నీ ఊపిరి సాక్షిగా ❣️-21

కార్తికేయ, అనసూయ లకు టీ ప్రిపేర్ చేసి తీసుకుని గార్డెన్ వైపు వెళ్తుంది మానస….. !! అనసూయ గార్డెన్ లో వాకింగ్ చేస్తూ ఉంటే కార్తికేయ ఏదో బిసినెస్ కాల్ లో బిజీగా ఉంటాడు….. !! కార్తికేయ చేతిలో సైలెంట్ గా కప్ పెట్టేసి కొంచెం దూరం లో వాక్ చేస్తున్న అనసూయ దగ్గరకు వెళ్లి తన చేతిలో కప్ పెడుతూ అమ్మా…… !! అన్నయ్య ను ఎలా అయినా త్వరగా ఆఫీస్ కి వెళ్ళేలా చెయ్ నాకు భూమి ను ఎపుడెపుడు చూస్తానా అనుంది…….. !!

ఆ విషయం నాకు వదిలేయ్ మానస నేను కూడా అదే అనుకుంటున్నా ముందు నువ్వు వెళ్ళి కుక్స్ తో త్వరగా బ్రేక్ఫాస్ట్ హాఫ్ ఆన్ లో ప్రిపేర్ చేయమని చెప్పు అని మానస ను అక్కడి నుంచి పంపేసి అనసూయ మెల్లగా కార్తికేయ పక్కన సెటిల్ అవుతూ టీ సిప్ చేస్తూ ఉంటుంది……. !!

కార్తికేయ కూడా టీ సిప్ చేస్తూనే కాల్ కంటిన్యూ చేసి తన టీ ఫినిష్ అయ్యేలోపు కాల్ కూడా ఫినిష్ చేస్తాడు…… !! అమ్మా రాజ్ పోలీస్ స్టేషన్ కి తన ఫ్లాట్ నుండే వెళ్ళాడట ఈవెనింగ్ డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాడు కాబట్టి మీరు వాడి గురించి వెయిట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయండి….. !! నేను అర్జంట్ గా ఒక క్లయింట్ ను కలవాలి ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి సో నేను ఫ్రెష్ అయి వస్తాను అని అనసూయ కి శ్రమ ఇవ్వకుండా తనే ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు….. !!

 

కార్తికేయ కి ఎమ్ చెప్పాలి అని ఆలోచిస్తుంటే తనే వర్క్ ఉందని వెళ్ళాలి అంటున్నాడు ఇది కూడా మన మంచికే అనుకుని అనసూయ కూడా మెల్లగా ఇంట్లోకి వెళ్తుంది…. !! కాసేపటికి కార్తికేయ ఫ్రెష్ అయ్యి రాగానే కార్తికేయ తో పాటుగా వీళ్ళు కూడా కూర్చుని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు….. !! బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక కార్తికేయ హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోగానే లేట్ చేయకుండా అనసూయ వెంటనే దేవయాని కి కాల్ చేస్తుంది…… !!

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

భూమి ఇంకా ఇలాగే ఉన్నావ్ ఏంటి….. ?? అని ప్రెసెంట్ భూమి ఉంటున్న రూమ్ లోకి వచ్చిన దేవయాని భూమి వైపు చూస్తూ అడుగుతుంది….. !! నేను రెడీ అయ్యాను నానమ్మ అదీ…. !! నీకు తెలుసు కదా నా దగ్గర ఉన్నది రెండు చీరలే అవి కూడా బాగా యూస్ చేసేసాను అందుకే ఇలా ఉన్నా అని చెప్తున్న భూమి ను చూసి దేవయాని మనసు చివుక్కుమంటుంది…… !!

నువ్వు ఇలాంటి లైఫ్ లీఫ్ చేయడానికి రీసన్ ఆ చవట దద్దమ్మే భూమి….. !! వాడే కనుక కరెక్ట్ గా ఉండుంటే ఈ ఇంట్లో మహారాణి లా ఉండేదానివి…… !! నా కూతురు చెప్పింది గుడ్డిగా నమ్మి చవట సన్నాసిలా తయారు అయ్యాడు…… !! వాడు చేసేది తప్పని తెలిసినా అమ్మ మాటే వేదం అనుకునే స్టేజ్ కి వచ్చేసాడు నువ్వే వాడిని ఎలా అయినా మార్చాలి….. !! ఈ విషయం లో నా ఆశలు అన్నీ నీ మీదే పెట్టుకున్నా భూమి….. !!

దిగులు పడకు నానమ్మ మహాన్ ను మాత్రమే కాదు….. !! తాతయ్య, అత్తయ్య & శ్లోక అందరినీ త్వరలోనే చేంజ్ చేస్తాను ఆ విషయం నాకు వదిలేసి నువ్వు హ్యాపీగా ఉండు….. !! టైం అవుతుంది కదా వెళ్దామా అని తన మొబైల్ తీసుకుంటూ అంటుంది….. !!

ఈ మొబైల్ ఎక్కడిది భూమి….. ?? నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు నీ మొబైల్ కింద పడి పగిలిపోయింది కదా దాని గురించి చాలా ఏడ్చావ్ కూడా & దీన్ని చూస్తుంటే న్యూ మొబైల్ లా ఉంది…… ??

అన్నయ్య వెళ్ళేటపుడు ఈ మొబైల్ నాకు ఇచ్చేసి వెళ్ళాడు నానమ్మ…. !!

అవునా మంచి పని చేశాడు….. !! నందు కంట పడకుండా జాగ్రత్తగా యూస్ చెయ్ భూమి మళ్ళీ దీనికి కూడా ఏదో ఒక రచ్చ చేస్తుంది….. !!

అలాగే నానమ్మ ఇక వెళ్దామా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు….. !! నాకు కూడా వాళ్ళను ఎపుడు చూద్దామా అని ఉంది….. !!

చూడమ్మా భూమి మరోలా అనుకోకు నిన్ను ఇలా చూస్తే మీ మామ్, అమ్మమ్మ చాలా ఫీల్ అవుతారు….. !! వాళ్ళ కోసం అయినా కొంచెం మంచి శారీ కట్టుకో అని తను భూమి కోసం తెప్పించిన శారీ ఇస్తూ అక్కడి నుండి రాగానే ఎప్పటి లాగే ఉండు కానీ ఇప్పుడు మాత్రం ఈ చీర కట్టుకో & బ్లౌజ్ కూడా రెడీగా ఉంది అని దేవయాని రిక్వెస్ట్ చేయడం తో భూమి మానస కోసం ఒప్పుకుని కాసేపటికి అందంగా రెడీ అవుతుంది….. !!

ఇప్పుడు బావున్నావ్ అని భూమి కి మెటికలు విరిచి పదా వెళ్దాం మీ అమ్మమ్మ నీ కోసం 2 సార్లు కాల్ చేసింది అంటూ భూమి ను తీసుకుని తన పుట్టింటికి స్టార్ట్ అవుతుంది దేవయాని….. !!

తన రూమ్ బాల్కనీ నుండి వీళ్ళ కార్ వైపు చూసిన శ్లోక నవ్వుకుంటూ వెల్లవే వెళ్ళు నీ పుట్టింటికి వెళ్ళడానికి తెగ రెడీ అయ్యి నవ్వుతూ వెళ్తున్నావా 😏 ……. !! కాసేపు వెయిట్ చేయవే గుక్క పట్టి ఏడుస్తావ్ అని కన్నింగ్ గా నవ్వుకుంటున్న శ్లోక కి తన ఫ్రెండ్ నుండి కాల్ రావడం తో ……. !! దాన్ని పిక్ చేస్తూ ఎలాగో అన్నయ్య దాన్ని ఈడ్చుకుంటూ కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకుని వస్తాడు….. !! ఆ సీన్ లో నేను లేకపోతే ఎలా అనుకుని లేదే నేను రావడం లేదు ఈవెనింగ్ పార్టీ కి వస్తాను అని కాసేపు కాల్ మాట్లాడి హాల్ లోకి వచ్చి కూర్చుంటూ వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటుంది…… !!

✨✨✨✨✨✨✨✨

 

ఫైనల్లీ మనం మామ్ ను మీట్ అవ్వబోతున్నాం చాలా హ్యాపీగా ఉంది నానమ్మ ఇదంతా నీ వల్లే థాంక్ యూ సో మచ్ నానమ్మ…. !! ఇంట్లో అందరూ నన్ను హేట్ చేసినా నువ్వు మాత్రం నాకు ఫస్ట్ నుండి చాలా సపోర్టివ్ గా ఉన్నావ్ అంటూ ఆనందంగా చెప్తుంది భూమి….. !?

శ్లోక, నువ్వు వేరు కాదు భూమి నాకు ఇద్దరూ ఒకటే….. !! అయినా నువ్వేం తప్పు చేసావ్ అని దూరం పెట్టాలి చెప్పు ఇక్కడ తప్పు చేసింది నందు అయినా అది ఒప్పుకోదు….. !! నేను చేయాల్సిన పని నువ్వు చేస్తూ వాళ్ళు నిన్ను ఏమన్నా బరిస్తున్నావ్ …. !! భూమి అని పేరు పెట్టినందుకు ఆ భూమాత కు ఉన్నంత ఓర్పు ఉందే నీకు అని భూమి చేతిని గట్టిగా పట్టుకుని నా మనవడికి నువ్వే కరెక్ట్ భూమి ఎమ్ జరిగినా వాడి చేయ్ వదలకు…… !?

నువ్వు ఇంతలా చెప్పాలా నానమ్మ మహాన్ నా ప్రాణం తను నన్ను వద్దు అనుకున్నంత ఈజీ గా నేను తనను వదులుకోలేను …… !! అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే డ్రైవర్ సడెన్ బ్రేక్ తో కార్ ఆపుతాడు….. !! దాంతో ఇద్దరూ ముందుకు పడేవాళ్ళు కాస్త కంట్రోల్ చేసుకుంటూ ఏమైంది అని డ్రైవర్ వైపు చూస్తూ ముందుకు చూడగా…… !! మహాన్ రోడ్ కి అడ్డంగా తన కార్ అడ్డు పెట్టుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా చూస్తూ నుంచుని కనిపించడం చూసి ఇద్దరికీ భయం తో హార్ట్ కడుపు లోకి జారిపోతుంది….. !!

భూమి వెంటనే తను కనిపించకుండా కిందకు వంగుతూ నాన్నమ్మ మహాన్….. ?? సడెన్ గా మహాన్ ఏంటి నానమ్మ ప్లీస్ తను నన్ను చూడకముందే ఎదోటి మాట్లాడి ఇక్కడి నుంచి పంపించేయ్ అని టెన్షన్ గా చెప్తున్న భూమి ను చూసి దేవయాని కార్ దిగుతూ నువ్వు ఇక్కడే ఉండు భూమి అని భూమి కి జాగ్రత్త చెప్పి మహాన్ వైపు వెళ్తుంది…. !?

మహాన్ నువ్వెంట్రా ఇక్కడ….. ?? ఆఫీస్ కి వెళ్లకుండా ఇలా రోడ్ మీద అడ్డంగా కార్ ఆపి ఏమ్ చేస్తున్నావ్…. ?? అని కంగారు తగ్గించుకుంటూ నార్మల్ వాయిస్ తో అడుగుతున్న దేవయాని ను చూసి నా గురించి తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మమ్మ…… ??

అది…. అదీ….. హా!! గుడికి వెళ్తున్నాను మహాన్ నీకు తెలుసు కదా ఎవ్రీ ఫ్రైడే నేను టెంపుల్ కి వెళ్తానని……. !! ఇవాళ కూడా అలాగే వెళ్తున్నా….. !!

అవునా సరే పదా నేను కూడా టెంపుల్ కి నీతో కలిసి వచ్చి చాలా డేస్ అవుతుంది ఇద్దరం కలిసి వెళ్దాం…… !! అవును నీ పూల సజ్జ ఎక్కడ….. ?? కార్ లో ఉందా సరే ఆగు నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని భూమి ఉన్న కార్ వైపు వెళ్లబోతాడు….. !!

మహాన్ ఆగు రా అని మహాన్ చెయ్ పట్టుకుని ఆపేస్తూ నీకు ఎందుకు ట్రబుల్ డ్రైవర్ ఉన్నాడు కదా నేను వెళ్ళిపోతాను….. !! నీ వర్క్స్ మాని నాతో టెంపుల్ కి ఎందుకు….. ??

ఎమ్ పర్లేదు అమ్మమ్మ నీ కంటే నాకు ఆఫీస్ ఎమ్ ఇంపార్టెంట్ కాదు నువ్వు కాస్త ఆగు అని దేవయాని పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన మహాన్ కి …….. !! ఎవరు కనిపించకుండా తల వంచుకుని కూర్చున్న భూమి కనిపించడం తో తన చెయ్ పట్టుకుని కిందకు లాగి దేవయాని వైపు సీరియస్ గా చూస్తూ ఉంటాడు….. !!

నా పర్మిషన్ లేకుండా దీన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావ్ అమ్మమ్మ….. ?? మహాన్ నుండి బులెట్ లా వచ్చిన వాయిస్ కి ఇద్దరూ కంగారుగా ఒకరిని ఒకరు చూసుకుంటారు… !!

పోనీ నేను చెప్పనా దీన్ని తీసుకుని దీని పుట్టింటికి వెళ్తున్నారు…. !! అవునా?? అని అడగ్గానే మహాన్ కి ఎలా తెలిసిందా అని ఇద్దరూ షాక్ అవుతూ మహాన్ వైపు చూస్తూ ఉంటారు….. !!

మహాన్ కోపంగా భూమి ను తన కార్ లో కి తోసి కోపంగా తన కార్ స్టార్ట్ చేసి దేవయాని ముందే తన కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు…… !! ఆది చూసిన దేవయాని కంగారుగా తన కార్ లో కూర్చుంటూ మహాన్ కార్ ను ఫాలో అవ్వమని చెప్తుంది కానీ అప్పటికే మహాన్ కార్ కంటికి కనిపించకుండా మాయం అవుతుంది…… !!

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

 

మను భూమి కి ఇష్టమైన డిషెస్ అన్ని కుక్ చేసావా అని రెండు గంటల నుండి కిచెన్ లో కుస్తీ పడుతున్న కూతురిని చూస్తూ అపుడే కిచెన్ లోకి వస్తూ అడుగుతుంది అనసూయ…. !! అన్నీ చేసాను అమ్మా ఇదిగో ఈ హల్వా ఒకటే బ్యాలెన్స్ ఇది కూడా 50% అయిపోయింది….. !!

 

భూమి వచ్చేసరికి ఇది కూడా అయిపోతుంది అని మెయిడ్ తో డిషెస్ డైనింగ్ టేబుల్ మీద పెట్టిస్తూ టేస్ట్ చూడు అమ్మా అని అన్నీ అనసూయ తో టేస్ట్ చేయించి తను పెర్ఫెక్ట్ అని చెప్పేసరికి హ్యాపీగా ఫీల్ అవుతూ హల్వా కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి అమ్మా!! నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని తన రూమ్ కి పరిగెడుతున్న కూతురిని చూసి నవ్వుకుంటూ హాల్ లోకి వస్తుంది అనసూయ….. !!

వీళ్ళు స్టార్ట్ అయ్యారో లేదో కనుక్కోవాలి అని దేవయాని కి కాల్ చేసిన అనసూయ దేవయాని చెప్పింది విని షాక్ అవుతూ ఇపుడు భూమి ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అని సోఫా నుండి లేస్తూ కంగారుగా అడుగుతుంది….. !?

అదే తెలియడం అనసూయ చాలా కంగారుగా కూడా ఉంది….. !! నేను ఇంటికే వెళ్తున్నా నాకు తెలిసి అక్కడకే వెళ్ళుంటారు నువ్వు కంగారు పడకు నేనున్నా కదా అక్కడ ఏం జరగకుండా నేను చూసుకుంటా అంటూ కాల్ కట్ చేయడం తో అనసూయ బాధగా సోఫా లో కూల బడుతుంది….. !!

అమ్మా!! భూమి వాళ్లకు కాల్ చేసావా….. ?? వాళ్ళు స్టార్ట్ అయ్యారా ఇంకా ఎంత సేపు పడుతుందట అని అడుగుతూ అప్పుడే అక్కడికి వచ్చిన కూతురి వైపు చూస్తూ భూమి రావడం లేదు…… !! అని బాధగా నీళ్ళు నిండిన కన్నులతో చెప్తున్న అనసూయ ను చూసి మానస కంగారుగా ఏ… ఎమ్ ఎందుకని అని అప్పటికే నీళ్ళు నిండిన కన్నులను తుడుచుకుంటూ అడుగుతుంది….. !!

మహాన్ కి వీళ్ళు ఇక్కడికి వస్తున్న విషయం తెలిసి వీళ్ళకు కార్ అడ్డు పెట్టి మరీ కోపంగా భూమి ను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడట అని చెప్తున్న అనసూయ ను చూసి మానస బాధ పెద్దది అవుతుంది అది చూసిన అనసూయ భూమి ను తలచుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది….. !!

మహాన్ భూమి ను తీసుకుని ఎక్కడికి అంత కోపంగా వెళ్ళాడు….. ?? ఇప్పుడు భూమి పరిస్థితి ఏంటి…… ?? భూమి తన ఇంటికి రాకుండా అడ్డుకుంది శ్లోక అని రాజ్ కి తెలిస్తే….. ?? నందన తలకు దెబ్బ తగలడానికి రీసన్ కార్తికేయ అని మహాన్ కి తెలియనుందా…… ?? తల్లిని అలా కొట్టింది తండ్రి అని తెలిస్తే మహాన్ ఊరికే ఉంటాడా….. ?? అసలు నెక్స్ట్ ఎమ్ జరగబోతుంది…. ?? డోంట్ పుట్ నెగెటివ్ కామెంట్స్ అపుడు చెప్పా ఇపుడు చెప్తున్నా ఇది స్టోరీ మాత్రమే దీన్ని అలాగే చూడండి 😈

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply