సంధ్య చనిపోయాక నా ప్రపంచం మొత్తం జై నే అయిపోయాడు మాయ యూ నో జై తో ఉన్నంత సేపు నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించేది జై కి అమ్మ లేదు అనే థాట్ రాకుండా అన్ని నేనై వాడ్ని చాలా బాగా చూసుకునే వాడిని… నాకు జై అంటే ఎంత ఇస్తామంటే జై కి ఏదైనా దెబ్బ తగిలితే నా ప్రాణం విల విల లాడేది అంత ప్రాణంగా వాడిని పెంచాను ఈ విషయం ఎపుడు జై కి కూడా చెప్పలేదు 🥹…….
నేను జై ను ఎంత ప్రేమగా చూసుకున్నా వాడు సంధ్య ను బాగా మిస్ అయ్యేవాడు తన ఫ్రెండ్స్ అందరికీ మదర్స్ ఉన్నారు తనకు లేదని జై నాతో చెప్తూ డైలీ ఏడుస్తూ ఉండే వాడు అది చూసి నాకు చాలా బాదేసేదీ …..
కన్న తండ్రి గా నేను ఎంత ప్రేమ పంచినా వాడికి తల్లి ప్రేమ కావాలి అని నాకు అర్థం అయ్యేలా చెప్పాడు మహిదర్ & నాన్న కూడా నన్ను సెకండ్ మ్యారేజ్ విషయం లో చాలా ఫోర్స్ చేశారు నా కోసం కాకపోయినా జై కి తల్లి ప్రేమను ఇవ్వడం కోసం అయినా మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాను….
నేను ఎలాంటి అమ్మాయి అయితే మా లైఫ్ లోకి రావాలి అనుకున్నానో అలాంటి అమ్మాయినే మా లైఫ్ లోకి నాన్న తీసుకుని వచ్చాడు అని చిరు నవ్వుతో రేణుక వైపు చూస్తూ రేణు నిజంగా ఏ రోజూ జై ను సంధ్య కొడుకు లా చూడలేదు తన కొడుకు లాగే చూసుకుంది…. రేణుక మంచి తనాన్ని చూసి నేను కూడా మెల్లగా తనను జై కి తల్లిగా మాత్రమే కాదు నాకు భార్యగా యాక్సెప్ట్ చేసాను & నువ్వు పుట్టాక కూడా జై మీద అంతే ప్రేమ చూపించేది ఈ విషయం లో నేను ఎప్పటికీ చాలా లక్కీ గా ఫీల్ అవుతాను….
రేణుక వినయ్ వైపు చూస్తూ ఆ జై ను అంత ప్రేమగా చూసుకుంది ఇదిగో ఇలా మీ మనసులో ప్లేస్ సంపాదించడం కోసమే అండి చూస్తూ ఉండండి ఇప్పటి వరకూ జై మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు ఎలా నటించానో అలాగే నటించి ఆ జై అంటేనే మీకు అసహ్యం పుట్టేలా చేస్తాను అని మనసులో విషపు ఆలోచనలు చేస్తూ పైకి మాత్రం వినయ్ ను చూసి చిన్నగా నవ్వుతూ ఉంటుంది అక్కడ రేణుక నిజ స్వరూపం పూర్తీగా తెలిసిన రెండు కళ్ళు మాత్రం నీ ఆటలు ఇక సాగనివ్వను అన్నట్లు చూస్తూ ఉన్నాయి… ( మరి ఆ కళ్ళు ఎవరివో గెస్ చేయగలరా గాయ్స్ 😜)
అప్పటి వరకు వినయ్ తన గురించి అలా చెప్తూ ఉంటే ఎమోషనల్ అవుతూ వినయ్ వైపు చూస్తున్న జై మొహం ఒక్క సారిగా ఎర్రగా మారి నరాలు పైకి ఉప్పొంగుతాయి ….
మీ ఇద్దరితో నా లైఫ్ ఎంతో హ్యాపీగా వెళ్తున్న టైమ్ లో జై ఎపుడైతే నాకు ఇష్టం లేని దారిలో వెళ్ళాడో అపుడే నేను సగం చచ్చిపోయాను మాయ అని బాధగా చెప్తూ జై ను మార్చాలని ఎంతో ట్రై చేశాను కానీ అది నా వల్ల కాలేదు ఆఖరికి నాకు జరిగిన యాక్సిడెంట్ కూడా జై ను మార్చలేక పోయింది …..
అందుకే చాలా సార్లు అనుకున్నా సంధ్య తో పాటు నేను ఎందుకు చనిపోలేదా అని అలా అనుకున్న ప్రతీ నా ముందు నువ్వు కనిపించేదానివి మాయ అప్పుడే ఫిక్స్ అయ్యాను నాకు ఉన్నది కూతురు మాత్రమే అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను ఇపుడు నాకున్న బాధ్యత నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయడమే మాయ అని కటినంగా చెప్పడం చూసి అక్కడున్న అందరూ షాక్ అయితే రేణుక కళ్ళు మాత్రం మతాబుల్లా వెలిగిపోతూ ఉంటాయి….
అది విన్న జై మొహం కోపంతో ఎర్రబడి మొహాన్ని మరింత రౌద్రంగా మార్చేస్తాయి…. అక్కడ జై కి ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించడం లేదు అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి పైకి లేవబోతున్న జై చేతిని ఇటుగా కూర్చున్న అమర్ పట్టుకుని జై పైకి లేవకుండా పట్టుకుంటూ ఆపేస్తాడు ….
అమర్ చేయి వదలరా నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అని లేదు ఐ వాంట్ టు గో అంటూ చిన్నగా చెప్పినా చాలా సీరియస్ గా వినిపిస్తుంది జై వాయిస్….
ఏంట్రా ఇదంతా కోపమే అయినా ఇప్పుడు నీకు ఎందుకు ఇంత కోపం వస్తుంది హా…. ఇప్పటికే అంకుల్ కి నీకు అందనంత దూరం వచ్చింది ఆ దూరాన్ని ఎలా తగ్గించాలి అని చూడకుండా ఇంకా పెంచుతాను అంటావెంట్రా…. ??
షట్ అప్ అమర్ నా సిచుయేషన్ లో ఉండి చూడు నా పెయిన్ ఎలా ఉందో నీకు కూడా తెలుస్తుంది మనం ఇష్టపడ్డ పర్సన్ మనల్ని హేట్ చేస్తుంటే ఆ పెయిన్ మాటల్లో చెప్పలేం నాకు ఎంత పెయిన్ గా ఉందో అంతే కోపంగా కూడా ఉంది లెట్ మీ గో అమర్…..
జై నీ పెయిన్ నేను ఫీల్ అవ్వగలను బట్ …., అంకుల్ మాటల్లో నీకు ఆయనకు నీ మీదున్న కోపం కనిపిస్తే నాకు నీ మీదున్న ప్రేమ కనిపిస్తుంది రా…. ప్లీస్ రా ఇక నీ అలవాట్లు అన్ని మానేసి మీ డాడ్ కి నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయి ఈ ఏజ్ లో ఆయనకు కావాల్సింది మెంటల్ పీస్ అది నువ్వు చేంజ్ అయితే తప్పా ఆయనకు దొరకదు ఇక ఆ తర్వాత నీ ఇష్టం…. అలాగే ఇప్పుడు మాత్రం నువ్వు కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంకుల్ ఇంకా బాధ పడతారు నీకు ఆయన ఫీలింగ్స్ అక్కర్లేదు అనుకుంటే వెళ్ళిపో జై నేను కూడా నిన్ను ఆపను అంటూ జై చేతిని వదిలి నార్మల్ గా కూర్చుంటాడు….
అమర్ మాటలకు లేవబోతున్న జై అక్కడే ఆగి వినయ్ వైపు చూస్తాడు సరిగ్గా అపుడే వినయ్ కళ్ళు తన వైపు బాధగా చూస్తూ కనిపించడం చూసిన జై కాసేపు అలాగే చూసి మొహాన్ని నార్మల్ గా పెట్టుకుని కష్టంగా అక్కడే వినయ్ కోసం కూర్చుంటాడు జై…..!
ఏంట్రా వినయ్ ఎందుకలా చెప్పావ్ జై
గురించి నీకు నచ్చని వే లో జై వెళ్ళడం ఏంటి?? జై గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు బట్ తన ఫాదర్ గా నువ్వెంట్రా ఇలా అంటూ వినయ్ చెయ్ పట్టుకుని నెమ్మదిగా అడుగుతాడు….
జై గురించి నువ్వు విన్నది ఒక వైపు మాత్రమే మహిదర్ బట్ వేరే వైపు వింటే జై ను ఎంతో అభిమానిస్తున్న నువ్వే వాడిని అసహ్యించుకుంటావ్ అంటూ విరక్తి నిండిన నవ్వుతో చెప్తాడు…..
వినయ్ ప్లీస్ అలా మాట్లాడకు రా నీ కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటే తెలుస్తుంది జై అంటే నీకు ఎంత ప్రేమో ఇంత ప్రేమ జై మీద పెంచుకుని ఎందుకలా జై బాధ పడేలా మాట్లాడావ్???
కావాలనే మాట్లాడా అంటూ సూటిగా చూస్తూ చెప్తున్న వినయ్ ను చూసి మహిదర్ కను బొమ్మలు ముడి పడతాయి….
అసలేం మాట్లాడుతున్నావ్ వినయ్ కావాలని మాట్లాడడం ఏంటి నువ్వేం అంటున్నావో నాకు అర్థం అవ్వడం లేదు….
జై కి నేనంటే చాలా ఇష్టం మహి వాడు నాకు నచ్చని దారిలో వెళ్తున్నప్పుడే జై తో మాట్లాడం మానేశాను అయినా జై లో చేంజ్ రాలేదు అందుకే నేను ఇలా కావాలని మాట్లాడాను ఇలా అయినా జై లో చేంజ్ వస్తుందని చిన్న ఆశ నిజానికి నాకు మాయ కంటే జై అంటేనే ఇష్టం ఎక్కువ ఎందుకంటే వాడు మా ప్రేమకు ప్రతిరూపం రా అలాంటి వాడిని నేను ఎలా అసహ్యించుకుంటాను చెప్పు 🥹🥺
రిలాక్స్ వినయ్ నువ్వు జై విషయం లో దేని గురించో బాగా డిస్టర్బ్ అయ్యావ్ ఇట్స్ ఒకే అన్ని సర్దుకుంటాయి ముందు వాటర్ తాగు అని వినయ్ ను తన మాటలతో డైవర్ట్ చేసిన మహిదర్ జై గురించి ఎలా అయినా ప్రతాప్ వర్మ తో మాట్లాడాలి అని డిసైడ్ అవుతాడు….
చూసావా మాన్య వీడు ఎంత వెధవ కాకపోతే పాపం మామ ఇలా అందరిలో బరస్ట్ అవుతాడు…. నేను వీడని చూసినపుడే అనుకున్నా వీడికి క్యారెక్టర్ లేదని ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది అని జై కి వినిపించకుండా మాన్య తో చెప్తుంది ఆద్య…..
నాకు అదే షాకింగ్ గా ఉంది ఆద్య జై ను చూసినపుడు నాకు కూడా తనో ప్లే బాయ్ లా అనిపించాడు ఈ విషయం లోనే ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చుంటుంది అనుకుంటాను…??
ఇంకా అనుకోవడం ఎంటే పిచ్చి ఇక్కడ ఇంత క్లారిటీ గా కనిపిస్తూ ఉంటే నేను ఆల్రెడీ వీడి గురించి విన్నా నచ్చిన ప్రతీ అమ్మాయితో డేట్ చేస్తాడట వీడు 😏😏 యూ నో వీడు ఎంజాయ్ చేయడం కోసమే ఒక ఫ్లాట్ కూడా బై చేసి డెయిలీ వీడి గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడట నా ఫ్రెండ్ ఒకడికి వీడు తెలుసు సో నాకు వాడే చెప్పాడు…..
అవునా మరి ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావ్??? నాకు తెలియని & నీకు తెలిసిన ఆ ఫ్రెండ్ ఎవడే???
అబ్బా సంతోష్ నే బాబు 🤷🤷 నాకు వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సి. ఈ. ఓ. గురించి చెప్పాడు నాకేం తెలుసు వాడే వీడని ఈ విషయం నాకు ఇందాకే గుర్తొచ్చింది….
వామ్మో జై మామూలోడు కాదే బాబు రోజు కి ఒక గర్ల్ ఫ్రెండ్ అంటే మాటల అంటూ జై వైపు షాకింగ్ గా చూస్తూ అంటుంది….
వాడేమైనా స్వామీ వివేకానంద అనుకుంటున్నావా 😏😏 అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావ్ అని జై వైపు కోపంగా చూస్తూ వాడో రోగ్, రోమియో & ఫాల్తూ గాడు వీడు ఇదే కంటిన్యూ చేస్తే ఏదో రోజూ ఎయిడ్స్ వచ్చి చస్తాడు వెధవ 😌🥲….
ఆద్య నాకు తెలిసి ఇవాళ మాల్ లో కనిపించిన అమ్మాయి కూడా మాయ చెప్పినట్టు జై ఫ్రెండ్ కాదు జై గర్ల్ ఫ్రెండ్ అయ్యుంటుంది….
హహ 😅 అది నాకు అక్కడే తెలుసు ఎంతైనా మాయ కి అన్నయ్య కదా అన్నయ్య ఎంత బేవర్స్ అయినా మా అన్నయ్య బేవర్స్ అని ఏ చెల్లి చెప్పదు అందుకే మన ముందు అలా కవర్ చేసింది….
హ్మ్మ్….. !!! అంతే కదా అని ఇద్దరూ జై గురించి డిబేట్ పెట్టుకొంటూ జై, అమర్ మీద జోక్స్ వేస్తూ వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు …..
అందరూ ఎవరి ప్లేసెస్ లో వాళ్లు కూర్చోకుండా ఆధ్య, మాన్య పక్కకు & అమర్ జై పక్కన మరో వైపు వినయ్, మహీదర్ ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటున్న అందరినీ చూసిన మాయ గాయ్స్ ఇక మీ మాటలు అయిపోతే తిరిగి గేమ్ స్టార్ట్ చేద్దాం అందరూ చిల్ మూడ్ లోకి వచ్చేయండి అని మళ్ళీ సాంగ్స్ ప్లే చేస్తుంది…..
మాయ మాటకు ఎవరి ప్లేసెస్ లోకి వాళ్లు వెళ్ళి సెటిల్ అవుతారు 😌 🫣 నెమ్మదిగా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే ఆ మెలోడీ మ్యూజిక్ కి డిస్టర్బ్ గా ఉన్న వినయ్, జై లకు కూడా ప్లెజెంట్ ఫీల్ రావడం తో అందరితో పాటు వీళ్ళు కూడా మ్యూజిక్ ను హమ్ చేస్తుంటారు….
మాయ అలా బ్యాక్ టు బ్యాక్ 3 సాంగ్స్ ప్లే అయ్యాక బౌల్ లో నుండి ఒక స్లిప్ తీస్తుంది అందులో ఎవరి నేమ్ ఉందా అని అందరూ ఎక్స్సైట్మెంట్ తో చూస్తూ ఉంటే మాయ నెమ్మదిగా ఆ స్లిప్ ఓపెన్ చేసి అందులో నేమ్ చూసి నవ్వుతూ ఇట్ ఇస్ అమర్ అన్నయ్య అనగానే అందరూ నవ్వుతూ అమర్ వైపు చూస్తారు ఒక్క మాన్య తప్పా…..
అమర్ నవ్వుతూ పైకి లేచి మిడిల్ లో నుంచుని ఇపుడు నేను ఎమ్ చేయాలి మాయ అని తన వైపు చూస్తాడు….
మాయ నవ్వుతూ సింపుల్ అన్నయ్య ఇక్కడ ఉన్న గర్ల్స్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసుకుని తనతో సాల్సా డాన్స్ చేయాలి అనగానే అది విన్న ఆద్య, మాన్య ఒకరిని ఒకరు కంగారుగా చూసుకుంటారు….
గార్డెన్ లో సాల్సా డాన్స్ 🤦 నీ థాట్ కి హాట్స్ ఆఫ్ మాయ అని ఆద్య వెటకారంగా అంటున్న మాయ తనలో తానే నవ్వుకుంటూ ఆద్య వైపు నవ్వుతూ చూసి తనకు అమర్ తో జరిగిన డిస్కషన్ గుర్తు చేసుకుంటుంది….
స్లిప్స్ ప్రిపేర్ చేస్తున్న తన ముందుకు వచ్చి కూర్చున్న అమర్ వైపు చూస్తూ ఏంటి అన్నయ్య ఇలా వచ్చావ్ నేను ఏం రాస్తున్నానో చూసి అన్నయ్య కి లీక్ చేయడానికా అని ఆ స్లిప్స్ అమర్ చూడకుండా దాస్తూ అడుగుతుంది…..
అబ్బా మాయ నేను ఎందుకు అలా చేస్తాను జై ను ఆడుకునే ఛాన్స్ నేను ఎందుకు మిస్ చేస్తాను….?? నేను వచ్చింది అందుకు కాదు నువ్వు నాకొక హెల్ప్ చేయాలి రా ప్లీస్ నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు ☹️☹️
ఏంటి అన్నయ్య బిస్కెట్స్ వేస్తున్నావ్ ఏంటి సంగతి 🧐🤔🤔
అది మాయ మరేంటంటే నాకు మాన్య అంటే ఇష్టం బట్ దానికే నేనంటే ఇష్టం లేదు నువ్వు ఏదో ఒకటి చేసి మా మధ్య ప్రేమ అనే విత్తనాన్ని నాటితే మాకు పుట్టే పాప కి నీ పేరే పెట్టుకుంటా మాయ ప్లీస్
అప్పుడే పిల్లలు వరకు వెళ్ళిపోయావా 🤦😂 సరే సరే సెంటిమెంట్ తో లాక్ చేశాక ఇంకేం చేస్తా కచ్చితంగా హెల్ప్ చేస్తాను అని కావాలని సాల్సా డాన్స్ అని రాస్తుంది అది గుర్తు రాగానే మాయ నవ్వుతూ అమర్ వైపు చూసి కన్ను కొడుతుంది అది చూసిన అమర్ కూడా నవ్వుతూ ఐ వింక్ చేసి మాన్య వైపు చూస్తాడు…..
నెక్స్ట్ ఎమ్ జరగబోతుంది అంటారు 😜😜 మన మాన్య పాప అమర్ తో సాల్సా డాన్స్ చేస్తుందా??? లేక హ్యాండ్ ఇస్తుందా గెస్ చేసి కామెంట్స్ చేయడం మర్చిపోకండి 🫣🫣 అలాగే లేట్ గా అప్డేట్ ఇస్తున్నందుకు సారి 🥰🥰 ఇక ముందు ఇలా డిలే అవ్వకుండా చూసుకుంటాం మీ లవ్ & సపోర్ట్ కి చాలా థాంక్స్ ♥️🥹 ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా 🤍🤍 నేను, శ్రావణి చాలా కష్టపడుతున్నాం సో మాకు మీ లవ్ చూస్తే చాలు మేము పడ్డ కష్టం మొత్తం వెళ్ళిపోతుంది ☺️♥️
TO BE CONTINUEED…………………………….