నందు సీరియస్లీ నాకు అసలు ఓపిక లేదు బట్ లేని ఓపిక తెచ్చుకుని మరీ అడుగుతున్నా ….. !! మహాన్ & భూమి జీవితం గురించి ఎమ్ ఆలోచించావ్ …… ?? భూమి ని ఎమ్ చేద్దాం అనుకుంటున్నావ్ …… ?? ఇప్పటి వరకూ జరిగింది చాలు మన పంతాల కోసం పిల్లల ఫ్యూచర్ స్పాయిల్ చేయకు…… !! ఇన్ని రోజులు భూమి ను ఎలా అయినా నా దగ్గరకు తెచ్చుకుని తనకు మరో పెళ్లి గణంగా చేయాలి అనే నేను కూడా అనుకున్నాను…… !! కానీ భూమి మహాన్ ను ఎంత ప్రేమిస్తుందో అర్థం అయ్యాక భూమి ప్రేమను దూరం చేయాలి అని అనుకోవడం లేదు …… !! ఎండ్ ఆఫ్ ది డే మనం కోరుకునేది పిల్లల సంతోషమే కదా అందుకే అడుగుతున్నా ఇప్పటికైనా నీ పంథాన్ని వదిలి పిల్లల ప్రేమను అర్థం చేసుకో…… !!
అయిపోయిందా నువ్వు చెప్పడం ఇక నేను వెళ్ళొచ్చా అని యాటిట్యూడ్ గా అడుగుతున్న నందన బుజాలు పట్టుకొని గోడకు ఆనిస్తూ…… !! ఎమ్ చూసుకుని నీకు ఇంత పొగరు నేను ఎమ్ చెప్తున్నానో అర్థం కావట్లేదా నీకు హా…… ?? తల్లివే కదా నువ్వు పిల్లల గురించి నా కంటే నువ్వే ఎక్కువ ఆలోచించాలి అలాంటిది నువ్వే ఎందుకు పిల్లల సంతోషాన్ని దూరం చేస్తున్నావ్…… ?? నీ పగ, కోపం నా మీద ఎందుకు ఇందులోకి అనవసరంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నావ్…… ?? కావాలంటే ఆ కోపం నా మీద తీర్చుకో అంతే కానీ భూమి హ్యాపీనెస్ కి అడ్డు రావద్దు నందు…… !!
స్టాప్ ఇట్ అంటూ కార్తికేయ గుండెల మీద చెయ్ వేసి విసురుగా వెనక్కి తోసి….. !! భూమి… భూమి… భూమి ఎపుడు దాని గురించే ఆలోచించు….. !! ఇదిగో ఈ ప్రేమ నాకు దక్కడం లేదు అనే నేను ఇలా తయారయ్యాను నేను ప్రేమించే మనిషి కి నేనే ప్రపంచం అవ్వాలి…… !! అందరి అమ్మాయిల్లాగే నేను కూడా ఎన్నో ఆశలతో నీతో జీవితాన్ని స్టార్ట్ చేసాను నీకోసం ఎన్నో సార్లు అడ్జస్ట్ అయ్యాను….. !! భర్తగా నీ ప్రేమ మొత్తం నాకే దక్కాలి అనుకున్నాను అది నీ దృష్టిలో స్వార్థం అయిపోయింది కదా…. !!
నీ కోసం చావడానికి కూడా సిద్ధపడ్డ నేను నీకు 20 ఇయర్స్ నుండి దూరంగా ఉంటున్నాను అంటే అర్థం చేసుకో నువ్వు నన్ను ఎంతలా బాధ పెట్టావో……. !! ఇన్ని ఇయర్స్ అయినా నీ చెల్లి కూతురి గురించి ఆలోచిస్తున్నావ్ కానీ నీ పిల్లల గురించి వాళ్ళ సంతోషాల గురించి ఒక్క సారైనా ఆలోచించావా …… ?? నీకు కావాల్సింది నీ చెల్లి & తన పిల్లలు అలాంటపుడు నన్ను ఎందుకు పెళ్ళి చేసుకుని ఇలా ఏడిపిస్తున్నావ్ …… ??
ఎనఫ్ నాకేం చెప్పకు నేను వినను కూడా ఎందుకంటే నేను విసిగిపోయాను ఇంత ప్రేమ నా మీద ఒక్క సారైనా చూపించావా కార్తీక్ అని ఏడుస్తూ……. !! కార్తికేయ కాలర్ పట్టుకుని నిన్ను పిచ్చిగా ప్రేమించినందుకే కదా నన్ను నా ప్రేమను తక్కువ చేశావ్….. !! మనం ప్రేమించిన వ్యక్తి మనకు దూరం అవుతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి తెలిసేలా చేస్తాను….. !!
నీకు ఎప్పుడైతే నా ప్రేమ అర్థం అవుతుందో అప్పుడు నేను వీటన్నిటినీ ఆపేస్తాను…… !! అది నీకు ఎప్పటికీ అర్థం అవ్వదని నాకు తెలుసు నీకు అదే ఇంపార్టెంట్ కదా…… !! భూమి ఇదే గుడిలో ఉంది అది వస్తాను అంటే తీసుకుపో బట్ నా కొడుకు తో మాత్రం నీ కోడలు ఎప్పటికీ కలిసి ఉండదు ….. !! త్వరలోనే నా కొడుకు కి నన్ను మెచ్చిన అమ్మాయితో పెళ్లి చేయబోతున్నా ……. !! నీకు దమ్ముంటే ఆ పెళ్లి ఆపు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నందన …… !!
ఈ మెంటల్ దానికి ఎలా చెప్తే అర్థం అవుతుంది అరే నా పిల్లల సంతోషం గురించి ఆలోచించాను కాబట్టే కదా దీనితో ఇంత కూల్ గా మాట్లాడుతున్నా ….. !! ఎంత సేపు దీని బాధ దీనిదే కాన్ నా బాధ పట్టించుకోదు అని తల కొట్టుకుంటూ మహాన్ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడా అనుకుంటూ…… !! ముందు వీడిని నాలుగు తంతే దీనికి బుద్ధి వస్తుంది అని మహాన్ ను కలవాలి అని డిసైడ్ అవుతాడు…… !!
💫💫💫💫💫💫💫💫💫💫
భూమి ఆనందంగా తను ఎవ్రీ ఇయర్ చేసే లాగే తన ఫాదర్ సంవత్సరికం ను రాజ్ తో పాటు ఆనందంగా షేర్ చేసుకుంటూ…… !! ప్రతీ కార్యక్రమాన్ని త్వరగానే కంప్లీట్ చేసి ఆనందంగా మానస ను హగ్ చేసుకుంటూ నిన్ను మళ్ళీ ఇంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు మమ్మీ……. !! ఐ రియల్లీ మిస్ యూ అంటూ అనసూయ ను కూడా కలిపి హగ్ చేసుకుంటూ నవ్వుతూ రాజ్ వైపు చూస్తుంది….. !! రాజ్ భూమి ని గట్టిగా హగ్ చేసుకుంటూ కొన్ని డేస్ భూమి త్వరలోనే మహాన్ గాడికి ఫ్యూస్ లు ఎగిరి పోయేలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను….. !! అది అయ్యాక వాడికి చూపిస్తాను చూడు అసలైన టార్చర్ దెబ్బకి వాడికి పట్టిన దెయ్యం వదిలి……. !! నా కాళ్ళు పట్టుకుని సారి చెప్పేలా చేస్తాను అని భూమి తల నిమురుతూ ఉంటాడు…… !!
భూమి ఇప్పుడు నీకు అక్కడ అంతా బానే ఉంది కదా ముందులా నందన, మహాన్ నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా…… ?? లేదు మమ్మీ నేను వాళ్ళకి అలాంటి ఛాన్స్ ఎందుకు ఇస్తాను చెప్పు నేను అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను….. !! ఇన్ఫాక్ట్ నన్ను అత్తయ్య ఏమైనా అంటే నానమ్మ అసలు ఊరుకోదు…… !! అక్కడ నాకు నానమ్మ నుండి ఫుల్ సపోర్ట్ ఉంది మీరు నా గురించి అస్సలు వర్రీ అవ్వకండి …… !!
దేవయాని అత్తయ్య ఉన్నారు కాబట్టే ఇక్కడ మేము పీస్ఫుల్ గా ఉండగలుగుతున్నాం భూమి….. !! అంటూ ప్రేమగా భూమి కి తన చేత్తో పులిహోర తినిపిస్తూ ఉంటే అది చూస్తున్న భూమి కన్నీళ్లతో దాన్ని తింటూ తను కూడా మానస కి తినిపిస్తుంది…… !! అలా ఒక్కొక్కరూ ప్రేమగా భూమి కి తినిపిస్తూ తమకు దొరికిన ఈ టైం ను భూమి తో మిస్ చేసుకోకుండా ఇన్ని డేస్ గా మిస్ అయిన మాటలు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు….. !!
అబ్బా ఈ నన్ను ఈ ప్రదక్షణాలు చేయమని చెప్పి మామ్, అన్నయ్య ఇటు మాయం అయిపోయారు…… !! ఈ భూమి కూడా కనిపించడం లేదు అని వీళ్ళ కోసం వెతుకుతున్న శ్లోక కి ఒక చోట కనిపిస్తారు భూమి ఫ్యామిలీ……….. !! రాజ్ తో నవ్వుతూ అల్లరి చేస్తూ రాజ్ భుజం మీద తల వాల్చి మానస, అనసూయ లతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న భూమి ను చూసి శ్లోక కోపంగా చూస్తూ ఉంటుంది….. !!
ఇదా విషయం దీని కోసమా అమ్మమ్మ నా మీద అంత ప్రేమ నటించింది…… !! నేను అప్పుడే అనుకున్నా అమ్మమ్మ కి సడెన్ గా నా మీద ఇంత ప్రేమ ఎలా వచ్చింది అని …… !! సో ఇదంతా ఈ భూమి మీద ఉన్న ప్రేమ అనమాట దీన్ని వాళ్ళను కలపడానికి నన్ను వాడుకుంది 😬😬 …… !! రేయ్ రాజ్ నాకు నిద్రలేకుండా చేసి నువ్వు మాత్రం నీ చెల్లితో ఎంత బాగా నవ్వుతున్నావ్ రా…… !!
లేదు నువ్వు ఇలా సంతోషంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు….. !! ఈ భూమి కూడా నిన్ను చూసి తెగ రెచ్చిపోతుంది అది నా ముందు బెండ్ అవ్వాలంటే నువ్వు హస్పిటల్ బెడ్ మీద ఉండాలి….. !! ఎస్ నువ్వు కాళ్ళు చేతులు విరిగి హస్పిటల్ బెడ్ మీద ఉంటే ఇది నేను చెప్పినట్టు వింటుంది…. !! ఎవర్నో యాక్సిడెంట్ చేశావని నన్ను సెల్ లో వేశావ్ కదా ఇప్పుడు దానికి రివేంజ్ తీర్చుకునే టైమ్ వచ్చింది…… !! అని కోపంగా అనుకుంటూ నందన, మహాన్ లను వెతుకుతూ మరో వైపు వెళుతుంది…… !!
✨✨✨✨✨✨✨✨✨
స్థంభానికి ఆనుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్న మహాన్ బుజం మీద చేయి పడగానే ఏదో ఆలోచిస్తున్న మహాన్ ఎవరు అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తాడు….. !! ఎటు వెళ్ళిపోయావ్ అన్నయ్య నీ కోసం మామ్ కోసం గుడి మొత్తం వెతకలేక కాళ్ళు లాగేస్తున్నాయి …… !! ప్రదక్షణాలు చేయకుండా ఇక్కడేం చేస్తున్నావ్ మామ్ ఎక్కడ…. ??
డోంట్ నో శ్లోక నా ప్రదక్షణాలు ఫినిష్ అయ్యాయి అందుకే మీ కోసం చూస్తున్నాను….. !! అవునా 🤔🤔 మరి భూమి ఎక్కడ అది కూడా కనిపించట్లేదు అని కావాలనే మహాన్ ఎమ్ చెప్తాడా అని అడుగుతుంది శ్లోక….. !! దాన్ని పాకెట్ లో పెట్టుకుని తిరుగుతానా ఏంటి శ్లోక అది అమ్మమ్మ తో పూజ కి కావలసినవి అన్నీ చూసుకుంటూ బిజీగా ఉంది 😏….. !! ఇస్ ఇట్ నేను అమ్మమ్మ దగ్గర నుండే వస్తున్నా అది అక్కడ లేదు గా……… ??
అ…. అవునా ఏమో శ్లోక 15 మినిట్స్ బ్యాక్ అక్కడే చూసాను ఈ లోపు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఆగు చూసి వస్తాను…… !! అని హడావిడిగా పరిగెడుతున్న మహాన్ ను చూసి ఎంత మారిపోయావ్ అన్నయ్య నేను చూస్తుంది నా అన్నయ్య నేనా …… ?? అంటూ మహాన్ కి డౌబ్ట్ రాకుండా వెనుకే ఫాలో అవుతూ వెళ్తుంది…… !!
మహాన్ ఫాస్ట్ గా భూమి దగ్గరకు వెళ్లి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ…… !! నందన అదే గుడిలో ఉందన్న విషయం కూడా మర్చిపోయి ఆది తనకు సంబంధమే లేనట్టు …… !! తన వాళ్ళతో చాలా హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ …….. !! రాజ్ తో చిన్న చిన్న గొడవలు పడుతూ చిన్న పిల్లలా అల్లరి చేస్తున్న భూమి ను చూసి మహాన్ మొహాన్ని విసుగ్గా పెడతాడు….. !!
ఇది టెంపుల్ కి వచ్చాను అనుకుంటుందా లేదా పిక్నిక్ కి వచ్చాను అనుకుంటుందా…… ?? అరే ఇంట్లో అంతలా ఏడుపు మొహం పెట్టుకుని కూర్చుంది ఇక్కడ చూడు గుర్రం లా పరిగెడుతుంది …… !! అని భూమి వైపు సీరియస్ గా చూస్తూ తన ముందుకు వచ్చి నవ్వింది చాలు ఇక పదా …… !! ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్ లా నవ్వుతున్నావ్ అంటూ భూమి చెయ్ పట్టుకుని అక్కడి నుండి తీసుకుని వెళ్లబోతాడు…… !!
రేయ్ ఆగరా అంటూ మహాన్ ముందు నుంచుని ఎమ్ మనిషివి రా నువ్వు అసలు ఏ నక్షత్రం లో పుట్టి చచ్చావ్ హా…… !! నా చెల్లి సంతోషంగా ఉంటే అస్సలు చూడలేవు కదా ఇంత కడుపు మంట ఏంటీ నీకు…… !! భూమి తో మా అమ్మ, అమ్మమ్మ మాట్లాడుతున్నారు కదా …… !! ఎందుకు దాన్ని బలవంతంగా తీసుకుని వెళ్తున్నావ్ అంటూ భూమి చెయ్ పట్టుకుని తన వైపు లాక్కుంటూ సీరియస్ గా చెప్తాడు రాజ్….. !!
సిచుయేషన్ తెలియకుండా వాగాకు ఇంత సేపు మీరు మాట్లాడుతున్నారు అనే కామ్ గా నేను పక్కకు వెళ్ళిపోయాను ….. !! మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇవాళ మొత్తం మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ నాకు అంత టైమ్ లేదు & ఇంత సేపు మిమ్మల్ని మాట్లాడుకోనివ్వడమే గొప్ప….. !! ఇదిగో దీని ఏడుపు మొహం చూడలేక మాట్లాడుకోని అని వదిలేశా…… !! ఇక నాకు టైమ్ లేదు ఏయ్ పదా అంటూ భూమి చెయ్ పట్టుకుంటాడు…… !!
నీకు టైమ్ లేకపోతే ఇక్కడి నుంచి దొబ్బెయ్ నేను నా చెల్లిని డ్రాప్ చేస్తాను….. !! ఇక వెళ్ళు అంటున్న రాజ్ వైపు కోపంగా చూస్తూ భూమి అని గట్టిగా అరుస్తాడు….. !! మహాన్ కోపాన్ని చూసిన భూమి రాజ్ చేతుల్లో నుండి తన చేతిని విడిపించుకుని అన్నయ్య ప్లీస్ రా గొడవ చేయకు నేను మహాన్ తో వెళ్ళాలి….. !! అత్తయ్య కి డౌబ్ట్ వస్తే మళ్ళీ లేని పోనీ గొడవలు అంటూ వస్తాను మమ్మీ అంటూ మానస, అనసూయ లను హత్తుకుని ముందుకు కదులుతుంది…… !!
భూమి వెనుకే వెళ్తున్న మహాన్ చెయ్ పట్టుకుని ఆపేస్తుంది మానస….. !! రాజ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగానే వెళ్తున్న రాజ్ నే చూస్తూ వెనక్కి తిరిగి మానస, అనసూయ ల వైపు చూస్తాడు మహాన్….. !! బాబు మహాన్ నీకు మేమంటే ఇష్టం లేదని మాకు తెలుసు కానీ నువ్వంటే మాకు ఎప్పటికీ ఇష్టమే మహాన్….. !! నువ్వు భూమి ని పెళ్ళి చేసుకున్నావ్ అని మేము నిన్ను కొత్తగా ఇష్టపడ్డం లేదు….. !!
నువ్వు ఎప్పుడైతే మా వదిన కడుపులో నుండి మా చేతుల్లోకి వచ్చావో అప్పటి నుండి నువ్వంటే మాకు ప్రాణం….. !! నీకో విషయం చెప్పనా నువ్వు పుట్టగానే నిన్ను ఫస్ట్ ఎత్తుకుంది నేనే అప్పుడే అనుకున్నాను నాకు కూతురు పుడితే నీకే ఇచ్చి చేయాలని….. !! నా కోరిక చాలా బలమైంది అని నువ్వు భూమి ని పెళ్ళి చేసుకున్న తర్వాతే అర్థం అయింది….. !! నువ్వు భూమి ని ఎందుకు పెళ్ళి చేసుకున్నా అది నీ భార్య ఈ విషయం మర్చిపోకు మహాన్ అలాగే వదిన ను జాగ్రత్తగా చూసుకో మహాన్…… !!
ఇక మేము బయలుదేరుతాం మళ్ళీ వదిన మమ్మల్ని చూస్తే భూమి మీద కొప్పడుతుంది…… !! అని మానస అక్కడి నుంచి వెళ్లిపోతే అనసూయ వెళ్తూ వెళ్తూ ఆగి నువ్వు భూమి కలిస్తేనే మీ అమ్మ నాన్న కలుస్తారు…… !! మన కుటుంబం అందరితో సరదాగా గడపాలని ఉంది మహాన్ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనసూయ….. !!
వీళ్ళు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కానీ మామ్ ఎందుకు మానస అత్త వల్ల తను చాలా టార్చర్ అనుభవించానని చెప్పింది…… ?? అసలు వీళ్లలో ఎవరిని నమ్మాలి ఆయన నిజంగానే మామ్ ను కొట్టి బయటకు గెంటేశాడా అసలేం జరిగింది…… ?? భూమి నిజంగా నన్ను మామ్ కి దూరం చేయడానికే నా కాలేజ్ లో జాయిన్ అయిందా….. ?? ఇలా ఆలోచిస్తున్న మహాన్ నందన వాయిస్ కి ఆ…. !! అంటూ ఉలిక్కిపడతాడు ……. !!
పూజ లోపల జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నావ్ మహాన్….. ?? న …..నథింగ్ మామ్ నీ గురించే చూస్తున్నాను ఏమైపోయావ్ నువ్వు….. !! కాల్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళాను కానీ పదా లోపలికి వెళ్దాం……. !! అని మహాన్ ను తీసుకుని దేవయాని దగ్గరకు వెళ్ళేసరికి భూమి అభిషేకం కి కావలసినవి అన్నీ పురోహితుడికి అందిస్తూ ఉంటుంది….. !!
నందన వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి దేవుడిని చూసి నమస్కారం చేస్తూ దేవుడి వైపు చూస్తూ ఉంటారు……. !! అప్పుడే దేవయాని నందన వైపు చూస్తూ నందు శ్లోక ఎక్కడ ఇప్పుడు తన చేతులతోనే దేవుడికి అభిషేకం చేయాలి అనగానే……. !! అప్పుడు చూసుకుంటారు అందరూ శ్లోక అక్కడ కనిపించడం లేదని…… !!
శ్లోక ఎక్కడ….. ?? అని అడుగుతున్న నందన వాయిస్ కి భూమి తెలియదు అన్నట్టు చూస్తే……. !? ఇక్కడే కదా ఉండాలి ఈ లోగా ఎటు వెళ్ళింది అని చుట్టు చూస్తూ…… !! మామ్ బయట ఉందేమో చూసోస్తా అని ఇందాక శ్లోక తో మాట్లాడిన చోటుకు వెళ్ళి చూడగా అక్కడ శ్లోక కనిపించదు…… !!
శ్లోక ఎక్కడ….. ?? ఎనీ గెస్స్ 😈😈