ఆ ఇద్దరు అబ్బాయిలు హెడ్ కానిస్టేబుల్ రాము చెప్పిన అడ్రస్ నోట్ చేసుకుని స్వరాజ్ ను మీట్ అవ్వడానికి తన స్టేషన్ కి వెళతారు…. !! మరో వైపు రాము ఏం తెలియనట్టు తన టీ ఫినిష్ చేసి తిరిగి స్టేషన్ కి వెళ్ళిపోతాడు….. !! హాఫ్ ఆన్ అవర్ తర్వాత బైక్ లో స్వరాజ్ స్టేషన్ ముందు ఆగిన ఇద్దరూ టెన్షన్ గానే లోపలికి వెళ్లి ఏ. సి. పి. సర్ ను మీట్ అవ్వాలి అని ఎదురుగా కనిపించిన కానిస్టేబుల్ ను అడుగుతారు….. !!
అక్కడ వర్క్ చేస్తున్న కానిస్టేబుల్ ఇద్దరినీ పై నుండి కింద దాకా చూస్తూ….. !! ప్రెసెంట్ సర్ బిజీగా ఉన్నారు వెయిట్ చేయండి అని చెప్పి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు….. !! ఆ అబ్బాయిలు ఇద్దరూ కూడా అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని ఎపుడు వాళ్ళను స్వరాజ్ దగ్గరకు పంపిస్తారా అని వెయిట్ చేస్తూ కూర్చుంటారు….. !!
సెకండ్స్ నిమిషాలు & నిమిషాలు గంటలు అవుతున్నా వాళ్ళను ఎవరు పట్టించుకోరు…. !! అప్పటికే వాళ్ళు అక్కడికి వచ్చి 3 అవర్స్ అవుతుంది కూర్చుని….. కూర్చుని విసుగెత్తిన ఇద్దరూ పైకి లేచి ఏంటి సర్ ఇది ఇంకా ఎన్ని అవర్స్ వెయిట్ చేయాలి….. ?? మేము స్వరాజ్ సర్ ను కలవడం చాలా ఇంపార్టెంట్ & అక్కడ ఓ పేషెంట్ ప్రాణాలతో పోరాడుతున్నాడు…… !! అది మీకు చెప్తున్నా ఇంత కేర్లెస్ బిహేవియర్ ఏంటి సర్ అంటూ క్వశ్చన్ చేస్తున్న ఇద్దరినీ చూసి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ సీరియస్ అవుతాడు….. !!
పోలీస్ స్టేషన్ అంటే ఇలానే ఉంటుంది అంత ఓపిక లేనప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు….. ?? కానిస్టేబుల్ వీళ్ళను బయటకు తోసెయ్యండి అని చెప్పగానే ఇద్దరూ కానిస్టేబుల్స్ వాళ్ళను బయటకు నెడుతూ ఉండగా…… !! ఇంటికి వెళ్ళడానికి తన క్యాబిన్ నుండి బయటకు వచ్చిన ఏ. సి. పీ. స్వరాజ్ అలియాస్ రాజ్ వీళ్ళ గొడవ చూసి అటుగా వెళ్లి ప్రాబ్లెమ్ ఏంటని అడుగుతాడు….. !?
స్వరాజ్ ను చూసిన ఇద్దరు కానిస్టేబుల్స్ స్టిఫ్ గా నుంచుని సెల్యూట్ చేస్తే ఆ కుర్రాళ్ళు స్వరాజ్ నేమ్ ను తన షర్ట్ మీద ఉన్న నేమ్ ప్లేట్ లో చూసి & రెండు షోల్డర్స్ మీద కనిపిస్తున్న షోల్డర్ ఇంసిగ్నియా సింబల్ చూసి తనే ఏ. సీ. పి. స్వరాజ్ అని ఇద్దరూ రికగ్నైజ్ చేస్తారు….. !!
రేయ్ ఈయనే ఏ. సీ. పీ సర్ అంటూ ఒకరిని ఒకరు చూసుకుని హాయ్ సర్ మీ కోసమే మేము 3 అవర్స్ నుండి వెయిట్ చేస్తుంటే మీ స్టాఫ్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఎలో చేయడం లేదు…… ?? మమ్మల్ని ఎందుకు వెయిట్ చేయిస్తున్నారు మా వెనుక వచ్చిన వాళ్ళను పంపిస్తున్నారు అని అడిగాం అని మమ్మల్ని బయటకు వెళ్ళమని తోసేస్తున్నారు సర్ ….. !!
రాజ్ కానిస్టేబుల్స్ వైపు సీరియస్ గా చూస్తూ వాట్ ఇస్ దిస్…. ?? ఎవరికైనా కష్టం వస్తే ముందు గుర్తొచ్చేది మనమే అలాంటి వాళ్ళను ఇలాగేనా ట్రీట్ చేసేది…… స్టుపిడ్స్ ?? అంటూ సీరియస్ అవ్వగానే వుయ్ ఆర్ సారి సర్ ఏ. సై. ఐ. గారే వీళ్ళను ఏలో చేయడానికి ఒప్పుకోలేదు !!
రాజ్ వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ను పిలిచి అబ్బాయిల ముందే సీరియస్ గా చివాట్లు పెట్టి ఇంకో సారి ఇది రిపీట్ అవ్వకూడదు …… !! అని వార్న్ చేసి అబ్బాయిలను తీసుకుని తన క్యాబిన్ కి వెళ్ళి సీట్ లో కూర్చుంటూ హ్మ్మ్ ఇప్పుడు చెప్పండి నాతో ఏంటి వర్క్…… ?? నా కోసం ఇప్పటి వరకూ వెయిట్ చేసారంటే ఏదో పెద్ద ప్రాబ్లెమ్ లోనే ఉన్నారని అర్థం అవుతుంది సో చెప్పండి…… ??
సర్ వుయ్ ఆర్ కరెంట్లీ స్టడియింగ్ ఎట్ గీతమ్స్ కాలేజ్….. !! రోజు లాగే బస్ కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే ఎవడిదో కార్ ఫాస్ట్ గా రాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి రోడ్ క్రాస్ చేస్తున్న మా లాంటి అబ్బాయికి డ్యాష్ ఇచ్చి ఆగకుండా వెళ్ళిపోయారు….. !!
తనను తీసుకుని హాస్పిటల్ కి వెళ్తే ఇది యాక్సిడెంట్ కేస్ సో పోలీస్ కంప్లైంట్ ఇస్తే తప్పా మేము జాయిన్ చేసుకోమని చెప్పారు…… !! అని అప్పటి నుంచి ఇందాకటి వరకు జరిగింది మొత్తం రాజ్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ అబ్బాయిలు….. !!
మొత్తం విన్న రాజ్ కాసేపటి మౌనం తరువాత వెరీ గుడ్ అందరిలా మాకు ఎందుకు అని వెళ్ళిపోకుండా హ్యుమానిటీ తో అబ్బాయిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు….. !! సరే వెళ్దాం పదండి ఇప్పటికే బాగా లేట్ అయింది తన కండీషన్ ఎలా ఉందో ఏంటో అని ఆ అబ్బాయిలను తీసుకుని హాస్పిటల్ కి స్టార్ట్ అవుతాడు……. !!
ఆఫ్టర్ హాఫ్ ఆన్ అవర్ రాజ్ వెహికల్ హాస్పిటల్ కి రీచ్ అవ్వగానే ఆ అబ్బాయిని వదిలి వెళ్ళిన రూమ్ దగ్గరకు వచ్చేసరికి…… !! అబ్బాయికి ఆల్రెడీ లోపల ట్రీట్మెంట్ చేస్తూ కనిపించగానే అందరూ ఒకరిని ఒకరు చూసుకుని డాక్టర్ బయటకు రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు….. !!!
కాసేపటికి బయటకు వచ్చిన డాక్టర్ ను చూసి హాయ్ డాక్టర్ దిస్ ఇస్ ఏ. సీ. పీ. స్వరాజ్ హౌ ఇస్ ది పేషెంట్ కండీషన్….. ?? హలో సర్ పేషెంట్ ఈస్ గుడ్ బట్ చాలా బ్లడ్ లాస్ అయింది సో బ్లడ్ ఎక్కించాం & కాన్షియస్ లోకి రావడానికి 12 అవర్స్ లా పట్టొచ్చు బట్ హి ఈజ్ ఫైన్ అంటూ రాజ్ ను చూసి భయపడుతూనే ఆన్సర్ చేస్తాడు…… !!
కంప్లైంట్ ఇచ్చే దాకా ట్రీట్మెంట్ చేయనని చెప్పారంట దెన్ ఇప్పుడెలా ట్రీట్ చేశారు….. ?? అబ్బాయి ఫ్యామిలీ ఏమైనా వచ్చారా ….. ?? మీకు అలా చెప్పాం అని కోపం రావచ్చు బట్ సర్ ట్రై టు అండర్స్టాండ్ అవర్ సిచుయేషన్ టూ …… !! ఈ హాస్పిటల్ లో మేము అఫ్ట్రాల్ డాక్టర్స్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి మేము అవే ఫాలో అవ్వాలి & లాస్ట్ టైమ్ నేను కూడా జాలి పడి ఒక యాక్సిడెంట్ కేస్ ను తీసుకుని ట్రీట్ చేశాను బట్ అతన్ని సేవ్ చేయలేక పోయాం….. !! కరెక్ట్ టైమ్ కి ట్రీట్ చేయలేదు అని రివర్స్ లో నా మీదే కేస్ ఫైల్ చేసారు….. !!
నేను ఆ ఇన్సిడెంట్ ను దృష్టిలో పెట్టుకుని అలా హార్ట్ గా మాట్లాడాను ఐ ఆమ్ సారి సర్…. !? అంటూ పేషెంట్ ఫ్యామిలీ కి ఇంకా తెలియదు అనుకుంటా ఆ అబ్బాయి కోసం ఎవరు రాలేదు….. !!! ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయడానికి రీసన్ ఇండస్ట్రియలిస్ట్ మహాన్ గారు ఆయనే కన్సెంట్ ఫామ్ మీద సైన్ చేసి ఎమ్ జరిగినా ఆయనే చూసుకుంటారు అని చెప్పారు…… !!! అందుకే ట్రీట్మెంట్ ఇచ్చాం అని చెప్తూ ఉండగా కాల్ మాట్లాడుతూ అక్కడికి వచ్చిన మహాన్ ను చూసి అదిగో మహాన్ సర్ వస్తున్నారు అని చెప్తూ మహాన్ కి ఎదురుగా వెళ్తాడు డాక్టర్….. !!
మహాన్ పేరు విన్నపుడే షాక్ అయిన రాజ్ డాక్టర్ చెప్పడం తో అటుగా చూసిన తనకు మహాన్ కాల్ మాట్లాడుతూ కనిపించడం చూసి…… !! వీళ్ళకు మనుషుల్ని హింసించడమే వచ్చు అనుకున్నా కాపాడడం కూడా వచ్చా వీడికి అన్ని ఆవిడ పోలికలే వచ్చాయి అనుకున్నా పర్లేదు వీడిలో మావయ్య మంచితనం కూడా ఎక్కడో అడుగున ఉంది ….. !!
డాక్టర్ ను చూసిన మహాన్ కాల్ కట్ చేసి పేషెంట్ గురించి డిటైల్స్ అడిగి ఒకే డాక్టర్ ఎనీ హెల్ప్ కాల్ మీ ఇన్ ఎనీ టైమ్ అని హ్యాండ్ షేక్ చేసి….. !! ఐ వాంట్ టు గో ఇట్స్ ఎమర్జెన్సీ అని అక్కడ రాజ్ ఉన్నాడు అని కూడా గమనించకుండా అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోతాడు….. !!
రాజ్ వెళ్తున్న మహాన్ వైపు క్రాస్ గా చూస్తూ ఒకే మీరు కూడా ఇక వెళ్ళిపోండి & మీకు తెలిసిన డిటైల్స్ మా కానిస్టేబుల్ కి ఇచ్చేసి వెళ్ళండి ఇందులో ఇక మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అవసరం అనుకుంటే కాల్ చేస్తాను మీ మొబైల్ నంబర్స్ కూడా ఇవ్వండి అని చెప్పి రాజ్ డాక్టర్ వైపు వెళ్తే ఆ అబ్బాయిలు కానిస్టేబుల్ కి డిటైల్స్ అన్ని చెప్పేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు…… !!
✨✨✨✨✨✨✨✨
అమ్మా భూమి ఇంకా ఎంత సేపు ఇలా వెయిట్ చేస్తూ హాల్ లో కూర్చుంటావ్….. ?? మహాన్ బాబు వస్తే నేను వడ్డిస్తాను కానీ నువ్వు తినేసి వెళ్ళి పడుకో భూమి మళ్ళీ నందన మేడం నిన్ను మార్నింగ్ లేవకపోతే తిడతారు….. ??
అవేమైనా నాకు కొత్త ….. ?? అయినా డెయిలీ త్వరగా ఇంటికి వచ్చే మహాన్ ఇంకా ఎందుకు రాలేదా అని నాకు టెన్షన్ గా ఉంది….. !! మహాన్ వచ్చాక నేను మహాన్ కలిపి తింటాం నువ్వెల్లి పడుకో అక్క అని భూమి రేణుజ ను అక్కడి నుండి పంపించేస్తుంది…… !!
అప్పటికే అందరూ నిద్రపోవడం తో భూమి ఒక్కటే హాల్ లో సోఫా లో ముడుక్కుని పడుకుని మహాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది….. !! మహాన్ కోసం చూస్తూ చూస్తూ భూమి అలాగే సోఫా లో నిద్రపోతుంది…… !! మహాన్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ప్రశాంతంగా ఎవరి రూమ్ లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు….. !!
తన కోసం భూమి వెయిట్ చేస్తూ ఉంటుందని మహాన్ గెస్ చేశాడు అందుకే ఇంట్లోకి వస్తూనే భూమి ఎక్కడుందా అని కళ్ళతో భూమి కోసం వెతుకుతూ ఉంటాడు…… ??
భూమి సోఫా లో నిద్రపోతూ కనిపించగానే అటుగా నడిచిన మహాన్ కంటికి నెలవంకలాంటి నడుము గాలికి చీర కొంగు ఎగురుతూ ఆ ఎర్రటి గులాబీ నడుము మీద తాకుతూ ఉంటే మహాన్ గుండె ఆగి మరీ కొట్టుకుంటుంది…… !! ఇది కావాలనే చేస్తుందా లేదా ఇలా యాక్సిడెంటల్ గా కనిపిస్తుందా అని కళ్ళు చిన్నవి చేసి భూమి మొహం వైపు చూసిన మహాన్ కి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది భూమి….. !!
భూమి నడుము మడతల్లో చిక్కుకుని ఊపిరి ఆడక అటు ఇటు ఊగుతున్న భూమి జుట్టు ను చూసి నవ్వుతూ తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని…… !! తన వేళ్ళతో భూమి సుతారమైన నడుము మీద వేళ్ళతో తాకగానే భూమి నిద్రలో అటు వైపు తిరుగుతుంది….. !!
కారుమొబ్బుల్లా వీపును పరచుకున్న హెయిర్ నుండి వచ్చే సువాసన ను గట్టిగా పీల్చి ఆ స్మెల్ తను పెట్టుకున్న మల్లెల ద్వారా అని అర్థం అవ్వగానే….. !! మహాన్ భూమి నడుము దగ్గరకు తన పెదాలను తీసుకుని వెళ్ళి కిస్ చేయబోతూ ఉండగా భూమి మెలకువ లోకి వస్తున్నట్టు కదలడం చూసి దెబ్బకు దూరం జరిగి నుంచుంటాడు….. !!
మహాన్ అనుకున్నట్టే మెలకువ లోకి వచ్చిన భూమి నెమ్మదిగా కళ్ళు తెరిచి మహాన్ ను చూసి పైకి లేచి మహాన్ వచ్చేశావా….. ?? ఎంత సేపు అవుతుంది రాగానే లేపచ్చు కదా సరే నువ్వెల్లి ఫ్రెష్ అయి రా నీకు డిన్నర్ వడ్డిస్తాను….. !!
నాకు ఆకలిగా లేదు అని కోపం నటిస్తూ పైకి వెళ్ళబోతున్న మహాన్ చెయ్ పట్టుకుని కోపం నా మీద అయితే నాలుగు తిట్లు తిట్టు….. !! అప్పటికి కోపం తగ్గకపోతే కొట్టు అంతే కానీ నా మీద కోపంతో నీ కడుపు మాడ్చుకోవద్దు మహాన్….. !!
ఇలాంటి డైలాగ్స్ చెప్పి నన్ను పడేయాలి అని చూడకు….. !! నువ్వంటే నాకు ఎప్పటికీ ఒకే ఫీలింగ్ ఐ హేట్ యూ 💔!!
( ఏంటీ ఈ మహాన్ క్యారెక్టర్ భూమి అంటే ఇష్టం ఉన్నట్టే బిహేవ్ చేస్తాడు మళ్ళీ ఇలా మాట్లాడి భూమి ను హార్ట్ చేస్తాడు అనే కదా మీ డౌబ్ట్…. ?? అన్నిటికీ త్వరలో ఆన్సర్ ఇస్తా 😎)
నిన్ను కొత్తగా పడేయడం ఏంటి….. ?? నువ్వు ఎప్పుడో నాకు పడిపోయావ్ కానీ అది ఒప్పుకోవడానికి నీకు ఈగో 😏 అదంతా కాదు ఇప్పుడు తింటావా తినవా…… ??
హేయ్ నాకు వొద్దు అంటుంటే అర్థం కావడం లేదా…. ?? దెయ్యం లా ఈ టైమ్ దాకా పడుకోకుండా ఎమ్ చేస్తున్నావ్…… ?? వెళ్ళి పడుకో అని సీరియస్ గా చెప్పి వెళ్తున్న మహాన్ కాలర్ పట్టుకుని మర్యాదగా నాతో పాటు డిన్నర్ చేస్తావా లేదా అందరి ముందు నిన్ను బుక్ చేయనా….. ??
హు 😏 నీ మొహానికి అంత సీన్ లేదు కానీ పోవే అని చెప్పి వెళ్తున్న మహాన్ ను చూసి సైడ్ స్మైల్ ఇస్తూ ఆగు చెప్తా నీ పని అని మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తూ తన రూమ్ లోకి వెళ్తున్న భూమి ను చూసి….. ?? ఏంటి ఇది అదో రకంగా నవ్వుతుంది ఎమ్ ప్లాన్ చేస్తోంది అని భూమి వెనుకే భూమి రూమ్ లోకి వెళ్ళిన మహాన్ కనిపించని భూమి కోసం వెతుకుతూ ఉంటాడు….. ??
డోర్ వెనుక దాక్కుని మహాన్ ను చూసిన భూమి రూమ్ లో కూడా లైట్స్ ఆఫ్ చేసి వెనుక నుండి మహాన్ ను ఒక చేత్తో గట్టిగా పట్టేసుకుని …… !! ఇంకో చేత్తో మహాన్ నోరు మూసి దొంగ….. దొంగ….. దొంగ అందరూ రండి అంటూ గట్టిగా కేకలు పెడుతుంది….. !!
( ఇక్కడ మనకు డౌబ్ట్ రావడం కామన్ భూమి కంటే మహాన్ స్ట్రాంగ్ కదా మరి భూమి ను విడిపించుకోకుండా ఎందుకలా ఉండిపోయాడు అని ….. ?? భూమి వెనుక నుండి హగ్ చేసుకోవడం తోనే మహాన్ బాబు కి సౌండ్ బాక్స్ ఆఫ్ అయిపోయింది 😜🤭 ఇంకేం విడిపించుకుంటాడు చెప్పండి 😌)
భూమి అరుపులకు హాయిగా నిద్రపోతున్న అందరూ నిజంగా దొంగ సెక్యూరిటీ కళ్ళు కప్పి వచ్చాడా….. ?? అని కంగారు పడుతూ హాల్ లో లైట్స్ ఆన్ చేస్తూ భూమి రూమ్ లోకి వెళ్ళి లైట్ ఆన్ చేయగానే భూమి మహాన్ ను కిందకు నెట్టేస్తుంది….. !!
కింద పడ్డ మహాన్ ను చూసిన అందరూ షాక్ అయితే భూమి తన ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకుంటూ ఎవరు చూడకుండా మహాన్ కి కన్ను కొడుతుంది 😉!! రాక్షసి అని భూమి వైపు పళ్ళు నూరుతూ చూస్తూ అందరి కంటే లాస్ట్ గా శ్లోక హెల్ప్ తో అక్కడికి వచ్చిన నందన ను చూసి కంగారు పడతాడు….. !?
నందన మహాన్ వైపు సీరియస్ గా చూస్తూ ఉంటే భూమి నవ్వు ఆపుకుంటూ అయ్యో మహాన్ నువ్వా…… ?? ముందే చెప్పుంటే ఇలా అందరినీ పిలిచే దాన్ని కదా సడెన్ గా ఎవరో వెనుక నుండి వచ్చి హగ్ చేసుకుని మెడ మీద కిస్ చేయగానే భయపడి అరిచేసాను…… !! అది నువ్వే అని అనుకోలేదు మహాన్ ఛా అనవసరంగా నీ మూడ్ మొత్తం స్పాయిల్ చేసాను….. !!
ఏయ్ చీ ఆపు నేనేం నిన్ను కిస్ చేయలేదు కావాలని అబద్ధం చెప్పకు అంటూ సీరియస్ గా భూమి వైపు చూస్తూ అంటున్న మహాన్ ను చూసి…… !! మరి భూమి రూమ్ లో నువ్వేం చేస్తున్నావ్ మహాన్…… ?? రాగానే డైరెక్ట్ గా నీ రూమ్ కి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావ్….. ??
నందన క్వశ్చన్ కి మహాన్ కి ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక సైలెంట్ గా ఉండిపోతే అది చూసిన భూమి నవ్వుకుంటుంది …… !! సో అది చెప్పింది నిజమే అనమాట అని మహాన్ వైపు కోపంగా చూస్తూ భూమి రేపటి నుండి నువ్వు ఇక్కడ కాదు నా రూమ్ పక్కనున్న రూమ్ కి షిఫ్ట్ అవ్వు…… !! ఆహా రేపు కాదు ఇప్పుడే షిఫ్ట్ అవ్వు అని చెప్పగానే దేవయాని అది విని హ్యాపీగా ఫీల్ అయితే మామ్ ఎమ్ చేస్తున్నావ్….. ?? దీనికి ఆ రూమ్ ఎందుకు అంతలా దీన్ని షిఫ్ట్ చేయాలి అనుంటే అవుట్ హౌస్ కి షిఫ్ట్ చెయ్ అని కోపంగా చెప్తుంది శ్లోక….. !!
ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు నువ్వు కామ్ గా ఉండు….. !! ఏయ్ భూమి నిన్నే నీ లగేజ్ ప్యాక్ చేసుకో అని చెప్పి అందరినీ ఎవరి రూమ్ కి వాళ్ళను పంపించేసి నందన కూడా మెల్లగా అక్కడి నుండి వెళ్తూ మహాన్ వైపు సీరియస్ గా చూస్తూ వెళ్ళిపోతుంది….. !?
అందరూ వెళ్ళాక భూమి ను కొట్టడానికి వస్తున్న మహాన్ ను చూసిన భూమి అత్తయ్యా …… !! అని దీర్ఘం తీస్తూ పిలవడం చూసి మహాన్ కంగారుగా అక్కడి నుండి పరిగెత్తడం చూసి భూమి గట్టిగా నవ్వేస్తుంది…… !! మీరందరూ బెడ్ మీద పందుల్లా దొర్లుతూ ఉంటే నేను నేల మీద పడుకోవాలా అందుకే ఇలా రివర్స్ లో వచ్చా….. !! ఇప్పటి నుండి నేను కూడా హ్యాపీగా ఏ.సీ. రూమ్ లో పడుకుంటా అని తన లగేజ్ తీసుకుని నందన చెప్పిన రూమ్ లోకి వెళ్తుంది భూమి….. !!
భూమి కి ఆ రూమ్ తెగ నచ్చేస్తుంది దాంతో నవ్వుతూ రూమ్ వైపు చూసి తన లగేజ్ సర్దేసి కింద కు వెళ్ళి మిల్క్ గ్లాస్ తీసుకుని తాగుతూ మహాన్ రూమ్ వైపు చూస్తుంది….. !! తల పట్టుకుని 🤦 కూర్చున్న మహాన్ ను చూసి నవ్వుకుంటూ బేబీ అని ముద్దుగా పిలిచి మహాన్ చూడగానే పెదవులు రౌండ్ గా చుట్టి ఉమ్మ్ 💋 అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మహాన్ పట్టుకునే లోగా ఫాస్ట్ గా తన రూమ్ డోర్ లాక్ చేసి నవ్వుకుంటూ మిల్క్ తాగి పడుకుంటుంది….. !!
ఆ!! అని ఫ్రస్ట్రేషన్ తో అరిచి నీ సంగతి రేపు చెప్తా అని వెనక్కి తిరిగిన మహాన్ కి శ్లోక తన వైపు కోపంగా చూస్తూ హు 😏 అని మొహం తిప్పుకుని వెళ్లిపోవడం చూసి తలను గోడ కేసి కొట్టుకోవాలి అనిపిస్తుంది….. !! దీని వల్ల అందరిలో వెధవ ను అయిపోయా మామ్ ఎమ్ అనుకుందో ఏంటో….. ?? ఫస్ట్ మామ్ కి ఎమ్ జరిగిందో క్లియర్ గా చెప్పాలి అని నందన రూమ్ కి వెళతాడు….. !!
మహాన్ మాట్లాడాలి అనుకున్నా నందన మహాన్ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఫుల్ గా బెడ్ షీట్ కప్పుకుని పడుకోవడం తో అసహనంగా తన రూమ్ కి వచ్చి బెడ్ మీద అడ్డంగా పడిపోతాడు…. !!
మహాన్ కి ఎవరిదో నవ్వుతున్న వాయిస్ వినిపించడం తో ఎవరు….?? అని పైకి లేచి కూర్చున్న మహాన్ కి మిర్రర్ లో తన రూపం ఆత్మ లా కనిపిస్తూ తన వైపు చూసి నవ్వుతూ …… !! ఇప్పుడు ఇంతలా జుట్టు పీక్కుంటూ కూర్చునే బదులు నీ పెళ్ళాం పిలిచినపుడే వెళ్ళుంటే నీకు ఈ ఏడుపు ఉండేది కాదు కదా 😏….. ?? అందుకే అన్నారు పెళ్ళాం చెప్తే వినాలి అని నువ్వు నీ బలుపు చూపిస్తే భూమి తన తెలివి చూపించింది అనుభవించు అని …… !! తన రూపం తనను చూసి వెక్కిరిస్తూ నవ్వడం చూసి మహాన్ కోపంగా ఫ్లవర్ వాజ్ విసిరి కొట్టగానే మిర్రర్ ముక్కలు అవ్వడం తో పాటు తన రూపం కూడా మాయం అవుతుంది….. !!
యాక్సిడెంట్ చేసింది ఎవరో రాజ్ కి తెలియనుందా….. ?? శ్లోక నే ఆ యాక్సిడెంట్ చేసిందని రాజ్ కి తెలిస్తే తనను అరెస్ట్ చేస్తాడా లేక కార్తికేయ కోసం వదిలేస్తాడా….. ?? కామెంట్స్ లో చెప్పండి 😌