విలన్ హస్బెండ్ -14

విలన్ హస్బెండ్ -14

జై ఆద్య వైపు యాటిట్యూడ్ గా చూస్తూ గుడ్ ఆ మాత్రం భయం ఉండాలి అని సేమ్ లుక్స్ మెయింటైన్ చేస్తూ తను ఓ గ్లాస్ తీసుకుని మరో గ్లాస్ అమర్ చేతికి ఇవ్వడం చూసిన ఆద్య నవ్వు ఆపుకుంటూ ఉంటుంది వెనుకే వచ్చిన మాన్య కూడా అమర్ జ్యూస్ తాగడం చూసి యస్ వీడికి ఇపుడు ఉంటది సినిమా లేకపోతే నన్నే పూల్ లో పడేస్తాడా తాగరా తాగు అది నువ్వు కొంచెం సిప్ చేసిన చాలు అప్ అండ్ డౌన్ ఆదరడం కన్ఫర్మ్ అని నవ్వుతూ వాళ్ళు చూడకుండా ఆద్య కి హై – ఫై ఇచ్చి ఎమ్ తెలియనట్టు కామ్ గా నుంచుంటారు…

ఇవేమీ తెలియని జై & అమర్ జ్యూస్ గ్లాస్ వైపు చూసి ఇంకొంచెం గ్లామర్ పెంచుకుందాం అనుకుని ఇద్దరూ కొంచెం సిప్ చేయగానే మంట నషాళానికి అంటడం తో పాటుగా ఇద్దరికీ కళ్ళల్లో నుండి నీళ్ళు ముక్కు లో నుండి పొగలు కూడా వచ్చి ఇద్దరి మొహాలు ఎర్రగా మారిపోతాయి అది చూసిన ఆద్య, మాన్య మరో సారి ఎవరు చూడకుండా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నవ్వుకుంటూ ఉంటారు…

అబ్బా మంట…. మంట…. అని ఇద్దరు ఆ గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి కిచెన్ లోకి పరిగెత్తి వాటర్ మొత్తం తాగేసి ఫ్రిడ్జ్ నుండి కాస్త స్వీట్ తీసుకుని తిని కాస్త రిలీఫ్ అవుతారు 😌

ఈ లోపు మన ఇంటెలిజెంట్ అమ్మాయిలు ఎవరు చూడకుండా ఆ గ్లాసెస్ మార్చేసి నిజంగానే రెడ్ యాపిల్ జ్యూస్ పెట్టేసి ఎమ్ తెలియనట్టు అలాగే నుంచుని చూస్తూ ఉంటారు…

( వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యి అందరి ఇంటెన్షన్ వాళ్ళ వైపు తిప్పేలా చేస్తారని ముందే గెస్ చేసిన ఆద్య మాన్య తో యాపిల్ జ్యూస్ తీసుకుని రమ్మని చెప్పి వాళ్ళు అలా వెళ్లగానే ఆ గ్లాస్ లో ఉన్న జ్యూస్ ను పక్కనే ఉన్న ప్లాంట్ లోకి వంపేసి అందులోకి మాన్య ను అడ్డుగా ఉండమని చెప్పి ఎవరు చూడకుండా జ్యూస్ రీప్లేస్ చేసింది 🥱😝)

 

ఒసేయ్ డెవిల్ నేను వాటర్ అడిగితే యాపిల్ జ్యూస్ అని చెప్పి చిల్లీ పౌడర్ మిక్స్ చేస్తావా అని కోపంగా అరుస్తూ హాల్ లోకి వస్తాడు జై

రేయ్ జై అది యాపిల్ జ్యూస్ కాదు రా రెడ్ యాపిల్ జ్యూస్ అని చెప్పి మనకు ఇచ్చి మనల్ని ఫూల్స్ ను చేసి తాగించారు అని ఏడుపు మొహం పెట్టుకుని ఉక్రోషంగా మాన్య వైపు చూస్తూ చెప్తాడు వెనుకే వచ్చిన అమర్

అసలే మండిపోయి ఉన్నా ఇపుడు కరెక్షన్స్ అవసరమా 🤨🤨 అని అమర్ కి సీరియస్ లుక్స్ వదిలి చెప్పవే దెయ్యం ఎందుకు చిల్లీ పౌడర్ కలిపావ్ అంటూ కోపంగా ఆద్య జుట్టు పట్టుకుని లాగుతాడు ( మన ఆద్య పాప బెడ్ రూమ్ లో లాగింది గుర్తు చేసుకుంటూ కొంచెం గట్టిగానే లాగుతున్నాడు మనోడు 😌)

 

రేయ్ ఇడియట్ వదులు అని జై చెయ్ పట్టుకుని గట్టిగా కొరికేసి తన జుట్టు ను విడిపించుకుని జై వైపు కోపంగా చూస్తుంది

చచ్చావే నా చేతిలో అని ఆద్య ను పట్టుకోవడానికి జై అడుగులు ముందుకు వేయడం తో అమ్మో….. !!! అంటూ జై కి అందకుండా పరిగెడుతూ ఆద్య జై ను హాల్ మొత్తం తిప్పించి మరీ గార్డెన్ వైపు పరుగులు పెడుతుంది

వాళ్ల గొడవను పెద్ద వాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉంటే వాళ్ళతో పాటు నవ్వుతున్న మాన్య ను చూసి నువ్వంటే హీరోయిన్ లా తెగ నవ్వుతున్నావ్ నా నోరు మండేలా చేసావ్ కదా చూడు నిన్నేం చేస్తానో అని అమర్ తన చెయ్ పట్టుకోవడానికి రావడం చూసి నువ్వెంట్రా నన్ను పట్టుకునేది అని వెనుక వస్తున్న మెయిడ్ మీదకు అమర్ ను నెట్టేసి తనను వెక్కిరిస్తూ మాన్య కూడా గార్డెన్ లోకి పరుగు అందుకుంటుంది…..

తన మీద పడ్డ అమర్ ను చూసి భయం తో ఏడుస్తున్న మెయిడ్ కి సారి అండి వాంటెడ్ గా కాదు ఆ దెయ్యం నన్ను పుష్ చేసింది అని 25 సంవత్సరాల మెయిడ్ కి సారి చెప్పి మాన్య ను తిట్టుకుంటూ తను కూడా గార్డెన్ లోకి వస్తాడు

వీళ్ళ అరుపులు విన్న రేణుక, శైలు కూడా హాల్ లోకి వచ్చి వీళ్ళ గొడవను చూసి మగవాళ్ళతో కలసి వీళ్ళ గొడవను ఆపడానికి గార్డెన్ వైపు వెళతారు

మర్యాదగా దొరకవే లేదా నా చేతిలో అయిపోతావ్ అని వార్నింగ్ ఇస్తూ తనను పట్టుకోవడానికి ట్రై చేస్తున్న జై ను చూసి వెనక్కి తిరిగి దమ్ముంటే నన్ను క్యాచ్ చెయ్ రా అని అంటూ ఉండగానే జై చేతికి ఆద్య దొరకడం ఇద్దరు వాదులాడుకుంటూ స్లిప్ అయ్యి దబేల్ మంటూ పూల్ లోకి పడ్డం సెకండ్స్ లో జరిగిపోతాయి

ఆ…ఆ… ఆ… ఆ …!! అని అరుస్తూ ఇద్దరూ ఒక్క సారిగా పూల్ లోకి పడ్డం తో జై చేతులు ఆద్య నడుము చుట్టూ ఆద్య చేతులు జై మెడ చుట్టూ చుట్టుకుంటాయి ….

ఇద్దరూ నీళ్లలో నుండి బయటకు వచ్చి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు మగసిరి ఉట్టిపడే మీస కట్టుతో హాజెల్ గ్రీన్ ఐస్ తో జై చాలా హ్యాండ్సం గా కనిపిస్తూ ఉంటే ఆద్య వొంటికి అంటుకుపోయిన డ్రెస్ లో తన బాడీ మెసర్మెంట్స్ పెర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంటే తన చేప కళ్ళను రెప రేపలాడిస్తూ జై వైపు డీప్ గా చూస్తూ ఉంటుంది….

ఇద్దరు ఒకరిని ఒకరు అతుక్కుని ఉన్నది కూడా మర్చిపోయి అలా ఎంత సేపు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారో వాళ్ళకే తెలియదు ( ఇక్కడ ఒక సిచుయేషన్ సాంగ్ ప్లే అయితే బలే ఉంటుంది కదా ఏమంటారు గాయ్స్ 😜 అలాగే సాంగ్ కూడా మీరే డెడికేట్ చేయండి 🤭)

వామ్మో ఏంటిది ఇప్పటి వరకూ ఇద్దరూ పిచ్చి పట్టినట్టు ఒకరిని ఒకరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుని ఇపుడేంటి అమర ప్రేమికుల్లా ఒకరిని ఒకరు అలా చూసుకుంటున్నారు 😲😲 కొంపదీసి ఈయన అన్నట్లు ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారా ఏంటి అదే జరిగితే ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది 🙆🙆 లేదు అలా జరగకూడదు ఈ జై ఎప్పుడూ ఈయనకు నచ్చని కొడుకు గానే మిగిలిపోవాలి అప్పుడే కదా నా కూతురు ఈయనకు దగ్గర అవుతుంది వాడు దూరం అవుతాడు అని కన్నింగ్ గా అనుకుంటూ మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది….

వీళ్ళ గొడవను ఎలా ఆపాలి అని వెనుక వచ్చిన పెద్ద వాళ్ళు కూడా వీళ్ళ పొజిషన్ చూసి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు 😳😳

ఒసేయ్ ఆగవే పరిగెత్త లేకపోతున్నా ఎమ్ తింటున్నావే దెయ్యం అలా పి. టి. ఉష లా పరిగెడుతున్నావ్ వామ్మో నా వల్ల కాదు అని ఆగిపోయి ఆయాస పడుతున్న అమర్ ను చూసి నవ్వుతూ అందుకే రా డెయిలీ జిమ్ చేయాలి అపుడే ఫిట్ గా ఉంటారు అయినా అమ్మాయిని నన్నే పట్టుకోలేక పోతున్నావ్ నువ్వేం అబ్బాయివి రా అని కావాలని అమర్ ను రెచ్చగొడుతుంది మాన్య 😜

మాన్య వైపు కోపంగా చూస్తూ నన్ను అంత మాట అంటావా చచ్చావే ఇవాళ అని కోపంగా తన వైపు వచ్చిన అమర్ ను చాలా తెలివిగా పూల్ లోకి నెట్టి టిట్ ఫర్ టాట్ నాతో పెట్టుకోకు అని నవ్వుకుంటూ ఉంటుంది మాన్య…

అమర్ పూల్ లోకి పడగానే ఆ శబ్దానికి జై, ఆద్య దూరం జరిగి ఒకరిని ఒకరు కోపంగా చూసుకుని తిట్టుకుని కొట్టుకుని ప్రతాప్ వర్మ తిట్టడం తో ఇద్దరూ చెరో రూమ్ కి ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళిపోతారు వెనుకే అమర్ మరో రూమ్ కి మాన్య వైపు చూస్తూ వెళ్ళిపోతాడు

జై, అమర్ కోసం వినయ్ ఇద్దరికీ డ్రెస్ తెప్పించడం తో ఇద్దరూ ఫ్రెష్ అయి ఆ డ్రెస్ లోకి చేంజ్ అయి తిరిగి హాల్ లోకి వచ్చి వీళ్ళను ఎలా ఏడిపించాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు

ఇక్కడ కింద ఇంత జరుగుతూ ఉంటే పైకి వచ్చిన మాయ ఒక్కో రూమ్ ను చూస్తూ చివరగా ఒక రూమ్ దగ్గర ఆగిపోతుంది ఆ రూమ్ డోర్ మీద అందంగా కనిపించిన అక్షరాల వైపు ప్రేమగా తడుముతూ ఉంటుంది… HARSHA అన్న పేరు చూడగానే మాయ కళ్ళు ఆటోమేటిక్ గా నీళ్ళతో నిండుకుంటాయి 🥹🥹

( చాలా మంది హర్ష ఎవరో గెస్ చేయమంటే చాలా కరెక్ట్ గా గెస్ చేశారు యస్ మీరు అందరూ గెస్ చేసినట్టు హర్ష ఆద్య బ్రదర్ 😌)

డోర్ హ్యాండిల్ మీద చెయ్ వేసి డోర్ ఓపెన్ చేసిన మాయ కి 10 సంవత్సరాల హర్ష పిక్ అందంగా నవ్వుతూ కనిపించడం తో జీవం లేనట్టు నడుస్తూ ఆ ఫోటో ముందు నుంచుని నువ్వు నవ్వుతూ నన్ను బాగా ఏడిపిస్తున్నావ్ హర్ష 🥹 ఎందుకు రా నన్ను వదిలి వెళ్ళిపోయావ్ అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్… ఎలా ఉన్నావ్… అసలేం చేస్తున్నావ్…. నేను ఇంకా గుర్తున్నానా లేక మర్చిపోయి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావా

నువ్వు అలా చేస్తే మాత్రం దాన్ని చంపేసి అయినా నిన్ను నా వాడ్ని చేసుకుంటా అని ఏడుస్తూనే నవ్వుతూ ఆ రూమ్ లోని ప్రతీ వస్తువు మీద హర్ష స్పర్ష తెలుస్తూ ఉంటే అలాగే అక్కడే అరగంట పాటు కూర్చుని హర్ష జ్ఞాపకాలతో గతం లోకి వెళ్ళిపోయి వినయ్ కాల్ చేసి కిందకు రమ్మనే వరకూ అలాగే ఉండిపోతుంది ….

డ్రెస్ చేంజ్ చేసుకుని మిర్రర్ ముందు కూర్చుని హెయిర్ డ్రై చేసుకుంటున్న ఆద్య ను చూసి ఏంటి మేడం స్విమ్మింగ్ పూల్ లో అలా జై వైపు చూస్తూ ఉండిపోయావ్ కొంపదీసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆఆ???

ఫస్ట్ సైట్ కాదు సెకండ్ నైట్ కాదు అయినా ఆ ఫాల్తూ గాడ్ని నేను లవ్ చేయడమా నెవర్ వాడ్ని మాత్రమే కాదు ఈ ఆద్య ఎవరిని లవ్ చేయదు నేను ఎప్పటికీ సింగిల్ గానే ఉండిపోతా నువ్వు నా గురించి ఆలోచించడం ఆపి మన ప్రాజెక్ట్ గురించి థింక్ చెయ్ అని సీరియస్ గా చూస్తూ అంటుంది….

హ్మ్మ్…..!!! ఇలా అన్నవాళ్లే పాప పుసుక్కుని లవ్ లో పడి త్వరగా పప్పన్నం పెట్టేస్తారు నీకు కూడా అదే థాట్ ఉందేమో నన్ను, జై ను అన్నయ్య గా ఫిక్స్ అవ్వమాంటావేమో అని ముందుగానే అడుగుతున్నా

పుసుక్కుని కాదు కదా కసుక్కున కూడా లవ్ లో పడను వాడ్ని అన్నయ్య అని కాకపోతే ఆంబోతు అని పిలువ్ నాకేంటి అని రెక్లెస్ గా చెప్పి వాడ్ని వాడి ఓవర్ యాక్షన్ ను భరిస్తుంది కేవలంతాతయ్య ,మావయ్య, మాయ ల కోసమే… !

ఆద్య నాకో డౌబ్ట్ వినయ్ అంకుల్ , ప్రతాప్ తాతయ్య అండ్ మాయ అందరూ కూడా చాలా బాగా మాట్లాడుతారు బట్ రేణుక ఆంటీ ఎంటే ఎప్పుడూ అలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది మాట్లాడినా కూడా ఏం రియాక్ట్ అవ్వదు ఆవిడకేమైనా స్క్రూ లూసా ఏంటి 🤭

హహ 😅 అదేం లేదు మాన్య ఆంటీ కొంచెం రిజర్వ్డ్ & కొద్దిగా స్టేటస్ పిచ్చి ఆవిడ కి తన పుట్టిల్లు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం సో వాళ్ళతో మాత్రమే ఫ్రీగా ఉంటుంది మొన్న చూసే ఉంటావ్ కదా ఆంటీ బ్రదర్ వైఫ్ & డాటర్ వచ్చారు పార్టీ కి సో ఆంటీ కి వాళ్లంటేనే చాలా ఇష్టం

హు 😏 ఏంటో ఆవిడ ను చూస్తేనే నాకు నెగెటివ్ వైబ్స్ వస్తాయి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో టైప్ 🤦

అబ్బా వాళ్ళు ఉండేది ఇవాళ 🤷 ఏదో లైఫ్ టైమ్ వాళ్ళతో కలిసే ఉండాలి అన్నట్లు ఎంటే నువ్వు నీ రియాక్షన్ పదా కిందకు వెళ్దాం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు

ఏమో చెప్పలేం నువ్వు వాళ్ళతో లైఫ్ టైమ్ కలిసే ఉండాల్సి వస్తే రేణుక ఆంటీ తో అడ్జస్ట్ అవ్వగలవా

నీకు పిచ్చి బాగా ఎక్కువైంది కానీ నోరు మూసి పదా అని మాన్య నోరు మూసి కిందకు తీసుకుని వెళ్ళేసరికి అందరూ లంచ్ కి కూర్చుంటూ ఉంటే వీళ్ళు కూడా వాళ్ళతో జాయిన్ అవుతారు…

ఆద్య వెళ్ళి మాయ పక్కన కూర్చోగానే మాయ నవ్వుతూ ఆద్య తో మాట్లాడుతూ తన లంచ్ చేస్తూ ఉంటుంది ఇటు జై మాత్రం ఆద్య ను ఎలా ఏడిపించాలి అని ప్లాన్స్ వేస్తూ లంచ్ చేస్తూ ఉంటాడు

బుద్దిగా తింటున్న మాన్య ను చూసి తినవే తిను ఇంకో వన్ వీక్ లో నీకు భయంకరమైన షాక్ ఇవ్వబోతున్న వాటికి ప్రిపేర్డ్ గా ఉండు అని నవ్వుకుంటూ తను కూడా లంచ్ చేస్తూ ఉంటాడు

ఆద్య ప్రతాప్ కి బాగా నచ్చుతుంది తను పెద్దలకు ఇచ్చే రెస్పెక్ట్ & మహిదర్ వల్ల ఆద్య బిజినెస్ లో ఎలా సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తుందో తెలుసుకుని ఆద్య తెలివికి ఇంప్రెస్ అవుతాడు….

జై కి ఆద్య అయితేనే పర్ఫెక్ట్ అని బలంగా ఫిక్స్ అవ్వడం తో ఆద్య కి ఏమైనా మ్యాచ్ చూస్తున్నారేమో అని డౌబ్ట్ రావడం తో నెమ్మదిగా మహిదర్ వైపు చూస్తూ నోరు విప్పుతాడు

మహిదర్ ఆద్య కి మ్యారేజ్ ఏజ్ వచ్చింది కదా సో ఆద్య కి మ్యాచెస్ ఏమైనా చూస్తున్నారా అని తనే తన డౌబ్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు

తాతయ్య ఏంటి సడెన్ గా నా మ్యారేజ్ గురించి అడుగుతున్నారు అనుకుంటూ తనకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పబోయే లోపే శైలు చెప్పింది విని తన వైపు సీరియస్ గా చూస్తుంది 🤨🤨

మ్యాచెస్ చూస్తున్నాం బాబాయ్ గారు మొన్నే ఒక మ్యాచ్ వచ్చింది అబ్బాయి చాలా బావున్నాడు పైగా ఒక్కడే కొడుకు మంచి రోజు చూసి పెళ్లి చూపులు పెట్టుకోవాలి అనుకుంటున్నాం అని చెప్పిన శైలు ను చూసిన ఆద్య కోపంగా పైకి లేచి మామ్ అంటూ కోపంగా అరుస్తుంది

సడెన్ గా ఆద్య అలా అరవడం తో అందరూ ఆద్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే శైలు తను ఏమందో గుర్తు చేసుకుంటూ టెన్షన్ గా ఆధ్య వైపు చూస్తూ ఉంటుంది

నా పర్మిషన్ లేకుండా నాకు ఎందుకు మ్యాచెస్ చూస్తున్నారా నాకు మ్యారేజ్ థాట్ లేదని ముందే చెప్పాను కదా అయినా ఎందుకిలా చేస్తున్నారు మామ్ అంటూ కోపంగా తన ప్లేట్ విసిరి కొడుతూ గట్టిగా అరుస్తుంది ఆద్య ( అసలే పాప జై మీద కోపం తో తిక్కలో ఉంది దానికి తోడు శైలు కూడా తనకు ఇష్టం లేని టాపిక్ తీసుకుని రావడం వల్ల ఆద్య ఒక్క సారిగా బరస్ట్ అయిపోయింది 😌)

 

ఆద్య బిహేవ్ అందరూ ఉన్నారు మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు కామ్ గా కూర్చుని లంచ్ చేయ్ అని సీరియస్ గా చూస్తూ చెప్తాడు మహిదర్

సారి డాడ్ ఈ విషయం లో మీరు కూడా మామ్ నే సపోర్ట్ చేస్తున్నారు కదా ఒకే ఫైన్ ఇద్దరికీ చెప్తున్నా వినండి నాకు పెళ్ళి ఇష్టం లేదు దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకోకండి నాకు లంచ్ వద్దు మీరు తినేయండి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళబోతున్న ఆద్య ముందుకు వచ్చి నిలబడతాడు జై

ఆద్య జై వైపు సీరియస్ గా చూస్తూ మర్యాదగా తప్పుకో చాలా కోపంగా ఉన్నాను ఇప్పుడు ఇరిటేట్ చేసావంటే అసలు బాగోదు చెప్తున్నా

నేను కూడా అంతే సీరియస్ గా చెప్తున్నా ఫస్ట్ ఆంటీ, అంకుల్ కి సారి చెప్పి అందరితో కలిసి లంచ్ చేయ్ నీ ఒక్క దాని వల్ల లంచ్ చేస్తున్న అందరూ చేయడం ఆపేసి నుంచున్నారు

నేను లంచ్ చేయాలో వద్దో నా ఇష్టం మధ్యలో నీ బోడి రికమండేషన్ నాకు అక్కర్లేదు గో టు హెల్

నువ్వు మర్యాదగా ఎందుకు వింటావే అని ఆద్య బుగ్గలు నొక్కుతున్న జై ను ప్రతాప్ జై అని సీరియస్ గా పిలవడం తో అసహనంగా ఆద్య ను వదిలి నాకు దొరక్క పోవు అపుడు చెప్తా నీ పని అని విసుగ్గా ఆద్య ను వదలడం తో ఆద్య జై వైపు సీరియస్ గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది

అప్పటి వరకు నవ్వుతున్న అందరూ ఒక్కసారిగా డల్ అయిపోవడం చూసిన జై అయ్యో ఆంటీ అంకుల్ ఇపుడు ఏమైందని అంత డల్ అయిపోయారు ముందిలా కూర్చోండి అని అందరినీ కూర్చో పెట్టాక డల్ గా ఉన్న శైలు పక్కన కూర్చుని ఆంటీ మీరు అనవసరంగా బాధ పడకండి ఆద్య కి మ్యారేజ్ అంటే ఇష్టం లేదు అని తెలుస్తుంది కదా సో ఆద్య చేత్తో నే నాకు పెళ్ళి ఇష్టమే అని చెప్పిస్తా అపుడు మీరు హ్యాపినా??

చాలా హ్యాపీ జై బట్ ఆద్య మ్యారేజ్ కి ఒప్పుకోదు అంటూ ఆద్య ఫ్రెండ్ విషయం లో జరిగింది చెప్పి దాని వల్లే ఆద్య మ్యారేజ్ కి ఒప్పుకోవడం లేదు అని డల్ గా చెప్తుంది

అయ్యో ఆంటీ ఇదసలు ప్రాబ్లెమ్ నే కాదు ఈ ప్రాబ్లెమ్ నాకు వదిలేయండి ముందు మీరు హ్యాపీగా ఉండండి ఆద్య ను పెళ్ళికి ఒప్పించే బాధ్యత నాది అంటూ వాళ్ళ మూడ్ డైవర్ట్ చేసి అందరూ లంచ్ చేసేలా చేస్తాడు

ఏదో డీప్ గా ఆలోచిస్తున్న ప్రతాప్ వర్మ పక్కన కూర్చుని ఏంటి తాతయ్య ఇది మనం ఏదో చేయాలి అనుకుంటుంటే ఇక్కడ ఇంకేదో అయిపోతుంది అని డల్ గా చెప్తున్న మాయ ను చూసి ప్రతాప్ వర్మ చిన్నగా నిట్టూర్చి నాకు అదే అర్థం కావడం లేదు తల్లీ జై మాత్రమే పెళ్ళి వద్దు అంటున్నాడు అనుకుంటే ఇక్కడ ఆద్య కూడా అలాగే అంటుంది ….

ఆద్య కి దగ్గరుండి జై నే పెళ్ళి చేస్తాను అంటున్నాడు 🤦 వీళ్ళను ఎలా కలపాలి అని ఆలోచిస్తూ ఉంటే నాకు పిచ్చెక్కుతుంది తల్లీ అసలు వీళ్ళ ఇద్దరికి మనం అనుకున్నట్టు పెళ్లి చేయగలం అంటావా

కచ్చితంగా చేయగలం తాతయ్య కాకపోతే అందుకు మనం చాలా కష్టపడాలి అందులో మెయిన్ గా వీళ్ళ ఇద్దరినీ ఈ హైదరాబాద్ కి దూరంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి ఇద్దరి మధ్య గొడవలు దూరం చేసి ప్రేమ పుట్టేలా చేయాలి

ఇక్కడే ఉంటే వీళ్ళు వీళ్ళ లైఫ్ లో బిజీగా ఉంటారు తప్పా ఒకరిని ఒకరు ఎపుడు అర్తం చేసుకుని లవ్ లో పడతారు అందుకే అందరం ఈ సిటీ కి దూరంగా ఎక్కడికైనా వెళ్ళాలి తాతయ్య అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది

ప్రతాప్ కాసేపు ఆలోచించి నువ్వు చెప్పింది నాకు కూడా నిజమే అనిపిస్తుంది నువ్వు నిజంగా బంగారం తల్లి అన్నయ్య ఫ్యూచర్ గురించి ఎంత చక్కగా ఆలోచించావ్ అని నవ్వి అలా అయితే అందరం కొద్ది రోజులు సరదాగా అన్నిటికి దూరంగా వేరే ఊరు వెళ్దాం

ఎక్కడికి వెళ్దాం తాతయ్య యూ ఎస్, కెనడా, ఆస్ట్రేలియా??? వీటిలో ఎక్కడికి

నో నో అంత దూరం కాదు మనం మీ నానమ్మ సొంతూరు అయిన రామాపురం వెళ్తున్నాం అనగానే మాయ కన్ఫ్యూస్డ్ ఫేస్ తో ప్రతాప్ వైపు చూస్తుంది

ఇక్కడే మనకు అనుకోని ట్విస్టు రాబోతున్నాయి అండ్ రుద్రాన్ష్ కూడా ఎంటర్ అవ్వబోతున్నాడు??? సో అన్నిటికి మీరు రెడీగా ఉండండి 😌😈

 

To Be Continueed……………….