రాజ్ భూమి తనతో రాను అన్నందుకు బాధగా మహాన్ భూమి ను ఎంతలా టార్చర్ పెడుతున్నాడో డైరెక్ట్ గా చూసి కూడా ఎమ్ చేయలేక భూమి ను వదిలి వెళ్ళలేక అయిష్టంగానే కోపంగా అక్కడి నుండి తన ఇంటికి స్టార్ట్ అవుతాడు …… !! ఇంటి పార్టీకో లో కార్ ఆపి ఇంట్లోకి వెళ్ళిన రాజ్ కి హాల్ లో భూమి గురించే బాధ పెడుతూ మాట్లాడుతున్న అనసూయ , మానస కనిపించడం తో తన అడుగులు అక్కడే ఆగిపోయి పిల్లర్ వెనుక దాక్కుంటూ వాల్ల మాటలు వింటాడు …… !!
అమ్మా!! నాకు భూమి గురించి చాలా బెంగగా ఉంది …… !! ఎమ్ చేస్తున్నా అదే గుర్తొస్తుంది భూమి వున్నన్ని రోజులు ఈ ఇల్లు కళ కళ లాడుతు ఉండేది …… !! ఇప్పుడు చూడు ఎలా ఉందో నేను ఎమ్ చేస్తున్నా భూమి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి ……. !! అమ్మా !!నాకు ఇది కావాలీ & అది కావాలీ అని అడిగి మరీ చేయించుకునేది …… !! అలాంటి భూమి ఈరోజు అన్ని కష్టాలు పడుతూ ఉంటే నా తల్లి హృదయం తట్టుకోలేక పోతుంది నాకు భూమి ను చూడాలి అనుందమ్మా ……. !!
నాకు మాత్రం భూమి గుర్తు రావడం లేదు అనుకున్నావా మానస …… !! నాకు ఆలాగే ఉంది కాలేజ్ నుండి రాగానే అది పరిగెత్తుకుంటూ నా దగ్గరికే వచ్చేది …… !! రోజూ నాతో వాకింగ్ చేయించేది నా బంగారు తల్లి అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఎంటో …… ?? అది అక్కడ ఏడుస్తూ ఉంటే ఇక్కడ నాకు గొంతులోకి ముద్ద దిగడం లేదు …… !!
అమ్మా నా వల్ల కావట్లేదు వదిన నన్ను ఎమ్ అన్నా సరే నేను భూమి ను చూసి వస్తాను …… !! దాన్ని చూడకుండా ఉండడం నా వల్ల అవ్వదు ప్లీస్ అమ్మా !! అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న మానస ను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ తన కన్నీళ్ళు తుడుచుకుంటూ…… !! వద్దు మను నువ్వు అక్కడికీ వెళ్ళావ్ అని మీ అన్నయ్య కి తెలిస్తే అసలు ఊరుకోడు …… !! ఆ నందన నీడ కూడా మీ మీద పడ్డం వాడికి ఇష్టం లేదు అందుకే పిల్లలకు ఆ నందన ఊసు కూడా రాజ్, భూమి లకు తెలియకుండా పెంచాడు …… !!
ఆన్ని మనం అనుకున్నట్టే జరగవు కదా ఎవరి నీడ వీళ్ళ మీద పడకూడదు అణుకున్నాడో …… !! భూమి ఆ ఇంటికే కోడలిగా వెళ్ళింది …… !! తనకి ఆ నందన గురించి తెలియక తననూ మార్చి రెండు కుటుంబాలను ఒక్కటి చేయాలి అని చూస్తుంది కానీ అది జరిగే అవకాశం లేదు …… !!
మానస అనసూయ నుండి దూరం జరిగి భూమి చేస్తుంది మంచి పనే కదమ్మా అన్నయ్య వదిన కలిస్తే నీకు మాత్రం సంతోషంగా ఉండదా చెప్పు …… !! నీ కొడుకు కోడలు & వాల్ల పిల్లలు ఇలా అందరు నీతో ఉండాలి అని నీకు లేదా …… ??
జరగని విషయాల గురించి ఆలోచించక పోవడమే మంచిది మను ……. !! నీ మనసు మంచిది కాబట్టీ ఆ నందన మీ అన్నయ్య తో సంతోషంగా ఉండాలి అని ఇప్పటికీ కోరుకుంటున్నావ్…… !! కానీ తను నీ నాశనాన్ని కోరుకుంటుంది & నీ మీద కోపాన్ని నీ కూతురి మీద చూపిస్తు దాన్ని ఎడిపిస్తుంది …… !! పాపం మను భూమి కి ఏ పాపం తెలియదు అది నీ లాగే అమాయకురాలు అలాంటి పిల్లను పట్టుకుని ఎంత నరకం చూపిస్తుందో ఆ రాక్షసి …… !! అలాంటిది నా కోడలిగా వచ్చినందుకు ఇప్పటికీ కూడా బాధ పడుతున్నా …… !!
నేను ఇక్కడికి రావడం వల్లే కదమ్మా వదిన అన్నయ్య గొడవ పడి ఇద్దరూ ఇలా విడిపోయే దాక వెళ్లారు ఇదంతా నా మూలంగానే జరిగింది …… !! అందుకే నా కూతురికి ఇలా జరుగుతుంది నేను చేసిన తప్పే భూమి విషయం లో శాపం గా మారింది ……. !!
మను పిచ్చి దానిలా మాట్లాడకు అల్లుడు గారు చనిపోవడం వల్లే కదా నువ్వు ఇక్కడికి వచ్చావ్ తప్పా
……. !! కావలని అయితే కాదు & మీ నాన్నే బతికి ఉండుంటే మనం ఇక్కడ మీ అన్నయ్య తో వుండేవాళ్ళం కాదు …….. !! ఆయన నువ్వు నేను పిల్లలు వుండేవాళ్ళం & ఇందులో నీ తప్పేం ఉందని నింద నీ మీద వేసుకుంటున్నావ్ …….. !! నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఆ నందన ఎదోటి అంటూనే ఉండేది అయినా నువ్వు చాలా ఓపికగా బరించావ్ తప్ప ఎనాడు నాకు కానీ మీ ఆన్న కి కానీ చెప్పలేదు ……. !! నేనే ఒక రోజు నందన నిన్ను తిట్టడం చూసి ఎందుకు అనవసరంగా మను ను తిడుతున్నావ్ నందన అని ఒక్క మాట అనగానే అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది …… !! ఇదనే కాదు తను చేసింది ఒకటా రెండా ఎన్నని చెప్పను …… ??
మానస బాధగా అనసూయ వైపు చూస్తూ నాకు భూమి గురించి చాలా బెంగగా ఉందమ్మా …… !! అది మొండిగా బిహేవ్ చేస్తుంది అన్నయ్య పిలిచినా రాను అంటుంది …… !! అది సంతోషంగా తన భర్త తో వుంటే నేను కూడా పోనిలే అదైనా హాయిగా ఉంది అనుకునే దాన్ని ……. !! కానీ తనను ప్రేమించినట్టు కేవలం నటించి ఇప్పుడు తన తల్లి మాటలు విని భూమి ను కష్టపడుతున్నాడు మహాన్ ……. !! ఇంకా అది ఏ నమ్మకం తో అక్కడ ఉందో నాకు అర్తం కావడం లేదు …….. !! ఈ విషయం రాజ్ కి తెలిస్తే వాడు ఊరికే వుంటాడా అయినా మనతోనే ఆగిపోవాల్సిన ఈ గొడవలు పిల్లల దాకా వెళ్ళాయి….. ??
ఇప్పటి వరకు అన్నయ్య వదిన మధ్యనే జరిగిన గొడవ ఇప్పుడు పిల్లల మధ్య కూడా యుద్ధం ల మొదలు అవుతుంది …… !! అది నాకు ఏ మాత్రం ఇష్టం లేదు అమ్మా
నువ్వు చెప్తుంది నిజమే మానస కానీ మన చేతుల్లో ఏముంది చెప్పు ఆ పైవాడు ఏమ్ జరగాలి అని రాసి ఉంటే అదే జరుగుతుంది …… !! నువ్వు ఎక్కువ ఆలోచించకు రాజ్ కి ఫోన్ చేసి ఎప్పుడూ వస్తున్నాడో కనుక్కో …… !! వచ్చాక వాడికి మెల్లగ ఇక్కడ జరిగింది చెప్పి భూమి సంతోషంగా నే ఉందని వాడికి అబద్దం చెప్పి కొద్ది రోజులు భూమి ను కలవకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక వెళ్లి భూమి ను చూద్దాం అని చెప్దాం …… !!
ప్చ్ అమ్మా !! మనం ఎమ్ చెప్తే అది నమ్మడానికి వాడేం చిన్న పిల్లాడు కాదు పోలీస్ ఆఫీసర్ మనం చెప్పింది వాడు కచ్చితంగా నమ్మడు …… !! పైగా వాడికి మహాన్ అంటే కొంచెం కూడా మంచి అభిప్రాయం లేదు …… !! భూమి పెళ్ళి గురించి తెలిస్తే కోపంగా వెళ్ళి మహాన్ ను కొట్టిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు ….. !!
అబ్బా అలా ఎమ్ జరగదు కానీ ముందు నువ్వు కాల్ చెయ్ నీకు మాట్లాడే ధైర్యం లేకపోతే నేను మాట్లాడతాను ……. !! ముందు వాడికి ఫోన్ చేసి ఇటివ్వు నేను మాట్లాడుతాను……. !!
సరే నీ ఇష్టం అంటూ కంగారుగానే రాజ్ నంబర్ కి డయల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది మానస…… !! తమ వెనుకే మొబైల్ రింగ్ అవ్వడంతో మానస, అనసూయ బయం తో వెనక్కి తిరిగి చుడాగానే చేతిలో మొబైల్ పట్టుకుని వాళ్ళ ముందుకు వచ్చి సోఫా లో కూర్చున్న రాజ్ ను చూసి ఇద్దరికీ నోట మాట రాదు ……. !!
రాజ్ కాల్ కట్ చేసి ఎంటమ్మా అలా చూస్తున్నావ్ …… ?? ఓహ్ చెప్పా పెట్టకుండా వచ్చాననా ….. !! మీకు సర్ప్రైజ్ చేయాలని ఇలా వచ్చా అయినా ఇద్దరూ ఎంటి ఎదో దయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు ……. ??
అ… అ… అదీ ఎమ్ లేదు రాజ్ సడెన్ గా నిన్ను ఇక్కడ చూసి కొంచెం షాక్ అయ్యాం అంతే… ఏమ్మా అంతే కదా అంటూ కళ్ళతో అనసూయ కి సైగ చేస్తుంది ….. !!
హా!!! అంతే రాజ్ నిన్ను చూసి షాక్ అయ్యా వెళ్ళి ఫ్రేష్ అయి రా నాన్న నీ కోసం ఎదైనా రెడీ చేస్తాను …… !! బాగా టైడ్ అయ్యింటావ్ ఎపుడు డ్యూటీ అంటూ ఎక్కడెక్కడో తిరుగుతూనే ఉంటావ్ ……. !!
అది తర్వాత అమ్మమ్మ అంటూ చుట్టూ చూస్తు నేను వచ్చి ఇంత సేపైనా భూమి కనిపించదు ఎన్టీ …… ?? భూమి ఎక్కడ అంటూ ఇద్దరి వైపు కోపంగా చూస్తు అడుగుతాడు …… !! అది చూసిన ఇద్దరూ కంగారుగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు …… !! అడుగుతుంటే అన్సర్ ఇవ్వకుండా ఒకరిని ఒకరు కొత్తగా చూసుకుంటున్నట్టు అలా చూస్తున్నారు ఎందుకు భూమి ఎక్కడ….. ??
రాజ్ రావడం రావడమే ఎట్లిస్ట్ ఫ్రెష్ కూడా అవ్వకుండా రాగానే భూమి గురించి అడగడం తో భూమి గురించి తెలిసిందా ఏంటి అని ఇద్దరు కంగారుగా రాజ్ వైపు చూస్తూ ఉంటారు …… !! మిమ్మల్నే అడుగుతోంది భూమి ఎక్కడ అంటే దిక్కులు చూస్తారేంటి …… ?? భూమి ఎక్కడ?? నేను వచ్చి ఇంత సేపు అవుతున్నా భూమి ఎందుకు ఇంకా కిందకు రాలేదు …… ??
అది ఇంట్లో లేదురా ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్ళింది …… !! ముందు నువ్వేళ్ళి ఫ్రెష్ అయి రా మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం …… !! అంటూ రాజ్ కి ఎక్కడ భూమి గురించి తెలుస్తుందో అని కంగారుగా చెప్తుంది దేవయాని….. !!
ఫ్రెండ్స్ తో టూర్ కి వెళ్ళిందా లేక పెళ్ళి చేసుకుని శాశ్వతంగా అత్తారింటికి వెళ్ళిందా …… ?? అని అడుగుతున్న రాజ్ ను చూసి ఇద్దరూ షాక్ అవుతారు …… !!
నాకెలా తెలిసిందా అని చూస్తున్నారా …… ?? మీరెవరు నాకు భూమి మ్యారేజ్ గురించి కాల్ చేసి చెప్పలేదు ….. !! బట్ నా ఫ్రెండ్ కాల్ చేసి నా చెల్లికి జరిగిన మోసం గురించి చెప్పాడు …… !! నేను సీ.ఎమ్ మీటింగ్ కోసం సెక్యూరిటీ గా వెళ్తున్నప్పుడు పదే పదే మీకు చెప్పి వెళ్ళాను ….. !! భూమి ఆ మహాన్ విషయం లో నా మాట వినడం లేదు …… !! నేను వచ్చే వరకు తనను జాగ్రత్తగా చూస్తూ ఉండండి & ఏ ప్రాబ్లెమ్ వచ్చిన నాకు కాల్ చేయండి అని చెప్పి వెళ్ళాను …… !! కానీ మీరేం చేశారు అంటూ ఇద్దరి వైపు కోపంగా చూస్తాడు …… !!
రేయ్ భూమి మన అందరికి తెలియకుండా అది కూడా మీ మావయ్య కి తెలియకుండా పెళ్ళి చేసుకుంటుంది అని కళ్లో కూడా అనుకోలేదు రా …… !! నిజంగా అది అలా చేస్తుంది అనుకుంటే ఇంట్లో నే ఉండనిచ్చేదాన్ని ఫ్రెండ్ మ్యారేజ్ అని రిక్వెస్ట్ చేస్తేనే బయటకు పంపాను….. !!
ఇందులో భూమి తప్పు కంటే ఆ మహాన్ తప్పే ఎక్కువ ఉంది అమ్మమ్మ ……. !! అది పిచ్చిది కాబట్టీ వాడ్ని నమ్మి పెళ్ళి చేసుకుని రెండు కుటుంబాలను ఒక్కటి చేయాలి అని మనకు తెలియకుండా పెళ్ళి చేసుకుంది …… ?? కానీ వాడు భూమి ను ఎడిపించడమే పనిగా పెట్టుకుని మహారాణీ లా పెరిగిన మన భూమి ను పని మనిషి ను చెసాడు రాస్కెల్ 😬….. !!
రాజ్ ఎమ్ మాట్లాడుతున్నావ్ రా ……. ?? భూమి ను వాళ్ళు సరిగ్గా చూసుకోవడం లేదా ……. ?? అక్కడ అది బానే ఉంది కదా…… ??
సరిగ్గా కాదు కదా సాటి మనిషి లా కూడా చూడకుండా భూమి తో అడ్డమైన పనులు చేపిస్తు ఇష్టం వచ్చినట్టు కొడుతూ వాతలు పెడుతూ పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు ……. !! దీనంతటిికి కారణం ఆ మహాన్ వాడ్ని అంత ఈజీగా వదలను …… !? నాకు ఒక్క ఛాన్స్ దొరకక పోదు అప్పుడు చెప్తా వాడి సంగతి ……. !! మావయ్య కొడుకు అని కూడా చూడను ఈ విషయం లో ఎవరు చెప్పినా నేను వినను …… !! భూమి నా ప్రాణం అలాంటి తన మీద నా ముందే చెయ్ చేసుకున్నాడు ….. !! వాడ్ని ఎలా కొట్టాలో అలా కొడతా అల్రెడీ పోలిసోడి దెబ్బ కొవ్వు పట్టిన ఆ అన్నా చెల్లెలకి చూపించే వచ్చా ……. !! ఇక మిగిలింది ఆవిడే అని కోపంగా చెప్పి లోపలికి వెళ్లిపోతాడు …… !!
అమ్మా ఏంటిది వాళ్ళు భూమి ను అంత టార్చర్ పెడుతున్న అది యింకా అక్కడే ఎందుకు ఉంది ……?? దానికి ఎందుకు అంత పంతం అని ఏడుస్తూ రెండు కుటుంబాలు కలవడం ఎమో కానీ …… ?? రాజ్ మాటలు వింటుంటే పిల్లలు ఒకరిని ఒకరు చంపుకునే దాకా వెళ్లేలా వున్నారు …… !! నీకు వాడి గురించి తెలిసిందే కదా భూమి విషయం లో వాడు ఎంత దూరం అయినా వెళ్తాడు…… !! ముందు నేను భూమి ను చూడాలి అది ఎలా ఉందో ఎంటో అంటూ మానస కంగారుగా నందన ఇంటికి వెళ్ళబోతుంది ….. !!
మానస ఆగు !! ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే కార్తికేయ నే కాదు రాజ్ కోపానికి కూడా నువ్వు బలి అవ్వాలి ….. !! అక్కడికి వెళ్తే ఆ నందన నిన్ను చూసి కావాలని అయినా మన భూమి ను మరింత ఇబ్బంది పెడుతుంది…… !! కాబట్టీ నువ్వు అక్కడికి వెళ్లకపోవడమే మంచిది …… !!
అది కాదమ్మా నేను ఇప్పుడే భూమి ను చూడాలి …… !! అప్పుడే నా మనసు ప్రశాంతంగా వుంటుంది ప్లీస్ అమ్మ ఎదోటి చెయ్ ….. !! నాకున్నది ఒక్కగానొక్క కూతురు అది అలా అత్తారింట్లో కష్టాలు పడుతూ ఉంటే నేను ఇక్కడ మనశ్శాంతి గా ఎలా ఉండగలను చెప్పు ……. !! అని ఏడుస్తూ సోఫా లో కూర్చుంటుంది …… !! మనం భూమి ని ఇంటికి తీసుకుని వచ్చేద్దాం అది రాను అంటే నాలుగు పీకైనా ఇక్కడికి తీసుకుని వద్దాం ప్లీస్ అమ్మా…… !!
అనసూయ కాసేపు ఆలోచించి మానస నువ్వు అక్కడికి వెళ్తేనే కదా ప్రాబ్లెమ్ …… ?? భూమి నే బయటకి రప్పించి మాట్లాడితే ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు కదా …… !!
మానస తల పైకి ఎత్తి చూస్తూ భూమి బయటకి ఎందుకు వస్తుంది అమ్మా …… ?? వాళ్ళు భూమి ను ఒంటరిగా బయటకు ఎందుకు పంపుతారు ……. !!
అదంతా నాకు వదిలేయ్ ఇప్పుడే వస్తాను అని తన రూమ్ కి వెళ్ళి అరగంట తరువాత హాల్ లో కి వచ్చి కూర్చుంటూ ……. !! భూమి రేపు సాయంత్రం బాబా దర్శనానికి వస్తుంది అక్కడ మనం భూమీ ను కలుద్దాం & నువ్వు చెప్పినట్టు ఇక్కడికి తీసుకుని రావడానికి ట్రై చేద్దాం సరేనా ….. !!
గుడికి వస్తుందా ఎలా అమ్మా…… ?? ఎవరు చెప్పారు భూమి టెంపుల్ కి వస్తుందని అంటూ అనసూయ వైపు అయోమయంగా చూస్తూ అడుగుతుంది ….. !!
దేవయాని కి కాల్ చేసి చెప్పాను తనే తీసుకు వస్తాను అని చెప్పింది …… !! తనతో వస్తే ఎవరు భూమి మీద డౌట్ పడరు …… !! ఇక నువ్వు ఏడవకు & నువ్వు ఇలా ఏడవడం చూస్తే రాజ్ కి మరింత కోపం పెరుగుతుంది …… !! ముందెళ్ళి వాడికి టిఫిన్ పెట్టు
అలాగే అమ్మా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ రాజ్ కోసం ప్లేట్ లో బ్రేక్ఫాస్ట్ తీసుకుని పైకి వెల్తుంది మానస…… !?
భూమి గార్డెన్ లో ఉన్న అన్ని రకాల పూల తో గులాబీ లను కూడా కట్ చేసి బెంచ్ మీద కూర్చుని తన ముందు దారం కనిపించడం తో అది నందన నే పంపించి ఉంటుందని పేలవంగా నవ్వి తనకు పూల మాల కట్టడం రాకపోవడం తో మొబైల్ తీసుకుని యూ ట్యూబ్ ఓపెన్ చేసి మాల ఎలా కట్టాలో వీడియో లో చూస్తూ ట్రై చేస్తుంది …….. !! కానీ ప్రతీ సారి తనకు దారం తో ఎలా పట్టుకోవాలో రాక ప్రతీ సారి ఫెయిల్ అవుతూ పూలను వేస్ట్ చేస్తుంటుంది …….. !! అలా పది నిమిషాల పాటు ప్రయత్నించి ఈ సారి జాగ్రత్తగా వీడియో ను అబ్జర్వ్ చేసి లాస్ట్ కి సక్సెస్ఫుల్ గా పూల మాల ను ఫస్ట్ టైమ్ అయినా చాలా ఆందంగా కడుతుంది ……. !!
ఆ మాల ను చూసి మురిసిపోతూ వావ్ చాలా బాగా వచ్చింది అని దాన్ని తీసుకొని వెళ్లి కన్నయ్య కు అలంకరించి ……. !! కాసేపూ కన్నయ్య తో తన బాధని కళ్ళు మూసుకుని చెప్తూ లేదు నేను ఇలా ఏడుస్తూ కూర్చుంటే మావయ్య & అత్తయ్య ను ఎప్పటికీ కలపలేను…… !! కానీ ఎమ్ చేసి వీళ్ళను కలపాలి అని ఆలోచిస్తూ ఫస్ట్ నన్ను నేను చేంజ్ చేసుకోవాలి ఇలాగే ఉంటే వీళ్ళు నన్ను మరింత ఏడిపిస్తూ ఆనందం పొందుతారు….. !! నాకు వీళ్ళ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ బట్ ఇలా అయితే కాదు….. !! ఒక్కొక్కరినీ మార్చడానికి ఇప్పటి నుంచి ట్రై చేయాలి కానీ ఫస్ట్ ఎవరు?? అని ఆలోచిస్తూ కన్నయ్య వైపు చూసిన భూమి నవ్వుతూ థాంక్స్ కన్నయ్య మంచి దారి చూపించావు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ వచ్చి అదే బెంచ్ లో కూర్చుంటుంది …… !!
నందన తన రూమ్ బాల్కనీ లో నిల్చుని కాఫి తాగుతూ ఎటో చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నా భూమి ను చూసి సైడ్ స్మైల్ ఇస్తూ …… !! నువ్వు ఇలా నా కళ్ళ ముందు ఏడుస్తూనే ఉండాలి భూమి …… !! అప్పుడే కదా నా ఇరవై సంవత్సరాల పగ చల్లారుతుంది ….. !! అయినా నువ్విలా కాళిగా కూర్చోవడం నాకు నచ్చలేదు ….. !! అని సైడ్ స్మైల్ ఇస్తూ గార్డెన్ లోకి వెళ్తుంది …… !!
నందన ఇప్పుడు ఎమ్ చేయనుంది….. ?? భూమి తను అనుకున్నట్టు ఇంట్లో వాళ్ళను మార్చగలదా…. ?? భూమి ని దేవయాని గుడికి తీసుకుని వెళ్ళడానికి నందన ఒప్పుకుంటుందా ….. ?? రాజ్ నెక్స్ట్ ఎమ్ చేయబోతున్నాడు …… ?? నందన ప్లాన్ కార్తికేయ కి తెలియనుందా…… ??
వీళ్ళ పాస్ట్ కోసం మీరు కూడా భూమి లాగే వెయిట్ చేస్తున్నారా….. ?? చేస్తే కామెంట్స్ లో చెప్పండి….. ??