విలన్ హస్బెండ్-6

విలన్ హస్బెండ్-6

మాయ సంధ్య ఫోటో వైపు చూస్తూ నాకు నీతో ఎలాంటి బాండింగ్ లేకపోయినా యూ ఆర్ లైక్ మై ఫస్ట్ మామ్ అండ్ ఐ మిస్ యూ అమ్మ నీ బ్లెస్సింగ్స్ ఎపుడు నాకు ఉంటాయని తెలుసు .ఇపుడు ఇంకొంచెం ఎక్కువ బ్లెస్ చెయ్ అమ్మా!! ఎందుకంటే ఫస్ట్ టైమ్ అన్నయ్య కి నచ్చని పని చేయబోతున్నా,  అన్నయ్య లీడ్ చేస్తున్న లైఫ్ నాకే కాదు ఇంట్లో ఎవ రికి నచ్చడం లేదమ్మా అది నీకు కూడా తెలుసు కదా అన్నయ్య గురించి డాడ్ చాలా బాధ పడుతున్నారు బట్ డాడ్ అది బయటకు చెప్పట్లేదు.

అందుకే ఏదో ఒక ప్లాన్ చేసి అన్నయ్య కి మ్యారేజ్ చేస్తే తప్పా ఫ్లాట్ కి వెళ్ళడం ఆపడు .ఈ విషయం లో నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అని కోరుకుంటూ కళ్ళు తెరవగానే కోమలంగా నవ్వుతున్న సంధ్య మొహం వైపు చూస్తూ చిన్నగా నవ్వి వెనక్కి తిరగ్గానే రేణుక చేతిలో స్వీట్ బౌల్ పట్టుకుని ఇది మీ పెద్దమ్మ ఫోటో దగ్గర పెట్టి అందరికీ నీ చేత్తో స్వీట్ తినిపించూ అనగానే మామ్ ఎన్ని సార్లు చెప్పాలి నీకు పెద్దమ్మ అనకు తను నాకు అమ్మ అని చిరు కోపంగా చెప్పి ఆ బౌల్ తీసుకుని సంధ్య ఫోటో దగ్గర పెడుతుంది .

నువ్వు చచ్చినా వీళ్ళ అందరి గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నావ్ కదే కట్టుకున్న భర్త దగ్గర నుంచి నాకు పుట్టిన నా కూతురి వరకూ అందరూ నీకే ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు అని సంధ్య ఫోటో వైపు కోపంగా చూస్తూ అంత లోనే తను హాల్ లో ఉందని గుర్తు చేసుకుని ఫేక్ స్మైల్ ఇచ్చి తను మాయ కోసం తీసుకుని వచ్చిన గిఫ్ట్ తీసుకుని వస్తుంది.

మెయిడ్ తీసుకుని వచ్చిన మరో స్వీట్ బౌల్ తీసుకుని నవ్వుతూ రేణుక వైపు చూడగానే హ్యాపీ బర్త్డే మాయ అంటూ నుదుటన ప్రేమగా ముద్దు పెడుతూ తను కూతురి కోసం ఎంతో స్పెషల్ గా చేయించిన మెస్సికా పింక్ ప్లాటినం బ్రెస్లెట్ గిఫ్ట్ చేస్తుంది .

ఇది చాలా రేర్ పీస్ మాయ ఆ రోజు షాపింగ్ మాల్ లో ఇలాంటి షో పీస్ చూసి అది కావాలి అని అడిగావ్ కదా సో అందుకే నీ కోసం స్పెషల్ గా మలేషియా నుండి తెప్పించాను యూ నో దిస్ కాస్ట్ 45 లాక్స్ అనగానే మాయ నవ్వుతూ వావ్ థాంక్ యూ మామ్ అని హ్యాపీగా చెప్తూ వెంటనే దాన్ని ఓపెన్ చేసి అరె వాహ్ ఎంత బావుందో అని రేణుక బుగ్గన ముద్దు పెడుతూ లవ్ యూ మామ్ అని చెప్పి దాన్ని జాగ్రత్తగా క్లోజ్ చేసి ఫస్ట్ స్వీట్ రేణుక కే తినిపించాక నెక్స్ట్ వినయ్ దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చుంటుంది.

మీ మామ్ అయిపోయాక నేను కనిపించానా అని అలిగినట్టు మొహం తిప్పుకున్న వినయ్ ను చూసి నవ్వుతూ యూ ఆర్ ఆల్వేస్ మై హీరో డాడ్ బట్ నీకు ఫస్ట్ పెడితే మామ్ ఫీల్ అవుద్ది కదా అందుకే తనకు పెట్టా అని కవర్ చేస్తున్న కూతురిని చూసి ఇలా మాటలు చెప్పే మాయ చేస్తావ్ నువ్వు అని నవ్వుతూ కూతురిని దగ్గరకు తీసుకుని నిన్ను చూస్తూంటే నా సంధ్య ను చూస్తున్నట్టే అనిపిస్తుంది మాయ అంటూ ఎమోషనల్ అవుతూ మాయ ను దగ్గరకు తీసుకుంటాడు

డాడ్ ఏంటిది ఇవాళ నా బర్త్డే అయినా అమ్మ లేదు కాబట్టే నన్ను నీ దగ్గరకు పంపింది నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మరి మరీ చెప్పింది సో నువ్వు ఇలా ఏడవచ్చా చెప్పు అమ్మ దగ్గర నాకు మాట వచ్చేయదు అని వినయ్ కన్నీళ్ళు తుడిచి నోట్లో స్వీట్ పెడుతూ నా గిఫ్ట్ ఎక్కడా అని కళ్ళు ఎగరేస్తున్న కూతురిని చూసి గిఫ్ట్ కి కూడా ఇలా డిమాండ్ చేసేది నువ్వే మాయ అని చిన్నగా నవ్వి ఈవెనింగ్ పార్టీ టైం కి నీ కళ్ళ ముందు ఉంటుంది ఒకే అనగానే ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి సరే మీకు ఈవెనింగ్ వరకూ టైం ఇస్తున్నా అని చెప్పి జై కూడా స్వీట్ పెట్టబోతుంది

మాయ నోహ్ ఇంత స్వీట్ నేను తినలేను ఇందులో చాలా క్యాలరీస్ ఉంటాయి అని తను కొంచెం టేస్ట్ చేసి మిగిలింది మాయ కే తినిపించాక మెయిడ్ తో తన బెడ్ మీదున్న గిఫ్ట్ ప్యాక్ తెప్పించి మాయ చేతిలో పెడుతూ దిస్ ఈజ్ ఫర్ యూ హ్యాపీ బర్త్డే బంగారం అని మరో సారి విష్ చేసి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ కి వెళ్ళిపోతాడు

అన్నయ్య ఎమ్ గిఫ్ట్ తెచ్చావ్ అని వెళ్తున్న జై ను చూసి  ఎక్స్సైటింగ్ గా ఓపెన్ చేసిన మాయ కి కళ్ళు జిగేల్ మనేలా కనిపించిన డైమండ్ సెట్ జ్యువెలరీ ను చూసి ముందు షాక్ అయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతూ థాంక్ యూ అన్నయ్య అంటూ స్టెప్స్ ఎక్కుతున్న జై కి వినిపించేలా అరుస్తుంది.

మాయ హ్యాపీనెస్ ను చూసిన జై వెనక్కి తిరిగి చిన్న స్మైల్ ఇచ్చి తన రూమ్ కి వెళ్ళిపోతాడు మాయ తన చేతిలో ఉన్న రెండు సెట్స్ ను మెయిడ్ కి ఇచ్చి తన రూమ్ లో పెట్టమని చెప్పి ప్రతాప్ వర్మ రూమ్ వైపు వెళ్తుంది

మెయిడ్ తీసుకుని వెళ్తున్న డైమండ్ సెట్ గిఫ్ట్ ప్యాక్స్ ను చూసి ఏయ్ ఆగు అని జై ఇచ్చిన గిఫ్ట్ వైపు చూస్తూ వామ్మో చూడ్డానికి చాలా ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తున్నాయి అని ఆ సెట్ వైపు అశ్చర్యంగా చూసి వాటిని తన మొబైల్ లో పిక్ తీసుకుని మెయిడ్ ను వెళ్ళిపోమని చెప్పి తనకు తెలిసిన గోల్డ్ షాప్ ఓనర్ కి కాల్ చేసి ఫోటో పంపాక ఇవి ఎంత కాస్ట్ ఉండచ్చు అని అడుగుతుంది

రేణుక పంపిన పిక్ ను జూమ్ చేసి ఆ డైమండ్ సెట్ ఎస్టిమేట్ చేసిన అతను అప్రాక్సిమేట్లీ 2 క్రోర్స్ మేడమ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అది విన్న రేణుక బాబోయ్ 2 క్రోర్స్ ఉంటుందా జై తో ఇలాగే ఒక్కొక్కటి లాక్కుని నా కూతురికే ఎక్కువ ఆస్తి వచ్చేలా చేయాలి అని మనసులో అనుకుంటూ వినయ్ కి బ్రేక్ఫాస్ట్ చేసే టైం అవ్వడం తో తనను తీసుకుని డైనింగ్ ఏరియా కి వెళ్తుంది

మాయ ప్రతాప్ వర్మ రూమ్ లోకి వెళ్ళేసరికి ఆయన ఏవో ఫైల్స్ చూస్తూ బిజీగా ఉంటాడు అది చూసిన మాయ తాతయ్య అని డోర్ లో నుంచుని పిలవగానే మాయ వాయిస్ కి తల తిప్పి నవ్వుతూ నుంచున్న మాయ ను చూసి చిట్టి తల్లీ రామ్మా అని ఫైల్స్ క్లోజ్ చేసి మాయ ను తన పక్కనే కూర్చో పెట్టుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ అని అదే రూమ్ లో తన లాకర్ లో దాచిన ఒక గోల్డ్ బాక్స్ తీసుకుని వచ్చి మాయ చేతిలో పెడుతూ ఇది మీ నానమ్మ గోల్డ్ ఈ ఇంటి కోడలికి ఇవ్వాలి అని దాచాను .

మీ అమ్మ మీ నానమ్మ మీదున్న గౌరవం తో దీన్ని తీసుకోలేదు మీ మామ్ అవి ఓల్డ్ అయిపోయాయి నాకు వద్దు అంది అందుకే ఇవి నీకు ఇస్తున్నా మీ అన్నయ్య కి కాబోయే భార్య కోసం ఇంకొన్ని దాచాను అని నవ్వుతూ చెప్పి వాటిని మాయ చేతిలో పెడతాడు

వాటిని చూసిన మాయ ఇవాళ అందరూ మాట్లాడుకుని జ్యువలరీ ఇస్తున్నారా ఏంటి తాతయ్య అని నవ్వి ముందు ఈ స్వీట్ తిను నీకో గుడ్ న్యూస్ చెప్పాలి అని స్వీట్ తినిపించాకా ఈ అమ్మాయి ఎలా ఉంది తాతయ్య అని తన మొబైల్ ప్రతాప్ వర్మ చేతిలో పెడుతుంది.

హాఫ్ శారీ లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా జడ వేసుకుని తలలో పూలు నుదుటన కుంకుమ మెడలో సింపుల్ జ్యువలరీ తో అందంగా కనిపిస్తున్న ఆద్య పిక్ చూస్తూ చాలా లక్షణంగా ఉంది తల్లీ ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతున్న ప్రతాప్ వైపు చూస్తూ మీరు ఒకే అంటే మన ఇంటికి కోడలు అవుతుంది తాతయ్య

ఏంట్రా నువ్వు చెప్పేది అని అశ్చర్యంగా చూస్తూ ఈ అమ్మాయి ఎవరు? ఎమ్ చేస్తుంటుంది?? తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి?? ఇవేం తెలియకుండా తనే నీ వదిన అని ఎలా ఫిక్స్ అయ్యావ్

తాతయ్య అవి అన్ని చూడ్డానికి మనం బిజినెస్ చేయట్లేదు మ్యారేజ్ చేస్తున్నాం ఐ నో మ్యారేజ్ అన్నాక కొన్ని పద్దతులు ఉంటాయి మీకు 2 డేస్ లో తనకు సంబంధించిన ప్రతిదీ కనుకుంటాను ట్రస్ట్ మీ నాకు ఎందుకో అన్నయ్య కి తను పర్ఫెక్ట్ అనిపిస్తుంది.

మాయ అంత స్ట్రాంగ్ గా చెప్పేసరికి ప్రతాప్ వర్మ ఆద్య ఫోటో వైపు తీక్షణంగా చూస్తూ ఉంటాడు

 

❤️🤍❤️🤍❤️🤍❤️🤍❤️🤍

దిస్ ఈజ్ ది లాస్ట్ టైం మమ్మీ ఇంకో సారి శారీ అన్నావో అని శైలు వైపు కోపంగా చూస్తూ నేను శారీ కట్టుకోవాలి అంటే నువ్వు బాక్సర్ వేసుకోవాలి అనగానే పక్కనే కూర్చుని మొబైల్ లో రీల్స్ స్క్రోల్ చేస్తున్న మాన్య వాట్ అంటూ నవ్వు ఆపుకుంటూ ఉంటుంది 😂🤭

నీకు మాటలు బాగా ఎక్కువ అయ్యాయే ఇదంతా మీ డాడ్ గారాభమే నీకు పెళ్ళి చేస్తే అల్లుడే నిన్ను కంట్రోల్ లో పెడతాడు అంటూ మెడలో డైమండ్ బ్రైడల్ చోకర్ పెడుతూ సీరియస్ గా చెప్తుంది

ఉఫ్ మామ్ సీరియస్లీ ఇంకో సారి నాకు పెళ్ళి అన్నా, శారీ కట్టుకోవాలి అన్నా సరే నేను నీకు చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతా అపుడైన నాకు ఈ మెంటల్ టార్చర్ తప్పుద్ది అని విసుగ్గా చెప్తూ తనకు ఇయర్ రింగ్స్ పెడుతున్న శైలు వైపు చూసి తనను తాను మిర్రర్ లో చూసుకుంటుంది

మమ్మీ 😬😬 వాట్ ఇస్ దిస్ నన్ను ఎందుకు ఇంత హెవీ గా రెడీ చేసావ్ చూడు నేనెలా ఉన్నానో గుడిలో ఉన్న అమ్మవారిలా ఉన్నాను 😤 నాకు ఇంత హెవీగా రెడీ అవ్వడం నచ్చదు ఫస్ట్ ఈ చోకర్ రిమూవ్ చేయ్ మమ్మీ మాల్ లో డిస్ప్లే బొమ్మ పెడతారు గా సేమ్ అలాగే ఉన్నాను

స్టుపిడ్ అలా ఎమ్ కాదు చాలా బావున్నావ్ ముందు నువ్వు చెయ్ తీయి అని జ్యువెలరీ తీసేయడానికి ట్రై చేస్తున్న ఆద్య చేతి మీద కొడుతూ మనం ఇవాళ మీ డాడ్ బెస్ట్ ఫ్రెండ్ ఎరేంజ్ చేసిన పార్టీ కి వెళ్తున్నాం మీ డాడ్ తన ఫ్రెండ్ ను మీట్ అవ్వక 10 ఇయర్స్ అవుతుంది అట సో చాలా డేస్ తర్వాత కలుస్తున్నారు కాబట్టి మనం మన స్టేటస్ కి తగ్గట్టు వెళ్ళాలి నువ్వు ఇంకేం మాట్లాడకు అని తన నడుముకు వడ్డాణం పెడుతున్న శైలు ను సీరియస్ గా చూస్తూ వెళ్తుంది పార్టీకి పేరంటానికి కాదు నన్ను రెడీ చేసింది చాలు కానీ నువ్వు రెడీ అయి రా అని మాన్య చేతిని పట్టుకుని నువ్వు రావే దెయ్యం ఎందుకే అలా నవ్వుతున్నావ్ అని నవ్వుతున్న మాన్య ను చిన్నగా కొడుతూ అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది

ఎప్పటికీ మారుతావే నువ్వు 🤦 అని వెళ్తున్న ఆద్య ను చూసి తల కొట్టుకుంటూ శైలు తన రూమ్ కి వెళ్ళి రెడీ అయి కిందకు వెళ్లగానే ఆద్య ను చూసి మురిసిపోతూ తనకు ఇస్ క్రీమ్ తినిపిస్తూ గారం చేస్తున్న మహిదర్ ను చూసి నిట్టూర్చి దాన్ని కాదు ముందు మిమ్మల్ని అనాలి అనుకుని అయిందా తినిపించడం లేదా బిర్యానీ కుక్ చేసి తీసుకుని రానా తీరిగ్గా తిని అది అరగడానికి కోక్ తాగి వెళ్దాం

అంత వెటకారం అక్కర్లేదు శైలు అని ఆద్య మూతి కి అంటుకున్న ఐస్ క్రీమ్ క్లీన్ చేసాక నలుగురు ఒక కార్ లో పార్టీ జరుగుతున్న ప్లేస్ కి స్టార్ట్ అవుతారు

❤️🤍❤️🤍❤️🤍❤️🤍❤️

ఒక వ్యక్తి కాన్ఫరెన్స్ రూమ్ లో లైట్స్ అన్ని ఆఫ్ చేసి తన చైర్ లో కూర్చుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కొన్ని పిక్స్ వైపే సూటిగా చూస్తూ కూర్చున్నాడు. ఆ రూమ్ చూడ్డానికి చాలా పెద్దగా ఉంది తను కూర్చున్న టేబుల్ యూ షేప్ లో ఉండి బోర్డ్ మెంబెర్స్ కూర్చోవడానికి కంఫర్ట్ సీట్స్ తో పాటు వాళ్లు తమ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి స్పీకర్స్ అండ్ హై క్వాలిటీ ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ లైక్ ప్రొజెక్టర్, స్క్రీన్స్ అండ్ మైక్రో ఫోన్స్ అండ్ ప్రాపర్ లైటింగ్ తో పాటు స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ తో వండర్ఫుల్ ఇంటీరియర్ తో చూడ్డానికి చాలా రిచ్ గా ఉంది.

అతని కాన్సంట్రేషన్ మొత్తం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న పిక్స్ మీదనే ఉంది ఆ స్క్రీన్ చూస్తున్నంత సేపు అతని పెదవులు విచ్చుకునే ఉన్నాయి ఎందుకో తెలియదు ఆ పిక్స్ ను చూస్తూంటే తన హార్ట్ స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంది . కాసేపటికి అతను ఎవరికో కాల్ చేసి కాసేపు మాట్లాడాక కాల్ కట్ చేసి తన బ్లేజర్ వేసుకుని బటన్స్ పెట్టుకుని స్క్రీన్ కి దగ్గరగా నడిచి డిస్ప్లే మీద నవ్వుతున్న అమ్మాయి ఫోటో వైపు చూస్తూ ఉంటాడు సడెన్ గా అపుడే కాన్ఫరెన్స్ రూమ్ లో లైట్స్ ఆన్ అవ్వడం తో అతను సీరియస్ గా వెనక్కి తిరిగి చూస్తాడు .

ఇంకా ఎన్ని డేస్ ఇలా అజ్ఞాతం లో ఉంటావ్ రా నువ్వు రీచ్ అవ్వాల్సిన గోల్స్ అన్ని రీచ్ అయ్యావ్ ఇంకా ఎందుకు నువ్వు ముందుకు వెళ్ళకుండా ఇక్కడే ఆగిపోయావ్? నీకు వెళ్లాలి అని లేదా ఇట్స్ ఒకే ఇప్పటితో అన్ని మర్చిపోయి నీ లైఫ్ లో ముందుకు వెళ్ళు అంతే కానీ ఇలా నీలో నువ్వే బాధ పడుతూ ఎందుకు ఇంత పెయిన్ బేర్ చేస్తున్నావ్

తన బెస్ట్ ఫ్రెండ్ వైపు యారోగెంట్ లుక్స్ వదిలి స్క్రీన్ ఆఫ్ చేసాక టేబుల్ మీద ఉన్న గాగుల్స్ పెట్టుకుని కాన్ఫరెన్స్ రూమ్ బయటకు నడుస్తాడు రుద్రాన్ష్

(ఈ క్యారెక్టర్ ఎవరో కరెక్ట్ గా గెస్ చేస్తే నెక్స్ట్ అప్డేట్ లో వాళ్ళ నేమ్ వీడియో లో రివీల్ చేస్తాం ☺️ అలా అని ఒకరిని ఒకరు చూసి కాపీ కొట్టకండి 😤 మీరు చెప్పేది కరెక్ట్ అని మేము చెప్పాలి సో మీరు నిజంగా స్టోరీ ను ఫాలో అయితే మీరు గెస్ చేసింది కరెక్ట్ గా చెప్పండి 🤗 చూద్దాం ఎంత మంది గెస్ చేస్తారో 😎😎)

🤍❤️🤍❤️🤍❤️🤍❤️🤍

 

తన అన్నయ్య తీసుకుని వచ్చిన ప్రిన్సెస్ డ్రెస్ లో బ్యూటీషియన్ హెల్ప్ తో అచ్చం ఏంజెల్ లా రెడీ అవుతుంది మాయ. తనను చూసిన రేణుక నవ్వుతూ చాలా బావున్నావ్ మాయ నా దిస్టె తగిలేలా ఉందని చెవి వెనుక కాటుక పెడుతూ చిన్నగా నవ్వుతుంది

అరెరే కోడలు పిల్ల ఎంత ముద్దొస్తున్నావే నా బంగారం అంటూ అపుడే మాయ వాళ్ళు ఉన్న రూమ్ లోకి ఎంటర్ అవుతుంది మాదేష్ వైఫ్ శ్వేత విత్ హరిణి. వాళ్ళను చూసిన రేణుక నవ్వుతూ వదినా వచ్చారా రండి అని పిలవగానే శ్వేత నవ్వుతూ నా కోడలి అందం ముందు ఏ కాంతి కూడా సరిపోదు వదినా ఎంతైనా మా వాడు అదృష్ట వంతుడు అని మాయ ను హత్తుకుని హ్యాపీ బర్త్డే బంగారం అంటూ తను మాయ కోసం తీసుకుని వచ్చిన గిఫ్ట్ ప్రెసెంట్ చేస్తుంది.

గిఫ్ట్ ఎందుకు అత్త అంటూ ఇబ్బందిగా దాని వైపు చూస్తూ అయిష్టంగానే దాన్ని తీసుకుని టేబుల్ మీద పెడుతూ హరిణి ను హగ్ చేసుకుంటుంది .

అరే ఎందుకు అంటా వెంట్రా నాకు కాబోయే కోడలికి గిఫ్ట్ తీసుకుని రాకుండా ఎలా ఉంటాను చెప్పు అంటున్న శ్వేత మాటలకు అడ్డు పడుతూ మీ నిర్ణయాలను మాయ మీద రుద్దకండి తనకు ఎవరు నచ్చితే వాళ్లను చేసుకుంటుంది అయినా మాయ కి ఇపుడే పెళ్ళేంటి అని చిరాగ్గా మొహాన్ని పెట్టుకుని ఇంకో సారి కాబోయే, అవ్వబోయే లాంటి చెత్త పోలికలు పోల్చకుండా ఉంటే మీకే మంచిది అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి బంగారం ఇలా రా అని మాయ ను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జై.

జై వార్నింగ్ కి ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతున్న శ్వేత చెయ్ పట్టుకుని వదిన నువ్వు ఫీల్ అవ్వకు మాయ ఎప్పటికైనా నీకు మాత్రమే కోడలు అవుతుంది నీకు జై గురించి తెలుసు కదా వదిలేయ్ ముందు పదా వెళ్ళి గెస్ట్స్ రిసీవ్ చేసుకుందాం అని శ్వేత ను తీసుకుని వెళ్తుంది

వాళ్ల వెనుకే వెళ్తున్న హరిణి కి జై పైకి వెళ్ళడం కనిపించి బావా 😍😍 అబ్బా ఎంత బావున్నాడో అని జై వైపు చూసి మమ్మీ నాకు కాల్ వచ్చింది నేను మాట్లాడి వస్తాను మీరు వెళ్ళండి అని వాళ్ళు ఇద్దరూ వెళ్ళిపోయాక పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ జై రూమ్ ముందుకు వెళుతుంది

రూమ్ ముందు నుంచుని అటు ఇటు చూసి ఎవరు తనను చూడట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది అటుగా వెళ్తున్న మాయ అది చూసి నొసలు ముడి పెడుతూ ఇదేంటి అన్నయ్య రూమ్ లోకి వెళ్ళింది అని ఆలోచిస్తూ జై రూమ్ దగ్గరకు వస్తుంది

పార్టీ కి టైమ్ అవ్వడంతో అప్పటి వరకు ఫార్మల్స్ లో పార్టీ ఎరేంజ్మెంట్స్ ఎలా జరిగాయో అండ్ తనకు నచ్చనివి ఈవెంట్ మ్యానేజర్ తో చేంజ్ చేయించాక మొత్తం ఒక సారి చూసి పర్ఫెక్ట్ అనుకుని షవర్ చేసి సూట్ వేసుకుంటున్న జై కి తన రూమ్ లోకి వచ్చిన హరిణి ను చూసి ఏయ్ ఎప్పుడొచ్చావు అని అడుగుతున్న జై మీదకు దూకినట్టే హగ్ చేసుకుంటుంది హరిణి.

సడెన్ గా తన మీద పడ్డ హరిణి వెయిట్ ను బ్యాలెన్స్ చేసుకోలేక జై వెనుకే ఉన్న బెడ్ మీద పడ్డం తో హరిణి కూడా జై తో పాటుగా బెడ్ మీద పడిపోతుంది

అబ్బా ఏంటే ఇలా దూకావ్ ముందు లే పార్టీ కి టైమ్ అవుతుంది అని తనను తోయడానికి చూస్తున్న జై ను అడ్డుకుంటూ ప్చ్ ఆగు బావా అసలే చాలా డేస్ తర్వాత నీ దర్శనం దొరికింది కాసేపు నిన్ను కళ్ళ నిండా చూసుకోనివ్వు అని జై అందమైన రూపాన్ని తన కళ్ళ నిండా చూసుకుంటూ ఉంది.

ఏంటిది హరిణి అన్నయ్య రూమ్ లోకి వెళ్ళి ఇంత సేపైనా రాలేదు అసలేం జరుగుతుంది లోపల పైగా డోర్ కూడా లాక్ చేశారు అని విసుగ్గా ఫీల్ అవుతూ పక్కనే విండోస్ వైపు చూసి టైమ్ గాడ్ ఇవైనా ఓపెన్ లో ఉన్నాయి అని వాటిని పూర్తీగా ఓపెన్ చేసి లోపలికి చూసిన మాయ కి జై కింద పైన హరిణి కనిపిస్తారు అది చూసి షాక్ అవుతున్న తనకు జై హరిణి ను పక్కకు దొర్లించి తను హరిణి మీదకు చేరి లిప్ కిస్ పెట్టడం చూసి మరింత కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది

To Be Contineeed….