విలన్ హస్బెండ్ -3

విలన్ హస్బెండ్ -3

ఇదేంటి జై ధీర్ సర్ క్యాబిన్ లోకి ఏదో పొడిచేస్తా అని చాలెంజ్ చేసి మరీ వెళ్ళింది ఇంకా బయటకు రాదేంటీ లంచ్ టైమ్ కూడా అవుతోంది అని వాచ్ వైపు చూసుకుంటూ ఉంటుంది పూజ. పోనీ కాల్ చేస్తే అమ్మో జై ధీర్ సర్ కి అసలే కోపం ఎక్కువ ఆఫీస్ అవర్స్ లో కాల్స్ ఏంటి అని సీరియస్ అవ్వచ్చు టెక్స్ట్ చేస్తే బెటర్ అనుకుని వెంటనే హంస కి ఒసేయ్ లోపల ఎమ్ చేస్తున్నావ్ నేను టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను త్వరగా బయటకు రా అని టెక్స్ట్ పంపుతుంది ఎంత సేపు అవుతున్నా బ్లూ టిక్స్ పడవ్ అండ్ హంస కూడా క్యాబిన్ నుండి బయటకు రాదు అలా… అలా లంచ్ టైమ్ కూడా అవుతుంది

లంచ్ చేయడానికి తన కొలీగ్స్ అందరూ క్యాంటీన్ కు వెళ్తుంటే తను కూడా వెళ్తూ ఎలాగో లంచ్ టైమ్ సో జై ధీర్ సర్ చూసినా ఎమ్ క్వశ్చన్ చేయరు అనుకుంటూ జై క్యాబిన్ వైపు పిల్లిలా అడుగులు వేస్తూ వెళ్ళిన తనకి జై క్యాబిన్ ఎంప్టీ గా కనిపించడం చూసి అయోమయం లో పడుతుంది

క్యాబిన్ లో ఎవరు లేరేంటి సర్ తను పర్సనల్ రూమ్ లో లంచ్ చేస్తున్నారా ? మరి సర్ లంచ్ చేస్తుంటే లోపల ఇదేం చేస్తుంది అని గోళ్లు కోరుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ టెన్షన్ నా వల్ల కాదు ఏదైతే అది అయింది లోపల ఎమ్ జరుగుతుందో చూద్దాం అని క్యాబిన్ డోర్ ఓపెన్ చేయబోతున్న తనకు వెనుక నుంచి ప్యూన్ వాయిస్ వినిపించడం తో హ్యాండిల్ మీద చెయ్ వెనక్కి తీసుకుని తన టెన్షన్ తగ్గించుకుని వెనక్కి తిరుగుతుంది

ఏమైంది పూజ మేడం అప్పటి నుంచి చూస్తున్నా సర్ క్యాబిన్ దగ్గరే అటు ఇటు తిరుగుతున్నారు సర్ తో ఏమైనా పనుందా ?

యాదగిరి సర్ తో సైన్ చేయించాలి అని హంస సర్ రాగానే లోపలికి వెళ్ళింది ఇంకా తను బయటకు రాలేదు సర్ కూడా కనిపించడం లేదు ఇద్దరూ ఎక్కడికైనా వెళ్ళారా

హంస మేడం గురించి నాకు తెలియదు కానీ సర్ మాత్రం లేరు మేడం అమర్ సర్ తో కలిసి బయటకు వెళ్ళారు మే బీ ఇవాళ ఇక రాకపోవచ్చు

ఏంటి సర్ లేరా?? మరి హంస ఎక్కడ

చెప్పాను కదా మేడం నాకు తెలియదు అమర్ సర్ వచ్చినప్పుడు క్యాబిన్ లో జై సర్ చారి సర్ మాత్రమే ఉన్నారు నాకు హంస మేడం కనిపించలేదు మీరు చారి సర్ ను అడిగితే బెటర్ అని ప్యూన్ కూడా లంచ్ చేయడానికి వెళ్లగానే హంస గురించి టెన్షన్ పడుతూనే చారి క్యాబిన్ కి వెళ్తుంది పూజ

తను ఇంటి నుండి బాక్స్ తీసుకుని వస్తాడు కాబట్టి క్యాంటీన్ కి వెళ్లకుండా తన క్యాబిన్ లో కూర్చొని తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి వేడి వేడి అన్నం ముద్ద పప్పు విత్ ఆవకాయ ను హాట్ ప్యాక్ నుండి ప్లేట్ లో సర్వ్ చేస్తున్న చారి కి ఎక్స్క్యూస్ మీ సర్ అన్న వాయిస్ వినిపించడం తో అబ్బబ్బా నన్ను పీస్ఫుల్ గా లంచ్ కూడా చేయనివ్వరు జై సర్ లేరు కదా ఇంకెవరు నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ కమిన్ అని పిలవగానే పూజ మెల్లగా లోపలికి వచ్చి ఎదురుగా నుంచుంది

పూజ ! ఏంటి ఇలా వచ్చావ్ అపుడే లంచ్ కంప్లీట్ అయిందా అంటూ ఫార్మల్ గా అడుగుతున్న చారి వైపు చూసి లేదు సర్ ఇంకా చేయలేదు మిమ్మల్ని ఒక విషయం గురించి అడగాలి అని వచ్చాను

సరే ఎలాగో లంచ్ టైమ్ కి వచ్చావ్ కూర్చో లంచ్ చేద్దాం తిన్నాక మాట్లాడు కుందాం

నో సర్ థాంక్ యూ అని అడగాలా వద్దా అని ఆలోచిస్తూనే సర్ అదీ…. మార్నింగ్ జై ధీర్ సర్ క్యాబిన్ కి హంస సైన్ కోసం వెళ్ళింది బట్ తను ఇపుడు కనిపించడం లేదు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లదు నాకు ఎందుకో టెన్షన్ గా ఉంది సర్ మొబైల్ కూడా వర్క్ చేయడం లేదు

 

ఓహ్ నువ్వు అడగాలి అనుకుంటుంది తన గురించా లీవ్ ఇట్ పూజ తన గురించి అయితే మర్చిపోయి వెళ్ళి లంచ్ చేయ్

టేక్ ఇట్ ఈసీగా చెప్తున్న చారి వైపు షాకింగ్ గా చూస్తూ అదేంటి సర్ అంత సింపుల్ గా వదిలేయమని చెప్తున్నారు హంస నాకు 3 మంత్స్ గా తెలుసు ఇద్దరం రూమ్ మేట్స్ కూడా అలాంటిది తను కనిపించడం లేదు అంటే వదిలేయ్ అని చెప్తున్నారు ఏంటి వేర్ ఇస్ షి?

హంస లేదు ఇక ఎప్పటికీ రాదు అండ్ నీకు ఎప్పటికీ కనిపించదు కూడా తన గురించి ఇలా నువ్వు అడుగుతున్నావ్ అని సర్ కి తెలిస్తే రేపటి నుండి నువ్వు కూడా ఎవరికి కనిపించవు పూజ. జై సర్ గురించి తెలిసి కూడా హంస ఆయన దగ్గరకు వెళ్ళడం తను చేసిన బిగ్ మిస్టేక్ యూ నో మీరు మాట్లాడుకునే ప్రతీ మాట ఆయన వింటూనే ఉంటారు మీ క్యాబిన్స్ లో సి సి క్యామ్ నే కాదు సీక్రెట్ మైక్స్ కూడా ఆయన ఫిక్స్ చేశారు సో నువ్వు దీని గురించి మర్చిపోవడం బెటర్ ఇక వెళ్ళు అని తన లంచ్ కంటిన్యు చేస్తాడు చారి

చారి చెప్పింది విన్న పూజ కి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి అంటే మేము మాట్లాడుకునే ప్రతీ మాట సర్ వింటారా అయితే హంస జై సర్ గురించి వాగిన మాటలు అన్ని సర్ వినే ఉంటారు ఇపుడు హంస ఎక్కడ ఉంది? అసలు బ్రతికే ఉందా నో అలా అయ్యుండదు సర్ మనుషుల్ని చంపేంత క్రూయల్ మైండ్ అని నేను అనుకోవడం లేదు హంస ఎక్కడున్నా సేఫ్ గా ఉంటే చాలు అని అనుకుంటూ నిస్సహాయంగా అక్కడి నుంచి తన క్యాబిన్ కి వెళ్తుంది లంచ్ కూడా తినాలి అనిపించక పోవడం తో టేబుల్ మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది

🤍🩷🤍🩷🤍🩷🤍🩷🤍

మాన్య నా మాట విను ఇప్పుడు నాకు కొంచెం కూడా షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేదే అని అంటున్న ఆద్య చెయ్ పట్టుకుని నువ్వు ఎన్ని సార్లు చెప్పినా నేను ఏం వినను కామ్ గా పదా అంటూ లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతారు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తున్న వీళ్లకు తన షూ అడ్డు పెట్టి మరీ లోపలికి వచ్చిన అమర్, జై ధీర్ ను చూసి విచ్ ఫ్లోర్ అంటూ అమర్ వైపు చూస్తూ అడుగుతుంది మాన్య

ఫిఫ్త్ వన్ అని అమర్ చెప్పడం తో వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లోర్ కూడా అదే అవ్వడం తో నలుగురు ఒకే లిఫ్ట్ లో వాళ్ళు వెళ్లాల్సిన ఫ్లోర్ కి వెళ్తారు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవ్వగానే ముందుగా బాయ్స్ బయటకు వెళ్తే వెనుకే వస్తారు ఆద్య, మాన్య . వెనుక వీళ్ళు వచ్చినా జై, అమర్ కంటే ముందు నడుస్తూ వెళ్తుంటారు

అక్కడ జై ను చూసిన సోని హేయ్ జై అంటూ ఫాస్ట్ గా వచ్చి తనకు అడ్డొచ్చిన ఆద్య ను పక్కకు నెట్టి మరీ జై ను టైట్ గా హగ్ చేసుకుంటుంది

అమ్ము కేర్ఫుల్ అంటూ కింద పడుతున్న ఆద్య ను పట్టుకున్న మాన్య ఆర్ యూ ఆల్రైట్ అంటూ తన వైపు చూడ్డం తో యాహ్ అని చెప్పి జస్ట్ వెయిట్ అంటూ పబ్లిక్ లో ఉన్నది కూడా మర్చిపోయి డీప్ హగ్ లో ఉన్న జై, సోని లను చిరాగ్గా చూసి హేయ్ యూ అంటూ సోని బుజం పట్టుకుని వెనక్కి లాగి ఆర్ యూ బ్లెండ్ ఆర్ వాట్ నీ బాయ్ ఫ్రెండ్ కి హాగ్ చేసుకోవాలి అంటే ముందు నడుస్తున్న వాళ్లను నెట్టి మరీ హాగ్ చేసుకోవాలా అంటూ సీరియస్ గా అడుగుతుంది

హౌ డేర్ యూ నన్నే బ్లెండ్ అంటావా అంటూ తనను కొట్టడానికి చెయ్ ఎత్తిన సోని చెయ్ పట్టుకుని వెనక్కి మడిచి ఎంటే తప్పు చేసింది నువ్వు అయినా నన్నే కొట్టడానికి చెయ్ ఎత్తుతావా విరిచేస్తాను అని కోపంగా చెప్పి సోని ను జై మీదకు నెడుతుంది

జై ఆద్య వైపు చూసి ఏయ్ మిర్చి ఎందుకలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావ్ షాపింగ్ చేయడానికి వచ్చావా లేక షాపింగ్ చేయడానికి కొట్టడానికి వచ్చావా

రేయ్ ఎవర్రా మిర్చి?? పిచ్చి పిచ్చి నేమ్స్ పెట్టి పిలిచావో పచ్చడి చేస్తాను అసలే నా మూడ్ బాలేదు అని నేను ఏడుస్తూ ఉంటే మధ్యలో మీ గోల ఏంటి నాకు

నిన్ను చూడగానే అనుకున్నానే పచ్చడి అమ్ముకునే దానివని ఇంతకీ ఏ పచ్చడి బాగా చేస్తావ్ అని వెటకారంగా అడుగుతున్న జై ను చూసి ఆద్య కి వొళ్ళు మండడం తో తొక్క పచ్చడి ఎమ్ కావాలా అని అంతే వెటకారంగా అంటుంది

నేను అలాంటి చీప్ పచ్చడి తినే టైప్ కాదు అని యాటిట్యూడ్ గా చెప్పి 2000 నోట్ తీసి ఆద్య చేతిలో పెడుతూ చీప్ పచ్చడి కాకుండా మంచి హైజినిక్ పచ్చళ్ళు అమ్ముకో అని చెప్పి కమ్ బేబీ అంటూ సోని నడుము చుట్టూ చేతులు వేసి అక్కడి నుంచి వెళతాడు

ఈ విలన్ నిజంగా నన్ను పచ్చళ్ళు అమ్ముకునే దాన్ని అనుకున్నాడా అని కోపంగా ఆ 2 తౌసండ్ నోట్ వైపు చూస్తూ జై వెనుకే వెళ్తున్న ఆద్య ను ఆపుతూ ఆద్య మనం షాపింగ్ కి వచ్చామే అయినా వాడితో గొడవ ఎందుకు ముందు పదా

నో గొడవ పడ్డది నేను కదా ఆ విలన్ అయినా వాడు నన్ను పచ్చళ్ళు అమ్ముకునే దాన్ని అన్నాడు అలాంటి వాడ్ని వదిలేయాలా నెవెర్ అంటూ ఫాస్ట్ గా జై ముందు నుంచుని బుసలు కొడుతున్న పాము లా జై వైపు సీరియస్ గా చూస్తుంది

ఏయ్ మిర్చి ఎంటే నా వెంట పడుతున్నావ్ డబ్బులు సరిపోలేదా ఏంటి అని నవ్వుతున్న జై మోహం మీద జై ఇచ్చిన డబ్బు తో ఇంకొంత మనీ విసిరి కొట్టి ఐ డోంట్ వాంట్ యువర్ మనీ అంతగా నీకు మనీ ఎక్కువ అయితే నిన్ను అతుక్కుని తిరుగుతుందిగా దీనికి ఇవ్వు పాపం డబ్బులు దీని దగ్గర లేవు అనుకుంటా అందుకే చిన్న చిన్న పీసెస్ కట్టుకుని తిరుగుతుంది అని పొగరుగా చెప్పి కోపంగా వెళ్తున్న ఆద్య ను కోపంగా చూస్తూ ఉంటారు జై,  బట్ సోని అమర్ మాత్రం ఇన్ని రోజులకు జై పొగరికి కరెక్ట్ గా అన్సర్ చేసే అమ్మాయి దొరికింది అని నవ్వుకుంటూ ఉంటాడు

చూసావా డియర్ దానికి ఎంత పొగరు ఉందో అయినా ఇలాంటి బీ క్లాస్ పీపుల్స్ ను ఇలాంటి మాల్స్ లోకి ఎందుకు అలో చేస్తారో ఎంటో అని అంటూనే కింద పడ్డ అమౌంట్ ను జాగ్రత్తగా తీసి తన హ్యాండ్ బ్యాగ్ లో వేస్తున్న సోని ను చూసి ఇక్కడ బీ క్లాస్ పీపుల్ ఎవరో మనకు బాగా అర్థం అవుతుంది కదా జై అని నవ్వుకుంటూ అడుగుతున్న అమర్ ను   జై సీరియస్ గా చూస్తూ లోపలికి నడుస్తాడు అది చూసిన అమర్ వీడికి బాగా మండినట్టు ఉంది అని విజిల్ వేస్తూ జై ను ఫాలో అవుతాడు

మాయ కోసం మంచి ప్రిన్సెస్ డ్రెస్ సెలెక్ట్ చేస్తున్న జై దగ్గరకు వచ్చి జై నేను కూడా షాపింగ్ చేసుకోనా అని జై చేతిని తన నడుము చుట్టూ వేయించుకుని హస్కీ గా అడుగుతున్న సోని ను చూసి ష్యూర్ డియర్ అని సోని లిప్స్ మీద చిన్న పెక్ ఇచ్చి మాయ కి డ్రెస్ సెలెక్ట్ చేయడం లో బిసి అవుతాడు

గోల్డెన్ కలర్ సిండ్రెల్లా ప్రిన్సెస్ డ్రెస్ సెలెక్ట్ చేసిన జై ధీర్ దాన్ని ఒకే చేసి బిల్ సెక్షన్ వైపు పంపాక తనకు కూడా సూట్ బై చేసి అమర్ వైపు చూస్తాడు తను కూడా షాపింగ్ చేస్తూ ఉండటం చూసి మొబైల్ తీసుకుని టైమ్ పాస్ చేస్తున్న తనకు సోని ఒక వన్ పీస్ డ్రెస్ తీసుకుని ట్రైల్ రామ్ వైపు వెళ్తూ తనను రమ్మని సైగ చేయడం తో బ్లేజర్ బటన్ విప్పుకుంటూ 2 మినిట్స్ ఆగి వెళతాడు

జై వెళ్ళేసరికి ట్రయల్ రూమ్ డోర్స్ అన్ని క్లోజ్డ్ లో ఉంటాయి బట్ ఒక రూమ్ డోర్ మాత్రం క్లోజ్ చేస్తూ ఉంటుంది అది చూసిన జై సోనీ ఆ రూమ్ లోనే ఉందనుకుంటూ ఫాస్ట్ గా ఆ డోర్ పట్టుకుని లాగి అది ఓపెన్ అయ్యాక తను లోపలికి వెళ్ళి లాక్ చేస్తాడు

ఆల్ ఆఫ్ సడెన్ తనున్న ట్రైల్ రూమ్ లోకి వచ్చిన జై ను షాక్ అవుతూ రేయ్ నువ్వేంట్రా ఇక్కడ అని అరుస్తున్న ఆద్య నోరు తన చేత్తో మూసి మిర్రర్ కి లాక్ చేస్తూ ఏయ్ మిర్చి ఆరవకు ఈ రూమ్ లో సోనీ ఉందేమో అనుకుని వచ్చాను అని చెప్తున్న జై మాటలకు కోపంగా చూస్తూ నేను ఉన్న రూమ్ అది ఎందుకు ఉంటుంది అయినా లేడీస్ ట్రైల్ రూమ్ లో నీకేంట్రా పని అంటూ జై చేతిని విసురుగా తోసి కోపంగా అడుగుతుంది

జై కోపంగా ఆద్య బుగ్గలు నొక్కి పట్టుకుని తన కళ్ళల్లోకి సీరియస్ గా చూస్తూ ఇంకో సారి రేయ్ అన్నావో చంపేస్తాను నా ముందు ఎవరు వాయిస్ పెంచినా నా బీపీ మీటర్ క్రాస్ చేస్తుంది ఏదో క్యూట్ గా ఉన్నావ్ అని ఇందాక వదిలేశా ఇంకో సారి అదే రిపీట్ అయితే ఎక్కడ ముద్దు పెడతానో నాకే తెలియదు అని కన్ను కొడుతున్న జై ను చూసి ఆద్య షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది

ఆద్య ఎక్స్ప్రెషన్స్ కి నవ్వొస్తుంటే అది ఫేస్ మీద కనిపించకుండా కవర్ చేసి అదే సీరియస్ నెస్ తో ఆద్య ను వదిలి డోర్ ఓపెన్ చేయబోతున్న జై కి బయట నుంచి ఎవరో డోర్ ఓపెన్ చేయగానే ఆ ఫోర్స్ కి తన వెనకున్న ఆద్య మీద పడిపోవడం తో కింద పడుతున్న ఆద్య ను పట్టుకునే టైమ్ లో తను కింద  ఆద్య తన మీద .ఫ్లోర్ మీద పడిపోతారు విత్ లిప్ కిస్

నాలుగు పెదవులు కలవడం తో ఆద్య జై వైపు షాక్ అయ్యి చూస్తూ ఉంటే జై మాత్రం ఆద్య లిప్స్ స్వీట్నెస్ హార్ట్ స్కిడ్ అవ్వడం తో ఆద్య లిప్స్ ను వదలకుండా తన లిప్స్ తో లాక్ చేస్తాడు అది చూసిన ఆద్య కోపంగా జై ను గిచ్చి తను. ఆద్య లిప్స్ ను లూస్ చేయగానే ఆద్య ఫాస్ట్ గా పైకి లేచి జై ను లాగి పెట్టి కొడుతుంది

 

నన్నే కొడతావా అని జై ఆద్య మొహాన్ని రెండు చేతులతో పట్టుకుని హార్డ్ గా కిస్ చేస్తాడు ఎంత అంటే ఇంకొక్క క్షణం ఉన్నా ఆద్య ప్రాణం పోతుంది అన్న టైం కి ఆద్య ను దూరంగా తోసి థాంక్స్ ఫర్ ది కిస్ డార్లింగ్ అని కన్నింగ్ గా చెప్పి ఓపెన్ అయిన డోర్ నుండి బయటకు వెళ్తూ తన కోసం వెయిట్ చేస్తున్న సోని ను ఆద్య చూస్తుండగా దగ్గరకు లాక్కుని నైట్ ఫ్లాట్ కి రా బేబీ ఇవాళా బాగా డిస్టర్బ్ గా ఉన్నాను అని నెక్ దగ్గర బైట్ చేసి సోని షాపింగ్ చేయడానికి 1 లాక్ వరకూ అమౌంట్ ట్రాన్సర్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవడం చూసి ఆద్య కి జై ను చంపేయాలి అన్నంత కోపం వస్తుంది

ఆద్య నేరుగా సోనీ దగ్గరకు వెళ్ళి హేయ్ యూ ఇడియట్ నీ బాయ్ ఫ్రెండ్ ఎమ్ చేశాడో తెలుసా నన్ను ఫోర్స్ గా కిస్ చేశాడు హౌ డేర్ హిం హా!! అయినా అలాంటి వాడిని ఎలా లవ్ చేసావ్ ఛా!!! నీ బాయ్ ఫ్రెండ్ కి చెప్పు ఇంకొక్క సారి వాడు నాకు కనిపిస్తే వాడ్ని చంపేస్తాను అని మంట పడుతున్న పెదవులను చూస్తూ కోపంగా అరుస్తుంది

బాయ్ ఫ్రెండ్?? హహ ఎవరికి ఎవరు బాయ్ ఫ్రెండ్ హి ఇస్ నాట్ మై బాయ్ ఫ్రెండ్ నేను తన గర్ల్ ఫ్రెండ్స్ లో ఒకరు అంతే జై కి కోపం వస్తే అంతే వెళ్ళి లిప్ బామ్ రాసుకో డియర్ అని నవ్వుతూ తన చంప తడుతూ వెళ్తున్న సోని ను చూసి చీ!!! ఇప్పటి వరకూ వీళ్ళు కపుల్ అనుకున్నా వాడు ఎక్కడైనా కనిపించాలి అపుడు చెప్తా అని కోపంగా పళ్ళు నూరుతూ షాపింగ్ చేస్తున్న మాన్య చెయ్ పట్టుకుని అక్కడి నుండి లాక్కుని వెళ్ళిపోతుంది

🤍❤️🤍❤️🤍❤️🤍❤️

ఏమండీ మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి లేవండి అంటూ బెడ్ మీద పడుకున్న వినయ్ వర్మ కు దగ్గరుండి ఆయనకు మెడిసిన్స్ వేసి జ్యూస్ తాగించి మూతి దగ్గర అంటుకున్న జ్యూస్ డ్రాప్స్ తన చీర కొంగుతో తుడిచి కాసేపు అలా గార్డెన్ లో కూర్చుందాం రండి అని వీల్ చైర్ లో వినయ్ ను గార్డెన్ లోకి తీసుకుని వస్తుంది రేణుక

మీకు ఫ్రెష్ ఎయిర్ చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్ చెప్పారు అండి అందుకే మీరు డెయిలీ కాసేపు అయినా గార్డెన్ లో టైం స్పెండ్ చేయాలి అని చెప్తున్న రేణుక ను చూసి వినయ్ చిన్న స్మైల్ ఇచ్చి రేణుక చెప్పే కబుర్లు వింటూ ఉంటాడు

రేణు రేపు బర్త్డే కి మీ అన్నయ్య ఫ్యామిలీ వస్తున్నారా అని తన పక్కన కూర్చున్న రేణుక వైపు చూస్తూ అడుగుతాడు

అన్నయ్య రాలేడు అండి తను కెనడా వెళ్ళాడట వదిన హరిణి మాత్రం వస్తారు అని చెప్తూ మీతో ఒక విషయం చెప్పాలి అండి దాని గురించి మాట్లాడడానికే రేపు వదిన వస్తోంది

చెప్పు రేణు నా దగ్గర పర్మిషన్ ఏంటి కొత్తగా అంటున్న వినయ్ ను చూసి చిన్న స్మైల్ ఇచ్చి అదే నండి మన ధీర్ ( జై) కి హరిణి కి పెళ్లి చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం కదా దాని గురించి మీ డెసిషన్ ఏంటి

రేణు నీకు ముందు చెప్పాను ఇపుడు చెప్తున్నా జై కి మ్యారేజ్ చేసే ఉద్దేశం మనకున్నా వాడు మ్యారేజ్ కి రెడీగా లేడు పైగా రోజుకో అమ్మాయితో టైమ్ స్పెండ్ చేస్తున్న వాడిని ఏ అమ్మాయి ఇష్టంగా పెళ్లి చేసుకుంటుంది చెప్పు అంటున్న వినయ్ క్వశ్చన్ కి రేణుక దగ్గర అన్సర్ లేదు అపుడే షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంట్లోకి వస్తున్న జై వీళ్ళ కన్వర్జేషన్ విని అక్కడికి వస్తాడు

 

విలన్ హస్బెండ్ – 4