విలన్ హస్బెండ్ -12

విలన్ హస్బెండ్ -12

రేణుక కి చాలా చిరాగ్గా ఉంది తన పుట్టింటి వాళ్ళ కంటే మహిదర్ ఫ్యామిలీ కి వినయ్ ఇస్తున్న ఇంపార్టెన్స్ తను అసలు భరించలేక పోతోంది…. అందులోనూ మాయ పదే… పదే ఆద్య ను వదిన…. వదిన  అంటూ పిలవడం మరింత చిరాకు తెప్పిస్తుంది తనకు ఇష్టం లేకపోయినా అనవసరమైన సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక తప్పక చిరాగ్గానే రెడీ అయ్యి హాల్ లోకి వస్తుంది…

అప్పటికే ప్రతాప్ వర్మ తమ ఫార్మ్ నుండి ఫ్రెష్ ఫ్రూట్స్ అన్ని తెప్పించి నీట్ గా ప్యాక్ చేయించాక వెహికల్ లో పెట్టిస్తూ తనకు తెలిసిన వాళ్ళ దగ్గరుండి ఇరవై రెండు రకాల స్వీట్స్ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేయించి అవి కూడా మెయిడ్స్ తో పెట్టిస్తూ చాలా బిజీగా ఉంటాడు….

పెళ్ళి చూపులకు వెళ్తున్నట్టు ఈ ఎరేంజ్మెంట్స్ ఏంటీ అని మరింత చిరాగ్గా మారిపోయిన రేణుక కి వినయ్ వాళ్ళందరి కోసం గిఫ్ట్స్ తెప్పించడం మరింత మంట పుట్టిస్తుంది….

ఎపుడైనా మా అన్నయ్య కి అట్లిస్ట్ వాచ్ గిఫ్ట్ గా తెప్పించారా వాళ్ళకు మాత్రం లక్షలు ఖర్చు చేశారు అని లోపలే రగిలిపోతూ ఉంటుంది….

డాడ్ ఐ ఆమ్ రెడీ అంటూ పై నుండి నవ్వుతూ వస్తున్న కూతురిని చూసిన రేణుక చీచీ!!! ఇది నా కడుపున ఎలా పుట్టిందో ఏంటో అన్ని వినయ్ పోలికలే వచ్చాయి అని మాయ ను చూసి తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది….

మేము కూడా రెడీ బంగారం అంటూ మాయ వైపు చూస్తాడు నీస్ వరకు ఉన్న బ్లూ కలర్ డెనిమ్ విత్ వైట్ టాప్ లో ముద్దుగా కనిపిస్తున్న కూతుర్ని చూసి నవ్వుతూ ఇక స్టార్ట్ అవుదాం అంటూ ప్రతాప్ వైపు చూస్తాడు….

వినయ్ నేను మాయ నా కార్ లో వెళ్తాం నువ్వు రేణుక వెనుక నీ కార్ లో రండి అని చెప్పి నలుగురు పార్టీకో వైపు వెళ్తూ ఉండగా అపుడే అక్కడికి జై ధీర్ కార్ వచ్చి ఆగగానే అందరూ అటుగా చూస్తారు….

వైట్ టీ షర్ట్ విత్ బ్లాక్ ష్రగ్ & బ్లాక్ జీన్స్ లో కనిపిస్తున్న జై ను చూస్తుంటే అందరికీ బాలీవుడ్ హీరో హృతిక్ లా కనిపిస్తూ ఉన్నాడు…. జై ఎపుడో కానీ ఇంత స్పెషల్ గా రెడీ అవ్వడు రెడీ అయితే మాత్రం చూపు తిప్పుకోవడం కష్టమే అని చెప్పాలి ఎందుకంటే జై కలర్ ఫుల్ వైట్ విత్ 8 ప్యాక్ నుదుటిన సిల్కీ హెయిర్ & మెయిన్ గా చెప్పాల్సింది జై ఐస్ గురించి హాజెల్ గ్రీన్ కలర్ ఐ బాల్ తో జై 👀 ఐస్ చూడ్డానికి చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి….

అందుకే జై తమ వైపు చూస్తే చాలు అని పడి చచ్చిపోయే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు… సో జై ను ఎపుడు ఫార్మల్స్, సూట్స్ లో నే చూసినా వీళ్ళకు చాలా డేస్ తర్వాత ఇలా కనిపించడం తో అందరూ అలా చూస్తూ ఉండిపోయారు….

జై తన నుదుటిన పడుతూ అల్లరి చేస్తున్న తన హెయిర్ సెట్ చేసుకుంటూ వీళ్ళ ముందుకు వచ్చి నేను వచ్చే దాకా ఆగలేక పోయారా మాయ ఆగండి నేను కూడా వస్తాను మహిదర్ అంకుల్ విల్లా కి అని చెప్తూ వినయ్ మాయ కి ప్రెసెంట్ చేసిన కార్ లో మాయ తో స్టార్ట్ అయితే వెనుకే రెండు కార్స్ ఒక దాంట్లో ప్రతాప్ మరో దాంట్లో రేణుక, వినయ్ కూడా మహిదర్ విల్లా కి స్టార్ట్ అవుతారు….

జై తమతో బయటకు రావడం చాలా అంటే చాలా తక్కువ అలాంటిది జై మహిదర్ ఇంటికి వెళ్ళడానికి ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో వినయ్ కి మాత్రమే కాదు రేణుక కి కూడా అర్థం అవ్వదు జై స్ట్రేంజ్ బిహేవియర్ గురించే ఇద్దరూ ఆలోచిస్తూ కూర్చుంటారు…

రేణుక నాకు జై మీద డౌబ్ట్ గా ఉంది వాడు ఎందుకో ఆద్య గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది

వాటర్ తాగుతున్న రేణుక కి వినయ్ అన్న మాటలు గొంతుకు అడ్డు పడ్డం తో దగ్గుతూ వినయ్ వైపు చూస్తూ అసలు మీరేం మాట్లాడుతున్నారు??? జై కి ఆద్య మీద ఇంట్రెస్ట్ ఏంటి అని అసహనంగా అడుగుతుంది

నేను జై ను పార్టీ లో నుండి అబ్జర్వ్ చేస్తున్నాను ఆద్య వైపే చూడ్డం తను ఎటు వెళ్తే అటు వెళ్ళడం మహి మనల్ని తన విల్లా కి ఇన్వైట్ చేయగానే జై చాలా ఎక్సైటింగ్ గా వస్తాను అని చెప్పడం ఇపుడు మనం పిలవకనే ఇంత స్మార్ట్ గా రెడీ అవ్వడం సో ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది

వామ్మో ఈయన చెప్పేది వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది అదే జరిగితే నేను , అన్నయ్య పడ్డ కష్టం మొత్తం వేస్ట్ అవుతుంది అని అనుకుంటూ టెన్షన్ తో చేతులు నలుపుకుంటూ కూర్చుంది

మాట్లాడవేంటి రేణు నేను చెప్పేది నీకు కూడా నిజమే అనిపిస్తుంది కదా??

ఈయన ఏంటి అంత ఆనందంగా అడుగుతున్నారు 😏 అవును లే ఈయన ప్రాణ స్నేహితుడి కూతురు కదా అందుకే ఇంత హ్యాపీగా కనిపిస్తున్నారు  అయినా నేను ఉండగా హరిణి తప్పా మరొకరు నా ఇంటికి కోడలిగా ఎలా వస్తారు అని కన్నింగ్ గా నవ్వుకుని ఏంటండీ మీరు జై కి ఆద్య కి చిన్నప్పటి నుండి పడదు పైగా ఇన్ని ఇయర్స్ తర్వాత మీట్ అయ్యారు కాబట్టి అలా ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు దాన్ని మీరు మరోలా అర్థం చేసుకున్నారు అంతే అంటూ అందంగా కవర్ చేస్తుంది రేణుక….

లేదు రేణు నాకు అలా అనిపించడం లేదు పైగా సంధ్య నాతో ఎప్పుడూ అంటూ ఉండేది మహి కి కూతురు పుడితే కోడలిగా చేసుకోవాలి అని సంధ్య కోరుకున్నట్టు కూతురు పుట్టింది…. అప్పుడు మాకు జై ఒకటే కాబట్టి ఆద్య ను చాలా బాగా చూసుకునే వాళ్ళం నిజంగా జై ను ఆద్య ను ఇష్టపడితే నాకంటే ఆనందించే వాళ్ళు ఎవరు ఉండరు…

అలా ఎలా ఇష్టపడతాడు అండి మన జై కి హరిణి అంటేనే ఇష్టం జై హరిణి తో సీక్రెట్ గా డేట్ కూడా చేస్తున్నాడు ఈ విషయం నాకు హరిణి నే చెప్పింది….

వినయ్ రేణుక వైపు సూటిగా చూసి చిన్నగా నవ్వి కాల్ రావడం తో దాన్ని అటెండ్ చేసి మాట్లాడుతూ బీసీ అవుతాడు …. ఈయనేంటి నేను చెప్పిన దానికి షాక్ అవుతాడు అనుకుంటే ఎట్ లీస్ట్ రియాక్షన్ కూడా ఇవ్వలేదు నేను చెప్పింది నమ్మాడా లేదా అని ఆలోచిస్తూ ఉండగానే మహిదర్ విల్లా లోకి ఎంటర్ అవుతాయి వీళ్ళ కార్స్…

పోర్టికోలో కార్స్ ఆగగానే అందరూ కార్ దిగి విల్లా లోకి నడిస్తే మెయిడ్స్ కార్స్ లో ఉన్న ఫ్రూట్స్, స్వీట్స్ తో పాటు వినయ్ తెప్పించిన గిఫ్ట్స్ ఎవ్రీ థింగ్ వెనుకే తీసుకుని హాల్ లో పెడతారు……

హాల్ లో కూర్చుని పేపర్ చదువుతూ కాఫీ సిప్ చేస్తున్న మహిదర్ మెయిడ్స్ తీసుకుని వస్తున్న వాటిని అశ్చర్యంగా చూసి గుమ్మం వైపు చూసిన తనకు వినయ్ ఫ్యామిలీ నవ్వుతూ కనిపిస్తారు…

మహిదర్ నవ్వుతూ వినయ్ వచ్చేసారా మీ కోసమే వెయిట్ చేస్తున్నా రండి…. రండి…. అంటూ ప్రతాప్ వర్మ ను చూసి నవ్వుతూ మీరు రారేమో అనుకున్నా అంకుల్ అంటూ ప్రతాప్ వర్మ ను ఆప్యాయంగా హత్తుకుంటూ చెప్తాడు…

నువ్వంత అభిమానంగా పిలిచాక రాకుండా ఎలా ఉంటాను మహిదర్ అంటూ సోఫా లో కూర్చుంటూ చిరు నవ్వుతో మహిదర్ విల్లా ఇంటీరియర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు…

వినయ్ ను మహిదర్ వీల్ చైర్ నుండి తనే స్వయంగా సోఫా లోకి షిఫ్ట్ చేసాక వినయ్ చేతిని తన రెండు చేతుల్లో బందించి నీకున్న బీసీ షెడ్యూల్ లో వన్ డే ఇలా మాతో టైం స్పెండ్ చేస్తావ్ అనుకోలేదు వినయ్ …. నువ్వు అప్పటికి ఎప్పటికీ ఎమ్ మారలేదు రా అంటూ ఆనందంగా చెప్తున్న మహిదర్ ను చూసి నీ కోసం నా వర్క్స్ నే కాదు కొన్ని కోట్లు అయినా వదులుకుంటా అయినా మనం ఒకే ఫ్యామిలీ ఇంకెప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని వేరు చేయకు ఇద్దరిదీ ఒకే ఫ్యామిలీ అని చిరు కోపంగా చెప్పి మహిదర్ తో బిజినెస్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాడు….

బాబోయ్ ఏంటో అనుకున్నా వీళ్ళు కూడా బానే సంపాదించారు అని విల్లా చుట్టూ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రేణుక …. మావయ్య మీ కోసం ఈ వాచ్
అంటూ మాయ మహిదర్ కి మరో వైపు కూర్చుంటూ మహిదర్ కి తనే స్వయంగా వాచ్ పెట్టడం చూసి రేణుక 🤦😳😬🤨 ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది …..

మహిదర్ కోసం స్పెషల్ గా రిచర్డ్ బ్రాండ్ వాచ్ గిఫ్ట్ చేస్తున్న కూతురి ను చూసి తన పక్కన కూర్చుని మొబైల్ లో ఏదో చూస్తున్న జై తో జై మాయ తీసుకున్న వాచ్ ఒక 5 తౌసండ్ ఉంటుందా అని ఆ వాచ్ వైపు డౌబ్ట్ గా చూస్తూ అడుగుతుంది…

5 తౌసండ్ కి ప్రెసెంట్ నార్మల్ టైటాన్ వాచ్ కూడా రావడం లేదు మామ్ ఆ వాచ్ కాస్ట్ నువ్వు గెస్ కూడా చేయలేవు

అవునా అంత ఎక్స్పెన్సివ్ వాచ్ నా అది 🤧🤧 పోనీ ఒక 15 వేలు ఉంటుందా

మామ్ అది బ్రాండ్ వాచ్ దట్ టూ చాలా రేర్ బ్రాండ్ దాని కాస్ట్ తౌసండ్స్ కాదు లాక్స్ అది 20 లాక్స్ వాచ్ అని చెప్పగానే రేణుక కి గుండె జారి కడుపులోకి వచ్చేస్తుంది ….

ఏంటి 20 లక్షలా 😯😯 అంత అమౌంట్ పెట్టి తీసుకుందా వాచ్ అని ఆలోచిస్తూ ఇంకో సారి మాయ కి క్రెడిట్ కార్డ్ ఇవ్వకూడదు జై అనవసరంగా ఎంత ఖర్చు చేసిందో చూడు మీ డాడ్ కి కూడా ఎపుడు అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వలేదు

అది నా అమౌంట్ లో తీసుకున్న గిఫ్ట్ మామ్ అంకుల్ కే కాదు ఆంటీ, ఆద్య కి కూడా గిఫ్ట్స్ తీసుకుంది అందుకే మేము రావడానికి కొంచెం లేట్ అయింది అని చెప్తూ అమర్ నుండి కాల్ రావడం తో లిఫ్ట్ చేసి అక్కడి నుండి బయటకు గార్డెన్ వైపు వెళతాడు…

ఇపుడు ఎందుకు రా ఈ గిఫ్ట్ నాకు నువ్వు రావడమే పెద్ద గిఫ్ట్ అంటూ మాయ నుదుటన ప్రేమగా ముద్దు పెడుతూ వాచ్ చాలా బాగుంది బంగారం అని వాచ్ వైపు చూస్తూ నవ్వుతూ చెప్పగానే మాయ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అత్త ఎక్కడ మామ వచ్చినప్పటి నుండి కనిపించడం లేదు

కిచెన్ లో ఉన్నట్టు ఉంది మాయ అని మహిదర్ చెప్పగానే ఒకే మామ ఇపుడే వస్తా అని మరో గిఫ్ట్ బ్యాగ్ తీసుకుని కిచెన్ లోకి వెళ్తున్న కూతురిని చూసి రేణుక పళ్ళు నూరుతుంది…

హాయ్ అత్త ఏం చేస్తున్నావ్ అంటూ వెనుక నుండి మీద చుట్టూ చేతులు వేసి అడుగుతున్న మాయ ను చూసి ఏయ్ మాయ వచ్చారా ముందు నువ్వు రా….  ఇలా కూర్చో అంటూ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చో పెడుతూ మాయ కోసం అప్పటికి అప్పుడు పన్నీర్ శాండ్విచ్ ప్రిపేర్ చేసి ఇవ్వగానే మాయ కొంచెం టేస్ట్ చేసి వావ్ సూపర్ అత్త చాలా బాగుంది ఇదిగో ఇది నీ కోసం తెచ్చాను అని శైలు కోసం తీసుకున్న బ్యాంగిల్స్ ఇస్తుంది….

శైలు గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి చూసి చాలా బావున్నాయి రా బట్ నాకు ఎందుకు రా మీ మావయ్య చాలానే తెచ్చారు నువ్వు తీసుకోవాల్సింది కదా బంగారం

అత్త ఇవి నేను మీ మీదున్న ప్రేమతో తెచ్చాను సో… నో అనకుండా తీసుకో ప్లీస్ అని తన శాండ్విచ్ ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కమ్…. కమ్ అందరూ హాల్ లో కూర్చున్నారు నువ్వు ఒకటే ఎందుకు ఇక్కడ పదా వెళ్దాం…

ఆగు రా అందరికీ జ్యూస్ తీసుకుని వెళ్దాం అని రెండు ట్రేస్ లో జ్యూస్ గ్లాసెస్ పెట్టేసి మెయిడ్స్ తో వాటిని తీసుకుని రమ్మని చెప్పి హాల్ లో ఉన్న అందరినీ నవ్వుతూ మాట్లాడుతూ జ్యూస్ తాగుతూ ఉంటుంది…

మాయ అసలేం చేస్తున్నావ్ నువ్వు అంత కాస్ట్ పెట్టి గిఫ్ట్ తీసుకుని రావడం అవసరమా అంటూ సీరియస్ గా చూస్తూ మెల్లగా అడుగుతుంది రేణుక

అదేంటి మామ్ అలా అంటావ్ నేను ఇచ్చిన గిఫ్ట్స్ ప్రైస్ కాదు అవి ఇచ్చినపుడు వాళ్ళ ఫేసెస్ లో కనిపించిన హ్యాపీనెస్ చూడు అని విసుగ్గా చెప్తుంది మాయ

అంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తే వాళ్లేంటి నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను … ఎపుడైనా మీ అత్త, మామ కి ఎట్ లీస్ట్ నీకు కాబోయే వాడికి అయినా ఒక గిఫ్ట్ ఇచ్చావా నీకు వాళ్ళ కంటే వీళ్లే ఎక్కువ అయిపోయారు

నువ్వు ఎప్పటికీ మారవు మామ్ ఎంత సేపు నీ పుట్టింటి మీద ప్రేమ తప్పా నీ కూతురి మనసులో ఏముందో థింక్ చేయవు అని రేణుక వైపు విసుగ్గా చూస్తూ ఆగు నీ పని చెప్తా అనుకుని అయ్యో దానికి ఎందుకు మామ్ ఇంత థింక్ చేస్తున్నావ్…. నువ్వు నాతో కాకుండా ఈ విషయం డాడ్ తో చెప్తే ఆయనే ఎస్ చెప్పే వారు దీనికి కుడా ఎందుకు మామ్ ఇంత థింకింగ్

సడెన్ గా మాయ ఎందుకు ఇంత పెద్దగా మాట్లాడుతుందో అర్థం అవ్వక మాయ కామ్ డౌన్ ఇపుడు ఎందుకు ఇంత గట్టిగా అంటున్నావ్ ఈ విషయం మీ డాడ్ తో డిస్కస్ చేయకు అని సీరియస్ గా చెప్తుంది…

ఉఫ్… మామ్ డాడ్ కి చెప్తేనే కదా తెలిసేది నువ్వు కామ్ గా ఉండు నేను మాట్లాడుతాను కదా అంటూ వెళ్ళి వినయ్ పక్కన కూర్చుని చెప్పనా అంటూ రేణుకా వైపు చూస్తుంది

రేణుక మాయ వైపు కంగారుగా చూస్తూ నీకు 🙏🙏 దండం పెడతానే చెప్పకు అని సైగ చేస్తున్న రేణుక ను చూసి నవ్వుతూ డాడ్ పాపం మామ్ మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటుంది అది చెప్తే ఎవరేం అనుకుంటారో అని టెన్షన్ పడుతుంది

ఇది ఈ రోజు నా కొంప ముంచేలా ఉంది 🙆🙆 అని రేణుక కంగారుగా చూస్తూ ఉంటుంది

నాకు చెప్పడానికి టెన్షన్ ఎందుకు బంగారం ఇంతకీ విషయం ఏంటీ??

అదీ..!! అసలు విషయం ఏమిటంటే అంటూ మాట్లాడుతున్న మాయ నోరు మూసి అదేం లేదండి అని కవర్ చేస్తున్న రేణుక చేతిని నెట్టేసి నన్ను చెప్పనివ్వు మామ్ అని చెప్పి నీకు తెలుసు కదా డాడ్ మామ్ కి కుక్ చేయడం అంటే బాగా ఇష్టం దట్ టూ సండే వస్తే తన చేత్తో మన అందరికీ స్పెషల్స్ కుక్ చేసి పెట్టేది కదా ఇవాళ అది మిస్ అయిపోయింది అని ఫీల్ అవుతోంది… నువ్వు ఒకే అంటే ఇక్కడ కుక్ చేసి అందరికీ ఇష్టమైనవి వండుతారు అంటుంది దానికి మీరేం అంటారో అని కంగారు పడుతుంది

మాయ చెప్పింది విన్న రేణుక అసలు నేను ఎపుడు చెప్పాను ఇలా అని నోరు తెరిచి అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది 😳😯😯

దీనికి టెన్షన్ ఎందుకు రేణు హ్యాపీగా వెళ్ళి కుక్ చెయ్ అని చెప్తున్న వినయ్ ను చూసిన రేణుక అది కాదండి నేను అసలు ఏమి అని అంటుండగా మామ్ డాడ్ కూడా ఒకే అన్నాడు కదా ఇంకేంటి చూస్తున్నావ్ వెళ్ళి కుక్ చెయ్ అత్త కూడా ఉంది కదా తను కూడా హెల్ప్ చేస్తుంది ఎమ్ అంటావ్ అత్త అంటూ శైలు వైపు చూస్తూ అడుగుతుంది….

తప్పకుండా బంగారం రండి వదిన అంటూ రేణుక చెయ్ పట్టుకుని కిచెన్ లోకి తీసుకుని వెళ్తున్న శైలు ను చూసి ఇంటికి వెళ్ళాక చెప్తా నీ పని అని మాయ వైపు కొర కొర చూస్తూ రుస రుస లాడుతూ కిచెన్ లోకి వెళ్తుంది రేణుక అది చూసిన నవ్వుకుంటూ ఉంటుంది….

మాయ అందరి వైపు చూసి మెల్లగా అక్కడి నుండి జారుకుని ఆద్య రూమ్ వైపు వెళ్లాలి అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన మాన్య ను చూసి నవ్వుతూ తనను హగ్ చేసుకుంటూ తనతో మాట్లాడుతూ ఉంటుంది…

జై గార్డెన్ లోకి వెళ్ళి అమర్ తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఇంకేంట్రా ఇవాళ ప్లాన్స్ ఎక్కడికి వెళ్తున్నావ్ ఏం చేస్తున్నావ్ అని జనరల్ గా అడుగుతాడు

నథింగ్ రా ఫుల్ బోరింగ్ నీ కంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ నాకు అంత అదృష్టం ఎక్కడిది 😏😤 ఇవాళ ఏ అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చారు సర్ గారు అని వెటకారంగా అడుగుతాడు

ఏడ్చావ్ ఇవాళ నేను ఎక్కడికి వెళ్లలేదు ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను అందుకే అందరం ఆద్య వాళ్ళ విల్లా కి వచ్చాం ఇవాళ డిన్నర్ వరకు ఇక్కడే స్పెండ్ చేసి రిటర్న్ అవుతాం

ఆర్ యూ సీరియస్ జై?? నేను జోక్ గా అన్నావ్ అనుకున్నా పార్టీ లో అంటే నిజంగానే మహిదర్ అంకుల్ విల్లా కి వెళ్ళావా

యాహ్ వెళ్ళాను నో నో అందరం వచ్చాం ఇక్కడ చాలా ప్లెసెంట్ గా ఉంది అమర్ కుదిరితే నువ్వు కూడా రా వుయ్ హ్యావ్ గ్రేట్ టైం హియర్ ఆద్య ఫ్రెండ్ మాన్య కూడా ఇందాకే వచ్చింది…

అమర్ రాను అని చెప్పాలి అనుకున్న వాడు కాస్త మాన్య వచ్చింది అని చెప్పగానే నవ్వుతూ అలాగే జై ఇపుడే స్టార్ట్ అవుతాను అడ్రస్ షేర్ చెయ్ అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు…

అమర్ కి అడ్రస్ పెట్టాక గార్డెన్ చూస్తూ తల పైకి ఎత్తి చూసిన జై కి అపుడే నిద్ర లేచి తన బెడ్ రూమ్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి వొళ్ళు విరుచుకుంటూ కనిపిస్తుంది ఆద్య….

అలా చేస్తున్నప్పుడు ఆద్య అందమైన బెల్లీ సూర్యుని కాంతి లో మరింత అందంగా మెరుస్తూ జై కంట్లో పడుతుంది… డైమండ్ బెల్లీ రింగ్ తళుక్కున మెరవడం తో జై కళ్ళకు ఆద్య ఇంకా అందంగా కనిపిస్తుంది పింక్ కలర్ లో నాజుగ్గా ఉన్న ఆద్య నడుము కి బెల్లీ రింగ్ మరింత అందాన్ని పెంచింది అని అనిపిస్తూ ఉంటే ఆద్య వైపు అలా రెప్ప వేయడం కూడా మర్చిపోయి చూస్తూ ఉన్నాడు….

ఆద్య తన మీద సన్ రైజర్స్ చూస్తూ చిరు నవ్వుతో తనకు ఇవాళా ఎందుకో ప్లేసెంట్ గా అనిపిస్తూ ఉంటే నవ్వుతూ గార్డెన్ వైపు చూసిన ఆద్య కి హాలీవుడ్ హీరో లా కనిపిస్తున్న జై ను చూసి నవ్వు ప్లేస్ లో కోపం వచ్చి చేరి తన మొహం ఎర్రబడుతుంది ….

 

To Be Continueed……………………………

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply