నీ ఊపిరి సాక్షిగా ❣️-30

ఇదంతా నీ వల్లేనే దెయ్యం అంటూ భూమి ను కొట్టడానికి వెళ్తున్న నందన కి భూమి కి మధ్య అడ్డుగా వచ్చి నుంచుంటాడు మహాన్….. !! మహాన్ ను అలా చూసి నందన, విజయేంద్ర ప్రసాద్ నోరు వదిలేసి షాక్ అవుతూ చూస్తుంటే దేవయాని, భూమి ఆశ్చర్యం & ఆనందం కలగలిపి చూస్తుంటారు….. !!

మహాన్ అంటూ సీరియస్ గా పిలిచిన కాదు అరిచిన నందన వాయిస్ కి భూమి విసుగ్గా చెవులు రెండు వేళ్ళతో మూసుకోవడం చూసి నందన మరింత ఉడికిపోతుంది …… !! మామ్ ఇందులో భూమి మిస్టేక్ లేదు & అనవసరంగా దీన్ని మధ్యలోకి లాగకు …… !! అంటూ మహాన్ ఫస్ట్ టైమ్ ఆది కూడా నందన కి అపోసిట్ గా భూమి వైపు సపోర్ట్ తీసుకుని మాట్లాడుతాడు….. !!

చూసావా నా మొగుడు నా మీద ఈగ కూడా వాలనివ్వడు అన్నట్టు ఉన్న భూమి ఎక్స్ప్రెషన్స్ చూసి నందన కోపంగా వెళ్ళి సోఫా లో కూర్చుంటే అది చూసిన భూమి మాత్రం మహాన్ తన వైపు స్టాండ్ తీసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది….. !!

ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళు అని సీరియస్ గా చెప్తున్న మహాన్ ను చూసి భూమి కామ్ గా అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళిపోతుంది …… !! హాల్ లో మిగిలిన విజయేంద్ర ప్రసాద్, దేవయాని ల వైపు చూస్తూ మీరు కూడా వెళ్ళి పడుకోండి తాతయ్య ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం …… !! శ్లోక ను రేపు ఎలా అయినా తీసుకుని వస్తా అని చెప్తున్న మహాన్ ను చూసి విజయేంద్ర ప్రసాద్ కోపంగా లోపలికి వెళ్ళిపోతే దేవయాని మాత్రం ఆనందంగా నవ్వుతూ వెళ్తుంది…… !!

తల వంచుకుని నేల వైపు చూస్తూ కూర్చున్న నందన ముందు నీస్ మీద కూర్చుని మామ్ అని పిలిచిన మహాన్ వాయిస్ కి నందన మెల్లగా హెడ్ లిఫ్ట్ చేస్తుంది….. !! నీళ్ళు నిండిన నందన కళ్ళను చూసి ఏంటి మామ్ ఇది అంటూ నందన కన్నీళ్ళు తుడుస్తున్న మహాన్ చెయ్ పట్టుకుని……. !! ఇన్నాళ్ళు ఒక భార్య గానే నా భర్త చేతిలో మోసపోయాను అనుకున్నా మహాన్….. ??

కానీ ఒక తల్లిగా కూడా నా కొడుకు చేతిలో మోసపోయాను అని తెలుసుకోలేకపోయాను….. !! ఇన్నాళ్ళు నువ్వే నా బలం అనుకుని పొంగిపోయాను మహాన్ బట్ ఆఖరికి నువ్వు కూడా ఇలా నన్ను వదిలేస్థావ్ అనుకోలేదు….. !! ఓడిపోయాను రా నేను అన్ని విధాలుగా అందరి చేతుల్లో ఓడిపోయాను ఇక నేను ఎందుకు బ్రతికుండాలి….. ??

మామ్ అంటూ నందన నోటి మీద చెయ్ ఉంచి అలా మాట్లాడకు నేను ఇప్పటికీ ఎప్పటికీ నీ కొడుకునే ఇందాక నీకు ఆగనెస్ట్ గా మాట్లాడింది భూమి మీదున్న ప్రేమ తో కాదు….. !! శ్లోక నిజంగానే ఒక అబ్బాయికి యాక్సిడెంట్ చేసింది దీనికి భూమి కి ఎలాంటి సంబంధం లేదు అందుకే అడ్డు పడ్డాను కానీ దాని మీద ప్రేమ ఎక్కువై కాదు….. !! భూమి ని కొట్టినా/ బాధ పెట్టినా అది నా విషయం లోనే అయ్యుండాలి అని సీరియస్ గా చెప్పి నాకు ఎప్పటికీ నువ్వే ఇంపార్టెంట్ మా నీ తర్వాతే ఎవరైనా అంటూ నందన చెయ్ పట్టుకుని ప్రేమగా చెప్తాడు…… !!

మహాన్ వాయిస్ లోని సిన్సియారిటీ కి నందన కొంచెం శాంతిస్తూ ఇప్పుడు నేను ఏమాత్రం దాని గురించి నోరు జారినా అనవసరంగా నా కొడుకు దృష్టిలో బ్యాడ్ అవుతాను అనుకుంటూ…… !! నువ్వు కూడా ఎక్కడ మీ నాన్న లా దాని మాయలో పడ్డావో అని భయం వేసింది మహాన్….. !! నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నా ఈ అమ్మ ను మళ్ళీ వంటరి చేయకు కన్నయ్య అంటూ ఎమోషనల్ అవుతూ మహాన్ వైపు చూస్తుంది…… !!

మామ్ నన్ను ఆ మనిషి తో కంపార్ చేయకు నేను చచ్చే వరకు నీ మాటే వింటాను & నీతోనే ఉంటాను ఇది ఎవరు చెప్పినా & నా లైఫ్ లోకి ఎవరు వచ్చినా మారదు ఒకే….. !! అనగానే నందన హ్యాపీగా ఫీల్ అవుతూ చాలు కన్నా ఈ లైఫ్ కి నువ్వు నా బంగారం అంటూ మహాన్ ను గుండెలకు హత్తుకుంటుంది ….. !!

రైలింగ్ నుంచి అమ్మా – కొడుకు అనుబంధం చూస్తున్న భూమి మీ ప్రేమ తగలెయ్య నువ్వు నీ మొగుడికి దూరంగా ఉండేది కాక నన్ను కూడా నా మొగుడికి దూరం చేయాలి అని చూస్తున్నావా సూర్యకాంతం అత్త….. !! నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చేయడానికి నేనున్నా కదా అని నవ్వుకుని భూమి తన రూమ్ కి వెళుతుంది….. !!

నందన మహాన్ నుండి దూరం జరుగుతూ చూడు మహాన్ నువ్వేం చేస్తావో & ఎలా చేస్తావో నాకు అనవసరం రేపు ఈవెనింగ్ కి నా కూతురు నా ఇంట్లో ఉండాలి….. !! అలా అని నువ్వు ఆ కార్తికేయ పేరు కానీ తన హెల్ప్ కానీ తీసుకోకూడదు అని స్థిరంగా చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతుంది….. !!

మహాన్ ఆలోచిస్తూ ఒక్కడే హాల్ లో మిగిలిపోతాడు….. !! ఎంత ఆలోచించినా రాజ్ ను కన్విన్స్ చేసి శ్లోక ను బయటకు తీసుకుని రావడం ఇంపాజిబుల్ కానీ తీసుకు రావాలి ఎలా అని ఆలోచిస్తున్న మహాన్ బుర్ర లో ఏదో ఐడియా రావడం తో సైడ్ స్మైల్ తో రేయ్ రాజ్ అయిపోయావ్….. !! శ్లోక ను అడ్డు పెట్టుకొని నాతోనే గేమ్స్ ఆడుతావా రేపు చెప్తా రా నీ పని …… ?? అని మెయిడ్ డిన్నర్ వడ్డిస్తాను అన్నా వద్దని చెప్పి స్టెప్స్ ఎక్కి తన రూమ్ వైపు వెళ్తూ ఆగి భూమి రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళతాడు….. !!

భూమి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన మహాన్ కి భూమి హాయిగా బెడ్ మీద నిద్రపోతూ కనిపిస్తుంది….. !! బెడ్ షీట్ కప్పుకోకుండా పడుకోవడం వల్ల ఏ. సీ. కూలింగ్ కి చలికి వణుకుతున్న భూమి కి బెడ్ షీట్ కప్పుతున్న మహాన్ చెయ్ పట్టుకుని…… !! నిద్రలోనే తన గుండెలకు అదుముకుని డోంట్ లీవ్ మీ మహాన్ నువ్వు లేకుండా నేను ఉండలేను …… !!  అని కలవరిస్తున్న భూమి మొహం మీద నోటితో ఎయిర్ బ్లో చేయగానే భూమి హ్యాండ్ ను లూస్ చేస్తుంది….. !!

మహాన్ టక్కున తన హ్యాండ్ వెనక్కి తీసుకుని చీకట్లో కూడా చందమామ లా వెలిగిపోతున్న భూమి మొహాన్ని చూసి నెమ్మదిగా తన పెదవులను భూమి మొహం దగ్గరకు తీసుకుని వచ్చి….. !! భూమి నుదుటిన ప్రేమగా కిస్ చేసే టైం కి మహాన్ కి నందన మొహం గుర్తు రాగానే అసహనంగా అక్కడే ఆగిపోయి ఫాస్ట్ గా తన రూమ్ కి వెళ్ళిపోతాడు…. !!

మహాన్ డోర్ క్లోజ్ చేసిన సౌండ్ కి అప్పటి వరకు నిద్ర నటించిన భూమి లేచి కూర్చుంటూ హ్మ్మ్!! నా మీద ఎంత ప్రేముందో అంతకు రెట్టింపు ప్రేమ మీ అమ్మ మీద ఉంది….. !! ఆ ప్రేమే నిన్ను నాకు దగ్గరగా రానివ్వకుండా ఆపుతుంది మీ అమ్మ ప్రేమ ను డామినేట్ చేయడం అంటే కష్టమే కానీ ట్రై చేస్తాను….. !! No pain there is no gain  అన్నారుగా సో ట్రై చేస్తాను మహాన్ ❤️….. !! అంటూ మహాన్ లో ఉన్న ప్రేమను ఎలా బయట పెట్టాలి అని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది……. !!

✨✨✨✨✨✨✨✨✨

ప్చ్ …… !! ఏంటిది ఇంతలా ఆకలేస్తుంది ఒక్క ఆఫ్టర్ నూన్ తినకపోతే ఇంతలా ఆకలేస్తుందా…… ?? అని పొట్ట పట్టుకుని సెల్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శ్లోక….. !! వీడి వల్ల మార్నింగ్ కూడా సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయలేదు తింటుంటే లాక్కొచ్చేశాడు సచ్చినోడు అని రాజ్ ను తిట్టుకుంటూ అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ ను చూసి హుష్…. హుష్….. !! అని సౌండ్ చేస్తూ ఆ కానిస్టేబుల్ ను పిలుస్తుంది….. !!

శ్లోక వైపు చూసిన ఆ కానిస్టేబుల్ ఏంటి మేడం అంటూ శ్లోక ముందుకు వచ్చి నుంచుంటాడు ….. !! చూడు నాకు బాగా ఆకలిగా ఉంది దగ్గర్లో ఏదైనా ఫైవ్ స్టార్ట్ హోటల్ ఉంటే మంచి దమ్ బిర్యానీ తీసుకుని రా కావాలంటే నేను రిలీస్ అయిన వెంటనే నీకు ఆ బిర్యాని అమౌంట్ కి 10 టైమ్స్ ఎక్కువ ఇస్తాను…. !!

అచ్ఛా బిర్యానీ ఒకటే చాలా తమ్సప్ కూడా తెప్పించి దానితో పాటు డెసర్ట్ గా ఇస్ క్రీమ్ కూడా తెప్పించనా …… ?? అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ కానిస్టేబుల్ వైపు సీరియస్ గా చూడ్డం తో కానిస్టేబుల్ భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు….. !!

ఏయ్ నీకు కొంచెం అయినా బుద్దిందా….. ?? మార్నింగ్ కూడా సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పుడు నైట్ అవుతోంది……. ?? నేను ఆకలికి అసలు ఉండలేను….. !! అమ్మాయిని అన్న కర్టసి కూడా లేదా నీకు….. !! నా కోసం ఫుడ్ తెప్పించు లేకపోతే ఆకలితోనే చచ్చిపోయేలా ఉన్నారా బాబు….. !?

నేను మరీ నీ అంత శాడిస్ట్ ను కాదే నీ కోసం ఆల్రెడీ ఫుడ్ తెప్పించా ….. !! ఏయ్ 402 మేడం కోసం స్పెషల్ గా తెప్పించిన గుడ్ సర్వ్ చేసి తీసుకుని రండి అని పిలుస్తాడు…. !!

పర్లేదు వీడు నేను అనుకున్నంత వెధవ కాదు అని రాజ్ వైపు చూస్తూ ఫుడ్ తెప్పించి నీ మీదున్న కోపం  10% అయినా తగ్గేలా చేసావ్ గుడ్ అంటూ కానిస్టేబుల్ ఇచ్చిన ట్రే తీసుకుని లిడ్ ఓపెన్ చేసి చూసిన శ్లోక యాక్ చీ!! అంటూ ట్రే ను విసిరి రాజ్ వైపు కోపంగా చూస్తుంటుంది….. !?

హహ ఎంటే అలా మిడి గుడ్లు వేసుకుని గుడ్ల గుబలా చూస్తున్నావ్….. ?? తిను నీ కోసమే స్పెషల్ గా తెప్పించా నీళ్ళు ఊరిన చద్దన్నం, పాచిపోయినా పప్పు, బూజు పట్టిన పచ్చడి, ఎండిపోయిన అప్పడం అన్ని వేడి వేడిగా ఉన్నాయి కానివ్వు మళ్ళీ చల్లారిపోతే టేస్ట్ తెలియదు అని నవ్వు ఆపుకుంటూ చెప్తాడు….. !!

రేయ్ శాడిస్ట్  ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి …… ?? నాకు తెలుసు ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావ్….. ?? బిర్యాని తెప్పించరా ఫుల్ గా ఆకలేస్తుంది & కళ్ళు కూడా తిరుగుతున్నాయి ……!!

రాజ్ శ్లోక వైపు ఓ సారి చూసి అక్కడ వర్క్ చేసే అబ్బాయితో బిర్యాని తీసుకుని రమ్మనగానే శ్లోక మొహం మతాబుల్లా వెళిపోయింది …… !! అది చూసిన రాజ్ నవ్వుకుంటూ అక్కడే కూర్చుని ఏవో ఫైల్స్ చెక్ చూస్తూ ఉంటాడు…… !!

అబ్బా ఇంకెంత సేపు వెయిట్ చేయాలి వాడు వెళ్ళి 15 మినిట్స్ అవుతుంది ఇంకా రాడేంటి…… ?? అని చూస్తున్న శ్లోక కి బిర్యానీ ప్యాకెట్ తో లోపలికి వస్తున్న అబ్బాయిని చూసి ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది….. !!

ఏయ్ క్యాట్ వాక్ చేస్తున్న మాడల్ లా ఎంటా నడక కమ్ ఫాస్ట్ ఐ ఆమ్ వెరీ హంగ్రీ అంటున్న శ్లోక వాయిస్ కి తల తిప్పి చూసిన రాజ్ కి బిర్యానీ ప్యాకెట్ తో లోపలికి వస్తున్న అబ్బాయిని చూసి ఫైల్ క్లోజ్ చేస్తాడు……. !!

బిర్యాని ప్యాకెట్ తీసుకుని రాజ్  వైపు వెళ్తున్న అబ్బాయిని చూసి హలో ఆది నా కోసమే తెప్పించాడు కానీ ఇటు తీసుకుని రా అలాగే కొంచెం చిల్డ్ వాటర్ విత్ కోక్ కూడా కావాలి….. !!

రాజ్ కోపంగా లాఠీ తో టేబుల్ మీద సౌండ్ చేసి ఇదేమైనా రెస్టారెంట్ అనుకుంటున్నావా నువ్వు ఆర్డర్ చేసింది తీసుకుని రావడానికి….. ?? అయినా అది నీ కోసం తెప్పించా అని నేను చెప్పలేదే అని తను కూర్చున్న టేబుల్ దగ్గరకు వచ్చి నుంచున్న అబ్బాయి చేతిలోని బిర్యాని ప్యాకెట్ తీసుకుని నువ్వెళ్ళు అంటూ తనే ఆరామ్ గా కూర్చుని బిర్యాని లాగిస్తాడు….. !!

వీడికి లూజ్ మోషన్స్ కాను ఎలా తింటున్నాడో చూడు బఫే కొచ్చిన బకాసురుడిలా అంటూ లెగ్ పీస్ తింటున్న రాజ్ ను చూసి ఏడుపు మోహం పెట్టుకుని బిర్యాని వైపు ఆశగా చూస్తుంటుంది…… !!

ఎంటే కావాలా అని తందూరి లెగ్ పీస్ చూపిస్తూ అడుగుతున్న రాజ్ ను చూసి హు 😏 అని మొహం తిప్పుకుని నేను ఎంగిలి తినను నాకు వేరే బిర్యాని కావాలి అంటూ కోపంగా చెప్తుంది….. !!

నీ మొహానికి అంత సీన్ లేదే కావాలంటే చెప్పు నేను తిన్నాక మిగిలిన ముక్కలు కుక్క కి పడేసినట్టు పడేస్తా అంతే కానీ నీ కోసం బిర్యాని తెప్పిస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు ……. !! అని ఉమ్…. ఉమ్….. అబ్బబ్బా బిర్యాని సూపర్ గా ఉంది అంటూ కావాలనే సౌండ్స్ చేస్తూ తింటున్న రాజ్ మీదకు అటు ఇటు చూసి తన సెల్ లో ఉన్న వాటర్ పాట్ మీదున్న గ్లాస్ విసురుతుంది….. !!

గ్లాస్ నేరుగా వెళ్ళి రాజ్ తలకు తగిలి బ్లడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న శ్లోక ఆశలు మీద బిస్లటీ వాటర్ చల్లుతూ రాజ్ ఆ గ్లాస్ ను లెఫ్ట్ హ్యాండ్ తో క్యాచ్ పట్టుకుంటూ సీరియస్ గా చూడగానే వామ్మో అంటూ మూలకు వెళ్ళి ముడుక్కుని కూర్చున్న శ్లోక ను చూసి రాజ్ తన బిర్యాని ఫినిష్ చేస్తాడు….. !!

శ్లోక మేడం అని పిలిచిన తన డ్రైవర్ వాయిస్ కి లోపల కూర్చుని రాజ్ ను అన్ని భాషల్లో తిట్టుకుంటున్న శ్లోక ముందుకు వచ్చి తన కార్ డ్రైవర్ ను చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది…… !!

మీ కోసం నందన మేడం ఫుడ్ పంపారు మేడం అని పెద్ద జ్యూట్ బ్యాగ్ చూపించగానే శ్లోక హ్యాపీగా ఫీల్ అవుతూ హమ్మయ్య ఫైనల్లీ మామ్ ఫుడ్ పంపింది అని ఆ బ్యాగ్ వైపు చూస్తూ ఉంటుంది….. !! సర్ సెల్ ఓపెన్ చేస్తారా మేడం కి బ్యాగ్ ఇచ్చేసి వెళ్తాను అని ఎస్. ఐ. వైపు చూస్తూ వినయంగా అడుగుతాడు డ్రైవర్…… !!

ఎస్. ఐ. కంగారుగా రాజ్ వైపు చూడగానే మండే సూర్యుడిలా కనిపిస్తున్న రాజ్ ను చూసి నాకు ఎందుకు వచ్చిన గోల రా బాబు అని ఎస్. ఐ అక్కడి నుండి వెళ్ళిపోయాక…… !! రాజ్ ముందుకు వచ్చిన డ్రైవర్ సర్ మేడం కోసం డిన్నర్ తీసుకుని వచ్చాను సెల్ ఓపెన్ చేస్తే ఇచ్చేసి వెళ్ళిపోతాను….. !!

మేడమా….. ?? ఇక్కడ మేడం ఎవరు ఉన్నారు లేడీ కానిస్టేబుల్స్ ఆల్రెడీ డిన్నర్ చేసేసారు అనుకుంటా….. ?? ఓహ్ నువ్వు చెప్పేది వాష్ రూమ్స్ క్లీన్ చేసే ఆవిడ గురించా అనగానే శ్లోక కోపంగా పల్లు నూరుతుంది …… !!

నేను చెప్పేది మా మేడం శ్లోక గురించి సర్…… !! దాని గురించా నువ్వు చెప్పేది చూడు అది నీకు మేడం అవ్వచ్చు బట్ వన్స్ నా సెల్ లోకి ఎంటర్ అయ్యాక ఎంత పెద్ద తోప్ అయినా నేను వాళ్లను ముద్దాయి ( accused) గానే చూస్తాను…. !! ఇంకో సారి ఆ పిచ్చుకుని పట్టుకుని మేడం అంటే మాడు పగలకొడతాను అని డ్రైవర్ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని స్టేషన్ బయటకు విసిరి …… !! అవుట్ సైడ్ ఫుడ్ నాట్ ఎలోడ్ దానికి ఇక్కడే ఫుడ్ ఎరేంజ్ చేసాం కడుపు నిండా ఇప్పుడే ఫుల్ గా మెక్కింది కానీ ఇక నువ్వు వెళ్ళు….. !!

రాజ్ నుండి సీరియస్ గా వచ్చిన మాటలకు డ్రైవర్ అక్కడి నుండి వెళ్ళిపోతే శ్లోక రాజ్ వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది….. !! శ్లోక చూపులు ఏమాత్రం కేర్ చేయకుండా అక్కడే కాలు మీద కాలు వేసుకొని కూర్చుని నీ పాపం పండెను నేడు!! నీ భరతం పడతా చూడు…… !! నీ పాలిటి యమున్ని నేను….. !! నీ కరెక్ట్ మొగుణ్ణి నేను అంటూ లిరిక్స్ పాడుతున్న రాజ్ వైపు చూస్తూ శ్లోక కుత కుత ఊడిపోకిపోతూ ఉంటుంది….. !!

ఎపుడు స్టేషన్ లో సీరియస్ & సిన్సియర్ గా ఉండే రాజ్ ఇలా సాంగ్స్ పాడుతూ ఉండడం చూసి స్టేషన్ లో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు….. !! సర్ డ్రైవర్ రెడీగా ఉన్నాయి మీరు వెళ్ళే టైమ్ అవుతుంది అని చెప్తున్న కానిస్టేబుల్ వైపు తల తిప్పుతూ…… !! నేను ఇవాళ ఇంటికి వెళ్ళడం లేదు డ్రైవర్ ను ఇవాళ ఇంటికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ త్వరగా రమ్మని చెప్పు…… !!

బట్ సర్ మానస మేడం మీ కోసం చూస్తూ ఉంటారేమో….. ?? మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇంత మంది ఉన్నాం కదా మీ పర్మిషన్ లేకుండా ఈ అమ్మాయిని బయటకు అలో చేయం …… !!

దాని గురించి మీకు తెలియదు మీరు కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు స్టేషన్ మీద rdx వేయించి మరీ ఎస్కేప్ అవుతుంది….. !! అందుకే దీన్ని కోర్ట్ లో ప్రొడ్యూస్ చేసే దాకా నేను జాగ్రత్తగా ఉంటాను వెళ్ళి నీ వర్క్ చూసుకో అని కానిస్టేబుల్ ను పంపి మానస కాల్ రావడం తో మాట్లాడుతూ ఉంటాడు…… !!

రాజ్ కాల్ కట్ చేసి మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉండగా ఏ. ఎస్. ఐ. ఇద్దరూ అమ్మాయిలను అక్కడికి తీసుకుని వచ్చి సర్ రైడింగ్ కి వెళ్ళినపుడు ఈ అమ్మాయిలు దొరికారు….. !! ఎన్ని సార్లు చెప్పినా ఈ అమ్మాయిలు ఈ ప్రొఫెషన్ వదిలి పోవడం లేదు అని చెప్పగానే రాజ్ వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళను సెల్ లో పడేయండి రేపు చెప్తా వీళ్ళను ఎమ్ చేయాలో….. ??

ఒకే సర్ అంటూ ఆ అమ్మాయిలను వేరే సెల్ లోకి పంపిస్తుంటే ఆపి మళ్ళీ సెపరేట్ సెల్ ఎందుకు…… ?? అది ఉంది గా అందులోకే పడెయ్యి అనగానే శ్లోక కోపంగా స్టాప్ ఇట్ రాజ్ వాళ్ళు నేను ఒకే సెల్ లో ఎలా ఉంటాం…… ?? దీనికి నేను ఒప్పుకోను నాకు ఇలాంటి వాళ్ళను చూస్తేనే అసహ్యం అలాంటి వాళ్ళతో ఒకే సెల్ లో ఎలా కలిసుండాలి …… ??

షట్ అప్ ఇది నా స్టేషన్ ఇక్కడ నేను చెప్పిందే అందరూ వినాలి ఇంకో సారి నోరు తెరిస్తే బులెట్ దించేస్తా అని సీరియస్ గా చూస్తూ ……. !! ఏయ్ నువ్వు వాళ్ళను లోపలికి పంపించి శ్లోక ఎఫ్. ఐ. ఆర్ తీసుకుని రా అని చెప్పగానే ఆ అమ్మాయిలను లోపలికి పంపేసి లాక్ చేసి రాజ్ అడిగిన ఫైల్ తెచ్చిస్తాడు ఏ. ఎస్. ఐ!!

శ్లోక ఆ అమ్మాయిలను చూస్తూ చిరాగ్గా వెళ్ళి కూర్చోడానికి వీలుగా ఉన్న ప్లేస్ లో కూర్చుంటూ…… !! ఏయ్ నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి దగ్గరకు వస్తే చంపేస్తాను అని కోపంగా చెప్పి కూర్చుంటుంది…. !!

ఏ కంపెనీ….. ??

ఒక్క నైట్ కి ఎంత తీసుకుంటావ్…… ??

చూడ్డానికి ఫ్రెష్ గా ఉన్నావ్….. ?? కొత్తగా ఈ ఫీల్డ్ కి వచ్చావా….. ??

వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కి శ్లోక కోపంగా పైకి లేచి ఇద్దరి చెంపలు పగల కొడుతుంది…… !! ఏయ్ ఎందుకు కొట్టావ్ అంటూ ఉక్రోషంగా అడుగుతున్న అమ్మాయిల వైపు సీరియస్ గా చూస్తూ మీలా నాకు క్యారెక్టర్ లేదు అనుకున్నారా నా గురించి తప్పుగా వాగితే చంపేస్తాను….. !!

ఉన్న మాట అంటే ఎందుకంత కోపం….. ?? నువ్వు అలాంటి అమ్మాయివి కాబట్టే ఈ టైం లో మాతో పాటు స్టేషన్ లో ఉన్నావ్…. ?? పెద్ద పతివ్రత లా బిల్డ్ అప్ ఇవ్వకు నువ్వు కూడా మా లాగే కాకపోతే కొంచెం రిచ్ పీపుల్స్ దగ్గరకి వెళ్తావ్ అనుకుంటా అందుకే ఇంత పోష్ గా ఉన్నావ్….. !!

సెల్ లో జరుగుతున్న గోల కి అక్కడికి వచ్చిన రాజ్ సెల్ డోర్ మీద కొడుతూ వాట్స్ హ్యాపెనింగ్ అంటూ సీరియస్ గా అడుగుతాడు….. ?? చూడు ఇదంతా నీ వల్లే అడ్డమైన వాళ్ళను తెచ్చి నా సెల్ లో పడేసావ్ వీళ్ళు నన్ను కూడా వాళ్ళ లాంటి అమ్మాయినే అంటున్నారు……. !! అంటూ అప్పటికే వాళ్ళ మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరగడం తో నీళ్ళు నిండిన కన్నులతో రాజ్ వైపు చూస్తుంది….. !!

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply