విలన్ హస్బెండ్ -5

విలన్ హస్బెండ్ -5

విండో లో నుండి బయటకు చూస్తూ కార్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక మాట కూడా మాట్లాడకుండా ఎట్లిస్ట్ తన మొహం కూడా చూడకుండా మూతి ముడుచుకుని కూర్చున్న మాయ ను చూసి ప్చ్  వాట్ ఇస్ దిస్ మాయ ఎందుకలా డల్ గా ఉన్నావ్ నీకు నచ్చినట్టు గానే నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా టెంపుల్ కి తీసుకుని వెళ్తున్నా కదా దెన్ వై ఆర్ యూ సో డల్ ఇవాళ నీ బర్త్డే టుడే నీతో ఉండాలని నా ప్రోగ్రామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసాను ఇంకా ఎందుకలా ఉన్నావ్

ఎందుకు నేను ఇలా ఉన్నానో నీకు తెలియదా అన్నయ్య లేక తెలిసే కావాలని క్వశ్చన్ చేస్తున్నావా అని మాయ కూడా జై వైపు చూస్తూ అడుగుతుంది

మాయ డల్ నెస్ కి రీసన్ తనే అని తెలిసినా అది జై యాక్సెప్ట్ చేయడు అందుకే దానికి ఎమ్ అన్సర్ ఇవ్వకుండా రోడ్ వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు

ఇలా డెయిలీ ఒకరితో టైమ్ స్పెండ్ చేస్తే నీ హెల్త్ కూడా అప్సెట్ అవుతుంది అన్నయ్య అండ్ ఆ సోని అసలు మంచిది కాదు దానికి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటి దాంతో నువ్వు అలా ఛా!!! నాకు దాని గురించి మాట్లాడుతుంటేనే వొళ్ళంతా చిరాగ్గా ఉంది

లిసన్ మాయ సోని జస్ట్ నా స్ట్రెస్ రిలీఫ్ కి యూస్ అయ్యే ఒక సెక్స్ డాల్ అంతే నాట్ ఓన్లీ సోని నాతో టైం స్పెండ్ చేసిన అమ్మాయిలు అందరూ నా దృష్టిలో దే అల్ లైక్ డాల్స్

అన్నయ్య నువ్వు ఎందుకిలా అమ్మాయిల గురించి చీప్ గా థింక్ చేస్తున్నావ్ నీకు కూడా ఒక చెల్లి ఉంది నా గురించి ఎవడైనా అలా వాగితే చూస్తూ ఊరుకుంటావా

షట్ అప్ మాయ బర్త్డే రోజు నాతో తన్నులు తినకుండా కామ్ గా కూర్చో నిన్ను ఎవడైనా కామెంట్ చేస్తే నెక్స్ట్ మినిట్ వాడి బాడీ బరియల్ గ్రౌండ్ లో ఉంటుంది ఇస్ ఇట్ క్లియర్ ఇంకో సారి నాతో ఈ చెత్త డిస్కషన్ పెట్టకు నువ్విలా మూడ్ ఆఫ్ చేసుకుంటావ్ అనే నిన్ను నా ఫ్లాట్ దగ్గరకు రావద్దు అంటాను ఇంకో సారి అక్కడ కనిపిస్తే చంపేస్తాను అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి టెంపుల్ రావడం తో కార్ పార్క్ చేసి మాయ ను తీసుకుని టెంపుల్ లోకి వెళతాడు

నేను ఫ్లాట్ కి రావడం కాదు అన్నయ్య నిన్ను ఆ ఫ్లాట్ కి వెళ్లకుండా చేయాలి అది జరగాలి అంటే నీ లైఫ్ లోకి వదిన రావాలి తనను ఎలా తీసుకుని రావాలో నేను తాతయ్య ఆల్రెడీ ప్లాన్ చేశాం అని చిన్నగా నవ్వుతూ జై తో పాటు గుడిలోకి వెళ్తుంది

అన్నయ్య అలా స్ట్రెయిట్ గా వెళ్ళిపోకూడదు ఇలా రా అంటూ జై ను గుడి బయట కాళ్ళు కడుక్కోవడానికి పెట్టిన వాటర్ ట్యాప్స్ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఇద్దరూ కాళ్ళు కడుక్కున్న తర్వాతా ప్రదక్షణలు చేస్తారు ( మన హీరో బాబు ప్రదక్షణలు చేయడం ఇష్టం లేకపోయినా చెల్లిని బర్త్డే రోజు బాధ పెట్టలేక కష్టంగా చేస్తున్నాడు )

*****************************

మామ్ 😬😬😬😬

ఇక్కడే ఉన్నానే ఎందుకలా చెవులు పగిలేలా అరుస్తున్నావ్ అని ఆద్య నైతి మీద కొడుతూ ఎందుకలా అరుస్తున్నావ్ అంటూ సీరియస్ గా చూస్తూ అడుగుతుంది

ఇప్పుడు నాకు హాఫ్ శారీ ఎందుకు కట్టావ్ దీన్ని క్యారీ చేయడం ఎంత కష్టమో తెలుసా పైగా ఈవెనింగ్ శారీ కట్టుకోవాలని ఇప్పుడు చెప్తున్నావ్ అని నడుము మీద రెండు చేతులు పెట్టుకుని సీరియస్ గా చూస్తుంది

టెంపుల్ కి వెళ్తూ శారీ కాకుండా షార్ట్స్, జీన్స్ లో వస్తావా మరీ చిన్న పాప లా అల్లరి చేయకుండా ఉండు అని ఆద్య కి జడ వేసి తలలో మల్లెలు తురిమి లైట్ గా మేక్ అప్ వేసాక అబ్బా ఎంత బావున్నావో నిన్ను ఆడపిల్ల లా చూడాలి అని ఎన్ని రోజులు నుండి అనుకుంటున్నానో తెలుసా అది ఇప్పటికీ నెరవేరింది

అంటే ఏంటి నీ ఉద్దేశం ఇన్ని డేస్ నీకు నేను అమ్మాయిలా కనిపించలేదా మామ్

ఎపుడు చూడు ఆ జీన్స్ లేదా ఫార్మల్స్ లో కనిపిస్తావ్ ఎలా కనిపిస్తావే ఆడపిల్లలా ఇప్పుడు చూడు బంగారు బొమ్మ లా ఉన్నావ్ అని సీరియస్ గా చూస్తున్న ఆద్య బుగ్గలు లాగి చూసింది చాలు కానీ పదా అంటూ ఆద్య ను తీసుకుని హాల్ లోకి వస్తుంది

రెడ్ కలర్ బార్డర్ పట్టు హాఫ్ శారీ లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా జడ వేసుకుని కొన్ని పూలు బుజం మీదుగా ముందుకు వేసుకుని పాపిటి బిళ్ళ మెడలో ఒక హారం తో నుదుటిన బింది దాని కింద కుంకుమ పెట్టుకుని వస్తున్న కూతురిని చూసి స్వచ్ఛంగా నవ్వుతూ చాలా బావున్నావ్ రా అంటూ నుదుటన ప్రేమగా ముద్దు పెట్టిన తండ్రి మొహం లోని హ్యాపీనెస్ ను చూసి అప్పటి వరకు చిరాగ్గా ఉన్న ఆద్య చిన్నగా స్మైల్ ఇస్తుంది

హ్మ్మ్ అయ్యాయ తండ్రి కూతురి ముచ్చట్లు ఇప్పటికే బాగా లేట్ అయింది పదండి వెళ్దాం గుడి నుండి వచ్చాక తీరిగ్గా కూర్చుని పెట్టుకోండి మీ ముచ్చట్లు అని చెప్తున్న శైలజ ను చూసి నీకు జెలస్ కదా మమ్మల్ని చూస్తే అని వెక్కిరిస్తున్న ఆద్య ను చూసి నిన్ను చూసి నేనెందుకు జెలస్ ఫీల్ అవుతానే

ఎందుకంటే నేను డాడీ ఒక పార్టీ పాపం నువ్వు ఒకటే అయిపోయావ్ నేను ఎప్పటికైనా డాడీ కూతురినే అని వెక్కిరిస్తూ సరే మీరు రండి ఇవాళ నా కార్ లో వెళ్దాం అని చెప్పి వెళ్తున్న కూతురిని చూసి శైలు కంట్లో కన్నీళ్ళు తిరుగుతాయి

అమ్మా!!! ఐ లవ్ యూ నేను ఎప్పటికీ నీ దగ్గరే ఉంటాను. డాడీ చెల్లి ఒక పార్టీ నువ్వు నేను ఒక పార్టీ యూ ఆర్ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్…..❤️

శైలు ఏంటి అలా అయిపోయావ్ కళ్ళల్లో ఆ కన్నీళ్ళు ఏంటి అని బుజం మీద chei vesina  మహిదర్ వాయిస్ కి జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చిన శైలు అటు వైపు తిరిగి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏం లేదండి కంట్లో ఏదో పడింది పదండి అంటూ అక్కడి నుండి బయటకు వెళ్తున్న తనను చూసి నీకు ఎవరు గుర్తొచ్చి ఉంటారో నేను ఊహించగలను శైలు కానీ అది గుర్తు చేసి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని బాధగా అనుకుంటూ మహిదర్ వెళ్ళి కార్ లో కూర్చోగానే ఆద్య కార్ ను టెంపుల్ వైపు పరుగులు పెట్టిస్తుంది

దేవుడి ముందు నుంచుని పూజ సజ్జ పంతులు చేతిలో పెడుతూ దేవుడి మీద అర్చన చేయించండి అంటున్న మాయ మాటలకు అడ్డు పడుతూ ఆగండి పూజారి ఆయనకు అర్చన చేయాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ నా బంగారు బొమ్మ మాయ బర్త్డే తన పేరు మీద అర్చన చేయించండి అని చెప్పగానే జై వైపు అయోమయంగా చూస్తునే పంతులు పూజ చేస్తాడు

మాయ జై వైపు చూసి తల కొట్టుకుంటూ స్వామి నువ్వే అన్నయ్య ను ఎలా అయినా చేంజ్ చేయాలి అన్నయ్య కు మంచి అమ్మాయితో పెళ్లి జరిగేలా ఆశీర్వదించు అని నవ్వుతూ కళ్ళు తెరిచి ఎదురుగా చూసిన తనకు అపరంజి బొమ్మ లా దేవుడిని చూస్తూ కళ్ళు మూసుకుని తన కోరిక దేవుడికి చెప్తున్న ఆద్య ను చూసి వావ్ ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అయితే అన్నయ్య పక్కన పర్ఫెక్ట్ గా ఉంటుంది అని వెంటనే తన చేతిలో ఉన్న మొబైల్ తో ఆద్య ఫోటో తీసి దాన్ని జూమ్ చేసి చూస్తూ వావ్ సూపర్ గా ఉంది అర్జంట్ గా దీన్ని తాతయ్య కి పంపించాలి అంత కంటే ముందు ఆ అమ్మాయి డిటైల్స్ అడగాలి అని ఎదురుగా చూసిన మాయ కి ఆద్య ఎక్కడ కనిపించదు

అయ్యో ఈ లోపే ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూస్తున్న మాయ ను చూసి ఏంట్రా ఏమైంది ఎవరి కోసం వెతుకుతున్నావ్

అది అన్నయ్య నీ కోసం ఆ…. లేదు అన్నయ్య కి విషయం చెప్తే కచ్చితంగా దీన్ని స్పాయిల్ చేస్తాడు సో అన్నయ్య కి తెలియకుండా ఉంటేనే బెటర్

 

మాయ నిన్నే అడిగేది ఎవరి కోసం వెతుకుతున్నావ్ ???

 

ఫ్రెండ్ అన్నయ్య అని నోటికి వచ్చింది చెప్పి పంతులు ఇస్తున్న హారతి అద్దుకుని ప్రసాదం తీసుకుని అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు ఇపుడే వస్తాను అని ఆద్య ను వెతుకుతూ బయటకు వెళ్తుంది

అబ్బా ఈ టెంపుల్ లో ఏంటి ఇంత హాట్ గా ఉంది అని అర చేత్తో మొహం మీద ఊదుకుంటూ గాడ్ చాలా సఫకేటింగ్ గా ఉంది ఐ వాంట్ ఫ్రెష్ ఎయిర్ అని తను కూడా మరో వైపు నుండి బయటకు నడుస్తూ వెళ్తున్నాడు మరో వైపు నుండి గుడి గోపురాన్ని తల ఎత్తి చూస్తూ నడుస్తున్న ఆద్య తన కాలు స్లిప్ అయి కింద పడబోతూ అటుగా వస్తున్న జై మీద పడ్డం తో ఇద్దరు కింద పడిపోతారు అలా ఒకరి మీద ఒకరు దొర్లుతూ గుడిలో పక్కనే ఉన్న కోనేరు లో పడిపోతారు

నీళ్ళల్లో పడగానే ఆవ్ …. అని అరుస్తూ నీళ్ళ నుండి బయటకు వచ్చి చేతులతో మొహం మీద పడ్డ నీటిని తుడుస్తూ రేయ్ ఎవర్రా నువ్వు కళ్ళు బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని తిరుగుతున్నావా అని అరుస్తూ ఎదురుగా ఉన్న జై ను చూసి కోపం తో ఆద్య మొహం ఎర్రగా మారుతుంది

జై కూడా అంటే షాక్ అవుతూ హేయ్ మిర్చి నువ్వేంటి ఇక్కడ వావ్ శారీ లో సూపర్ హాట్ గా ఉన్నావ్ అని తన చేతులు ఇంకా ఆద్య నడుము మీదే ఉండటం తో చిన్నగా నొక్కుతూ చెప్తాడు

యూ ఇడియట్ డోంట్ టచ్ మీ ఛా నా మూడ్ మొత్తం మళ్ళీ స్పాయిల్ చేసావ్ అని కోపంగా జై ను వెనక్కి నెట్టి తన హాఫ్ శారీ ను రెండు చేతులతో పట్టుకుని నీళ్ళ నుండి బయటకు వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్తుంది

తడిచిన హాఫ్ శారీ లో ఉన్న ఆద్య ను ఇంచ్ టు ఇంచ్ చూస్తున్న జై కి ఆద్య అలా సడెన్ గా తోయడం తో వెనక్కి పడిపోయి లేచి చూసే సరికి ఆద్య అక్కడ కనిపించదు ఎటు పోయింది ఇది అని చుట్టూ చూస్తూ నుంచున్న జై ను చూసిన మాయ అయ్యో అన్నయ్య ఏంటిది ఇలా తడిచిపోయావ్ ఏంటి నిన్ను టెంపుల్ లో కూర్చోమంటే ఇక్కడేం చేస్తున్నావ్

మాయ తో జరిగింది చెప్పకుండా ఫస్ట్ టైమ్ టెంపుల్ కి వచ్చా కదరా అందుకే అలా చూస్తూ ఉన్నాను ఆల్ ఆఫ్ సడెన్ ఇలా కాలు స్లిప్ అయి పడ్డాను అర్జంట్ గా షవర్ చేయాలి లెట్స్ మూవ్

బట్ అన్నయ్య ఫుల్ గా తడిచిపోయావ్ ఇక్కడ రూమ్స్ ఉంటాయి ఇక్కడే ఫ్రెష్ అవుదువు పదా నీకు కావాలంటే డ్రెస్ తెప్పిస్తాను

ఇక్కడ ఫ్రెష్ అవ్వాలా నో వే ముందు పదా అంటూ అలాగే కార్ లో కూర్చుని ఇద్దరూ ఇంటికి స్టార్ట్ అవుతారు

 

 

మెరుపు తీగలా ఇలా వచ్చి అలా మాయం అయిపోయావ్ నువ్వు ఎవరైనా సరే నువ్వే నా వదిన ఇది ఫిక్స్ ముందు తాతయ్య కి ఈ పిక్ చూపించాలి అని ఆద్య ఫోటో వైపు చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి జై తో మాటల్లో పడుతుంది మాయ

ఆద్య టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న రూమ్ లో డ్రెస్ ను హెయిర్ డ్రయ్యర్ హెల్ప్ తో ఆర్పుకున్న తరువాత హెయిర్ ను కూడా నీట్ గా ముందులా సెట్ చేసుకుంటూ ఉంటుంది అపుడే శైలు నుండి కాల్ రావడం తో వస్తున్నా మామ్ అని ఫాస్ట్ గా గుడిలోకి వెళ్తుంది

ఎక్కడికి వెళ్ళావ్ ఆద్య మా ప్రదక్షణలు అయ్యే దాకా ఇక్కడే ఉండవే అంటే ఇటు వెళ్ళావ్ సరే పదా లోపలికి వెళ్దాం అని ముగ్గురు గర్భ గుడిలోకి వెళ్లి పూజ చేయించిన తరువాత అక్కడే కాసేపు కూర్చుని పీస్ఫుల్ గా కళ్ళు మూసుకుని వారి కోరికలను చెప్తూ ఉంటారు

 

 

వినయ్ కోసం కాఫీ కప్ తీసుకుని తమ బెడ్ రూమ్ లోకి వెళ్ళిన రేణుక కి వినయ్ సంధ్య ఫోటో వైపు చూస్తూ కనిపిస్తాడు

తను వచ్చినట్టు చిన్నగా దగ్గిన రేణుక వైపు చూసిన వినయ్ తన వైపు చూసి గుడ్ మార్నింగ్ రేణు అంటూ ఆ కప్ తీసుకుని చిన్నగా సిప్ చేస్తూనే మాయ లేచిందా అని అడుగుతాడు

టెంపుల్ కి వెళ్ళొస్తాను అని బయటకు వెళ్ళింది అండి అని చెప్తూ మహిదర్ చేతిలో ఉన్న సంధ్య ఫోటో వైపు చూస్తూ ఇంకా మీరు అక్క ను మర్చిపోలేదా అని మెల్లగా అడుగుతుంది

సంధ్య ను ఎప్పటికీ మర్చిపోలేను రేణు తనను ఎపుడైతే చూసానో అపుడే తను నా ప్రాణం అయిపోయింది అని చెప్తూ సంధ్య గుర్తు రాగానే బుగ్గల నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ ఉంటాడు

ఏంటండీ ఇది చిన్న పిల్లాడిలా అక్క లేకపోయినా మిమ్మల్ని అక్క లాగే చూసుకోవడానికి నేను ఉన్నాను కదా ప్లీస్ మీరు బాధ పడకండి

ఎంత మంది ఉన్నా సంధ్య లేని లోటు నాకు తీరదు రేణు అలా అని నిన్ను తక్కువ చేయడం లేదు కానీ సంధ్య స్థానం ఎప్పటికీ మరొకరికి ఇవ్వలేను అంతే అని రేణుక బుగ్గ తట్టి నన్ను కాస్త వాష్ రూమ్ లో వదలవా అనగానే వినయ్ ను వాష్ రూమ్ లో వదిలి తన నీడ్స్ అయ్యాక వినయ్ కి తనే బాత్ చేయించి డ్రెస్ వేసి బెడ్ మీద కూర్చో పెడుతూ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఇస్తుంది

నువ్వు కూడా ఫ్రెష్ అయి రా రేణు అంటూ తనను వీల్ చైర్ లో కూర్చోపెట్టాక మెల్లగా వీల్ చేర్ ను మూవ్ చేస్తూ వినయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాక రేణుక కోపంగా తన అన్నయ్య మాదేశ్ కి కాల్ చేస్తుంది

ఆల్మోస్ట్ కట్ అయ్యే టైమ్ కి ఆరామ్ గా కాల్ లిఫ్ట్ చేసిన మాదేష్ ఆవలిస్తూ ఏంటి రేణుక ఇంత ఎర్లీ గా కాల్ చేసావ్ అంటూ నిద్రలేస్తూ అడుగుతాడు

ఇక్కడ కొంపలు అంటుకు పోతుంటే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావా

అయితే ఫైర్ ఇంజన్ కి కాల్ చేయకుండా నాకు ఎందుకు కాల్ చేసావ్ అని సర్కాస్టింగ్ గా అన్సర్ ఇస్తాడు మాదేష్

కుళ్ళు జోక్స్ వేసావ్ అంటే నాకు ఉన్న కోపానికి నిన్ను చంపేస్తాను చెప్తున్నా ఇక్కడ నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు జోక్ గా ఉందా!!!

అబ్బా విషయం చెప్పకుండా ప్రొద్దున్నే ఎందుకలా అరుస్తున్నావ్ అసలేం జరిగిందో చెప్పు

చెప్పడానికి ఇంకేం లేదు ఇన్ని రోజులుగా మనం చేస్తున్న ప్లాన్ మొత్తం స్పాయిల్ అయ్యేలా ఉంది దేని గురించి నేను ఇన్ని ఇయర్స్ గా మంచి తనం అనే ముసుగు వేసుకుని తిరుగుతున్నానో అది అంతా బూడిద లో పోసిన పన్నీరు అయ్యేలా ఉంది అన్నయ్య

 

రేణుక నువ్వు కంగారు పడకుండా నన్ను కంగారు పెట్టకుండా విషయం చెప్పు

జై కి మన హరిణి ని కాకుండా బయట మ్యాచెస్ చూడమని మావయ్య మ్యారేజ్ బ్రోకర్ కి కాల్ చేసి చెప్పారు

వాట్??? అలా చెప్తుంటే నువ్వే చేస్తున్నావ్ సినిమా చూస్తున్నావా ఆపకుండా, అసలు అలా ఎలా బయట సంబంధాలు చూస్తారు అని సీరియస్ అవుతాడు మాదేశ్

నేను చాలా ట్రై చేశాను కానీ మావయ్య కి మన హరిణి మీద కానీ నీ మీద కానీ మంచి అభిప్రాయం లేదు అది నీకు కూడా తెలుసు అయినా చాలా ట్రై చేశా ఆయన వినలేదు మీ బావ కి చెప్తే ఆయన అసలు పట్టించుకోవడం లేదు

ఈ ముసలోడు మనకు ప్రతీ విషయానికి అడ్డొస్తున్నాడు ముందు వీడిని వేసేస్తే తప్పా మన ఆటలు సాగవు

చాల్లే ఆపు ఇప్పటికే ఆ సంధ్య ను చంపేశావ్ అది ఎపుడు బయటకు వస్తుందా అని రోజు టెన్షన్ పడుతూ చస్తున్నా మళ్ళీ ఇది ఒకటా 🤦 ఈ టెన్షన్ పడ్డం నా వల్ల కాదు నువ్వు అలాంటి ప్లాన్స్ వేసి నా పీకల మీదకు తెచ్చి పెట్టకు నువ్వు వీలైనంత త్వరగా ఇండియా కి చావు ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం

సరే హరిణి ను నీ కోడలిగా చేసుకుంటా అన్నావ్ ఆది నెలబెట్టుకో అలాగే నీ కూతురిని నా కొడుకు కి ఇచ్చి పెళ్ళి చేయాలి ఇది కూడా గుర్తు పెట్టుకో

నేను ఏది మర్చిపోలేదు నీ కొడుకు నీ కూతురిలా తిరుగుబోతు కాదు కాబట్టే మాయ తో పెళ్ళికి ఒప్పుకున్నా సర్లే మళ్ళీ కాల్ చేస్తా ఎవరో వస్తున్నట్టు ఉన్నారు అని ఫాస్ట్ గా కాల్ కట్ చేసి ఎమ్ తెలియనట్టు ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది రేణుక

కట్ అయిన కాల్ వైపు చూసి నవ్వుకుంటూ పిచ్చి చెల్లెమ్మా నిన్ను ఎరగా వేసిందే ఆ ఆస్తి కోసం అది నా చేతికి వచ్చే వరకు నువ్వు చెప్పినట్టు వింటా అది నా చేతికి వచ్చాక చెప్తా అందరి సంగతి అని తన కొడుకు ఎంత ఎదవో గుర్తు చేసుకుంటూ వాడి క్యారెక్టర్ నీకు తెలిసే లోపు మాయ నా కోడలు అవ్వాలి అని క్రూరంగా తన ప్లాన్స్ తను వేసుకుంటూ ఉంటాడు మాదేష్

ఇంటి ముందు కార్ ఆగగానే నవ్వుతూ పూల సజ్జ తో ఫాస్ట్ గా తన తాతయ్య రూమ్ వైపు వెళ్తున్న మాయ కి హాల్ లో పేపర్ చదువుతూ కనిపించిన వినయ్ ను చూసి నవ్వుతూ తన చేతిలో ఉన్న కుంకుమ తీసి వినయ్  కి పెడుతూ గుడ్ మార్నింగ్ డాడీ అంటూ ప్రసాదం ఆయన నోటికి అందిస్తుంది

గుడ్ మార్నింగ్ బంగారం అని మాయ కి ఫోర్హెడ్ కిస్ చేస్తూ మార్నింగ్ నీ గురించి అడిగితే టెంపుల్ కి వెళ్ళావ్ అంది అని నవ్వుతూ నీ బర్త్డే కదా మాయ వెళ్ళి అమ్మ బ్లెస్సింగ్స్ కూడా తీసుకో అని చెప్తున్న వినయ్ ను చూసిన రేణు నవ్వుతూ మాయ వైపు చూస్తూ ఉంటుంది తన వెనుకే ఇంట్లోకి వచ్చిన జై కూడా మాయ వైపు చూస్తూ సోఫా లో సెటిల్ అవుతాడు

మాయ తన ముందు నవ్వుతున్న రేణుక ను దాటి హాల్ లో ఎన్లార్జ్ చేసి ఉన్న సంధ్య ఫోటో ఫ్రేమ్ ముందు నుంచుని రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఆశీర్వాదం తీసుకుంటున్న కూతురిని చూసి రేణుక మొహం ఎర్రగా మారుతుంది కానీ అది కనిపించకుండా ఎప్పటి లాగే చిరు నవ్వుతో మాయ వైపు చూస్తూ ఉంటుంది బట్ రేణుక ను మాత్రం రెండు కళ్ళు గమనిస్తూనే ఉంటాయి

హోప్ ఇవాళ మీకు చాలా ట్విస్ట్స్ రిలీస్ చేసాను అండ్ చాలా హింట్స్ ఇచ్చాను ఇప్పుడు చెప్పండి ఇందులో మెయిన్ విలన్ ఎవరు?

To Be Contineeed….

విలన్ హస్బెండ్-6