రాజ్ కన్నింగ్ స్మైల్ చూసిన శ్లోక ఏయ్ ఎందుకు అలా నవ్వుతున్నావ్ ….. ?? ఫస్ట్ కార్ ఆపు నన్ను స్టేషన్ కి తీసుకుని వెళ్తానని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావ్ ఆపరా అంటూ రాజ్ చెయ్ పట్టుకుని కొడుతూ ఉంటుంది…… !! ఏయ్ చుప్ అంటూ నోటి మీద వేలు పెట్టి సీరియస్ గా చెప్తున్న రాజ్ ను చూసి శ్లోక భయం తో సీట్ చివరకు అతుక్కుపోయి టెన్షన్ గా చూస్తూ ఈ సచ్చినోడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో ఏంటో అసలే వీడికి నేనంటే పడదు….. ?? నన్ను సీటీ అవుట్ స్కర్ట్స్ కి తీసుకుని వెళ్లి చంపేయడు కదా….. ??
నిన్ను చంపాలి అనుకుంటే సిటీ అవుట్ స్కర్ట్స్ దాకా ఎందుకే నాకు పెట్రోల్ బొక్క 😏 …… ?? నిన్ను చంపాలి అనుకుని ఉంటే ఈ పాటికి ఎప్పుడో చంపేసే వాడిని అయినా నిన్ను చంపితే నా పగ ఎలా చల్లారుతుంది చెప్పు ….. ?? అందుకే అంతకు మించి ప్లాన్ చేసాను జస్ట్ వెయిట్ & వాచ్ మై షో 😎
యూ పాగల్ మా అన్నయ్య లేని టైమ్ లో మా ఇంటికి దొంగ గా వచ్చి నన్ను తీసుకుని వెళ్తున్నావ్….. ?? ఈ పాటికి ఈ విషయం మా అన్నయ్య కు తెలిసే ఉంటుంది…… !! అన్నయ్య వచ్చాక చెప్తారా నీ సంగతి నీకు ఏమాత్రం బ్రతకాలి అన్న ఆశ లేదు కదా అందుకే నాతో పెట్టుకున్నావ్…… ??
వాడో పెద్ద పిస్తా నువ్వో పెద్ద చంచా మూసుకుని కూర్చో లేకపోతే కిందకు తోసేస్తా చచ్చి ఊరుకుంటావ్….. ??
నీ అబ్బ వదులు నన్ను….. !! అంటూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్న శ్లోక ను చూసి సడెన్ గా తన కార్ ఆపుతాడు రాజ్….. !!
చూసావా మర్యాదగా అడిగితే ఆపలేదు ఇప్పుడు నీ అంతట నువ్వే ఆపావ్ నో ఆపేలా చేసా దట్ ఇస్ శ్లోక….. !! నన్ను మర్యాదగా మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి సారి చెప్పి వెళ్ళిపో దీన్ని ఇంతటితో వదిలేస్తా లేదా ……… ??
హా లేదా …… ??
నీ గురించి ఉన్నవి లేనివి మా మామ్ కి చెప్పి నీ జాబ్ తీయించేస్తాను తెలుసు కదా మా మామ్ కి నీ సుపీరియర్ ఆఫీసర్స్ కూడా బాగా తెలుసు 😎 ….. !! కాబట్టి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో…… ??
దిగవే….. ??
వాట్ 🤷….. ??
వాట్ లేదు వంకాయ లేదు ముందు కార్ దిగు అంటూ రాజ్ కోపంగా కార్ దిగి శ్లోక చెయ్ పట్టుకుని తనను బయటకు లాగి మీ మామ్ కి అన్నీ చెప్తాను అన్నావ్ కదా ఇది కూడా చెప్పు అంటూ శ్లోక నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని నాలుగు పెదాలు కలిపేస్తాడు……. !!
రాజ్ చేసిన పనికి శ్లోక షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి రాజ్ నుండి దూరం జరగాలి అని చూస్తుంటే రాజ్ అంతకంతకు శ్లోక ను డీప్ గా కిస్ చేస్తూ తనను మరింత గట్టిగా హత్తుకుంటాడు…. !!
శ్లోక రాజ్ ను గట్టిగా కొడుతూ జుట్టు పట్టుకుని లాగుతూ కొరుకుతున్న రాజ్ ఇంచ్ కూడా కదలడు….. !! రోడ్ మీద వెళ్తున్న వాళ్ళు వీళ్ళని చూసి ఓ…. ఓ… అని అరుస్తూ క్యూట్ లవర్స్ అంటున్నా రాజ్ వదలడు…… !! శ్లోక పెదవిని కొరికి బ్లీడింగ్ అవుతున్న బ్లడ్ ను చూసి నవ్వుతూ తనకు దూరం జరుగుతాడు….. !!
శ్లోక ఏడుస్తూ రాజ్ వైపు చూసి నన్ను కిస్ చే……. ?? మాట కంప్లీట్ అవ్వకముందే మళ్ళీ కిస్ చేస్తాడు….. !! అలా శ్లోక మాట్లాడిన ప్రతీ సారి కిస్ పెడుతూ శ్లోక నోరు తెరవకుండా చేసి ఏడుస్తున్న శ్లోక ను కార్ లోకి తోసి శ్లోక కన్నీళ్ళు ….. !! చూసి నవ్వుతూ తిరిగి తన స్టేషన్ వైపు కార్ టర్న్ చేసి స్టేషన్ రాగానే శ్లోక ను తీసుకుని సెల్ లో పడేసి తన రూమ్ లో కూర్చుని ఫింగర్స్ కౌంట్ చేస్తూ ఉంటాడు…. !!
సరిగ్గా తను 10 ఫింగర్స్ కౌంట్ చేసే సరికి మహాన్ లాయర్ ను తీసుకుని బెయిల్ పేపర్స్ తో స్టేషన్ లో అడుగు పెట్టడం చూసి రాజ్ నవ్వుతూ చూస్తుంటాడు…… !!
రేయ్ రాజ్….. !! స్టేషన్ లోకి అడుగు పెడుతూనే కోపంగా అరిచిన మహాన్ వాయిస్ కి శ్లోక సెల్ నుండి చూస్తూ అన్నయ్య అంటూ ఏడుస్తూ మహాన్ ను పిలుస్తుంది….. !?
శ్లోక ఎవర్రా నిన్ను సెల్ లో వేసింది…. ?? రేయ్ రాజ్ మర్యాదగా నా చెల్లిని వదులు అని కోపం తో ఊగిపోతున్న మహాన్ ను చూసి స్టేషన్ లో అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు….. !! గెట్ బ్యాక్ టు యువర్ వర్క్స్ అని సిరియస్ గా వినిపించిన రాజ్ వాయిస్ కి అందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చుంటారు…. !!
ఇది నీ ఆఫీస్ కాదు నా స్టేషన్ రెస్పెక్ట్ లేకుండా పిలిస్తే నీ చెల్లి పక్క సెల్ కూడా ఖాళీగానే ఉంది అని వెటకారంగా నవ్వుతాడు రాజ్…. !!
అంటే ఎంట్రా నన్ను కూడా అరెస్ట్ చేస్తావా….. ?? నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయరా అంటూ రాజ్ ముందు నుంచుంటాడు మహాన్….. !!
రాజ్ మహాన్ ముందుకు వస్తుంటే మధ్యలో అడ్డుకున్న లాయర్ సర్ ప్లీస్ వుయ్ ఆర్ సారి….. !! ఇదిగోండి బెయిల్ పేపర్స్ ప్లీస్ మేడం ను రిలీజ్ చేయండి……. !!
బెయిల్ పేపర్స్ మాత్రమే తెస్తే సరిపోదు లాయర్ సర్ బెయిల్ ఇస్తున్న వాడి ఐడి ప్రూఫ్ కూడా తేవాలి….. !! ఎందుకంటే ఆ బెయిల్ ఇస్తున్న బచ్చా ఎవరో ఏంటో మాకు తెలియాలి & మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా……. !!
మహాన్ కోపంగా తన పాకెట్ నుండి రాజ్ అడిగిన ప్రూఫ్స్ అన్ని చూపిస్తాడు….. !! రాజ్ అన్ని చూస్తూ ఒకే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి బట్ ఆధార్ కార్డ్ లో మీ ఫాదర్ నేమ్ లేదేంటి…… ?? నీకు ఫాదర్ లేడా మిస్టర్ మహాన్….. !!
అది అంత అవసరమా నాకు ఫాదర్ ఉన్నా లేనట్టే నాకు అన్ని మామ్ నే అంటూ పళ్ళు నూరుతూ చెప్తాడు…. !!
అచ్ఛా ఉన్నా లేనట్టే అంటే ఉన్నట్ట లేనట్టా….. ?? లేక ఉండి లేనట్టా…… ?? లేదా లేకపోయినా ఉన్నట్ట…… ???
షట్ అప్ నా పర్సనల్ విషయాలు నీకు ఎందుకు …… ?? మర్యాదగా శ్లోక ను వదిలేయ్…… ??
అరే ముందు నా డౌబ్ట్ క్లియర్ చేయండి మిస్టర్ మహాన్….. ?? నీకు ఫాదర్ ఉన్నాడా లేడా….. ??
మహాన్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నాకు ఫాదర్ లేడు ….. !!
లేడు అంటే మీతో లేడా!!
చచ్చిపోయాడు అని కోపంగా చెప్తున్న మహాన్ ను చూసి రాజ్ పిడికిలి బిగుసుకుంటే శ్లోక మాత్రం పొగరుగా నవ్వుతుంది !! కరెక్ట్ గా చెప్పావ్ అన్నయ్య మాకు నాన్న లేడు ఎపుడైతే మమ్మల్ని వదిలేశాడో ఆ క్షణమే చచ్చిపోయాడు …… !! అని శ్లోక చెప్పడం విని రాజ్ శ్లోక వైపు సీరియస్ గా చూస్తే శ్లోక కూడా మహాన్ ఉన్నాడన్న ధైర్యం తో అంతే సీరియస్ లుక్స్ ఇస్తుంది….. !!
ఓహ్ అయితే మీకు మీ నాన్న ఎవరో తెలియదు అనమాట ప్చ్ …. !! సో సాడ్ కనీసం మీ అమ్మకైన తెలుసా లేదా ఆవిడకు కూడా తెలియదా 😏 !!
రాజ్ స్టేషన్ దద్దరిల్లేలా అరిచిన మహాన్ వాయిస్ కి రాజ్ కాదు ఏ. సి. పీ. స్వరాజ్ నీకు నోరు లేస్తే నాకు చెయ్ లేస్తుంది అంటూ బెయిల్ పేపర్స్ మహాన్ ముందే చింపి తన మొహం మీదకు విసురుతాడు…… !! నీ ఆధార్ కార్డ్ లో ఫాదర్ నేమ్ లేదు కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేయడం లేదు పోయి కరెక్ట్ ఆదార్ కార్డ్ పట్టుకుని రా 😎 అని యాటిట్యూడ్ గా చెప్పి ఏమయ్యా సోమేష్ స్ట్రాంగ్ టీ పట్టుకుని రా తల పగిలిపోతుంది అని చెప్పి తన రూమ్ లో కి వెళ్తున్న రాజ్ ను చూసి అన్నా చెల్లెలు పళ్ళు నూరుతూ చూస్తుంటారు….. !?
అన్నయ్య వాడు ఇదంతా కావాలని చేస్తున్నాడు అంటూ కోపంగా చెప్తున్న శ్లోక ను చూసి డోంట్ వర్రీ శ్లోక ఒక్క కాల్ తో వాడి జాబ్ పీకించేస్తా అంటూ పెదవి దగ్గర బ్లడ్ రావడం చూసి ఏయ్ ఏమైంది ఎందుకలా బ్లడ్ వస్తుంది అని అడుగుతాడు….. !!
అదీ….. అదీ…. హా ఇందాక నేనే పెదవి కొట్టుకున్నా అని కవర్ చేస్తున్న శ్లోక మాటలకు డౌబ్ట్ గా చూస్తూనే ……. !! మహాన్ కాసేపు శ్లోక తో మాట్లాడి అక్కడి నుండి స్టేషన్ బయటకు వచ్చి ఎస్. పీ. కి కాల్ చేసి మహాన్ గురించి చెప్తాడు….. !!
ఐ ఆమ్ సారి సర్ మీ కోసం ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను కానీ రాజ్ ను మాత్రం టచ్ చేయలేను….. !! రాజ్ వెనుక మీ డాడ్ కార్తికేయ ఉన్నాడు ఆయన ఉండగా రాజ్ మీద ఈగ కూడా వాలనివ్వడు…… ?! మీరు కోప్పడను అంటే ఒక సలహా ఇస్తాను మీ సిస్టర్ బయటకు రావాలంటే అది మీ ఫాదర్ వల్లే అవుతుంది సో మీరు మీ ఫాదర్ హెల్ప్ తీసుకోవడం బెటర్ అని చెప్తున్న ఎస్. పీ. మాటలకు కోపంగా కాల్ కట్ చేస్తాడు మహాన్….. !!
✨✨✨✨✨✨✨✨✨
నందన హాల్ లో సీరియస్ గా కూర్చుని ఉంటే భూమి గుమ్మం ముందు టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది….. !! అసలు అన్నయ్య ఎందుకిలా చేశాడు శ్లోక ను ఎందుకు అరెస్ట్ చేశాడు….. ?? శ్లోక అసలేం చేసింది అని పదే పదే గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది….. !!
నందు మహాన్ ఏమన్నాడు…… ?? శ్లోక ను రిలీస్ చేశారా అసలేం జరిగిందో ఇప్పటికైనా చెప్పవే….. ?? నువ్విలా కోపంగా కూర్చుంటే అది ఎమ్ రాజ కార్యాలు బయట వెలగబెట్టిందో నాకెలా తెలుస్తుంది అంటూ కోపంగా అడుగుతుంది దేవయాని….. !!
అమ్మా విసిగించకు & కనీసం ఇప్పుడు అయినా నీ మనవరాలి గురించి కన్సర్న్ చూపించు అంటూ విసుగ్గా చెప్పి ఎవరికో కాల్స్ చేస్తూ ఉంటుంది….. !!
అదేం తప్పు చేయకపోతే రాజ్ ఎందుకు దాన్ని తీసుకుని వెళతాడు…. ?? ఇంకా దాన్నే సపోర్ట్ చేస్తూ నీ కూతుర్ని కూడా నీ లాగే తయారు చేయ్….. !! నువ్వు ఎలా నా మాట వినడం లేదో రేపు నీ కూతురు కూడా నీ మాట వినదు…… !? అప్పుడు తెలుస్తుంది నీకు ఈ తల్లి బాధ అంటూ దేవయాని తన రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది …… !!
నందన దేవయాని మాటలకు తను వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ ఉంటుంది….. !! అత్తయ్య అన్న భూమి వాయిస్ కి తన వైపు సీరియస్ గా చూస్తున్న నందన ను చూసి శ్లోక గురించి ఏమైనా తెలిసిందా ….. ?? తను వెళ్ళి చాలా సేపైంది కదా ఇంకా రాకపోయేసరికి కొంచెం కంగారుగా ఉంది….. !!
నీకు ఎందుకే కంగారు వాంటెడ్ గా నువ్వు నీ అన్న కలిసి నా కూతురిని టార్గెట్ చేసి ఈ కేస్ లో ఇరికించారని నాకు తెలియదు అనుకున్నావా ….. ?? అంటూ కోపంగా పైకి లేచి మీరు ఎంత ట్రై చేసినా నా కూతురిని ఎమ్ చేయలేరు అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోతుంది నందన….. !!
గాడ్ ఏంటిది నేను ఏదో చేయాలి అనుకుంటే ఇంకేదో అయ్యేలా ఉంది…. ?? అన్నయ్య ఎందుకురా ఇలాంటి పని చేసావ్ అని రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి తన మొబైల్ తీసుకుని రాజ్ కి కాల్ చేస్తుంది….. !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡
తన క్యాబిన్ లో కూర్చుని సెల్ లో దోమలు కుడుతూ ఉంటే విసుగ్గా అటు ఇటు తిరుగుతూ చిరాకు పడుతున్న శ్లోక ను చూసి నవ్వుతూ కావాలనే శ్లోక కి వినిపించేలా అనుభవించు రాజా…… !! అనుభవించు రాజా…… !! పుట్టింది?? పెరిగింది?? ఎందుకు…… ?? అంటూ సాంగ్ పెట్టుకుని మసాలా టీ తాగుతున్న రాజ్ ను నోట్లో నోట్లోనే పచ్చి భూతులు తిట్టుకుంటూ ఉంటుంది శ్లోక…… !!
( బయటకు తిడితే రాజ్ లాఠీ తో శ్లోక బెండ్ తీస్తాడని పాప కి బాగా తెలుసు కాబట్టి బయటకు తిట్టే సాహసం చేయదు 😎😜 )
తన టేబుల్ మీద ఉన్న మొబైల్ వైబ్రేట్ అవుతూ ఉంటే దాన్ని చేతిలోకి తీసుకున్న రాజ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూసి నవ్వుతూ అక్కడి నుండి శ్లోక కి తన కాల్ వినిపించనంత దూరం వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు….. !!
హాయ్ భూమి…… !!
అన్నయ్య అసలేం చేస్తున్నావ్ రా నువ్వు….. ?? శ్లోక ను ఎందుకు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళావ్….. ??
ఓహ్ అందుకు కాల్ చేసావా….. ?? ఇంకా అన్నయ్య మీద ప్రేమ ఎక్కువ అయ్యి మాట్లాడడానికి కాల్ చేసావ్ అనుకున్నా….. !!
అన్నయ్య ఇది జోక్స్ వేసే టైం కాదు….. !! నేను సీరియస్ గా అడుగుతున్నా శ్లోక ను ఎందుకు తీసుకుని వెళ్లావో చెప్పు….. ??
సరే నువ్వు సీరియస్ గా అడుగుతున్నావ్ కదా నేను కూడా సిన్సియర్ గా చెప్తున్నా విను….. !! శ్లోక ఒక అబ్బాయిని యాక్సిడెంట్ చేసి ఎట్లిస్ట్ ఆ అబ్బాయికి ఏమైందో అని కూడా చూడకుండా వెళ్ళిపోయింది…… !! ఇప్పుడు ఆ అబ్బాయికి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది…… !!
నువ్వు మొగుడు అనుకుంటున్న ఆ మహాన్ గాడు ఎంత తెలివైనోడు అంటే కేస్ వాడి చెల్లి మీదకు రాకూడదు అని ఆ అబ్బాయి చనిపోతే కేస్ మెడకు చుట్టుకుంటుంది…… !! అని ముందే గెస్ చేసి పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు డాక్టర్ తో ఫైట్ చేసి మరీ ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇచ్చేలా బిల్డ్ అప్ ఇచ్చాడు….. !! నేను అప్పుడే అనుకున్నా వీళ్ళకు చంపడం తప్పా కాపాడడం రాదే అని మార్నింగ్ కార్ డిటైల్స్ చూస్తే కానీ అర్థం అవ్వలేదు…… !!
అన్నయ్య ప్లీస్ రా ఆ అబ్బాయికి ఎమ్ కాలేదు కదా శ్లోక ను వదిలేయ్…. !! ఎంత కాదు అనుకున్నా అది మావయ్య కూతురు పైగా ఆడ పిల్ల ఇంకెప్పుడు అలా చేయకని వార్నింగ్ ఇచ్చి వదిలేయ్ ప్లీస్ నా కోసం….. !!
తప్పు చేసింది ఎవరైనా నేను వదిలి పెట్టను అది చెల్లైనా సరే….. !! ఇది నేను చెప్తుంది కాదు మావయ్య నాకు చెప్పిన మాట కాబట్టి నేను దాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు….. !! ఇది చేసిన యాక్సిడెంట్ వల్ల హ్యాపీగా ఇంట్లో ఉండాల్సిన వాడు ఇప్పుడు పేషెంట్ లా హస్పిటల్ లో పడున్నాడు….. !! సారి భూమి అంటూ రాజ్ కోపంగా కాల్ కట్ చేయగానే భూమి కి ఎమ్ చేయాలో అర్థం అవ్వదు….. !!
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
రాత్రి పది అవుతున్నా ఇంటికి రాని మహాన్ కోసం అందరూ హాల్ లోనే వెయిట్ చేస్తూ ఉంటారు….. !! కాసేపటికి మహాన్ కార్ సౌండ్ వినిపించగానే పరుగున బయటకు వెళ్తున్న భూమి ను ఆగు అంటూ ఆపేస్తుంది నందన….. !! అసలే డిస్టర్బ్ గా ఉన్న నందన ను చూసి అక్కడే ఆగిపోయి మహాన్ కోసం చూస్తూ ఉంటుంది భూమి…… !!
శ్లోక ను తీసుకుని వస్తాడు అనుకున్న మహాన్ ఒకడే ఇంట్లోకి రావడం చూసి అందరూ ఒకరిని ఒకరు చూసుకుంటారు….. !! మహాన్ చిరాగ్గా ఇంట్లోకి వచ్చి హాల్ లో ఉన్న సోఫా లో కూర్చుని తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకుంటాడు….. !!
మహాన్ శ్లోక ఎక్కడ….. ?? తనను తీసుకుని వస్తానని చెప్పి వంటరిగా వచ్చావ్ ఏంట్రా….. ?? కాల్స్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదు….. ?? అసలేం అయింది శ్లోక ఎక్కడ…. ?? శ్లోక కోపంగా కార్ లోనే కూర్చుందా అని కార్ వైపు వెళ్తున్న నందన చెయ్ పట్టుకుని ఆపేస్తూ శ్లోక లేదు మామ్ అంటూ తల పైకి ఎత్తి నందన వైపు చూస్తాడు….. !?
లేదు అంటే…… ??
శ్లోక ను ఆ రాజ్ వదిలేయలేదు మామ్…… !! నేను ఎంత ట్రై చేసినా ఆ రాజ్ గాడు నా మాట వినడం లేదు అంటూ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ గురించి క్లియర్ గా చెప్తూ ఇదంతా వాడు కావాలనే చేస్తున్నాడు….. !!
మరి ఇప్పుడు ఎలా మహాన్….. ?? నా కూతురు అలా పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిందేనా అంటూ ఆవేశంగా అరుస్తుంది నందన….. !!
మామ్ ఆవేశ పడకు మన శ్లోక బయటకు రావాలంటే మనకు టూ వేస్ ఉన్నాయి అంటూ నందన వైపు చూస్తూ…… !! నంబర్ వన్ ఆదార్ కార్డ్ లో ఫాదర్ నేమ్ వేయించాలి లేదా ఆ వ్యక్తి ( కార్తికేయ/ నాన్న అని పిలవడం కూడా మహాన్ కి ఇష్టం లేదు) హెల్ప్ తీసుకుని శ్లోక ను బయటకు వచ్చేలా చేయడం….. !!
ప్రాణం పోయినా ఆ రెండిటికి నేను ఒప్పుకోను అంటూ కోపంగా చెప్పి ఇదంతా ఎందుకు ఆ రాజ్ గాడిని చంపేస్తే ఒక పని అయిపోతుంది….. !! ప్రతీ సారి వీడు నాకు అడ్డు వస్తూనే ఉన్నాడు వీడి చావు ఒక రకంగా నా పగ ను కొంచెం లో కొంచెం చల్లారుస్తుంది …… !! ఆ కార్తికేయ కి వీడంటే ప్రాణం కాబట్టే వీడ్ని చంపి కార్తికేయ మీద పగ తీర్చుకుంటాను ….. !!
మా అన్నయ్య జోలికి వస్తే బాగోదు అత్తయ్య అయినా మా అన్నయ్య మాములు వ్యక్తి కాదు అంత ఈజీగా చంపడానికి….. !! ఏ. సి. పి. స్వరాజ్ తన చుట్టూ ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది & వాళ్ళను దాటుకుని చంపాలి అని చూస్తా ఏకే 47 తో వీపు గోక్కున్నట్టే అని పొగరుగా చెప్తుంది భూమి….. !!
ఇదంతా నీ వల్లేనే దెయ్యం అంటూ భూమి ను కొట్టడానికి వెళ్తున్న నందన కి భూమి కి మధ్య అడ్డుగా నుంచుంటాడు మహాన్….. !! మహాన్ ను అలా చూసి నందన, విజయేంద్ర వర్మ నోరు వదిలేసి షాక్ అవుతూ చూస్తుంటే దేవయాని, భూమి ఆశ్చర్యం & ఆనందం కలగలిపి చూస్తుంటారు….. !!
అప్డేట్స్ లేట్ అయ్యాయి అందుకు రీసన్ కూడా మీకు పోస్ట్ లో చెప్పాం….. !! మా స్టోరీ కోసం పేషెన్స్ తో వెయిట్ చేసినా మీ అందరికీ థాంక్ యూ ఇంకో సారి డిలే అవ్వకుండా చూసుకుంటాం ….. !! స్టోరీ ఇప్పుడిపుడే ట్రాక్ ఎక్కుతుంది కాబట్టి మిస్ అవ్వకండి గాయ్స్…… !! మీరు హైప్ ఇస్తే ఈ స్టోరీ మరి కొంత మందికి రీచ్ అవుతుంది….. !! సో స్టోరీ అయ్యాక హైప్ ఇవ్వడం మర్చిపోకండి & స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ ద్వారా చెప్పండి