తనను విష్ చేస్తున్న అందరితో చిరు నవ్వుతో మాట్లాడుతున్న భూమి కి వాట్స్ గోయింగ్ ఆన్ అంటూ సీరియస్ గా వినిపించిన వాయిస్ కి వెనక్కి తిరిగి చూసిన భూమి ను చూసి మహాన్ స్టన్ అవుతాడు….. !! మహాన్ భూమి ను అలా చూడ్డం తోనే తన ప్రపంచం అక్కడే ఆగిపోయింది….. !! గాలి కూడా ఆడనంత లా భూమి ను అలా శారీ లో అది కూడా తన ఫేవరేట్ కలర్ శారీ లో చూస్తుంటే మహాన్ నుదుటిన చమట పడుతుంది….. !!
ఏ. సీ లో కూడా మహాన్ సేఫకేటింగ్ గా ఫీల్ అవుతూ ఉఫ్ అని నోటి తోనే గాలి ఉదుకుంటూ ఇది నన్ను చంపడానికే ఇంత అందంగా పుట్టిందా ఏంటి…… ?? గాలికి చీర ఎగురుతూ భూమి నాజూకైన అందమైన నడుము ఎర్రగా ఊరిస్తూ కనువిందు చేస్తుంటే మహాన్ చూపు అక్కడే ఆగిపోయింది….. !!
గాలికి చీర తో పాటు జుట్టు కూడా భూమి మొహాన్ని తాకుతూ ఉంటే దాన్ని తన సుతారమైన చేతులతో చెవి వెనుక పెడుతున్న భూమి ను చూసి…… !! నీ మొహాన్ని తాకే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది అని అందంగా కనిపిస్తున్న భూమి ను రెప్ప వేయడం మరచి చూస్తూ ఉంటే ……. ?? మహాన్ చూపులకు అందంగా సిగ్గు పడుతూ ఓరగా కళ్ళు తిప్పి మహాన్ ను చూస్తూ ఉంటుంది భూమి…… !!
భూమి చిరు నవ్వును చూసి గుండె మీద రుద్దుకుంటున్న మహాన్ ఎక్స్ప్రెషన్స్ కి హాయిగా నవ్వుకుంటుంది భూమి….. !! తన కళ్ళల్లో ఉన్న మృదత్వం…. !! తన ఎర్రటి పెదవుల మీద నిలిచిన అందమైన చిరు నవ్వు …… !! తను కట్టిన చీర లో దాగిన సౌందర్యం ఇలా అన్నీ మహాన్ ను పిచ్చోడిని చేస్తున్నాయి……. !!
మహాన్ చూపు భూమి మీదే ఆగిపోయింది తను ఆఫీస్ లో ఉన్నాడు అని కానీ స్టాఫ్ తమను టికెట్ లేకుండా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు అని కానీ ఇవేమీ మహాన్ కి తెలియడం లేదు….. !! భూమి ను ఈ చీరలో చూసి మహాన్ లోకం భూమి దగ్గరే ఆగిపోయింది…… !!
కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్
కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ ……. !!
వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్…… !!
ఎడమ భుజము కుడి భుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం…… !!
పడుచు చదువులకు గణితసూత్రమిది ఎంతో సహజం
సరళ రేఖ లిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం …… !!
కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్ వొళ్ళు వొళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ….. !!
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇంఫాట్యుషన్
ఇంఫాట్యుషన్ ఇంఫాట్యుషన్
దూరాలకి మీటర్లంటా భారాలకీ కే.జి !!
సడెన్ గా ఈ సాంగ్ ఏంటీ అని ….. ?? సాంగ్ వినిపిస్తున్న వైపు కు చూసిన మహాన్ కి హనీష్ చేతిలో మొబైల్ & హనీష్ కూడా తన పక్కనే నుంచుని స్పాటిఫై లో సాంగ్ ప్లే చేస్తూ కనిపిస్తాడు….. !! రేయ్ ఇది ఆఫీస్ అనుకున్నావా నీ ఇల్లు అనుకున్నావా…… ?? ఫస్ట్ సాంగ్ ఆపు అని విసుగ్గా హనీష్ వైపు చూస్తూ వేసుకున్న బ్లేజర్ సర్దుకుంటూ సీరియస్ గా చెప్తాడు….. !!
సిచుయేషన్ సింక్ అయింది మహాన్ అని నవ్వు ఆపుకుంటూ చెప్తున్న హనీష్ ను చూసి భూమి కూడా చెయ్ అడ్డు పెట్టుకుని నవ్వుతుంది….. !! ఏయ్ హి హి అని నవ్వింది చాలు 😏 రాగానే స్టాఫ్ ను డిస్టర్బ్ చేసావ్ ఇప్పుడు నన్ను చేస్తున్నావ్ ఎందుకు వచ్చావే ఆఫీస్ కి నువ్వు….. ??
అదేంటి మహాన్ గజినీ బ్రదర్ లా మాట్లాడుతున్నావ్ ….. ?? నువ్వే కదా లంచ్ తీసుకుని రమ్మన్నావ్ అని చెప్తూ ముందుకు వెళ్తున్న భూమి కి తన శారీ పల్లు అడ్డు వొచ్చి స్లిప్ అయి పడిపోతూ ఉంటే….. !? భూమి కేర్ఫుల్ అంటూ తను పడకుండా నడుము పట్టుకుని ఒక రౌండ్ తిప్పి మరీ పడకుండా పట్టుకుంటాడు మహాన్…… !!
ఆహా వాట్ ఏ పోస్ అని ఫాస్ట్ గా ఆ పోజ్ ను క్లిక్ మనిపించి రేయ్ మీరు ఏమైనా ఉంటే మీ క్యాబిన్ లో పెట్టుకోండి ఇలా నలుగురిలో బాగోదు….. !! హనీష్ వాయిస్ కి ఇద్దరూ దూరం జరిగితే దీన్ని అనవసరంగా ఆఫీస్ కి రమ్మన్నా అని భూమి వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోతున్న మహాన్ ను చూస్తూ భూమి, హనీష్ హై ఫై ఇచ్చుకుని నవ్వుకుంటారు…. !!
ఎలా ఉన్నావ్ రా…… ?? భూమి ను హాగ్ చేసుకుంటూ అడుగుతున్న హనీష్ వైపు చూసి చిన్నగా నవ్వి ముక్కలు అవ్వబోతున్న నా లైఫ్ ను అలా అవ్వకుండా కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నా….. !! నువ్వెలా ఉన్నావ్ హనీష్ అని అడుగుతున్న భూమి వైపు చూస్తూ బానే ఉన్నా & ఐ ఆమ్ సారి భూమి వాడు నిన్ను మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నాడో తెలిసి కూడా నేను నీకు చెప్పలేక పోయాను….. !!
ఐ కెన్ అండర్ స్టాండ్ యువర్ సిచుయేషన్ డోంట్ ఫీల్ అంటూ హనీష్ తో మాట్లాడుతూ ఉండగానే హడావిడిగా క్యాబిన్ నుండి వస్తున్న మహాన్ వైపు ఇద్దరూ విచిత్రంగా చూస్తారు….. ?? ఏయ్ పదా వెళ్దాం అని కంగారుగా భూమి చేయ్ పట్టుకుని లాక్కుని వెళ్తున్న మహాన్ వైపు చూస్తూ రేయ్ ఆగు ఏమైంది అంటూ అడ్డు నుంచున్న హనీష్ వైపు చూసి మామ్ కి యాక్సిడెంట్ అయిందట డ్రైవర్ కాల్ చేసాడు….. !!
వాట్….. ?? అంటూ ఇద్దరూ కూడా షాక్ అవుతూ కార్ లో కూర్చోగానే…… !! నేను వస్తాను అని గోల చేస్తున్న భూమి ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ నోరు మూసి లోపలికి వెళ్ళు నిన్ను చూస్తే మామ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఇద్దరూ హస్పిటల్ వైపు వెళ్ళడం చూసి భూమి కంగారుగా ఇంట్లోకి పరిగెత్తి దేవయాని కి విషయం చెప్తుంది….. !!
✨✨✨✨✨✨✨✨✨
సెలైన్ ఎపుడు అవుద్దా & ఎపుడెపుడు ఇక్కడి నుండి వెళ్ళిపోదామా అని విసుగ్గా సెలైన్ బాటిల్ వైపు చూస్తున్న నందన కి మామ్ అంటూ కంగారుగా రూమ్ లోకి వస్తున్న మహాన్ ను చూసి మహాన్ అంటూ పిలవగానే…… !! మామ్ అసలేం జరిగింది….. ?? నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నాకు బ్రెయిన్ వర్క్ చేయలేదు….. !! నీకు ఇప్పుడు బానే ఉంది కదా….. ?? అని అడుగుతూ బెడ్ మీద కూర్చుంటున్న మహాన్ చెయ్ పట్టుకుంటుంది నందన….. !!
ఆంటీ యాక్సిడెంట్ అయితే మీకు మాత్రమే ఇంజ్యురీ అయ్యిందేంటి డ్రైవర్ నార్మల్ గానే ఉన్నాడు….. ?? ఇంతకు మీకు జరిగింది యాక్సిడెంట్ / ఎవరైనా ఎటాక్ చేసారా అని తన డౌట్ అడుగుతాడు హనీష్….. !!
హనీష్ మాటలకు మహాన్ నందన వైపు చూస్తే నందన మొహాన్ని సీరియస్ గా పెట్టుకొని నేను ఇలా అవ్వడానికి కారణం యాక్సిడెంట్ కాదు కార్తికేయ అని చెప్పగానే హనీష్ కళ్ళు పెద్దవి చేసి షాక్ అయ్యి చూస్తే…… ?? మహాన్ కూర్చున్న వాడళ్ల కోపంగా పైకి లేచి వాట్ ఎమ్ అంటున్నావ్ మామ్…..??
నిజం మహాన్ నేను కార్తికేయ ఆఫీస్ కి నైట్ మా ఇంట్లో పవర్ ఎందుకు తీసావ్ అని అడగడానికి వెళ్ళాను….. !! కానీ ఆ కార్తికేయ నన్ను నలుగురిలో అవమానించి నన్ను కొట్టాడు….. !! నేను అది కూడా భరించా కానీ నిన్ను, శ్లోక ను తిట్టేసరికి ఆగలేక పోయాను …… !? అందుకే వెళ్ళి కోపంగా కాలర్ పట్టుకునే సరికి ఇదిగో నా తలను ఫుడ్ బాల్ లా గోడకు ఆనించి కొట్టి ఇలా హాస్పిటలైజ్ అయ్యేలా చేశాడు అని చక్కటి స్టోరీ అల్లేస్తుంది ….. !!
నందన చెప్పింది విన్న మహాన్ ఆవేశంగా బయటకు వెళ్ళడం చూసి హనీష్ కంగారుగా వెళ్తే నందన నవ్వుకుంటూ….. !! నన్ను దెబ్బ కొట్టి హాయిగా నవ్వుకుంటున్నావా కార్తికేయ నిన్ను అలా ఎలా అంత ఈజీగా వదులుతాను….. ?? అందుకే నా కొడుకు ను పంపిస్తున్నా ఆ పిచ్చోడికి నేను ఎంత చెప్తే అంత ఇవాళ నిన్ను నా కొడుకు ఈజీగా వదిలి పెట్టడు అని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది….. !!
మహాన్ ఆగు అంటున్నానా ఆగు అంటూ హనీష్ మహాన్ చెయ్ పట్టుకుని ఆపేస్తూ ఎక్కడికిరా అంత ఆవేశంగా వెళ్తున్నావ్…… ??
ఇంకెక్కడికి ఆ కార్తికేయ ఆఫీస్ కి ఆయనకు ఎంత ధైర్యం ఉంటే మామ్ మీద చెయ్ చేసుకుంటాడు…… !! ఇన్నాళ్ళు ఫాదర్ అన్న రెస్పెక్ట్ తో ఆయన జోలికి ఎప్పుడూ వెళ్లలేదు … !! బట్ చూసావ్ కదా మామ్ ను ఎలా హార్ట్ చేశాడో & తలకు ఆ బ్యాండేజ్ చూడరా పాపం మామ్ ఎంత పెయిన్ ఫీల్ అయిందో ఏంటో….. ??
ఇదంతా ఆయన వల్లే అంటూ కోపంగా వెళ్తున్న మహాన్ ను ఆపి ప్చ్ మహాన్ డోంట్ బీ సిల్లీ అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఏంట్రా ఆ ఆవేశం…… ?? నీకు కోపం వచ్చినా సరే ఒక్కటి మాత్రం నిజం అంకుల్ చాలా మంచి వారు….. !! అలాంటి ఆయన ఆంటీ ను ఇంతలా గోడకు ఆనించి కొట్టారు అంటే ఐ కాంట్ డైజెస్ట్…… !! ఇద్దరి మధ్య ఏదో జరిగింది & నలుగురిలో అంటీ ను అవమానించారు అన్నది టోటలీ రాంగ్ ఆయన ఎప్పటికీ అలా చేయరు….. !!
దట్ మీన్స్ మామ్ అబద్దం చెప్తుంది అంటున్నావా అంటూ ఆవేశంగా హనీష్ కాలర్ పట్టుకుంటాడు మహాన్….. !! జరిగింది పూర్తిగా తెలుసుకో అంటున్నా అని మహాన్ చేతులు విడిపించుకుని హనీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక మహాన్ తల పట్టుకుని కూర్చుంటాడు…… !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
హనీష్ అక్కడి నుండి వెళ్ళిపోయాక మహాన్ మెదడు లో ఏవేవో ఆలోచనలు….. !! నందన రూమ్ కి మళ్ళీ వెళ్ళి మామ్ అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పు అని అడుగుతున్న కొడుకు వైపు చూస్తూ ఇందాక చెప్పిన దానికి ఇంకొంచెం మసాలా యాడ్ చేసి ఏడుస్తూ చెప్తున్న నందన ను చూసి మహాన్ మొహం ఎర్రగా మారిపోతుంది…… !! ఇప్పుడే వస్తా మామ్ నేను వచ్చే వరకూ ఇక్కడే వెయిట్ చెయ్ అని చెప్పి ఆవేశంగా వెళ్తున్న కొడుకు వైపు చూస్తూ నవ్వుకుంటుంది నందన …… !!
అనంత్ తో కాల్ మాట్లాడుతున్న కార్తికేయ క్యాబిన్ డోర్ సడెన్ గా తెరుచుకోవడం తో అటుగా చూసిన కార్తికేయ కి కోపంగా లోపలికి వస్తూ కనిపిస్తాడు మహాన్…… !! నందు ఈ పాటికి వీడికి బ్రెయిన్ వాష్ చేసి ఉంటుంది అని కోపంగా ఉన్న మహాన్ మొహాన్ని చూస్తూ లోపలికి వచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలి …… !! అని తెలియదా & ఈ మాత్రం కూడా మీ అమ్మ నేర్పలేదా అని అడుగుతున్న కార్తికేయ వైపు కోపంగా చూస్తూ ……. !! ఇప్పుడు మీతో నీతులు చెప్పించుకోవడానికి రాలేదు అని కోపంగా చెప్పి టేబుల్ మీద ఉన్నవి అన్ని కోపంగా పగల కొట్టేస్తాడు…… !?
మహాన్ నీకేమైనా పిచ్చా అసలేం చేస్తున్నావ్….. ?? అని ఆపుతున్న కార్తికేయ వైపు కోపంగా చూస్తు వెళ్ళి ఆయన కాలర్ పట్టుకోబోయి ఆఖరి క్షణం లో ఆగి ఛా!!! అంటూ కాలిని గట్టిగా ఫ్లోర్ మీద కొట్టి కట్టుకున్న భార్యను హింసించడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి …… ?? అంటూ ఆవేశంగా అడుగుతాడు
కార్తికేయ మహాన్ వైపు కోపంగా చూస్తు ఒక్క సారిగా గట్టిగా నవ్వుతాడు …… !! ఎంతలా అంటే కళ్లల్లో నీళ్లు వస్తున్నా కూడా ఆపకుండా నవ్వుతూనే ఉంటాడు ……. !?
కార్తికేయ బిహేవియర్ కి మహాన్ కార్తికేయ వైపు విసుగ్గా చూస్తూ ఇక్కడ నేను సీరియస్ గా అడుగుతున్నా & నవ్వెలా వస్తుంది మీకు …… ?? మా మామ్ అంటే ఎంత కోపం ఉన్నా తను మీ భార్య ఆన్న సంగతి మర్చిపోయి తనను ఇలా కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి ……?? అసలు మనుషులు బిహేవ్ చేసే పద్దతా ఇది…… ??
హహ 😂 మై గాడ్ ఐ కాంట్ కంట్రోల్ మై లాఫ్ …… !! అని నవ్వుతూ సడెన్ గా మహాన్ వైపు ఎర్రటి చింత నిప్పులాంటి కళ్ళతో చూస్తూ …… !! మీ మామ్ ను జస్ట్ అలా నెట్టినందుకు అంత కోపం వచ్చి నా ఆఫీస్ కి వచ్చి మరీ నన్ను క్వశ్చన్ చేస్తున్నావ్…… ?? మరి భూమి ను టార్చర్ చేసేటపుడు తెలియలేదా తను నీ బార్య …… ?? అని & తను కూడా ఒక అమ్మాయి అని…… ?? నీ వరకూ వచ్చే సరికి నీకు నొప్పి తెలుస్తుందా …… ??
కార్తికేయ మాటలకు మహాన్ కి ఎవరో తనను లాగి పెట్టీ కొట్టినట్టు ఫీల్ అవుతూ కార్తికేయ వైపు కోపంగా చూస్తుంటాడు….. !!
మాట్లాడవేంట్రా కట్టుకున్న భార్య ను కష్టపెట్టడం తప్పు అన్నట్టు మాట్లాడావ్ కదా……. ?? మరి ఇపుడు నేను అడుగుతుంటే సైలెంట్ గా ఉంటావేంటి ……. ??
అది మీకు అనవసరం నా బార్య నా ఇష్టం…… !! తన మీద అన్ని రైట్స్ నాకున్నాయి …… ??
అవునా అయితే నీ అమ్మ కూడా నా భార్య …… !! దాని మీద కూడా నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి ……. !! అని కోపంగా చెప్తూ ఇంకో సారి అది కనిపిస్తే చంప పగలకొడతాను అని చెప్పు….. !!
యూ నా ముందే మామ్ ను కొడతాను అంటావా….. ?? నిన్ను ఊరికే వదలను అంటూ కోపంగా కార్తికేయ కాలర్ పట్టుకుని తన వైపు కోపంగా చూస్తాడు …….. !! తన కాలర్ పట్టుకున్న కొడుకు వైపు చూస్తూ నీ తల్లి పెంపకం లో పెరిగి నువ్వు నేర్చుకుంది ఇదా…….. ?? పెద్దా చిన్న అన్న గౌరవం లేకుండా కన్న తండ్రి కాలర్ పట్టుకుంటావా …… ??
కన్న తండ్రా…… ?? హహ 😅 నాకు ఉన్నది అమ్మ మాత్రమే తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు అంటున్న మహాన్ మెడ వెనుక నుంచి పట్టుకుని అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ వెనక్కి లాగి కౌచ్ లోకి విసిరేసినట్టే పడేస్తాడు…… !?
మావయ్య…… !! మీరు ఒకే కదా అని కార్తికేయ వైపు చూస్తూ దేవుడి లాంటి మావయ్య కాలర్ పట్టుకుంటావా ఎంత ధైర్యం రా నీకు అని మహాన్ ను పైకి లేపి కడుపులో పంచ్ ఇవ్వగానే అమ్మా!! అని నొప్పికి కడుపు పట్టుకున్న మహాన్ ను చూసి రాజ్ ఎమ్ చేస్తున్నావ్….. ??
మీరు ఆగండి మావయ్య ఇవాళ వీడు నా చేతుల్లో చచ్చాడు అని అంటున్న రాజ్ కాళ్లు లాగేసి రాజ్ పైకి లేవకుండా మీద కూర్చుని కొడుతూ ఉంటాడు మహాన్…… !! ఒకరిని ఒకరు దొర్లుకుంటూ కొట్టుకుంటున్న ఇద్దరినీ చూసి కార్తికేయ కోపంగా ఇద్దరినీ విడదీసి …… !! ఇద్దరికీ చెరో దెబ్బ వేయగానే రాజ్ సైలెంట్ అయినా మహాన్ పళ్ళు నూరుతూ హౌ డేర్ యూ టు టచ్ మీ అంటూ కోపంగా అరుస్తాడు….. !!
నిన్ను కొట్టడానికి సరి పడా ధైర్యం నాకుంది రా కావాలంటే చూడు అని మరో చంప పగల కొట్టిన కార్తికేయ ను చూసి మహాన్ తన రెండు చంపలు చేతుల్తో కవర్ చేసుకోవడం చూసి అంత కోపం లోనూ కార్తికేయ కి నవ్వొస్తుంది….. !!
చిన్నప్పుడు టాయ్స్ కోసం మహాన్, రాజ్ ఇలాగే కొట్టుకుంటూ ఒకరిని ఒకరు కొరుక్కునే వాళ్లు….. !! అది చూసిన కార్తికేయ వాళ్ళను కొట్టడానికి వస్తే మహాన్ అలాగే కవర్ చేసుకోవడం గుర్తొచ్చి కార్తికేయ కళ్ళల్లో చిరు తడి చేరుకుంటుంది….. !! మహాన్ బుగ్గ మీద చెయ్ వేయబోతున్న కార్తికేయ చేతిని కోపంగా నెట్టేస్తూ నన్నే కొడతారా చెప్తా మీ సంగతి అని ఆవేశంగా ఊగిపోతూ……. !! అక్కడి నుండి వెళ్తున్న మహాన్ ను చూసి ఈ తండ్రి ప్రేమ ను ఎపుడు అర్థం చేసుకుంటావ్ రా అని బాధగా చూస్తూ ఉంటే ఓదార్పుగా బుజం మీద చేయి వేస్తాడు రాజ్….. !!