ఏయ్ లోపల ఎవరు లేకపోతే మాట్లాడేది ఎవరు…. ?? ఫస్ట్ డోర్ ఓపెన్ చెయ్ అంటూ కోపంగా డోర్ ను విరిగిపోయే రేంజ్ లో కొడుతున్న నందు వాయిస్ కి మహాన్ భూమి వైపు సీరియస్ గా చూస్తే…. !! భూమి తింగరిగా నవ్వుతూ ఇప్పుడెలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది….. !! అయ్యో మహాన్ అత్తయ్య కి డౌబ్ట్ వచ్చేసింది ఇప్పుడెలా పోనీ పిల్లిలా కాకుండా కుక్కలా అరవనా అంటున్న భూమి వైపు చంపేసేలా చూస్తూ….. !! చేసిన పెంట చాలు డౌబ్ట్ వచ్చేలా చేసి ఎమ్ తెలియని ఇన్నోసెంట్ లా పెడతావా ఫేస్ ఇప్పుడు మామ్ కి ఎలా చూపించాలి నా ఫేస్….. ?? ఇద్దరినీ ఇలా చూస్తే కచ్చితంగా నేనే నిన్ను లోపలికి పిలిచాను అనుకుంటుంది గాడ్ ఇప్పుడేం చేయాలి….. ??
ఏయ్ భూమి లోపల ఉంది నువ్వే అని నాకు తెలుసు డోర్ ఓపెన్ చేస్తావా పగల కొట్టేయనా….. ?? అంటూ కాకి లా కావ్ మంటూ అరుస్తున్న నందన వాయిస్ కి భూమి ఫాస్ట్ గా ముడి పెట్టున్న హెయిర్ ను వదిలి మహాన్ చంప మీద లిప్స్టిక్ మార్క్స్ పడేలా కిస్ పెడుతూ…… !! వాటర్ తో తన శారీ ను కూడా అక్కడక్కడ తడుపుకుని మహాన్ ను చూసి కన్ను కొడుతూ నవ్వుతూ డోర్ ఓపెన్ చేస్తుంది….. !!
ఏయ్ ఎమ్ చేస్తున్నావ్ ఆగు నువ్వు అని మహాన్ అంటూ ఉండగానే భూమి కాస్త డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళడం చూసి మహాన్ నిజంగానే తలను గోడ కేసి బాదుకుంటాడు… !! భూమి కొంచెం డోర్ ఓపెన్ చేసినట్టు చేసి మహాన్ తన చెయ్ పట్టుకుని లాగుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఒక చేయ్ వాష్ రూమ్ లోనే ఉంచేసి….. !! అయ్యో మహాన్ వదులు అత్తయ్య చూస్తుంది ప్లీస్ మహాన్ మళ్ళీ రేపు బాత్ చేయిస్తాను సరేనా అబ్బా సరే కిస్ కూడా పెడతాను…… !! ఇప్పుడు అయినా వదులు అని బలవంతంగా మహాన్ ను వదిలించుకున్నట్టు యాక్ట్ చేస్తూ నందన ను చూసి సిగ్గు పడుతూ కిందకు పరిగెడుతుంది …. !!
పరిగెడుతున్న భూమి ను చూసి ఇంకో వన్ వీక్ నవ్వవే బాగా నవ్వు ఆ తర్వాత నీకు మిగిలేది ఏడుపు మాత్రమే….. !! ఈషా రాగానే తనను నా ఇంటి కోడలిగా అందరికీ పరిచయం చేసి నీ పొగరు అణిచి నీ కళ్ళ ముందే మహాన్ ఇషా ల పెళ్ళి జరిపిస్తా …… !! అది చూసి కుళ్ళి కుళ్ళి ఏడువు అనుకుంటూ వాష్ రూమ్ నుండి బయటకు వచ్చిన మహాన్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది….. !!
మామ్…. మామ్ ఛా!! మామ్ కి కోపం వచ్చినట్టు ఉంది అనుకుంటూ డ్రెస్ అప్ అవ్వడానికి వెళతాడు మహాన్….. !! కిచెన్ లోకి వెళ్ళిన భూమి నవ్వుకుంటూ కుక్ తో డిన్నర్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది…… !!
✨💫✨💫✨💫✨💫✨💫✨
మను నువ్వు కూడా కూర్చో కలిసి డిన్నర్ చేద్దాం అంటూ మానస చెయ్ పట్టుకుని పక్కనే కూర్చో పెట్టుకుని తనకు కూడా ప్లేట్ లోకి ఫుడ్ తనే స్వయంగా సర్వ్ చేస్తాడు కార్తికేయ…. !! నలుగురు సరదాగా మాటలు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి హాల్ లో కూర్చుని జనరల్ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటారు…. !!
కాసేపటికి అనసూయ, మానస నిద్రొస్తుంది అని గుడ్ నైట్ చెప్పి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళి హాయిగా బెడ్ ఎక్కిస్తే ….. !! హాల్ లో మిగిలిన కార్తికేయ తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే రాజ్ ఒక ఇంపార్టెంట్ కేస్ ఫైల్ చూస్తూ ఉంటాడు ….. !! కార్తికేయ తన వర్క్ కంప్లీట్ చేసి లాపీ షట్ డౌన్ చేస్తూ రాజ్ వైపు చూసి రాజ్ నీకు నా మీద కోపంగా లేదా…… ??
కార్తికేయ వాయిస్ కి రాజ్ తల తిప్పి చూస్తూ కోపమా……. ?? అది కూడా నీ మీద ఛాన్స్ ఏ లేదు మావయ్య అయినా నీ మీద నాకు ఎందుకు కోపం వస్తుంది…… !! స్టేషన్ లో శ్లోక ను వదిలేయ్ అని చెప్పినప్పుడు నీ మొహం లోని కోపాన్ని నేను చూసా రాజ్ నా మాట కోసమే కదా తనను వదిలేశావ్….. !! కోపం వచ్చిన మాట నిజమే మావయ్య కానీ మీరు చెప్పింది కూడా నిజమే కదా విత్ అవుట్ ప్రూఫ్స్ అరెస్ట్ చేసినా……. ?? ఆ కేస్ నిలబడదు అందుకే దాన్ని వదిలేశా అయినా మీరేం చేసినా/ చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది మావయ్య…… !! మీ డెసిషన్ ఏదైనా నేను దాన్ని జడ్జ్ చేయను జస్ట్ ఫాలో అయిపోవడమే….. !! అంటూ స్మైల్ ఇచ్చిన రాజ్ తల నిమిరి గుడ్ నైట్ రాజ్ త్వరగా పడుకో అంటూ కార్తికేయ కూడా తన రూమ్ కి వెళ్ళిపోతాడు…… !!
కార్తికేయ వెళ్ళిన పది నిమిషాలకు ఫైల్ క్లోజ్ చేసిన రాజ్ బద్దకంగా వొళ్ళు విరుచుకుంటూ వాచ్ వైపు చూస్తాడు….. !! 11 అవుతూ కనిపిస్తున్న టైమ్ ను చూసి ఎందుకో భూమి బాగా గుర్తొస్తుంది ఒక సారి వెళ్ళి చూసొస్తే బెటర్ అనుకుని….. !! అనుకున్నదే తడువుగా భూమి ను చూడ్డానికి మహాన్ విల్లా కి స్టార్ట్ అవుతాడు…… !!
💫💫💫💫💫💫💫💫💫💫
డిన్నర్ చేసి రూమ్ కి వచ్చిన నందన డోర్ లాక్ చేసి కాసేపు మొబైల్ తో టైమ్ స్పెండ్ చేసాక…. !! ఏదో ఫైల్ కోసం వాడ్రాబ్ లో వెతుకుతూ ఉంటుంది అప్పుడే తన చూపు గ్రీన్ కలర్ పట్టు శారీ మీద పడుతుంది …… !! దాన్ని చేతిలోకి తీసుకుని ముని వేళ్ళతో దాన్ని తడుముతూ గతం లోకి వెళుతుంది….. !!
కార్తీక్ 1 వీక్ నుండి అడుగుతున్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని ఎపుడు ఆఫీస్ వర్క్ అంటూ ఇవాళ, రేపు అంటున్నావ్…… ?? బట్ ఇవాళ నువ్వు ఈవెనింగ్ వచ్చాక మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్కడే 2 డేస్ టైం స్పెండ్ చేస్తున్నాం…… !!
నందు నీకు అంతలా చూడాలి అనుంటే నువ్వు వెళ్లేసి రావచ్చు కదా 2 డేస్ కాకపోతే 1 వీక్ అక్కడే ఉండు….. !! నాకు ఆఫీస్ వర్క్స్ తోనే సరిపోతుంది 2 డేస్ అక్కడే ఉండాలంటే నాకు అస్సలు కుదరదు… !! అత్తయ్య వాళ్ళు ఉండేది కూడా హైదరాబాద్ నే కదా నందు జస్ట్ 1 ఆర్ జర్నీ నువ్వు పిల్లలు వెళ్ళేసి రండి ఒకే……. !!
బట్ కార్తీక్ నువ్వు కూడా వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు రేపు ఎలాగో సండే నే కదా అని బ్రేక్ఫాస్ట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్న కార్తికేయ కి హ్యాండ్ కీ ఇస్తూ అడుగుతుంది… !! ఐ విల్ ట్రై నందు అంటున్న కార్తికేయ ను చూసి నందన మూతి ముడుచుకుంటే అది చూసిన కార్తికేయ నందు ను దగ్గరకు తీసుకుని సరే ఈవెనింగ్ రెడీగా ఉండు వెళ్దాం అనగానే నందన హ్యాపీగా ఫీల్ అవుతూ కార్తికేయ బుగ్గ మీద నవ్వుతూ కిస్ చేస్తుంది…. !!
కిస్ చేయాల్సింది అక్కడ కాదు నందు ఇక్కడ అని తన లిప్స్ వైపు వేలు పెట్టి చూపిస్తున్న కార్తికేయ ను చూసి నందు సిగ్గు పడుతూ….. !! చీ పో కార్తీక్ అని దూరం జరుగుతూ ఈవెనింగ్ త్వరగా వచ్చెయ్…… !! అని నవ్వుతూ చెప్పి కార్తికేయ ఆఫీస్ కి వెళ్ళిపోయాక ఈవెనింగ్ ఎపుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంటుంది….. !!
కార్తికేయ చెప్పిన టైమ్ కంటే ముందే వచ్చేయడం తో నందు నవ్వుతూ ఎదురు వెళ్ళి….. !! అరే త్వరగా వచ్చేసావే ఇదిగో చూడు నేను పిల్లలం రెడీ అయిపోయాం ఇక నువ్వు రెడీ అయ్యి వస్తే స్టార్ట్ అవుదాం….. !!
మేడం గారు ఆర్డర్ వేశాక రాక తప్పుతుందా మళ్ళీ అలక పాన్పు ఎక్కుతారు కదా అందుకే వచ్చాను….. !! అని కార్తికేయ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే నందు నవ్వుకుంటూ తాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు అనసూయ కి చెప్పి కార్తికేయ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది….. !!!
కాసేపటికి కార్తికేయ కూడా రెడీ అయి వచ్చాక నందు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తూ ఉండగా …… !! సడెన్ గా ఉరుము లేని వర్షం లా తన హస్బెండ్ తో అక్కడికి వస్తుంది మానస… !! మానస ను చూసిన నందన మొహం విసుగ్గా మారిపోతే తను కట్టుకున్న గ్రీన్ కలర్ పట్టు శారీ చూసి కోపంగా కార్తికేయ వైపు చూస్తుంది…… !!
కార్తికేయ, నందన & మానస, విజయ్ అందరూ ఒక సారి షాపింగ్ కి వెళ్ళినపుడు నందు కి గ్రీన్ కలర్ పట్టు శారీ నచ్చుతుంది…… !! కానీ అదే శారీ మను కూడా ఇష్టపడ్డం తో కార్తికేయ నందు తో నీకు ఆ శారీ బాగోదు అని నందు ను మాయ చేసి దాన్ని మానస కి దక్కేలా చేస్తాడు…. !! అదంతా గుర్తు రాగానే నందు కోపంగా కార్తికేయ వైపు చూస్తూ ఉంటే కార్తికేయ మానస వాళ్ళను చూసి తను ఎత్తుకున్న శ్లోక ను కిందకు దింపి …… !! భూమి ను చేతుల్లోకి తీసుకుంటూ మీ అమ్మ వాళ్ళ ఇంటికి నెక్స్ట్ వీక్ వెళ్దాం అని మను, విజయ్ లతో హాల్ లో కూర్చుని ముచ్చట్లు పెడుతూ ……. !! తనను, తన పిల్లల్ని ఇగ్నోర్ చేయడం చూసి నందన కోపంగా మహాన్, శ్లోక లను తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది….. !!
అదంతా గుర్తు చేసుకుంటూ నందు మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని ఆ చీర ను ఎలా తిరిగి మను నుండి తీసుకుందో గుర్తు చేసుకుంటూ తనలో తాను పొగరుగా నవ్వుకుంటూ ఉంటుంది…… !!
✨✨✨✨✨✨✨✨✨
భూమి ను చూడ్డం కోసం వచ్చిన ప్రతీ సారి ఈ గోడ దూకలేక చస్తున్నా ….. !! అని మహాన్ ఇంటి గోడ దూకి డాగీస్ కోసం తెచ్చిన బిస్కెట్స్ వాటికి వేసి అవి అరవకుండా వాటిని ఊరుకో బెట్టి …… !! సెక్యూరిటీ గార్డ్స్ కళ్ళు కప్పి బ్యాక్ సైడ్ డోర్ నుండి ఇంట్లోకి ఎంటర్ అవుతాడు రాజ్…… !!
భూమి రూమ్ చేంజ్ అయ్యాక ఆ విషయం రాజ్ కి చెప్పకపోవడం వల్ల భూమి ఏ రూమ్ లో ఉందో అర్థం అవ్వక ఒక్కో రూమ్ చూస్తూ వెళ్తున్న రాజ్ ….. !! శ్లోక రూమ్ లోకి వెళ్ళి వాల్ కి ఎన్లార్జ్ చేసున్న శ్లోక పిక్ చూసి ఇది దీని రూమ్ ఆ….. ?? పర్లేదే నీట్ గా నే ఉంది దీని రూమ్ అని రూమ్ ను చూస్తున్న రాజ్ వాష్ రూమ్ డోర్ సౌండ్ విని ఫాస్ట్ గా వెళ్ళి కర్టెన్ వెనుక దాక్కుంటాడు….. !!
ఫ్రెష్ అయి టవల్ వంటికి చుట్టుకుని హెయిర్ ను చేత్తో తుడుచుకుంటూ మిర్రర్ ముందు నుంచున్న శ్లోక ను చూసిన రాజ్ …… ?? కళ్ళతోనే శ్లోక ను ఇంచ్ టు ఇంచ్ స్కాన్ చేస్తూ పర్లేదు ఇది కూడా అందగత్తే అని అనుకోకుండా ఉండలేకపోయాడు ….. !!
మిర్రర్ లో చూసుకుంటూ ఏదో ఆలోచిస్తున్న శ్లోక కి మిర్రర్ లో తనకు బదులు రాజ్ రూపం కనిపిస్తూ ఉంటే….. !! వీడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని రాజ్ ను తిట్టుకుంటూ నా పర్మిషన్ లేకుండా నన్నే కిస్ చేస్తావా…. ?? నీకు నా గురించి సరిగ్గా తెలియదు రా అనవసరంగా నాతో పెట్టుకున్నావ్ ….. ?? నేనేంటో నీకు త్వరలోనే చూపిస్తా అని టెడ్డి బేర్ లో రాజ్ మొహాన్ని ఇమాజిన్ చేసుకుంటూ…. !!!తన కసి తీరా దాన్ని కొడుతూ & నలిపేస్తూ ఏంట్రా నిన్ను చూస్తే నేను 102 ఫీవర్ తెచ్చుకుని వనికిపోతానా …… ?? ఎదీ ఇప్పుడు రారా చూసుకుందాం నీకు దమ్ముంటే నా ఇంటికి రారా అని రాజ్ ను తిట్టుకుంటూ పిచ్చి చాలెంజెస్ చేస్తూ ఉంటుంది… !!
ఏంట్రా మాట్లాడావ్ నీకు దమ్ముంటే నువ్వు మగాడివి అయితే ఇప్పుడు రారా ఒక్క దెబ్బ కొడితే లేవడానికి 3 నెలల పడుతుంది…… !! ఆ వచ్చా ముందు ఎక్కడ కొడతావ్ లెఫ్ట్/ రైట్ ఆ….. ?? ఇదేంటి నిజంగా వీడి వాయిస్ వినిపిస్తుంది ఇమాజినేషన్ లో కూడా వాయిస్ వినిపిస్తుందా అని కంగారుగా వెనక్కి తిరిగి చూసిన శ్లోక …. !! తన ఎదురుగా కనిపిస్తున్న రాజ్ ను చూసి ఆ ఆ ఆ అంటూ భయం తో గట్టిగా అరవగానే తన వంటిని చుట్టుకున్న టవల్ ఆ కంగారులో ఊడి నేల మీద పడుతుంది అది చూసిన రాజ్….. ??
తరువాత ఎమ్ జరిగి ఉంటుందో గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి 😌
