ఎలా చెప్పాను ❤️||బావ మరదలు ఫుల్ స్టోరీ

ఏయ్ చందు….. చందు…. లే కాలేజ్ కి టైమ్ అవుతోంది త్వరగా లేచి రెడీ అవ్వు  అని తన ముద్దుల కూతురు చందన ను నిద్ర లేపుతోంది లలిత

అబ్బా మమ్మీ కాసేపు పడుకోనివ్వు నాకు నిద్రొస్తోంది నైట్ లేట్ గా పడుకున్నా ప్లీజ్ మా కాసేపు అయ్యాక లేపు అని అటు ఇటు తిరుగుతూ చెప్తోంది చందు అలియాస్ చందన…..

నిన్ను  నైట్ 🌃 అంతా మూవీ చూస్తు ఎవరు మేలుకోమన్నారు అని చిరు కోపంగా చూస్తూ చూడు చందు ఇప్పటికే  టైమ్ 8 అవుతోంది నువ్వు తీరిగ్గా లేచి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యేసరికి కచ్చితంగా 40 మినిట్స్ పడుతుంది

సో నువ్వు ఇప్పుడు లేస్తెనే కాలేజ్ కు ఇన్ టైమ్ కి వెళ్తావ్ అని ముద్దుగా కసురుకుంటు చందు ను బలవంతంగా లేపి చందు చేతిలో కాఫీ కప్ పెట్టీ త్వరగా రెడీ అయి రా అని చెప్పి లలిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది ….

చందు ఇంకేం చేయలేక బద్దకంగా వళ్లు విరుచుకొని కాఫీ కప్ పట్టుకుని బెడ్ దిగి తన రూమ్ బాల్కనీ లో నిల్చుని కాఫీ సిప్ చేస్తూ చుట్టూ చూస్తూ వుంటుంది …….

చందు కాఫీ తాగడం ఫినిష్ అవ్వగానే రూమ్ లోకి వచ్చి కాఫీ కప్ టేబుల్ మీద పెట్టేసి టవెల్ తీసుకుని వాష్ రూమ్లో కి వెళ్తుంది ……కాసేపయ్యాక చందు బ్లాక్ కలర్ జీన్స్ వైట్ కలర్ నెక్ షర్ట్ దాని మీద మినీ బ్లాక్ కలర్ శ్రగ్ వేసుకుని అందంగా రెడీ అవుతుంది ……..

తన కాలేజ్ బ్యాగ్ లో బుక్స్ నీట్ గా సర్దుకుని మొబైల్ & వాలెట్ కూడా బ్యాగ్ లో పెట్టేసి అన్ని ఒక సారి చెక్ చేసుకుని తన రూమ్ నుండి బయటకు వస్తుంది…….

చందు గురించి చెప్పాలి అంటే 5.5 హైట్ ,వైట్ స్కిన్ టోన్ తో చాలా అందంగా ఆ హైట్ తగ్గ వెయిట్ తో కుందనపు బొమ్మ లా వుంటుంది తనలో మెయిన్ గా ఎట్రాక్ట్ చేసేది నవ్వితే బుగ్గన పడే డింపుల్ ……

లలిత , భాస్కర్ లకు ఒక్కగానొక్క  కూతురు చందన ( చందు) కూతురు అంటే లలిత, భాస్కర్ లకు పంచ ప్రాణాలు ……  చందు ను చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా చూసుకుంటూ వుంటారు చందు ఇది కావాలి అనకముందే దాన్ని చందు ముందు పెట్టేవారు …….

చందు కొంచెం సెన్సిటివ్ చిన్న విషయానికి కూడా చాలా బాధ పడుతుంది అందుకే చందు కు ఏ  కష్టం రాకుండా చూసుకుంటూ వుంటారు & చందు వాళ్ళది విలేజ్ కావడం వల్ల చందు రోజు కాలేజ్ కి బస్ లో వెళ్లి బస్ లో వస్తూ అప్ అండ్ డౌన్ చేస్తోంది …….

చందు కి హాస్టల్ ఫుడ్ పడకపోవడం తో ఇలా రోజూ బస్ లో వెళ్లి వస్తు వుంటుంది భాస్కర్ ఊర్లోనే వ్యవసాయం చేస్తూ వుంటాడు ……..చందు ప్రెసెంట్ ఏమ్. సి. ఏ. లాస్ట్ ఇయర్ చదువుతోంది తను బాగా చదువుతుంది తనే క్లాస్ టాపర్……. (సింపుల్ గా ఇదే మన చందు ఫ్యామిలీ ఇంట్రడక్షన్ స్టోరీ లోకి వెళ్ళే కొద్ది మరికొన్ని విషయాలు తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ)

చందు తన రూమ్ నుండి బయటకు రాగానే హల్ లో కూర్చుని పేపర్ చదువుతూ వున్న భాస్కర్ దగ్గరకు వచ్చి కూర్చుని కబుర్లు చెప్తూ వుంటుంది ……. చందు తో మాట్లాడుతూనే వాచ్ వైపు చూసిన భాస్కర్ లలిత టిఫెన్ రెడీ అయిందా అని అడగగానే హా అయింది రండి అని ఇద్దరిని పిలుస్తుంది లలిత…….

చందు, భాస్కర్ ఇద్దరు బ్రేక్ ఫాస్ట్ చేయగానే లలిత చందు కి లంచ్ బాక్స్ తన బ్యాగ్ లో పెట్టేస్తుంది ……..చందు తన పేరెంట్స్ కి భై చెప్పి అక్కడి నుంచి బస్టాండ్ కు వెళ్తుంది భాస్కర్ కూడా పొలం పనులు  ఎలా జరుగుతున్నాయి  చూసి వస్తాను అని చెప్పి పొలానికి వెళ్ళిపోయాడు ……..

లలిత వాళ్ళు వెళ్ళిపోయాక ఇంటి పని చేసుకుంటూ అవి అవ్వగానే స్నానం చేసి టిఫిన్ పెట్టుకుని టివి చూస్తు తింటూ వుంటుంది …….

( ఇప్పటి నుండి ఈ కథ మన చందు నే మీకు చెప్తుంది అట తన నోటి ద్వారానే ఈ కథని విందాం సారి సారి చదువుదాం 😁😁)

నా పేరు చందు అమ్మ నాన్న లకు ఒక్కటే కూతురు ను & నాకు వాళ్ళంటే చాలా ఇష్టం నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు వున్నది ఇద్దరే వాళ్ళతోనే నేను అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను అలాగే   నా లైఫ్ లో  వీళ్ళతో పాటు మరొకరు కూడా వున్నారు తనే మా బావా మౌర్య  మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కొడుకు ……నాకు మా బావ అంటే చాలా ఇష్టం యాక్చుయల్లీ ఇష్టం అనడం కంటే పిచ్చి అంటే బావుంటుంది …….

మా బావ చెన్నై లో సాఫ్టవేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ వున్నాడు అపుడపుడు మా ఊరికి వచ్చేవాడు వాళ్ళ ఇల్లు మా ఇంటి ఎదురుగానే ……..నాకు మా బావ మీద ఎపుడు ఎలా ప్రేమ పుట్టిందో నాకు ఇప్పటికీ అర్తం కాదు అవును నాది నిజంగా ప్రేమేనా అవును అసలు ప్రేమంటే ఎంటి 🤔🤔

ప్రేమంటే….🤔🤔

ప్రేమంటే …!!!

ఆక్సీజన్ లాంటిది

అది మనకు కనిపించదు

కానీ మనల్ని బ్రతికిస్తుంది….!!!

వినిపించదు ….!!!!

కానీ చెవిలో అమృతం పోస్తుంది

గుండె చప్పుడు

నేనే అని అంటుంది

అంతా తానే అనిపిస్తుంది

అన్నీ తానై కనిపిస్తుంది

చివరికి మనల్ని మనమే

మరచిపోయే చేసి

తనే మన ప్రపంచం

అయిపోతుంది ….!!!

 

నిజమే నాకు అలానే అనిపిస్తోంది బావ అంటే నాకు ఎంతో ఇష్టం తను లేకపోతే నిజంగా నా ఊపిరి ఆగిపోతుంది ఏమో అనిపిస్తుంది ……..  కానీ నేను ఇప్పటి వరకు మా బావా తో సరిగ్గా మాట్లాడింది లేదు ఎదో హాయ్ అంటే హాయ్ అని మాట్లాడుకునే వాళ్ళం …….  ఊరికి బావ వస్తే డెఫినెట్ గా మా ఇంటికి వచ్చేవాడు బావ మా ఇంటికి రాగానే నేను అక్కడ వుండే దాన్ని కాదు నా రూం కి వెళ్లేదాన్ని …….. బట్  నా రూం లో నుండే మా బావ మాటలు అన్ని వింటూ ఆనంద పడేదాన్ని మా బావ వెళ్ళిపోయాడు అని కన్ఫాం అయ్యాకే రూమ్ నుండి బయటకు వచ్చేదాన్ని అంత సిగ్గు నాకు బావ ను చూస్తే…….!

మమ్మీ, అత్తయ్యా ఎప్పుడు నన్ను ఆటపట్టిస్తు వుండే వాళ్ళు మీ బావ కు కాబోయే భార్య వి నువ్వే అని నాకు అపుడు చాలా సిగ్గు గా అనిపించి రూమ్ లోకి వెళ్ళిపోయేదాన్ని  ……. యూ నో  ఎప్పటికప్పుడు బావకు నా లవ్ గురించి చెప్పాలి అని అనుకుని మళ్లీ బావ కు నేను ఇష్టం లేకపోతే అన్న భయం వల్ల ఆగిపోయేదాన్నీ …..ఆల్మోస్ట్ నేను బావను చూసి 3 మంత్స్ అవుతోంది ఎల్లుండి బావ వస్తున్నాడని ఇక్కడే టెన్ డేస్  వుంటాడని మమ్మీ చెప్పింది ఇలా అలోచనలతోనే నేను కాలేజ్ కి రీచ్ అయ్యాను……

కాలేజ్ కి వెళ్లగానే నా బెస్ట్ ఫ్రెండ్స్ తో హ్యాపీగా  బావ వస్తున్నాడు అని చెప్పాను వాళ్ళు నాతో ఈ సారి అయినా నీ మనసు లో మాట మీ బావ కు చెప్పు అని చెప్పారు నేను ఆలోచిస్తూ నే సరే అని చెప్పా అలా….. అలా ఈవెనింగ్ కాలేజ్ అవ్వగానే  బస్ లో ఇంటికి వెళ్ళా నేను వెళ్లేసరికి మమ్మీ నా కోసం వేడి వేడి బజ్జీలు చేస్తూ వుంది …… నేను ఫ్రెష్ అయి వచ్చి బజ్జీలు తిని ఇంకేం వద్దు అని నా రూమ్ కి వెళ్ళి బావ ఫోటో చూస్తూ ఎప్పటికో నిద్రపోయాను …..

నెక్స్ట్ డే మొత్తం బావ ఆలోచనతో బావ మెమోరీస్ తో గడిపేశా ఎపుడెపుడు తెల్లవారుతుందా బావని ఎపుడెపుడు వస్తాడా రాగానే బావ తో ఎలా అయినా మాట్లాడాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను …….

తెల్లవారగానే అమ్మ వచ్చి నన్ను లేపి కాఫీ ఇచ్చి త్వరగా రెడీ అవ్వు కాలేజ్ కి టైమ్ అవుతోంది అని చెప్పేసి వెళ్ళిపోయింది నేను కూడా లేచి మంచి డ్రెస్ వేసుకుని రెడీ అయి నేను కిందకు వెళ్లేసరికి నాన్న బావ తో మాట్లాడుతూ కనిపించాడు ……బావ ను చూడగానే నా ఆనందానికి అవధులు లేవు బావ ను గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకోవాలి అనిపించింది ……

బాబోయ్ ఏంటి ఇలా అయిపోతున్నా అని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా వెళ్లి నాన్న పక్కన కూర్చుని ఓరగా బావను చూస్తూ కూర్చున్నా…… బావ నన్ను చూసి నవ్వి ఎలా ఉన్నావ్ చందు అని ఆప్యాయంగా పలకరించాడు  ఆ క్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి బావనే చూస్తూ కూర్చున్నాను …….

బావ మళ్లీ నాకు వినిపించ లేదు అని మళ్ళీ అడిగాడు నేను తేరుకుని నవ్వుతూ బానే ఉన్నా బావ నువ్వెలా ఉన్నావు అని అతి కష్టం మీద అడిగాను ఎందుకంటే బావ ఎదురుగా ఉంటే నాకు నోటి నుండి మాట కూడా రాదు అదేంటో?? బావ నవ్వుతూ బావున్నా అని చెప్పి మళ్ళీ నాన్నతో ఏవో జనరల్ టాపిక్స్ మాట్లాడుతూ వున్నాడు …….

నాకు ఎవరు కనిపించడం లేదు బావ తప్పా అందుకే చుట్టూ ఎమ్ జరుగుతుందో కూడా పట్టించుకోకుండా బావ ను చూస్తూ కూర్చున్నా ఆల్ ఆఫ్ సడెన్ బావ నన్ను చూసి ఎంటి అన్నట్టు సైగ చేసాడు …… అంతే కంగారుగా నేను వెంటనే చూపు తిప్పుకుని ఫోన్ తీసుకుని ఎదో చూస్తూ కూర్చున్నా అది చూసి బావ నవ్వాడు ……

నాకు ఇక అక్కడ వుండాలి అని అనిపించలేదు వెంటనే బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తూ వుంటే వెనుక నుండి మమ్మీ అరుస్తోంది ఎంటే టిఫెన్ తినవా?? అలాగే వెళ్తావా ?? అని నాకు బలవంతంగా టిఫెన్ తినిపిస్తూ ఉంది …..  అది చూసి  బావ నవ్వు ఆపుకుంటూ నన్ను చూస్తూ ఉన్నాడు అది చూసిన నాకు మా అమ్మ మీద చాలా కోపం వచ్చింది ఇక చాలు అంటున్నా వినకుండా నోట్లో పెడుతూనే వుంది నేను కక్కలేక మింగలేక తిన్నాను …..

బావ కూడా నాతో పాటు కూర్చుని టిఫెన్ తిన్నాడు నేను ఇక మమ్మీ కు భై చెప్పేసి లంచ్ బాక్స్ పెట్టుకుని అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోయాను ……. నేను బస్ స్టాండ్ కి వెళ్ళగానే బస్ వచ్చింది వెంటనే దాన్ని ఎక్కి కూర్చుని ఇందాకే జరిగింది తలచుకుని నాలో నేను నవ్వుకుంటూ వున్నాను కాలేజ్ రాగానే ఆ విషయం గురించి వదిలేసి లోపలికి వెళ్ళిపోయా…..

ఆ రోజు అంతా కాలేజ్ లో చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నా నా ఫ్రెండ్స్ నన్ను ఆటపట్టిస్తు వున్నారు మీ బావ ను వచ్చాడా అని ఇంత హ్యాపీగా ఉన్నావ్ అని నేను చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోయా ఎందుకంటే అది కూడా నిజమే మరి బావ మొహం చూస్తే చాలు నాకు ఎందుకో చాలా సంతోషంగా మైండ్ అంతా ప్లెజెంట్ గా ఉంటుంది…… ఈవెనింగ్ కాలేజ్ అవ్వగానే నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కాలేజ్ బయటకు వచ్చాను అక్కడ బైక్ మీద కూర్చుని కోక్ సిప్ చేస్తూ కనిపించాడు మా బావ మౌర్య ……..

ఎంటో మనం ఎవర్నైనా ఎక్కువ ఇష్టపడితే ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు అని అంటారు ఇపుడు నాకు అదే అనిపిస్తోంది లేకపోతే ఊర్లో వుండాల్సిన బావ మా కాలేజ్ ముందు కనిపించడం ఎంటి అని నా పిచ్చిని చూసి నవ్వుకుని ముందుకు నడిచాను ……….  అది చూసిన నా ఫ్రెండ్స్ ఏయ్ చందు అక్కడ మీ బావ నీ కోసం ఎదురు చూస్తూ వుంటే నువ్వేంటి ఇలా వస్తున్నవ్ అని అనగానే అప్పటికీ కానీ నాకు అర్తం అవ్వలేదు బావ నిజంగానే వచ్చాడని  వెంటనే నా ఫ్రెండ్స్ కి భై చెప్పేసి బావ ముందు వెళ్లి నిల్చుని నువ్వేంటి బావ ఇక్కడ అని అడిగాను ……..

నీ గురించే వెయిట్ చేస్తున్నా నువ్వేంటి నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్లిపోతున్నావ్ అంటూ నా వైపు చూస్తూ అడగడం తో అయ్యో బావ సారి నిజంగా నువ్వు అనుకోలేదు బావ అంటూ బావ హర్ట్ అయ్యాడేమో అని చిన్నగా చెప్పాను..,. నేను కాక మరెవరు అనుకున్నావ్ అంటూ తిరిగి క్వశ్చన్ చేస్తున్న బావ ను చూసి తల బాదుకుని  ఎవరో అనుకున్నా లే కానీ అయినా నువ్వేంటి బావ ఇలా ఇక్కడ ఏమ్ చేస్తున్నావ్ ??

 

ఇక్కడ నాకు కొంచెం వర్క్ వుంటే వచ్చా ఎలాగో వచ్చా గా నువ్వు చదివేది ఇక్కడే కదా డు నిన్ను పిక్ అప్ చేసుకుందాం అని వెయిట్ చేస్తున్నా అంటున్న బావ ను చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది బావ నా కోసం వెయిట్ చేయడం ఇంకా ఇంకా నచ్చింది బట్ అది బయటకు కనిపించకుండా అయ్యో నీకెందుకు బావ శ్రమ నేను బస్ లో వచ్చే దాన్ని కదా??

 

ఏమ్ పర్లేదు కానీ ముందు బైక్ ఎక్కు వెళ్దాం అనగానే ఇంకా ఎక్కువ చేస్తే బావ వదిలేసి వెళ్తాడు అనుకుని హుషారుగా  సరే అని బైక్ ఎక్కి కూర్చోగానే బావ
బైక్ స్టార్ట్ చేసి రయ్ రయ్ మంటూ డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎంత బావుందో మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను ……… ఏంటో బస్ లో వెళ్తూ ఉంటే ఎప్పుడు ఊరు వస్తుందా అని వెయిట్ చేసే నేను బావ తో ఇలా బైక్ మీద వెళ్తూ ఉంటే అపుడే ఇల్లు వచ్చేసిందా అని మా ఇంటిని చూసి నీరసంగా బైక్ దిగి నుంచున్నా…….

బావ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లిపోయాడు నాకు ఇవాళా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైమ్ బావ బైక్ ఎక్కాను ఈ డే నాకు ఎప్పటికీ మెమొరబుల్ గా ఉంటుంది …….  నన్ను డ్రాప్ చేసి వెళ్తున్న బావ ను నవ్వుతూ చూస్తూ నేను కూడా ఇంట్లోకి వెళ్ళిపోయా…… అలా బావ వున్నన్ని డేస్ నేను ప్రతి రోజు ఎదో ఒక విధంగా బావ తో మాట్లాడుతూ వున్నాను  ఇప్పుడు నాకు బావ అంటే బయం పోయింది ఎదైన ఫ్రీ గా మాట్లాడుతువున్నాను ఈ ఫీలింగ్ నాకు బాగా నచ్చింది…….

బావ కూడా నాతో ఫ్రీగా మూవ్ అవుతూ చాల బాగా మాట్లాడుతూ ఉండే వాడు & సరదాగా జోక్స్ వేసుకోవడం స్టడీస్ గురించినాకు గైడెన్స్ ఇస్తు నాకు బాగా క్లోజ్ అయ్యాడు…….బావ పెట్టిన లీవ్స్ అయిపోవడం తో ఆ రోజు బావ తిరిగి చెన్నై వెళ్ళిపోయాడు నాకు చాలా బాధేసింది డిన్నర్ కూడా చేయాలి అనిపించక అలాగే ఏడుస్తూ నా రూమ్ లో కూర్చున్నా ……..

అపుడే నా మొబైల్ కి  బావ నుండి మెసేజ్ రావడం తో కళ్ళు తుడుచుకుని ఓపెన్ చేసి చూసాను “మిస్ యూ అల్లరి కోతి” అని టెక్స్ట్ పంపాడు ……అది చూసిన నాకు అప్పటి వరకు పడ్డ బాధ మొత్తం పోయింది …..వెంటనే లేట్ చేయకుండా బావ కి కాల్ చేస బావ నాతో చాలా బాగా మాట్లాడాడు & నేను కూడా బావ తో మాట్లాడుతూ నా బాధను మర్చిపోయాను …….

అప్పటి నుండి ప్రతి రోజు బావ తో మాట్లాడ్డం, చాటింగ్ చేయడం బాగా అలవాటు అయ్యాయి బావ తో మాట్లాడకుండా వన్ డే కూడా వుండే దాన్ని కాదు …….. ఇలా 6 మంత్స్ అయిపోయాయి నా ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి ఇక నేను నా స్టడీస్ మీద ఫోకస్ పెట్టాను బావ ప్రతి రోజు బెస్ట్ ఆఫ్ లక్ అని మెసేజ్ పెట్టేవాడు …….
అదేంటో బావ మెసేజ్ చేసాడనో ఎంటో కానీ నేను అన్ని ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను లాస్ట్ ఎగ్జామ్  కూడా ఫినిష్ అయిపోయింది …….

 

ఇక ఇవాళ్టి నుంచి ఫుల్ ఫ్రీ బావ తో హ్యపీగా మాట్లాడవచ్చు అనుకుని ఇంటికి వెళ్ళాను ……నేను ఇంటికి వెళ్లేసరికి అమ్మ నాన్న తో పంతులు గారు ఎదో మాట్లాడుతూ వున్నారు …….నేను అంతలా ఏమ్ పట్టించుకోలేదు నా రూం కి వెళ్ళి ఫ్రెష్ అయి డిన్నర్ కు కిందకు వెళ్ళను అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి హాల్ లో కూర్చున్నాం …….

అపుడే మమ్మీ నాకు హార్ట్ ఎటాక్ వచ్చే న్యూస్ చెప్పింది 2 డేస్ లో నాకు ఎంగేజ్మెంట్ అని అది కూడా బావ తో కాదు వేరే అబ్బాయి తో అని నా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది షాక్ తో నాకు మాటలు కూడా రాలేదు కళ్ళల్లో నుండి నీళ్ళు బయటకు రావడానికి రెడీగా ఉన్నాయి వాటిని కష్టంగా అక్కడే ఆపి పైకి లేచి అదేంటి మమ్మీ సడెన్ గా ఈ ఎంగేజ్మంట్ ఎంటి ?? నాకు ఒక మాట కూడా చెప్పలేదు&  ఇపుడే గా చదువు ఫినిష్ అయింది ఇంకా నేను జాబ్ చేయాలి అనుకుంటున్నా అని నాకు ఇండైరెక్ట్ గా మ్యారేజ్ ఇష్టం లేదు అని చెప్పాను……

 

లేదు చందు చాలా మంచి సంబంధం నీకు ఇంత కంటే మంచి మ్యాచ్ మేము తీసుకు రాలేము అబ్బాయి కూడా చాలా మంచి వాడు ,ఒక్కడే కొడుకు మంచి జాబ్ &  మంచి కుటుంబం నిన్ను సొంత అమ్మ నాన్న లా చూసుకునే అత్త మామ అబ్బాయికి ఎటువంటి అలవాట్లు లేవు నువ్వు అక్కడ సంతోషంగా వుంటావు రా అంటూ ఆప్యాయంగా నా తల నిమురుతూ చెప్పాడు మా నాన్న……

బట్ నాన్న ☹️☹️ నన్ను బావ కు ఇచ్చి మ్యారేజ్ చేస్తాం అన్నారు కదా ఇప్పుడేంటి వేరే మ్యాచ్ చూశారు అని ఏడుపు ఆపుకుంటూ అడిగాను……

 

మేము అదే అనుకున్నాం కానీ అన్ని మనం  అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది చందు అని మమ్మీ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తోంది……

 

మమ్మీ నువ్వు ఏమ్ చెప్పాలి అనుకుంటున్నావో కొంచెం క్లారిటీ గా అర్తం అయ్యేలా చెప్పు

 

ఇందులో  అర్తం కాకపోవడానికి ఏమ్ లేదు రా నీకు మౌర్య కు మ్యారేజ్ చేయాలని అనుకోవడం నిజమే కానీ ……???

 

హా కానీ ☹️ ఏమైంది డాడీ??

 

మౌర్య మాకు ఎవరికీ చెప్పకుండా అక్కడే ఎవరో అమ్మాయి ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు  అట మాకు నిన్నే తెలిసింది & మీ అత్తయ్యా మావయ్య లు కూడా ఆ పెళ్ళిని యాక్సెప్ట్ చేశారు….. అందుకే నీకు వాళ్ళ కంటే మంచి మ్యాచ్ చూసం నువ్వు ఇంకేం థింక్ చేయకుండా మ్యారేజ్ కి ఒప్పుకో చందు ఇది చాలా మంచి మ్యాచ్ మేము ఏమ్ చేసినా నీ మంచి కోసమే చందు అంటూ నా పేరెంట్స్ నన్ను ఎటు ఆలోచించకుండా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు…..

నేను గట్టిగా కళ్లు మూసుకుని మీ ఇష్టం మమ్మీ అని బాధగా చెప్పేసి నారూమ్ లో కి వెళ్ళి పోయి డోర్ కి ఆనుకుని నీస్ మీద కూర్చొని నా కాళ్ళ చుట్టూ చేతులు వేసి ఏడుస్తూ కూర్చున్నా బావ వేరే అమ్మాయి ను మ్యారేజ్ చేసుకున్నాడు అనే ఊహ కూడా నేను భరించలేక పోతున్నాను……

హాల్ లో కూర్చున్న నా పేరెంట్స్ నేను మ్యారేజ్ కి ఒకే చెప్పడం తో వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి అప్పటికే లేట్ అవ్వడం తో పడుకోవడానికి వాళ్ళ రూమ్ లోకి వెళ్లిపోయారు …… నాకు నిజంగా ఏమ్ చేయాలో అర్థం కావడం లేదు బావ వేరే అమ్మాయి ను ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నాడా ??  స్టిల్ నేను నమ్మలేక పోతున్నాను నిన్ను ప్రాణంగా ప్రేమించాను కదా బావ 🥹🥹 నా ప్రేమ నిజంగా నికు అర్తం కాలేదా అని ఏడుస్తూ నాలో నేనే క్వశ్చన్ చేసుకుంటున్నాను…….

డెయిలీ గంటలు…..గంటలు నాతో కాల్ లో మాట్లాడుతూ ఉంటావ్ గా ఎందుకు ఇంత సేపు మాట్లాడుతుంది ఇది అని ఒక్క సారి కూడా ఆలోచించ లేదా నా గురించి 🥹🥺……

నేను నీకు 100 టైమ్స్ కంటే ఇంకా ఎక్కువే చెప్పి వుంటాను నువ్వంటే నాకిష్టం బావ నీతో మాట్లాడకుండా వన్ డే కూడా ఉండలేను అని అందులో నా ప్రేమ కనిపించలేదా నీకు 🥺☹️

ఇలా నాలో నేను ఏడుస్తూ కూర్చున్నాను అపుడే నాకు బావ నుండి కాల్ రావడం తో కన్నీళ్లు తుడుచుకుని బాధను మనసులోనే దాచేసి బావ కాల్ లిఫ్ట్ చేశాను …….

హెలో హాయ్ చందు

బావ వాయిస్ వినగానే గట్టిగా ఎడవాలి అనున్నా అది చేయలేక గట్టిగా కళ్లు మూసుకుని కళ్ళలో నుండి నీళ్ళు బుగ్గల మీదకు జారడం తో వాటిని తుడుచుకుంటూ హలో బావ అంటూ ఏడుపు ఆపుకుంటూ మాట్లాడాను…..

కంగ్రాట్స్ చందు

 

ఆగకుండా వస్తున్న కన్నీళ్లు తుడుస్తూ ఎందుకు బావ కంగ్రాట్స్ 🥹

 

మ్యారేజ్ ఫిక్స్ అయింది అట కదా చందు అందుకే ఈ కంగ్రాట్స్ అని ఎంతో హుషారుగా విష్ చేశాడు బావ

 

బావ విష్ కి విరక్తిగా ఒక నవ్వు నవ్వి థాంక్స్ బావ నీకు కూడా కంగ్రాట్స్ మ్యారేజ్ చేసుకున్నావ్ అట కదా

 

బావ నవ్వుతూ థాంక్స్ చందు ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది లేకపోతే నిన్ను కూడా పిలిచే వాడిని

 

ఇట్స్ ఓకే బావ ఎపుడు వస్తున్నావ్ ఇక్కడికి

 

సారి చందు నేను నీ ఎంగేజ్మెంట్ కు రాలేను ఎందుకు అంటే రేపు నేను నా వైఫ్ ను తీసుకుని బాలీ కి వెళ్తున్నా హనీమూన్ కోసం సో ఏమ్ అనుకోకు

 

పర్లేదు బావ ఆల్ ది బెస్ట్ అంతకు మించి మాట్లాడలేక పోయాను

 

థాంక్స్ చందు గుడ్ నైట్ & వన్స్ అగైన్ కంగ్రాట్స్ అంటూ బావ కాల్ కట్ చేశాడు……

 

గుడ్ నైట్ బావ అని నేను కూడా కాల్ కట్ చేసి నైట్ అంతా నిద్ర పోకుండా ఎంత సేపు ఏడ్చనో నాకే తెలీదు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా  ఇంకిపొయాయి ……ఈ మ్యారేజ్ నా పేరెంట్స్ కోసం అయినా చేసుకోవాలి వాళ్లేం చేసినా నా మంచి కోసం చేస్తారు కానీ బావను నేను అంత త్వరగా మర్చిపోలేను 😭😭…..

కళ్లకు నచ్చిన వారిని

కన్నుమూసి తెరిచేలోగా

మర్చిపోవచ్చు కానీ 🥺

మనసుకి నచ్చిన వారిని

అంత త్వరగా మర్చిపోలేము ☹️

కానీ మర్చిపోవాలి తప్పదు ఎందుకంటే ఇపుడు బావ వేరొకరి భర్త నేను ఇలా ఆలోచించడం కూడా తప్పే ఇపుడు బావను నేను నా బావ లానే చూడాలి ఇలా అనుకోవడం కూడా నాకు నరకంగా ఉంది……

మనం ఇష్టపడే వారు మనతోనే

ఉండాలనుకోవడం కాదు

ప్రేమంటే…..

వాళ్ళు ఎక్కడవున్నా నవ్వుతూ

సంతోషంగా వుండలనుకోవడమే

నిజమైన ప్రేమ!!!!

 

అలా ఏడుస్తూనే నిద్రలోకి జారుకున్నాను తెల్లవారక లేచి ఫ్రెష్ అయి అమ్మ ఇచ్చిన కాఫీ తాగి కిందకు వెళ్ళేసరికి నా ప్రమేయం లేకుండా నే నా ఎంగేజ్మంట్ వర్క్స్ జరుగుతూ వున్నాయి ……..అత్తయ్యా మావయ్య కూడా వచ్చి నన్ను చూసి ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకున్నారు & షాపింగ్ కూడాఅంతే త్వరగా కంప్లీట్ అయిపోయింది…….

నేను నా ఫ్రెండ్స్ కు నా ఎంగేజ్మెంట్ గురించి చెప్పాను వాళ్ళు కూడా అంతే షాక్ అయ్యారు ఇంకేం చేయలేక వాళ్ళు నన్ను ఓదార్చి ఎంగేజ్మెంట్ కు వస్తాం అని చెప్పారు ……..  నా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఇల్లంతా సందడిగా వుంది  ఇంటిని రకరకాల ఫ్లవర్స్ తో అలంకరించి చాలా అందంగా రెడీ చేసారు ……

మమ్మీ, అత్త ఇంకా కొంత మంది ఆడవాళ్ళు నాకు చీర కట్టి వంటి నిండా నగలతో అందంగా అలంకరించి నన్ను కిందకు తీసుకుని వెళ్లారు ….. నేను దించిన తల పైకి ఎత్తకుండా మౌనంగా కూర్చున్నా కనీసం పెళ్లి కొడుకు మొహం కూడా చూడలని లేదు & పూజ మొత్తం అయ్యాక తాంబూలాలు మార్చుకున్నారు తరువాత మమ్మల్ని కూడా రింగ్స్  మార్చుకోమని చెప్పారు …….

నాకు ప్రాణం పోతున్నట్టు వుంది ప్రాణం లేని బొమ్మల పైకి లేచి నిల్చుని నా చేయి అతని ముందు పెట్టాను అతను నా చేయి అందుకున్నాడు & నాకు ఆ చేతి స్పర్శ బాగా తెలిసినట్టు అనిపిస్తోంది కానీ తల పైకి ఎత్తకుండా వున్నాను అతను నా చేయి పట్టుకొని ఎంటి మామ ఈ అల్లరి కోతి కు నేను నచ్చలేదా కనీసం తల కూడా పైకి ఎత్తడం లేదు అని అన్నాడు …….,

అంతే  ఆ గొంతు వినగానే చటుక్కున కళ్ళు పైకి ఎత్తి చూసాను ఎదురుగా నా బావ మౌర్య రాజకుమారుడు లా అందంగా నవ్వుతూ నన్ను చూసి కళ్లు ఎగరేసాడు……

నాకు పోయినా ప్రాణం తిరిగొచ్చింది అంతే ఇక వెనుక ముందు చూసుకోకుండా ఇంటి నిండా రిలేటివ్స్ ఉన్నది కూడా మరచి బావ ను గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేసా బావ నువ్వు లేకుండా నేను  ఉండలేను ఐ రియల్లీ లవ్ యూ ♥️ అని నా మనసులో మాట చెప్పేశా …….

నేను ఆ మాట చెప్పిన మరు క్షణం ఒక్క సారిగా అందరు క్లాప్స్ కొట్టారు అపుడు కానీ నాకు నేను ఏమ్ చేశానో గుర్తు రాలేదు వెంటనే కంగారుగా బావ నుండి దూరంగా జరిగి నిల్చున్నా నాకు టెన్షన్ తో శివరింగ్ వచ్చేస్తోంది…….బావ నన్ను చూసి నవ్వూతూ నీ నోటితో ఈ మాట వినాలనే ఇదంతా చేశాను చందు & నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం చందు ఐ రియల్లీ లవ్ యూ రా అంటూ నా హ్యాండ్ పట్టుకుని రింగ్ పెట్టాడు ……

అప్పటికి కానీ నాకు అర్తం కాలేదు బావ కు పెళ్లి అయింది అని చెప్పడం నాకు వేరే అబ్బాయి తో ఎంగేజ్మెంట్ ఇదంతా బావ ప్లాన్ అని వెంటనే బావను పట్టుకుని బాగా కొట్టి అందరి సమక్షంలో ఇద్దరం రింగ్స్ మార్చుకున్నాం……   మా హ్యాపీనెస్ చూసి అమ్మ నాన్న అత్తయ్యా మావయ్య & నా ఫ్రెండ్స్ ఇంకా మా బందువులు అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మమ్మల్ని మనస్పూర్తిగా  ఆశీర్వదించారు …….

సరిగ్గా ఆరు నెలలు తరువాత బందు మిత్రులందరి సమక్షం లో మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఇప్పుడు నా పేరు చందన కాదు మౌర్య చందన …… నిజంగా నాది నిజమైన ప్రేమ అందుకే నా ప్రేమ నన్ను వెతుక్కుంటూ వచ్చింది & నాది నిజమైన ప్రేమ కాబట్టే ఓడిపోలేదు ఇప్పటి వరకూ ఇద్దరిగా వున్న మేము పెళ్లి అనే బంధం ద్వార ఒకటయ్యం …….

3 సంవత్సరాల తరువాత మా ప్రేమ కు గుర్తుగా మాకు అందమైన అమ్మాయి పుట్టింది తన పేరు ప్రేమ మా ప్రేమకు ప్రతి రూపం మా ప్రేమ బావ నేను మా పాప తో నేను సంతోషంగా ఉన్నాను ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తోంది & వాళ్ళే నా ప్రపంచం …….♥️

ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది నా ప్రేమ కథ?? మీకు ఇలాంటి లవ్ స్టోరీ ఉంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి 🫣 నా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ ద్వారా చెప్పండి 🙂

HAPPY ENDING ❣️

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply