డిన్నర్ తర్వాత తన వర్క్ చేసుకుంటూ హాల్ లో కూర్చుని సీరియస్ గా వర్క్ చేసుకుంటున్న కార్తికేయ కి హాల్ లో అటు ఇటు తిరుగుతూ వాల్ క్లాక్ మీద టైం చూస్తూ పదే పదే గుమ్మం వైపు చూస్తున్న మానస ను చూసి మను ఎందుకలా తిరుగుతున్నావ్….. ?? వాడేమైనా చిన్న పిల్లాడా ఏంటి వర్క్ అవ్వగానే వస్తాడు కానీ ముందులా కూర్చో అంటున్న ……. !! కార్తికేయ వాయిస్ కి డెయిలీ 10 లేదా 10:30 లోగా వచ్చేవాడు అన్నయ్య ఇవాళ 11 దాటినా ఇంకా రాలేదు….. !!
మను రాజ్ హైదరాబాద్ ఏ. సీ. పి. అలాంటి వాడికి అందరూ భయపడాలి కానీ వాడు ఎవరికి భయపడడు కాస్త హెడ్ ఏక్ గా ఉంది….. !! నువ్వు నా కోసం స్ట్రాంగ్ కాఫీ తీసుకుని రా అని అనడం తో ఒకే అన్నయ్య అని గుమ్మం వైపు చూస్తూనే …… !! కిచెన్ లోకి వెళ్తున్న మానస ను చూసి కార్తికేయ నవ్వుకుని తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు….. !!
అన్నయ్య కాఫీ అంటూ కార్తికేయ కి కాఫీ కప్ ఇస్తూ ఉండగా అపుడే ఇంట్లోకి వస్తూ కనిపిస్తాడు రాజ్….. !! ఏంట్రా ఇంత లేట్ అయింది అరే లేట్ అవుతుందని ఒక కాల్ చేయడానికి కూడా నీకు తీరిక లేదా….. ?? అసలు ఇప్పటి వరకూ ఎక్కడికి వెళ్ళావ్ అని రాజ్ ఇంట్లోకి రాగానే నాన్ స్టాప్ గా క్వశ్చన్స్ అడుగుతున్న మానస ను చూసి ….. !! కార్తికేయ నవ్వుతూ ఇప్పుడే కదా మను వస్తున్నాడు పాపం వాడికి ఊపిరి తీసుకునే గ్యాప్ అయినా ఇవ్వు….. !?
థాంక్స్ మావయ్య ఫైనల్లీ నీ చెల్లి ప్రశ్నల పరంపర కు అడ్డు కట్ట వేశావ్ అని రాజ్ కూడా నవ్వుతూ కార్తికేయ ఎదురుగా కూర్చుంటూ……. !! మామ్ ఫుల్ హెడ్ ఏక్ నా కోసం కూడా కాఫీ తీసుకురావా ……. ?? స్టేషన్ లో ఇవాళ ఫుల్ వర్క్ బాబోయ్ ఒక్కో కేస్ ఒక్కో టైప్ తల పగిలిపోతుంది….. !!
కాఫీ తర్వాత ముందు నువ్వు ఫ్రెష్ అయి వస్తే డిన్నర్ వడ్డిస్తా నువ్వు ఈ మధ్య సరిగ్గా ఫుడ్ తినడం లేదు…… !! కార్తికేయ కూడా మీ అమ్మ చెప్తుంది నిజమే రాజ్ వెళ్ళు ఫస్ట్ ఫ్రెష్ అయి రా….. ??
సరే మావయ్య అంటూ రాజ్ పదిహేను నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తాడు….. !! అప్పటికే రాజ్ కోసం అన్ని వేడి వేడిగా కుక్ చేసి తీసుకుని వచ్చి సర్వ్ చేస్తూ తింటున్న రాజ్ ను చూసి ఇంత లేట్ అవ్వడానికి రీసన్ అడుగుతుంది…… !!
నేను త్వరగా రావాలి అనే స్టార్ట్ అయ్యాను మామ్ బట్ సడెన్ గా ఒక యాక్సిడెంట్ కేస్ వచ్చింది…… !! సో దాని గురించి హస్పిటల్ కి వెళ్ళి యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అని స్టేట్మెంట్ తీసుకుని ఆ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేసరికి బాగా టైం అయిపోయింది….. !! ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే నాకు ఆ హస్పిటల్ లో మహాన్ గాడు కనిపించాడు…… !? అని చెప్పగానే అప్పటి వరకు లాపి లో తల దూర్చి వర్క్ చేసుకుంటున్న కార్తికేయ టక్కున తల ఎత్తి వీళ్ళ వైపు చూస్తాడు….. ??
రేయ్ మహాన్ నీకు బావ కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా పిలుస్తావ్ ఏంట్రా….. ?? ఇద్దరిదీ ఒకటే ఏజ్ కదరా ఎందుకిలా ఎనిమీస్ లా అయిపోయారు చిన్నప్పుడు ఇద్దరూ ఎంత బాగా ఉండే వారో తెలుసా….. ??
అది నాకు గుర్తు లేదు కానీ నన్ను ఎనిమీ లా చేంజ్ చేసింది మాత్రం వాడే….. !! అలాంటి వాడికి రెస్పెక్ట్ ఒక్కటే తక్కువ కానీ కొంచెం పప్పు చారు వేయి….. !!
మను రాజ్ ప్లేట్ లో పప్పు చారు వేస్తూ అది సరే మహాన్ లో హస్పిటల్ లో కనిపించాడు అన్నావ్….. ?? తను బానే ఉన్నాడా…… ?? ఏమైంది రా ఎందుకు వచ్చాడు హాస్పిటల్ కి …… !!
వాడికేం దుక్కలా ఉన్నాడు వాడి గురించి ఎమ్ వర్రీ అవ్వకు ఇక్కడ మ్యాటర్ వాడు హాస్పిటల్ కి రావడం కాదు…… !! అక్కడికి వచ్చి వాడు ఏం చేశాడన్నది పాయింట్ …….. ??
అంతలా ఏమ్ చేశాడు అని హ్యాండ్ వాష్ చేసుకుంటున్న రాజ్ కి హ్యాండ్ టవల్ అందిస్తూ అడుగుతుంది మానస….. !!
ఇప్పటి వరకు వాడిలో ఆవిడ బ్లడ్ ఒకటే ఉందని ఫిక్స్ అయ్యా బట్ నేను షాక్ అయ్యేలా వాడిలో మావయ్య బ్లడ్ కూడా ఉందని ప్రూవ్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వని పేషెంట్ కి షూరిటీ సైన్ చేసి ట్రీట్మెంట్ జరిగేలా చేసాడు….. !!
రాజ్ చెప్పింది విన్న కార్తికేయ మొహం లో ఆర క్షణం నవ్వు అలా వచ్చి అలా మాయం అవుతుంది…… !! మానస కూడా నవ్వుతూ నా అల్లుడు బంగారం అని మురిసిపోతూ ఉంటే రాజ్ మానస వైపు కోపంగా చూస్తూ తన చేతిలోని హ్యాండ్ టవల్ విసిరేసి ……. !! విసుగ్గా తన రూమ్ కి వెళ్ళడం చూసి మానస భారంగా నిట్టూర్చి మెయిడ్ తో అన్ని నీట్ గా క్లీన్ చేయమని చెప్పి తను కూడా కార్తికేయ కి చెప్పి తన రూమ్ కి వెళ్ళి నిద్రపోతుంది….. !!
ఒంటరిగా హాల్ లో మిగిలిపోయిన కార్తికేయ తన వర్క్ ఫినిష్ అయ్యేసరికి నైట్ 2 అవుతుంది….. !? మంట పుడుతున్న కళ్ళను రుద్దుకుంటూ చేసిన వర్క్ సేవ్ చేసి పైకి లేచి బాడీ స్ట్రెచ్ చేస్తూ తన లాపీ పట్టుకుని తన రూమ్ కి వెళ్ళి లాపీ టేబుల్ మీద పెడుతూ…… !! బెడ్ మీద అడ్డంగా పడిపోయి కళ్ళు మూసుకుంటాడు …… !!
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
భూమి అలారం పెట్టుకుని ఎప్పటి లాగే తను రెగ్యులర్ గా లేచే టైమ్ కి లేచి ఫ్రెష్ అయ్యి తన రూమ్ నుండి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి అప్పటికే మెయిడ్స్ నిద్ర లేచి ఇల్లు నీట్ గా మాప్ పెడుతూ ఉంటారు…… !!
భూమి ను చూసి అందరూ గుడ్ మార్నింగ్ మ్యామ్ అని విష్ చేస్తుంటే భూమి కూడా నవ్వుతూ విష్ చేస్తూ …….. !! రేణుక నేర్పించిన వాటిలో ఒక సింపుల్ ముగ్గు ను ఇంటి ముందు అందమైన రంగులతో ఆ ముగ్గు ను అందంగా వేసి ……. !! ఇంట్లోకి వచ్చేసరికి రేణుక అందరి కోసం టీ & మహాన్ కోసం కోకనట్ వాటర్, శ్లోక కోసం గ్రీన్ టీ ఇలా అందరికీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది….. !!
రేణుక వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి ముందుగా గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ తీసుకుని వచ్చి ఇంట్లో ధూపం వేస్తూ పూజ కంప్లీట్ చేసి….. !! తులసి చెట్టు కు పూజ చేయడానికి గార్డెన్ రైట్ సైడ్ వైపు వెళుతుంది….. !!
తను అనుకున్నది త్వరగా జరిగేలా చూడమని కోరుకుంటూ పూజ చేస్తూ ఉంటుంది భూమి…… !! బద్దంగా నిద్ర లేచి బాల్కనీ లోకి వచ్చి వొళ్ళు విరుచుకుంటున్న మహాన్ కి గార్డెన్ వైపు భూమి తులసి చెట్టు కు పూజ చేయడం కనిపించి తన చేతులు రైలింగ్ మీద బిగుసుకుంటాయి….. !!
నన్ను అందరిలో వెధవని చేసావ్ కదా ఆగవే నీ పని చెప్తా అని ఫాస్ట్ గా వాష్ రూమ్ కి వెళ్ళి బకెట్ వాటర్ తీసుకుని వచ్చి కిందకు చూస్తాడు….. !! భూమి పూజ పూర్తి చేసి దీపం వెలిగించి ఇంట్లోకి వెళ్తూ ఉండడం చూసి ఇదే కరెక్ట్ టైమ్ అనుకుంటూ మహాన్ ఆ బకెట్ వాటర్ ను భూమి మీదకు పడేలా విసిరి దాక్కుంటాడు…… !!
దబ్ మంటూ తన మీద పడ్డ నీళ్ళకు ఉలిక్కిపడ్డ భూమి షాక్ నుండి తేరుకుని కోపంగా పైకి చూస్తుంది…… !! అక్కడ తనకు ఎవరూ కనిపించరు అయినా భూమి కి అవి ఎక్కడి నుండి పడ్డాయో అర్థం అవ్వగానే కోపంగా మహాన్ రూమ్ లోకి పరుగు పెడుతుంది….. !!
భూమి మహాన్ రూమ్ కి వెళ్ళేసరికి మహాన్ బుద్ధిమంతుడి బామ్మర్దిలా నిద్ర నటిస్తూ కనిపిస్తాడు….. !! ఓరిని వేషాలో ఆగు నీ పని చెప్తా అని టేబుల్ మీద బాటిల్ తీసుకుని తను వెళ్ళిపోయినట్టు డోర్ సౌండ్ చేస్తుంది….. !! నిజంగా భూమి వెళ్ళిపోయింది అనుకున్న మహాన్ నవ్వుతూ పైకి లేచి వెనక్కు తిరిగి చూసే సరికి నవ్వుతూ మహాన్ మొహం మీద బాటిల్ వాటర్ పోసేసి నవ్వుకుంటూ రూమ్ నుండి బయటకు పరిగెడుతుంది భూమి….. !!
ఆ ఆ ఆ 😬😬 ఏయ్ భూమి ఆగు అయిపోయావే నా చేతిలో అంటూ మహాన్ కోపంగా రూమ్ నుండి బయటకు వచ్చి భూమి ను పట్టుకోవడానికి వెనుకే పడతాడు….. !! నువ్వు నన్ను పట్టుకోలేవు మహాన్ కమాన్ క్యాచ్ మీ అంటూ హాల్ మొత్తం పరిగెడుతూ మహాన్ కి దొరకకుండా తనను ముప్పు తిప్పలు పెడుతుంది…… !!
వీళ్ళ గోలకు నిద్రపోతున్న వాళ్ళు కూడా రూమ్స్ నుండి బయటకు వచ్చి చూడగా ఇద్దరూ తడి బట్టల్లో ఒకరిని ఒకరు తరుముతూ చిన్న పిల్లల్లా ఆడుకుంటూ ఉంటారు….. !! ఏంటి ఈ గోల ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా నన్ను అని అరుస్తూ రూమ్ బయటకు వచ్చిన నందన వీళ్ళను చూసి కోపంగా చూస్తూ ఉంటుంది…… !!
భూమి మహాన్ కి అందకుండా పరిగెడుతూ తను ఆల్రెడీ మొత్తం తడిచిపోవడం తో చీర పల్లు అడ్డు పడి స్లిప్ అయి వెళ్ళి సోఫా మీద పడిపోవడం తో మహాన్ భూమి ను చూసి ….. !! నవ్వుతూ ఇప్పుడు ఎక్కడికి పోతావే అంటూ భూమి ను రెండు చేతులతో ఎత్తుకుని గార్డెన్ వైపు వెళ్ళడం చూసి నందన కి బుర్ర గిర్రున తిరుగుతుంది….. !!
మహాన్ వదులు అంటూ చేప పిల్లలా కొట్టుకుంటున్న భూమి ను అలాగే గార్డెన్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కి విసిరి విలన్ లుక్ ఇస్తూ నవ్వుతున్న మహాన్ కాలు పట్టుకుని మహాన్ ను కూడా స్విమ్మింగ్ పూల్ లోకి లాగేసి గల గలా నవ్వుతుంది భూమి….. !!
ఒసేయ్ దెయ్యం నన్ను ఎందుకే లాగావ్ అంటూ మహాన్ భూమి నడుము పట్టుకుని మీదకు లాక్కుంటూ సీరియస్ గా తన వైపు చూస్తాడు….. !! నా పూజ నేను చూసుకుంటూ ఉంటే అనవసరంగా నన్ను గెలికావ్ నీ వల్ల చూడు ఎలా తడిచిపోయానో ఇప్పుడు మళ్ళీ స్నానం చేయాలి అంటూ అరుస్తుంది భూమి!!
భూమి చీర వంటికి అతుక్కుపోయి మహాన్ చెయ్ డైరెక్ట్ గా తనకు తాకుతూ ఉంటే ….. !! భూమి చిగురుటాకులా చలికి వణుకుతూ మహాన్ నుండి దూరం జరగబోతుంటే భూమి చుట్టూ చేతులు వేస్తూ భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన వైపు చూస్తాడు….. !!
మహాన్ ను అంత దగ్గరగా చూసిన భూమి కి కూడా తమ కాలేజ్ డేస్ & మహాన్ తనకున్న బ్యూటిఫుల్ మెమోరీస్ గుర్తొస్తూ ఉంటే ….. !! మహాన్ చేతులు మీద తన చేతులు ఉంచుతూ నన్ను అంతలా ప్రేమించిన నువ్వు ఎందుకిలా మారిపోయావ్ మహాన్….. ?? నిజంగా నువ్వు నన్ను లవ్ చేయకపోతే ఎందుకు నా నేమ్ టాటూ వేయించుకున్నావ్ ….. ??
నేను నిన్ను లవ్ చేస్తున్నా అని నువ్వు నమ్మాలి కదా అందుకే టాటూ వేయించా….. !! అది వేయించాకే నీలో నా మీద ప్రేమ మొదలైంది అంటూ భూమి మొహానికి అంటుకుపోయిన జుట్టు ను చెవి వెనుక పెడుతూ చెప్తాడు…… !!
భూమి చిన్నగా నవ్వి అలా అయితే నన్ను నమ్మించడానికి టెంపరరీ టాటూ వేయించుకోవచ్చు కదా ఎందుకు వేయించలేదు….. ?? ఇప్పుడు కూడా నాకు ఇంత దగ్గరగా ఉన్నావ్ & నీ కళ్ళల్లో నా మీద ప్రేమ క్లియర్ గా నేను చూసా అది అబద్ధం అని నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు….. ??
భూమి నుండి వచ్చిన క్వశ్చన్ కి మహాన్ సెకండ్ కూడా లేట్ చేయకుండా భూమి ను వదిలి దూరం జరిగి పూల్ నుండి కోపంగా వెళ్లిపోవడం చూసి భూమి నవ్వుతూ తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది !?
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
అక్కా అందరి కోసం బ్రేక్ఫాస్ట్ చేసేసావా అని అడుగుతూ కిచెన్ లోకి వచ్చిన భూమి ను చూసిన రేణుక ఆనందంగా నవ్వుతూ చూస్తుంటుంది…… !! ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ లో వన్ ప్లీట్ వేసుకుని హెయిర్ లూస్ గా వదిలేసి మినిమల్ మేకప్ తో మెడలో తాళి & నల్లపూసలు వేసుకుని చెవులకు డైమండ్ జ్యువలరీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని భూమి ఇప్పుడు ఈ ఇంటి కోడలు ఎలా ఉండాలో అలానే ఉంది….. !!
భూమి ఎంత బావున్నావో తెలుసా నా దిష్టి తగిలేలా ఉంది ఆగు అంటూ ఎండు మిర్చి & రా సాల్ట్ తీసుకుని ఎవరికి భూమి దిష్టి తగలకుండా దిష్టి తీసి చాలా బావున్నావ్ భూమి….. !! నిన్ను ఇలా చూడాలి అనే నేను కోరుకున్నాను అని ఆనందంగా చెప్తూ అయ్యో నిన్నిలా చూస్తే మళ్ళీ నందన మేడం గొడవ చేస్తారేమో భూమి అని టెన్షన్ గా అంటుంది….. !!
మా అత్త నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు అక్క నువ్వు దాని గురించి వర్రీ అవ్వకు….. !! ఇప్పటి నుంచి నేను ఇలానే ఉంటాను సరేనా అని రేణుక ఏమేం కుక్ చేసిందో చూసి నువ్వు వెళ్ళి అందరినీ పిలువు అక్క నేను ఈ లోపు డైనింగ్ టేబుల్ మీద అన్ని ఆరెంజ్ చేస్తాను ….. !! అని రేణుక ను అక్కడి నుండి పంపేసి భూమి ఒక్కో డిష్ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది….. !!
మహాన్ & విజయేంద్ర వర్మ ఏవో మీటింగ్స్ ఉన్నాయని ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరూ ఎవరి కార్ లో వాళ్ళు వెళ్ళిపోతారు….. !! శ్లోక, దేవయాని & నందన డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ భూమి ను అలా చూసి దేవయాని మనసు ఆనందం తో నిండిపోతే….. !! శ్లోక, నందన లకు మండిపోతూ ఉంటుంది….. !!
చూసావా మామ్ దాన్ని అన్నయ్య ను చూసుకుని ఇది రోజు రోజుకి రెచ్చిపోతుంది….. !! నువ్వు ఇలాగే చూస్తూ కామ్ గా ఉంటే అన్నయ్య ఇంటి కీస్ నీ చేతిలో నుండి తీసుకుని దానికి ఇచ్చినా ఇచ్చేస్తాడు డు సమ్థింగ్ మామ్!! నువ్వు ఇలా సైలెంట్ గా అది మరింత ఓవర్ చేస్తుంది…… ??
సునామీ వచ్చేటపుడు సముద్రం కూడా నా లాగే ప్రశాంతంగా ఉంటుంది…. !! అది వచ్చాక కానీ అర్థం అవ్వదు సునామీ ఎంత ప్రమాదకరమో నేను కూడా అంతే…… !! జస్ట్ ఫ్యూ డేస్ చూస్తూ ఉండు తర్వాత అసలు కథ నేను నడిపిస్తా ఇప్పుడే రెక్కలు వచ్చాయి కదా ఎగరనివ్వు దాని రెక్కలు ఎలా విరిచేయాలో నాకు తెలుసు….. !!
అత్తయ్య ఏంటీ అక్కడే ఆగిపోయారు త్వరగా రండి మీరు తినేసాక నేను కూడా తిని మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి అసలే మీ అబ్బాయి మరీ మరీ చెప్పాడు …… !! లంచ్ తీసుకుని రమ్మని అంటూ సిగ్గు పడుతూ చెప్పడం చూసి శ్లోక, నందన భూమి ను కోపంగా చూస్తూ వెళ్ళి చైర్ లో కూర్చుంటారు….. !!
భూమి మహాన్ కోసం లంచ్ కి ఎమ్ స్పెషల్స్ చేస్తున్నావ్….. ?? నాకు ఇవాళ మటన్ తినాలని ఉంది బంగారం కాస్త అది కుడా లంచ్ మెన్యూ లోకి యాడ్ చెయ్యి….. !!
లేదు నానమ్మ ఇవాళ మహాన్ అడిగిన స్పెషల్ డిషెస్ నే లంచ్ కి కుక్ చేస్తున్నా….. !! అందరూ అవే తినాలి ఎమ్ అనుకోకు నానమ్మ నువ్వు అడిగింది రేపు చేసి పెడతాను సరేనా…. !!
అలాగే బంగారం ఇంతకీ మహాన్ కోసం ఎమ్ స్పెషల్స్ కుక్ చేస్తున్నావ్….. ??
చాలానే చేస్తున్నా నానమ్మ ములక్కాడ పప్పు, ములక్కాడ సాంబార్, ములక్కాడ కారం పులుసు, ములక్కాడ వేపుడు, ములక్కాడ చికెన్ విత్ ములక్కాడ వడియాలు!!
ములక్కాడ అన్నం & ములక్కాడ పెరుగు కూడా చెయ్ అవి ఎందుకు బ్యాలెన్స్ 😏 అని వెటకారంగా అంటున్న శ్లోక ను చూసి నవ్వుతూ థాంక్స్ శ్లోక మంచి ఐడియా ఇచ్చావ్ ….. !! వాటితో పాటు ములక్కాడ పకోడీ, ములక్కాడ కట్లెట్ కూడా చేస్తాను….. !!
ఏయ్ ఆపుతావా నువ్వు నీ ములక్కాడ రామాయణం!! నాకు సాంబార్ వేసి ఆ ములక్కాడ ను పక్కకు తోసి అమ్మ అడిగినట్టు మటన్ తో స్పెషల్స్ చేయ్…… !!
సారి అత్తయ్య మహాన్ అదే పని గా చెప్పాడు చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతాడు…. !! తనకు ఎనర్జీ ఉండాలంటే ఇలాంటి ఫుడ్ నే తినాలి కదా అంటూ సిగ్గుపడుతుంది ….. !!
ఎనర్జీ ఆ?? ఎందుకు ఇప్పుడు అన్నయ్య కి ఏమైంది తను ఫిట్ గానే ఉన్నాడు కదా….. ??
ఇది ఆ ఎనర్జీ కాదు శ్లోక వేరే ఎనర్జీ కోసం అని సిగ్గుతో మొహాన్ని చేతుల్లోకి తీసుకుని దాచేస్తూ…… !! ఇక నేను చెప్పలేను అత్తయ్య ను అడుగు తను అయితే క్లియర్ గా చెప్తారు….. !!
మామ్ అది ఎమ్ వాగుతుంది …… ?? నాకు అర్థం కావడం లేదు….. !!
శ్లోక అని సీరియస్ గా పిలిచి పైకి లేచి భూమి ను కొట్టబోతున్న నందన కి వెనుక నుంచి ఫ్లవర్ వాజ్ వచ్చి గోడకు తగిలి కింద పడి పగిలిపోవడం చూసి షాక్ అవుతూ వెనక్కి తిరిగి చూడగా….. !! రాజ్ పోలీస్ డ్రెస్ లో చేతిలోని లాటి ఊపుతూ స్టైల్ గా వాక్ చేస్తూ రావడం చూసి శ్లోక షాక్ అవుతూ తనకే తెలియకుండా పైకి లేచి నుంచుంటుంది….. !!
కళ్లకున్న గాగుల్స్ తీసి చేత్తో తిప్పుతూ హెలో అత్త నమస్తే అంటూ యాటిట్యూడ్ లుక్స్ తో కన్నింగ్ గా నవ్వుతున్న రాజ్ ను చూసి పళ్ళు నూరుతూ…… !? హోల్డ్ యువర్ టంగ్ ఎవర్రా నీకు అత్త….. ?? ముందు నువ్వు బయటకు నడువు ఎవరు నిన్ను ఆలో చేసింది సెక్యూరిటీ……. సెక్యూరిటీ….. అడ్డమైన వాళ్ళను ఎందుకు లోపలికి పంపిస్తున్నారు అంటూ కోపంగా ఊగిపోతుంది నందన….. !!
ఓ….. ఓ…… హోల్డ్ ఆన్ అత్త ఎందుకలా ఆంబొతులా ఆవురావురుమని అరుస్తున్నావ్….. ??
రేయ్ ఎంత ధైర్యం రా నీకు మా ఇంటికి వచ్చి మా మామ్ ను మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా పిలుస్తావా……. ?? అని రాజ్ ను కొట్టడానికి వచ్చిన శ్లోక చెయ్ పట్టుకుని వెనక్కి మడిచి తన రెండు చేతులకు సంకెళ్ళు వేయగానే అక్కడున్న అందరూ షాక్ అవుతారు….. !!
ఏయ్ నా కూతురికి ఎందుకు ఆ కాప్స్ వేసావ్ ఫస్ట్ రిమూవ్ చెయ్ వాటిని….. ?? అంటూ సీరియస్ అవుతుంది నందన….. !?
నేను వచ్చింది నీతో గొడవ పెట్టుకోవటానికి కాదు కన్నింగ్ అత్త ఇదిగో దీన్ని అరెస్ట్ చేయడానికి పదవే….. !! అంటూ శ్లోక బుజం పట్టుకుని లాక్కుని వెళ్తున్న రాజ్ కి అడ్డొచ్చి ఆగు శ్లోక ను అరెస్ట్ చేయడం ఏంటి ఏమ్ చేస్తున్నావ్ నువ్వు….. ??
నీ కూతురు మర్డర్ అటెంప్ట్ చేసి ఒకరిని చంపాబోయింది అని కంప్లైంట్ ఫైల్ అయింది అందుకే లాక్కెలుతున్నా ఆర్ యూ క్లియర్ నౌ….. !! అని నందన ఎంత ఆపుతున్నా వినకుండా శ్లోక ను లాక్కుని వెళ్ళడం చూసి అందరూ బొమ్మ ల్లా నుంచుని చూస్తుంటారు….. !?
శ్లోక డ్రైవ్ చేస్తున్న రాజ్ వైపు సీరియస్ గా చూస్తూ నన్ను అరెస్ట్ చేశానని సంబర పడిపోకూ నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతాను చూస్తూ ఉండు అని రాజ్ వైపు పొగరుగా చూస్తూ చెప్పి రోడ్ వైపు చూడగా….. !! రాజ్ తనను స్టేషన్ వైపు కాకుండా యూ టర్న్ తీసుకుని రూట్ చేంజ్ చేయడం గమనించి…… !? ఏయ్ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావ్ ఆపరా అని శ్లోక కంగారుగా అరుస్తూ ఉంటే రాజ్ కన్నింగ్ గా నవ్వుతూ శ్లోక వైపు చూడ్డం చూసి శ్లోక కి వొళ్ళంతా చమటలు పడతాయి…… !?
శ్లోక షాక్స్ 😜 రాజ్ రాక్స్ 😎
రాజ్ శ్లోక ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో ఎవరైనా గెస్ చేయగలరా….. ?? నందన శ్లోక ను సేవ్ చేస్తుందా లేదా….. ?? మహాన్ మనసులో భూమి ప్లేస్ ఏంటి….. ??