అద్విక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు…… అద్విక్ మదర్ పేరు శ్రీవాణి ఫాదర్ నాగేష్……. అద్విక్ చిన్నప్పుడే నాగేష్ చనిపోవడం తో అప్పటి నుంచి శ్రీవాణి నే అద్విక్ కు అమ్మ నాన్న అన్ని తానే అయి అద్విక్ కు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ వుంటుంది . శ్రీవాణి ప్రైవేట్ స్కూల్ లో మాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తోంది & ఇద్దరు ఉన్నంతలో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు మార్నింగ్ ఎవరి వర్క్స్ మీద వాళ్ళు వెళ్ళడం ఈవెనింగ్ వచ్చాక సరదా కబుర్లతో డిన్నర్ కంప్లీట్ చేయడం ఇద్దరి డైలీ రొటీన్ & ఎవ్రీ వీకెండ్ శ్రీవాణి కి ఇష్టమైన డిషెస్ కుక్ చేయడం అద్విక్ కి చాలా ఇష్టం…..
మరో వైపు అద్విక్ తన పర్సనల్ లైఫ్ లో కూడా ఫర్దర్ స్టెప్ వేసి హ్యాపీగా ఉన్నాడు ఎలా అంటే తన కంపెనీ లో వర్క్ చేస్తున్న ఆశ్లేష అనే అమ్మాయితో లవ్ లో ఉన్నాడు & ఆశ్లేష కి కూడా అద్విక్ అంటే చాలా ఇష్టం ముందు ప్రపోజ్ చేసింది అద్విక్ నే అయినా అద్విక్ తో లవ్ లో పడ్డాక తన లవబుల్ క్యారెక్టర్, కేరింగ్ బిహేవియర్ & కంపాటబిలిటీ , సపోర్టివ్ నేచర్ కి ఆశ్లేష అద్విక్ ను ప్రాణంగా ప్రేమిస్తూ వుంటుంది. అంతే కాకుండా రెండు ఫ్యామిలీస్ కూడా వీళ్ళ లవ్ ను త్వరగానే యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ కి ఓకే చెప్పారు ……
సో పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో యాస్ సూన్ యాస్ పాజిబుల్ ఇద్దరు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు….. ఒక రోజు ఆఫీస్ లో ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు గ్రాండ్ పార్టీ ఆరెంజ్ చేస్తారు అక్కడ అద్విక్ తాగే డ్రింక్ లో ఆల్కహాల్ మిక్స్ అవ్వడం తో సెన్సెస్ కోల్పోయిన అద్విక్ రిసార్ట్ లో తమకు ఇచ్చిన రూమ్ లో అనుకోకుండా అద్విక్, ఆశ్లేష మ్యారేజ్ కి ముందే ఫిజికల్ గా కలుస్తారు…… ఇంటిమేషన్ అయిన నెక్స్ట్ మార్నింగ్ ఇద్దరు చాలా ఆక్వార్డ్ గా ఫీల్ అవుతూ మ్యారేజ్ త్వరగా చేసుకోవాలి అని అనుకుంటారు ……
డల్ గా కనిపిస్తున్న ఆశ్లేష వైపు చూసి ఇంట్లో పేరెంట్స్ తో పెళ్లికి ముహూర్తం పెట్టించమని అద్విక్ నే అడగడం తో పేరెంట్స్ కూడా వీళ్ళ మ్యారేజ్ గురించే వెయిట్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే కాదు మళ్ళీ అద్విక్ మనసు ఎక్కడ మారుతుందో అని వెంటనే పురోహితుడిని రప్పించి ఇద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం పెట్టమని చెప్తారు……
పురోహితుడు ఇద్దరి జాతకాలు పరిశీలించి ఇద్దరి జాతకాలు దివ్యంగా ఉన్నాయి కాబట్టి పంచాగం ప్రకారం ఇద్దరికీ నెలలో ఎంగేజ్మెంట్ కి ఇంకో 2 మంత్స్ లో పెళ్లికి మంచి ముహూర్తం వుంది అని చెప్పగానే పెద్దవాళ్ళు సంతోషంగా ఆ ముహూర్తాలు ఫిక్స్ చేయమని చెప్పగానే పంతులుగారు అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు…….
ఆశ్లేష కు చాలా గిల్టీ గా ఉంతుంది తన పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ ను మిస్యూస్ చేశాను అని బాధ పడుతూ వర్క్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేక డల్ గా ఒక్కటే కెఫెటేరియా లో కూర్చున్న దగ్గరకు అద్విక్ రావడం తో ఆశ్లేష తన వైపు ఓ సారి చూసి మళ్ళీ ఎటో ఆలోచిస్తూ ఉంటుంది….. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి ఆశ్లేష ఆఫీస్ వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేక పోతోంది ఎపుడు ఎదో ఆలోచిస్తూ వుంటుంది…… తనను అలా చూసిన అద్విక్ కాఫీ ఆర్డర్ చేసి అది రాగానే ఇద్దరు తాగుతూ వున్నారు……
శ్లేష ప్లీజ్ …..!! నువ్వు ఇలా ఉండకు నాకు చాలా కష్టంగా ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎప్పటికీ ప్రేమిస్తాను కూడా మనం చేసింది తప్పే కాదనను కానీ అది అనుకోకుండా జరిగిపోయింది నేను ఎంటో నీకు తెలుసు కదా నిన్ను తప్ప మరో అమ్మాయి కి నా లైఫ్ లో ఎటువంటి చోటు లేదు అంటూ ప్రేమగా చెప్తాడు
కష్టమైన….. ఇష్టమైన!!!
బాదైన…… సంతోషమైన !!!
చావైన…. బతుకైన….. నీతోనే … శ్లేష ♥️
ఆశ్లేష నీళ్ళు నిండిన కన్నులతో అద్విక్ వైపు చూసి అద్విక్ చేతిని తన చేతిలోకి తీసుకుని ఐ నో అద్విక్ హౌ మచ్ యూ లవ్స్ మీ బట్ స్టిల్ చాలా గిల్టీ గా ఉంది……. మమ్మీ , డాడీ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ & వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అని గుర్తు వచ్చిన ప్రతీ సారి నా మీద నాకే అసహ్యంగా వుంది అని కన్నీళ్లతో చెప్తుంది……
హేయ్ శ్లేష డోంట్ క్రై అని తన కన్నీళ్ళు తుడుస్తూ లుక్ ఎట్ టు మీ అని తన చిన్ పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఏ తప్పు చేయలేదు ఇందులో మిస్టేక్ ఏదైనా వుంటే అది నాది మాత్రమే నేనే నిన్ను ఫోర్స్ చేసాను నా మీదున్న లవ్ తో నువ్వు ఒకే చెప్పావ్ నేను కొంచెం కంట్రోల్ లో ఉండాల్సింది……
నో అద్విక్ ఇందులో నాకు కూడా షేర్ వుంది నిన్ను వద్దు అని నేను వార్న్ చేయలేక పోయాను ఇట్స్ మై మిస్టేక్ టూ……
శ్లేష వాట్ ఎవర్ జరిగింది ఏదో జరిగిపోయిందినువ్వు దాని గురించి వదిలేయ్& ఇందాకే నాకు ఒక గుడ్ న్యూస్ తెలిసింది అది నీతో షేర్ చేసుకుందాం అనే వచ్చాను నువ్వు ఇక ఆ ట్యాప్ కట్టేసి కొంచెం స్మైల్ ఇస్తే నేను ఆ న్యూస్ చెప్తాను
ఆశ్లేష అద్విక్ వైపు చూస్తూ ఏంటది ☹️☹️
హు 😏 నువ్వు ఇలా అశోకవనం లో సీత లా ఇలా డల్ గా కూర్చుంటే నాకు నచ్చట్లేదు కొద్దిగా నవ్వు శ్లేష ప్లీజ్ నాకు నీ స్మైల్ అంటే చాలా ఇష్టం అంటూ ముడుచుకున్న ఆశ్లేష పెదవులను తన రెండు వేళ్ళు బొటనవేలు, చూపుడువేలు తో సాగదీసి ఆశ్లేష ను నవ్వించి…… నేను నీ నుండి కోరుకునేది ఎప్పటికీ రెండు మాత్రమే శ్లేష అవి ఎప్పటికీ నీ నుండి దూరం అవ్వకూడదు అలా అని నాకు ప్రామిస్ చెయ్ అని తన చేయి ఆశ్లేష ముందు పెడతాడు…….
ఆశ్లేష అద్విక్ వైపు చూసి ప్రామిస్ అద్విక్ ఇప్పుడు చెప్పు ఎంటవీ అంటూ తన వైపు చూస్తుంది ……
అద్విక్ తన వైపు చూస్తూ నువ్వు ఎప్పుడు నవ్వుతూ వుండాలి & ఆ నవ్వులో నేను ఎప్పుడూ నీతోనే వుంటాను సో ఎప్పటికి నువ్వు ఇలా ఏడ్చకూడదు సరేనా ఎది ఒక సారి నవ్వు అనగానే ఆశ్లేష లైట్ గా స్మైల్ చేస్తుంది 🙂😊
అది నా శ్లేష అంటే చూడు ఇపుడు ఎంత క్యూట్ గా ఉన్నావో అని నవ్వుతూ ఆశ్లేష బుగ్గలు లాగి చీక్ కిస్ ఇచ్చి తన పక్కన కూర్చున్న అద్విక్ వైపు చిరు కోపంగా చూస్తూ ఆఫీస్ లో ఉన్నాం అద్విక్ అని చిరు దెబ్బలు వేస్తూ అది సరే ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి ??
గెస్ వాట్ ఇంకో వన్ మంత్ లో మన ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు అని అద్విక్ చిరు నవ్వుతో చెప్పడం చూసిన ఆశ్లేష మెరిసే కళ్ళతో వాట్ నిజమా అంటూ హ్యాపీగా అడుగుతుంది…..
ట్రూ శ్లేష ఇపుడు నువ్వు హ్యాపీ కదా……
చాల హాపీగా వుంది అద్విక్ & అంతే త్వరగా మ్యారేజ్ కూడా అయిపోతే నాలో ఈ గిల్టినేస్ వుండదు …….
జస్ట్ 3 మంత్స్ రా మన మ్యారేజ్ కూడా అయిపోతుంది ……
హ్మ్మ్ ఇపుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అద్విక్
అద్విక్ చిన్న స్మైల్ ఇస్తూ ఇక నువ్వు మూడిగా వుండకుండా హ్యాపీగా వుండు సరేనా అనగానే ష్యూర్ అంటూ అప్పటి వరకు ఉన్న డల్ నెస్ పోయి ఆశ్లేష ఎంగేజ్మెంట్ వర్క్స్ గురించి గల గలా మాట్లాడుతూ ఉంటే అద్విక్ తన హ్యాపీనెస్ ను చూసి నవ్వుతూ ప్రేమగా తన వైపు చూస్తూ ఉంటాడు ……..
చెప్పడం మర్చిపోయా శ్లేష ఈవెనింగ్ ఇంటికి వెళ్దాం మమ్మీ నిన్ను ఇంటికి తీసుకుని రమ్మంది ….. అలాగా ఒకే వెళ్దాం నాకు కూడా అత్తమ్మ ను చూడాలి అని వుంది తనను మీట్ అయ్యి 2 వీక్స్ అవుతోంది……సరే ఇక వెళ్దాం పదా ఇన్ని డేస్ నీ మూడినెస్ తో వర్క్ కూడా ఇగ్నోర్ చేసావ్ ఇప్పుడు వెళ్ళి మొత్తం ఫినిష్ చేయాలి అనగానే ఆశ్లేష బద్దకంగానే అద్విక్ వెంట వెళ్తుంది అలా ఇద్దరు వర్క్ లో ఈవెనింగ్ వరకు బిజీ అయిపోయారు …..
ఈవెనింగ్ అద్విక్ , ఆశ్లేష ను తన బైక్ లో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు …….. వీళ్ళు వస్తున్నారు అని ముందుగానే తెలియడం వల్ల శ్రీవాణి స్కూల్ కి లీవ్ పెట్టేసి ఆశ్లేష కోసం తనకు ఇష్టమైన ఐటమ్స్ అన్ని కుక్ చేస్తూ కిచెన్ లో బిజీగా వుంటుంది …..ఆశ్లేష ఇంట్లోకి రావడం తో నే అత్తమ్మ …. అత్తమ్మ ….. అని అరుస్తూ వస్తుంది …….
శ్రీవాణి కిచెన్ లో నుండి ఇక్కడ వున్నా శ్లేష అని పిలవగానే ఆశ్లేష నవ్వుతూ కిచెన్ లోకి వెళ్లి శ్రీవాణి ను సైడ్ హగ్ చేసుకుని కిచెన్ గట్టు మీద కూర్చుంటూ శ్రీవాణి కి బోర్ కొట్టకుండా కబుర్లు మాట్లాడుతూ వుంటుంది …….
అద్విక్ వాళ్ళను అలా చూసి నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ కి వెళ్ళిపోతాడు ………శ్రీవాణి ఆశ్లేష తో కబుర్లుచెప్తూనే శ్లేష కు ఇష్టమైనవి చేసి తనే స్వయంగా తినిపిస్తుంది……. శ్లేష నో అనకుండా తింటూ నువ్వు సూపర్ అత్తమ్మ ఎంత బాగా చేశావో ఈ స్వీట్ &ఇదే కాదు లడ్డు కూడా సూపర్ గా ఉంది 😋😋 ఇన్నాళ్ళు నీ కుకింగ్ బాగా మిస్ అయ్యాను…..
అవును అత్తమ్మ నువ్వేమో ఇంత టేస్టీ ఫుడ్ చేసి పెడతావ్ ఫ్యూచర్ లో నేను ఇంత టేస్టీ గా చేయగలనా ఇంత టేస్టీ గా ……నా మొహానికి గాస్ స్టవ్ అన్ చేయడం మాత్రమే వచ్చు అని చెప్పి నవ్వుతుంది ఆశ్లేష 🤣😂
నేను వున్నాను కదా శ్లేష మీకు నచ్చినవి డెయిలీ చేసి పెడతాను…… నువ్వు నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో చాలు అంటూ శ్లేష కు నీళ్ళు అందిస్తూ చెప్తున్న శ్రీవాణి వైపు చూసి మా మంచి అత్తమ్మ అని బుగ్గన ముద్దు పెడుతూ నువ్వు,నేను ఇద్దరం కలిసి అద్విక్ ను చూసుకుంటూ కుకింగ్ కూడా చేద్దాం ఎట్లిస్ట్ వెజ్జీస్ అయినా కట్ చేయడం నేర్చుకొనివ్వు అత్తమ్మ అనగానే శ్రీవాణి నవ్వి నా బంగారు కొండ అని శ్లేష కు మేటికలు విరిచి నుదుటిన ముద్దు పెడుతుంది……
అపుడే అక్కడికి వచ్చి వాళ్ళను అలా చూడగానే అద్విక్ కు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి వాళ్ళ మధ్య వున్న ప్రేమ చూసి ఎందుకంటే ఇద్దరూ అత్త – కోడలి లా కాకుండా అమ్మా – కూతురు లా ఉంటారు అందుకే అద్విక్ కి వాళ్ళ బాండింగ్ అంటే చాలా ఇష్టం……
ఎంటిమమ్మీ అన్ని శ్లేష కేనా నాకేం లేవా అని అంటాడు అద్విక్ ….. కిచెన్ ప్లాట్ఫమ్ మీద ఆశ్లేష పక్కన సెటిల్ అవుతూ అది చూసిన శ్రీవాణి అయ్యో నీకు లేకుండానే ఇదిగో అద్విక్ నీకు ఇస్టమని జామూన్ చేశాను తిను అని తినిపిస్తూ ఉంది అది చూసిన అద్విక్ నవ్వి జామూన్ తీసుకుని శ్రీవాణి, ఆశ్లేష కు తానే స్వయంగా తినిపిస్తూ తాను తింటూ వున్నాడు ……
తర్వాత ముగ్గురూ హాల్ లోకి వచ్చి కూర్చుని ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ వున్నారు కాసేపటికి ఆశ్లేష శ్రీవాణి కు భై చెప్పి అద్విక్ తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లి పోతుంది & అద్విక్ కాసేపు ఆశ్లేష అమ్మ నాన్న లతో టైమ్ స్పెండ్ చేసి ఎవరు చూడకుండా ఆశ్లేష బుగ్గన ముద్దు పెట్టుకుని ఆశ్లేష అద్విక్ ను కొట్టడానికి రాగానే బైక్ మీద పారిపోవడం చూసి ఆశ్లేష నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది……..
నెక్స్ట్ వీక్ అద్విక్, ఆశ్లేష వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఎంగేజ్మెంట్ షాపింగ్ చేస్తారు ……..తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా సెలెక్ట్ చేస్తారు ఆ రోజు అంతా అలా అటు ఇటు ఎంగేజ్మెంట్ వర్క్స్ తో తిరుగుతూ రెండు ఫ్యామిలీస్ బాగా బిజీ అవుతాయి……
ఎంగేజ్మెంట్ డే అందరి సమక్షంలో ఆశ్లేష, అద్విక్ ల ఎంగేజ్మెంట్ చాలా బాగా జరుగుతుంది …….
ఇద్దరు చాలా సంతోషంగా ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ రింగ్స్ మార్చుకుంటారు……. ఎంగేజ్మెంట్ కు వచ్చిన వాళ్ళు అందరు చూడముచ్చటైన జంట అని వీళ్ళను మనస్పూర్తిగా ఆశీర్వదిస్తారు అది వింటున్న శ్లేష
చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అద్విక్ చేతిని మరింత గట్టిగా పట్టుకుని తన హ్యాపీనెస్ ను తెలియచేస్తుంది ….. ఆశ్లేష హ్యాపీనెస్ ను చూసిన అద్విక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ……
నెక్స్ట్ డే నుండి ఆశ్లేష , అద్విక్ ఎప్పటిలా నే వాళ్ళ వర్క్స్ లో బిజీ అయిపోయారు ……..ఇలా ఇంకో మంత్ అయిపోతుంది పెళ్లికి ఇంకా వన్ మంత్ మాత్రమే వుంటుంది …..ఇక్కడ పెద్ద వాళ్ళంతా పెళ్లి పనులు చూసుకుంటూ చాలా బిజీగా ఉంటారు …….. వెడ్డింగ్ కార్డ్స్ సెలక్షన్, పెళ్లి షాపింగ్, వెడ్డింగ్ హల్ సెలక్షన్ ఇలా ఒక్కొక్కటీ చూసుకుంటూ వున్నారు & మ్యారేజ్ కి వన్ వీక్ వుంది అనగా ఆశ్లేష లాంగ్ లీవ్ తీసుకుని ఇంట్లోనే వుంటుంది ……..
మెహంది ఫంక్షన్, హల్ది ఫంక్షన్, సంగీత్ ఇలా అన్ని చాలా ఆనందంగా ఒక్కోటి చాలా ఫాస్ట్ గా జరిగిపోతాయి ……..నెక్స్ట్ డే పెళ్లి అవ్వడం తో ఆశ్లేష సంతోషంగా రేపటితో అద్విక్ నా హస్బెండ్ అని తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ హ్యాపీగా పడుకుంటుంది ………కానీ ఆశ్లేష కు ఏమ్ తెలుసు తన సంతోషం ఇవాళే ఆకరి రోజు అని ☹️☹️
తెల్లవారగానే ఆశ్లేష ను అందంగా పెళ్లి కూతురు ను చేసి అక్కడి నుంచి కళ్యాణ మంటపం కు తీసుకుని స్టార్ట్ అయ్యారు & అద్విక్ ను కూడా పెళ్లి కొడుకు ను చేస్తారు శ్రీవాణి తన కొడుకుని అలా చూసి మురిసిపోతూ వుంటుంది …… ఒకొక్కరిగా అందరు కళ్యాణ మండపం కు స్టార్ట్ అవుతూ వుంటారు & అద్విక్ కూడా కార్ ఎక్కబోతూ ఉండగా తన మ్యానేజర్ నుండి అర్జంట్ గా ఒక మెయిల్ సెండ్ చేయమని కాల్ రావడం తో తప్పక ఇంట్లో వాళ్ళను వెడ్డింగ్ హాల్ కి వెళ్ళమని పంపించి నేను ఇంకో 15 మినిట్స్ లో వస్తా అని చెప్పి అందరి ను పంపించేసాడు ……. అద్విక్ తన వర్క్ ను ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకొని వెంటనే కార్ లో కళ్యాణ మంటపం కు ఆశ్లేష పెళ్ళి కూతురు గా రెడీ అయ్యాక పంపిన పిక్స్ చూస్తూ తను కూడా స్టార్ట్ అయ్యాడు ……
అద్విక్ కార్ డ్రైవర్ తో టైమ్ అవుతోంది అని ఫాస్ట్ గా వెళ్ళమని చెప్పడం తో స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ వున్నాడు డ్రైవర్ & వెనుక కూర్చున్న అద్విక్ ఆశ్లేష తో తను సంతోషంగా గడపబోయే జీవితాన్ని ఊహించుకుంటూ ఆనందంగా కూర్చున్నాడు అపుడే అటు వైపు నుండి స్పీడ్ గా వస్తున్న ట్రక్ బ్రేక్స్ ఫెయిల్ అయి అద్విక్ కార్ కి డాష్ ఇస్తుంది ……..
అద్విక్ కార్ 5 పల్టీలు కొట్టేసి ఒక మూలన వెళ్లి పడుతుంది డ్రైవర్ స్పాట్ లో నే చనిపోతాడు & కొన ఊపిరి తో పోరాడుతున్న అద్విక్ ను చూసి చుట్టూ పక్కల వాళ్ళు యాంబులెన్స్ కు కాల్ చేసి అద్విక్ ను హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు ……… అద్విక్ కు యాక్సిడెంట్ అయిన విషయం తెలియగానే శ్రీవాణి, ఆశ్లేష & తన పేరెంట్స్ అందరు మండపం నుండి హాస్పిటల్ కు వస్తారు……
ఆశ్లేష కన్నీరు మున్నీరుగా విలపిస్తు హాస్పిటల్ కు వస్తుంది. కొడుకునే ప్రాణంగా చూసుకుంటూ బ్రతికిన శ్రీవాణి ఇప్పుడు అద్విక్ ను ఆ పరిస్థితి లో చూసి ఏడుస్తూ ఉంది ……… హాస్పిటల్ కు వెళ్లి అద్విక్ ను బెడ్ మీద చూసి అందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు
కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి ఐ యాం సారీ హి ఈజ్ నో మోర్ అని చెప్పడం విన్న శ్రీవాణి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది తనను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు ……..
ఆశ్లేష కు అద్విక్ ఇక లేడు అన్న మాట వినగానే తనకు ప్రపంచం మొత్తం సున్యంగా అనిపిస్తూ ఉంది …….ఈ ప్రపంచం లో తను ఒంటరిది అనే బాధ తనను వెంటాడుతూ వుంది & ఇక తను ఎవరి కోసం బ్రతకాలి ……??
ప్రాణంగా చూసుకున్న వాడే తనను వదిలి వెళ్లిపోతే ఇక తను ఎందుకు బ్రతకాలి అని ఏడుస్తూ ఏడుస్తూ అలాగే స్ట్రెస్ ఎక్కువ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవడం తో వెంటనే ఆశ్లేష ను ఎత్తుకుని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళగానే డాక్టర్ తనను చెక్ చేసి షి ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్తారు ….. అది విని అందరూ షాక్ అయ్యి అలాగే చూస్తూ వుండిపోయారు ఎలా రీఆక్ట్ అవ్వాలో కూడా వాళ్లకు అర్తం కావడం లేదు ……
కాసేపటికి కాన్షియస్ లో కి వచ్చిన ఆశ్లేష తను కన్సీవ్ అయింది అని తెలుసుకుని తన పొట్ట తడుముతూ నువ్వు లేకుండా నేను ఉండలేను అని తెలిసి నువ్వు వెళ్తూ వెళ్తూ నీ ప్రతి రూపాన్ని నాకు ఇచ్చి వెల్లావా అద్విక్ 🥹…… ఇప్పటి వరకు ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి అని అనుకున్నా 🥺 కానీ బ్రతకాలి ఇదిగో అని పొట్ట మీద చేయి పెట్టుకుని వీడి కోసం మన బిడ్డ కోసం బ్రతకాలి 🥹🥺
నువ్వు నాతో లేకపోయినా నీ ప్రతి రూపం అయిన మన బిడ్డ నాతోనే వుంటుంది & మన బిడ్డ లో నిన్ను చూసుకుంటూ బ్రతికేస్తా అద్విక్ అని ఏడుస్తూ ఐ లవ్ యూ రా లవ్ యు సో మచ్ అంటూ ఏడుస్తున్న శ్రీవాణి ను దగ్గరకు తీసుకుని తనను ఓదారుస్తూ వుంటుంది
ఎందుకు అత్త ఏడుస్తూ వున్నావ్ అద్విక్ లేకపోతే ఏమ్ తన ప్రతి రూపం మన తోనే వుంది & ఈ బేబీ లో అద్విక్ ను చూసుకుంటు బ్రతికేద్దాం అని చెప్తుంది 😢😢
శ్లేష నీకు బాధగా లేదా వాడ్ని ప్రాణంగా కంటే ఎక్కువ ప్రేమించావు కదే అని ఏడుస్తూ అడుగుతున్న శ్రీవాణి వైపు చూసి బాధ లేదని ఎవరు అన్నారు అత్త నా ప్రాణాన్ని నా నుండి తీసుకు పోతే నాకు బాధగా వుండదా కానీ అద్విక్ వెళ్తూ నాకు బేబీ ను ఇచ్చి వెళ్ళాడు అని అద్విక్ వైపు చూస్తూ ఈ బేబీ ను చూసుకుంటూ నా అద్విక్ జ్ఞాపకాలతో ఈ జీవితాన్ని గడిపేస్థాను……
ఎడిపించని ప్రేమంటు
ఏది వుండదు🥺
ఎడిపించక పోతే
అది ప్రేమే అయివుండదు🥺☹️
ఇన్నాళ్లు అద్విక్ నా బలం అని అనుకున్నా
కానీ నాకు ఇప్పుడే తెలిసింది
అద్విక్ నా బలం మాత్రమే కాదు
నా బలహీనత కూడా తనే అని
ఎవరు చెప్పారు అత్త ప్రేమిస్తే సంతోషంగా వుంటుంది అని అది అపద్దం హు సేడ్ లవ్ మేక్స్ బ్యూటీఫుల్ ఇట్స్ రాంగ్ ద ట్రూత్ ఇస్ లవ్ మేక్స్ లైఫ్ పెయిన్ ఫుల్ 😭😭
ప్రేమ, చావు ఎప్పుడోస్థాయో
ఎప్పుడు పోతాయో తెలియదు
కానీ రెండింటి పని ఒకటే
తీసుకుపోవడం 😢😢
ఒకటి జీవితం 😭
రెండోది ప్రాణం 😭😭
శ్రీవాణి ఆశ్లేష ను హత్తుకుని ఏడుస్తూ వుంటుంది ఆశ్లేష కూడా శ్రీవాణి ను హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది 😭😭…… తరువాత అద్విక్ బాడీ కు అంత్య క్రియలు సక్రమంగా జరిపిస్తారు & ఆశ్లేష తన లగేజ్ తీసుకుని అద్విక్ వాళ్ళ ఇంటికి వచ్చేసి శ్రీవాణి తో వుంటూ తనను చూసుకుంటూ వుంది……
ఆశ్లేష తన పేరెంట్స్ తనను ఎన్ని సార్లు మ్యారేజ్ గురించి అడిగినా వాళ్ళను కోపంగా చూస్తూరూమ్ లో కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని తన పొట్ట మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ వుండేది 🥺 ……. శ్రీవాణి కూడా అద్విక్ ను మర్చిపోయి పెళ్లి చేసుకోమని ఎన్ని సార్లు చెప్పినా ఆశ్లేష ఎవరి మాట వినేది కాదు ఇంకో సారి మ్యారేజ్ టాపిక్ తీస్తే అందరికీ దూరంగా వెళ్ళిపోతా అని సీరియస్ గా చెప్పడం తో అప్పటి నుంచి ఎవరు కూడా మ్యారేజ్ గురించి మాట్లాడేవారు కాదు…….
ఆశ్లేష తో పెళ్లి టాపిక్ వదిలేసి తనను జాగ్రత్తగా చూసుకుంటూ వుండేవారు & కొన్ని డేస్ తర్వాత అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఆశ్లేష ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండే వారు……. ఆశ్లేష శ్రీమంతం కూడా వద్దు అని చెప్పగానే అందుకు వాళ్ళు కూడా ఇంకేం అనలేక సైలెంట్ గా వుండి పోయారు …..
ఆశ్లేష కు గట్టిగా ఎడవాలి అని వున్నా అద్విక్ కు ఇచ్చిన మాట కోసం నవ్వుతూ నే వుండేది…….. కొన్ని మంత్స్ తరువాత ఆశ్లేష కు అద్విక్ పోలికలతో పండంటి మగ బిడ్డ పుడతాడు & ఆ బేబీ కి అదిత్ అని పేరు పెట్టుకుని వాడిలో అద్విక్ ను చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తోంది……
ఆశ్లేష అదిత్ ను వొళ్ళో పడుకోబెట్టుకొని వాడిని జో కొడుతూ అద్విక్ ను గుర్తు చేసుకుంటూ యూ హావ్ లెఫ్ట్ మై లైఫ్ బట్ యూ విల్ నేవర్ లీవ్ మై హార్ట్ 💓 అద్విక్ లవ్ యూ సో మచ్
నువ్వు ఎప్పటికీ తిరిగి రావని తెలుసు కాని
నా ఈ పిచ్చి మనసు ఇప్పటికీ నీ
రాకకై ఎదురుచూస్తూ నీ కోసం
పరితపిస్తూ వుంటుంది అద్విక్ 💛❤️
ఆదిత్ ను బెడ్ మీద పడుకోబెట్టి వాడి పక్కన పడుకుని అద్విక్ నేను నిన్ను చూసిన క్షణం నీ ప్రేమ లో పడిపోయాను & నువ్వు భౌతికంగా నాకు దూరమై వుండచ్చు కానీ నీ జ్ఞాపకాలతో నాలో నువ్వు ఎపుడు బ్రతికే వుంటావు …….
మరణం నిన్ను నన్ను విడదీసి శారీరకంగా నిన్ను నాకు దూరం చేసి వుండచ్చు , కానీ మానసికంగా నువ్వు నాతోనే నాలోనే వున్నావ్ అద్విక్ ……..నువ్వు ఎప్పటికీ నాతోనే నా చుట్టూనే వుంటావు అని కళ్ళు మూసుకుని అరవింద్ నే తలచుకుంటూ నిద్రపోయింది …….
ఆశ్లేష కు ఇప్పుడు ఆదిత్ మాత్రమే ప్రపంచం & తన లోనే అద్విక్ ను చూసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది & తన పేరెంట్స్ తో పాటు శ్రీవాణి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుని అద్విక్ ఉంటే ఎవరికి ఏ లోటు లేకుండా ఎలా చూసుకునే వాడు తను కూడా అలాగే అందరినీ చూసుకుంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని తను చేసిన సేవింగ్స్ తో విల్లా కూడా కట్టించి రీసెంట్ గా కార్ కూడా కొని అందరినీ హ్యాపీగా చూసుకుంటూ తను మాత్రం అద్విక్ జ్ఞాపకాలతో జీవితాన్ని అందంగా & ఆనందంగా గడుపుతోంది…..
అన్ని స్టోరీస్ హ్యాపీగా ఎండ్ అవ్వవు కొన్ని స్టోరీస్ ఇలా హ్యాపీగా స్టార్ట్ అయ్యి సాడ్ గా ముగుస్తాయి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి 🙂 మెయిన్ గా ఆశ్లేష కి అద్విక్ మీద ఉన్న లవ్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి 😌 ఒక అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే చచ్చే వరకూ ఆ ప్రేమ మారదు అని చెప్పడానికి ఆశ్లేష నే బెస్ట్ ఎక్సాంపుల్ 🥹 నేను మాత్రం స్టోరీ రాసేటపుడు చాలా ఎమోషనల్ అయ్యాను మీకు ఈ అందమైన కథ ను వినిపిస్తున్న శ్రావణి కూడా ఎమోషనల్ అయింది మరి మీరు??
THE END ❤️
