ఆది మహాన్ ప్లాన్ అని తన మొహం లోని చిరునవ్వే చెప్పడం తో అప్పటి వరకు టెన్షన్ పడుతున్న శ్లోక కూడా నవ్వుతూ మహాన్ వైపు చూస్తూ ……. !! తన చూపును రాజ్ వైపు తిప్పి యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ వెళ్ళి మహాన్ పక్కన నుంచుంటుంది …… !!
అసలేం మాట్లాడుతున్నారు మీరు …….. ?? ఇంకో వన్ అవర్ లో కోర్ట్ లో మీ కేస్ ఉంది & విట్నెస్ గా మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయబోతుంటే ఇప్పుడు వచ్చి దానికి ఈ యాక్సిడెంట్ కి అసలు సంబంధమే లేదంటారు ఏంటి……. ?? అని రాజ్ వాళ్ళ ముగ్గురి వైపు సీరియస్ గా చూస్తూ ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా అంటూ సూటిగా చూస్తూ అడుగుతాడు….. !!
లే…. లేదు సర్ మమ్మల్ని ఎవరు బెదిరించలేదు …… !! ఒక మంచి అమ్మాయికి అన్యాయంగా శిక్ష పడడం ఇష్టం లేక ఇలా మేము చేసింది తప్పని తెలుసుకుని వెంటనే మీ కోసం వచ్చాం….. !! మమ్మల్ని క్షమించి మేడం ను వదిలేయండి సర్ మేడం చాలా మంచి వారు……. !! అంటూ శ్లోక వైపు చూస్తూ మమ్మల్ని క్షమించండి మేడం అంటూ ముగ్గురు రెండు చేతులతో నమస్కారం చేస్తారు…… !!
శ్లోక రాజ్ వైపు చూసి కన్నింగ్ గా నవ్వుతూ వాళ్ళ ముగ్గురి వైపు చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వచ్చి మీరు చేసిన పని వల్ల నేను వన్ డే మొత్తం సెల్ లో ఉన్నాను…… !! నాకు వచ్చే కోపానికి మీ ముగ్గురిని హైదరాబాద్ లో లేకుండా చేయగలను బట్ మీ ఫ్యూచర్ డెస్ట్రాయ్ చేయడం ఇష్టం లేక ఫర్గివ్ చేస్తున్నా…… !!
చాలా థాంక్స్ మేడం అంటున్న ముగ్గురి చంప పగల కొడతాడు రాజ్ …… !! అది చూసిన శ్లోక మహాన్ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుని రాజ్ వైపు మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని చూస్తుంటారు ……. !!
ఏంట్రా నాతోనే గేమ్స్ ఆడుతున్నారా …… ?? చంపేస్తాను ముగ్గురినీ హా…… !! నిన్నటి వరకు ఇది ( శ్లోక) యాక్సిడెంట్ చేసిందని చెప్పి ఇప్పుడు కరెక్ట్ గా దీనికి శిక్ష పడుతుంది అనే టైం కి వచ్చి యాక్సిడెంట్ చేసింది ఇది కాదు అంటారా….. ?? డు యూ థింక్ యాం ఐ ఫూల్…… ?? ఇది యాక్సిడెంట్ చేయకపోతే చేసింది అని ఎందుకు చెప్పారు….. ?? కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు & నన్ను కలవడానికి అన్ని అవర్స్ ఎందుకు వెయిట్ చేసారు అని సీరియస్ గా చూస్తూ అడుగుతాడు……. ??
సర్ చెప్తున్నాం కదా ఒకరికి తెలియకుండా ఒకరం కన్ఫ్యూస్ అయ్యి అలా కంప్లైంట్ చేశాం వుయ్ ఆర్ సారి ఫర్ దట్…… !!
వాట్….. ?? సారి ఆ…..!! చిన్న సారి చెప్పి ఎస్కేప్ అవ్వాలి అని చూస్తున్నారా……. ?? మీరు చేసింది చిన్న తప్పు కాదు వదిలేయడానికి ……. ?? నాకు ఈ డిస్కషన్ అనవసరం మర్యాదగా ఎమ్ జరిగిందో క్లియర్ గా చెప్పండి లేదా షూట్ చేసి పారేస్త ……. !? అంటూ పాకెట్ లోని గన్ తీసి గురి పెట్టగానే ముగ్గురు కంగారుగా ఒకరిని ఒకరు చూసుకుంటారు….. !!
మహాన్ ఇద్దరికీ మధ్యలో నిలబడి ఆ రివాల్వర్ లాక్కుని…… !! రాజ్ వైపు చూస్తూ బెదిరించి వీళ్ళతో శ్లోక నే యాక్సిడెంట్ చేసిందని చెప్పించి కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయాలి అని చూస్తే బాగోదు మిస్టర్ రాజ్……. ?? కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళే చెప్తున్నారు కదా శ్లోక ఇన్నోసెంట్ అని ఇంకెంట్రా నీ బాధ…… ?? మర్యాదగా నా చెల్లిని రిలీజ్ చేయండి లేదా మీడియా ను పిలిచి రచ్చ చేస్తా లేదా అనవసరంగా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని నా చెల్లిని ఈ కేస్ లోకి లాగావ్…… ?? అని కేస్ పెట్టి నీ స్టేషన్ లోనే నిన్ను బొక్క లోకి వేయిస్తా….. !?
ఏంట్రా నా స్టేషన్ లో నన్ను పెట్టేది నీకు నచ్చింది చేసుకో అంటూ మహాన్ చేతిలో నుండి రివాల్వర్ తీసుకుని చెప్పండ్రా ఇది యాక్సిడెంట్ చేయకపోతే మరి చేసింది ఎవరు….. ?? రాజ్ క్వశ్చన్ కి ముగ్గురికి వొళ్ళు చల్ల బడుతుంది హస్పిటల్ లో ఉండగానే మహాన్ రాజ్ పెట్టిన సెక్యూరిటీ కళ్ళు కప్పి ఎవరు చూడకుండా శ్లోక ను యాక్సిడెంట్ చేసిన అబ్బాయి రూమ్ కి వచ్చి డోర్ లాక్ చేస్తాడు….. !!
అప్పటికే ఆ రూమ్ లో ఆ అబ్బాయి తో పాటు సాక్షులుగా ఉన్న ఇద్దరు అబ్బాయిలు కూడా కోర్ట్ కి రెడీ అయి వచ్చి ఈ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటారు…… !! సడెన్ గా అక్కడికి వచ్చిన మహాన్ ను చూసి ఎవరు అన్నట్టు ముగ్గురూ తన వైపే చూడ్డం చూసిన మహాన్ సిట్……. !! అంటూ పైకి లేచి నుంచున్న అబ్బాయిలను కూర్చోమని చెప్పి ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుంటూ ముగ్గురి వైపు చూస్తాడు….. !!
ముగ్గురూ కూడా బిలో 20 ఇయర్స్ అని వాళ్ళను చూడగానే అర్థం చేసుకున్న మహాన్ మెల్లగా గొంతు సవరించుకుంటూ……. !! చూడండి అబ్బాయిలు నా పేరు మహాన్ నేనో బిజినెస్ మ్యాన్ & నా నేమ్ కూడా మీరు వినే ఉంటారు నేను ప్రతీ విషయాన్ని బిజినెస్ మైండ్ తోనే చూస్తాను….. !! నిన్ను హస్పిటల్ లో పోలీస్ కంప్లైంట్ లేకుండా జాయిన్ చేసుకోక పోతే సైన్ చేసి నీకు ట్రీట్మెంట్ ఇచ్చేలా చేసింది నేనే & నాకు అప్పుడు నువ్వు ఎవరో కూడా తెలియదు బట్ లేటర్ ఆన్ నాకు తెలిసింది నీకు యాక్సిడెంట్ అయ్యేలా చేసింది నా సిస్టర్ శ్లోక అని…… !!
అప్పటి వరకు మహాన్ వల్లే ఆ అబ్బాయి ప్రాణాలు దక్కాయి అని హ్యాపీగా ఫిల్ అవుతున్న ముగ్గురు చివరగా మహాన్ చెప్పింది విని ……. !? మహాన్ ఎందుకు వచ్చాడో వాళ్ళల్లో వాళ్ళు అంచనా వేస్తూ మహాన్ వైపు చూస్తుంటారు….. !? బేసిక్ గా నాకు నా చెల్లంటే చాలా ఇష్టం & నాకు ఉన్నది అది ఒక్కటే కాబట్టి శ్లోక ను నేను చెల్లి లా కాదు నా డాటర్ లా చూసుకుంటాను …… !!
ఇప్పుడు ప్రాబ్లెమ్ ఏంటంటే మీరు ఇచ్చిన కంప్లెయింట్ వల్ల నా చెల్లి జైల్ కి వెళ్ళే సిచుయేషన్ లో ఉంది….. !! తను జైల్ కి వెళ్తే మా మామ్ హర్ట్ అవుతుంది తను హార్ట్ అయితే నేను ఫీల్ అవుతాను అంటూ బ్యాక్ పాకెట్ లో ఉన్న తన లైసెన్స్ రివాల్వర్ తీసి టేబుల్ మీద పెడతాడు….. !!
రివాల్వర్ చూసిన ముగ్గురు అబ్బాయిలు టెన్షన్ గా చూస్తూ ఉంటే…… !! హేయ్ రిలాక్స్ అబ్బాయిలు అని నవ్వుతూ నేను మిమ్మల్ని ఎమ్ చేయను ఎందుకంటే మీకు బోల్డంత ఫ్యూచర్ ఉంది దాన్ని నాకు స్పాయిల్ చేయాలి అని అసలు లేదు….. !! పైగా మీరు నేను చెప్పినట్టు చేస్తే మీ స్టడీస్ అయ్యాక నా కంపెనీ లోనే 1 లాక్ సాలరీ తో జాబ్ & ప్రెసెంట్ మీ ఒక్కొక్కరికి 10 లాక్స్ అమౌంట్ కూడా ఇస్తాను….. !!
నేను ఇచ్చిన ఆఫర్ కాదని మీరు జరిగింది చెప్తే మాత్రం నా దగ్గర బందీగా ఉన్న మీ పేరెంట్స్ మాత్రం మీ కంటికి ఎప్పుడూ కనిపించరు….. !! ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు నేను చెప్పినట్టు చేస్తే మీ ఫ్యూచర్ బావుంటుంది సో ఆలోచించుకోండి అనగానే….. !! ముగ్గురూ కూడా పేరెంట్స్ & జాబ్ కి ఆశ పడి మహాన్ చెప్పిన ప్లాన్ ప్రకారమే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చారు….. !!
అడుగుతుంటే దిక్కులు చూస్తారేంటి…… ?? యాక్సిడెంట్ చేసింది ఎవరు అని మరో సారి గట్టిగా అరిచిన రాజ్ వాయిస్ కి ముగ్గురు భయపడుతూ అది….. అదీ….. అని నీళ్లు నములుతూ ఉండగా స్టేషన్ లోకి సర్ అంటూ ఎవరో రావడం చూసి అందరూ అటు వైపు చూస్తారు…… !!
కొత్తగా అక్కడికి వచ్చిన వ్యక్తి నేరుగా రాజ్ ముందుకు వచ్చి నుంచుంటూ సర్ మీరు వెతుకుతున్న పర్సన్ ని నేనే నా పేరు కాశి ….. !?
ఎవరయ్యా నువ్వు…… ?? ఇక్కడ సీరియస్ గా కేస్ గురించి నేను మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెవరు…… ?? వెళ్ళి కాసేపు వెయిట్ చెయ్ ఇది అయ్యాక నీ కేస్ ఏంటో చూస్తా అంటూ విసుగ్గా తన క్యాప్ తీస్తూ చెప్తాడు….. !!
మీరు మాట్లాడుతున్న కేస్ లో మెయిన్ కల్ప్రిట్ నేనే సర్ ఆ యాక్సిడెంట్ చేసింది కూడా నేనే & ఇప్పుడు నేను బయటకు రావడానికి రీసన్ ఆ రోజు బయపడి నేను బయటకు రాలేదు….. !! బట్ నేను చేసిన యాక్సిడెంట్ ఇంత పెద్ద ఇష్యూ అయిందని & నా వల్ల ఒక అమ్మాయి జైల్ కి వెళ్ళడం ఇష్టం లేక ధైర్యం చేసి ఇలా మీ ముందుకు వచ్చాను ……. !! నేను చేసింది తప్పే నన్ను అరెస్ట్ చేయండి సర్…… !!
కాశి చెప్పింది విన్న శ్లోక నవ్వుతూ ఆనందంగా మహాన్ వైపు చూస్తే నువ్వు నా బాధ్యత నిన్ను ఎలా అయినా ఈ అన్నయ్య సేవ్ చేస్తాడు ……. !! అన్నట్టు ఉన్న మహాన్ చూపుకు శ్లోక మనసులోనే మహాన్ గురించి తప్పుగా అనుకున్నందుకు సారి చెప్పుకుంటుంది …… !!
రాజ్ కి కాశి చెప్పింది విని ఇది పక్కాగా మహాన్ ప్లాన్ అని వెంటనే అర్థం అవుతుంది…… !! ఓహ్ అయితే పక్కాగా ప్లాన్ చేసుకునే దీన్నీ సేవ్ చేయడానికి పెద్ద ప్లాన్ తోనే వచ్చావ్ అనమాట గుడ్ .!! గుడ్. !! అని నుంచున్న ఇద్దరు అబ్బాయిలను & వీల్ చైర్ లో ఉన్న యాక్సిడెంట్ అబ్బాయిని చూస్తూ మీ ముందు నేనుంటాను …… !! అని చెప్పాక కూడా వీడికి భయపడి నన్ను ఇవాళ అందరిలోనూ దోషిలా నుంచునేలా చేసారు అనగానే ఆ అబ్బాయిలు గిల్ట్ ఫీలింగ్ తో తల వంచుకుంటారు …. !!
లుక్ మిస్టర్ స్వరాజ్ నువ్వు వాళ్ళను ఎంతలా మానిపులేట్ చేయాలి అనుకున్నా నో యూస్ ఎందుకంటే విజయం మా వైపే ఉంది ……. !! ఎప్పటికైనా గెలిచేది నేనే నా ముందు నువ్వు ఎప్పుడు ఇదిగో ఇలా హెడ్ డౌన్ చేసే నుంచోవాలి అనగానే…… !! శ్లోక నవ్వుతూ వాహ్ సూపర్ గా చెప్పావ్ అన్నయ్య అంటూ చెప్పరా రాజ్ ఇప్పుడేం చేస్తావ్ నన్ను ఏదో జైల్ కి పంపిస్తా నా ఎంటైర్ లైఫ్ ఇక అక్కడే అన్నట్టు బిల్డప్ ఇచ్చావ్ ఇప్పుడేం చేస్తావ్ హా….. ??
ఇంకేం చేస్తాడు శ్లోక రెండు చేతులు కట్టుకుని సారి సర్ అని మనకు చెప్పి పంపించడం తప్పా అంటూ అన్నా చెల్లెళ్ళు నవ్వుకోవడం చూసి స్టేషన్ లోని అందరూ రాజ్ మొహం లోని కోపాన్ని చూసి భయపడుతూ ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అని కంగారుగా ఒకరిని ఒకరు చూసుకుంటారు…… !!
రాజ్ తన ముందున్న కాశి వైపు చూసి చూడు నీ మంచి కోసమే చెప్తున్నా మర్యాదగా నిజం చెప్పు….. !! వాడు చెప్పాడని అనవసరంగా కేస్ నీ మీదకు వేసుకున్నావో లైఫ్ లాంగ్ జైల్ లో ఊచలు లెక్కబెట్టేలా చేస్తాను కాబట్టి అనవసరంగా నాకు కోపం తెప్పించకుండా వాడు నీకేం చెప్పి ఒప్పించాడో చెప్పు….. ??
నాకు మహాన్ సర్ కి పరిచయం కూడా లేదు సర్ ఆయన గురించి ఆర్టికల్స్ లో చదవడం తప్పా డైరెక్ట్ గా ఎప్పుడు కలవలేదు….. !! అలాంటి వ్యక్తి చెప్తే అనవసరంగా నేను ఎందుకు కేస్ లో ఇరుక్కుంటాను చెప్పండి నిజంగా ఈ యాక్సిడెంట్ నా వల్లే జరిగింది & నేనే చేశాను అంటూ స్థిరంగా చెప్తాడు కాశి….. !!
మహాన్ నవ్వుతూ రేయ్ నువ్వు ఎన్ని సార్లు అడిగినా నిజం నిప్పులాంటిది కాబట్టి ఇదే అన్సర్ రిపీట్ అవుతుంది….. !! నువ్వు అన్నీ మూసుకుని నువ్వు చేసిన రచ్చ వల్ల పోయిన మా పరువు మాకు దక్కాలంటే నాకు నా చెల్లికి సారీ చెప్పు….. !! లేకపోతే ఈ ఇష్యూ ను నేను అంత ఈజీగా వదలను అంటూ కోపంగా చెప్తాడు మహాన్…… !!
ఈ యాక్సిడెంట్ చేసింది శ్లోక నే బట్ దానికి ప్రూవ్స్ లేకుండా చేసి దాన్ని కాపాడుకున్నావ్ …… !! నేను దీన్ని ఎస్కేప్ చేయిస్తావ్ అని దీనికి కాపలాగా ఉంటే నువ్వు ఇంకో దారిలో వెళ్ళి దాన్ని సేవ్ చేస్తావ్ ……. ?? అని ఎక్స్పెక్ట్ చేసుంటే వీళ్ళ ముగ్గురిని నా అండర్ లోనే పెట్టుకునే వాడిని ఐ డిడ్ ఏ మిస్టేక్ అంటూ సీరియస్ గా చెప్తున్న రాజ్ ను మహాన్ పొగరుగా నవ్వుతాడు….. !!
నీ పోలీస్ బ్రెయిన్ తో అక్కడి దాకా ఆలోచించావ్ బట్ నాది బిజినెస్ బ్రెయిన్ సో చిన్న లూప్ హోల్ దొరికినా చాలు దాన్ని ఎలా టర్న్ చేయాలో నాకు బాగా తెలుసు…… !! ఆ విషయం నీకు ఇప్పుడు బాగా అర్థం అయింది అనుకుంటా 😏….. !! నీ చెల్లిని అడ్డు పెట్టుకుని నేను మీ అందరితో ఆడుకుంటున్నా అని నువ్వు కూడా నా చెల్లిని అడ్డు పెట్టుకోవాలి అనుకున్నావ్ కదా పాపం ……. !!
కానీ ఏం చేస్తాం నీ ప్లాన్ ఇలా అట్టర్ ఫ్లాప్ అయింది …… ?? నీ చెల్లి అంత అమాయకురాలు కాదు రా నా చెల్లి శ్లోక & అక్కడుంది ఈ మహాన్ చెల్లి …… !! దాన్ని నమ్మించడం అంత ఈజీ కాదు & అక్కడ నీ చెల్లి నన్ను ప్రేమించింది బట్ నా చెల్లి ఎప్పటికీ నీ వైపు కూడా చూడదు ….. !! ఇంకో సారి నా చెల్లి జోలికి వచ్చావో చీమ ను నలిపినట్టు నలిపేస్తా చెప్పరా సారి అనగానే రాజ్ కోపంగా మహాన్ కాలర్ పట్టుకుని తన వైపు వేడి సెగలు వదులుతూ చూస్తుంటే మహాన్ కూడా తక్కువ కాదు అన్నట్టు రాజ్ కాలర్ పట్టుకుంటాడు…… !!
✨✨✨✨✨✨✨✨✨✨
భూమి తన రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసి మొబైల్ తీసుకుని లేట్ చేయకుండా వెంటనే కార్తికేయ నంబర్ కి డయల్ చేస్తుంది….. !! అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటి నుండి ఆఫీస్ కి స్టార్ట్ ఆయన కార్తికేయ కి భూమి నుండి కాల్ రాగానే అరే చిట్టి తల్లీ అంటూ నవ్వుతూ కాల్ ఆన్సర్ చేస్తాడు….. !!
భూమి ఎలా ఉన్నావ్ రా…… ?? ఇందాకే అనుకుంటున్నా నిన్నటి నుండి నువ్వు ఒక్క కాల్ కూడా చేయలేదు అక్కడంతా బానే ఉందా అని ఈ లోగా నువ్వు కాల్ చేసావ్….. ?? బ్రేక్ఫాస్ట్ చేసావా చిట్టి తల్లీ అంటూ ఆప్యాయంగా అడుగుతున్న కార్తికేయ వాయిస్ విన్న భూమి తన కంగారు తగ్గించుకుంటూ…… !! బావున్నాను మావయ్య నువ్వెలా ఉన్నావ్…… ?? బిజీగా ఉన్నావా డిస్టర్బ్ చేయలేదు కదా….. ??
నువ్వు నన్ను డిస్టర్బ్ చేయడం ఏంట్రా తల్లీ అలాంటిదేం లేదు….. !! ఇదిగో ఆఫీస్ కి వెళ్తున్నా అవును నీ వాయిస్ ఏంటి అంత లోగా వస్తుంది నువ్వింకా తినలేదా…… ?? హెల్త్ బానే ఉంది కదా.!!!
ఆ…. !! నేను బావున్నా మావయ్యా నువ్వు నాకొక హెల్ప్ చేయాలి మావయ్య ప్లీస్..!! ఈ విషయం లో అన్నయ్య ఎవరి మాట వినడు ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క హాప్ నువ్వే మావయ్య ..!!
ఏమైంది చిట్టి తల్లీ ఎవరైనా ఏమైనా అన్నారా….. ?? కంగారు పడకుండా ఎమ్ జరిగిందో క్లియర్ గా చెప్పు….!!
అన్నయ్య శ్లోక ఎవరినో యాక్సిడెంట్ చేసిందని అరెస్ట్ చేసి తన స్టేషన్ లోనే నిన్నటి నుంచి సెల్ లో ఉంచాడు మావయ్య….. !! ఇవాళ తనను కోర్ట్ లో ప్రొడ్యూస్ చేస్తాడట & అన్నయ్య ను ఏలా అయినా ఆపాలి అని మహాన్ కోపంగా స్టేషన్ కి వెళ్ళాడు….. !! వీళ్లిద్దరూ కలిశారు అంటే కచ్చితంగా పెద్ద గొడవే జరుగుతూ ఉంటుంది….. !! అత్తయ్య కి హెల్త్ బాలేదు కాబట్టి తను స్టేషన్ కి వెళ్లలేదు…… !! విజయేంద్ర తాతయ్య వస్తాను అన్నా మహాన్ వద్దు అని ఒక్కటే వెళ్ళాడు అక్కడేం జరుగుతుందో ఏంటో అని నాకు చాలా టెన్షన్ గా ఉంది…… !!
వాట్ శ్లోక ను అరెస్ట్ చేసాడా…… ?? నాకు ఈ విషయం నిన్న కాల్ చేసి చెప్పాల్సింది కదా భూమి….. !! సరే సరే టెన్షన్ పడకు నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నా & శ్లోక తప్పుంటే మాత్రం నేను కూడా రాజ్ ను ఆపను అని చెప్పి కార్తికేయ కాల్ కట్ చేయడం చూసి భూమి తల బాదుకుంటూ అందరూ ఒక్కటే…… !! ఛా ఇప్పుడు శ్లోక ను సేవ్ చేసేది ఎవరు….. ?? మావయ్య స్టేషన్ కి వెళ్ళి శ్లోక చేసింది తప్పని రాజ్ కి సపోర్ట్ చేస్తే మహాన్, శ్లోక లకు మరింత దూరం అవుతాడు…… ?? నేను అనవసరంగా మావయ్య కి కాల్ చేసాను అనిపిస్తుంది అంటూ భూమి రక రకాలుగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది……. !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
రాజ్ & మహాన్ ఒకరిని ఒకరు కాలర్ పట్టుకుని కోపంగా చూసుకుంటూ ఉండగానే అక్కడికి వస్తాడు కార్తికేయ….. !! తన ఫాదర్ ను అక్కడ చూసిన శ్లోక మొహం లో తెలియని ఆనందం కళ్ళల్లో మెరుపు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది….. !! కార్తికేయ వస్తూ వస్తూ వాడిపోయిన శ్లోక మొహం & బాగా ఏడవడం వల్ల తన బుగ్గల మీద క్లియర్ గా కనిపిస్తున్న కన్నీటి చారికలు చూసి కార్తికేయ అడుగులు నెమ్మదిస్తాయి….. !!
డాడ్ అంటూ అప్రయత్నంగా శ్లోక నోటి నుంచి వచ్చిన పిలుపు కార్తికేయ గుండెకు తాకుతుంది…… !! కానీ శ్లోక కి నందన కార్తికేయ గురించి చెప్పినవి గుర్తు రాగానే అప్పటి వరకు కార్తికేయ వైపు ప్రేమగా చూసిన తను ఇప్పుడు కోపంగా చూస్తూ మొహం తిప్పుకుంటుంది అది చూసిన కార్తికేయ మనసు చివుక్కుమంటుంది ….. !!
కార్తికేయ శ్లోక వైపు చూస్తూనే మహాన్ & రాజ్ చూపులతో కత్తులు విసురుకుంటున్న ఇద్దరినీ దూరంగా జరిపి ఎమ్ జరుగుతుంది రాజ్…… ?? స్టేషన్ అనుకుంటున్నారా మీ ఇల్లు అనుకున్నారా అంటూ సీరియస్ గా అవగానే మహాన్ రాజ్ వైపు కోపంగా చూస్తు నలిగిన తన బ్లేజర్ సరి చేసుకుంటే రాజ్ కూడా కోపంగా చూస్తూ చూపు తిప్పేస్తాడు….. !!
రావయ్యా పెద్ద మనిషి రా కరెక్ట్ టైమ్ కి వచ్చావ్ నీకు నీ కడుపున పుట్టిన పిల్లలు ఎలాగో అవసరం లేదు కనీసం నీ చెల్లి పిల్లలను కూడా పెంచడం రాదా అంటూ కార్తికేయ వెనుకే లోపలికి వస్తూ అడుగుతాడు విజయేంద్ర ప్రసాద్…… !! ఆయనను చూసి శ్లోక ఏడుస్తూ వెళ్ళి తాతయ్య అని హగ్ చేసుకోగానే ఇది దీని యాక్షన్ అని శ్లోక వైపు పళ్ళు నూరుతూ చూస్తూ…… !! మీరేం మా మావయ్య కి బెస్ట్ పేరెంట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన మమ్మల్ని మంచిగా పెంచాడు కాబట్టే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను….. !!
అసలు మీరందరూ నా స్టేషన్ కి నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చారు….. ?? ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ అంటున్న రాజ్ ను చూసి విజయేంద్ర ప్రసాద్ సీరియస్ గా చూస్తూ నా మనవరాలి తప్పు లేకుండా తనను ఎందుకు అరెస్ట్ చేసావ్…… ?? మర్యాదగా శ్లోక కాళ్ళు పట్టుకుని సారి చెప్పు లేదా నిన్ను ఈ క్షణమే జాబ్ నుండి తీయించేస్తాను ……. !! అనగానే రాజ్ కోపంగా శ్లోక కాళ్ళ దగ్గర తగిలి తగలనట్టు షూట్ చేయగానే ఆ…… డాడీ అంటూ శ్లోక వెళ్ళి భయం తో కార్తికేయ గుండెల్లో గువ్వ పిట్ట లా ఒదిగిపోయి డాడ్ భయంగా ఉంది…… !! అని ఎడవడం చూసి రాజ్ నవ్వితే మహాన్, విజయేంద్ర ప్రసాద్ కోపంగా చూస్తూ ఉంటారు….. !! కార్తికేయ మాత్రం కూతురిని మొదటి సారి దగ్గరకు తీసుకుని భయపడకు తల్లీ నేనున్నా కదా అంటూ ప్రేమగా తల నిమురుతూ ఉంటే శ్లోక నీళ్ళు నిండిన కన్నులతో తల పైకి ఎత్తి తన తండ్రి వైపు చూస్తుంది…… !!