✨ చెన్నై ✨✨
ఉదయం అలారం మోగడం తో బద్దకంగా కళ్లు తెరచి గోడకు ఉన్న గడియారం వైపు చూస్తే అది 8 గంటలు అవుతూ చూపించడం తో వొళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చుని తన పక్కన చూడగానే ముద్దుగా నిద్రపోతూ కనిపిస్తున్న తన కూతురు ఐరా ను చూసి చిన్నగా నవ్వి ఫోర్హెడ్ కిస్ పెడుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు విహాన్ 😍
విహాన్ వైజాగ్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ లో సాఫ్ట్వేర్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నాడు తనకు మ్యారేజ్ అయి 4 ఇయర్స్ అవుతుంది ….. తన వైఫ్ పేరు విషిత వీళ్ళ ఇద్దరి ముద్దుల కూతురు ఐరా ముద్దుగా మిల్కీ అని పిలుస్తారు ……
విహాన్ ఫ్రెష్ అయి ఫార్మల్స్ వేర్ చేసి రెడీ అయి హాల్ లోకి వచ్చి కూర్చుని పేపర్ చదువుతూ ఉండడం చూసిన విషిత నవ్వూతూ కాఫీ తిసుకుని వచ్చి ఇవ్వగానే నవ్వూతూ కప్ తీసుకుని గుడ్ మార్నింగ్ విషి అని విష్ చేసి కాపీ సిప్ చేస్తూ ఉన్నాడు విహాన్
విషిత నవ్వుతూ విహాన్ పక్కనే కూర్చుని తనతో కాసేపు టైమ్ స్పెండ్ చేసాక విహాన్ కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయటం కోసం కిచెన్ లోకి వెళ్తుంది….. విషిత ఏదైనా ఫాస్ట్ గా చేస్తుంది సో ఇప్పుడు కుకింగ్ కూడా హాఫ్ ఆన్ అవర్ లో కంప్లీట్ చేసి విహాన్ తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది…..విహాన్ అది తినేసి ఆఫీస్ కి టైమ్ అవ్వటం తో విషిత ఇచ్చిన బాక్స్ తీసుకుని మరో సారి కూతురి వైపు చూసి ఆఫీస్ కి వెళ్లిపోతాడు ……
విహాన్ వెళ్ళిపోయాక ఐరా నిద్ర లేవక ముందే ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసి ఊర్లో ఉంటున్న విహాన్ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉండగనే ఐరా నిద్రలేచి ఏడుస్తూ ఉండడం గమనించిన విషిత అత్తయ్యా ఐరా లేచింది నేను మళ్లీ చేస్తాను అంటు కాల్ కట్ చేసి ఐరా తల్లీ లేచావా అంటు తనను ఎత్తుకుని బాత్ చేయించడానికి వాష్ రూమ్లో కి తీసుకుని వెల్తుంది ……
ఆఫీస్ కి వెళ్ళిన విహాన్ సిస్టమ్ ఆన్ చేసి తన వర్క్ లో తను బిజీ అయిపోయాడు ఆఫ్టర్ నూన్ అవ్వటం తో లంచ్ చేయాలని సిస్టమ్ షట్ డౌన్ చేసి తన బాక్స్ తీసుకుని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సురేష్ తో క్యాంటీన్ వైపు వెళ్తాడు ……
ఇద్దరు లంచ్ అయ్యాక కాసేపు ఆఫీస్ విషయాలు & పర్సనల్ విషయాలు మాట్లాడి లంచ్ అవర్ అవ్వటం తో తిరిగి ఆఫీస్ లో కి వచ్చి ఎవరి సిస్టమ్ ముందు వాళ్ళు కూర్చుంటారు
విహాన్ సిస్టమ్ ఆన్ చేస్తూ ఉండగా తన మొబైల్ రింగ్ అవ్వటం తో పాకెట్ లో ఉన్న మొబైల్ తీసి చూడగా వేద కాలింగ్ అని చూసి నవ్వూతూ అక్కడ నుండి క్యాఫీటరియా కి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు
హాయ్ విహాన్ డిస్టర్బ్ చేశానా
హలో వేద ఎలా ఉన్నావ్ ?? నో… అదేం లేదు ఇపుడే లంచ్ చేసి సిస్టమ్ ఆన్ చేస్తూ ఉన్నా ఈ లోగా నువ్వు కాల్ చేశావ్ ఎలా ఉన్నారు వేద!! విధుర్ బావున్నాడా అవును ప్రభాన్ష్ ఎలా ఉన్నాడు నేను వాడిని బాగా మిస్ అవుతున్నా…..
అందరం బావున్నాం విహాన్ ప్రభాన్ష్ ది ఎల్లుండి బర్త్డే నువ్వు విషిత , ఐరా కన్ఫర్మ్ గా రావాలి….. విధుర్ మరి మరీ చెప్పమని చెప్పాడు
వాడి బర్త్డే మేము ఎలా మర్చిపోతాం వేద….. కన్ఫర్మ్ గా అందరం ఎటెండ్ అవుతాం & రేపే స్టార్ట్ అయ్యి వచ్చేస్థాం హైదరాబాద్ ఒకే నా ……
థాంక్ యూ విహాన్…… ఇంకా చాలా మంది నీ పిలవాలి నీకే ఫస్ట్ కాల్ చేశా బై విహాన్ నైట్ మాట్లాడదాం……
హా ఒకే వేద….. అయినా ప్రభాన్ష్ కు అపుడే 5 ఇయర్స్ అంటే నమ్మలేక పోతున్నా…..
హా హా నాకు అలాగే ఉంది విహాన్ పిల్లలు అంతే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతారు….. ఐరా పుట్టి కుడా అపుడే వన్ ఇయర్ పైన అవుతుంది ……..
హ్మ్మ్ నిజమే వేద సరే నువ్వు లంచ్ చేసి తరువాత పిలవాల్సిన వాళ్ళని పిలువ్ ఒకే బై వేద
అలాగే విహాన్ తో బై అంటూ వేద కూడా కాల్ కట్ చేశాక వేద పిక్స్ ను చూస్తు తనతో ఉన్న జ్ఞాపకాలను తలచుకొంటూ ఉన్నాడు విహాన్ 🥲
ఎంటండి ఎవరు ఈ వేద తను కాల్ చేస్తే విహాన్ ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని ఆలోచిస్తున్నారా ?? ఐ నో మీరు అదే ఆలోచిస్తున్నాడు అనవసరంగా మీరు ఎక్కువ థింక్ చేయకండి మీకు ఆ శ్రమ లేకుండా నేనే చెప్తాను వేద విహాన్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి
ఎన్టీ షాక్ అయ్యారా అనుకున్నా మీరు షాక్ అవుతారు అని 😌….. ఎస్ మీరు అనుకుంటున్నది నిజమే వీళ్లది లవ్ ఫెయిల్యూర్ అండి…… ఎన్టీ లవ్ ఫెయిల్యూర్ అని ఇంత కూల్ గా చెప్తున్న అనుకుంటున్నారా ??
లవ్ ఫెయిల్ అయితే మన లైఫ్ ఫెయిల్ అయినట్టు కాదు లవ్ మన లైఫ్ లో ఒక పార్ట్ అంతే లవ్ నే లైఫ్ కాదు విహాన్ – వేద పాస్ట్ ఏంటో వీళ్ళు ఎలా విడిపోయారో మనం ఇప్పుడు తెలుసుకుందాం…. సో ఇప్పుడు మీరు కూడా నాతో పాటు పాస్ట్ లోకి వెళ్దాం రండి 🏃🏃🏃
విహాన్ పుట్టింది పెరిగింది అంతా వైజాగ్ లో నే అమ్మా నాన్నలకు ఒకడే కొడుకు అందుకే నన్ను వాళ్ళు చాలా అని గారాబంగా పెంచారు….. బాగా డబ్బు ఉన్న వాళ్ళు అని చెప్పలేను కానీ ఉన్నంతలో బాగానే ఉండే వారు…..
విహాన్ ఫాదర్ ప్రైవేట్ కంపెనీ లో అసిస్టెంట్ మ్యానేజర్ గా వర్క్ చేస్తే మదర్ హౌస్ వైఫ్ గా ఉంటూ ఉండేది….. విహాన్ కి స్టడీస్ అంటే పెద్దగా ఇంటరెస్ట్ వుండేది కాదు …… ఏదో అరకొర మార్క్స్ మాత్రమే వచ్చేవి అవి కూడా ఎగ్జామ్ ముందు నైట్ చదివి పాస్ అయ్యే వాడు …..ఎపుడు క్రికెట్, వాలీ బాల్ ఆడటం ఫ్రెండ్స్ తో సినిమాలు & అమ్మాయిలకు సైట్ కొట్టడం లాంటి ఎక్స్ట్రా క్వాలిటీస్ కూడా ఉండేవి……
ఇంటర్ లో కూడా కేవలం పాస్ మార్క్స్ తో పాస్ అయ్యాయి ….. అపుడు విహాన్ ను తన ఫాదర్ తిట్టినా తిట్లు అన్నీ ఇన్నీ కాదు కనీసం ఇప్పటి నుండి అయిన చదువు మీదశ్రద్ధ పెట్టు అని వార్నింగ్ ఇచ్చి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు….. అయినా విహాన్ అవేం పట్టించుకోలేదు ……
ఫ్రెండ్స్ తో పాటు విహాన్ కూడా బి. టెక్ లో జాయిన్ అయ్యాడు అక్కడ మొదటి సారి వేద ను చూసాడు విహాన్….. వేద పూర్తి పేరు వేదాన్శిక చాలా అందంగా ఉండేది….. చూడగనే చూపు తిప్పుకోలేక పోయాడు …… తనను ఎందుకో అందరి అమ్మాయి ల లాగా చూడలేక పోయాడు…..
తనను చూస్తూనే ఫస్ట్ ఇయర్ గడిపేశాడు….. విహాన్ తనతో మాట్లాడాలి అని ఎన్నో సార్లు అనుకున్నా కానీ ధైర్యం సరిపోలేదు….. ఎం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్తం అయ్యేది కాదు….. అలా ఫస్ట్ ఇయర్ అయిపొయింది ఇపుడు వీళ్ళు సీనియర్స్ అయిపోయారు……
వేద చాలా డీసెంట్ గా ఉండేది తన పని తాను చేసుకుపోతుంది క్లాస్ లో ఎపుడూ తనే ఫస్ట్ తనతో మాట్లాడడానికి అబ్బాయిలు మేమంటే మేము అంటూ వుండే వారు బట్ వేద ఎవరితో ఎంత వరకు మాట్లాడాలో అంత వరకే మాట్లాడేది …….
వేద తో ఎలా పరిచయం పెంచుకోవాలి అని ఆలోచిస్తున్న విహాన్ కి ఆ దేవుడే అవకాశం ఇచ్చినట్టు తన బైక్ స్టార్ట్ కాకపోవడం వల్ల నడుచుకుంటూ వెళ్తూ వుండగా వెనుక నుండి హార్న్ సౌండ్ వినిపించగానే వెనక్కీ తిరిగి చూసిన విహాన్ కి ఎదురుగా వేద 😍
వేద స్కూటీ విహాన్ పక్కన వచ్చి ఆగగానే విహాన్ ఆనందానికి అవధులు లేవు నవ్వూతూ తన వైపూ చూడగానే తను కూడా నవ్వూతూ విహాన్ వైపు చూసి నీ పేరు విహాన్ కదా అని అడిగింది
అవును ☺️
నా పేరు వేదాన్షిక నీ క్లాస్ మీట్& నిన్ను నేను 2 టైమ్స్ క్లాస్ లో చూసా అవును ఎంటిలా నడిచి వెళ్తున్నావ్ బైక్ ఏమైంది విహాన్
వేద కు నేను తెలుసా అని షాకింగ్ గా ఫీల్ అవుతూ బైక్ ట్రబుల్ ఇచ్చింది నా ఫ్రెండ్స్ ముందే వెళ్ళిపోయారు నేను లైబ్రరీ కి వెల్లోచ్చే లోగా ఎవరు లేరు అందుకే ఆటో కి అయినా వెళ్దాం అని వెళ్తున్నా ……
ఓహ్ అవునా ఒకే నో ప్రాబ్లెమ్ విహాన్ కమ్ 🙂 నేనూ డ్రాప్ చేస్తాను
పర్లేదు వేద నేను ఆటో లో వెళ్ళిపోతా నువ్వెల్లు అనవసరంగా నీకు ఎందుకు ట్రబుల్
నాకే ట్రబుల్ లేదు వుయ్ అర్ క్లాస్ మెట్స్ విహాన్ ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా ప్లీజ్ కమ్
ఇంకా వేద ను రిక్వెస్ట్ చేయించుకోవడం బాగోదని చిన్న స్మైల్ తో కాస్త గ్యాప్ ఇచ్చి వేద వెనుక కూర్చుని అడ్రస్ చెప్పగానే వేద విహాన్ ను తన ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది
వెళ్తున్న వేద వైపే చూస్తూ ఇంట్లోకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా డాన్స్ వేసి విహాన్ ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ అందరికి హ్యాపీగా చెప్పగానే….. అందరూ కూడా అబ్బో అంటూ విహాన్ ను ఆకాశానికి ఎత్తేశారు అది విహాన్ కి చాలా ప్రౌడ్ గా అనిపించింది ( టీనేజ్ ఎఫెక్ట్ 🥲🥱)
ఇక ఆ రోజు నుండి విహాన్ వేద తో మాట్లాడడానికి ఏనాడూ బయపడ లేదు అవసరం ఉన్నా లేకపోయినా వేద తో మాట్లాడుతూ ఉండే వాడు వేద కూడా విహాన్ తో త్వరగా క్లోజ్ అయింది….. వేద పుణ్యమా అని విహాన్ కి కూడా చదువు మీద ఇంటరెస్ట్ వచ్చి మెల్లగా చదవడం మొదలు పెట్టాడు…..
ఫ్రెండ్స్ తో సినిమాలకు వెళ్ళడం క్రికెట్ ఆడటం తగ్గించి కేవలం స్టడీస్ మీద శ్రద్ద చూపిస్తున్న విహాన్ ను చూసి మా నాన్న ఏంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు….. అలాగే తనలో వచ్చిన మార్పు చూసి విహాన్ కే ఆశ్చర్యం కలిగింది & ఇందుకు కారణం అయిన వేద మీద ప్రేమ ఇంకా ఎక్కువ అయింది …….
క్లాస్ లో ఉన్నంత సేపు తనను చూస్తు ఉండటం & సబ్జెక్ట్ వైస్ ఎదైనా అర్తం కాకపోయినా వేద చాలా ఓపికగా చెప్పేది….. అపుడపుడు తను చెప్పేది కూడా వినకుండా వేద వైపే చూస్తూ ఉండేవాడు విహాన్….
ఇలా మరో 2 ఇయర్స్ అయిపోయాయి ముందు కంటే ఇపుడు చాలా బాగ మార్క్స్ రావటం తో విహాన్ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే విహాన్ ఫ్రెండ్స్ కూడా అంతే ఆశ్చర్య పోయారు …..
ఇపుడు విహాన్ ఫైనల్ ఇయర్ ఇంకా తన ప్రేమ విషయం దాస్తే వేద తనకు ఎక్కడ దూరం అవుతుందో అని భయపడి ఒక సాయంత్రం ఎవరు లేని ఏకాంత ప్రదేశంలో విహాన్ మనసులో వేద మీద పెంచుకున్న ప్రేమా గురించీ తనకు చెప్పేసాడు…..
వేద విహాన్ ప్రపోజల్ కి కాసేపు మౌనంగా ఉండి తర్వాత మాట్లాడుతు చూడు విహాన్ ఇపుడు మనం లాస్ట్ ఇయర్ ఇపుడు మనం ప్రేమ అంటూ మన మైండ్ పొల్యుట్ చేసుకుంటే స్టడీస్ స్పాయిల్ అవుతాయి సో ఈ విషయాన్ని మనం ఈ ఇయర్ అయ్యాక మాట్లాడదాం
అప్పటి వరకు ఇద్దరం ఇప్పటి లానే ఉందాం ఒకే అండ్ ఈ విషయం ఎవరికీ చెప్పకు ఈవెన్ నీ ఫ్రెండ్స్ ఇక వెళ్దాం పదా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది
వెళ్ళడానికి వెనక్కీ తిరిగిన వేద చెయ్ పట్టుకున్న విహాన్ ను చూసి ఎన్టీ విహాన్ ఏమైనా చెప్పాలా అని అంది వేద……
నిజం చెప్పు వేద నీకు నేనంటే ఇష్టమే కదా ఇష్టం అని ఒక సారి చెప్పు వేద మన స్టడీస్ అయ్యే వరకు నిన్ను డిస్టర్బ్ చేయను కేవలం ఫ్రెండ్ లా వుంటాను బట్ నా మీద నీ ఒపినియన్ ఏంటో చెప్పు ప్లీజ్
విహాన్ నువ్ బేసిక్ గా అల్లరి పిల్లాడివి కానీ చెప్పే విధంగా చెప్తే వింటావ్ మొదట్లో నువ్వు నన్ను ఫ్రెండ్ లా నే ట్రీట్ చేశావ్ కానీ మెల్లగా నువ్వు నన్ను గుచ్చి గుచ్చి చూడటం మన ఇద్దరి నేమ్స్ నీ బుక్ లో రాయటం నేను నీ వైపు క్యాసుఏల్ గా చూసినా నువ్వు బ్లష్ అవ్వటం ఇవన్నీ నేను గమనించా
అపుడే అనుకున్నా ఎదో ఒక రోజు ఇలా చెప్తావ్ అని సో చెప్పావ్ అయినా విహాన్ ను ఇష్టపడని వారుండరు నువ్వంటే నాకు చాలా ఇష్టం విహాన్ మా నాన్న దగ్గర మిస్ అయిన ఆప్యాయత , అనురాగం నీ దగ్గర చూసా అందుకే ఎవరి కి క్లోజ్ అవ్వని నేనూ నీకు అయ్యాను
వేద మాటలు విన్న విహాన్ కి ఎంతో ఆనందం వేసింది అది మాటల్లో కూడా వర్ణించలేము ….. విహాన్ సంతోషంగా వేద చేతులు పట్టుకుని థాంక్ యూ వేద థాంక్ యూ సో మచ్ అంటూ కాసేపు మాట్లాడి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు…..
ముందుగా అనుకున్నట్టు గానే ఈ విషయం గురించి ఇద్దరూ మళ్లీ డిస్కస్ చేసుకోలేదు ముందు ఎలా వున్నామో ఇపుడు అలాగే వున్నారు……. ఇద్దరు కూడా స్టడీస్ మీద ఫోకస్ పెట్టి ఎగ్జామ్స్ చాలా బాగ రాసారూ క్యాంపస్ ఇంటర్వ్యూలో లో ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు…..మంచి కంపెనీ లో జాబ్ రావడం తో చాలా ఆనందం వేసింది …….
ఇంటర్వ్యు నుండి బయటకు రాగానే వేద ను ఎత్తుకుని గిర గిర తిప్పేస్తున్న విహాన్ వేద వైపు చూస్తూ ఐ గాట్ ది జాబ్ వేద అన్న సంతోషం లో అక్కడ అందరూ మమ్మల్ని చూసి నవ్వూతూ ఉంటే అపుడు వాస్తవం లోకి వచ్చి వేద ను దింపి మధు వైపు కృతజ్ఞతగా చూసాడు…..
కంగ్రాట్స్ విహాన్ ముందు నాకు కాదు ఆంటీ అంకుల్ కు చెప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి నవ్వూతూ అక్కడ నుండి వెళ్ళిపోతున్న వేద ను చిరు నవ్వుతో చూస్తూ విహాన్ స్వీట్స్ తిసుకుని వెళ్ళి అమ్మ నాన్న కు ఈ విషయం చెప్పగానే వాళ్ళు చాలా చాలా సంతోషించారు
ఇద్దరూ వేరే వేరే కంపెనీ లో జాబ్ కు జాయిన్ అయ్యారు…. ఒక రోజు సాయంత్రం వేద ను అడిగా ఎపుడూ ఒకే చెప్తావ్ మన ప్రేమ కి ఎలాగో జాబ్ వచ్చేసింది నువ్వు కూడా ఓకే అంటే ఇంట్లొ మాట్లాడి మ్యారేజ్ చేసుకుందాం నువ్వు నా లైఫ్ లోకి వచ్చాకే నేను ప్రయోజకున్ని అయ్యాను
నువ్వే కనుక నాకు పరిచయం అవ్వకపోయి వుంటే నా ఫ్రెండ్స్ తో పాటు ఇంకా బ్యాక్లాక్స్ రాసుకుంటూ వుండే వాడిని 😂🤭అని అడుగుతున్న విహాన్ వైపు చూసిన వేద……
విహాన్ నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్తం కావట్లేదు కానీ ఇంకా దాచి నిన్ను మోసం చేయలేను అందుకే ఈ విషయం చెప్పాక దయచేసి నన్ను అష్యించుకుని నన్ను దూరం పెట్టవు కదా ……
ఎమ్ మాట్లాడుతున్నావ్ వేద నేను నిన్ను అసహ్యించు కోవడమా ఎన్టీ కామెడీ చేస్తున్నావా అలా ఎప్పటికీ జరగదు ఏంటో ధైర్యంగా చెప్పు
నేను బి. టెక్ సెకండ్ ఇయర్ లో వున్నపుడే మా మావయ్య కొడుకుతో నాకు పెళ్ళి ఫిక్స్ అయింది అతని పేరు విధుర్ హైదరాబాద్ లో ఎమ్ . ఎన్.సీ కంపెనీ లో వర్క్ చేస్తున్నాడు చాలా మంచి వ్యక్తి నేనంటే చాలా ఇష్టం & తనే డైరెక్ట్ గా తన పేరెంట్స్ తో కలసి వచ్చి అమ్మ తో మాట్లాడి ఒప్పించాడు …..
అమ్మ కు కూడా విధుర్ నచ్చడం తో నేను లేకుండా నే నా పెళ్లి నిశ్చయం చేసారు …..నేను ఇంటికి వెళ్ళాక నాకు ఈ విషయం గురించి తెలిసి షాక్ అయ్యా ఇక చేసేది లేక నేను కూడా ఒప్పుకున్నా అపుడపుడు విధుర్ మా ఇంటికి వచ్చేవాడు
తన వ్యక్తిత్వం గురించి తెలిశాక నేను మనస్పూర్తిగా తనతో పెళ్లికి రెడీ అయ్యాను అపుడే నీతో పరిచయం అవ్వటం ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం కానీ అనుకోకుండా నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పగానే షాక్ అయ్యాను
నిన్ను నేనూ కేవలం ఫ్రెండ్ గా చూసాను నేనూ ఇష్టం లేదు అని చెప్తే ఎక్కడ నీ స్టడీస్ స్పాయిల్ చేసుకుని నీ లైఫ్ పాడవుతుందో అని భయపడి ముందు స్టడీస్ కంప్లీట్ చేద్దాం అని చెప్పాను
నాకు తెలుసు నిన్ను మోసం చేస్తున్నా అని కానీ నాకు నీ భవిష్యత్తు ముఖ్యం అందుకే తప్పని పరిస్థితుల్లో అలా చెప్పాను ప్లీజ్ విహాన్ నేను చేసింది తప్పే అందుకు నువ్వు ఎటువంటి శిక్ష వేసినా బరిస్తా కానీ నువ్వు మాట్లాడకుండా వుంటే మాత్రం బరించలేను
నేను విధుర్ దగ్గర ఎది దాచను అంత ఫ్రీడం ఇచ్చాడు తను అందుకే నీ గురించీ చెప్పా ఇంకా నీకు నిజం చెప్పకుండా వుంటే అది నిన్ను మోసం చేసినట్టు అవుతుంది అని చెప్పి తనే ఇవాళ నీకు చెప్పమని చెప్పాడు ఎల్లుండి నా ఎంగేజ్మెంట్ నేను చేసింది తప్పు కాదు అని నీకు అనిపిస్తే వచ్చి బ్లేస్ చెయ్ అంటూ వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది వేద
వేద చెప్పింది విన్న నాకు నా అందమైన ప్రపంచం నా కళ్ళ ముందే నేల రాలినట్టు అయిపొయింది వొంట్లో శక్తి లేనట్టు అలాగే నేల మీద ఒరిగిపోయాను కంట్లో నీరు వరదై పారుతోంది వేద తో ఏంతో అందంగా ఊహించుకున్న నా జీవితం నా కళ్ళ ముందే ముక్కలు అయింది ……
వేద ను ఎంత లవ్ చేశానో & ఎంత ఆరాదించానో నాకు మాత్రమే తెలుసు వేద గురించి మా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను….. అలాంటిది వేద మనసులో నాకు స్థానం లేదని తెలిసి నా గుండె ముక్కలు అయింది నలుదిక్కుల దద్దరిల్లేలా అరవాలని ఉంది …..
అలాగే ఏడుస్తూ ఎపుడూ ఇల్లు చేరానో నాకే తెలియదు పడుకున్న నిద్ర రావటం లేదు వేద రూపం కళ్ల ముందు మెదులుతూ నన్ను మరింత కృంగ దీస్తోంది అలా 2 రోజులు గడిచాయి నిద్ర ….ఆకలి…. ఎది లేదు హెల్త్ బాలేదు అని ఇంట్లో చెప్పి కళ్లు మూసుకొని పడుకున్నా ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు
పైకి లేచి కళ్లు మూసుకుని కూర్చుని ఆలోచిస్తున్నా నాకు ఇందులో వేద తప్పు ఎం లేదు అనిపించింది
కేవలం నా కోసం నా భవిష్యత్తు కోసం ఆలోచించి అలా చెప్పింది అని అర్తం చేసుకుని నా మనసుకు సర్ది చెప్పుకుని ఉదయాన్నే లేచి బారమైన మనసు తో వేద ఎంగేజ్మెంట్ కి వెళ్ళాను
నన్ను చూసాక వేద మొహం లో వచ్చిన వెలుగు ఇప్పటికీ మర్చిపోలేను నన్ను విధుర్ కి పరిచయం చేసింది …..ఎక్కువ సేపు ఏడుపు ఆపుకోలేక నేనూ అక్కడ నుండి వచ్చేసాను ఆ తరువాత 2 నెలల్లో వేద పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది …….
విహాన్ మాత్రం వేద తలపులలో తనను మర్చిపోలేక ఇంట్లొ అమ్మ నాన్న చూస్తున్న సంబంధాలు రిజెక్ట్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు ….. ఇప్పటికే వేద కు పెళ్లి జరిగి 2 ఇయర్స్ అవుతుంది తనకూ ఒక బాబు పేరు ప్రభాన్ష్ చాలా ముద్దుగా ఉన్నాడు అచ్చం వాళ్ళ నాన్న లాగా ఉండడం వల్ల అనుకుంటాను…..
నాకు కుదిరినప్పుల్లా ప్రభాన్ష్ ను చూడ్డానికి వెళ్ళి వస్తూ ఉండే వాడ్ని వేద కూడా అపుడపుడు తన ఫ్యామిలీ తో మా ఇంటికి వస్తూ అమ్మ నాన్న లకు బాగా క్లోస్ అయింది ……అమ్మ ద్వారా విషయం తెలుసుకున్నా వేద నన్ను బలవంతంగా ఒప్పించి మరీ విషిత తో పెళ్ళి చేసింది
పెళ్లికి ముందే విషిత కు నా పాస్ట్ గురించీ కూడా చెప్పా తను నన్ను అర్తం చేసుకుని మ్యారేజ్ కి ఒప్పుకుంది మ్యారేజ్ అయ్యాక విషిత ప్రేమా లో నేనూ మెల్లి మెల్లిగా వేద జ్ఞాపకాలను మరచి విషిత ను పూర్తిగా నా భార్య గా స్వీకరించాను
వేద, విషిత చూడ్డానికి సిస్టర్స్ లా వుంటారు …… అందరం గ్యాదర్ అయినపుడు వాళ్లు ఇద్దరు ఒకటి అయ్యి నన్ను, విధుర్ ను బాగ ఎడిపిస్తారు …..కొన్ని రోజులకు నా జీవితం లో కి సంతోషాలను తిసుకుని వచ్చింది నా ఐరా తల్లీ 🥰🥰
నాన్న రిటైర్ అవ్వటం తో మా సొంత ఊర్లో పోలాలని చూస్తు వుంటానని ఎంత చెప్పినా వినకుండా అక్కడే వున్నారు ఇక్కడ నేను విషి , ఐరా ఉంటున్నాం ఇలా ఏదైనా ఫంక్షన్స్ కు నేను , వేద కలుస్తూ ఉంటాం
వేద నా జీవితం లో చాలా స్పెషల్ తనే లేకపోయి ఉంటే నేను ఇలా వుండేవాడిని కాదు అందుకే ఇప్పటికీ నేను తనను దేవత లా మూగగా ఆరాధిస్తూ వుంటాను……
ఈవెనింగ్ అలా ఇంటికి వెళ్లగానే విషిత తో హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పగానే విషిత, ఐరా హ్యాపీగా ఫీల్ అయ్యారు…. నెక్స్ట్ డే ముగ్గురం కార్ లో హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం….. మమ్మల్ని వేద, విధుర్ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు ….. ప్రభాన్ష్, ఐరా ను క్షణం కూడా వదలకుండా ఆడిపిస్తూ ఉండడం చూసి నేను వేద హ్యాపీగా ఫీల్ అయ్యాం….. మా రిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని నేను వేద స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాం……
మీ విహాన్ ♥️
చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే ఎదో మనకు ఇక లైఫ్ ఏ లేనట్టు బాధ పడుతూ మన ప్రేమ ను ఒప్పుకోని ఆ అమ్మాయి నీ బాధ పెట్టడం లేదా మనల్ని మనం బాధ పెట్టుకుంటు వుంటాం అది తప్పు నిజంగా అది క్షమించరాని నేరం
ప్రేమ జీవితం లో భాగం మాత్రమే ప్రేమే జీవితం కాదు మనల్నే నమ్ముకుని మన ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ కోసం అయిన మనం మూవ్ అన్ అయి జీవితం లో సక్సెస్ సాధించాలి ….