నీ ఊపిరి సాక్షిగా ❣️-15

రాజ్ స్మైల్ చూసిన భూమి అన్నయ్య నో….. !! ఇప్పుడు నువ్వు ఎమ్ చేసినా వాళ్ళకు డౌబ్ట్ వస్తుంది….. !! ప్లీస్ రా నువ్వు వెళ్ళిపో నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్ గా ఉంది అని అటు ఇటు చూస్తూ చెప్తుంది…… !!

 

భూమి నువ్వు ఇప్పటి దాకా వాళ్ళ ఆట చూసావ్ మరి ఈ పోలీసోడి ఆట ఎలా ఉంటుందో కూడా చూపించాలి కదా వాళ్లకు …… ?? నువ్వు ఇంకేం చెప్పకుండా పదా ఆ బోర్డ్ ఎక్కడో చూపించు అంటూ…… !!  భూమి చెయ్ పట్టుకొని ఆ బోర్డ్ దగ్గరకు తీసుకుని వెళ్లి భూమి ఆ బోర్డ్  చూపెట్టాక …… !!

ఆ బోర్డ్ వైపు చూసి హ్మ్మ్…. !!   నువ్వు కాస్త దూరం జరుగు అంటూ భూమి ను దూరం జరిపి ఆ బోర్డ్ ఓపెన్ చేసి ఫ్యూస్ తీసేయడం తో పాటు …… !! జనరేటర్ కూడా వర్క్ చేయకుండా సక్సెస్ఫుల్ గా అన్ని వైర్స్ కి వున్న కనెక్షన్ తీసేయడం తో  భూమి షాక్ అవుతూ అన్నయ్య వాట్ ఆర్ యూ డూయింగ్ అంటూ రాజ్ ను ఆపబోతుంది…… !!

భూమి ఎమ్ అవ్వదు ఇవాళ రాత్రి వాళ్ళు నీకు నిద్రలేకుండా చేయాలి అనుకున్నారు కానీ వాళ్ళు ఎలా నిద్రపోతారో నేను చూస్తా అని నవ్వుతూ తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఇవాళ ఇంట్లో ఉన్న ఎవరి మొబైల్స్ వర్క్ చేయకూడదు ఆని ఆర్డర్ వేసి అందరి మొబైల్ నంబర్స్ తన ఫ్రెండ్ కి ఫార్వర్డ్ చేసి భూమి వైపు కన్ను కొడుతూ ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఆట అని నవ్వుతూ చూస్తాడు ….. !!

అన్నయ్య ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నావ్ …..  ?? నువ్వే ఇలా చేశావ్ అని మహాన్ కి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో ఆలోచించావా ….. ?? అందులోనూ మన సూర్యకాంతం అత్తయ్య కూడా ఉంది….. !!

ఆ మహాన్ కి అంత బుర్ర ఉందని నేను అనుకోవడం లేదు….. !! నిన్ను వీళ్ళు బాధ పెడుతున్నారు అని తెలిసిన మరు క్షణం నేను ఇలాగే వస్తూ ఉంటాను & వాళ్ళకు నా స్టైల్ టార్చర్ కూడా చూపిస్తా….. !! అయినా ఇంకా ఆట మొదలు పెట్టకుండానే డ్రాప్ ఎలా అవుతాను చెప్పు….. !!

 

నువ్వు దాని గురించి వదిలేసి ఇలా రా అంటూ భూమి ను బెంచ్ దగ్గరకు తీసుకుని వచ్చి పక్కనే కూర్చో పెట్టుకుని 2 డేస్ కే ఎలా అయిపోయావో చూడు…… !! వాళ్లకు మంచిగా చెప్తే వినరు భూమి మనం కూడా వాళ్ళ వే లోనే వెళ్ళి వాళ్ళకు బుద్ది చెప్పాలి…. !!

అన్నయ్య నేను కూడా అదే చేయబోతున్నా నీకు ఒక విషయం చెప్పనా అంటూ ఈవెనింగ్ తను నందన & శ్లోక కి ఎలా జలక్ ఇచ్చిందో చెప్పి నవ్వగానే రాజ్ కూడా నవ్వుతూ అదీ నా చెల్లి అంటే 😎….. !! ఇప్పుడు ఈ రాజ్ చెల్లివి అనిపించావ్ అని భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నీ కళ్ళల్లో నేను మరో సారి కన్నీళ్ళు చూడకూడదు….. !!

చూస్తే మాత్రం ఎవరినీ వదిలిపెట్టను అని కోపంగా చెప్తున్న రాజ్ ను చూసి భూమి నవ్వుతూ ఇక నుండి వాళ్ళు నాలో కొత్త భూమిని చూస్తారు అన్నయ్య అని చెప్పి అవును అసలు నువ్వు ఎలా వచ్చావ్ ఇక్కడికి….?? నేను గార్డెన్ లో ఉన్నట్టు నీకు ఎవరు చెప్పారు…. ?? అని దూరం జరుగుతూ అడుగుతుంది…… !!

ఓహ్ అదా ఉంది గా సూర్పణక అదే నీ పిక్ నాకు సెండ్ చేసి మరీ నీ చెల్లి చూడు ఎలా ఏడుస్తూ కూర్చుందో …… !!  తను నైట్ మొత్తం బయటే ఉండాలి అని కాల్ చేసి మరీ చెప్పింది…. !! అది చూస్తూ నేను క్షణం కూడా రాకుండా ఉండలేక పోయాను అందుకే వెంటనే వచ్చేసాను….. !!

 

అయినా  పవర్ తీసినందుకు నువ్వు టెన్షన్ పడకు నేనే వచ్చి తీసినట్టు ఎలా తెలుస్తుంది భూమి ….. ?? అంటూ భూమి ను దగ్గరకు తీసుకొని నేను ఇంట్లోకి రావడం సెక్యూరిటీ గార్డ్స్ కూడా చూడలేదు & ఇక్కడ ఉన్న డాగిస్ కి కూడా మార్నింగ్ వరకూ లేవకుండా బిస్కెట్స్ లో స్లీపింగ్ పిల్స్ కలిపి వేసాను అవి తిని డాగీస్ హ్యాపీగా బజ్జున్నాయి సో ఇక నో వర్రీస్….. !!

.        ఇక నువ్వు వాటి గురించి వదిలేసి హ్యాపీగా పడుకో రేపటి నుండి వాళ్ళకు నీ స్టైల్ లో టార్చర్ చూపెట్టు …… !! ఇవాళ మాత్రం ఆ బ్రెయిన్ కి రెస్ట్ ఇచ్చి పడుకో …… !! ఎందుకంటే నన్ను కనుక్కోవడం ఆ మహాన్ గాడి వల్ల అవ్వదు&  నీకు తిండి & నిద్ర లేకుండా చేయాలి అనుకున్న వాల్లకు నేను పిస్ఫుల్ గా నిద్ర పోనిస్తానా …… ?? అంటూ అప్పుడే అక్కడికీ ఎవరికి తెలియకుండా వస్తున్న తన కానిస్టేబుల్స్ వైపు రాజ్ నవ్వుతూ చూడ్డం తో వాళ్ళు ఎలా వచ్చారో అర్తం అవ్వక భూమి వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తోంది ……. !!

ఇద్దరు రాజ్ కి సెల్యూట్ చేసి అక్కడే ఎయిర్ బెడ్ ఆరెంజ్ చేసి ఎయిర్ ఫిల్ చేశాక బెడ్ షీట్ ఎయిర్ పిళ్లోస్ & టేబుల్ ఫ్యాన్ కూడా ఆరెంజ్ చేస్తారు …… !! భూమి కోసం స్పెషల్ గా తెచ్చిన హైదరాబాద్ దమ్ బిర్యాని ప్లేట్ లో పెట్టి చికెన్ కర్రీ, రైతా వేసి రాజ్ చేతిలో పెడతారు …… !!

అన్నయ్య ఎన్టీ ఇదంతా …… !! ఇప్పుడు ఇది అవసరమా ఎందుకింత రిస్క్ చేస్తున్నావ్ …… ?? నేను ఆల్రెడీ తినేసాను కానీ నువ్వు తిను ….. !!

నువ్వు మార్నింగ్ నుండి ఎమ్ తినలేదు అని నాకు తెలుసు భూమి …… !! నీకు ఆకలి లేదు అని చెప్తున్నావ్ కానీ అది నీ కళ్ళల్లో క్లియర్ గా కనిపిస్తుంది & మొహం చూడు ఎలా పీక్కుపోయిందో ముందు కామ్ గా తిను బిర్యానీ వేడిగా ఉంది …… !! ఇది నీ ఫేవరెట్ అని తెప్పించాను అంటూ భూమి కి ప్రేమగా తినిపిస్తున్న రాజ్ ను చూసి భూమి కళ్ళల్లోకి నీళ్లు చేరుతాయి ….  !!

 

తను చెప్పకుండా నే తన ఆకలికి గుర్తించి అమ్మ లా అన్నం పెడుతున్న రాజ్ ను చూసి కన్నీళ్ళు తుడుచుకుంటూ రాజ్ పెట్టింది మొత్తం వద్దు అనకుండా తినేస్తుంది …… !! అన్నయ్య నువ్వు కూడా తిను అని రాజ్ కి కూడా తినిపిస్తూ ఇద్దరూ సగం కడుపు ఆనందం తో ఇంకో సగం బిర్యానీ తో ఫిల్ చేసుకుంటారు….. !!

హ్యాండ్ వాష్ చేసుకున్న రాజ్ చేతికి మరో బాక్స్ & స్పూన్ ఇవ్వగానే రాజ్ బాక్స్ ను ఓపెన్ చేస్తూ నీకు ఏదైనా స్పైసీ తినగానే స్వీట్ తినడం ఇష్టం కదా ……. !! అందుకే నీ కోసం స్పెషల్ గా నీకు ఇష్టమైన కషీ హల్వా కళాకండ్ ప్రిపేర్ చేయించుకుని తీసుకు రమ్మన్నా హ్యావ్ ఇట్ అంటూ భూమి నోటి దగ్గర స్పూన్ పెడతాడు….. !!

డీప్ స్లీప్ లో ఉన్న భూమి మొబైల్ వైబ్రేట్ అవుతూ ఉంటే మత్తుగా కళ్ళు తెరిచి దాన్ని చేత్తో పట్టుకుని అన్సర్ చేసి హెలో ఎవరు ….. ?? అంటూ డ్రౌజీ నెస్ తోనే కళ్ళు కూడా తెరవకుండా అడుగుతుంది….. !!

భూమి ఇట్స్ మీ బాల్కనీ డోర్ దగ్గరకు రా క్విక్ అంటూ కాల్ కట్ చేసిన మహాన్ వాయిస్ కి నిద్ర మత్తు ఎగిరిపోవడం తో ఫాస్ట్ గా లేచి కూర్చుంటూ….. !! మహాన్ ఈ టైమ్ లో ఎందుకు వచ్చాడు అని లైట్ ఆన్ చేసి టైమ్ మిడ్ నైట్ 2 అవ్వడం చూసి ఫాస్ట్ గా బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే మహాన్ చలికి వణుకుతూ బాక్సర్ అండ్ స్లీవ్లెస్ వీ నెక్ టీ షర్ట్ లో కనిపిస్తాడు….. !!

మహాన్ ఏంటిది….. ?? ఈ టైం లో ఇక్కడికి ఎలా వచ్చావ్ & ఇంత చలిలో ఎందుకు వచ్చావ్….. !! ఫస్ట్ లోపలికి పదా అంటూ మహాన్ ను లోపలికి తీసుకుని వచ్చి డోర్ లాక్ చేస్తూ ఎట్లిస్ట్ షర్ట్ కూడా వేసుకోకుండా వచ్చావ్ ఏంటి మహాన్…. ?? బయట బాగా చలిగా ఉంది అంటూ తను మహాన్ కోసం తీసుకున్న హుడీ మహాన్ కి ఇస్తూ అడుగుతుంది….. !!

మహాన్ దాన్ని వేసుకుంటూ డిన్నర్ చేసాక కషీ హల్వా తినాలి అనుంది బట్ అది ఎక్కడ స్టాక్ లేదట అని చెప్పావ్ కదా భూమి అందుకే నీ కోసం 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ అక్కడ నుంచి తీసుకుని వచ్చేసరికి ఈ టైం అయిపోయింది….. !! వాట్ దీని గురించి అంత దూరం ఇంత నైట్ వెళ్ళావా అని అడుగుతున్న భూమి వైపు చూస్తూ నీ విషయం లో నేను ఎదీ లైట్ గా తీసుకోను భూమి ….. !! నా భూమి ఏదైనా కావాలి అంటే నేను తీసుకుని రాకుండా ఎలా ఉంటాను చెప్పు నీ విషయం లో నాకు ప్రతిదీ ఇంపార్టెంట్ అంటూ భూమి ను గట్టిగా హత్తుకుని నాలుగు పెదాలు కలిపేస్తాడు….. !!

రూమ్ మొత్తం చాలా నిశబ్దంగా ఉంది….. !! భూమి, మహాన్ ఎదురెదురుగా నుంచుని ఒకరి కళ్ళల్లోకి మరొకరు ప్రేమగా చూసుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వచ్చి నుంచోగానే … !! విండో నుండి వస్తున్న చల్లని గాలి తమ మేనిని తాకుతూ చల్లగా ఉన్నా ఇద్దరిలో ఏదో తెలియని కంగారు….. !! మహాన్ ఇంటెన్స్ లుక్స్ కి భూమి కంగారుగా అక్కడి నుండి బాల్కనీ వైపు వెళ్తూ ఉంటే మహాన్ భూమి చేతిని పట్టుకుంటూ తన మీదకు లాక్కుంటాడు….. !!

ఎందుకంత కంగారు అని నుదుటిన పడుతున్న హెయిర్ ను చెవి వెనుక పెడుతూ భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఇరు పెదవులను కలపగానే భూమి లో తెలియని అలజడి….. !! అది ఇద్దరికీ ఫస్ట్ కిస్ అవ్వడం తో ఫస్ట్ నెర్వస్ ఫీల్ అయినా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ వల్ల ఇద్దరూ ఒకరి నాలుక తో ఒకరు లిక్ చేస్తూ ఎంగిలి కూడా అమృతం లా ఉంటుందని ఫీల్ అవుతూ అలా ఎంత సేపు ఉన్నారో వారికే తెలియదు….. !!

 

అరగంట తర్వాత మహాన్ కి దూరంగా జరిగిన భూమి అప్పటికే మహాన్ వొళ్ళో ఉండడం చూసి సిగ్గు తో దూరం జరుగుతూ ఇంత కంటే ముందుకు వెళ్తే బాగోదు…. !! నువ్వు వెళ్ళు మహాన్ అని చెప్పడం చూసి మహాన్ నవ్వుతూ తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి భూమి కి స్వీట్ తినిపిస్తూ….. !! తను కూడా తిని హు ఈ స్వీట్ కంటే నీ లిప్స్ నే స్వీట్ గా ఉన్నాయి అని భూమి కింద పెదవిని తను పెదాల మధ్య కి తీసుకుని మరో కిస్ కూడా తన అకౌంట్ లో వేసుకుంటాడు….. !!

భూమి !! రాజ్ అరుపుకు మహాన్ జ్ఞాపకాల నుండి బయటకు వచ్చిన భూమి హా!! అంటూ రాజ్ వైపు చూస్తుంది….. !! ఏమైంది నీకు స్వీట్ తిను అంటే ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయావ్ ఆర్ యూ ఆల్రైట్….. ??

ఆ…. !! ఏదో ఆలోచిస్తున్న అంతే అని రాజ్ పెడుతున్న స్వీట్ తింటూ మహాన్ తో తనకున్న మెమోరీస్ గుర్తు చేసుకుంటూ ఉంటే మరో వైపు మహాన్ కూడా భూమి మెమోరీస్ ను తనను చుట్టు ముట్టి వెళ్ళను అని మొండికి వేస్తూ ఉంటే షవర్ చేస్తూ ఉంటాడు….. !!

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

తనకు ఇష్టమైనవి డిన్నర్ లో ఫుల్ గా లాగించేసి ఫ్రెష్ అయ్యి మూవీ చూడాలి అని తన రూమ్ లో ఉన్న టీవీ ఆన్ చేసిన శ్లోక కి స్విచ్ బోర్డ్ మీద చెయ్ పెట్టగానే పవర్ పోతుంది….. !! ఓహ్ గాడ్ ఏంటిది సడెన్ గా పవర్ పోయింది అని ఇరిటేట్ అవుతూ తన మొబైల్ తీసుకుని పక్క రూమ్ లో ఉన్న నందన కి కాల్ చేస్తుంది….. !! ( పాప కి పక్క రూమ్ కి వెళ్ళడానికి కూడా అంత బద్దకం అనమాట 🫣)

ఏంటిది నా మొబైల్ వర్క్ అవ్వట్లేదు అని మొబైల్ వైపు చూస్తూ షట్ సిగ్నల్స్ లేవా అని తల కొట్టుకుంటూ మామ్….. మామ్ అని అరుస్తూ తన రూమ్ నుండి నందన రూమ్ ముందుకు వెళ్ళి డోర్ బాదేస్తుంది…… !!

అప్పటికే పవర్ పోయి జెనరేటర్ కూడా వర్క్ చేయట్లేదు అని వాచ్ మెన్ కింద నుండి చెప్పడం తో ఇరిటేట్ అవుతున్న నందన విసుగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది….. !!

మామ్ వాట్ ఇస్ దిస్….. ?? ఎప్పుడు లేనిది మన ఇంట్లో పవర్ పోవడం ఏంటి….. !! అర్జంట్ గా జెనరేటర్ ఆన్ చేయమని చెప్పు అంటూ కోపంగా అరుస్తుంది …… !! నాకు ఏ. సీ లేకపోతే నిద్ర రాదని నీకు తెలుసు కదా….. !!

జెనరేటర్ వర్క్ అవ్వట్లేదట ఏవో వైర్స్ కట్ అయ్యాయి వాటిని సెట్ చేయాలంటే ఎలెక్ట్రీషియన్ రావాలని చెప్పాడు సో వాడు వచ్చే వరకు వెయిట్ చేయడం తప్పా నో ఆప్షన్….. ??

దెన్ వై ఆర్ యూ వేస్టింగ్ ది టైం మామ్….. ?? కాల్ హిం ఇమ్మిడిఎట్లీ & సడెన్ గా పవర్, జెనరేటర్ ఏవీ వర్క్ అవ్వకుండా పోవడం ఏంటి చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది కదా….. ??

శ్లోక మాటకు నా 3 మొబైల్స్ వర్క్ అవ్వట్లేదు…… !! ఇదంతా ఆ కార్తికేయ పనే అయ్యుంటుంది అని పళ్ళు నూరుతూ ఆ భూమి ను మనం బయటకు నెట్టాం అని తెలుసుకుని ఇలా మనకు నిద్ర లేకుండా రివెంజ్ తీర్చుకుంటున్నాడు ….. !!

హు ఆయనకు మన మీద కంటే ఆవిడ మీదే లవ్ ఎక్కువ కదా ఎమ్ చేస్తాం అని శ్లోక విసురుగా తన రూమ్ కి వెళ్ళిపోతుంది….. !! శ్లోక వైపు చూస్తూ మహాన్ రూమ్ లోకి వెళ్ళిన నందన కి అప్పుడే బాత్ చేసి వచ్చి కబోర్డ్ ముందు నుంచుని డ్రెస్సెస్ చూస్తూ కనిపిస్తాడు మహాన్….. !!

తనకు భూమి ఇచ్చిన హుడీ వైపు చూస్తూ నుంచున్న మహాన్ కి నందన వాయిస్ వినిపించడం తో కంగారుగా దాన్ని లోపల పెట్టేస్తూ వెనక్కి తిరిగి నందన వైపు చూస్తాడు….. !! ఎమ్ చేస్తున్నావ్ మహాన్ అని ఫ్లాష్ లైట్ వెలుగులో కనిపిస్తున్న మహాన్ ను చూస్తూ నీ మొబైల్ వర్క్ చేస్తూ ఉంటే ఎలక్ట్రీషియన్ కి కాల్ చేసి రమ్మని చెప్పు …. !!

నో మామ్ నా మొబైల్ కూడా వర్క్ చేయట్లేదు నేను దాని గురించి థింక్ చేస్తున్నాను అని చెప్తున్న మహాన్ వైపు చూసి ఇదంతా ఆ కార్తికేయ పని మహాన్….. !! చూసావా నన్ను మనశ్శాంతిగా కూడా పడుకోకుండా చేస్తున్నాడు అని మహాన్ లో చిగురిస్తున్న ప్రేమ ను తన మాటలతో చంపేస్తుంది నందన….. !!

మామ్ ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు వెళ్ళి పడుకో నేను పవర్ ఎలా కట్ అయిందో చూసి వస్తాను అని డ్రెస్ అప్ అయి తన మొబైల్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి కిందకు దిగి గార్డెన్ వైపు వస్తూ ఉంటాడు….. !! మరో వైపు భూమి, రాజ్ బెడ్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ మహాన్ వచ్చేది ఇద్దరూ గమనించరు…… !!

🌟🌟🌟🌟🌟🌟🌟🌟

అమ్మా!! చాలా లేట్ అయింది రా డిన్నర్ చేద్దాం….. !! అన్నయ్య వచ్చేసరికి లేట్ అవ్వచ్చు & రాజ్ కూడా ఇపుడే వచ్చేలా లేడు…. !! కాల్స్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు మే బీ బిజీగా ఉన్నాడేమో ….. ?? అని అనసూయ పక్కన కూర్చుంటూ తనను డిన్నర్ కి పిలుస్తుంది మానస….. !!

నాకు తినాలి అని లేదు మను ఇద్దరూ ( రాజ్, కార్తికేయ) మార్నింగ్ కూడా భూమి గురించి ఆలోచిస్తూ తినకుండా వెళ్ళిపోయారు….. !! మధ్యాహ్నం కూడా తిన్నారో లేదో ఇపుడు 9:30 అవుతున్నా ఇద్దరూ ఇంకా రాలేదు… !!

 

భూమి గురించి ఆలోచిస్తూ వీళ్ళు ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవడం లేదు….. !! ముందు వీళ్ళు హెల్తీ గా ఉంటే కదా భూమి ని అక్కడి నుంచి తీసుకుని రాగలరు అని బాధగా చెప్తూ ఉన్నప్పుడే కార్తికేయ ఆఫీస్ నుండి ఇంట్లోకి వస్తూ కనిపిస్తాడు….. !!

అమ్మా!! అన్నయ్య వస్తున్నాడు అని కార్తికేయ ను చూసి లేచి నుంచుంటూ ఎంటన్నయ్యా ఇంత లేట్ అయింది….. ?? అమ్మ నీ కోసం డిన్నర్ కూడా చేయకుండా వెయిట్ చేస్తుంది అని చెప్తూ కార్తికేయ చేతిలోని బ్యాగ్ తీసుకుని తన చేతికి అయిన గాయం చూస్తుంది….. !!

అయ్యో ఏంటిది అన్నయ్య అని కంగారుగా అడుగుతున్న మానస ను చూసి డోర్ లో చూడకుండా హ్యాండ్ లాక్ అయింది మను అంతే నువ్వు కంగారు పడకు……. !! చిన్న దెబ్బే కదా అంటూ సోఫా లో కూర్చుంటున్న కార్తికేయ ను చూసి అంత పెద్దగా దెబ్బ కనిపిస్తుంటే ఇంకా దేనికి కార్తికేయ అబద్దం చెప్తున్నావ్….. ?? మను నువ్వు ముందు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రా అని మానస ను అక్కడి నుంచి పంపి ఆ రాక్షసి మీద ఉన్న కోపం తో నిన్ను నువ్వు ఎందుకు కార్తికేయ గాయ పరుచుకుంటావ్ ….. ?? దీనికి కారణం అదే అని నాకు బాగా తెలుసు…. !! నీ జీవితాన్ని నా చేతులతో నాశనం చేసాను అని బాధగా కార్తికేయ వైపు చూస్తూ అంటుంది….. !!

ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి కాదమ్మా ఇప్పుడు మన కళ్ళ ముందు నాశనం అవుతున్న భూమి జీవితాన్ని చూస్తూ కూడా ఇలా సైలెంట్ గా ఉన్నందుకు నా మీద నాకే కోపంగా ఉంది…… !!

మను కూడా భూమి గురించి చాలా బాధ పడుతుంది కార్తికేయ…… !! పైగా రాజ్ కి కూడా భూమి పెళ్ళి విషయం తెలిసి ఇంట్లో పెద్ద గొడవే చేశాడు….. !! పిల్లలను చూస్తుంటే భయంగా ఉంది మీ మధ్య ఉన్న గొడవ వల్ల వాళ్ళు ఒకరి మీద ఒకరు పగలు, ప్రతీకారాలు పెంచుకుంటున్నారు ….. !!

ఒక సారి నువ్వు నీ కొడుకు మహాన్ తో మాట్లాడి దీనికి సొల్యూషన్ ఇస్తే అందరం బావుంటాం….. !! చీ!! ఆ వెధవని నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉందమ్మా…. !! నా కళ్ళ ముందే వాడు నా చిట్టి తల్లీ మీద చెయ్ చేసుకున్నాడు …… !! అక్కడికక్కడే వాడి చేయ్ నరికేయాలి అన్నంత కోపం వచ్చింది కేవలం భూమి కోసమే వాడ్ని కొట్టకుండా వదిలేసాను …… !! వాడు నందన కొడుకు మాత్రమే నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు…… !!

 

అనవసరమైన బంధుత్వాలు కలపకు అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి తనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న మను వైపు చూస్తూ….. !! భూమి గురించి వర్రీ అవ్వకు మను చిట్టి తల్లీ ను త్వరలోనే మన ఇంటికి తెచ్చేస్తాను అని చెప్పి తన రూమ్ కి వెళ్తూ నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని చెప్పి ఆగకుండా వెళ్తున్న కార్తికేయ ను చూసి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటారు….. !!

 

రాజ్ శ్లోక కి ఎలా బుద్ధి చెప్పనున్నాడు….. ?? పాస్ట్ లో అంతలా లవ్ చేసిన మహాన్ ఇపుడు ఇలా బిహేవ్ చేయడానికి నందన మీదున్న ప్రేమే కారణమా…… ?? గార్డెన్ లో కూర్చున్న రాజ్, భూమి లను మహాన్ చూస్తే తర్వాత ఏం జరుగుతుంది…… ?? కార్తికేయ, నందన గతం ఎంత మంది కి కావాలో కామెంట్స్ లో చెప్పండి 😌….. !!

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply