నందు అంటూ ఒక్క సారిగా బెడ్ మీద నుంచి లేచి కూర్చున్న కార్తికేయ నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ….. !! చుట్టూ చూస్తాడు తను తన రూమ్ లోనే ఉన్నాడు అని అర్థం అవ్వడం తో తన ముందున్న వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ…… !! ఛా ఎంత గుర్తు చేసుకోకుండా ఉందాం అనుకున్నా నందు తో ఉన్న మెమోరీస్ నన్ను వదిలి పోవడం లేదు అని అసహనంగా బాల్కనీ లోకి వెళ్ళి నుంచుని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు…… !!
నా లైఫ్ లోకి ఎందుకే వచ్చావ్….. ?? చెల్లి, అమ్మ తో ఎంతో సంతోషంగా వెళ్తున్న నా లైఫ్ లోకి తుఫాను లా వచ్చి నన్ను నీళ్ళల్లో ముంచేసి వెళ్ళావ్….. !! నేను వద్దు అన్నా నువ్వే కావాలని మా అమ్మ ను సెంటిమెంట్ తో లాక్ చేసి నిన్ను పెళ్ళి చేసుకునేలా చేసి నా లైఫ్ లోకి వచ్చావ్….. !! కానీ నీతో నేను ఏ రోజు హ్యాపీగా లేను ఎప్పుడూ ఏదో ఒక గొడవ అంటూ నందన తో తన లైఫ్ ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ వరకూ అలా బాల్కనీ లో నుంచునే సిగరెట్ తాగుతూ ఉండిపోయాడు….. !!
ఆలోచన కొలిమిలో కొట్టుకుపోతున్న కార్తికేయ కి తన రెగ్యులర్ గా లేచే టైమ్ అవుతోందని అలారం గుర్తు చేయడం తో టైమ్ వైపు చూసుకుని నిద్రపోవాలి అనిపించక ఫ్రెష్ అయ్యి జిమ్ రూం వైపు వెళతాడు….. !!
( కార్తికేయ ఈ ఏజ్ లో కూడా మిస్ అవ్వకుండా డెయిలీ జిమ్ చేస్తాడు అందుకే తను ఫిట్ గా చూడ్డానికి మహాన్ కి ఫాదర్ లా కాకుండా బ్రదర్ లా ఉంటాడు 😜😎)
✨✨✨✨✨✨✨✨
మార్నింగ్ 4 కి మెయిడ్స్ డోర్ ఓపెన్ చేసి వాళ్ళ పనులు వాళ్లు చేస్తూ ఉంటారు …… !! వాళ్ళ మాటలకు మెళకువ వచ్చిన రాజ్ మత్తుగా కళ్ళు తెరచి తన మొబైల్ లోని టైమ్ చూసి భూమి కి మెళకువ రాకుండా …… !! బెంచ్ మీద పడుకో బెట్టి అక్కడున్న ఎయిర్ బెడ్, పిల్లో & చార్జింగ్ టేబుల్ ఫ్యాన్ & మిగిలిన థింగ్స్ కూడా తీసుకుని ఎవరి కంట పడకుండా ……. !!
ఎవరు చూడకముందే గోడ దూకి బయటకు వెళ్ళిన రాజ్ చేతిలో బ్యాగ్ పట్టుకుని ఆ ఇంటికి కొంచెం దూరం గా పార్క్ చేసిన తన కార్ దగ్గరకు వెళ్ళగానే రాజ్ కోసమే అక్కడే నైట్ నుండి వెయిట్ చేస్తున్న డ్రైవర్ . …. !! రాజ్ కూర్చోగానే కార్ ను రాజ్ ఫ్లాట్ వైపు డ్రైవ్ చేస్తాడు …… !! రాజ్ బ్యాక్ సీట్ లో బ్యాగ్ పెట్టేసి డ్రైవర్ పక్కన కూర్చుంటూ రాత్రంతా నిద్ర లేకపోవడం తో కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటాడు….. !!
మెయిడ్స్ బయట మొత్తం వుడ్చేసి ఇంట్లో కూడా మాప్ పెట్టినా నిద్రపోతున్న భూమి లేవకపోయేసరికి నందన వస్తే ఎక్కడ మళ్లీ భూమి ను కొడుతుందోనని …….. !! రేణుక ఫాస్ట్ గా భూమి దగ్గరకు వెళ్ళి భూమి… భూమి లేమ్మా 5 అవుతోంది అని మెల్లగా భూమి బుజం తట్టి లేపుతుంది …… !!
నెమ్మదిగా కళ్లు నులుముకుంటూ నిద్ర లేచిన భూమి ……. !! రేణుక ను చూసి షాక్ అయ్యి లేచి నిల్చుని రాజ్ కోసం చుట్టూ చూస్తుంది ……. !! కానీ తను కనిపించక పోయేసరికి టైమ్ గాడ్ ఎవరు చూడకముందే వెళ్ళిపోయాడు అని రిలాక్స్ అవుతుంది ……. !!
భూమి ఏమైంది ఎందుకలా ఉలిక్కిపడి లేచావ్ ……. ?? ఎవరి కోసం చూస్తున్నావ్ అంటూ భూమి చుట్టూ ఎవరి కోసమో వెతుకుతూ ఉంటే అయోమయంగా చూస్తూ అడుగుతుంది…. !!
హా… !! ఎం లేదక్కా అత్తయ్య వచ్చారేమో అనుకున్నా అంతే …… !! అని తన కంగారు తగ్గించుకుంటూ రేణుక వైపు నవ్వుతూ చూస్తుంది …… !!
మేడమ్ ఇంకా లేవలేదు భూమి …… !! బహుశా ఇవాళ లేట్ గా లేవచ్చు…… !! నైట్ మొత్తం ఇంట్లో పవర్ లేదు కదా …… !! అందుకే సరిగ్గా నిద్ర పోయి ఉండరు ……. !! అలా అని నువ్వు లేవకపోతే అది మేడమ్ కి తెలిస్తే ఊరుకోరు …… !! అందుకే నిద్ర లేపాను ఎమ్ అనుకోకమ్మా బయట వూడ్చి ముగ్గు కూడా పెట్టేసాను ……. !! నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి దీపం వెలిగించు ……. !! నేను ఈ లోపు అందరికి టీ రెడీ చేస్తాను అని చెప్పి లొపలికి వెల్తుంది రేణుక….. !!
వాట్?? రాత్రి నుండి ఇంకా పవర్ రాలేదా అని అప్పటికే నిద్ర మత్తు వదలడం తో మెయిడ్స్ కూడా తమ చేతుల్లో ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసుకుని వర్క్స్ చేయడం చూసి మొబైల్ తీసుకుని వెంటనే రాజ్ కి మెసేజ్ చేసి ఇంట్లోకి వెళుతుంది…… !!
మంచి స్లీప్ లో ఉన్న రాజ్ కి తన చేతిలో ఉన్న మొబైల్ వైబ్రేట్ అవ్వడం తో దాని వైపు చూసిన రాజ్ భూమి నుండి వచ్చిన మెసేజ్ కి ఒకే అని రిప్లై చేసి తనకు తెలిసిన ఎలక్ట్రీషియన్ కి కాల్ చేసి మహాన్ ఇంటికి పంపిస్తాడు….. !! వచ్చిన ఎలక్ట్రీషియన్ ను చూసి మహాన్ పిలిపించాడు అనుకున్న వర్కర్స్ సైలెంట్ గా ఉంటే ఆ ఎలక్ట్రీషియన్ మొత్తం సెట్ చేసి పవర్ వచ్చాక అక్కడి నుండి వెళ్ళిపోతాడు….. !!
తను బాత్ చేయడానికి వాష్ రూమ్ లోకి వెళ్తూ ఉండగా పవర్ రావడం తో నవ్వుతూ బాత్ చేసి పూజ రూమ్ లోకి వెళ్తుంది భూమి…… !! ఫాస్ట్ గా పూజ రూమ్ లో పూజ ఫినిష్ చేసుకుని తులసి చెట్టు దగ్గర దీపం పెడుతున్న భూమి కి తనను ఎవరో చూస్తున్నట్టు అనిపించడం తో చటుక్కున తల ఎత్తి చూసిన భూమి కి ఎవరూ కనిపించరు….. !!
ఏంటిది ఎవరు లేరు….. ?? అని చుట్టూ చూసిన భూమి కి ఎవరు కనిపించక పోయేసరికి అంతా నా భ్రమ అయ్యుంటుంది….. !! అని లైట్ తీసుకుని దీపం పెట్టడం పూర్తయ్యాక ఇంట్లోకి వెళ్తుంది…. !!
పూజ అవ్వగానే కిచెన్ లోకి వెళ్ళిన భూమి కి రేణుక టీ రెడీ చేసి పెట్టడం తో ముందుగా దేవయాని , విజయేంద్రప్రసాద్ ల రూమ్ డోర్ నాక్ చేస్తుంది ….. !! నైట్ మొత్తం నిద్ర లేక అప్పుడే లేచి ఫ్రెష్ అయి చీర కట్టుకుని తల దువ్వుకుంటున్న దేవయాని డోర్ ఓపెన్ చేసి ఎదురుగా చిరు నవ్వుతో నిల్చున్న భూమి ను చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ తల్లీ అంటూ టీ కప్ తీసుకుంటుంది …… !!
గుడ్ మార్నింగ్ అమ్మమ్మ ఇది తాతయ్య కోసం అంటూ మరో కప్ లో ఉన్న సుగర్ లెస్ టీ ఇస్తూ ట్రే లో మిగిలిన టీ కప్ పట్టుకుని నందన రూమ్ డోర్ నాక్ చేస్తుంది …… !!
నైట్ నుండి నిద్రపోకుండా రూమ్ లో ఉన్న స్వింగ్ చైర్ లో ఊగుతున్న నందన కి డోర్ నాక్ చేస్తుంది భూమి …… !! అని అర్థం అవ్వడంతో విసురుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి నవ్వుతూ నిల్చున్న భూమి ను చూసి కోపం నషాలానికి ఎక్కడం తో బెడ్ కాఫీ లేచాక ఇవ్వాలి లేపి కాదు …… !! ఇది కూడా నేర్పలేదా నీకు నీ మామ అంటూ కప్ నేలకేసి కొట్టి భూమి చంప పగల కొట్టడానికి ముందుకు రాబోతున్న నందన ను చూసిన భూమి పక్కకు తప్పుకోవడం తో…… !! నందన వెళ్ళి కింద పడి ఫ్లోర్ కి ముద్దు పెడుతుంది….. !! అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన మహాన్ అది చూసి అక్కడే ఆగిపోతాడు ……!! మహాన్ ను చూసిన భూమి అయ్యో అత్తయ్య అలా పడిపోయారు ఏంటి చూసుకోవాలి కదా అని నందన ను పైకి లేపుతూ ఇన్నోసెంట్ గా మొహాన్ని పెట్టుకుంటుంది….. !!
ఏయ్ డ్రామా ప్లే చేస్తున్నావా…. ?? నువ్వే కదే నన్ను కావాలని కింద పడేలా చేసావ్ అంటూ విసురుగా భూమి నుండి దూరం జరుగుతూ కోపంగా చూస్తూ అడుగుతుంది….. !! ఎందుకు అత్తయ్య నా మీద ఇంత పగ మీకు నేను నిజంగా మిమ్మల్ని పడేయాలి అనుకుంటే ఎందుకు కింద పడ్డ మిమ్మల్ని లేపుతాను చెప్పండి…… ??
ఏయ్ నిన్ను అంటూ కొట్టడానికి వస్తున్న నందన మహాన్ ను చూసి ఆగిపోతుంది….. !! భూమి కూడా అప్పుడే మహాన్ ను చూస్తున్నట్టు చూసి ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ అక్కడి నుండి వెళ్లిపోవడం చూసిన నందన అది కావాలనే నన్ను కింద పడేసింది మహాన్….. ??
మామ్ దానికి అంత సీన్ లేదు ….. !! నైట్ నిద్ర లేక డోర్ ఓపెన్ చేయగానే నిద్ర మత్తులో కింద పడుంటావ్ ఫస్ట్ వెళ్ళి పడుకో అంటూ మహాన్ కిందకు వెళ్ళడం చూసిన నందన కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది….. !! నేను ఎమ్ చెప్పినా నమ్మే వాడు ఇప్పుడేంటి జరిగింది చెప్తున్నా వినకుండా నాదే తప్ప అన్నట్టు అలా వెళ్ళిపోతున్నాడు అని వెళ్తున్న కొడుకు వైపు చూస్తూ ఇది నా కొడుకు ను బుట్ట లో కానీ వేసుకోలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది….. !!
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
దేవయాని అందరూ ఎవరి వర్క్స్ కి వాళ్ళు వెళ్ళిపోయాక టెంపుల్ కి వెళ్దాం అని భూమి కి చెప్పడం తో భూమి రేణుక కి హెల్ప్ చేస్తూ ఫాస్ట్ ఫాస్ట్ గా అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం లో హెల్ప్ చేస్తూ ఉంటుంది….. !! భూమి బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది నేను వెళ్ళి వీటిని డైనింగ్ టేబుల్ మీద పెడతాను నువ్వు అందరినీ పిలుచుకుని రా అని చెప్పగానే….. !! ఒకే అక్క అని అందరినీ బ్రేక్ఫాస్ట్ కి పిలుస్తుంది…….. !!
నైట్ సరిగ్గా నిద్ర లేక పవర్ వచ్చాక పిస్ఫుల్ గా పడుకున్న శ్లోక కి డోర్ నాక్ చేస్తున్న సౌండ్ కి చిరాకు రావడం తో విసుగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది….. !!
గుడ్ మార్నింగ్ శ్లోక అని చిరు నవ్వుతో చెప్తున్న భూమి వైపు కోపంగా చూస్తూ ఏయ్ నీకసలు బుద్దుందా హ్యాపీగా నిద్ర పోతున్న నన్ను ప్రొద్దున్నే నీ కాకి గొంతు వేసుకుని ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నావ్….. ?? అంటూ భూమి మీద కు చెయ్ ఎత్తిన శ్లోక చెయ్ పట్టుకుని వెనక్కి మడిచి టైమ్ 9 అవుతున్నా అడ్డ గాడిదా లా పడుకున్నది చాలక నన్నే తిడుతున్నావ్ ఇట్స్ నాట్ కరెక్ట్ శ్లోక….. ??
అయినా బుద్ధి లేనిది నాకు కాదు నీకు ముందు వెళ్ళి 10 మినిట్స్ లో ఫ్రెష్ అయ్యి రా లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఉండదు అని యాటిట్యూడ్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్తున్న భూమి ను చూసి శ్లోక కోపంగా…… !! అటు ఇటు చూస్తూ తన రూమ్ లో ఉన్న అరటిపండు ను చూసి ఆగవే నీ పని చెప్తా అని భూమి ముందుకు తను చూడకుండా ఆ అరటిపండు వేస్తుంది….. !!
అది చూడని భూమి అరటి పండు మీద కాలు వేసి స్లిప్ అయ్యి పడిపోతూ ఉంటే కిందకు వెళ్తున్న మహాన్ అది చూసి తను పడిపోకుండా నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకోవడం చూసిన శ్లోక 🤦🤦 ఆ కర్మ అని తల ను గోడకేసి కొట్టుకుంటూ ఉంటుంది…… !!
ఆఫీస్ కి రెడీ అయ్యి కిందకు వస్తున్న నందన వాళ్ళను చూసి రూమ్ బయటే ఆగిపోతే నందన ను చూసిన భూమి…… !! చూసావా నీ కొడుకు ను ఎలా పడేసానో అని నందన కు కన్ను కొట్టి మహాన్ ను చూసి సిగ్గు పడుతూ ఏంటి మహాన్ ఇది ఇవన్నీ మన బెడ్ రూమ్ లో చేస్తే బావుంటుంది…. !!
మనం ఇలా ఉన్నది అత్తయ్య చూస్తే కోప్పడతారు నువ్వు మరీ అల్లరి పిల్లాడివి అయిపోతున్నావ్ అబ్బా అని మహాన్ బుగ్గ గిల్లి అక్కడి నుంచి సిగ్గు పడుతూ పరిగెత్తడం చూసిన మహాన్ భూమి వైపు విచిత్రంగా చూస్తూ…… !! ఏమైంది దీనికి అని ఏదో సౌండ్ వస్తూ ఉంటే ఏంటిది అని పక్కకు చూసిన తనకు నందన పళ్ళు నూరుతూ కోపంగా కనిపిస్తుంది …… ??
ఇప్పుడు నందన మహాన్ మధ్య ఎమ్ జరగబోతుంది…. ?? భూమి గేమ్ ఎలా అనిపిస్తుంది…… ?? మహాన్ లో మార్పు మొదలయిందా…… ?? దేవయాని భూమి ను గుడి కి తీసుకు వెళ్తుందా లేదా….. ?? కార్తికేయ నందన గతం పూర్తిగా కావాలా లేక అది సగం ప్రెసెంట్ స్టోరీ సగం ఇస్తూ రెండు ప్యారెలెల్ గా చూపించనా…… ?? మీకు ఈ స్టోరీ ఎలా అనిపిస్తుంది….. ?? డోంట్ ఫర్గెట్ టు కామెంట్, లైక్ & హైప్ టు ది స్టోరీ ❤️