విలన్ హస్బెండ్-8
మహి నేను మీ ఫ్యామిలీ ను తీసుకుని రమ్మంటే నువ్వెంట్రా శైలు ను మాత్రమే తీసుకుని వచ్చావ్ నా కోడలు పిల్ల ఎక్కడ అని కనిపించని ఆద్య గురించి అడుగుతున్న వినయ్ ను చూసి లేదు రా అందరం వచ్చాం బట్ అమ్ము అర్జంట్ మెయిల్ సెండ్ చేయాలి అని కార్ దగ్గరే ఉంది. ఈ పాటికి వస్తూ ఉంటుంది అని అంటుండగానే అక్కడికి వచ్చిన మాన్య ను చూసి వినయ్ తను మాన్య ఆద్య కి బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్తారు మాన్య తనే నా ఫ్రెండ్ వినయ్ వర్మ అని ఇద్దరినీ ఒకరికి ఒకరిని పరిచయం చేస్తాడు.
నమస్తే అంకుల్ అంటున్న మాన్య ను చూసి చిన్న స్మైల్ ఇచ్చి మహిదర్ తో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వస్తుంది ఆద్య. ఆద్య ను చూసిన శైలు అన్నయ్య తనే మా అమ్మాయి పేరు ఆద్య అంటూ ఆద్య కి కూడా వినయ్ గురించి చెప్పి పరిచయం చేస్తుంది.
ఆద్య నవ్వుతూ హాయ్ అంకుల్ హౌ ఆర్ యూ సో లాంగ్ అంటూ బ్లెస్ మీ అంకుల్ అని వినయ్ కాళ్లకు నమస్కారం చేసాక బంగారు బొమ్మ లా ఉన్నావ్ బంగారం అంటూ ఆద్య ను తన పక్కనే కూర్చో బెట్టుకుని ఎంత పెద్దగా అయిపోయావ్ రా నేను చూసినపుడు ఎంత చిన్నగా ఉండేదానివో తెలుసా మీ డాడ్ నీ పిక్స్ పంపిస్తూ ఉండే వాడు బట్ ఇలా రియల్ గా చూస్తుంటే పిక్స్ లో రియల్ గా ఇంకా ముద్దుగా ఉన్నావ్ అంటూ ఆద్య వైపు చూసి నవ్వుతూ చెప్తాడు.
చిన్నప్పుడు ఎవరైనా చిన్నగానే ఉంటారు కదా అంకుల్ 😜 అని నవ్వుతున్న ఆద్య ను చూసి శైలు సీరియస్ గా చూస్తే మిగిలిన అందరూ నవ్వుతూ ఉంటారు. ఏమో అనుకున్న మహి నీ కూతురు నీ లాగ ఇన్నోసెంట్ అయితే కాదు రా బాగా గడుసు పిల్లే… కదా బుల్లి రాక్షసి అంటూ ఆద్య వైపు చూస్తాడు
అంతా శైలు పోలికే 🤣😂 అని మహిదర్ అనడం తో శైలు 🤨🤨 సీరియస్ లుక్స్ ఇవ్వడం చూసి దిక్కులు చూస్తూ వినయ్ తో ఆపిన ముచ్చట్లు స్టార్ట్ చేస్తాడు.
అంకుల్ మీ కిడ్స్ ఎలా ఉన్నారు ఇపుడు వాళ్లేం చేస్తున్నారు?? మీకు అబ్బాయి, అమ్మాయి కదా అంటూ చిన్నప్పుడు వాళ్ళతో ఆడుకోవడం గుర్తు చేసుకుంటూ అడుగుతుంది.
అవును ఆద్య అమ్మాయి పేరు మాయ ఇవాళ తనదే బర్త్డే అందుకే ఈ పార్టీ తను ఎమ్. బి. బి. ఎస్ చదువుతుంది .
ఓహ్ అలాగే మరి మీ అబ్బాయి???
జై గురించి మాట్లాడడం ఇష్టం లేకపోయినా తప్పక మాట్లాడుతూ వాడి పేరు జై ధీర్ వర్మ వర్మ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సి. ఇ. ఓ.
ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని ఆలోచిస్తున్న ఆద్య కి రేయ్ వినయ్ అక్కడ నుంచుంది నీ కొడుకే కదా అని మహిదర్ డౌబ్ట్ గా అడగడం చూసి ఆద్య అటుగా తన చూపు తిప్పుతుంది.
రాయల్ బ్లూ కలర్ సూట్ విత్ వైట్ షర్ట్ తో చేతికి రోలెక్స్ వాచ్ తో సైడ్ నుండి కనిపిస్తున్న జై ను చూసి వీడు షాపింగ్ మాల్ లో కనిపించిన విలన్ లా ఉన్నాడేంటి అని తన వైపు డౌబ్ట్ గా చూస్తూ ఉంటుంది.
జై వైపు చూసిన వినయ్ కి హా….!! అవును రా తనే జై బలే గెస్ చేసావ్ మహి …. అరే ఆ మాత్రం గుర్తు పట్టలేనా ఏంటి నీ కొడుకు గురించి మొన్న బిజినెస్ మ్యాగ్జైన్ లో ఒక ఆర్టికల్ కూడా రాసాను ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ జై…. నువ్వు జై గురించి కన్న డ్రీమ్స్ అన్ని ఫుల్ ఫిల్ చేస్తున్నాడు అని సంతోషంగా చెప్తాడు.
వినయ్ జై వైపు చూసి వాడు నాకు నచ్చని వే లో ఎపుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుండే వాడి నుండి హ్యాపీనెస్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయడం మానేశాను మహి జై బిజినెస్ లో ఎంత సక్సెస్ అయినా వాడి లైఫ్ మీద బ్లాక్ మార్క్స్ వల్ల వాడు నా కంటికి లూసర్ గానే కనిపిస్తున్నాడు.
ఏంట్రా జై వైపు అలా చూస్తున్నావ్ సడెన్ గా ఎందుకలా డల్ అయ్యావ్??
అదేం లేదు రా ఐ ఆమ్ ఒకే అని చిన్న స్మైల్ ఇచ్చిన వినయ్ ను చూసి తను కూడా నవ్వుతూ జస్ట్ వెయిట్ అంటూ జై దగ్గరకు నడుస్తాడు.
హాయ్ యంగ్ మ్యాన్!!! మహిదర్ వాయిస్ కి గెస్ట్స్ తో మాట్లాడుతున్న జై మహిదర్ వైపు స్ట్రేంజ్ గా చూస్తూ ఉంటాడు ….
హలో జై హౌ ఆర్ యూ… సో గుడ్ టు సీ యూ హియర్ అని చిన్న చిన్న తో చెప్తున్న మహిదర్ ను చూసి షేక్ హ్యాండ్ ఇస్తూ హాయ్ డు యూ నో మీ అంకుల్??? ఐ మీన్ జై అంటూ చాలా క్లోజ్డ్ పర్సన్ లా పిలుస్తున్నారు దట్స్ వై ఐ ఆమ్ అస్కింగ్….
జై నువ్వు నన్ను ఇంకా గుర్తు పట్టలేదా కొంచెం ఆలోచించు…!
మహిదర్ మాటలకు జై అమర్ వైపు చూస్తాడు నేను కూడా ఇపుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నా అంటూ మెల్లగా చెప్తున్న అమర్ ను చూసి ఉఫ్… సారి అంకుల్ గుర్తు రావడం లేదు
ఒకే కూల్…. !! ఇట్స్ మీ జై మీ డాడ్ క్లోజ్ ఫ్రెండ్ మహిదర్ నీ చైల్డ్హుడ్ లో వైజాగ్ లో ఉండే వాళ్ళం మనం ఎవ్రీ వీకెండ్ బీచ్ కి వెళ్ళే వాళ్ళం గుర్తొచ్చానా
జై కాసేపు ఆలోచించి…. హో మై గుడ్నెస్ అంకుల్ మీరా ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటూ మహిదర్ ను హగ్ చేసుకుంటూ సీరియస్లీ కొంచెం కూడా గుర్తు పట్టలేక పోయాను ఎలా ఉన్నారు
మహిదర్ నవ్వుతూ నువ్వు కూడా చాలా చేంజ్ అయ్యావ్ జై … మీ డాడ్ ద్వారా మీ అందరి పిక్స్ నేను చూసాను అందుకే ఈజీగా రికగ్నయ్జ్ చేసాను సో హ్యాపీ ఫర్ యూ కమ్ ఆంటీ అండ్ ఆద్య కూడా ఇక్కడే ఉన్నారు
అవునా అందరూ వచ్చారా థాంక్స్ ఫర్ కమింగ్ అంకుల్ అని బ్రైట్ స్మైల్ తో చెప్తూ బై ది బై హి ఇస్ అమర్ మీ లాగా మేము కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ అమర్ ను మహిదర్ కి ఇంట్రడ్యూస్ చేస్తాడు.
ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని మాట్లాడాక ఒకే కమ్ అంటూ జై, అమర్ ను తీసుకుని వినయ్ వాళ్ళ దగ్గరకు తీసుకుని వస్తాడు మహిదర్…
మహిదర్ తో పాటు వస్తున్న జై ను చూసిన ఆద్య కోపంగా పైకి లేచి వీడేంటి ఇక్కడ??? హో గాడ్ వీడిని చూస్తే చాలు ఎక్కడ లేని ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు అని జై వైపు చంపేసేలా చూస్తూ ఈ స్టుపిడ్ తో డాడీ కి మాటలు ఏంటి అని జై వైపు చంపేసేలా చూస్తూ ఉంటుంది ….
అమర్ ను చూసిన మాన్య కూడా అంతే షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ వీడేంటి ఇక్కడికి వస్తున్నాడు అని ఇందాక అమర్ చేసిన ఓవర్ యాక్షన్ గుర్తు చేసుకుంటూ తన వైపు మండిపోతూ చూస్తూ ఉంది.
యూ నో అమర్ చిన్నప్పుడు నేను అంకుల్ కూతురు బిగ్ ఎనిమీస్ నేను ఎమ్ చేస్తే దానికి క్వైట్ అపోసిట్ చేసేది అని నవ్వుతూ చెప్పి…. అంకుల్ ఇపుడు మీ డాటర్ ఎలా ఉందో తెలియదు కానీ నా మైండ్ లో ఉంది మాత్రం రెండు పోనీ టైల్స్ వేసుకుని చీమిడి ముక్కు వేసుకుని నా పేరు పలకడానికి కూడా దానికి అప్పట్లో వచ్చేది కాదు జస్ట్ లైక్ ధీరు…. ధీరు…. అని ఫన్నీ గా పిలుస్తూ ఉండేది అని నవ్వుతూ ఎదురుగా చూసిన తనకు ఆద్య అమ్మోరు తల్లి లా తన వైపు చూస్తూ కనిపిస్తుంది…
ఈ రెడ్ మిర్చి ఏంటి ఇక్కడ ఉంది నా అడ్రస్ తెలుసుకుని డాడ్ కి నా గురించి కంప్లైంట్ చేస్తుందా ఏంటి ఉఫ్…. ఇపుడు డాడ్ ఏమంటారో ఏంటో పైగా అంకుల్ ఫ్యామిలీ కూడా ఉన్నారు ఇది పార్టీ లో గొడవ చేయాలి అపుడు చెప్తా దీని సంగతి అని ఆద్య వైపు యారోగెంట్ లుక్స్ ఇస్తూ ముందుకు నడుస్తాడు
మాన్య ను చూసిన అమర్ కూడా ఇదేంటి ఇక్కడుంది కొంపదీసి ఇది మహిదర్ అంకుల్ కూతురు కాదు కదా కూతురు అయితే మాత్రం నాకు భయం ఎందుకు అనుకుంటూనే మాన్య ను చూసి నవ్వుకుంటూ తనలో మరింత ఫ్రస్ట్రేషన్ పెంచేలా జై వెనుక వెళ్ళి తన ఫేస్ కనిపించకుండా వెనుకే వస్తూ నడుస్తాడు
వీడి గురించి వీడు ఏమనుకుంటున్నారు చెత్త వెధవ అని అమర్ చేస్తున్న ఓవర్ యాక్షన్ కి పళ్ళు నూరుతూ తన వైపు చూస్తుంది
మహిదర్ వినయ్ వైపు చూస్తూ రేయ్ వినయ్ నీ కొడుకు అచ్చం నువ్వు టీనేజ్ లో ఎలా ఉండే వాడివో అలాగే ఉన్నాడు రా అంటూ జై చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా చెప్తాడు
వాట్???? వీడు వినయ్ అంకుల్ కొడుకా షట్ 🤦🤦🤦 ఎలాంటి కొడుకుని కన్నారు అంకుల్ అనుకుంటూ జై వైపు అసహనంగా చూస్తుంది
జై ఆంటీ ను గుర్తు పెట్టావా అని మహిదర్ అడగ్గానే కమాన్ అంకుల్ నేను మిమ్మల్ని ఐడెంటిఫై చేయలేక పోయాను కానీ ఆంటీ నాకు ఇప్పటికీ గుర్తుంది అని నవ్వు ఆపుకుంటూ హాయ్ ఆంటీ హౌ ఆర్ యూ అని ఆద్య ను టైట్ హగ్ చేసుకుని ఎవరు చూడకుండా మెడ మీద బైట్ చేస్తాడు…
ఆ ఆ ఆ……!!! ఇడియట్ అంటూ కోపంగా జై ను వెనక్కి నెట్టి నొప్పెడుతున్న మెడ ను రుద్దుకుంటూ జై వైపు సీరియస్ లుక్స్ ఇస్తుంది అది చూసిన జై 😉😉 కన్ను కొట్టడం చూసి ఆద్య కి మరింత చిరాకు వస్తుంది..
వాట్ ఆంటీ ఎందుకలా తోసారు యూ నో ఐ మిస్డ్ యూ సో మచ్ అంటూ మళ్ళీ హగ్ చేసుకోవడానికి వెళ్తున్న జై ను ఆపుతూ బాబు జై తను నా కూతురు ఆద్య ఇదిగో తన పక్కన ఉందే తను నా వైఫ్ శైలు అంటూ బీట్ రూట్ లా మారిన కూతురి ఫేస్ చూసి కంగారుగా చెప్తాడు
ఏంటి ఈ మిర్చి అంకుల్ డాటర్ ఆ?? కరెక్ట్ గా దొరికావే ఆగు నీ పని చెప్తా అని కన్నింగ్ గా నవ్వుతూ ఆద్య వైపు చూస్తాడు
రేయ్ విలన్ నన్ను ఆంటీ అంటావా నాకు తెలుసు రా నువ్వు కావాలనే అంటున్నావ్ నేను ఆంటీ కాదు రా నువ్వే తాత లా ఉన్నావ్ ఉడతలు మొహం నువ్వు నూ 😏 అని మొహం తిప్పుకుంటుంది
జై ఆద్య వైపు చూస్తూ డోంట్ లైస్ టు మీ అంకుల్ ఆంటీ ను పట్టుకుని అమ్మాయి అంటారేంటి 😜🤭 బై ది బై మీ అమ్మాయి చాలా బావుంది అంటూ శైలు వైపు చూసి చెప్పడం తో అది విన్న శైలు హెయిర్ ను చెవి వెనుక పెడుతూ సిగ్గు పడుతుంది అది చూసిన ఆద్య 🤦
అబ్బా జై నేను చెప్పేది నిజం తను నా కూతురు కావాలంటే మీ ఆంటీ నే అడుగు
ఇస్ ఇట్ అంటూ శైలు వైపు చూస్తూ మీరు నిజంగా అంకుల్ కి వైఫ్ ఆ అని అమాయకంగా అడుగుతున్న ఐ మీన్ అమాయకుడిగా యాక్ట్ చేస్తూ అడుగుతున్న జై ను చూసి అవును జై యాక్చుయల్లీ నాకు చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయింది ఎర్లీ గానే కన్సీవ్ కూడా అయ్యాను అందుకే నేను ఆద్య సిస్టర్స్ లా ఉంటాం 🥰🥰 తనే మా కూతురు పేరు ఆద్య
అవునా ఐ ఆమ్ సారి ఆంటీ చూడగానే మీరే డాటర్ అనుకున్నా అండ్ మీ అమ్మాయి కంటే మీరే బ్యూటీఫుల్ గా ఉన్నారు టేక్ దిస్ రోస్ అంటూ టేబుల్ మీదున్న బొకే నుండి రోస్ తీసి ఇవ్వడం తో శైలు నవ్వుతూ దాన్ని తీసుకుంటుంది
వీడు కావాలనే ఎక్స్ట్రాస్ చేస్తున్నాడు అని జై వైపు సీరియస్ గా చూస్తూ వెళ్ళి వినయ్ పక్కన కూర్చుంటుంది తన పక్కనే అమర్ ను చూసి మాన్య కూడా అంతే సీరియస్ గా మొహాన్ని పెట్టుకుని ఉంటుంది…
ఆద్య తో జై బిహేవియర్ స్ట్రేంజ్ గా కనిపిస్తూ ఉంటే వినయ్ ఇద్దరిని అబ్జర్వ్ చూస్తూ ఉంటాడు…. ఇద్దరికీ పవర్స్ లేక ఆగారు కానీ లేకపోతే ఇద్దరు ఒకరిని ఒకరు కంటి చూపు ల తోనే చంపేసేవారు… ఆద్య కోపాన్ని ఎంజాయ్ చేస్తూ జై కూడా అమర్ తో పాటు అక్కడే సెటిల్ అయి ఆద్య ను చూస్తూ నవ్వుతూ ఉంటాడు ….
మాయ నిన్ను డాడీ పిలుస్తున్నాడు అని పార్టీ లో అటు ఇటు ఎవరి కోసమో చూస్తున్న మాయ చెయ్ పట్టుకుని వినయ్ దగ్గరకు తీసుకుని వస్తుంది అప్పటికే ఆద్య కోసం వెతికి అలసిపోయిన ప్రతాప్ వర్మ కూడా అపుడే అటుగా గెస్ట్స్ తో నవ్వుతూ మాట్లాడుతూ అక్కడికి వస్తారు
మామ్…. నేను తరువాత వస్తాను అని కళ్ళతోనే ఆద్య కోసం వెతుకుతున్న మాయ కి వినయ్ పక్కన కూర్చున్న ఆద్య కనిపించడం తో షాక్ తో ఉన్న చోటే ముందుకు కదలకుండా అక్కడే ఆగిపోతుంది
మాయ ఏమైంది డాడ్ వెయిట్ చేస్తున్నారు రా బంగారం డాడ్ ను అలా వెయిట్ చేయించకూడదు
మామ్ జస్ట్ వెయిట్ అంటూ రేణుక కు బాగా దగ్గరగా వచ్చి డాడ్ పక్కన కూర్చుంది కదా హు ఇస్ షి మామ్?? తనను ఇపుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నా
ఎవరు అంటూ వినయ్ వైపు చూసిన రేణుక కి బుట్ట బొమ్మ లా కూర్చున్న ఆద్య కనిపిస్తుంది
ఏమో రా నాకు కూడా తెలియదు మీ డాడ్ కి తెలిసిన వాళ్ళ అమ్మాయి అనుకుంటాను
అవునా 😍😍 చాలా అందంగా ఉంది కదా మామ్ ఇలాంటి అమ్మాయి అయితే అన్నయ్య కి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఏమంటావు మామ్
నో అంటాను 😏😏 మన హరిణి కంటే ఎమ్ బావుంది అని పైకి చెప్పిందే కానీ మాయ చెప్పింది నిజమే ఈ అమ్మాయి అందంగా కాదు చాలా అందంగా ఉంది అనుకుంటుంది
అబ్బా నీకు టేస్ట్ లేదు పో మామ్ అని చెప్పి హాయ్ డాడ్ అంటూ వెళ్ళి వినయ్ కి మరో వైపు కూర్చుంటుంది
ఏంట్రా ఇంత లేట్ చేసావ్ చూడు నీ కోసం ఎవరొచ్చారో అని మహిదర్, శైలు వైపు చూపిస్తూ అడుగుతాడు
ఎవరు అనుకుంటూ వాళ్ళ వైపు చూసిన మాయ కి కాసేపటికి వాళ్ళను గుర్తు పడుతూ అంకుల్ అంటూ వెళ్ళి మహిదర్ పక్కన కూర్చుని ఆయన్ని హగ్ చేసుకుంటుంది
ఎలా ఉన్నావ్ మాయ అంటూ ప్రేమగా తల నిమురుతున్న ఆయనను చూసి నవ్వుతూ సూపర్ గా ఉన్నాను మీరెలా ఉన్నారు అంటూ శైలు ను చూసి ఆంటీ అంటూ తనను కూడా హగ్ చేసుకుంటుంది
ఆంటీ ఏంట్రా చిన్నప్పుడు పిలిచే దానివి కదా అత్త అని అలాగే పిలువు అపుడే మాకు హ్యాపీగా అనిపిస్తుంది ఎదీ ఒక సారి పిలువు అని శైలు అడగడం తో మాయ నవ్వుతూ సరే అత్త అంటూ ఇంతకీ నా డార్లింగ్ వదిన ఎక్కడ అంటూ అడుగుతున్న మాయ ను చూసి అదిగో అక్కడ అంటూ ఆద్య వైపు చూపిస్తాడు
ఆద్య ను చూసిన మాయ ను తీన్ మార్ డాన్స్ వేయాలి అన్నంత హ్యాపీగా ఉంటే కష్టంగా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసి హాయ్ వదిన అంటూ వెళ్ళి ఆద్య ను హగ్ చేసుకుంటుంది
ఆద్య కూడా మాయ ను తిరిగి హగ్ చేసుకుని ఎలా ఉన్నావ్ అంటూ మాయ పేరు తెలియక తన వైపు చూస్తుంది
మాయ చిన్నగా నవ్వుతూ మాయ వదిన అనగానే యస్ అవును కదా ఇందాక అంకుల్ కూడా చెప్పారు హ్యాపీ బర్త్డే మాయ అని నవ్వుతూ విష్ చేస్తుంది
మావయ్య నేను మాత్రం మిమ్మల్ని మామ, అత్త అనాలి బట్ వదిన మాత్రం అంకుల్, ఆంటీ అంటుంది దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని అలిగినట్టు ఫేస్ పెడుతుంది
మాయ మాటలకు ఆద్య నవ్వుతూ సారీ మేడం నేను కూడా మన అనే పిలుస్తాను ఒకే ఇక స్మైల్ చెయ్ అనగానే మాయ హాయిగా నవ్వేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్ వర్మ ఆద్య వైపు అశ్చర్యంగా చూస్తూ మాయ వైపు ఎలా??? అన్నట్లు చూస్తాడు…
మాయ ప్రతాప్ వర్మ వైపు చూస్తూ తాతయ్య తను ఆద్య మన మహిదర్ మామ కూతురు అని చెప్పగానే ప్రతాప్ అప్పుడు చూస్తాడు మహిదర్ శైలు వైపు మాయ లాగే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరితో జాయిన్ అవుతాడు
ఆద్య నవ్వుతూ ప్రతాప్ వర్మ బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయనను తన పక్కనే కూర్చో బెట్టుకుని ఆయన తనను అడిగే వాటికి పేషెన్స్ తో అన్సర్ చేస్తూ ఉంటుంది …. ప్రతాప్ వర్మ తనను మాటల్లో పెట్టి డిటైల్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటాడు….
అందరి మొహాల్లో కనిపిస్తున్న హ్యాపీనెస్ ను చూసిన రేణుక మెల్లగా ప్రతాప్ వర్మ పక్కకు వచ్చి నుంచుని మావయ్య అదిగో నా మేనకోడలు హరిణి ఎంత చక్కగా ఉందో కదా ఇప్పుడు అయినా నేను చెప్పింది కొంచెం ఆలోచించండి మావయ్య అంటూ మెల్లగా మాటలు మొదలు పెడుతుంది
రేణుక మాటలకు తల తిప్పి చూసిన ఆయనకు తన బెల్లీ కనిపించేలా డ్రెస్ వేసి నడుము అటు ఇటు కనిపించేలా డ్రెస్ వేసుకుని ఫుల్ స్కిన్ షో చేస్తూ వయ్యారంగా నడుస్తూ వచ్చి తన ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న హరిణి వైపు విసుగ్గా చూసి మొహాన్ని చిరాగ్గా తిప్పుకుంటాడు …..
చూడమ్మా రేణుక అమ్మాయి అందం అనేది కలర్ లేదా బ్యూటీ లో ఉండదు పెద్ద వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి ఇక్కడే తన సంస్కారం అర్థం అవుతుంది …. తను జై కి పూర్తీగా అన్ఫిట్ ఇంకో సారి తన గురించి నా దగ్గర మాట్లాడి నా మూడ్ చేంజ్ చేయకు అని సీరియస్ గా చెప్పి మాయ, ఆద్య, మాన్య లతో సరదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు……
జై వాచ్ వైపు చూసి ఒకే గాయ్స్ పార్టీ టైం అవుతుంది పదండి అని తొందర చేయడం తో అందరూ అక్కడి నుండి లోపలికి వెళ్తారు….. లాస్ట్ లో వెళ్తున్న ఆద్య చెయ్ పట్టుకుని నోరు మూసి అలాగే వెనక్కి ఎత్తుకుని వెళ్తున్న జై ను చూసిన హరిణి షాక్ అయ్యి తను కూడా వాళ్ళ వెనుకే వెళ్తుంది……
To Be Continueed……
This is a test comment via API