నీ ఊపిరి సాక్షిగా ❣️-46

ఏంటిది ఎవరి అరుపులు వినిపించడం లేదు మహాన్ కూడా పైకి వచ్చినట్టు లేడు…… ?? వీడు కింద ఎమ్ చేస్తున్నాడు కొంపదీసి ఆ భూమి ను కింద చూడలేదు కదా అని కంగారుగా అనుకుంటూ ఫాస్ట్ గా కిందకు వచ్చి చూడగా….. !! ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకుంటూ కనిపిస్తారు భూమి ♥️ మహాన్ అది చూసిన నందన కరెంట్ షాక్ కొట్టినట్టు చూస్తూ ఉంటుంది…… !!

ఛా ….. !! వీళ్ళను ఎంత దూరం చేయాలి అనుకుంటే అంత దగ్గర అవుతున్నారు….. !! ఈ భూమి నా కొడుకును పూర్తిగా తన మాయలో పడేసింది ఇక వీడు నా మాట అసలు వింటాడా……. ?? దాన్ని ప్రేమించినట్టు నటించరా అని చెప్తే నిజంగా దాన్ని ప్రేమించినట్టు ఉన్నాడు వీడు 😬😬 …… !! అని పళ్ళు నూరుతూ వీళ్ళను ఇలానే వదిలేస్తే నాకు తెలియకుండా కాపురం కూడా చేసేలా ఉన్నారు…… !! అనుకుంటూ కోపంగా వాళ్ళ వైపు వెళ్ళబోయి లేదు ఇప్పుడు నేనేం చేసినా మహాన్ దృష్టిలో బ్యాడ్ అవుతాను…… !!

ఈ విషయం లో చాల జాగ్రత్తగా ఉండాలి మహాన్ ముందు మంచిగా నటించి ఇద్దరినీ వేరు చేసి కార్తికేయ మీద పగ భూమి మీదున్న కోపం రెండు నెరవేర్చుకుంటాను….. !! ఒసేయ్ భూమి నువ్వు ఎంత పిచ్చిగా వాడిని ప్రేమించినా లాస్ట్ కి వాడు నా మాటే వింటాడు ఎందుకంటే వాడు నా కొడుకే…… !! అని భూమి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి కోపంగా పైకి వెళ్ళిపోతుంది…… !!!

నందన తన రూమ్ లోకి వెళ్ళబోతూ…… !! అవును ఇషా మహాన్ రూమ్ లో వాడి గురించి వెయిట్ చేస్తూ ఉంది కదా….. !! వాడు దాని పెళ్ళాం తో బిజీగా ఉన్నాడని చెప్పాలి అనుకుంటూ ……. !! క్లోజ్ లో ఉన్న మహాన్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన నందన…… !! స్విచ్ బోర్డ్ వెతికి రూమ్ లో లైట్స్ ఆన్ చేస్తూ బాల్కనీ వైపు చూస్తూ ముందుకు వెళ్తుంది…….. !! సినిమా లో హీరోయిన్ లా నడుము కనిపించేలా హాట్ గా అటు వైపు తిరిగి నుంచున్న ఇషా ను చూసి…… !! నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది అనుకుంటూ ఇషా బుజం మీద చేయి వేస్తుంది…… !!

రూమ్ లోకి వచ్చింది మహాన్ అనుకున్న ఇషా వెనక్కి తిరిగి తన ఎదురుగా ఎవరున్నారు అని కూడా చూడకుండా……!! హేయ్ మహాన్ సర్ప్రైజ్ అంటూ గట్టిగా హగ్ చేసుకుంటూ చీక్ కిస్ పెడుతూ నవ్వుతూ తన వైపు చూస్తుంది….. !! తన వైపు గుడ్లు ఉరిమి చూస్తున్న నందన ను చూసి షాక్ అవుతూ ఫాస్ట్ గా వెనక్కి జరిగి ఆంటీ మీరా….. ?? మీరున్నారు ఏంటీ మహాన్ ఎక్కడ తనే కదా ఇందాక రూమ్ లోకి వచ్చింది….. ?? అని వెర్రి మొహం పెట్టుకుని అడుగుతుంది…… !!

నందన కోపంగా చూస్తూ అసలు ఎవరిచ్చారో ఏంటో కూడా తెలియకుండా హగ్ చేసుకుని కిస్ చేయడమేనా ఇషా…… ?? అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ కూడా తెలియలేదా నీకు…… ?? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది అదే ఇంకెవరైనా అయ్యుంటే అని తల కొట్టుకుంటూ…… !! అయినా నిన్ను హగ్ మాత్రమే చేసుకోమని చెప్పా కిస్ ఎందుకు చేసావ్…… ?? నిజంగా మహాన్ వచ్చినప్పుడు కిస్ చేసుంటే లాగి పెట్టీ కొట్టేవాడు……. !! మర్చిపోయావా వాడు నిన్ను ఫ్రెండ్ అనుకుంటున్నాడు అంటూ కోపంగా చెప్తుంది…… !!

ఐ ఆమ్ సారి ఆంటీ మహాన్ రూమ్ లోకి తను కాకుండా ఈ టైం లో ఎవరొస్తారు అనుకుని చూడకుండానే హగ్ చేసుకున్నాను…… !! ఇప్పటి వరకూ మహాన్ వస్తే ఎలా మాట్లాడాలి ఏంటి అని రిహాసల్ చేస్తున్నా ఈ లోగా ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది…… !! ఐ గెస్ మహాన్ వచ్చాడని సో ఆ ఎక్స్సైట్మెంట్ లో హగ్ చేసుకున్నాను…… !!

అవును మీరు ఎందుకు వచ్చారు ఆంటీ మన ప్లాన్ మర్చిపోయారా మీరు త్వరగా వెళ్ళండి మహాన్ వచ్చేస్తాడు….. !! నందన ఇషా చెయ్ పట్టుకుని వాడు కింద ఆ భూమి తో చాలా బిజీగా ఉన్నాడు పదా చూపిస్తా…… !! అంటూ ఇషా ను కిందకు తీసుకు వచ్చి మహాన్ & భూమి వైపు వేలు పెట్టి చూపిస్తుంది…… !!

ఏముంది అక్కడ అని అటు వైపు చూసిన ఇషా కి మహాన్ ప్రేమగా తినిపిస్తూ ఉంటే భూమి మహాన్ కి ఏవో మాటలు చెప్తూ మహాన్ పెట్టేది తింటూ ఉంటుంది…… !! అది చూసిన ఇషా మొహం రెడ్ టమోటా లా మారిపోతుంది ఆంటీ వాట్ ఇస్ దిస్ మహాన్ ఏంటి దానికి ఫుడ్ తినిపిస్తున్నాడు…… ?? అంటూ కోపంగా అరుస్తుంది….. !!

హుష్ 🤫 షట్ అప్ అరవకుండా చూడు నేను చెప్పానా అది పూర్తిగా మహాన్ ను తన మాయలో పడేసింది……. !! అని మహాన్ నా ముందు అదంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తాడు బట్ ఎవరు లేకపోతే ఇలా దాంతో సంతోషంగా ఉంటాడు….. !! ఇది నాకు తెలిసినా తెలియనట్టే ఉన్నాను ఎందుకంటే నాకు తెలిసింది అని తెలిస్తే వీళ్ళు మరింత రెచ్చిపోతారు అని ఇద్దరి వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది…… !!

వాళ్ళను అంత క్లోజ్ గా చూస్తూ భరించడం నా వల్ల కావట్లేదు ఆంటీ ఇప్పుడే దాని సంగతి చెప్తా మహాన్ ఇస్ ఓన్లీ మైన్…. !! అంటూ వాళ్ళ వైపు కోపంగా వెళ్ళబోతున్న ఇషా చెయ్ పట్టుకుని పైకి తీసుకుని వస్తూ …… !! ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆవేశంగా దాన్ని కొడితే నెక్స్ట్ మినిట్ మహాన్ నిన్ను కొట్టి బయటకు గెంటేస్తాడు అర్థం అవుతుందా….. ??

 

మనం ఎమ్ చేసినా తెలివిగా ఆలోచించి చేయాలి మంచిగా ఉంటూనే ఎలా ఇద్దరినీ దూరం చేయాలో అది ఆలోచించు…… !! మహాన్ కి తెలియకుండా భూమి ను టార్గెట్ చేయాలి కానీ మహాన్ కి తెలిసేలా మాత్రం కాదు ….. !! ఇప్పుడు నువ్వు మహాన్ కి కనిపించడం కంటే రేపు మార్నింగ్ కనిపించడం బెటర్ ఇక వెళ్ళి నీ రూమ్ లో పడుకో అంటూ నందన తన రూమ్ కి వెళ్ళిపోతుంది……. !!

వీళ్ళు ఒకే ఇంట్లోనే కాకుండా ఒకే రూమ్ లో కూడా ఉంటున్నారా ఏంటి…. ?? వీళ్ళు కంప్లీట్ హస్బెండ్ & వైఫ్ అవ్వలేదు కదా అని ఇద్దరూ పైకి వచ్చే వరకు గోళ్ళు కొరుకుతూ అటు ఇటు టెన్షన్ గా తిరుగుతూ ఉంటుంది…… !! మహాన్ మాటలు వినిపించగానే చాటుగా నుంచుని ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది…… !! తన రూమ్ వైపు వెళ్తున్న భూమి కి ఫోర్హెడ్ కిస్ పెడుతున్న మహాన్ వైపు కోపంగా చూస్తు…. !! ఎవరి రూమ్స్ కి వాళ్లు వెళ్ళిపోయాక ఇప్పటి నుండి మీ ఇద్దరి మధ్య ఇలా దూరం పెంచుతానో చూస్తూ ఉండండి అని కోపంగా అనుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోతుంది ఇషా…… !!

✨💫✨💫✨💫✨💫✨💫✨💫

తన ఫ్లాట్ దగ్గర బైక్ ఆపిన రాజ్ కిందకు దిగకుండా అటు ఇటు చూస్తున్న శ్లోక ను చూసి…… !! హారతి ఇవ్వడానికి ఎవరు లేరు కానీ బైక్ దిగు అని వెటకారంగా అంటున్న రాజ్ ను చూసి….. !! విసుగ్గా బైక్ దిగి నుంచుంటుంది రాజ్ కూడా బైక్ దిగి దాన్ని లాక్ చేశాక శ్లోక తో లిఫ్ట్ లో తన ఫ్లాట్ ఉన్న ఫ్లోర్ నంబర్ నొక్కుతాడు …… !!

ఓపెన్ అయిన లిఫ్ట్ నుండి రాజ్ పక్కనే నడుస్తూ వస్తున్న శ్లోక ను చూసిన ఒక ఆవిడ బాబు రాజ్ ఎవరు ఈ అమ్మాయి…… ?? రాజ్ తో ఉన్న కాస్త చనువు కొద్దీ నీ ఫ్లాట్ కి భూమి కాకుండా వచ్చిన అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ ఆ ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది…. !! ఆవిడ మాటలకు శ్లోక కోపంగా చూస్తే రాజ్ మాత్రం నవ్వుతూ అదేం లేదు ఆంటీ ఇది నా మరదలు పేరు శ్లోక….. !! ఓహ్ అయితే కాబోయే భార్య అనమాట పిల్ల ముద్దొస్తుంది రాజ్ ఎంతైనా నీ పక్కన ఆ మాత్రం ఉండాలి లే అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది….. !!

ఆవిడ మాటలకు రాజ్ నవ్వుకుంటూ ఫ్లాట్ డోర్ ఓపెన్ చేస్తూ లోపలికి వెళ్తాడు….. !! ఏయ్ ఎందుకు నవ్వుతున్నావ్ ఎవరు ఆవిడ ఓవర్ గా మాట్లాడుతుంది……. !! తన మాటలకు నాకు మండిపోతుంటే నీకు నవ్వొస్తుందా అసలు నన్ను ఎందుకు తీసుకుని వచ్చావ్ రా ఇక్కడికి…… ?? అని కోపంగా అరుస్తూ అక్కడే ఉన్న సోఫా లో కూర్చుంటుంది…… !!

ఇవాళ నువ్వు నేను ఎమ్ చేసినా క్వశ్చన్ చేయకూడదు కాబట్టి నోరు మూసి కూర్చో & ఆంటీ ఏదో సరదాగా అన్నారు…. !! ఆవిడ అనగానే నువ్వేం నా పెళ్ళానివి అయిపోవు కానీ కాకి లా అరవకుండా వెళ్ళి ఫ్లాట్ క్లీన్ చెయ్…… !! ఈ లోపు నేను ఫ్రెష్ అయ్యి గ్రాసరీస్ ఆర్డర్ పెడతాను రాగానే ఇద్దరికీ లంచ్ ప్రిపేర్ చేయ్ చాలా ఆకలిగా ఉంది……. !!

వాట్ ద హెల్ నేను ఫ్లాట్ క్లీన్ చేయాలా & కుకింగ్ కూడా చేయాలి వాట్ డు యూ థింక్ అబౌట్ మీ హా…… ?? నేను నందన కూతురిని ఆ విషయం మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావ్ రాజ్…… !! నేను మార్నింగ్ లేవగానే కాళ్ళకు వేసుకునే స్లిప్పర్స్ కూడా మెయిడ్ తో వేయించుకునే రేంజ్ నాది అలాంటి నన్ను మెయిడ్ లా అది చెయ్ ఇది చెయ్ అని ఆర్డర్స్ వేస్తున్నావ్…… ??

రాజ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా చూస్తూ అయిపోయిందా నువ్వు చెప్పడం ఇంకొక్క మాట నీ నోటి నుండి వచ్చిందో చంపేస్తాను…… !! ఇదే ఈ బలుపే తగ్గించుకోమని చెప్పేది నీకు నేను చెప్పింది చేయడం తప్పా ఇంకో ఆప్షన్ లేదు…… !! కాదు కూడదు అంటావా జైల్ లో రాళ్ళు కొడుదువు పదా ఇప్పుడే స్టేషన్ కి వెళ్దాం అని శ్లోక చెయ్ పట్టుకోబోతాడు …… !!

ఆ….. వద్దు ప్లీస్ ఫ్లాట్ క్లీన్ చేయాలి అంతే కదా 5 మినిట్స్ లో చేసేస్తాను నువ్వెళ్లి ఫ్రెష్ అవ్వు….. !! అని పళ్ళు నూరుతూ చెప్తుంది…. !! కొంపలు ఎమ్ మునిగి పోవు కానీ నిదానంగా నీట్ గా క్లీన్ చెయ్ అది అయ్యాక మాప్ కూడా పెట్టేయ్….. !! బాగా చికాగ్గా ఉంది ఫ్రెష్ అయి వస్తాను అని బెడ్ రూం వైపు వెళ్తున్న రాజ్ ను బండ బూతులు తిట్టుకుంటూ లూజ్ గా ఉన్న హెయిర్ ను పోనీ వేస్తూ ……. !! ప్రొద్దున్నే నా మొహం నేనే చూసుకుని ఉంటాను అందుకే వీడి దగ్గర బుక్ అయ్యాను అనుకుంటూ చీపురు తీసుకుని ఫ్లాట్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది….. !!

పెద్దగా దుమ్ము లేకపోయినా శ్లోక ఫస్ట్ టైమ్ క్లీన్ చేయడం & ఫ్లాట్ కూడా కొంచెం పెద్దగా ఉండడం తో వీడు ఉండేది ఒక్కడు…… !! అది కూడా అపుడపుడు వస్తాడు ఆ మాత్రం దానికే త్రిబుల్ బెడ్ రూమ్ ఎందుకు తీసుకుని చచ్చాడు….. ?? వామ్మో దీన్ని క్లీన్ చేసే సరికి నా నడుము కూడా విరిగిపోయింది అని నడుము పట్టుకుని ఏడుపు మొహం పెట్టుకుంటూ…….. !! మాప్ తప్పక పెడుతూ ఉంటుంది ఈ లోగా రాజ్ కూడా ఫ్రెష్ అయ్యి హాల్ లోకి వచ్చేసరికి తను ఆర్డర్ చేసిన గ్రాసరీస్ కూడా వచ్చేస్తాయి…… !!

డెలివరీ బాయ్ కి టిప్ ఇచ్చి పంపేస్తూ…… !! నడుము పట్టుకుని నీరసంగా సోఫా లో కూలబడ్డ శ్లోక ముందు గ్రాసరిస్ పెడుతూ ……. !! నీట్ గా ఇవన్నీ ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేసి ముందు నాకు హాట్ కాఫీ తీసుకుని రా అంటూ టీవీ ఆన్ చేసి కూర్చుంటాడు…… !! నన్ను వన్ డే మెయిడ్ చేయాలని వీడు బలంగా ఫిక్స్ అయ్యాడు అని రాజ్ వైపు కోపంగా చూస్తూ …… !! మళ్ళీ ఏమైనా అంటే కోర్ట్/ కేస్ అంటాడని ఇన్నర్ లైన్ తిట్టుకుంటూ గ్రాసరీస్ తీసుకుని కిచెన్ లోకి వెళ్తుంది….. !!

శ్లోక ను సైడ్ స్మైల్ తో చూస్తున్న రాజ్ నా చెల్లితో కూడా ఇలాగే కదే పని చేయిస్తున్నారు…… ?? తను కూడా ఇవన్నీ చేయడానికి ఎంత బాధ & ఇబ్బంది పడిందో నీకు తెలియాలి అని కసిగా అనుకుంటూ శ్లోక వైపు చూస్తూ ఉంటాడు…… !! కిచెన్ లోకి వెళ్ళిన శ్లోక కప్ లోకి షుగర్ ప్లేస్ లో కావాలని సాల్ట్ వేసి కాఫీ ప్రిపేర్ చేసాక…… !! నాతోనే వర్క్ చేయిస్తావా ఇది తాగాక కూడా నాతో కుకింగ్ చేయిస్తావ్ అని నేను అనుకోవడం లేదు….. !! నాకు కుకింగ్ రాదని చెప్పి ఈ వంట అనే గండం నుండి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అని నవ్వుకుంటూ రాజ్ ముందు కాఫీ కప్ పెడుతుంది…… !!

రాజ్ నవ్వుతూ ఆ కాఫీ కప్ తీసుకుని తాగబోతూ…… !! ఏంటీ నాకు ఒక్కడికే తెచ్చావ్ నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకో…….. !! ఆ…. అదీ నేను కాఫీ తాగను నాకు అలవాటు లేదు నువ్వు తాగు రాజ్……. !! ఏంటిది టెన్షన్ పడుతుంది పైగా రాజ్ అంటూ ఇంత మర్యాదగా పిలుస్తుంది…… ?? దీంట్లో నన్ను లేపేయడానికి సైనేడ్ కానీ కలపలేదు కదా అనుకుంటూ ఇలా కూర్చో అని శ్లోక చెయ్ పట్టుకుని లాగి తన పక్కన కూర్చో పెట్టుకుంటాడు….. !!

ఇంకా తాగడు ఏంటీ అని కప్ పట్టుకుని టీవీ చూస్తున్న రాజ్ ను చూసి…… !! కాఫీ చల్లగా అయిపోతుంది తాగు రాజ్ అంటున్న శ్లోక వైపు చూస్తూ పాపం ఫ్లాట్ క్లీన్ చేసి టైడ్ అయ్యుంటావ్ ఇది నువ్వే తాగు……. !! అని కప్ శ్లోక నోటి దగ్గర పెడతాడు అది చూసిన శ్లోక చచ్చాన్ రా బాబు 😧 అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుంది…… !!

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply