రాజ్ తో మాట్లాడిన దేవయాని మనసు కాస్త ప్రశాంతంగా మారడం తో అనసూయ నంబర్ కి డయల్ చేస్తుంది…… !! దేవయాని కాల్ కోసమే వెయిట్ చేస్తున్న అనసూయ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హెలో దేవయాని భూమి ఎలా ఉంది…… ?? మహాన్ తనను ఎమ్ అనలేదు కదా….. ?? భూమి ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో ఏంటో అని నేను, మను చాలా కంగారు పడుతున్నాం అని అనసూయ మాట్లాడుతూ ఉండగా….. !! అత్తయ్య నేను అని 📲 మొబైల్ తీసుకున్న మానస భూ…. భూమి ఎలా ఉందో చెప్పండి అంటూ కంగారు నిండిన గొంతు తో అడుగుతుంది….. !!
మానస ఎలా ఉన్నావ్….. ?? ఎన్ని రోజులు అవుతుంది నీతో ఇలా మాట్లాడి….. ?? భూమి కోసం నువ్వు వర్రీ అవ్వకు భూమి ను చూసుకోవడానికి ఇక్కడ నేనున్నా కదా & భూమి కూడా బానే ఉంది….. !!
నేను ఏమాత్రం బాలేను అత్తయ్య అక్కడ నా కూతురిని వదిన, మహాన్ ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని ప్రతీ క్షణం తలుచుకుంటూ ఒక్కో క్షణాన్ని లెక్క పెడుతున్నాను ….. !! భూమి ను ఇవాళ చూడబోతున్నా అని ఎంతో ఆనందంగా వెయిట్ చేస్తుంటే సడెన్ గా మహాన్ కి తెలిసి ఇలా అవుతుంది అనుకోలేదు అత్తయ్య…… !!
మానస అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి అని లేదు కదా అపుడపుడు ఇలా అవుతూ ఉంటాయి…… !! అంత మాత్రానా మన ప్రయత్నాలు ఆపేయకూడదు అయినా ఈ రోజు మహాన్ కి తెలియడానికి కారణం శ్లోక….. !! అది ఇంట్లో ఉందన్న విషయం మర్చిపోయి బయలుదేరి తప్పు చేశాం….. !! అది మా మాటలు ఎలా విందో & ఎప్పుడు విన్నదో కానీ వెంటనే మహాన్ చెవిలో ఊదేసింది ….. !! ఇంకో సారి ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను సరేనా….. !! భూమి ను ఎలా అయినా నీకు చూపించే బాధ్యత నాది…… !!
థాంక్స్ అత్తయ్య అని కన్నీళ్ళు తుడుచుకుంటూ…… !! ఇంకో వారం లో విజయ్ సంవత్రరికం వస్తుంది అత్తయ్య ఆ రోజు మాత్రం భూమి ను ఎలా అయినా మంజునాథ స్వామీ టెంపుల్ కి వచ్చేలా చేయండి…. ?? ఎవ్రీ ఇయర్ భూమి చేత్తో కొన్ని దానాలు చేయిస్తూ వచ్చాం….. !! ఈ ఇయర్ కూడా చేయించాలి అని ఉంది ఈ విషయం లో మీరే ఏదోలా మ్యానేజ్ చేసి టెంపుల్ కి తీసుకుని రావాలి…… !!
భూమి మాత్రమే కాదు మొత్తం అందరం వస్తాం సరేనా…. !! ఆ విషయం గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉండు….. !! నీ బాధ చూస్తూ పాపం మీ అమ్మ కూడా చాలా బాధ పడుతుంది….. !! భూమి ను చూసుకోవడానికి నేనున్నా కదా నా మీద నమ్మకం ఉంటే భూమి గురించి ఇక బాధ పడకు…… !!
అంత మాట అనకండి అత్తయ్య మీ మీద నాకు అప్పుడు & ఇప్పుడు….. ఎప్పుడూ మంచి అభిప్రాయం ఉంది….. !! ఒక్క సారి భూమి తో మాట్లాడించండి అత్తయ్య దాని గొంతు వినాలి అనుంది ప్లీస్….. !!
అయ్యో తప్పకుండా మానస తను నీ కూతురు దానికి నన్ను అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ దేవయాని రూమ్ డోర్ ఓపెన్ చేసి కిచెన్ లోకి వెళ్లి కుకింగ్ లో బిజీగా ఉన్న భూమి చేతిలో మొబైల్ పెడుతుంది…… !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
అనంత్ చెప్పినట్టే కాసేపటికి కాంషియస్ లోకి వస్తుంది నందన…… !! మెల్లగా కదులుతున్న నందన ను చూసిన సిస్టర్ ఫాస్ట్ గా వెళ్ళి ఆనంత్ కి చెప్పగానే అనంత్ నందన ఉన్న రూమ్ కి వస్తాడు….. !! కళ్ళు నెమ్మదిగా తెరిచి తను ఎక్కడుందా అని సీలింగ్ ను చూస్తున్న నందన ను చూసి లోపలికి వస్తున్న అనంత్ హాయ్ అంటూ విష్ చేస్తాడు….. !!
అనంత్ వాయిస్ కి డోర్ వైపు చూసిన నందన కి మెడలో ఉన్న స్టెత్ చేతిలోకి తీసుకుంటూ చిరు నవ్వుతో లోపలికి వస్తున్న అనంత్ ను చూసి నందన కనులు ముడి పడతాయి…… !! కార్తికేయ ఫ్రెండ్ గా అనంత్ కి నందన తో పరిచయం ఉంది అందుకే అనంత్ ను చూసి నందన మొహం సీరియస్ గా పెట్టుకుంటుంది….. !!
నందన ఏం ఆలోచిస్తుందో తన మొహం లోని ఎక్స్ప్రెషన్ చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది….. !! అనంత్ నందన వైపు చూస్తూ హ్మ్మ్ నీ లాగే యాగోయిస్ట్ ను భరించాలి అంటే కొంచెం కష్టమనే చెప్పాలి పాపం కార్తీక్ అని ఫ్రెండ్ మీద జాలి పడుతూ…… !! హాయ్ నందన అంటూ మరో సారి విష్ చేసి నందన చెయ్ పట్టుకుని పల్స్ చెక్ చేస్తూ ఉంటాడు….. !!
నందన విసురుగా తన చేతిని వెనక్కి తీసుకుంటూ నేను ఎక్కడ ఉన్నాను….. ?? అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకు వచ్చారు….. ?? అని కార్తికేయ నే తీసుకుని వచ్చుంటాడు అని కోపంగా అరుస్తూ నన్ను తీసుకుని రావడానికి తనకేం రైట్ ఉంది….. ?? ముందు వెక్కి నీ ఫ్రెండ్ ను పిలువు అంటూ గట్టిగా అరిచేస్తూ హ్యాండ్ కి ఉన్న కాన్యూలా ను ఆవేశంగా తీస్తూ ఉంటే కోపంగా లాగేయడం వల్ల బ్లీడింగ్ ఓవర్ గా అవుతూ ఉంటుంది …… !!
స్టాప్ ఇట్ నందన….. ?? అసలేం చేస్తున్నావ్ నువ్వు అని ఆల్మోస్ట్ ఊడిపోతున్న క్యాన్యూల ను పెడుతూ నువ్వు వీక్ గా ఉన్నావ్….. !! నీకు 2 సెలైన్స్ పెట్టాలి అని ఆపుతూ సెలైన్ బాటిల్ చేంజ్ చేస్తూ…… !! నిన్ను కార్తీక్ తీసుకుని రాలేదు నీ డ్రైవర్ తీసుకుని వచ్చాడు చాలా….. ?? ఇక కామ్ గా పడుకో
డోంట్ ట్రై టు కవర్ ది ట్రూత్ మిస్టర్ అనంత్…… !! నన్ను కార్తికేయ నే తీసుకుని వచ్చాడు ఐ నో దట్….. !! నీ ఫ్రెండ్ అని వెనకేసుకుని రావద్దు ముందు పిలువు నీ ఫ్రెండ్ ను అంటూ విసుగ్గా చెప్తుంది….. !! ( అంటే మన కంచు అత్త కి నీరసం తో అప్పటికే లైట్ గా కళ్ళు తిరుగుతున్నాయి అందుకే వాయిస్ తగ్గించింది 😁🥱)
హో గాడ్ చెప్తుంటే అర్థం కావడం లేదా కార్తీక్ ఇక్కడికి రాలేదు…… !! నిన్ను తీసుకు వచ్చింది నీ డ్రైవర్ కావాలంటే తననే అడుగు అని డ్రైవర్ ను లోపలికి పిలిపిస్తాడు…. !! బిక్కు బిక్కు మంటూ లోపలికి వచ్చిన డ్రైవర్ బెడ్ మీద ఉన్న నందన ను చూసి మే… మేడం ఇప్పుడు ఎలా ఉంది….. ?? అని అడుగుతున్న డ్రైవర్ తో ఏయ్ నన్ను హాస్పిటల్ కి ఎవరు తీసుకుని వచ్చారు…… ?? నిజం చెప్పు నన్ను తీసుకుని వచ్చింది కార్తికేయ నే కదా అబద్దం చెప్పావంటే పీక పిసికేస్తా అంటూ కోపంగా అరుస్తుంది…. !!
కార్తికేయ తనకు ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుంటూ నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ లే….. లే…..లేదు మేడం…… !! మీరు కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పగానే అక్కడున్న స్టాఫ్ హెల్ప్ తో మిమ్ముల్ని నేనే డ్రాప్ చేసాను అని గట్టిగా చెప్తున్న డ్రైవర్ మాటలకు నందన కళ్ళు ఎరుపు రంగు మారడం తో పాటు తనకే తెలియకుండా తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కానీ అవి ఎవరి కంట పడనివ్వద్దు….. !! ( ఆ కన్నీళ్లు దేనికో మీలో ఎవరికైనా అర్థం అయిందా 😜😶)
అర్థం అయింది కదా ఇక రెస్ట్ తీసుకో అంటున్న అనంత్ వైపు సీరియస్ లుక్ వదులుతూ…. !! కార్తికేయ మాత్రమే కాదు తనకు సంబంధించినది ఏదైనా నాకు ఇష్టం లేదు….. !! నీతో ట్రీట్మెంట్ చేయించుకునే కర్మ నాకు పట్టలేదు అంటూ డ్రైవర్ వైపు చూస్తూ మహాన్ కి కాల్ చేసి రమ్మని చెప్పు అంటూ నీరసంగా కళ్ళు మూసుకున్న నందన బిహేవియర్ కి అనంత్ విసుగ్గా జుట్టు పీక్కుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ కార్తికేయ కి కాల్
చేస్తాడు ……. !!
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
తన చేతిలో మొబైల్ పెట్టిన దేవయాని వైపు అయోమయంగా చూస్తూ ఏంటి నానమ్మ….. ?? ఏమైంది….. ?? నా కుకింగ్ ఇంకా అవ్వలేదు ఈ మొబైల్ ఎందుకు నా చేతిలో పెట్టావ్….. ??
లంచ్ కుక్ చేయడానికి కుక్స్ తో పాటు రేణుక కూడా ఉంది కానీ నువ్వు మీ అమ్మ తో మాట్లాడు….. !! నీ కాల్ అయ్యేసరికి లంచ్ కూడా రెడీ అవుతుంది అని చెప్తున్న దేవయాని మాటలకు…… !! భూమి ఆనందంగా మొబైల్ వైపు చూస్తూ హెలో మమ్మీ అంటూ కిచెన్ నుండి బయటకు వెళ్ళడం చూసిన దేవయాని నవ్వుతూ ఏమేం కుక్ చేస్తున్నారో అడుగుతూ కిచెన్ లోనే ఉండిపోతుంది……. !!
భూమి ఎలా ఉన్నావ్ రా 🥹….. ?? ఎన్ని డేస్ అవుతుంది నీ వాయిస్ విని….. !! కొంచెం కూడా గుర్తు రాలేదా నీకు మీ అమ్మ….. !! నువ్వు ఎప్పుడూ కాల్ చేస్తావా అని నిద్ర కూడా పోకుండా వెయిట్ చేస్తున్నాను తెలుసా 🥹🥹.!! ఏ కాల్ వచ్చినా నువ్వే చేసావ్ అని అనుకుంటూ తర్వాత నువ్వు కాదని ఏడుస్తూ ఉన్నాను……. !!
మమ్మీ ప్లీస్ అంటూ మానస వాయిస్ లోని బాధ కు ఏడ్చేస్తుంది భూమి….. !! నీతో మాట్లాడాలి అని ఎన్నో సార్లు అనుకున్నాను……. !! కానీ ఏ మొహం పెట్టుకుని నీతో మాట్లాడాలి మమ్మీ నువ్వు వద్దు వద్దు అంటున్నా…… !! ఎవరు చెప్పినా వినకుండా మీ అందరూ లేకుండానే పెళ్లి చేసుకున్నాను ఆ గిల్ట్ ఫీలింగ్ తో మీతో మాట్లాడాలి అంటేనే ఎడ్పొచ్చేస్తుంది నాకు…… !! నిజం చెప్పు నా మీద కోపంగా లేదా నీకు….. ??
ఫస్ట్ చాలా కోపం వచ్చింది భూమి కానీ నువ్వు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావో తెలిసి చాలా బాధ పడ్డాను….. !! నీకు మా వదిన గురించి తెలియదు భూమి తన వల్ల నేను ఎంతలా ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు….. !! నువ్వు అనుకున్నవి ఏవీ వదిన జరగనివ్వదు భూమి నా మాట విని మన ఇంటికి వచ్చెయ్…… !! నిన్ను చూసుకోవడానికి మేము అందరం ఉన్నాం కదా…….. !!
అమ్మమ్మ ఎలా ఉంది మమ్మీ…… ?? టైమ్ కి టాబ్లెట్స్ వేసుకుంటుందా ….. ?? భూమర్ ఎలా ఉన్నాడు ……. ?? ( భూమి పెట్ డాగీ తన పేరు భూమర్ దాని గురించే ఇప్పుడు భూమి అడుగుతుంది) సరిగ్గా ఫుడ్ తింటున్నాడా….. ?? వాడికి టైమ్ కి ఫుడ్ పెట్టు మమ్మీ…… !! మార్నింగ్ టైమ్స్ లో అలా గార్డెన్ లో వాక్ చేయించు లేకపోతే అమ్మమ్మ లా లేజీ గా తయారు అవుతాడు….. !!
టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా….. ?? అర్థం అయింది నువ్వు అనుకున్నది చేసే దాకా రాను అంటావ్ అంతే కదా…… !! చిన్నప్పటి నుండి ఇంతే ఇలాగే మొండిగా బిహేవ్ చేస్తున్నావ్…… ?? నేను చెప్పేది విను రా నా బుజ్జి తల్లీ వి కదా అన్నయ్య కూడా నీ గురించి ఆలోచిస్తూ ఫుడ్ కూడా సరిగ్గా తినడం లేదు….. !!
మమ్మీ నేను తర్వాత మాట్లాడనా మహాన్ కి లంచ్ తీసుకుని వెళ్ళాలి….. !! టైమ్ కి వెళ్లకపోతే మళ్ళీ సీరియస్ అవుతాడు బై అంటూ కాల్ కట్ చేస్తుంది….. !! ఐ ఆమ్ సారి మమ్మీ మావయ్య గురించి నువ్వు ఇంకొక్క మాట చెప్పినా ……. !! నా మనసు ఎక్కడ కంట్రోల్ తప్పుతుందో & నేను ఎక్కడ ఇంటికి వచ్చేస్తానో……. !! అని కట్ చేశా అని బుగ్గల మీద కు జారిన కన్నీళ్ళు తుడుస్తూ కాసేపటికి మొహాన్ని నార్మల్ గా మార్చేసి మొబైల్ టేబుల్ మీద పెట్టేస్తుంది…… !!
భూమి కిచెన్ లోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ కుకింగ్ ఫినిష్ అవ్వడం తో బ్యాలెన్స్ ఉన్నవి పూర్తి చేసి రేణుక ను బాక్స్ ప్రిపేర్ చేయమని చెప్పి భూమి రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందంగా చీర కట్టుకుని …… !! రేణుక ఇచ్చిన బాక్స్ జూట్ బ్యాగ్ లో పెట్టేసి ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెడుతూ ఆ బ్యాగ్ తీసుకుని దేవయాని కి చెప్పి కార్ లో మహాన్ ఆఫీస్ కి వెళ్తుంది….. !?
మహాన్ ఆఫీస్ ముందు ఆగిన కార్ నుండి దిగిన భూమి బ్యాగ్ తీసుకుని రమ్మని డ్రైవర్ కి చెప్పి తను ఆఫీస్ లోకి ఎంటర్ అవుతుంది…… !! ఆరెంజ్ కలర్ టిస్యూ శారీ కట్టుకుని హెయిర్ లీవ్ చేసి, చెవులకు జుమ్కాలు అటు ఇటు ఊగుతూ ఉంటే…… !? తను వేసుకున్న హిల్స్ ను టక టక లాడిస్తూ మహాన్ బార్య గా ఫస్ట్ టైమ్ ఆఫీస్ లోకి ఎంటర్ అవుతుంది భూమి….. !!
మహాన్ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ఆఫీస్ కి వచ్చింది కానీ తనకు వైఫ్ అయ్యాక మాత్రం భూమి రావడం ఇదే ఫస్ట్ టైమ్….. !! ఆఫ్టర్ లాంగ్ టైం భూమి ను అక్కడ చూసిన స్టాఫ్ హాయ్ మ్యామ్ అంటూ చుట్టు చేరి విష్ చేస్తూ ఉంటే అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది భూమి….. !?
సీ సి టీవీ ఫుటేజ్ లో స్టాఫ్ వర్క్ ఆపి జోక్స్ వేస్తూ నవ్వుతూ ముచ్చట్లు పెట్టడం చూసిన మహాన్ …… !! వర్క్ ఆపి అందరూ ఎందుకిలా ఉప్పర్ మీటింగ్ పెట్టారు….. ?? అని సీరియస్ గా తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి అందరినీ చూసి వాట్స్ గోయింగ్ ఆన్ అంటూ సీరియస్ గా వినిపించిన మహాన్ వాయిస్ కి అందరూ పిల్లిలా ఎవరి వర్క్ ప్లేస్ కి వాళ్ళు వెళ్లిపోతే…… ?? వెనక్కి తిరిగిన భూమి ను చూసి మహాన్ గుండె స్కిడ్ అయ్యి కడుపులోకి వచ్చేస్తుంది…… ??