ఏమాయ చేశావే-2

ఆర్యన్, అన్విక ఇద్దరు గుమ్మం దగ్గర ఆగగానే మోనిష హారతి ఇస్తుంది ఇద్దరికీ కలిపి …. తర్వాత ఇద్దరు కుడి కాలు లోపలికి పెట్టీ వెళ్తూ వుండగా !!!!!

మోనిష:: అరే ఆగండి అలా ఎలా లోపలికి వస్తారు

 

ఆర్యన్:: ఇంకెలా రావాలి వదిన

 

మోనిష:: అబ్బా !!!! ఆర్య  బలే యాక్ట్ చేస్తున్నావ్ నా పెళ్లి లో నువ్వు అన్వి చేసిన అల్లరి నేనేమీ మర్చిపోలేదు ……

ఇద్దరు ఒకరి పేర్లు మరొకరు చెప్పి లోపలికి రావాలి

అన్విక:: కు అస్సలు ఏడుపు ఆగడం లేదు అతి కష్టం మీద ఓర్చుకుంటూ ఉంది

 

ఆర్యన్:: అన్విక బుజం చుట్టూ చేతులు వేసి నేను నా భార్య అన్విక కలిసి వచ్చాం

 

రచన:; అరే బచ్చా సూపర్ గా చెప్పావ్ నాన్న

 

ఆర్యన్:: థాంక్స్  మామ్ …….

 

సురేష్:: అరే అందరు ఒకటి అయి నా బంగారం ను వేరు చేస్తారా!!!!!!

నేను మాత్రం నా కోడలు పార్టీ నువ్వు చెప్పు అన్విక మనం ఎందుకో ఓడిపోకుడదు

దిస్ ఈజ్ అవర్ ప్రెస్టేజ్ ఇష్యూ కమాన్ అన్విక  చెప్పే

 

సంతోష్:: చెప్పరా మమ్ము

 

అభి:; అరే  మర్థల్ సిగ్గు పడింది చాలు గానీ చెప్పు

 

అన్విక:: అంజలి, సంతోష్  వైపు చూస్తుంది

 

అంజలి, సంతోష్ :: చాలా సంతోషంగా కనిపిస్తున్నారు

 

అన్విక:: డీప్ బ్రిత్ తీసుకుని మొహం లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నేను ఆది అని అంటూ వుండగా

 

ప్రియ:: వెనుక నుంచి అన్వి బుజం మీద చేయి వెయ్యగానే

 

అన్విక:: తను ఏమ్ చెప్తుందో అర్తం చేసుకుని కళ్ళల్లో నీళ్ళని బయటకు రాకుండా ఆపేసి

మనసులో బాధను తన మొహం లో కనిపించకుండా ఫేస్ లో స్మైల్ క్యారీ చేస్తూ ……… నేను ఆర్యన్ కలిసి వచ్చాం అని చెప్తుంది

 

అవినాష్:: ఆర్యన్ ఆ ఆర్యన్ అంటే ఎవరు అన్విక నీ ఫైండ్ ఆ లవర్ ఆ లేక బందువా 🤔🤔

 

మోనిష:: ఆబ్బ!!!! అన్వి నేను మా ఆయన వచ్చాం అని చెప్పే రా

 

అన్విక:: నేను మా ఆయన ఆర్యన్ వర్మ కలిసి వచ్చాం !!!!!

 

ఆర్యన్:: 😁😁 చూస్తూ ఉన్నాడు

 

రచన:: నా బంగారం ఎంత బాగా చెప్పావు

 

అన్విక:: చిన్నగా నవ్వి ఊరుకుంది

 

ఆర్యన్:: ఇప్పటికీ అయిన లోపలికి రావచ్చా

 

శిశిర్:: అలా కాదు బావ నా చెల్లిని ఎత్తుకుని లోపలికి రా అంతే (ఆర్య బెస్ట్ ఫ్రెండ్స్ శిశిర్, జతిన్)

 

ఆర్యన్:: సరే అని అన్విక ను ఎత్తుకుని లోపలికి వస్తాడు

 

అన్విక:: షాక్ అవుతుంది అలాగే చూస్తూ ఉంది !!!!!!

 

ఆర్యన్:: అన్వి ను చూసి కన్ను కొట్టి కిందకు దించు తాడు

 

అన్విక:: సైలెంట్ గా తల వంచుకుని వుంటుంది

 

ఆర్యన్:: అన్వి ను చూసి నవ్వుతాడు

 

రచన:: అన్వి  వెళ్లి దేవుడి ముందు దీపం వెలిగించు బంగారం మినిష చెల్లి తో వెలిగించు

 

మోనిష:: అలాగే అత్తమ్మ అన్వి రా

 

అన్విక:: దేవుడి ముందు దీపం వెలిగించి దేవుడికి
దండం పెట్టుకుని హారతి ఇస్తుంది

తర్వాత ఇద్దరు బయటకు రాగానే అన్విక  ను రెస్ట్ తీసుకో అని చెప్పగానే

 

ఆర్యన్:; పదా అన్వి వెళ్లి రెస్ట్ తీసుకుందాం అని అంటాడు

 

జతిన్:: అరే బావ నువ్వు  ఆగు అన్విక నువ్వు వెల్లు అనగానే

 

నందు:: అన్వి  పదా రెస్ట్ తీసుకుందువు ఈవెనింగ్ రిసెప్షన్ వుంది

 

అన్విక:: సైలెంట్ గా నందు, ప్రియ తో పాటు తన రూమ్ కి వెళ్ళి పోయింది

 

ఆర్యన్:: రేయ్ ఏంట్రా ఇది

 

రచన:: అరే బచ్చా మీరు ముహూర్తం అయ్యేవరకు విడిగా వుండాలి నాన్న

 

ఆర్యన్:: అది కాదు మామ్

 

సురేష్:: ఆర్యన్ రేపు సాయంత్రం మీ ముహూర్తం ఓకే ఇక వెళ్లి రెస్ట్ తీసుకో

 

ఆర్యన్:: ఓకే డాడ్ అని జతిన్, శిశిర్ తో పాటు తన రూమ్ కి వెళ్ళి పోయాడు

 

రచన:: నవ్వుతుంది

 

అంజలి:;  మనసులో  ఐ యాం సారీ అన్వి నాకు తెలుసు నువ్వు ఎంత బాధ పడుతున్నావు కానీ !!!!!!

నీ సంతోషం కోసం నిన్ను ఇప్పుడు బాధ పెడుతున్నా కానీ నువ్వు ఆర్య తో త్వరలో హ్యాపీగా వుంటావు !!!!!!!

ఆ నమ్మకం నాకు వుంది నువ్వు నీ గతాన్ని తలచుకుంటూ నీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ వుంటే నేను చూస్తూ ఉండలేను!!!!!

ఆర్య నిన్ను మార్చుకుంటారు తన ప్రేమతో నిన్ను మామూలు గా  చేస్తాడు మీరు హ్యాపీగా వుంటారు అని అనుకుంటూ వుంటుంది

 

రచన:; అంజలి ఏమైంది అప్పటి నుండి పిలుస్తున్నా పలకడం లేదు ఏమ్ ఆలోచిస్తూ వున్నావ్

 

అంజలి:: ఆలోచనల నుంచి బయట పడి అదేం లేదు రచన వాళ్ళ ఇద్దరిని అలా చూస్తూ వుంటే చాలా సంతోషంగా ఉంది

 

 

రచన:: అవును అంజు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు !!!!!

 

 

అంజలి:; రచన నికో మాట చెప్తాను ఏమ్ అనుకోకు !!!!

 

రచన:: ఏంటి అంజు చెప్పు

అంజలి:; రచన చేయిని తన చేతిలోకి తీసుకుని రచన అన్వి ఎదైన తెలియక తప్పు చేసిన ఎం అనకు చాలా గారాబంగా పెంచాం దాన్ని

 

రచన:: నవ్వి అంజు !!!!!  నువ్వు  మరీ ఇంతగా చెప్పాలా చెప్పు నాకు వున్నది ఇద్దరూ అబ్బాయిలే

నాకు అమ్మాయిలు లేరు నా కొడల్లే నాకు కూతుర్లు !!!!

నువు వాళ్ళ గురించి టెన్షన్ పడకు సరేనా అని పదా ఈవెనింగ్ రిసెప్షన్ కి శారీస్ సెలెక్ట్ చేశాం గా వాటిని అన్వి, మోని కి ఇద్దాం

 

అంజలి:: సరే అని చెప్పి ఇద్దరు వెళ్లి పోతారు

 

సురేష్, సంతోష్ ఇద్దరు ఈవెంట్ మేనేజర్ తో ఈవెనింగ్ రిసెప్షన్ గురించి మాట్లాడుతూ వున్నారు!!!!!

తర్వాత ఎవరి రూమ్స్ కు వాళ్ళు వెళ్లి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు….. ఈవెనింగ్ అందరు రెడీ అయి ఫంక్షన్ హాల్ కి వెళ్తారు!!!……

రిసెప్షన్ కి వచ్చిన గెస్ట్ లను రిసీవ్ చేసుకోడం లో బిజీగా ఉన్నారు సురేష్, రచన……

సంతోష్, అంజలి  వచ్చిన వాళ్ళను వెల్కమ్ చేస్తూ ఉన్నారు!!!!

స్టేజ్ ను అద్భుతంగా అందంగా అలంకరించారు అక్కడ ఆర్యన్, అన్విక నిల్చుని వున్నారు!!!!

వచ్చిన వాళ్ళను ఆర్యన్ అన్విక కు పరిచయం చేస్తూ వున్నాడు!!!!

అన్విక అందరికీ నవ్వుతూ నమస్కారం చెప్తూ ఉంది….. అన్విక కు అస్సలు నచ్చడం లేదు కానీ అంజలి, సంతోష్ కోసం నవ్వుతూ నటిస్తూ ఉంది

 

శిశిర్:: కంగ్రాట్స్ రా బావ అండ్ కంగ్రాట్స్ సిస్టర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్

 

ఆర్యన్:: హగ్ చేసుకుని థాంక్స్ రా బావ !!!!

 

అన్విక:: చిన్నగా నవ్వి ఊరుకుంది

 

జతిన్:: కంగ్రాట్స్ బోథ్ ఆఫ్ యూ అండ్ హాపీ మ్యారీడ్ లైఫ్

 

ఆర్యన్, అన్విక:; థాంక్స్ అని అంటారు

 

ప్రియ:: కాస్త నవ్వు అన్వి అని మెల్లగ చెవిలో చెప్తుంది

 

అన్విక:: వచ్చే కన్నీళ్లను తుడుచుకుని నవ్వుతుంది

 

తర్వాత చాలా గ్రాండ్ గా జరుగుతుంది రిసెప్షన్…… మీడియా మొత్తం కవర్ చేస్తూ వుంది!!!!!

అలా అలా !!!! రిసెప్షన్ చాలా బాగా జరుగుతుంది….. తర్వాత అందరు ఇంటికి వెళ్లి పడుకుంది పోతారు…..

నెక్స్ట్ డే  అందరు లేచి హాల్ లో కూర్చుని మాట్లాడుతూ వున్నారు ….. సురేష్, సంతోష్, అభి అఫీస్ కు వెళ్ళిపోయారు!!!!

అంజలి, రచన కూర్చుని మాట్లాడుతూ వున్నారు అపుడే సులోచన ( అభి బామ్మ) సాయంత్రం ముహూర్తానికి ఏర్పాట్లు గురించి చెప్తూ వుంది వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుతూ వున్నారు!!!!!

మోనిష ఫ్రెష్ అయి దెవాన్ష్ ను తీసుకుని అన్విక రూమ్ దగ్గరకి వెళ్లి డోర్ నాక్ చేస్తుంది

 

అన్విక:: ఫోన్ లో ఫొటోస్ ను చూసి నైట్  నుండి నిద్ర కూడా పోకుండా ఏడుస్తూ ఉంది

ఎందుకు ఆదిత్య నన్ను ఇలా వంటరిగా వదిలి వెళ్ళిపోయావ్!!!!

వై ఆది వై నువ్వు లేకుండా నేను ఎలా వుంటాను అని అనుకున్నావు !!!!!

ఈ బంధాన్ని నేను మోయలేక పోతున్నాను నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు!!!!!

నేను ఈ మ్యారేజ్ చేసుకుంది కేవలం మామ్ డాడ్ కోసం వాళ్ళ సంతోషం కోసం మాత్రమే!!!!!

నన్ను నీకు దూరం చేసి ఆ దేవుడు చాలా తప్పు చేసాడు ఆది అందుకే ఆ దేవుడు నాకు నచ్చడు😠😠!!!!!

కేవలం అత్తమ్మ వాళ్ళ కోసమే దీపం వెలిగించ మళ్లీ ఆ గది లో అడుగు పెట్టను ఆది ఐ లవ్ యూ ఆది లవ్ యూ సో మచ్😭😭!!!!

నిన్ను మర్చిపోయి ఆర్య తో జీవితం పంచుకోవడానికి నేను సిద్దంగా లేను!!!!

అందుకే ఆర్య తో చెప్తాను ఇవాళే నా వల్ల ఆర్య కూడా బాధ పడాలి కానీ తప్పడం లేదు ఆది 😭😭!!!

ఇలా ఆదిత్య ఫొటోస్ చూసి బాధపడుతూ ఉంది అపుడే మోనిష డోర్ నాక్ చేయడం తో!!!

ఫోన్  ఆఫ్ చేసి తన కన్నీళ్లు తుడుచుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది

 

మోనిష:: అన్వి లేచావా వెల్లు వెళ్లి ఫ్రెష్ అవ్వు

 

అన్విక:: మోనిష ను హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది మోనీ నా వల్ల కావట్లేదు

 

మోనిష:; అన్వి ప్లీజ్ ఎడవకు ఎవరైనా చూస్తే బాగోదు ముందు నువ్వు కూర్చో అని డోర్ లాక్ చేసి ఇద్దరు బెడ్ మీద కూర్చుంటారు

 

అన్విక:: ఏడుస్తూ ఉంది ఫోన్ తీసుకుని

 

మోనిష:: అన్వి ఏమ్ చేస్తున్నావో నీకైనా అర్థం అవుతోందా ఎందుకే ఇలా చేస్తున్నావ్

నువ్వు బాధ పడి మమ్మల్ని బాధ పడుతూ వున్నావ్ !!!!

చూడు అన్వి ఆర్య చాలా మంచోడు నీ గతం మర్చిపో నీ ముందు వున్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొ !!!!

ఆదిత్య నీ గతం అది అయిపోయింది కానీ ఆర్య నీ భవిష్యత్తు తనతోనే నువ్వు లైఫ్ లాంగ్ వుండాలి

ఆర్యన్ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమిస్తున్నాడు తనతోనే నీ జీవితం

వెల్లు వెళ్లి ఫ్రెష్ అయి రా పో అలాగే కొద్ది రోజుల వరకు శారీస్ కట్టుకో

 

ఆర్యన్:: మోనీ 😭😭

 

మోనిష:: తనను గట్టిగా హత్తుకుని ఓదారుస్తూ వుంది

 

అన్విక:: కాసేపటికి నార్మల్ అవుతుంది తర్వాత  ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది

 

మోనిష:: దేవుడా దీని మనసు నుండి త్వరగా ఆదిత్య ను తీసేసి ఆర్యన్ ను ప్రేమించే లా చూడు స్వామి ప్లీస్ !!!!

ఇలా ఆలోచిస్తూ వుండగా దేవాన్ష్ ఏడుస్తాడు వాడిని ఎత్తుకుని నవ్విస్తూ వుంటుంది

మన బుడ్డోడు వాళ్ళ అమ్మ మీద చుచ్చు పోసేసాడు ( 🙆🙆 అయ్యయ్యో పాపం మోనిష కొత్త సారీ మొత్తం పాడైంది 😁😁)

మోనిష:: అబ్బా !!! ఏంటి అన్షు ఇది  మీ డాడ్ ఎంత ప్రేమగా తెచ్చారు తెలుసా ఈ సారీ

చా!!!! అనుకుని వాడిని తీసుకుని వాళ్ళ రూమ్ కి వెళ్ళి పోతుంది ఫ్రెష్ అవ్వడానికి

 

మన ఆర్యన్ అపుడే రూమ్ నుండి బయటకు వస్తూ నైట్ నుండి అన్వి ను చూడలేదు అని !!!!!

మోనిష రూమ్ నుండి బయటకు వెళ్ళడం చూసి తను వెళ్ళగానే మెల్లగ రూమ్ లోకి వెళ్తాడు!!!!!

రూమ్ మొత్తం చూస్తూ ఉన్నాడు అన్వి బేబీ ఎక్కడ వున్నావ్ అని చూస్తూ ఉన్నాడు!!!!!!

అపుడే అన్వి వాష్ రూమ్ నుండి బయటకు రావడం చూసి తనకు కనిపించకుండా దాక్కుంటాడు!!!!

అన్విక:: బయటకు వచ్చి సారీ కట్టుకుంటూ వుంటుంది

 

ఆర్యన్:: 🙆🙆 బాబోయ్ ఏంటి ఇది ఇలా వుంది అమ్మో చూడకూడదు

ఆ అయిన నా పెళ్ళాం కదా 🤔🤔 చూస్తే తప్పు లేదు లే అని చూస్తూ ఉన్నాడు

అబ్బబ్బా!!!!  ఎమ్ వుంది రా బాబు ఆ నడుము ….. నుడుమ పక్కన చిన్న పుట్టు మచ్చ

అన్విక  సారీ కట్టుకుని తల తుడుచుకుంటూ వుంటుంది అపుడు తన నడుము కనిపిస్తూ ఉంటుంది

 

ఆర్యన్:: దేవుడా ఇంకా ఇక్కడే వుంటే కంట్రోల్ తప్పేలా వున్నా అని బ్యాక్ సైడ్ డోర్ నుండి వెళ్ళిపోయాడు

అన్విక కూడా రెడీ అయి కిందకు వెళ్తుంది…. అక్కడ రచన, అంజలి, మోనిష, ఆర్యన్, అన్షు కూర్చుని వుంటారు

 

రచన:: గుడ్ మార్నింగ్ అన్వి బంగారం

 

అన్విక:: గుడ్ మార్నింగ్ అత్తమ్మ అండ్ గుడ్ మార్నింగ్ మామ్

 

అంజలి:: గుడ్ మార్నింగ్ మమ్ము

 

ఆర్యన్:; గుడ్ మార్నింగ్ అన్వి

 

అన్విక:; కొంచెం ఇబ్బందిగా నవ్వి గుడ్ మార్నింగ్ బావ

 

మోనిష:: అన్వి మేము అందరం బ్రేక్ ఫాస్ట్ చేశాం ఆర్య నువ్వు వస్తె తినాలి అని !!!!!

 

వెయిట్ చేస్తూ  వున్నాడు వెళ్ళండి ఇద్దరు బ్రేక్ ఫాస్ట్ చెయ్యండి అని అంటుంది

అంజలి:: వెల్లు  మమ్ము

 

అన్విక::  తనకు నచ్చక పోయిన వాళ్ళ అమ్మ కోసం వెళ్తుంది

 

ఆర్యన్:: కూర్చో అన్వి నో ఫార్మాలిటీస్  ఇద్దరం కూర్చుని తిందాం

 

అన్విక:: పర్లేదు బావ ముందు నువ్వు తిను అని సర్వ్ చేస్తూ వుంటుంది

 

ఆర్యన్:: అబ్బా !!!! మరీ అంత రెస్పెక్ట్ ఇవ్వకే బాబు నీ ఒరిజినల్ క్యారక్టర్ లోకి రా పర్లే

 

అన్విక:: నవ్వి రేయ్ ఆర్య  చాలు తిను అని పక్కనే కూర్చుని తనకు కూడా సర్వ్ చేసుకుని తినడం స్టార్ట్ చేసింది

 

ఆర్యన్:: హమ్మయ్య ఒరిజినల్ క్యారక్టర్ లోకి వచ్చేశావ్ సో హ్యాపీ

 

అన్విక:: 😁😁

 

ఆర్యన్:: తింటూ లేకపోతే ఎంటే బాబు బావ, ఏమండీ అని ఒకటే రెస్పెక్ట్ తట్టుకోలేక పోతున్నా

 

అన్విక:; హు హు  ఎంతైనా ఇపుడు తమరికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా

 

ఆర్యన్:: ఏమ్ అక్కర్లేదు మామూలుగా నే పిలు ఓకే

 

అన్విక:: సర్లే రా బాబు తిను

 

ఆర్యన్:: నవ్వుతూ తనతో మాట్లాడుతూ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ వున్నాడు

 

మోనిష:: వాళ్ళ ఇద్దరిని అలా చూస్తూ మీరు ఎపుడు ఇలాగే వుండాలి అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది

 

తర్వాత అందరు హాల్ లో కూర్చుని మాట్లాడుతూ వున్నారు….. ఆర్యన్ లాబ్ టాబ్ లో వర్క్ చేస్తూ వుంటాడు

అన్విక  అంజలి వొళ్ళో పడుకుని ఆదిత్య తో తాను గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని బాధ పడుతూ ఉంది

 

మోనిష:: ముహూర్తానికి కావలసిన ఏర్పాట్లు చూసుకుంటూ వుంటుంది

 

అన్విక:: అలాగే బాధ పడుతూ పడుకుంది పోతుంది

అది చూసిన అంజలి తన నుదుటిన ముద్దు పెట్టీ రచన పిలవగానే మెల్లగ పడుకోబెట్టి వెళ్తుంది

 

ఆర్యన్:: వర్క్ కంప్లీట్ చేసి అన్వి వైపు చూసి నవ్వుకుని తనను లిఫ్ట్ చేసి బెడ్ రూమ్ లో పడుకో బెట్టి!!!!!!

నుదుటిన కిస్సి ఇచ్చి లవ్ యూ అన్వి అని చెప్పి వెళ్ళిపోతాడు!!!!

 

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

ఈవెనింగ్ అవ్వగానే అన్విక ను అందరు కలిసి రెడీ చేస్తూ ఉంటారు ……

అన్విక కు చాలా టెన్షన్ గా ఉంది కానీ అది బయటకు కనిపించకుండా వుంది!!!!!!

అన్విక ఫ్రెండ్స్ ప్రియ, నందు కూడా వచ్చి తనను రెడీ చేస్తూ ఉంటారు

మోనిష, అంజలి, రచన కూడా అక్కడే వుండి రెడీ చేస్తున్నారు

 

తెల్లని పట్టు చీర ఎరుపు రంగు అంచుతో తల నిండా మల్లె పూలు వంటి నిండా నగలతో , బుగ్గన చుక్క , చేతులకు  మెహంది ………అందానికే అసూయ పుట్టే  విధంగా ఉంది మన అన్విక!!!!

 

తనను చూసి అంజలి నుదుటిన ముద్దు పెట్టీ చాలా అందంగా వున్నావు మమ్ము అని  అంటుంది!!!!!

 

రచన కూడా మన అన్వి ను హగ్ చేసుకుని తనకు దిష్టి తీసి బయటకు వెళ్తారు!!!!!

 

ఆర్యన్ ను కూడా అందంగా రెడీ చేసారు అభి, శిశిర్, జతిన్, అవినాష్ కలిసి వైట్ షర్ట్ దోతి తో బుగ్గన చుక్క తో చాలా అందంగా వున్నాడు !!!!

శిశిర్:: సూపర్ గా  ఉన్నావ్ బావ నిజంగా నేనే అమ్మాయి అయ్యుంటే నిన్ను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకునే వాడిని

 

ఆర్యన్:: రేయ్ బావ చాల ఎక్కువ అయింది నోరు ముయ్

 

Shashir:: నిజం రా బావ పాపం మన అఫీస్ స్టాఫ్ లేడీస్ మొత్తం ఏడుస్తూ వున్నారు నీకు మ్యారేజ్ అయిందని

 

ఆర్యన్:: రేయ్ నిన్ను

 

అభి:: ఆర్య  పంతులు గారు పిలుస్తున్నారు పదా టైం అవుతోంది

 

ఆర్యన్:: నీ సంగతి తర్వాత చెప్తా రా

 

శిశిర్:: హు హు  బావ మా చెల్లి వెయిటింగ్ పద పదా.,…

 

ఆర్యన్:: శిషి

 

జతిన్:: బావ వాడిని తీరిగ్గా tiduduvu కానీ పదా అని అందరూ బయటకు వస్తారు

 

నందు:: అన్వి చూడు నువ్వు తిక్క టిక్కగా ఆలోచిం చకు ఇది నీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్

ఆదిత్య  ను మర్చిపోయి ఆర్యన్ తో హ్యాపీగా లైఫ్ లీడ్ చెయ్

నీ హ్యాపీనెస్ లోనే మీ పేరెంట్స్ హ్యాపీనెస్ వుంది గుర్తు పెట్టుకో

అండ్ ఇపుడు నువ్వు ఏ పిచ్చి డెసిషన్ తీసుకున్న నీతో పాటు మోనిష అక్క లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది !!!!!!

సో్ ప్లీజ్  అన్వి అర్థం చేసుకుని ఆర్య తో లైఫ్ షేర్ చేసుకో అని చెప్పి వెళ్లిపోతుంది!!!!!

 

అన్విక:: ఆదిత్య ఫోటో ను గట్టిగా గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఉంది

వై ఆది వై ఎందుకు నన్ను ఇలా ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావ్😭😭

నిన్ను మర్చిపోయి ఆర్య ను నా లైఫ్ లోకి ఎలా వెల్కమ్ చెప్పాలి

ఐ కాంట్ డూ దట్ ఆది నిన్ను నేను మర్చిపోలేను అది నా వల్ల కాదు

ఈ పెళ్లి కేవలం మామ్ డాడ్ కోసం మాత్రమే ఆది అని ఏడుస్తూ ఉంది !!!!

 

ప్రియ:: అన్వి ప్లీస్ బాధ పడకు ముందు పదా ఆర్యన్ నిన్ను బాగా చూసుకుంటాడు ఆ నమ్మకం నాకు వుంది పదా నిన్ను పిలుస్తున్నారు !!!!

 

అన్విక:: కళ్ళు తుడుచుకుని కిందకు వెళ్తుంది!!!!

అన్విక, ఆర్యన్ తో కలిసి పూజ చేయిస్తారు!!!!! పూజ చేస్తున్నంత వరకు ఆర్య అన్వి వైపు చూస్తూనే వున్నాడు

 

జేతిన్:: రేయ్ బా!!!!  పరువు  తీయకుండా పూజ చెయ్ అందరు నిన్నే చూస్తున్నారు

 

ఆర్యన్:: 😁😁 నవ్వు పూజ చేస్తూ వుంటాడు

 

శిశిర్:: 🤦 వీడితో చస్తున్నా రా బాబు

 

ఆర్యన్:: ఓయ్

 

అన్విక:: పూజ చేస్తూ ఆర్యన్ వైపు చూస్తుంది

 

ఆర్యన్:: లుకింగ్ బ్యూటిఫుల్ అన్వి

 

అన్విక:: సైలెంట్ గా పూజ చేస్తూ వుంటుంది

 

ఆర్యన్:: అబ్బో సిగ్గే నీకు కూడా సిగ్గుపడడం వచ్చా

 

శిశిర్:: రేయ్ పూజ మీద దృష్టి పెట్టు

 

ఆర్యన్:: వీళ్ళు ఇద్దరు  ఒకరు  నా అన్వి ను సరిగ్గా కూడా చూడ నివ్వట్లే 😠😠

 

శిశిర్:: 😁😁

తర్వాత వాళ్ళతో కొన్ని ఆటలు అడించి ఇద్దరిని ఆశీర్వదించి ముందు ఆర్య ను గది లోపలికి పంపిస్తారు!!!!

తర్వాత అంజలి పాల గ్లాస్ అన్వి చేతిలో పెట్టీ నుదుటిన ముద్దు పెట్టీ అందరు కలిసి అన్వి ను  లోపలికి పంపిస్తారు …..!!!!!

అన్వి భయపడుతూ భయపడుతూనే గది లోపలికి అడుగు పెడుతుంది…… చేతులు కాళ్ళు వణుకుతూ వున్నాయి !!!!

అన్వి లోపలికి వెళ్ళి రూమ్ మొత్తం చూస్తూ ఉంది రూమ్ మొత్తం పూలతో అందంగా అలంకరించి ఉంది!!!!

రూమ్ మొత్తం సువాసనతో వస్తూ ఉంది…. రోజ్ ఫ్లవర్స్ తో  డెకరేట్ చేశారు…. బెడ్ మీద లవ్ సింబల్ తో ఆరెంజ్ చేశారు

ఆర్యన్:: అన్వి ను చూసి నవ్వుతూ వున్నాడు

 

అన్విక:: చేతులు వణుకుతూ ఉన్నాయి

 

ఆర్యన్:: అన్విక దగ్గరకి వచ్చి డోర్ క్లోజ్ చేసి అన్విక బుజం చుట్టూ చేతులు వేసి బెడ్ దగ్గరకి తీసుకు వచ్చాడు !!!!

 

అన్విక:: ఆ….. ఆ…… ఆర్యన్ పాలు అని గ్లాస్ ఇస్తుంది

 

ఆర్యన్::  నవ్వి  తను కొంచెం తాగి అన్వి కు ఇస్తాడు

 

అన్విక:: నాకు పాలు ఇష్టం లేదు నువ్వే తాగు

 

ఆర్యన్:: అది కాదు అన్వి ఇది మన ఫస్ట్ నైట్ కదా మనం  పాలు షేర్ చేసుకోవాలి

 

అన్విక:: ఆర్య నాకు నిజంగా నచ్చదు ప్లీస్!!!!!

 

ఆర్యన్:: కు బాధేస్తుంది కానీ సైలెంట్ గా వుంటాడు

 

అన్విక:: నీతో కొంచెం మాట్లాడాలి ఆర్యన్

 

ఆర్యన్:: అబ్బా!!!! రేపు మాట్లాడుకుందాం లే అన్వి టైమ్  వేస్ట్ చేయకు అని హగ్ చేసుకోవడానికి వస్తాడు

 

అన్విక:: ఆర్యన్  నేను మాట్లాడాలి అని సీరియస్ గా అంటుంది

 

ఆర్యన్:: ఏమైంది అన్వి  ఎందుకు అంత సీరియస్ avutunnav

 

అన్విక:: మన మధ్య ఇపుడే ఈ రిలేషన్ స్టార్ట్ చేయటం నాకు ఇష్టం లేదు

మనం ఫ్రెండ్స్ లా ఉందాం ఇపుడే మన మధ్య వైఫ్ & హస్బెండ్ రిలేషన్ వద్దు !!!!

 

ఆర్యన్:: వాట్ 🤷🤷

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply