జిమ్ రూమ్ నుండి హాల్ లోకి వచ్చి కూర్చుంటూ పేపర్ చదువుతున్న కార్తికేయ కి గ్రీన్ టీ ఇస్తూ ఎదురుగా కూర్చుంటుంది మానస….. !! చేతిలో ఉన్న కప్ తీసుకుని మెల్లగా సిప్ చేస్తూ పేపర్ చదువుతూ ఎదురుగా సైలెంట్ గా కూర్చున్న చెల్లి వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మను….. ?? ఏమైంది ఎందుకలా ఉన్నావ్ ఇంకా భూమి గురించే ఆలోచిస్తూ ఉన్నావా…… ??
భూమి గురించి కాదు అన్నయ్య నీకు తెలుసు కదా ఇంకో వారం లో విజయ్ సంవత్రరికం వస్తుంది…… !! ఎవ్రీ ఇయర్ ఆ రోజు భూమి చేత్తో అన్నదానం, వస్త్ర దానం జరిపిస్తూ ఉంటాం….. !! బట్ ఈ ఇయర్ భూమి లేదు & ఉన్నా అది రాలేదు అని బాధగా చెప్తున్న మానస పక్కన కూర్చుంటూ….. !! మను ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా భూమి చేత్తోనే అన్ని జరుగుతాయి….. !!
నువ్వు అరేంజ్మెంట్స్ చూడు నా చిట్టి తల్లీ కచ్చితంగా తన ఫాదర్ సంవత్సరికం కి వస్తుంది ….. !! నేను తీసుకుని వస్తాను ప్రామిస్ అని మానస తల నిమురుతూ నువ్వు భూమి నా ఇంటి మహాలక్ష్ములు ఇంకెప్పుడు కంట తడి పెట్టకు అని చెప్పి తన రూమ్ కి వెళ్తున్న కార్తికేయ ను చూసి….. !! విజయ్ తో ఉన్న జ్ఞాపకాలు తక్కువే అయిన అవి గుర్తు రాగానే ఎమోషనల్ అవుతున్న మానస కార్తికేయ మాటలకు కన్నీళ్ళు తుడుచుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది….. !!
ఇంట్లో 3 కుక్స్ ఉన్నా మానస కి ఎపుడైనా మనసు బాగోనపుడు తన మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి కుక్ చేయడం తనకు అలవాటు….. !! ఇప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ కోసం వెజ్జిస్ కట్ చేస్తున్న కుక్స్ ను బయటకు పంపేసి తనే కుక్ చేయడం స్టార్ట్ చేస్తుంది…… !!
దేవయాని కాల్ తో నిద్ర లేచిన అనసూయ దేవయాని చెప్పింది విని నవ్వుతూ అలాగే మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం…. !! కార్తికేయ ఆఫీస్ కి వెళ్లగానే కాల్ చేస్తాను నువ్వు భూమి ను తీసుకుని వచ్చెయ్ అని ఆనందంగా కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి మానస కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది…. !!
మానస మేడం కిచెన్ లో ఉన్నారని చెప్పిన మెయిడ్ వైపు చూసి కిచెన్ లో ఉందా ….. ?? మను మనసు బాలేనపుడే కదా కుక్ చేస్తుంది….. !! భూమి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకున్నట్టు ఉంది అని కూతురి కోసం కిచెన్ లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ నుండి దోస బ్యాటర్ తీసుకుంటున్న మానస పక్కకు వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావ్ మను….. ?? నేను నీ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉన్నాను నీకో గుడ్ న్యూస్ చెప్పాలి…… !!
ఏంటమ్మా అది అంటూ అనసూయ వైపు చూసిన మానస తో దేవయాని భూమి ను తీసుకుని వస్తున్నట్టు చెప్పగానే మానస ఆనందంగా నిజమా అమ్మా అంటూ నవ్వుతూ అడుగుతుంది…. !!
నిజమే మను ఇదిగో ఇందాకే కాల్ మాట్లాడాను….. !! కార్తికేయ ఉంటే కచ్చితంగా గొడవ అవుతుంది అందుకే కార్తికేయ వెళ్ళాక వాళ్ళను రమ్మని చెప్పాను….. !! నువ్వు కూడా ఈ విషయం కార్తికేయ కి చెప్పకు ………… !!
ఏంటమ్మా నాకు చెప్పద్దు అంటున్నావ్…… ?? ఎంటా విషయం అని సడెన్ గా అక్కడికి వచ్చిన కార్తికేయ ను చూసి అనసూయ, మానస కంగారుగా ఒకరిని ఒకరు చూసుకుంటారు….. !!
నిన్నే అమ్మా!! నాతో ఏంటి చెప్పద్దు అంటున్నావ్….. ??
ఆ….. ఆ….. అది అమ్మ 3 డేస్ నుండి వాకింగ్ చేయట్లేదు అంట అన్నయ్య…… !! నీకు తెలిస్తే సీరియస్ అవుతావు అని నీకు చెప్పద్దు అని నాకు చెప్తుంది….. !! అంతే కదా అమ్మా అంటూ అనసూయ కి కళ్ళతోనే సైగ చేస్తుంది మానస….. !!
హా…. హా…… అంతే కార్తికేయ అదే చెప్తున్నాను ఈ లోగా నువ్వొచ్చావ్….. !!
డాక్టర్స్ చెప్పేది నీ హెల్త్ గురించే కదా అమ్మా !! ఇలా నెగ్లెట్ చేస్తే ఎలా….. ?? ఇంకో సారి ఇది రిపీట్ చేయకు….. !! నీకు ఇప్పుడిప్పుడే అన్నీ కంట్రోల్ లో ఉంటున్నాయి సో ఇవాళ్టి నుంచి వాకింగ్ మిస్ చేయకు అని సీరియస్ గా చెప్తున్న కొడుకు వైపు చూస్తూ హమ్మయ్యా కార్తికేయ ఎమ్ వినలేదు అని రిలాక్స్ అవుతూ ఆ …. అలాగే కార్తికేయ వాకింగ్ చేస్తాను….. !! అవును నువ్వేంటి ఇలా వచ్చావ్…. ??
హెడేక్ గా ఉందమ్మా టీ కోసం వచ్చాను ….. !! మను నాకు అమ్మ కు కాఫీ తీసుకుని గార్డెన్ లోకి రా….. !! అమ్మా కాసేపు వాక్ చేద్దువు రా అని అనసూయ చెయ్ పట్టుకుని గార్డెన్ లోకి తీసుకుని వెళ్తూ ఉంటే…. !! అనసూయ మానస కి ఏదో సైగ చేస్తూ అక్కడి నుండి కార్తికేయ తో పాటు గార్డెన్ కి వెళుతుంది….. !!
భూమి వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ముందు అన్నయ్య వాళ్లకు కాఫీ ఇచ్చేసి దానికి ఇష్టమైన డిషెస్ కుక్ చెయ్యాలి అనుకుంటూ ఫస్ట్ బర్నర్ ఆన్ చేసి కాఫీ పెడుతుంది మానస…… !!
✨✨✨✨✨✨✨✨✨
డీప్ స్లీప్ లో ఉన్న శ్లోక కి తన మొబైల్ కంటిన్యూ గా రింగ్ అవుతూ ఉంటే బద్దకంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది…… !! హేయ్ శ్లోక ఇవాళ రియా బర్త్డే మర్చిపోయావా అందరం నీ కోసం స్టార్ బగ్స్ లో ఉన్నాం…… !! వుయ్ ఆర్ అల్ వెయిటింగ్ ఫర్ యూ వేర్ ఆర్ యూ….. ??
ఫ్రెండ్ కాల్ కి నిద్ర మత్తు వదిలిన శ్లోక దెబ్బ కు లేచి కూర్చుంటూ వాచ్ లో టైమ్ చూస్తూ ఓహ్ షట్….. !! హాఫ్ ఆన్ అవర్ లో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసి ఫాస్ట్ గా షవర్ చేసి బ్రేక్ఫాస్ట్ కోసం కిందకు వచ్చిన శ్లోక కి హాల్ లో ఎవరు కనిపించరు….. !! ఏంటిది ఎవరు లేరు అని చూస్తూ కిచెన్ దగ్గరకు వచ్చిన శ్లోక దేవయాని & భూమి మాటలు విని ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి మహాన్ కి కాల్ చేస్తుంది….. !!
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
కోపంగా ఆఫీస్ కి వచ్చిన మహాన్ ఎవరు విష్ చేస్తున్న పట్టించుకోకుండా వచ్చి తన సీట్ లో కూర్చుంటూ దీనికి బాగా ధైర్యం ఎక్కువ అయింది….. !! దాని మామ, అన్న ను చూసుకునే దీనికి ఈ పొగరు….. !! చెప్తా చెప్తా ఇంకో సారి ఆ రాజ్ కనిపిస్తే వాడికి దీనికి కలిపి స్ట్రాంగ్ గా చెప్తా అపుడు కానీ నేనంటే భయం ఉండదు అని భూమి మీద ఉన్న కోపం మొత్తం వర్క్ మీద చూపిస్తూ తన మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఉంటాడు….. !!
మహాన్ సైన్స్ కోసం చేతిలో ఫైల్ పట్టుకుని అక్కడికి వచ్చిన హనీష్ రెడ్ టొమాటో లా ఉన్న మహాన్ ఫేస్ వైపు చూస్తూ వీడేంటీ కారం తిన్న కోతి లా పెట్టాడు మొహం ఏమై ఉంటుంది అనుకుంటూ హాయ్ మహాన్ గుడ్ మార్నింగ్ అంటూ ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుంటూ విష్ చేస్తాడు….. !!
హానిష్ వైపు కళ్ళు ఎత్తి చూసి తిరిగి తన వర్క్ చేసుకుంటున్న మహాన్ వైపు చూస్తూ ఏమైంది రా….. ?? మొహం ఎందుకు అలా పెట్టావ్….. ??
నథింగ్…. !! ఎందుకు వచ్చావో చెప్పు అని మొహాన్ని నార్మల్ గా పెట్టుకొంటూ చెప్తాడు మహాన్….. !!
వీడ్ని గెలకక పోవడమే బెటర్ అనుకుంటూ నీ సైన్స్ కావాలి మహాన్ అంటూ ఫైల్స్ మహాన్ ముందు పెట్టగానే…. !! వాటి మీద సైన్స్ పెట్టేసి హనీష్ కి ఇస్తూ ఆఫ్టర్ నూన్ ఆ డిల్లీ నుండి వచ్చిన డీలర్స్ తో మీటింగ్ ఎరేంజ్ చెయ్ వుయ్ హావ్ టు ఫినిష్ దట్ వర్క్….. !!
ఒకే మహాన్ అని ఫైల్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ మహాన్ చేసిన సైన్స్ చూసి తల బాదుకుంటూ నీ వైఫ్ మీద ప్రేమ ఉండచ్చు మహాన్ మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉంటే కష్టం….. !! అంతలా నా చెల్లిని వదిలి రాలేక పోతే తనను తీసుకుని సరదాగా హనీమూన్ కి వెళ్ళు ఆఫీస్ నేను మ్యానేజ్ చేస్తాను…. !!
పిచ్చిగా వాగితే చంపేస్తాను హానీ అసలేం వాగుతున్నావ్ ….. ?? దాని మీద నాకు ప్రేమేంటీ….. ??
ఎంత ప్రేమ లేకపోతే నీ సైన్ కావాలి అని అడిగితే భూమి పేరు తో సైన్ చేస్తావ్….. !! ఎందుకు రా కవర్ చేయాలి అని చూస్తున్నావ్…… ?? యూ జస్ట్ షట్ అప్ ఒకే ఆ భూమి వల్ల నా మూడ్ మొత్తం చేంజ్ అయింది…… !! అందుకే దాని సైన్ చేసినట్టు ఉన్నాను అని కోపంగా చెప్పి గెట్ అవుట్ అని విసుగ్గా చెప్పగానే ప్రేమ ఉన్న ఒప్పుకోవడానికి ఈగో అని గొణుక్కుంటూ వెళ్తున్న హనీష్ ను చూసి మహాన్ పిడికిలి బిగుసుకుంటుంది…… !!
సరిగ్గా అప్పుడే తనకు శ్లోక నుండి కాల్ రావడం తో చిరాగ్గా కాల్ లిఫ్ట్ చేస్తాడు….. !! అన్నయ్య ఎక్కడున్నావ్…… ?? నీకో న్యూస్ అర్జంట్ గా చెప్పాలి…… !!
సినిమా హాల్ లో ఉన్నాను 😑 నువ్వు కూడా వస్తావా 😏 నాతో ఎక్స్ట్రా టికెట్ ఉంది పైగా పాప్కార్న్ కూడా ఫ్రీగా ఇచ్చారు….. !!
అదేంటి అన్నయ్య ఈ టైం లో నువ్వు ఆఫీస్ లో ఉంటావ్ కదా….. ?? మూవీస్ కూడా నువ్వు ఎక్కువగా లైక్ చేయవు…. ??
తెలుసు కదా మరి ఎమ్ తెలియనట్టు ఎక్కడున్నావ్….. ?? అని ఎందుకు అడుగుతున్నావ్ ….. !! అసలే ఆ భూమి వల్ల చిరాగ్గా ఉంది….. !!
ఓహ్ ఆ చిరాకు దాని వల్ల వచ్చిందా….. !! అన్నయ్య నువ్వు భూమి కి లంచ్ కుక్ చేయమని చెప్పి వెళ్తే అది మన నానమ్మ ను బురిడి చేసి నానమ్మ తో కలిసి తన ఇంటికి వెళ్తుంది….. !!
వాట్….. ?? అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు అది వాళ్ళ ఇంటికి వెళ్లడం ఏంటి….. ??
నేను చెప్పేది అబద్దం అయితే భూమి వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చెయ్ నీకే తెలుస్తుంది అని కాల్ కట్ చేసిన శ్లోక మాటలకు మహాన్ వెంటనే డ్రైవర్ తో కార్ స్టార్ట్ చేయమని చెప్పి కార్ లో కూర్చుంటాడు….. !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
నందన కార్ లో కూర్చుంటూ డ్రైవర్ తో కార్తికేయ అఫీస్ కి వెళ్ళమని చెప్పగానే……. !! కార్ అరంగంట లో కార్తికేయ ఆఫీస్ ముందు కార్ ఆగడం తో నందన మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని కార్ దిగుతుంది……. !! కార్తికేయ ఆఫీస్ వైపు పళ్ళు నూరుతూ చూస్తూ అఫీస్ లోకి కోపంగా వెళ్లి కార్తికేయ క్యాబిన్ వైపు వెళ్ళబోతున్న నందన ను కార్తికేయ పి. ఏ. లోపలికి వెళ్ళకుండా ఆపేస్థాడు…….. !!
లుక్ మ్యామ్ సర్ పర్మిషన్/ అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని లోపలికి నేను పంపలేను …… !! ప్రెసెంట్ సర్ సెడ్యూల్ అసలు ఫ్రీగా లేదు డు వన్ థింగ్ మీరు ఆఫ్టర్ వన్ వీక్ నాకు కాల్ చేయండి అప్పుడు మీరు నేను ఎపుడు రావాలో చెప్తాను అని అంటున్న కార్తికేయ పి.ఏ. చంప చల్లుమని పగల కొడుతుంది……. !!
హౌ డేర్ యూ టు స్టాప్ మీ డు యూ నో హు యామ్ ఐ దిస్ ఇస్ నందన అని మరో చంప కూడా పగల కొట్టి ఆవేశంగా ఛాంబర్ లోకి వెళ్తుంది ……. !! మ్యామ్ …. మ్యామ్ వెయిట్ అంటున్నా వినకుండా ఛాంబర్ లోకి వెళ్ళిపోయిన నందన ను చూసి కార్తికేయ పి. ఏ. అసహనంగా తన క్యాబిన్ కి వెల్లిపోతాడు …….. !!
ఆవేశంగా కార్తికేయ క్యాబిన్ లోకి వెళ్ళిన నందన కి క్యాబిన్ కాళిగా కనిపిస్తుంది…… !! ఓహ్ ఇంకా కార్తికేయ రాలేదా అని కార్తికేయ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది……. !! ఎంత సేపు అయినా కార్తికేయ రాకపోయేసరికి రూమ్ లో ఉన్న చైర్ లో కూర్చుని కార్తికేయ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది …… !!
అరగంట తర్వాత అఫీస్ కి వచ్చిన కార్తికేయ కి తన పి. ఏ. ద్వారా నందన వచ్చిన విషయం తెలుసుకుని కోపంగా లోపలికి వెళ్లిన తనకు ……. !! నందన క్రాస్ లెగ్స్ వేసుకుని తన వైపు యాటిట్యూడ్ లుక్ ఇస్తూ హాయ్ మిస్టర్ కార్తీక్ వెల్కమ్ ఎంటలా చూస్తున్నావ్ …… ?? అయినా అక్కడే ఆగిపోయావ్ ఎంటి కమ్ అంటూ సర్క్యాస్టింగ్ స్మైల్ ఇస్తుంది ….. !!
కార్తీక్ కాదు కార్తికేయ !! కరెక్ట్ యువర్ వర్డ్స్ నా అఫీస్ కి ఎందుకొచ్చావ్ …… ?? జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై అఫీస్ …… !! అంటూ కోపంగా చూస్తూ నందన బుజం పట్టుకుని విసురుగా పైకీ లేపుతాడు …… !!
డోంట్ టచ్ మీ అంటూ కార్తికేయ ను తన నుండి దూరంగా నెడుతూ ……. !! నన్ను తాకే రైట్ నీకు లేదు & నేను వచ్చింది నీ కోసం కాదు……. !! నీతో కబుర్లు చెప్పడానికో లేదా నీతో డిబేట్ పెట్టడానికో కాదు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను …….. !!
నా ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టనని ప్రగల్బాలు పలికి దొంగ లా రాత్రి నా ఇంట్లోకి వచ్చి మా అందరికీ నిద్ర లేకుండా చేశావ్…… !! కొంచెం కూడా షేమ్ అనిపించడం లేదా నీకు దాని కోసం కట్టుకున్న భార్యను & కన్న బిడ్డలను రాత్రి మొత్తం నిద్రకు దూరం చేసావ్ ……. !! ఇప్పటికీ కూడా నీకు అదే ఇంపార్టెంట్ ఒక్క సారైనా మహాన్, శ్లోక గురించి ఆలోచించావా ……. ??
షట్ అప్ అంటూ కోపంగా నందన వైపు గుడ్లు ఉరిమి చూస్తు ఎవరే దొంగ చంపేస్తాను …… ?? మరో సారి దొంగ, మంగ అన్నావ్ అంటే అలాంటి బుద్దులు నావి కావు నీవి ……. !! నా మేన కోడలిని దొంగ దెబ్బ కొట్టి తనను ఎటు కదలకుండా లాక్ చేసి ఆడపిల్ల అని జాలి కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు టార్చర్ చేస్తున్నారు…….. !!
నేను కాదు నువ్వు సిగ్గు పడాలి ఆడదానివి అయ్యుండి & ఒక ఆడపిల్ల కి తల్లివి అయ్యుండి ……. !! నీ కూతురి వయసున్న అమ్మాయి ను అంతలా ఏడిపిస్తున్నావే…… !! కొంచెమ్ అయినా సిగ్గుందా నీకు ……. !! ఛీ నిన్ను చూడాలి అంటేనే అసహ్యంగా ఉంది ……. !! నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే కోపంగా ఉంది …… !!
నాది కూడా సేమ్ ఫీలింగ్ కార్తికేయ అయినా నేనిలా మారడానికి కారణం నీ ముద్దుల మేన కోడలు & నీ చెల్లి ……. !! యస్ వాళ్ళ వల్లే నేనిలా బండరాయి లా మారిపోయాను ……. !! అంటూ కోపంగా చెప్పి చూస్తూ ఉండు నీ ఇంటి యువరాణి ను నా కాలి కింద చెప్పులా నలిపేయక పోతే నా పేరు నందన నే కా… …. !! అంటున్న నందన మాట కార్తికేయ ఉక్కు పిడికిలి లో చిక్కుకుని నోట్లో మాట నోట్లోనే ఆగిపోయి కార్తికేయ నుండి తన గొంతు విడిపించుకోవడానికి & తప్పించుకోవడానికి చూస్తూ ఉంటుంది …… !!
అప్పుడు, ఇప్పుడు & ఏప్పుడు నాకు భూమి నే ఇంపార్టెంట్ …… !! తన ఇష్టాన్ని కాదు అనలేక తనను అక్కడ వదిలి వచ్చాను …….. !! కానీ చేత కాక కాదు అది చూసుకుని నువ్వు ఇలా కళ్ళు తాగిన కోతి లా రెచ్చిపోతే నిన్ను ఎమ్ చేయడానికైనా సిద్ధమేనని …… !! చెప్పి తనను విసురుగా గోడ మీదకు నెడతాడు ……….. !!
కార్తికేయ నెట్టిన ఫోర్స్ కి నందన తల గోడకు తాకడం & దెబ్బ బలంగా తాకడం వల్ల నందన తల నుండి రక్తం కారుతూ కార్తికేయ చూస్తూ ఉండగానే స్పృహ లేకుండా పడిపోతుంది…… !! అది చూసిన కార్తికేయ…… ??
అంత ఈజీగా చెప్పేస్తే ఎలా నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి…… !! ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ స్టోరీ సో ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి 😈…… !! జీవితం అన్నాక సంతోషాలు మాత్రమే ఉండవు కదా కష్టాలు కూడా ఉంటాయి ఇది కూడా అంతే….. !! ఏ స్టోరీ లో అయినా సాడ్ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ రెండు ఉంటాయి….. !! స్టోరీ ను స్టోరీ లా మాత్రమే చూడండి 😈😈 లాజిక్స్ వెతక్కండి 😶 😶