ఆద్య తన మీద పడ్డ సన్ రైస్ చూస్తూ ఇవాళ ఎందుకో చాలా ప్లెసెంట్ గా అనిపిస్తుంది నాకు కావాల్సింది నాకు దగ్గర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అని తన హార్ట్ ఎందుకింత స్పీడ్ గా కొట్టుకుంటూ ఉందో అర్థం అవ్వక చిరు నవ్వుతూ చుట్టూ చూస్తున్న ఆద్య కి గార్డెన్ లో నుంచుని తన వైపే చూస్తున్న జై కనిపించడం తో అప్పటి వరకు నవ్వుతున్న ఆద్య మొహం లో కోపం వచ్చి చేరి తన మొహం బీట్ రూట్ లా ఎర్రబడుతుంది….
ఓహ్ గాడ్ వీడేంటి ఇంత మార్నింగ్ అది కూడా నా ఇంట్లో నా గార్డెన్ లో అని విసుగ్గా తల తిప్పుకుని వీడికి నా అడ్రస్ ఎలా తెలిసింది ఇవాళ నా చేతుల్లో చావడానికి వచ్చాడు ఫాల్తూ అని తిట్టుకుంటూ కోపంగా గార్డెన్ వైపు చూసిన ఆద్య కి అక్కడ ఎవరు కనిపించరు….
అదేంటి వీడు కనిపించడం లేదు ఇందాక అక్కడే కదా ఉన్నాడు అని గార్డెన్ మొత్తం చూస్తున్న తనకు జై ఎక్కడ కనిపించడు ఈ లోపే ఎటు పోయాడు వీడు అనుకుంటూ ఉండగా అక్కడ చెట్లకు నీళ్లు పడుతున్న వెంకట్ ( గార్డెన్ ను మొత్తం తనే చూసుకుంటూ ఉంటాడు చెట్లు వాడిపోకుండా వాటర్ పోస్తూ ఉండటం , సాయిల్ చేంజ్ చేయడం & మంత్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేస్తూ ఉండటం ఇక్కడ వెంకట్ డ్యూటీ) ను చూసిన ఆద్య వెంకట్ ను పిలుస్తుంది…
ఆద్య వాయిస్ విన్న వెంకట్ తన చేతిలో ఉన్న గ్రీనరీ హ్యాండ్ స్ప్రేయర్ ను పక్కన పెడుతూ ఆద్య కి వినిపించేలా దగ్గరకు వచ్చి నుంచుని చెప్పండి అమ్మాయి గారు ఏమైనా కావాలా అని ఆద్య కి వినపడేలా అడుగుతాడు….
నో… ! నాకేం వద్దు కానీ ఇక్కడికి నువ్వు కాకుండా కొత్త పర్సన్స్ ఎవరైనా వచ్చారా
లేదు అమ్మాయి గారు ఎవరు రాలేదు నేను అరగంట నుండి ఇక్కడే ఉన్నాను ఇక్కడికి ఎవరు రాలేదు ఏమైంది ఎందుకలా అడిగారు అమ్మాయి గారు
నథింగ్ వెళ్ళి నీ వర్క్ చూసుకో అని ఆద్య చెప్పగానే ఏమైంది అమ్మాయి గారికి అనుకుంటూ వెంకట్ అక్కడి నుంచి వెళ్ళిపోయి తన వర్క్ కంటిన్యూ చేస్తాడు….
వెంకట్ ఎవరు లేరు అంటున్నాడు మరి నేను జై గార్డెన్ లో ఉండడం చూసానే అంటే అదంతా నా భ్రమ 🤦 ఛా!!! వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళేసరికి జై బెడ్ మీద పడుకుని కనిపిస్తాడు
జై ను చూసిన ఆద్య షాక్ అవుతూ హేయ్ నువ్వేంటి ఇక్కడ అసలు ఇక్కడికి ఎలా వచ్చావ్ నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వస్తావా ఫస్ట్ యూ గెట్ అప్ 🤨🤨
నువ్వే కదే మిర్చి నన్ను నిన్నటి నుంచి తలచుకుంటూనే ఉన్నావ్ అందుకే వచ్చా ఇట్స్ టోటల్లీ యువర్ మిస్టేక్ అంటూ కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు
బుల్ షట్ 🤨🤨 నేను నిన్ను తలచుకోవడం ఏంటి ముందు నా బెడ్ మీద నుండి లేస్తావా లేదా
నేను లేవను నన్ను ఎందుకు తలచుకున్నావో చెప్పు అప్పుడు లేస్తాను అప్పటి వరకు లేవను అని చెప్పి శ్రీకృష్ణుడి స్టైల్ లో బెడ్ మీద పడుకున్న జై ను చూసి కొట్టడానికి ఏదైనా దొరుకుతుందేమో అని అటు ఇటు చూస్తున్న ఆద్య కి తన రూమ్ బాల్కనీ లో హాకీ స్టిక్ కనిపించడం తో అది తీసుకుని తిరిగి బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి అక్కడ జై కనిపించడు
గాడ్ 🤦 నిజంగా ఇదంతా నా ఇమాజినేషన్ 🙆🙆 మరి నాకేంటి వాడు నిజంగా వచ్చాడు అనిపిస్తుంది నైట్ నుండి వాడిని తిట్టుకుంటూ ఉన్నాను కదా అందుకే ఇలా అనిపిస్తుంది 😕 😕 వీడు నన్ను బాగా డిస్టర్బ్ మాత్రమే కాదు ఇరిటేట్ కూడా చేస్తునాడు
చీ!!! ఇక వీడి నేమ్ కూడా తలచుకోకూడదు అయినా వీడు గుర్తొస్తే చాలు ఎక్కడ లేని చిరాకు కనిపిస్తుంది నా మొహం లో అని తన చేతిలో ఉన్న హాకీ స్టిక్ పడేసి మిర్రర్ లో ఎర్ర పడ్డ తన ఫేస్ ను చూసి కాసేపు మెడిటేషన్ చేస్తే తప్పా నాకు ఈ చిరాకు పోదు అని విసుగ్గా యోగా మ్యాట్ తీసుకుని బాల్కనీ లో ఫ్లోర్ మీద వేసి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ మెడిటేషన్ స్టార్ట్ చేస్తుంది
10 నిమిషాల మెడిటేషన్ తర్వాత మైండ్ పూర్తీగా రిలాక్స్ అవ్వడం తో చిరు నవ్వుతో కళ్ళు తెరిచి చూసిన ఆద్య కి తనకు ఇంచ్ గ్యాప్ కూడా ఇవ్వకుండా కూర్చుని రెండు చంపల కింద చేతులు పెట్టుకుని నవ్వుతూ తన వైపు చూస్తున్న జై ను చూసి ఆఆ….. 😬😬 నేను నిన్ను తలచుకోలేదు కదరా విలన్ మళ్ళీ ఎందుకు వచ్చావ్ వెళ్ళు…. వెళ్ళు…. వెళ్ళు అని మళ్ళీ కళ్ళు మూసేసి అరుస్తూ నెమ్మదిగా ఒక కన్ను తెరచి చూసిన ఆద్య కి అక్కడ తను తప్పా ఎవరు కనిపించరు….
టైమ్ గాడ్ వెళ్ళిపోయాడు అని ఊపిరి తీసుకుంటూ నాకు మరీ హెల్యూజినేషన్ ఎక్కువైపోయింది 🙆🙆 అర్జంట్ గా హాట్ వాటర్ తో బాత్ చేస్తే తప్పా ఈ తల నొప్పి తగ్గేలా లేదు అనుకుంటూ తన రూమ్ డోర్ లాక్ చేసి 15 నిమిషాల తర్వాత నీస్ వరకు ఉన్న బాత్ రబ్ లో బయటకు వస్తుంది
తన మిర్రర్ ముందు ఉన్న హెయిర్ డ్రయ్యర్ తీసుకుని హెయిర్ డ్రై చేస్తూ ఎవరో తనను పట్టి పట్టి చూస్తున్నారు అనిపించడం తో తన కళ్ళను భూచక్రం లా చుట్టూ తిప్పుతూ వెనక్కి తిరిగి చూసిన ఆద్య కి తన రూమ్ లో ఎవరు కనిపించరు…
ఇదేంటి ఎవరు లేరు మరి నాకేంటి ఎవరో నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది చా!!! ఇవాళ ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది మార్నింగ్ ఆ మెంటలోడిని తలచుకున్నా కదా ఆ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు అనుకుని ఆ బాత్ రబ్ తీస్తున్న టైం కి మొబైల్ రింగ్ వినిపించడం తో వెంటనే ఆగిపోతుంది…
తన బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకుని చూసిన ఆద్య కి తన మొబైల్ కి ఏ కాల్ రాకపోవడం స్ట్రేంజ్ గా ఉంటుంది అదేంటి ఇందాక రింగ్ అయింది కదా అని ఆలోచిస్తున్న ఆద్య ను చూసిన జై కర్టెన్ వెనుక దాక్కుని ఆద్య ను కన్ఫ్యూస్ చేసి ఆడుకోవడం బాగా నచ్చుతుంది అందుకే ఆద్య ఎక్స్ప్రెషన్స్ కి నవ్వొస్తుంటే కస్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు….
గార్డెన్ లో నుంచుని అమర్ కాల్ అయ్యాక చుట్టూ చూస్తున్న జై కి ఆద్య ను అలా చూడగానే మతి పోతుంది తననే మైమరచి చూస్తున్న జై కి ఎందుకో ఆద్య తో ఆడుకోవాలి అనిపిస్తుంది …. అనుకున్నదే తడవుగా వెంటనే ఎవరు చూడకుండా దాక్కుని తర్వాత ఇంట్లోకి వచ్చి అర్జంట్ మెయిల్ పంపాలని పైకి వెళ్తున్నట్టు అందరికీ చెప్పి ఆద్య రూమ్ ఎక్కడో వెతుక్కుని వచ్చి మరీ తనకు కనిపించీ కనిపించకుండా మాయం అవుతూ సక్సెఫుల్ గా ఆధ్య కి పిచ్చి పట్టించి ఇపుడు కర్టెన్ వెనుక దాక్కుని నవ్వుకుంటూ ఉంటాడు….
మొబైల్ వైపు చూస్తున్న ఆద్య కి ఇందాక రింగ్ టోన్ గుర్తు రావడం తో ఎస్ అది నా రింగ్ టోన్ కాదు సో ఇక్కడ ఎవరో ఉన్నారు అని తనకు క్లారిటీ వస్తుంది…. పైగా ఇందాక జై మీద ఉన్న కోపంలో అబ్జర్వ్ చేయలేదు కానీ తనకు మెన్స్ పెర్ఫ్యూమ్ స్మెల్ ఇపుడు బాగా తెలుస్తూ ఉంటుంది….
ఇది డాడ్ పెర్ఫ్యూమ్ స్మెల్ కాదు మెయిడ్స్ నా రూమ్ కి వచ్చినా ఇంత సేపు నాకు కనిపించకుండా ఉండరు సో ఎవరో వచ్చారు అని డోర్ ఓపెన్ చేసి బయటకు చూసిన ఆద్య కి ఆ ఫ్లోర్ మొత్తం కాలిగా కనిపిస్తుంది సో మెయిడ్స్ ఎవరు కాదు అంటే యస్ వాడే ఆ విలన్ 😈😈
నన్ను కావాలనే కన్ఫ్యూస్ చేసి నాతో ఆడుకుంటావా చెప్తారా నీ పని అని పళ్ళు నూరుతూ రూమ్ మొత్తం జాగ్రత్తగా ఇంచ్ టు ఇంచ్ అబ్జర్వ్ చేస్తున్న ఆద్య కి కర్టెన్స్ అలా గాలికి ఎగరడం వల్ల జై షూస్ కనిపించడం చూసి 😬😬 చర్చావ్ రా నా చేతిలో అనుకుంటూ తన టేబుల్ దగ్గరున్న ఇంక్ బాటిల్ తీసుకుని ఆ చేతిని వెనక్కి పెట్టుకుని కర్టెన్ ముందుకు వచ్చి నుంచుంటుంది….
ఇదేంటిది ఏం సౌండ్ రావడం లేదు మనం ఇచ్చిన ట్రీట్మెంట్ కి పిచ్చి పట్టి తల ను గోడకు బాదేసుకుంటుందా ఏంటి 😂🤣 అని నవ్వుకుంటూ కర్టెన్స్ బయట కొంచెం తల బయట పెట్టి చూసిన జై కి తనకు ఎదురుగా పూనకం వచ్చిన అమ్మోరిలా చూస్తూ కనిపిస్తుంది ఆద్య….
వామ్మో ఇది కనిపెట్టేసింది 🙆 ఎలాగోలా కవర్ చేసి ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటూ 🤔🤔 ఎంటే మిర్చి మళ్ళీ తలచుకున్నావ్ ఇలా మళ్ళీ నీ కళ్ళ ముందు కు వచ్చేశా ఒక సారి కళ్ళు మూసుకో మళ్ళీ మాయం అయిపోతాను నాకు అర్జంట్ వర్క్స్ ఉన్నాయే వెళ్ళాలి ఒక సారి కళ్ళు మూసుకో 😏
నేను కళ్ళు మూసుకోవడం కాదురా ఆగు నీ కాళ్ళు విరిచేస్తాను అని జై షర్ట్ పట్టుకుని లాగి ఫోర్స్ గా బెడ్ మీదకు తోయడం తో జై వెళ్ళి బెడ్ మీద పడతాడు ఆద్య ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి జై మీదకు వెళ్ళి ఆటో కాలు ఇటో కాలు వేసి కూర్చుని జుట్టు గట్టిగా పట్టుకొని నాతోనే గేమ్స్ ఆడుతావా యూ ఇడియట్ ఇవాళ నిన్ను వదలను అని చెప్పి జుట్టు గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటుంది….
ఒసేయ్ డెవిల్ ఒదలవే అబ్బా….. బాగా నొప్పిగా ఉందే అలా లాగకూ ఇట్స్ రియల్లీ పెయినింగ్
నొప్పిగా ఉండాలి అనే కదరా ఫాల్తు లాగుతుంది ఇవాళ నా చేతిలో చావడానికే నా రూమ్ కి వచ్చావ్ నైట్ పార్టీ లో నన్ను ఫోర్స్ గా కిస్ చేస్తావా ఎలా చేస్తావ్ రా అలా నా పర్మిషన్ అక్కర్లేదా అంటూ కోపంగా జై జుట్టు పట్టుకుని ఊడోచ్చేలా లాగుతుంది….
ఆఆఆ….!!!! నన్ను అనవసరంగా గెలికావ్ అనుభవించవే అంటూ ఆద్య మెడ పట్టుకుని దగ్గరకు లాక్కుని ఆధ్య లిప్స్ ను వదలకుండా కొరికేస్తూ ఉంటాడు ( అంటే మన వాడు ముద్దు ను కూడా ఒక యుద్ధం లాగే చేస్తాడు అనమాట 🫣🫣)
ఉప్పగా తన నాలుక కి తగులుతున్న బ్లడ్ ను చూసి నవ్వుతూ ఆద్య ను వదిలేయడం తో ఆద్య మిర్రర్ లో తన లిప్స్ చూసుకుని నిన్న బైట్ చేసిన చోటే మళ్ళీ బైట్ చేయడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటే కాటన్ తో లిప్స్ క్లీన్ చేసి జై వైపు సీరియస్ గా చూస్తుంది….
మనతో పెట్టుకోకు అని ఆద్య కి యాటిట్యూడ్ లుక్ ఇచ్చి నలిగిన తన డ్రెస్ సెట్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ ది కిస్ అని కన్ను కొట్టి వెళ్తున్న జై ను వొళ్ళు మండుతుంటే జై ష్రగ్ పట్టుకుని వెనక్కి లాగి తన కళ్ళలోని కోపాన్ని మొత్తం తన కాళ్ళల్లోకి తెచ్చుకుని జై ను ఫోర్స్ గా చెప్పుకోలేని చోట ఒక కిక్ ఇచ్చి జై ను తన రూమ్ నుండి బయటకు నెట్టేసి డోర్ లాక్ చేస్తుంది…
అమ్మా!!!!! చంపేసింది రా బాబోయ్ అని తన్నిన చోట రుద్దుకుంటూ దీనికి కొట్టడానికి ఏ ప్లేస్ దొరకలేదా అంటూ నొప్పికి పైకి కిందకు ఎగురుతూ ఉన్న జై ను అపుడే అక్కడికి వచ్చిన అమర్ విచిత్రంగా చూస్తూ ఉంటాడు……
ఏంట్రా జై ఇది ఇది ఏ టైప్ డాన్స్ సాల్సా కాదు, రాక్ అండ్ రోల్ కూడా కాదు మరీ స్ట్రిప్ డాన్సా అని పిచ్చి మొహం వేసుకుని అడుగుతాడు అమర్…..
నీ యబ్బా ఇక్కడ నొప్పికి నాకు టాప్ టు బాటమ్ అదురుతూ ఉంటే ఇది నీకు డాన్స్ లా అనిపిస్తుందా నోరు మూసి ఫాస్ట్ గా వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకుని రా ఫాస్ట్
ఏమైంది జై ఎందుకలా నిల్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నావ్ నీ మొహం 5ఎందుకు ఎర్రగా ఉంది అంటూ అప్పటి వరకు నవ్వుతున్న అమర్ జాగ్రత్తగా జై ను అక్కడే హాల్ లో ఉన్న సోఫా లో కూర్చో పెడుతూ నెమ్మదిగా అడుగుతాడు
జై నెమ్మదిగా సోఫా లో కూర్చుని ఉందిగా ఆ పొట్టిది దాని వళ్ళే ఇలా అయింది దాన్ని ఎదోటి చేస్తే తప్పా నాకు ప్రశాంతత ఉండదు అని పళ్ళు నూరుతూ చెప్తాడు
పొట్టిదా 🙄 ఇక్కడ పొట్టి వాళ్ళు ఎవరు ఉన్నారు అందరు బానే హైట్ ఉన్నారుగా
రేయ్ ఫాల్తూ దెబ్బ నాకు తగిలితే చిప్ నీకు దొబ్బిందా ఏంటి నేను అంటుంది ఆ ఆద్య గురించి 😬😬
ఓహ్ తనా రేయ్ తను క్యూట్ గా బటర్ఫ్లై లా ఎంత బావుంటుంది అలాంటి తననూ పొట్టి అంటా వెంట్రా అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ మాయ ను అడిగితే వర్క్ లో ఉన్నాడు అంది వీకెండ్స్ నీకు వర్క్ చేసే మూడ్ ఎక్కడ ఉంటుంది నీ గర్ల్ ఫ్రెండ్స్ తోనే సరిపోతుంటే 😌😏 నువ్వు ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేయడమే వింత అనుకుంటే పైగా వీకెండ్స్ వర్క్ అని నవ్వుతాడు 😂🤣 అమర్….
(వాడు అసలే బాగా కాలిపోయి ఉన్నాడు 😌 మళ్ళీ పెట్రోల్ పోసావ్ 🫣 అనుభవించు రా అమరూ….. 😝😝)
అమర్ ను చూసిన జై ఈడ్చి పెట్టి కొట్టడమే కాకుండా కుక్క ను తన్నినట్టు తన్ని బాగా చిరాగ్గా ఉన్నాను మళ్ళీ దాన్ని డబుల్ చేయకు వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకుని రా అని సీరియస్ గా చెప్పగానే అమర్ చెంపలు రుద్దుకుంటూ అదేదో నార్మల్ గా చెప్పచ్చు కదా అనవసరంగా ఇటోచ్చా అని గొణుగుతూ కిందకు వెళ్ళి ఇస్ ప్యాక్ తీసుకుని వచ్చి జై కి ఇవ్వగానే ఆ ఫ్లోర్ లోనే ఉన్న రూమ్ లో పెయిన్ తగ్గే వరకూ ఇస్ ప్యాక్ పెట్టుకుని పెయిన్ కాస్త తగ్గాక డ్రెస్ అప్ అయి అమర్ తో పాటు కిందకు వెళ్ళి అందరితో జాయిన్ అవుతాడు….
ఇటు ఆద్య కూడా తన కోపం తగ్గాక మళ్ళీ ఫ్రెష్ అయి బ్యూటీఫుల్ గా ఉండే బ్లాక్ కలర్ క్యూట్ ఫ్రాక్ లో రెడీ అయ్యి కిందకు వస్తుంది…
హాల్ లో కనిపిస్తున్న వినయ్ ఫ్యామిలీ ను చూసిన ఆద్య నవ్వుతూ హాయ్ మావయ్య అని చిరు నవ్వుతో వినయ్ వైపు వెళ్తూ ఉండగా వదిన అంటూ సుడి గాలిలా వచ్చి చుట్టేస్తుంది మాయ….
హేయ్ మాయ అంటూ తనను నవ్వుతూ హగ్ చేసుకుంటూ సీరియస్ లుక్స్ ఇస్తున్న జై వైపు అంతే సీరియస్ గా చూస్తుంది అది చూసిన అమర్ రేయ్ ఏంట్రా ఆద్య అంత కోపంగా చూస్తుంది అసలు మీ మధ్య ఈ కోల్డ్ వార్ ఏంటి అని నెమ్మదిగా అడుగుతాడు
ఇపుడు అది నీకు అంత అవసరమా అన్నట్లు ఉన్న జై ఎక్స్ప్రెషన్ చూసి ఇందాక జై కొట్టింది గుర్తు చేసుకుని మళ్ళీ జై తో కొట్టించుకునే ఓపిక లేక ఇంకా తనకు కనిపించని మాన్య కోసం కళ్ళతోనే వెతుకుతూ ఉంటాడు…
వదిన నైట్ ఎందుకలా పార్టీ మిడిల్ లో వెళ్ళిపోయావ్ ఎట్ లీస్ట్ వెళ్తున్నట్టు చెప్పను కూడా లేదు నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా నీకు కాల్ చేద్దాం అంటే నీ నంబర్ కూడా లేదు ఫస్ట్ నీ నంబర్ చెప్పు అని తన మొబైల్ తీసుకుంటూ అడుగుతుంది….
సారి మాయ సడెన్ గా హెడ్ ఏక్ వచ్చింది అందుకే అలా వెళ్ళిపోయా ఇదిగో నా నంబర్ అంటూ తన నంబర్ చెప్పడం తో మాయ తో పాటు జై కూడా ఎవరు చూడకుండా తన మొబైల్ లో ఆధ్య నంబర్ POTTI అని సేవ్ చేసుకుంటాడు
నీతో చాలా మాట్లాడాలి కూర్చో వదిన అంటూ వినయ్ దగ్గరకు వెళ్లి కూర్చుని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వినయ్ తో జోక్స్ వేస్తూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు…. అపుడే అక్కడకి ప్రతాప్ వర్మ కూడా రావడం తో ఆద్య నవ్వుతూ వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఇపుడే వస్తున్నారా తాతయ్య అని నవ్వుతూ అడుగుతుంది
లేదమ్మా చాలా సేపు అవుతుంది కాళ్ళు అలా నొప్పిగా ఉంటే అలా గార్డెన్ లో వాక్ చేస్తూ ఉన్నా అంతే అంటూ ఆద్య ను తన పక్కనే కూర్చో బెట్టుకుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు…
ఇంటికి పిలవగానే సరిపోతుందా వచ్చిన గెస్ట్స్ కి ఎట్ లీస్ట్ వాటర్ కూడా ఇవ్వడం నేర్పలేదా నీకు అని జై సీరియస్ గా చూస్తూ అడుగుతాడు
అప్పటి వరకు నవ్వుతున్న ఆద్య జై వాయిస్ కి తన వైపు సీరియస్ గా చూస్తూ ఇచ్చిన ట్రీట్మెంట్ సరిపోలేదు అనుకుంటా చెప్తారా నీ సంగతి అని తన వైపు కోపంగా చూస్తూ అయ్యో సారి జై ధీర్ వర్మ గారు ఇపుడే తీసుకుని వస్తాను అని చెప్పి కిచెన్ వైపు వెళ్తుంది….
జై ఎందుకు నువ్వు కావాలని ఆద్య ను టార్గెట్ చేస్తున్నావ్ అని సీరియస్ గా వినిపించిన ప్రతాప్ వాయిస్ కి అబ్బా తాతయ్య నేను తనతో కావాలని అలా అన్నాను అయినా మాకు ఇవి చిన్నప్పటి నుంచి మామూలే జస్ట్ చిల్
అపుడు అంటే మీరు చిన్న వాళ్ళు బట్ నౌ యూ ఆర్ గ్రోన్ అప్ సో డోంట్ బిహేవ్ లైక్ కిడ్ అంటూ మహిదర్ రావడం చూసి ఆ టాపిక్ అక్కడితో కట్ చేస్తాడు
వినయ్ కూడా జై కావాలని ఆద్య ను ఏడిపిస్తున్నాడు అని అర్థం చేసుకుని వీళ్ళ మధ్య కోపం తప్పా ప్రేమ లేదని ఫిక్స్ అయ్యి జై కి హరిణి అంటే నిజంగా ఇష్టం ఉంటే ఇద్దరికీ మ్యారేజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు
మాయ జై వైపు సీరియస్ గా చూస్తూ అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళడం జై చూస్తునే ఉంటాడు కానీ ఎమ్ మాట్లాడడు అది చూసిన అమర్ ఎంతో కొరియన్ డ్రామా విత్ అవుట్ సబ్ టైటిల్స్ చూస్తున్నట్టు ఉంది అని పెదవి విరిచి మొబైల్ చూస్తూ ఉంటాడు
ఆద్య కోపంగా కిచెన్ లోకి వెళ్ళి మాన్య తో హాల్ లో జరిగింది చెప్పి నువ్వు చిల్లీ పౌడర్ ఒక గ్లాస్ తీసుకుని రా అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూల్ వాటర్ బాటిల్ తీసుకుని వెయిట్ చేస్తూ కూర్చుంటుంది ….
మాన్య కాసేపటికి చిల్లీ పౌడర్ తో పాటు 2 గ్లాసెస్ తీసుకుని వచ్చి అవి ఆద్య ముందు పెడుతూ నవ్వుతూ ఉంటుంది….
ఏయ్ రెండు ఎందుకే నాకు ఒకటి చాలు నా రివేంజ్ ఆ జై మీద మాత్రమే 😬😬
బట్ నా రివేంజ్ జై తోక మీద అందుకే రెండు తెచ్చా వన్ షాట్ టూ బర్డ్స్ 😉😁
ఆద్య మాన్య వైపు చూస్తూ నువ్వు చెప్పేది అమర్ గురించా అని డౌబ్ట్ గా చూస్తూ అడుగుతుంది
ఎస్ వాడే నువ్వు లేట్ చేయకు మళ్ళీ ఎవరైనా వస్తారు అని తొందర చేయడం తో ఆద్య కూడా ఫాస్ట్ గా ఒక్కో గ్లాస్ లో 6 స్పూన్స్ చిల్లీ పౌడర్ మిక్స్ చేసి బోనస్ గా 4 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసి దీన్ని జాగ్రత్తగా లోపల పెట్టేయ్ అని మాన్య కి చెప్పి కూల్ వాటర్ యాడ్ చేసి వాటిని రెడ్ యాపిల్ జ్యూస్ లా కలరింగ్ ఇచ్చి ఆ ట్రే తీసుకుని జై ముందుకు వచ్చి నుంచుంటుంది
గుడ్ ఆ మాత్రం భయం ఉండాలి అని యాటిట్యూడ్ గా చెప్పి తను ఒక గ్లాస్ తీసుకుని మరో గ్లాస్ అమర్ కి ఇస్తున్న జై ను చూసి ఆద్య వెనుకే వచ్చిన మాన్య వాళ్ళు చూడకుండా హై – ఫై ఇచ్చుకుని నవ్వుకుంటూ ఉంటారు…
To Be Contineed………….
Nice story
fgggg
Hejekksoo Huu
Excellent story
Super