అచ్చచ్చో ఏడుస్తున్నావా భూమి కన్నీళ్లను దాచిపెట్టుకో భూమి అవి నీకు చాలా చాలా అవసరం అన్ని ఇప్పుడే కర్చు పెట్టేస్తే ఎలా చెప్పు కొంచెం కొంచెం గా వాడుకో ఎందుకో తెలుసా నువ్వు నీ జీవితాంతం ఏడుస్తూనే బ్రతకాలి సో అన్ని ఇప్పుడే అవ్వగొడితే ఎలా చెప్పు అని నవ్వుతున్న నందన ను చూసి హహ సూపర్ మామ్ బలే చెప్పావ్ …..!! మామ్ చెప్తుంది నిజమే భూమి ఆ కన్నీళ్లను కొంచెం కొంచెం గా వాడుకో అంటూ నవ్వుతున్న శ్లోక ను పక్కనే ఉన్న నందన ను చూసి భూమి కి ఏడుపు మరింత పెద్దది అవుతుంది 🥹
ఏయ్ ఏడ్చింది చాలు కానీ ఆపు ఏడ్చి ఏడ్చి ఇలా
నట్టింట్లో వచ్చిన రోజే చస్తావా ఎన్టీ ……??నువ్వు అప్పుడే చావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు భూమి అంటూ భూమి బుగ్గలు నొక్కి పట్టుకుని నువ్వు కొంచెం కొంచెం గా రోజూ చస్తూ బ్రతకాలి అది చూసిన నీ మావయ్య కుమిలి కుమిలి ఏడవాలి అప్పుడే కదా నా 20 సంవత్సరాల పగ చాల్లారుతుంది అంటూ భూమి ను విసురుగా వెనక్కి నెడుతుంది……
అత్తయ్యా ప్లీస్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అయినా మీకు నేనేం అన్యాయం చేశానని నన్ను ఇంతలా ఎడిపిస్తున్నారు 🥹🥺 నాకు మీరంటే చాలా గౌరవం, ఇష్టం అత్తయ్యా ఇన్ఫాక్ట్ మేము పెళ్ళి చేసుకుంది మా ప్రేమ కోసం కాదు నిన్ను మావయ్య ను కలపడానికి…..!! ప్లీస్ అత్తయ్యా అర్తం చేసుకో మహాన్ కి నువ్వే అర్తం అయ్యేలా చెప్పు అంటు కన్నీళ్ళతో నందన కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ అడుగుతుంది ……
హహ ఎంటి నేను నా కొడుకు తో నిన్ను భార్యగా స్వీకరించమని చెప్పాలా అని హాల్ మొత్తం రీ సౌండ్ వచ్చేలా నవ్వుతూ ఎన్టీ భూమి కళ కంటున్నావా …..?? అని భూమి జుట్టు పట్టుకుని పైకి లేపి తన మొహం లోకి మొహం పెట్టి చూస్తూ నిన్ను ఈ ఇంటికి తీసుకు వచ్చి పని మనిషి ను చేయమని చెప్పిన నేను అలా ఎలా చెప్తాను అనుకుంటున్నావ్ ఇంత అమాయకురాలు ఎన్టీ భూమి నువ్వు …..??
మామ్ అది అంత ఇన్నోసెంట్ కాబట్టే కదా అన్నయ్య దీన్ని లవ్ చేస్తున్నా అని చెప్పగానే అవునని నమ్మేసింది పూర్ భూమి అంటూ పక్క నుండి వెటకారంగా అంటుంది శ్లోక……
లేదు మహాన్ నన్ను నిజంగానే ప్రేమించాడు నాకు తెలుసు హి లవ్స్ మీ 🥹♥️ మహాన్ మనసులో నేనే వున్నాను ……
కరెక్ట్ భూమి మహాన్ మనసులో నువ్వే వున్నావ్ కాకపోతే ఆ మనసు నిండా ద్వేషం, పగ , కోపం, అసహ్యం తప్పా ప్రేమ , అనురాగం , ఆప్యాయత లాంటివి లేవు అని నవ్వగానే భూమి రెండు చెవులు మూసుకుంటూ లేదు… లేదు…. లేదు మహాన్ లవ్స్ మీ హి ట్రూలీ లవ్స్ మీ తన ప్రేమ అబద్దం కాదు అది నాకు తెలుసు అంటూ ఏడుస్తూనే గట్టిగా చెప్తుంది ……
నువ్వు తెలుగు లో లేదు అన్నా హిందీ లో నహీ అన్నా ఇంగ్లీష్ లో నో అని చెప్పినా వాడు నిన్ను ప్రేమించాడు అన్నది అబద్దం ప్రేమించినట్టు నటించాడు అన్నదే నిజం …… నమ్మితే నమ్ము లేకపోతే ఎటైనా వెళ్ళి చావ్ నాకు వచ్చిన నష్టమేమీ లేదు అంటూ భూమి ను కింద నుండి పై వరకూ చూస్తుంది నందన ……. కలువ రేకుల్లాంటి కళ్లు , కోటేరు ముక్కు , లిప్స్టిక్ కూడా అవసరం లేకుండా ఉన్న ఎర్రటి పెదవులు , బుగ్గన పడే డింపుల్ & ముఖ్యంగా పై పెదవి మీద ఉన్న పుట్టుమచ్చ 5.5 ఎత్తులో పాలరాతి శిల్పం లా ఎంతో ఆందంగా ఉంటుంది భూమి తన అందాన్ని మరింత పెంచేలా గ్రీన్ కలర్ పట్టు చీర , బంగారు నగలతో షో రూమ్ లో ఉన్న బంగారు బొమ్మ లా ఉన్న భూమి ను చూసి కాసేపు కళ్లు తిప్పుకొలేక పోయింది నందన …….
మామ్… మామ్ ఆర్ యు హియర్ అన్న శ్లోక మాటలకి చూపును తిప్పుకుంటూ భూమి వైపు చూసి నువ్వు ఇంత అందంగా ఉండడం ఎమ్ బాలేదు భూమి…… నా ఇంటి పనిమనిషి కి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా నీలో లేదు ఒక్క క్షణం ఆగు అంటూ కిచెన్ లో ఉన్న పని మనిషి ను పిలుస్తుంది ……
రేణుక…. రేణుక అని పిలవగానే 30 సంవత్సరాల రేణుక కిచెన్ నుండి ఫాస్ట్ గా తన చేతులు చీర కొంగు కు తుడుచుకుంటూ చెప్పడం మేడం అంటూ వినయంగా నందన వైపు చూస్తుంది…… ఏయ్ నీ దగ్గరున్న పాత చీరలు దీనికి ఇవ్వు ఇవాళ్టి నుంచి అవే ఇది కట్టుకుంటుంది అంటూ భూమి వైపు చూస్తూ అంటుంది…….
కానీ మేడం తను మీ ఇంటి కోడలు అలాంటిది అమ్మాయి గారికి నా చీరలు అని నసుగుతున్న రేణుక చంప పగల కొట్టి ఎవరే..?? ఎవరే కోడలు మరొక్క సారి అలా అన్నావ్ అంటే నాలుక చీరేస్తాను జాగ్రత్త …..!! నోరు మూసుకుని చెప్పిన పని చెయ్ అని సీరియస్ గా చెప్పి ఏయ్ నువ్వెళ్ళి చీర మార్చుకుని తలలో ఉన్న పూలు, కట్టుకున్న బాసికం పడేసి పెట్టుకున్న నగలు, చీర కవర్ లో పెట్టుకుని తీసుకురా అని గదమగానే భూమి నందన అరుపుకి భయంగా రేణుక తో కలిసి అక్కడే ఉన్న మెయిడ్ క్వార్టర్స్ కి వెల్తుంది …….
నందన చెప్పినా కూడా అమాయకమైన భూమి మొహాన్ని చూసి పాత చీరలు ఇవ్వలేక 1000 కి 4 చీరలు అని ఆఫర్ లో తను కొనుకున్న కొత్త చీరల కవర్ ను భూమి చేతిలో పెడుతూ తీసుకోండి అమ్మాయి గారు ఇవి నావే …….. కొత్త చీరలు అదృష్టం కొద్దీ ఇద్దరం ఓకే బరువు కాబట్టీ బ్లౌజెస్ కూడా సెట్ అవుతాయి …….. నాకు తెలుసు మీరు ఇలాంటి చీరలు ఎప్పుడూ కట్టి ఉండరని కానీ నా దగ్గర ఇంత కంటే మంచి చీరలు లేవు వచ్చే శాలరీ మొత్తం పిల్లల చదువులకు అత్తయ్య హస్పిటల్ కే సరిపోతుంది …… నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చాక మీకు మంచి చీరలు కొంటాను అప్పటి వరకు వీటితో అడ్జస్ట్ అవ్వండి ప్లీస్ ….. !!
పర్లేదు అక్కా ప్రస్తుతానికి ఇవి కొనే స్థోమత కూడా నాకు లేదు మీ కోసం కొన్న చీరలు నాకు ఇచ్చారు …….. చాలా థాంక్స్ బట్ నాకు అన్ని వద్దు ఒక్కటి చాలు అంటూ ఒక్క చీర తీసుకొని చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్న భూమి ను ఆపి నోరారా అక్క అని పిలిఛావ్ అక్క ఇస్తున్న బహుమతి అనుకుని తీసుకోండి అమ్మాయి గారు ……..
ప్లీస్ !! అంటూ బలవంత పెడుతున్న రేణుక ను చూసి తప్పక ఆ చీరలు తీసుకుంటు నేను ఇవి తీసుకోవాలి అంటే వన్ కండీషన్ ……??
ఎంటో చెప్పండి అమ్మాయు గారు కష్టం అయినా సరే చేస్తాను …..!!
నువ్వు నన్ను భూమి అని పిలవాలి ఇలా రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తుంటే నాకు ఎమ్ నచ్చట్లేదు అక్క అయినా చెల్లెల్ని పేరు పెట్టి పిలవాలి కానీ అమ్మాయి గారు అని కాదు ……!!
భూమి అంత బాధలో ఉన్నా ఇలా మాట్లాడడం చూసి భూమి ఎంత మంచిదో అర్తం అయిన రేణుక చిరు నవ్వుతో ఆలాగే భూమి అనే పిలుస్తాను ……. మనం మాత్రమే వున్నప్పుడు బట్ అందరు ఉన్నప్పుడు మాత్రం అమ్మయి గారు అనే పిలుస్తాను …… ఇక నన్ను ఇబ్బంది పెట్టకు భూమి వెళ్ళి చీర మార్చుకుని రా లేట్ అయితే మేడం కోప్పడతారు అని చెప్పగానే…… భూమి ఫాస్ట్ గా సారి చేంజ్ చేసుకొని కవర్ లో జాగ్రత్తగా తన జేవెలరీ, సారి పెట్టేసి పూలు, బాసికం, బుగ్గన చుక్క తీసేసి మామూలు ఆడపిల్ల లా సాదసీదా చీర లో మెడలో మంగళ సూత్రం తప్పా చెవుల్లో కమ్మలు కూడా లేకుండా వెళ్ళి నందన ముందు నిల్చుంటుంది…… భూమి ను అలా చూసి నందన నవ్వుతూ గుడ్ ఇప్పుడు నా ఇంటి పనిమనిషి లా వున్నావ్ ఇప్పుడు ఆ హెయిర్ ను బ్యాండ్ తో ముడేసి శ్లోక కి ఇడ్లీ, మహాన్ కి మసాల దోశ, నాకు ఊతప్పం అమ్మా నాన్నా లకు పెసరట్టు ఉప్మా ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకొని రా ….. గో…..!!
అత్తయ్యా అది నాకు వంట …….??
ఐ నో నీకు వంట రాదు బట్ అలా అని చేయకుండా కూర్చుంటే ఏమీ రాదు సో కిచెన్ లోకి వెళ్లి ట్రై చేస్తే అన్ని వస్తాయి…… వెల్లు వెల్లు ఏయ్ రేణుక దీంతో దగ్గరుండి వంట చేయించు అని చెప్పగానే రేణుక భూమి ను తీసుకుని కిచెన్ లోకి వెళ్తుంది …… అది చూసిన నందన, శ్లోక నవ్వుకుంటూ విజయేద్రప్రసాద్ వైపు చూడ్డం తో ఆయన కూడా నవ్వుతూ హాల్ లో నే కూర్చుని మాట్లాడుకుంటూ వుంటారు …….
అరగంట తరువాత నందన నిలయం ముందుకు బ్లాక్ కలర్ బెంజ్ కార్ వచ్చి ఆగుతుంది ……. డ్రైవర్ ఫాస్ట్ గా దిగి కార్ డోర్ ఓపెన్ చేయగానే బ్లాక్ కలర్ సూట్ లో కళ్లకు గాగుల్స్ చేతికి రోలెక్స్ వాచ్ పెట్టుకుని హుందాగా కార్ దిగుతాడు 50 సంత్సరాల కార్తికేయ మిశ్ర …….. ఆరడుగుల అందగాడు కండలు తిరిగిన శరీరం తెల్లని మేలిమి ఛాయ నడకలో రాయల్టీ చూపులో చిరుత పదును ఒక్క ముక్కలో చెప్పాలంటే చూడ్డానికి హాలీవుడ్ హీరో లా ఉంటాడు …… ఆయనకు 50 ఇయర్స్ అంటే ఎవరు నమ్మరు అలా వుంటాడు కార్తికేయ మిశ్ర ……!!
సింహం లా అడుగులు వేస్తూ కోపం, ఆవేశం తో ఇంట్లోకి అడుగు పెట్టిన కార్తికేయ కు హాల్ లోనే కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్న నందన కనిపించడం తో కోపం మరింత పెరిగిపోతుంది …… కోపంగా ఒక్కో అడుగు వేస్తూ తన పక్కనే ఉన్న టేబుల్ మీద షో పీస్ ను పగల కొట్టి నందు అంటూ ఆవేశంగా అరుస్తాడు……
కార్తికేయ వాయిస్ విని తల తిప్పిన నందన వాల్లకు ఉగ్రరూపం దాల్చిన నరసింహ స్వామి లా కోపంతో ఉగిపోతున్న కార్తికేయ ను చూసి షాక్ అయ్యి పైకి లేస్తారు …….. విజయేంద్రప్రసాద్ & శ్లోక, దేవయాని పైకి లేచి నుంచుని చూస్తారు కానీ నందన ఇంచ్ కూడా కదలకుండా కార్తికేయ వైపు చూసి నందు కాదు నందన ……. నువ్వు అలా పిలిచే అర్హత కోల్పోయి కూడా 20 సంవత్సరాల పైనే అవుతుంది మిస్టర్ కార్తికేయ మిశ్రా అంటూ యాటిట్యూడ్ గా చెప్తుంది……
ఏయ్ ఇపుడు నేను వచ్చింది నిన్ను ముద్దుగా పిలవడానికో లేక బుజ్జగించి ముద్దు పెట్టుకోవడానికో కాదు…… ఈ జన్మలో ఈ ఇంట్లో కాలు పెట్టకూడదు అనుకున్న బట్ నన్ను పెట్టేలా చేసారు నువ్వు నీ కొడుకు …… మర్యాదగా నా కోడలిని పిలువు లేకపోతే ఎమ్ జరుగుతుందో & ఎమ్ చేస్తానో నాకే తెలియదు …..!!
ఆ దరిద్రం ఇక్కడే ఉంది వస్తాను అంటే తీసుకుపో అంటూ పొగరుగా చెప్పి ఏయ్ భూమి… భూమి అని అరవాగానే లెమన్ కలర్ శారీ లో ఏడవడం వల్ల కల్లు ఎర్రగా కందిపోయి జుట్టు ను క్లచ్చర్ తో పైకీ పెట్టేసి ఫస్ట్ టైమ్ వంట చేయటం వల్ల మొహానికి పిండి అంటుకుని నుదుటిన చిరు చమట తుడుచుకుంటూ వస్తున్న భూమి ను చూసి కార్తికేయ రక్తం కుత కుత ఉడుకుతుంది …….
ఇప్పుడు కార్తికేయ రియాక్షన్ ఏంటంటారు 🥱🫣…….?? నందన కార్తికేయ ఎందుకు విడిపోయారు……??? వాళ్ళు విడిపోవడానికి భూమి కి సంబంధం ఏంటి 🤷……?? గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి 🙂