ఏమాయ చేశావే-1

ఏమాయ చేశావే-1

🌷🌷 AmR  గార్డెన్స్ ఫంక్షన్ హాల్ 🌷🌷

ఒక పెద్ద కళ్యాణ మంటపం !!!!!! మండపం మొత్తం చుట్టాలతో అక్కడ వున్న వారి నవ్వులతో కల కళకళ లాడుతూ ఉంది…..

అక్కడ జరుగుతున్న పెళ్ళిని చూడడానికి పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెట్స్, పొలిటీషియన్స్, ఇంకా చాలా మంది,  వీ. ఐ.పీస్, సినిమా యాక్టర్స్, బిగ్ సెలబ్రిటీస్ ఇలా చాలా మంది వచ్చారు…..

ఆ మండపాన్ని చూడ్డానికి రెండు కళ్ళు  సరిపోవడం లేదు అంత అందంగా అలంకరించారు ఆ కళ్యాణ మంటపాన్ని…….

ఎందుకు అంటే అక్కడ జరిగే పెళ్ళి హైదరాబాద్ లోనే  ద బెస్ట్ బిజినెస్ మాన్స్ అయిన  సురేష్ వర్మ చిన్న కొడుకు అయిన ఆర్యన్ వర్మ & సంతోష్ గోయల్ చిన్న కూతురు అయిన అన్వీక   గోయల్ పెళ్లి జరుగుతూ ఉంది……

 

మండపం బయట ఫ్లోవర్స్ తో అందంగా డెకరేట్ చేశారు ఇలా !!!!!

ఆర్యన్  వర్మ

వెడ్స్

అన్వికా గోయల్

 

 

🍁🍁 సురేష్ వర్మ ఫ్యామిలీ 🍁🍁

సురేష్ వర్మ గారి నాన్న గారి పేరు జగదీష్ వర్మ ఆయన బార్య  సులోచన …… జగదీష్ వర్మ గారికి  ఒక్కడే కొడుకు ఆయనే సురేష్ వర్మ….. సురేష్ వర్మ గారి భార్య పేరు రచన……

వీళ్లకు  ఇద్దరు అబ్బాయిలే పెద్ద అబ్బాయి పేరు అభినవ్ వర్మ సొంతంగా బిసినెస్ స్టార్ట్ చేసి  తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు……

సొసైటీ లో మంచి పేరు తండ్రికి తగ్గ కొడుకు  అనే పేరు కూడా వుంది….. అభినవ్ ను అందరు అభి అనే పిలుస్తారు …… అభినవ్ బార్య పేరు మోనిష ….. మోనిష కూడా అభినవ్ తో పాటు వర్క్ చేస్తూ వుంటుంది…… ఇద్దరు కలిసే కంపెనీ ను చూసుకుంటూ వుంటారు….. వీళ్ళకి ఒక అబ్బాయి పేరు దేవన్ష్ వర్మ వీడికి వన్ ఇయర్…….

 

ఇక సురేష్ వర్మ గారి చిన్న కొడుకు అదేనండి మన హీరో గారి పేరు ఆర్యన్ వర్మ (పెళ్లి కొడుకు) ఆరడుగుల అందగాడు, ముట్టుకుంటే మసిపోయే అంత అందంగా కండలు తిరిగిన శరీరం తో చూడగానే పడిపోయే విధంగా వుంటాడు మన ఆర్య (ఆర్యన్ ముద్దు పేరు)…. ఈ మధ్యే ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ తీసుకున్నాడు …..
🌷🌷 సంతోష్ గోయల్ ఫ్యామిలీ 🌷🌷

 

సంతోష్ అమ్మా ,నాన్న ఈ మధ్య చనిపోయారు….. సంతోష్ కు వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ప్రేమ!!!! సంతోష్ కు వాళ్ళ నాన్నే ఇన్స్పిరేషన్ …… సంతోష్ ఎంతో కష్టపడి సొసైటీ లో గౌరవం ,మర్యాద సంపాదించుకున్నాడు…….

సంతోష్ బార్య పేరు అంజలి….. వీళ్లకు ఇద్దరు అమ్మాయిలు …   పెద్ద అమ్మాయి పేరు మోనిష (అభినవ్ బార్య) ……. చిన్న అమ్మాయి పేరు అన్వికా (పెళ్లి కూతురు) తనే మన హీరోయిన్

అన్వి మన హీరోయిన్ ముద్దు పేరు …..5.3 అడుగుల ఎత్తులో  తెల్లని మేలిమి చాయ సన్నగా అందంగా పాలుగారే బుగ్గలతో చూస్తే మళ్లీ మళ్లీ చూడాలి అని అనిపించేంత అందంగా ఉంటుంది…..

అన్వికా గైనకాలజిస్ట్ ( డాక్టర్)  గోయల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కు చైర్మెన్  అండ్ అదే హాస్పిటల్ లో డాక్టర్ గా వర్క్ చేస్తూ వుంటుంది…… ఎంతటి క్రిటికల్ సర్జరీస్ అయిన ఈజీగా సక్సస్  చేస్తుంది అతి తక్కువ సమయంలో నే ఎక్కువ పేరు సంపాదించుకుంది ……

 

హమ్మయ్యా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ అయిపోతుంది!!!!!  🙆🙆 ……. ఇపుడు కళ్యాణ మంటపం లో ఏమ్ జరుగుతూ వుందో చూద్దాం పదండి !!!!!

 

అక్కడ మీడియా మొత్తం వీడియో కవర్ చేస్తూ లైవ్ లో చూపిస్తూ వున్నారు ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ఆర్యన్ వర్మ  గారి వివాహం  గోయల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మెన్ అయిన అన్వికా గోయల్ గారితో జరుగుతూ ఉంది……

అన్వికా గారు కూడా ఫేమస్ గైనకాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ అని చెప్తూ లైవ్ లో చూపిస్తూ బిజీగా వున్నారు మీడియా వాళ్ళు……

 

సుమంత్:: 🙏🙏 సురేష్ వర్మ గారు

 

సురేష్:: 🙏🙏 సుమంత్  గారు రండి రండి…… ఎలా వున్నారు

 

 

సుమంత్:: బానే వున్నాం అండి పెళ్లి చాలా ఘనంగా నిర్వహించారు

 

సురేష్:: 😁😁 చాలా సంతోషం అండి

 

 

సుమంత్:: ఇంతకీ మీ  వియ్యంకులు సంతోష్ గోయల్ గారు ఎక్కడ కనిపించడం లేదు

 

 

సురేష్:: అదిగో అక్కడ మిత్ర గ్రూప్ ఆఫ్ చైర్మెన్ తో మాట్లాడుతూ వున్నాడు ఆగండి పిలుస్తాను సంతోష్!!!! సంతోష్!!!!

 

సంతోష్:: సురేష్ దగ్గరకు వస్తాడు

 

 

సురేష్:: సంతోష్!!!! సుమంత్ గారు

 

సంతోష్:: 🙏🙏 సుమంత్ గారు చాలా సంతోషం పిలవగానే వచ్చారు ….. ముందు కూర్చోండి ప్లీజ్

 

సుమంత్:: మీరు కూడా కూర్చోండి సంతోష్ గోయల్ గారు

 

సంతోష్:: 😁😁 సురేష్ నువ్వు కూడా కూర్చో

 

 

సురేష్:: కూర్చుంటాడు

 

 

సుమంత్:: వియ్యంకులు మళ్లీ వియ్యంకులు కాబో తున్నారు అనమాటా

 

 

సురేష్, సంతోష్:: 😁😁

 

 

సుమంత్:: సురేష్ గారు అభి ఎక్కడ కనిపించడం లేదు

 

సురేష్:: దగ్గరుండి తమ్ముడిని పెళ్లి కొడుకు చేస్తున్నాడు

 

సుమంత్:: ఎంతైనా అభి కు ఆర్యన్ అంటే చాలా ఇష్టం సురేష్ గారు

 

సురేష్:: 😁😁 ఇద్దరు  ఇద్దరే అండి ఒకరంటే మరొకరికి ప్రాణం

 

సుమంత్:: చాలా మంచి అబ్బాయిలు అండి ఇద్దరు…. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు సురేష్ గారు వజ్రాల్లంటి పిల్లల్ని కన్నారు

 

సురేష్:: 😁😁 …..!!!!

 

సుమంత్:: అరె మీ  కోడలు కూడా కనిపించడం లేదు సంతోష్ గారు

 

సంతోష్:: అన్వికా ను రెడీ చేస్తూ వుంది

 

సుమంత్:: సరిపోయారు

 

 

సురేష్, సంతోష్:: నవ్వ్వి 😁😁 గెస్ట్ లను రిసీవ్ చేసుకోవడం లో బిజీ అయిపోయారు!!!!!

 

🌻🌻 పెళ్లి కొడుకు గది 🌻🌻

 

ఇక్కడ ఆర్యన్ ను తన ఫ్రెండ్స్ మరియు అభి ఫ్రెండ్స్ అందరు కలిసి ఆర్య ను రెడీ చేస్తూ ఉంటారు…… ఆర్య ను పెళ్లి కొడుకు చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా మాట్లాడుతూ వున్నారు…… అభి ఆర్యన్ కు బాసికం కట్టి ఇలా మాట్లాడుతూ వున్నాడు

 

అభి:: ఏంట్రా ఆర్య చాలా సంతోషంగా వున్నట్టు ఉన్నావ్

 

అవినాష్:: మరి ఇష్ట పడ్డ అమ్మాయిని ఇంకొద్ది క్షణాల్లో పెళ్లి చేసుకో బోతున్నాడు ఆ మాత్రం సంతోషం వుంటుంది (అభి ఫ్రెండ్)

 

అభి:: హ్మ్మ్!!!! ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఇప్పుడు వున్న ఫ్రీడమ్ మళ్లీ వుండదు

 

ఆర్య:: అబ్బా!!!! అవునా ఆగు వదిన ను కూడా అడుగుతా

 

అభి:: 🙏🙏 అంత పని చేయకురా అది అసలే ఫైర్ బ్రాండ్

 

ఆర్యన్:: నవ్వుతూ వున్నాడు

 

అవినాష్:: మోనిష ను కూర్చోమని చెప్పచ్చు కదరా దెవన్ష్ ను చూసుకుంటూ

 

అభి:: చెప్పా రా !!!! వునట్లేదు నా చెల్లి నీ నేనే దగ్గర వుండి పెళ్లి కూతుర్ని చేయాలి అని చెప్పింది

 

అవినాష్:: మరి దేవాన్ష్  ను ఎవరు చూసుకుంటూ వున్నారు

 

అభి:: మామ్, అత్తయ్య చూసుకుంటూ వున్నారు

 

ఆర్య:: అన్వి పిక్స్ ఫోన్ లో చూస్తూ నవ్వుతూ వున్నాడు

 

 

అభి, అవినాష్:: ఏడిపిస్తూ వున్నారు

 

పంతులు:: అమ్మా!!!! పెళ్ళికొడుకుని తీసుకుని రండి

 

అభి:: ఆర్య పదా నిన్నే పిలుస్తూ ఉన్నారు

 

ఆర్య:: నవ్వుతూ మండపం లోకి ఆడుగు పెట్టాడు!!!!  అక్కడ అందరు ఆర్యన్ ను చూడగానే అందరు స్టన్ అవుతారు……

ఆచ్చం రాజకుమారుడు లాగ  వుంటాడు…. పంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తూ అన్వీ కోసం వెయిట్ చేస్తూ వుంటాడు

 

🍀🍀🍀 పెళ్లి కూతురు గది 🍀🍀🍀

 

అన్వికా పింక్ కలర్ పట్టు చీర లో గోల్డ్ కలర్ బ్లౌస్ తో వంటి నిండా నగలతో అలంకరించుకుని చాలా అంటే చాలా చాలా అందంగా ఉంటుంది……

 

మోనిష ఇంకా అన్వికా ఫ్రెండ్స్ అయిన ప్రియ ,నందు తనను రెడీ చేస్తూ ఉంటారు….. ఇంకా హైదరాబాద్ లో ద బెస్ట్ బ్యూటీషన్లు కూడా అక్కడే ఉండి తనను రెడీ చేస్తూ ఉంటారు…..

 

అన్వికా మొహం లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా సైలెంట్ గా కూర్చుని ఎదో ఆలోచిస్తూ వుంటుంది……

 

అప్పుడే అక్కడికి వచ్చిన అంజలి, రచన అన్వికా ను చూసి ఇలా మాట్లాడుతూ వుంటారు……

 

రచన:; అన్వి  నిజంగా చాలా అందంగా వున్నావు మా నా దిష్టి తగిలేలా వుంది అని రెండు చేతులతో దిష్టి తీస్తుంది

 

అన్వికా:: జీవం  లేని ఒక నవ్వు నవ్వి సైలెంట్ గా ఉండిపోయింది

 

అంజలి::  నిజంగానే చాలా అందంగా వున్నావు అన్వీ అని నుదుటిన ముద్దు పెడుతుంది

 

అన్వీకా:: స్మైల్ ఇచ్చింది

 

ప్రియ:: అన్వి బుజం మీద చేయి వేస్తుంది

 

అన్వీకా:: ఆలోచనల నుండి బయటకు వచ్చి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది

 

మోనిష:: 👌👌 గా వున్నావ్ అన్వి నిన్ను ఇలా చూస్తే ఆర్యన్ ఫ్లాట్ అయిపోతాడు

 

 

 

అన్వి:: స్మైల్ ఇచ్చింది కానీ లోపల చాలా బాధగా ఉంది

 

రచన:: అన్షు ఏడుస్తున్నాడు చూడు మోనిష

 

మోనిష:: ఇటు ఇవ్వండి అత్తమ్మ అని వాడిని ఎత్తుకుని వుంటుంది

 

రచన:: చూడు అంజలి నా కోడలు ఎంత అందంగా ముద్దుగా వుందో

 

అంజలి:: నవ్వుతుంది

 

అన్వికా:: ఏమ్  మాట్లాడకుండా మౌనంగా తక దించుకుని వుంటుంది

 

రచన:; అబ్బో సిగ్గే !!!!! కాస్త దాచుకో అని ఆట పట్టుస్తు ఉంది

 

అన్వికా:: కల్ల వెంట నీళ్లు కారుతూనే వున్నాయి అవి ఎవరికీ కనిపించకుండా తుడుచుకుంటుంది

 

ఈ లోపు పంతులు గారు పెళ్లి కూతురు ను పిలుచుకుని రమ్మని చెప్పగానే అందరు కలిసి అన్వికా ను పెళ్లి మండపం లోకి తీసుకు వస్తారు…..

ఇద్దరికీ మధ్య తెర అడ్డం పట్టుకొని పెళ్లి జరిపిస్తు వున్నారు….. పాపం మన ఆర్య అన్వి ను చూడాలని తెగ ట్రై చేస్తున్నాడు కానీ తెర అడ్డం వుండడం వల్ల కనిపించడం లేదు…..

ఆర్యన్ ఫ్రెండ్స్ అండ్ అభి తనను ఆట పట్టిస్తూ వుంటారు అయిన మన ఆర్య పట్టు వదలని విక్రమార్కుడు లా ట్రై చేస్తున్నాడు…..

 

పంతులు:: నాయన 🙏🙏 అమ్మాయి జీవితం మొత్తం నీ పక్కనే వుంటుంది కానీ ముందు పూజ మీద దృష్టి పెట్టు అని అంటాడు

ఆ మాటకి అందరు నవ్వేసారు….. ఆర్య కూడా చిన్న గా నవ్వు నవ్వి బుద్దిగా కూర్చుని పూజ చేస్తూ వుంటాడు.

 

అన్వికా:: కు ఇవేం వినిపించడం లేదు తన కల్ల ముందు ఏవేవో జ్ఞాపకాలు కనిపిస్తూ ఉంటాయి వాటిని తలచుకుని బాధ పడుతూ ఉంది

 

తర్వాత సంతోష్ గోయల్ మరియు అంజలి కలిసి ఆర్యన్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు…. ఆ tarvatha ఒకరి తల మీద మరొకరు జిలకర బెల్లం  పెట్టుకోగానే వారి మధ్య వున్న తెర తీసేస్తారు …..

 

ఆర్యన్:: తెర తీయగానే ఎదురుగా కూర్చుని వున్న అన్వికా ను రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు

 

అభి:: అది చూసి రేయ్ ఆర్య నా పరువు తీయకు  బుద్దిగా కూర్చో అని అంటారు

 

 

ఆర్యన్:: 😁😁

తర్వాత  ఇద్దరిని పక్క పక్కన కూర్చో బెట్టి పూజ చేయిస్తూ వున్నారు ఆ తర్వాత ఆర్యన్ చేతికి మంగళ సూత్రం ఇచ్చి  మాంగల్య ధారణ చేయమని చెప్పగానే …

ఆర్యన్ నవ్వుతు  సంతోషంగా ఆ దేవుడి సాక్షిగా అన్వికా ను చూస్తూ తన మెడలో మూడు ముళ్లు వేసి  అన్వికా గోయల్ ను కాస్త అన్వికా ఆర్యన్  వర్మ చేసుకుంటాడు ….

 

అన్వికా మెడలో తాళి కట్ట గానే అప్పటి వరకు ఆపూకున్న కన్నీళ్లు ఇక ఆగను అన్నట్టుగా బయటకు వచ్చేస్తాయి…..వధూవరులను అందరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ….

వాళ్ళను చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంతా అందంగా వున్నారు ఇద్దరు ఒకరికోసం ఒకరు పుట్టినట్టు ఉన్నారు …….

 

ఆర్యన్:: తాళి బొట్టు కట్టిన తరువాత నుదుటిన ముద్దు పెట్టీ ఐ లవ్ యూ అన్వి  అని చెప్పి కూర్చుంటాడు

 

అన్వికా:: సైలెంట్ గా ఉండిపోయింది……

 

అలా పెళ్లి జరిగిన తరువాత అందరు వీళ్ళను వీళ్ళను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు….. అందరు వీళ్ళను విష్ చేస్తూ ఉంటారు……

 

తర్వాత అందరు కలిసి సురేష్ వర్మ మాన్షన్ కు బయలుదేరుతారు …… ఆర్యన్, అన్వికా చేయి పట్టుకుని కార్ లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేసాడు

 

ఆర్యన్:: అన్వికా ను చూస్తూ ఉన్నాడు

 

అన్వికా:: విండో లో నుండి బయటకు చూస్తూ ఉంది…..

 

అలా కాసేపటికి అందరు వర్మ మాన్షన్ కు రీచ్ అవుతారు….. డ్రైవర్ వచ్చి  డోర్ ఓపెన్ చేయగానే ఆర్యన్ దిగి అన్వీక కు  చేయి అందివ్వగనే అన్వికా ఆర్యన్ చేయి పట్టుకుని కిందకు దిగి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి గుమ్మం దగ్గర ఆగుతారు……

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply