విషిత చిరాగ్గా అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ…….. !! నిషాన్ తో నవ్వుతూ మాట్లాడుతున్న అభి చేతి మీద కావాలనే పొగలు కక్కుతున్న వేడి వేడి సాంబార్ పోసి ఆయుష్ చేత చంప దెబ్బ తింటుంది ……. !! అది చూసిన అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటే సాంబార్ వేడికి ఏడుస్తున్న అభి కూడా ఆయుష్ చేసిన పనికి షాక్ అవుతూ…… !! అయ్యో బావ అక్కది ఎమ్ తప్పు లేదు నేనే చూడకుండా చెయ్ అడ్డు పెట్టా అనుకుంటా అని అభి కంగారుగా చెప్తున్నా…… !! ఆయుష్ అభి మాటలు వినకుండా కళ్ళు ఎక్కడ పెట్టుకుని సర్వ్ చేస్తున్నావ్ అంటూ ఇంకో చంప కూడా పగల కొడతాడు…… !!
చంప మీద చెయ్ పెట్టుకున్న విషిత ఆయుష్ అంటూ బాధగా చూస్తూ ఉంటుంది…….!! షట్ అప్ మాట్లాడకు ఫస్ట్ కళ్ళు మూసుకుని వడ్డిస్తున్నావా కొంచెం కూడా బుద్ధి లేకుండా పోతుంది నీకు…… !! నేను కావాలని చేయలేదు ఆయుష్ అనుకోకుండా జరిగిపోయింది ఐ ఆమ్ రియల్లీ సారీ…… !! అది ఇక్కడ కాదు అక్కడ చెప్పు ఫుడ్ సర్వ్ చేసేటపుడు బ్రెయిన్ ఎక్కడో పెడితే ఇలాగే ఉంటుంది ……… !! అయినా ఈ మధ్య నువ్వేం చేసినా ఎమ్ అనట్లేదు అని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావ్ ……… ??
ఇంత చిన్న విషయానికి ఆషి ను ఎందుకు కొట్టావ్ బావ జస్ట్ లీవ్ ఇట్……. !!
ఏంట్రా లీవ్ ఇట్ దీని కంటే దియా కొంచెం మార్చ్యూర్డ్ గా బిహేవ్ చేస్తుంది……. !! అరే ఇంత జరుగుతున్నా నేను ఇంత సీరియస్ అయినా సారి అని చెప్తుందేమో చూడు …….. !!
ఆయుష్ లో సడెన్ గా ఇంత కోపాన్ని చూసిన మోహిత్ కూడా వెనక్కి తగ్గుతూ……. !! సారి నే కదా ఆషి చెప్పేయి రా అనవసరంగా ఎందుకు గొడవ పెద్దది చేయడం…… !!
విషిత అభి వైపు తిరిగి ఆయుష్ కోసం దీనికి సారీ చెప్పాల్సి వస్తుంది…… !! ఇంకా ఇలాగే అడ్డంగా వాదిస్తే కచ్చితంగా ఆయుష్ కి నా మీద డౌబ్ట్ వస్తుంది…… !! అసలే మార్నింగ్ నిష్ విషయం లో కూడా డౌబ్ట్ వచ్చేలా బిహేవ్ చేసాను……. !! ఇప్పుడు నవ్వుతూ దాన్ని దీన్ని కలిపి కవర్ చేయాలి అనుకుంటూ సారి అభి నేను నిజంగా కావాలని పడేయలేదు…… !!
అయ్యో అక్కా నువ్వు నాకు సారి చెప్పడం ఏంటి…… ?? ప్లీస్ అక్క ఇంకెప్పుడు నువ్వు నాకు సారి చెప్పకు అంటూ……. !! విషిత చేతులు పట్టుకుని అయినా నాకు వేడిగా ఎమ్ లేదు నువ్వు ఫీల్ అవ్వకు…… !!
మిస్టేక్ ఎవరు చేసినా సారి చెప్పడం వారికి ఉన్న సంస్కారం గుర్తు చేస్తుంది అభి……. !! సో నువ్వు మీ అక్క సారి చెప్పిందని అస్సలు ఫీల్ అవ్వకు…… !! ఆషి అలా చూస్తున్నావ్ ఏంటీ అభి చేతిని క్లీన్ చేసి కూల్ జెల్ రాసి బ్రేక్ఫాస్ట్ తినిపించు…… !!
నేనా 😬😬 …… ??
ఎమ్ చేయవా 🤨…. ??
ఆ…. ఆ…… ఎందుకు చేయను ఆయుష్ బలే వాడివే అయినా అభి నా చెల్లెలు…… !! తనకు నేను కాకపోతే ఎవరు తినిపిస్తారు అని నవ్వుతూ …….. !! లక్ష్మి అని కిచెన్ లో ఉన్న మెయిడ్ కి వినిపించేలా పిలిచి తను రాగానే……. !! వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రా లక్ష్మీ అభి కి ఫస్ట్ ఎయిడ్ చేయాలి పాపం తన హ్యాండ్ రెడ్డిష్ గా అయిపోయింది…… !!
అలాగే మేడమ్ అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెళ్తున్న లక్ష్మీ ను ఆగు లక్ష్మీ అంటూ ఆపేస్తాడు ఆయుష్…… !!
చెప్పండి సర్…… !!
వెళ్ళి నీ వర్క్ చూసుకో…… !!
సర్….. ??
చెప్పింది వినిపించలేదా …….. ??
సీరియస్ గా వినిపించిన ఆయుష్ వాయిస్ కి ఒకే సర్ అని వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోతుంది లక్ష్మీ……. !! విషిత అర్థం కానట్టు ఆయుష్ ఆయుష్ వైపు చూడగా నీ చేతులతో నువ్వు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెతికి తీసుకుని వచ్చి నీ చెల్లికి ఫస్ట్ ఎయిడ్ చెయ్……. !! ఆయుష్ మాటకి విషిత మొహం కందగడ్డలా ఎర్రగా మారిపోవడం చూసిన రాగిణి ఆయుష్ అంటూ కొంచెం సీరియస్ గానే పిలుస్తుంది……. !!
ప్లీస్ మామ్ ఎవరు చేసిన మిస్టేక్ వాళ్ళే తెలుసుకునేలా చేయాలి ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు…… !! తప్పు చేసింది ఎవరైనా నాకు ఒక్కటే అది బార్య అయినా కూతురు అయినా తల్లి అయినా ఆల్ ఆర్ ఈక్వల్ టు మీ…….. !!
జరిగేది స్టెప్స్ దగ్గర చాటుగా నుంచుని చూస్తున్న ప్రణవి దీనికి బావ చేతిలో సినిమా స్టార్ట్ అయినట్టు ఉంది…… !! అక్కడుంది ఆయుష్ వర్మ 😎 తనను చీట్ చేయడం ఎవరి వల్ల కాదు…….. !! అని గర్వంగా ఆయుష్ వైపు చూస్తూ విషిత వైపు జాలిగా చూస్తూ ఉంటుంది……. !! బావ కి దీని మీద డౌట్ కానీ వచ్చిందా ఏంటీ అని ఆయుష్ ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్ అబ్సర్వ్ చేస్తూ ఉంటుంది….. !!
ఇంకా ఏంటి నుంచున్నావ్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రా…… ??
ఒకే ఆయుష్ అని విసుగ్గానే డైనింగ్ ఏరియా నుండి హాల్ లోక్ వచ్చిన విషిత చుట్టూ చూస్తూ…… !! ఇంత పెద్ద కొంప లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం ఎక్కడని వెతికి చావాలి ఛా……. !! ఇవాళ ఎవరి ఫేస్ చూసానో ఎంటో అన్ని రివర్స్ లో నాకే వస్తున్నాయ్…… !! అని చిరాకు పడుతూ హాల్ మొత్తం ఫస్ట్ ఎయిడ్ కోసం వెతికి….. వెతికి నీరసంగా సోఫా లో కూర్చుంటుంది…… !!
ఎంటలా కూర్చున్నావ్……. ?? అక్కడ బావ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు త్వరగా వెళ్ళు లేట్ చేస్తే బావ కి అసలు నచ్చదు…… !!
షట్ అప్…… !! చూస్తున్నావ్ కదా మొత్తం వెతికా ఎక్కడా లేదు అయినా రాజ్ భవన్ లా కోట కట్టించడం కాదు……. !! ఇంత పెద్ద మహల్ లో చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా పెట్టాలి…… !!
నీ ఫ్రస్ట్రేషన్ ఆపి ఇక్కడ చూడు అని ప్రణవి చాటుగా ఎవరికీ తెలియకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి విషిత ముందు పెడుతుంది…… !!
హు 😏 ఇదేదో ఫస్ట్ నే ఇవ్వచ్చు కదా అనవసరంగా నా టైం వేస్ట్ చేసావ్ అని …… !! కోపంగా వెళ్తున్న విషిత ను అంత కన్నా ఎక్కువ కోపంగా చూస్తూ దీనికి అనవసరంగా హెల్ప్ చేశా చాలా ఓవర్ చేస్తుంది…….. !! వన్స్ బావ కి డౌబ్ట్ వచ్చాక దీని సంగతి బావ నే చూసుకుంటాడు దానికి కూడా ఎక్కువ టైమ్ లేదు అనిపిస్తుంది……. !! ఎనీ వే ఇది ఆ విప్లవ్ గాడు కలిసి నన్ను కామెడీ పీస్ ను చేశారు…….. !! నా స్టోరీ లోకి వచ్చి నన్నే సైడ్ చేయాలి అని చూస్తారా మిమ్మల్ని ఎమ్ చేయగలనో నేను త్వరలో చూపిస్తా అని కోపంగా అనుకుంటూ అక్కడే కూర్చుంటుంది……… !!
హాల్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రావడానికి ఇంత టైమ్ పట్టిందా…….. ??
సారి ఆయుష్ కనిపించలేదు ……. !! వెతికి తీసుకుని వచ్చాను అని అభి హ్యాండ్ క్లీన్ చేస్తూ ఆన్సర్ ఇస్తుంది…….. !!
కొత్త కదా అలాగే ఉంటుంది లే ఆషి…… !?
ఆషి కి కొత్త ఏంటి ఆయుష్……. ??
ఐ మీన్ ఈ మధ్య ఆషి మహల్ లో వర్క్స్ ఏవీ చేయట్లేదు కదా జోషి అందుకే మర్చిపోయి ఉంటుంది అని అలా అన్నాను……. !! తను చేయాలి అనుకున్నా ఆఫీస్ లో ఊపిరి ఆడనంత వర్క్ తనైన ఎమ్ చేస్తుంది చెప్పు…… !! ఎమ్ ఆషి కరెక్ట్ గా చెప్పానా…… ??
ఆ….. ఆ…… అంతే ఆయుష్ అంతే….. అంతే…… !! ఏంటిది ఆయుష్ మాటలు నార్మల్ గా ఉన్నా చూపు డిఫరెంట్ గా ఉంది నా మీద అనుమానం కానీ వచ్చిందా……. ??
థాంక్ యూ అక్కా….!!
అభి వాయిస్ కి ఆయుష్ వైపు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయిన విషిత అభి వైపు చూస్తూ……. !! మనకు మనకు థాంక్స్ ఏంట్రా నో నీడ్ అంటూ అభి కి తన చేత్తోనే బ్రేక్ఫాస్ట్ తినిపించి ……. !! హ్యాండ్ వాష్ చేసుకోవడం కోసం వెళ్ళి తన హ్యాండ్ ను డేటాల్ తో మూడు సార్లు రుద్ది రుద్ది……. !! తన హ్యాండ్ ను వాష్ చేసి తిరిగి డైనింగ్ ఏరియా లోకి వచ్చి దియా కి బ్రేక్ఫాస్ట్ తినిపించబోతుంటే దియా కి బ్రేక్ఫాస్ట్ తినిపించాను ఇక నువ్వు కూడా తిని ఆఫీస్ కి స్టార్ట్ అవ్వు ఆషి……. !!
ఆయుష్ జస్ట్ 10 మినిట్స్ ఆగవా నేను కూడా నీ కార్ లోనే వస్తాను నన్ను నా ఆఫీస్ లో డ్రాప్ చెయ్ అని …… !! ఫాస్ట్ ఫాస్ట్ గా 2 ఇడ్లీ లు తింటూ చెప్తుంది…… !! షూర్ ఆషి త్వరగా రెడీ అయి రా అని చెప్పగానే విషిత ఫాస్ట్ గా తినేసి రూమ్ వైపు వెళ్తుంది……… !!
ఆయుష్ అసలు ఇక్కడ ఎమ్ జరుగుతుంది ……. ?? నువ్వు ఆషి తో ఇలా బిహేవ్ చేయడం ఏంటి మాకు అసలు ఎమ్ జరుగుతుందో అర్థం కావడం లేదు…… !! ఆషి బిహేవియర్ కూడా చాలా స్ట్రేంజ్ & విర్డ్ గా ఉంటోంది ఆది దంపతుల్లా ఉండే మీ మధ్య ఈ కోల్డ్ వార్ ఏంటి ……. ?? అవును బావ నేను కూడా అక్క లో చేంజెస్ అబ్జర్వ్ చేసాను మీరు అత్త చెప్పినట్టు నిజంగా గొడవ పడ్డారా……….. ?? ఎంత కోపంలో ఉన్నా మిమ్మల్ని ఆయుష్ గారు అని రెస్పెక్ట్ ఇచ్చి పిలిచే అక్క ఇపుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తోంది……. ??
మీ అందరి క్వశ్చన్స్ కి ఆన్సర్ త్వరలోనే చెప్తాను బ్రేక్ఫాస్ట్ చేసి ఎవరి వర్క్స్ కి వాళ్ళు వెళ్ళిపోండి…… !! సీ యూ ఆల్ ఎట్ ఈవెనింగ్ అని దియా ను ఎత్తుకుని కిందకు దిగుతున్న విషిత ను చూసి తనతో పాటు బయటకు నడుస్తాడు ఆయుష్…… !!
ఆయుష్ కన్ఫ్యూస్డ్ మాటలకు అందరూ ఒకరిని ఒకరు చూసుకుని ఆయుష్ చెప్పినట్టే ఎవరి వర్క్స్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు……. !! ఆయుష్ దియా ను ఎత్తుకుని వెనుక నడుస్తుంటే విప్లవ్ కి కమ్ టు ఆఫీస్ అని టెక్స్ట్ పెడుతూ కార్ డోర్ ఓపెన్ చేయబోతున్న విషిత ను ఆపేస్తాడు మున్నా……. !!
వాట్ మున్నా నన్ను ఎందుకు ఆపావ్……. ??
సర్ ఇవాళ తన కార్ లో కాకుండా maruthi suzuki లో వెళ్ళాలి అనుకుంటున్నారు మేడం…… !! వాట్ benz కార్ లో వెళ్లకుండా suzuki లో వెళ్ళాలా అయినా ఆయుష్ ఎప్పుడూ ఈ కార్ లోనే వెళ్తాడు కదా సడెన్ గా syzuki లో ఎందుకు……. ??
సెక్యూరిటీ రీజన్స్ మేడం…… !!
బుల్ షట్ అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఆయుష్ వైపు నడుస్తూ వాట్ ఆయుష్ మనం ఎప్పుడు బయటకు వెళ్లినా ఇందులోనే కదా వెళ్తాం……. ?? ఆల్ ఆఫ్ సడెన్ suzuki లో ఎందుకు వెళ్తున్నాం అయినా నువ్వు బ్రాండెడ్ కార్స్ మాత్రమే యూస్ చేస్తావ్ కదా……. ??
Suzuki కూడా బ్రాండ్ నే ఆషి మర్చిపోయినట్టు ఉన్నావ్ …….. ?? మన మ్యారేజ్ కి ముందు నువ్వు నీ బాబు తీయించిన సెకండ్ హ్యాండ్ డొక్కు స్కూటీ లో వెళ్ళేదానివి ఏంటీ అపుడే మర్చిపోయావా ……. ?? మ్యారేజ్ అవ్వగానే నీలో కూడా అహంకారం, బలుపు బాగా పెరిగినట్టు ఉన్నాయ్ అంటూ లెఫ్ట్ ఐ బ్రో రైస్ చేస్తూ చూస్తాడు…….. !!
ఆ….. ఆ….. బాగా గుర్తుంది ఆయుష్ ……. !! నా ఉద్దేశం ఆది కాదు నువ్వు ఇలాంటి కార్స్ లో ఎపుడు ట్రావెల్ చేయలేదు కదా నీకు ఇబ్బందిగా ఉంటుందేమో అని అలా అన్నాను…… !!
నాకే ఇబ్బంది లేదు లెట్స్ మూవ్……. !!
ఈ పిల్ల దెయ్యం ఏంటీ నా వైపు అలా డౌబ్ట్ గా చూస్తుంది నేనేమైనా వీళ్ళకు డౌబ్ట్ వచ్చేలా తప్పుగా మాట్లాడానా…….. ?? ఎందుకొచ్చిన గొడవ కామ్ గా ఆఫీస్ కి వెళ్ళడం బెటర్ అనుకుని ఆయుష్ డోర్ ఓపెన్ చేయగానే కార్ లో స్టైల్ గా కూర్చుంటుంది……. !! విషిత ను సైడ్ స్మైల్ తో చూస్తూ ఆయుష్ కూడా విషిత పక్కన దియా తో పాటు కూర్చుని ముందుగా దియా ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి…… !! విషిత ను ఆషి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తను తన ఆఫీస్ కి వెళ్ళిపోతాడు……. !!
ఆయుష్ డైరెక్ట్ గా తన క్యాబిన్ కి వెళ్ళి ఫస్ట్ హాఫ్ ఆన్ ఆర్ కాల్స్ లో ఫుల్ బిజీ అవుతాడు….. !! కాల్స్ అయ్యాక ఆఫీస్ వర్క్స్ చేసుకుంటూ టైమ్ కూడా చూడనంత బీసీ అయిపోయిన ఆయుష్ ను డిస్టర్బ్ చేస్తూ కరెక్ట్ 11 కి ఓపెన్ అవుతుంది ఆయుష్ క్యాబిన్….. !!
క్యాబిన్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ కి తల తిప్పిన ఆయుష్ కి మోహిత్, నిషాన్ & విక్రమ్ డోర్ దగ్గర నుంచుని కనిపిస్తారు……. !! వాళ్ళను చూసి వాచ్ లో టైమ్ చూసుకున్న ఆయుష్ ఓహ్ అపుడే 11 అయిందా అక్కడే ఆగిపోయారే కమ్…….. !! అంటూ చేసినంత వరకూ వర్క్ సేవ్ చేస్తూ లాపి క్లోజ్ చేసి ప్యూన్ కి కాల్ చేసి నాలుగు టీ తీసుకుని రా అని మొబైల్ చూస్తూ ఉంటాడు…… !!
ఆయుష్ ముందు కూర్చున్న ముగ్గురూ ఒకరిని ఒకరు చూసుకుని ఆయుష్ వైపు చూస్తూ ఆయుష్ అదీ ……… !! అని అంటూ ఉండగా ప్యూన్ టీ కప్స్ తో లోపలికి రావడం చూసి…… !! టీ తాగాక మాట్లాడుకుందాం ఫస్ట్ టీ తాగండి అనడం తో ముగ్గురు ఇంకేం చేయలేక టీ కప్స్ చేతిలోకి తీసుకుని ఫాస్ట్ గా టీ ఫినిష్ చేసి ఆయుష్ వైపు చూస్తారు…… !!
ఆయుష్ కూడా తన కప్ లోని టీ ఫినిష్ చేసి ముగ్గురి వైపు చూస్తాడు…… !! ముగ్గురూ కూడా ఆయుష్ వైపే చూస్తూ కనిపించడం తో ఏంట్రా ఎప్పుడు నన్ను చూడనట్టు పెట్టారు ఫేస్ వాట్ హ్యాపెండ్…… ??
అది మేము అడగాలి అన్నయ్య వాట్ హ్యాపెండ్ టు యూ & ఆషి ఇద్దరూ చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నారు…… !! నువ్వు ఆషి ను తిట్టడం & తను అలగటం మాకు కొత్తేం కాదు బట్ ఆషి మాతో హార్ష్ గా మాట్లాడడం లీటరల్లీ చాలా షాకింగ్ గా ఉంది…… !!
ఏంటి షాకింగ్ గా ఉందా……. ?? మీరు షాక్ అవ్వాల్సిన విషయాలు నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి…… !! జస్ట్ ఏ మినిట్ అంటూ తన పర్సనల్ డ్రా నుండి ఒక ఫైల్ తీసి ముగ్గురి ముందు పెడతారు….. !! ఎంటా ఫైల్ అనుకుంటూ ఓపెన్ చేసి చూసిన ముగ్గురి మొహాల్లో చెప్పలేనంత ఆనందం 🤩 కానీ ఆయుష్ మొహం మాత్రం కోపంతో ఎర్రబడుతుంది…… !!
అన్నయ్య ఇది…. ఇది నిజంగా నిజమా……. ??
హ్మ్మ్….. !!
ఆషి ప్రెగ్నెంట్ ఆ…….. ?? ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్ ఆయుష్ వుయ్ ఆర్ వెరీ హ్యాపీ……. !! ఇంత గుడ్ న్యూస్ ని ఇలా మూడీగా చెప్తావ్ ఏంటి ఆయుష్……. !!
బావ నిజంగా ఆషి ప్రెగ్నెంట్ ఆ మరి ఈ విషయం ఎందుకని ఎవరికీ చెప్పకుండా దాచారు ……. ??
అన్నయ్య సర్ప్రైజ్ ప్లాన్ చేశారా……. ?? అందుకే ఎవరికీ చెప్పలేదా…… ??
అడుగుతుంటే మాట్లాడవేంటీ బావ ఆషి దేని గురించి అయితే వెయిట్ చేస్తుందో……. ?? ఆ మూమెంట్ వచ్చేశాక కూడా ఆషి ఎందుకు మా ఎవరితో తను కన్సీవ్ అయినట్టు చెప్పలేదు…….. ??
చెప్పడానికి తను ఆషి అయితే కదా…….. ??
వాట్……. ??
ముగ్గురూ షాకింగ్ గా చూస్తూ ఎమ్ మాట్లాడుతున్నావ్ ఆయుష్ ఆషి – ఆషి కాకపోవడం ఏంటి…… ??
మన మహల్ లో ఉన్నది నా ఆషి కాదు తన రూపం లో మరో అమ్మాయ్ అనగానే ముగ్గురికీ ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది…… !!