నీ ఊపిరి సాక్షిగా -36

నందన కార్తికేయ వైపు చూస్తూ కోపంగా ప్లేట్ లోని ఫుడ్ తినకుండా హ్యాండ్ వాష్ చేసుకోవడం చూసిన మానస అయ్యో ఏంటి వదిన ఒక్క ముద్ద కూడా తినకుండానే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నావ్…… ?? తను చేసిన కర్రీ తననే తినాలి అనిపించట్లేదు అనుకుంటా మను అయినా మనం కాబట్టి రిస్క్ చేసి తింటున్నాం….. !! అని జోక్ చేస్తున్న కార్తికేయ వైపు కోపంగా చూస్తూ విసురుగా అక్కడి నుండి వెళ్తున్న నందన ను చూసి వదిన….. వదిన…..??

 

ఏంటన్నయ్యా నువ్వు…. !! నీ మాటలకు వదిన ఫీల్ అయినట్టు ఉంది అయినా నువ్వు కూడా ఏంటి చిన్న పిల్లాడిలా….. ??  నేనేదో జోక్ చేశాను ఆ మాత్రానికే మీ వదిన అలగాలా అయినా తన అలక ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు లే మను….. !! నువ్వు అదేం పట్టించుకోకు ఫస్ట్ తిను అంటూ ప్రేమగా ముద్దలు పెడుతూ మానస కి తినిపించాక నందు కోసం ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుని తీసుకుని వెళతాడు…. !!

అప్పటికే నందు బెడ్ రూమ్ లో కార్తికేయ మీద కారాలు మిరియాలు నూరుతూ ఫ్రెష్ అయ్యి శారీ నుండి నైట్ వేర్ లోకి చేంజ్ అయ్యి చేతులకు బాడీ లోషన్ రాస్తూ ఉంటుంది….. !! నందు రా తిందాం అని పిలిచిన కార్తికేయ వైపు గుర్రుగా చూస్తూ చేతిలోని లోషన్ కోపంగా విసిరి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది….. !!

ఏయ్ తిను అంటుంటే పడుకుంటున్నావ్ ఏంటి లే ఫస్ట్ అని నందు బుజం పట్టుకుని లేపుతున్న కార్తికేయ చేతిని విసిరి కొడుతూ….. !! డోంట్ టచ్ మీ కార్తీక్ నాకు ఆకలిగా లేదు నీకు కావలసిన వాళ్ళకు కొసరి కొసరి తినిపించావ్ కదా అది చూసి నా కడుపు నిండిపోయింది అని చెప్పి మరో వైపు తిరిగి పడుకుంటుంది….. !!

నందు ఎన్ని సార్లు చెప్పాలి నీకు మన మధ్య లోకి మను ను తీసుకురాకు అని ….. ?? తను చాలా డేస్ తర్వాత మన ఇంటికి వచ్చింది అయినా చెల్లికి ఫుడ్ పెట్టడం అంత క్రైమ్ ఆ……. ??

నందన కోపంగా లేచి కూర్చుంటూ క్రైమ్ అని నేను చెప్పట్లేదు అలా అని తినిపించకూడదు అని కూడా నేను అనను….. !! బట్ నేను నీ కోసం నిద్ర కూడా ఆపుకుని మరీ కడుపు మాడ్చుకుని వెయిట్ చేస్తూ చెయ్ కాల్చుకుని మరీ కుక్ చేసి వెయిట్ చెస్తుంటే…… !! నువ్వు నన్ను పట్టించుకోకుండా మానస కి తినిపిస్తూ తన ముందు నన్ను తక్కువ చేస్తే నాకు ఎలా ఉంటుంది నువ్వే చెప్పు….. !!

నేనేదో జోక్ చేశా నందు దానికి ఇంత సీరియస్ అవ్వాలా చెప్పు….. !! నా మంచి నందు కదా ఇంకో సారి నిన్ను ఇగ్నోర్ చేయను ఒకే నా ఇప్పుడైనా తింటావా లేక కాళ్ళు కూడా పట్టుకోవాలా….. ??

నందు కాసేపటికి మౌనం తర్వాత కార్తీక్ కళ్ళల్లోకి చూస్తూ నువ్వు తినిపిస్తే తింటా లేకపోతే నాకు వద్దు…. !! ఇద్దరూ పిల్లలు పుట్టినా ఇంకా కిడ్ లానే ఒక్కో సారి చిన్న పిల్లలా మారం చేస్తావ్ అంటూ నందు నోటికి ఫుడ్ అందివ్వబోతాడు …   !!

తన నోటి దగ్గర కార్తికేయ పెట్టిన ఫుడ్ తినబోతూ ఉంటే ఎవరో బయట నుండి డోర్ నాక్ చేస్తున్న సౌండ్ కి నందు కి కోపం వస్తుంది….. !! నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు అని మానస ను తిట్టుకుంటూ బెడ్ మీద నుంచి లేస్తున్న కార్తికేయ హ్యాండ్ పట్టుకుని వెళ్ళకు కార్తీక్ ప్లీస్…. !!

జస్ట్ వన్ మినిట్ నందు అని నందు ను బుజ్జగించి డోర్ ఓపెన్ చేసిన కార్తికేయ కి భూమి ను ఇస్తూ….. !! నిన్ను చూడాలని ఒకటే ఏడుపు అన్నయ్య అంటున్న మానస ను చూసి నందు అసహనంగా బాల్కనీ లోకి వెళ్ళిపోతే…   !! నేను చూసుకుంటాను నువ్వెల్లి పడుకో గుడ్ నైట్ మను అంటూ భూమి కి ముద్దు పెడుతూ నవ్వుతూ చెప్తాడు…. !!

వద్దు లే అన్నయ్య మీకు ఎందుకు ఇబ్బంది అది ఏడుపు ఆపగానే తీసుకుని వెళ్తాను…. !! అరే మాకేం ఇబ్బంది లేదు మదు నీకే సరిగ్గా నిద్ర లేదు ఇక్కడున్నన్ని రోజులు నా చిట్టి తల్లీ నాతోనే ఉంటుంది కానీ నువ్వు పడుకో వెళ్ళు…. !!

అది కాదు అన్నయ్య వదిన మూడ్ అసలే బాలేదు కదా….  !! మళ్ళీ భూమి ఇక్కడే ఉంటే ఇంకెంత ఫీల్ అవుతుందో అందుకే భూమి ని నిద్రపుచ్చి నాకివ్వు నేను తీసుకుని వెళ్తాను….. !! అని ఏడ్చి ఏడ్చి కార్తికేయ గుండెల మీద నిద్రపోతున్న భూమి ను తీసుకోబోతుంది….. !!

కానీ నిద్రలో కూడా కార్తికేయ నుండి వెళ్ళడం ఇష్టం లేదు భూమి తన చిట్టి పిడికిలి లో కార్తికేయ షర్ట్ ను గట్టిగా వదలకుండా పట్టుకొంది…. !! మను భూమి నిద్ర లేస్తుంది ఇక వదులు అని మానస ను బలవంతంగా పంపేసి భూమి ను బుజం మీద ఎత్తుకుని జో కొడుతూ నందు ను మర్చిపోతాడు….. !! అదంతా బాల్కనీ లో నుండి చూస్తున్నా నందన కోపం తో రగిలిపోతూ ఫాస్ట్ గా రూమ్ లోకి వచ్చి కార్తీక్ తినిపిస్తావా తినిపించవా అంటూ గట్టిగా అరుస్తుంది…. !!

నందు వాయిస్ కి భూమి ఉలిక్కిపడి నిద్ర లేచి ఎడవడం చూసి కార్తికేయ నందన వైపు కోపంగా చూస్తూ…… !! తినిపించకపోతే చచ్చిపోతావా దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కదా వాటితో తిను కావాలంటే రేపు తినిపిస్తాను….. !! లాస్ట్ టైమ్ అడుగుతున్నా తినిపిస్తావా లేదా నందు వైపు సీరియస్ గా చూస్తూ ఏడుస్తున్న భూమి వైపు చూసి…… !!  కోపంగా రూమ్ నుండి బయటకు వెళ్తున్న కార్తికేయ ను చూసి నందన కోపంగా ప్లేట్ విసిరి కొట్టి ఏడుస్తూ బెడ్ మీద వాలిపోతుంది….. !!

మేడం అని పిలిచిన మెయిడ్ వాయిస్ కి గతం తాలుకూ జ్ఞాపకాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నందన….. !! అక్కడి నుండి బయటకు వస్తూ మొహాన్ని నార్మల్ గా పెట్టుకొని తన వైపు చూస్తుంది….. !! లంచ్ కి ఎమ్ చేయమంటారు మేడం అని అడుగుతున్న మెయిడ్ వైపు చూస్తూ…… !!  శ్లోక, మహాన్ లకు ఇష్టమైనవి కుక్ చెయ్ అని చెప్పి మెయిడ్ వెళ్ళాక ఇషా కి కాల్ చేసి వన్ వీక్ లో నువ్వు ఇండియా లో ఉండాలని చెప్పి నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది….. !!

✨💫✨💫✨💫✨💫✨💫

ఈవెనింగ్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ తో టైడ్ గా ఇంటికి వచ్చిన మహాన్ హాల్ లో కనిపించిన భూమి కి స్ట్రాంగ్ టీ కావాలని చెప్పి….  !! బ్లేజర్ విప్పుతూ తన రూమ్ కి వెళ్ళిపోతాడు భూమి మహాన్ కోసం మంచి టేస్టీ టీ ప్రిపేర్ చేసుకుని మహాన్ రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి బెడ్ మీద తల పట్టుకుని కూర్చున్న మహాన్ ను చూస్తుంది….. !!

ఏయ్ డోర్ ఎందుకు లాక్ చేసావ్….. ?? నేనేం పూర్తిగా లాక్ చేయలేదు జస్ట్ అలా ముందుకు వేశా అంతే అయినా ఆడపిల్లను డోర్ లాక్ చేస్తే నేను కంగారు పడాలి కానీ …… !! నువ్వెందుకు కంగారు పడుతున్నావ్ అంటూ మహాన్ కప్ పెడుతూ అడుగుతుంది…… !!

నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను నాకు తెలియకుండానే నా అడుగులు నీ వైపు పడతాయి….. !! అది నీకు ఎలా చెప్పాలి చెప్తే ఇక నిన్ను నేను ఆపలేను  😏 ….. !!

అడుగుతుంటే దెయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తావేంటి…  ?? అని అడుగుతున్న భూమి వైపు చూస్తూ ఎమ్ లేదు ఇన్నాళ్లకు ఒక నిజం ఒప్పుకున్నావే అని చూస్తున్నా…. !! యాహ్ నువ్వు చెప్పింది నిజమే నిజంగా దెయ్యానివేనే నువ్వు 😌😏 ….. !! ఇస్ ఇట్ అంటే అందమైన దెయ్యాన్నా అని సిగ్గు పడుతున్న భూమి ను టాప్ టు బాటమ్ చూసి దెయ్యాలు ఎక్కడైనా అందంగా ఉంటాయా 🤦😏…..  ??

ఎందుకు ఉండవ్ మహాన్ నువ్వు చూడు ఎంత అందంగా ఉంటావో 😍….. !!  నిన్ను చూశాకే అర్థం అయింది దెయ్యాలు కూడా అందంగా ఉంటాయని 😜 అని భూమి నవ్వు ఆపుకుంటూ చెప్తే….. !! భూమి చెప్పింది అర్థం అయిన మహాన్ యూ అని కొట్టడానికి లేవబోతూ ఉంటే నన్ను మళ్ళీ కొట్టచ్చు కానీ కాసేపు కదలకుండా కూర్చో అని …… !! రెండు బుజాలు పట్టుకొని కూర్చో బెట్టి ఇవాళ చాలా టైడ్ గా కనిపిస్తున్నావ్ అందుకే నీ కోసం ఆయిల్ హీట్ చేసి తీసుకుని వచ్చాను….. !! ఈ ఆయిల్ తో మసాజ్ చేస్తే నీ తల నొప్పి కచ్చితంగా తగ్గుతుంది అని చీర కొంగు నడుముకు దోపుకుంటూ చెప్తుంది…. !!

నాకు ఏ ఆయిల్ వద్దు కానీ నువ్వు ముందు బయటకు పో ఈ టీ తాగి ఒక నాప్ వేస్తే ఆటోమాటిక్ గా తల నొప్పి తగ్గుతుంది….  !! ఇలా మసాజ్ చేస్తే అబ్బో భూమి చాలా మంచిది నాకు చిన్న తల నొప్పి వస్తేనే తట్టుకోలేక పోయింది అని నేను అనుకోవాలనే కదా ప్లాన్….. ??

మహాన్ మాటలకు భూమి చిన్నగా నవ్వి అలాంటి ప్లాన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు…. !! ఎందుకంటే నా ప్రేమ నిజమైంది అయితే అది నీ మనసుకు ఎప్పటికైనా చేరుతుంది ఆ నమ్మకం నాకుంది….. !! ఇవన్నీ చేస్తుంది నీ భార్యగా నీ మీదున్న ప్రేమతో మాత్రమే ఎలాగో మనిద్దరం జీవితాంతం కలిసి ఉండలేం కదా….. !! అందుకే ఉన్నన్ని రోజులు నీతో మంచి మెమోరీస్ కలెక్ట్ చేసుకుని నువ్వు పంపించేసిన రోజున ఆనందంగా వెళ్ళిపోతాను….. !!

భూమి లో రోజుకో మార్పును చూస్తున్న మహాన్ కి భూమి బిహేవియర్ చాలా వియర్డ్ గా అనిపిస్తుంది….. !! మొన్నటి దాకా తను ఎమ్ అన్నా ఏడ్చేది తర్వాత ఎదిరించింది ఆ తర్వాత ఫ్యామిలీ ముందు తనను కావాలని బుక్ చేసేది…… ??  ఇప్పుడు అర్థం అయ్యి కానట్టు మాట్లాడుతూ ఉంటే మహాన్ కి పిచ్చెక్కుతోంది ….. !! అందుకే భూమి వైపు అలాగే సూటిగా చూస్తూ తనను వొళ్ళో కి లాక్కుని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ తన కళ్ళలోని భావాలను చదవడానికి ట్రై చేస్తుంటాడు….. !!

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply