అఫీస్ నుండి ఇంటికి వచ్చిన మహాన్ కి ఎక్కడ ఒక్క లైట్ కూడా అన్ లో లేకపోవడం చూసి ఏమైంది వీళ్లకు ఇంత చీకటి అవుతున్నా ఒక లైట్ కూడా అన్ చేయలేదు ……. !! అంటూ తన బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వెళ్తున్న మహాన్ కి గార్డెన్ లో ఫ్లాష్ లైట్ వెలుగుతూ కనిపించే సరికి అటుగా నడుస్తాడు …… !!
అప్పటికే చీకట్లు అలుముకున్న ఆకాశాన్ని చూస్తూ ఒక్క లైట్ కూడా లేకపోవడం వల్ల అంతా చీకటిగా కనిపిస్తున్న గార్డెన్ ను చూసి ఇందాక నందన ను తను ఏడిపించడం గుర్తు చేసుకుని నవ్వుకుంటున్న భూమి కి ఆ చీకటిలో ఎవరిదో అడుగుల చప్పుడు తనకు దగ్గరగా వినిపించే సరికి ఎవరు వస్తున్నారు అని అడుగుల చప్పుడు వున్న వైపు చూస్తూ ఉంటుంది …… !!
ఆ అడుగుల చప్పుడు తనకు మరింత దగ్గరగా వినిపించే సరికి బెంచ్ దిగి ఫ్లాష్ లైట్ వేసి అటుగా వేసిన భూమి కి తన వైపే వస్తున్న మహాన్ కనిపించే సరికి …… !! తన మెదడు లో ఏదో స్ట్రైక్ అవ్వడం తో మొబైల్ బెంచ్ మీద పెట్టి ఏడుస్తూ అదే ….. !! ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ వెళ్ళి మహాన్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుని వణుకుతుంది …… !!
సడెన్ గా పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హగ్ చేసుకున్న భూమి ను చూసి ఆ ఫోర్స్ కి పడిపోయే వాడు కాస్త నిలదొక్కుకుని భూమి వైపు చూస్తాడు ….. !! అప్పటికే బయం తో వణుకుతున్న గొంతు తో నువ్వే పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఒకే మహాన్ బట్ నాకు ఈ చీకటి అంటే బయం వేస్తుంది ….. !!
ప్లీజ్ మహాన్ నన్ను ఇంట్లోకి రానివ్వు …… !! నాకు ఇక్కడ ఉండాలి అంటే చాలా భయంగా ఉంది & బయట కుక్కలు కూడా అరుస్తున్నాయి ….. !! ఇక్కడ చూస్తే ఒక్క లైట్ కూడా ఆన్ లో లేదు …. !! నాకు నిజంగా చాలా భయమేస్తుంది ప్లీస్ మహాన్ నన్ను కూడా నీతో పాటు ఇంట్లోకి తీసుకొని వెల్లు …… !! అంటూ మరింత గట్టిగా మహాన్ ను హత్తుకుని మెడ దగ్గర కిస్ పెడుతుంది…… !! భూమి కిస్ కి మహాన్ నరాలు మొత్తం జివ్వుమంటూ ఎక్కడో అడుగున ఉన్న భూమి మీద ఉన్న ప్రేమ మళ్ళీ తన హృదయాన్ని తాకడం తో తనను వదలకుండా భయం తో ఏడుస్తున్న భూమి ను చూసి తనకు తెలియకుండా నే తన చుట్టు చేతులు వేస్తాడు మహాన్ …… !!
మహాన్ రెస్పాన్స్ కి భూమి నవ్వుకుంటూ ఐ నో మహాన్ నీకు నేనంటే ప్రేమ ఉంది బట్ అది మీ అమ్మ మీదున్న ప్రేమ వల్ల దాన్ని నువ్వు ఫీల్ అవ్వలేక పోతున్నావ్….. !! బట్ ఆ ప్రేమను ఎలా అయినా బయటకు రప్పించి నీతో ఐ లవ్ యూ ♥️ అని చెప్పించుకుంటాను అని మరింతగా మహాన్ ను హత్తుకుని తనలో అలజడి రేకెత్తిస్తుంది…… !!
తన గుండెను తాకిన భూమి గుండె వైపు చూసి మహాన్ ట్రాన్స్ లోకి వెళ్ళినట్టు భూమి నుండి దూరం జరిగి భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన వైపు చూస్తూ ఉంటాడు….. !! అదురుతున్న భూమి ఎర్రటి గులాబీ పెదాల వైపు చూస్తూ భూమి పెదాల దగ్గరకు తన పెదాలను తీసుకుని వచ్చి నాలుగు పెదాలు ఒక్కటి అవ్వబోతున్న టైమ్ కి వాట్?? అంటూ అటుగా వస్తున్న విజయేంద్ర ప్రసాద్ ను చూసిన మహాన్ కి తనేం చేస్తున్నాడో…… ?? తెలుసుకుని చటుక్కున భూమి ను విసురుగా వెనక్కి నెట్టి భూమి వైపు తిరిగి కూడా చూడకుండా ఇంట్లోకి వెళ్తాడు …… !! అప్పుడే అటుగా వచ్చిన విజయేంద్ర అది చూసి నవ్వూతూ భూమి దగ్గరకు వస్తాడు ….. !!
మహాన్ తనను వెనక్కి నెటతాడు అని ఎక్ష్పెక్ట్ చేయని భూమి మహాన్ తోయగానే కింద పడబోతూ లాస్ట్ మినిట్ లో బెంచ్ సపోర్ట్ తో నుంచుని మహాన్ వెళ్లిన వైపే బాధ నిండిన కళ్ళతో చూస్తూ …… !! ఎందుకిలా రాక్ లా మరిపోయావ్ మహాన్ …… ?? నా మీద నీకు ప్రేమ ఉందని తెలుస్తున్నా అది ఎందుకు నువ్వు కనిపించకుండా దాచేస్తున్నావ్ ….. ?? నువ్వు ఎంత దాయాలి అని చూసినా నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ నేను చూసాను…… !!
అపుడు నువ్వు నా మీద చూపించిన ప్రేమ, కేరింగ్ అన్నీ నిజమే అని హ్యాపీ టియర్స్ తుడుచుకుంటూ ….. !! మీ మామ్ నన్ను లవ్ చేసినట్టు యాక్ట్ చేయమంటే నువ్వు నీకు తెలియకుండా నన్ను ట్రూ గా లవ్ చేసావ్….. !! నా కాలికి గాజు ముక్క గుచ్చుకుంటేనే నీ కళ్లల్లో రక్తం కారేది అలాంటిది ఈ రోజు నువ్వే నన్ను ఆ గాజు ముక్క తో గుండెళ్ళో పొడుస్తున్నావ్ ….. ?? అని అపోహ పడ్డా బట్ ఇట్ వాస్ క్లియర్ నీకు నేనంటే ఇష్టం….. !! ఇది చాలు నా మీద ఉన్న ప్రేమను బయట పెట్టడానికి అని వెళ్తున్న మహాన్ ను చూస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది…… !!
ఏడుస్తున్న భూమి ముందుకు వచ్చి నిల్చుని నోట్లోని సిగరెట్ పొగ వదులుతూ ఎన్టీ భూమి ఏడుస్తున్నావా ……. ?? ఆచ్చచ్చో ఎంత కష్టం వచ్చింది నీకు అయినా ఇక్కడే ఉంటూ ఇన్ని బాధలు అనుభవించే బదులు మీ ఇంటికి వెళ్లిపోవచ్చు కదా భూమి…… ?? ఎందుకు చెప్పు ఈ కష్టాలు పడడం మీ ఇంటికి వెళ్తే నిన్ను మహారాణి లా చూసుకునే మీ మావయ్యా వుండగా ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటున్నావ్ …… ??
విజయేంద్ర ప్రసాద్ ను చూసి నవ్వుతూ పెళ్లి జరిగిన తర్వాత నాకే కాదు తాతయ్య ఏ అమ్మాయికి అయినా మెట్టినిల్లే తన ఇల్లు అవుతుంది ….. !! తప్పా పుట్టిల్లు ఎప్పటికి తనది అవ్వదు కాబట్టీ నా ఇల్లు వదిలి నేను ఎందుకు వెళ్తాను …… !! అయినా నేను నీ కూతురి లా అత్తారిల్లు వదిలి వెళ్ళే టైప్ కాదు…… !! మీరు కంగారు పడకండి నేను నా అత్తారింట్లో ఎలా అయితే ఉంటున్నానో అలాగే మీ కూతురు & మనవరాలిని కూడా త్వరలోనే అత్తారింటికి పంపించేస్తా ….. !! ఆ విషయం నాకు వదిలేసి మీరు పిస్ఫుల్ గా ఉండండి తాతయ్య….. !!
మాటలు బాగా చెప్తున్నావ్ ఎంతైనా మేన మామ పోలికలు & బుద్దులు ఎక్కడికీ పోతాయి లే …… !! నా కూతురు & మనవరాలి సంగతి తర్వాత ముందు నువ్వు పదే పదే ఇలా ఏడుస్తూ కన్నీళ్ళు వేస్ట్ చేసుకోకు భూమి …… !! ఎందుకంటే ముందు ముందు నువ్వు ఇంకా చాలా కష్టాలు పడాలి అని నవ్వుతూ చెప్తాడు ….. !!
తాతయ్య మీకు శ్లోక అంటే ఇష్టమా ??
విజయేంద్ర ప్రసాద్ భూమి వైపు చూస్తూ ఎందుకు ఇష్టం లేదు నాకున్న ఒకే ఒక్క మనవరాలు శ్లోక అలాంటిది తనంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది ….. ??
మరి నేను కూడా మీ మనవరాలు లాంటి దాన్నే కదా తాతయ్య …… !! నన్ను ఇలా ఏడిపిస్తూ ఉంటే తప్పు అని చెప్పాల్సింది పోయి …… !! ఇంకా నేను ఎడవాలి అని కోరుకోవడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి ….. ?? దారి తప్పిన కూతురు, మనవడిని సరైనా దారిలో నడిపించాల్సిన మీరే ఇలా వాళ్ళను సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు ఎలా చేంజ్ అవుతారు….. ??
షట్ అప్ నువ్వు శ్లోక ఒకటే ఎలా అవుతారు …….?? శ్లోక ఈ ఇంటి మహారాణి నువ్వు పని మనిషి తో సమానం …… !! ఈ విషయం ఆల్రెడీ నా కూతురు క్లియర్ గా చెప్పింది అనుకుంటా అయినా మహాన్ తాళి కట్టాడు అని నిజంగా వాడు నీతో కాపురం చేసి పిల్లల్ని కంటాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ……. ?? హహ అయ్యో పిచ్చి భూమి అలా అనుకుంటే నిజంగా పొరపాటే ….. !!
ఎందుకంటే వాడికి మరో పెళ్ళి చేయడానికి నందన అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది …… !! నువ్వు జస్ట్ వాడి లైఫ్ లో పాసింగ్ క్లౌడ్ లాంటి దానివి …… !! నువ్వేం ఫీల్ అవ్వకు వాడి పెళ్లి స్వయంగా నీ కళ్ళతో చూసి ఏడుస్తూ ఒక మూల పడుండు …… !! అంతే కానీ వాడితో జీవితాన్ని పంచుకోవాలి అని మాత్రం ఆశ పడకు ఎందుకంటే అది ఎప్పటికి నెరవేరదు …… !!
ఎందుకంటే వాడు నిజంగా నిన్ను ప్రేమించలేదు జస్ట్ ప్రేమించినట్టు నటించాడు …… !! వాడి తల్లి కోసం తన పగను వాడి పగ లా అనుకున్నాడు …… !! అందుకోసమే నిన్ను పావుగా వాడుకున్నాడు తప్పా నిన్ను నిజంగా ప్రేమించి కాదు …… !!
విజయేంద్ర ప్రసాద్ చెప్పింది విన్న భూమి ఏడుస్తూ తన కాళ్ళ మీద పడుతుంది అని విజయేంద్ర ప్రసాద్ ఎక్స్పెక్ట్ చేస్తే……. !! భూమి దానికి పూర్తి విరుద్ధంగా గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఎంతలా అంటే భూమి నవ్వి నవ్వి తన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి……. !!
హేయ్ భూమి నేను సీరియస్ గా చెప్తుంటే నీకు జోక్ గా ఉందా అలా నవ్వుతున్నావ్…… ?? భూమి తన నవ్వును కంట్రోల్ చేసుకుంటూ జోక్ కాకపోతే మరేంటి తాతయ్య మహాన్ కి మరో పెళ్ళా….. ?? అది కూడా నేను బ్రతికి ఉండగా ఓహ్ గాడ్ నాకేంటి ఇంత నవ్వొస్తుంది హహ 😅 😅….. !! బలే జోక్ చేశారు తాతయ్య నేను ఉండగా మహాన్ పక్కన మరో అమ్మాయి కూర్చుంటే దాన్ని చంపి మరీ నేను కూర్చుంటా అది నా ప్లేస్ ఎప్పటికీ నాకు మాత్రమే సొంతం….. !! నన్ను కాదని మహాన్ కి పెళ్లి మరో పెళ్లి చేస్తారా….. ??
చేస్తారా కాదు చేస్తాం జరిగేది అదే మీకు జరిగింది మా దృష్టిలో పెల్లే కాదు …… !! మా పగ తీర్చుకోవడానికి నిన్ను జస్ట్ టాయ్ లా వాడుకున్నాం …… !! ఆ కార్తికేయ కళ్ళ ముందే నీ జీవితం ఇలా నాశనం అవుతూ ఉంటే వాడు అది చూసి కుళ్ళి కుళ్ళి ఎడవాలి …… !! అప్పుడు కదా మా ఇన్నాళ్ళ పగ చాల్లరేది ….. !! ఇక మహాన్ అంటావా వాడికి నా కూతురు ఎంత చెప్తే అంత ఏ అమ్మాయిని తీసుకొని వచ్చి తాళి కట్టరా అంటే కళ్లు మూసుకొని కట్టేస్తాడు …… !!
అంత ఇష్టం వాడికి సో జరగబోయేది తెలిసింది కదా ఇక్కడ కూర్చుని హ్యాపీగా నీకు కావలసినంత సేపు ఏడువ్ & నీకు ఎవరం అడ్డు రామ్ సరేనా హ్యవ్ ఏ గుడ్ నైట్ అంటూ నవ్వుకుంటూ ……. !! లొపలికి వెళ్తున్న విజయేంద్ర ప్రసాద్ ను చూస్తూ చిన్నగా నవ్వి బెంచ్ మీద కూర్చుంటుంది …… !!
నిజంగానే మహాన్ నన్ను కాదని మరో అమ్మాయి మెడలో తాళి కడతాడా …… ?? లేదు అలా ఎప్పటికి జరగదు & జరగకూడదు …… !! నేను ఉండగా అది జరగనివ్వను ఐ నో మహాన్ రియల్లీ లవ్స్ మీ ……. !! బట్ తాతయ్య చెప్పినట్టు మహాన్ కి అత్తయ్య అంటే చాలా ఇష్టం …… !! ఒక వేళ నిజంగా అత్తయ్య చెప్పారు అని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది చూసి నేను బరించగలనా …….. ??
అలా జరగకుండా ఉండాలి అంటే అత్తయ్య మావయ్య మధ్య ఎమ్ జరిగిందో తెలుసుకోవాలి …….?? ఎస్ ఈ విషయాలు తెలియాలి అంటే మావయ్యా నే అడగాలి ……. !! కానీ ఎలా అని ఆలోచిస్తూ ఎవర్నో ఎందుకు మావయ్య నే అడుగుతాను అని కార్తికేయ నంబర్ కి డయల్ చేస్తుంది …… !!
మీటింగ్ లో ఉన్న కార్తికేయ తన మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ కట్ చేసి మీటింగ్ కంటిన్యూ చేస్తాడు …… !! అయినా ఆపకుండా కాల్ చేస్తూనే ఉండడం తో ఎక్స్జ్యూస్ మీ అంటూ కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటకు వస్తూ కాల్ లిఫ్ట్ చేసి హెలో హు ఈస్ దిస్ అంటూ అసహనంగా అడుగుతాడు ……. !!
కార్తికేయ వాయిస్ కి భూమి కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే గొంతులో మాట బయటకి రాక ఏడుస్తూ కార్తికేయ వాయిస్ విని నోటికి చెయ్ అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ……. !!
కాల్ చేసి మాట్లాడరు ఎన్టీ ఎవరు హెలో… హెలో అంటూ అరుస్తున్న కార్తికేయ వాయిస్ కి తన ఏడుపు కష్టంగా కంట్రొల్ చేసుకుంటూ మా… మా… మా…వ…య్యా అంటూ వెక్కిళ్లు పెడుతూ పిలుస్తుంది ……. !!
భూమి వాయిస్ విన్న కార్తికేయ ఆనందంగా భూమి నువ్వేనా తల్లీ ఎలా ఉన్నావ్ రా ……. !! ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ మళ్ళీ వాడు ఏమైనా అన్నాడా/ నందన ఏమైనా అందా …… ??
ఎవరు ఎమ్ అనలేదు మావయ్యా …… !! నీ వాయిస్ విని ఏడుపు వచ్చింది …… !! అని కన్నీళ్ళు తుడుచుకుంటూ నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా అని నా మీద కోపంగా ఉందా మావయ్యా …… !!
నీ మీద కోపమా ఛచా అలాంటిదేం లేదు చిట్టి తల్లీ…… !! అర్హత లేని వాడ్ని నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావ్ అని బాధ ……. !! ఇప్పటికైనా మించపోయింది లేదు నా మాట విని మన ఇంటికి వచ్చేయ్ భూమి ……. !! ఆ ఇంట్లో వాళ్ళని మార్చాలి అనుకోవడం నీ మూర్ఖత్వం ఎందుకంటే వాళ్ళు ఎప్పటికి మారరు ఆ విషయం నాకు బాగా తెలుసు ….. !!
నా ప్రయత్నం నన్ను చేయనివ్వు మావయ్యా ప్లీస్ …… !! నేను ఎమ్ చేసినా నువ్వు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే వాడివి ……. !! ఈ విషయం లో కూడా నన్ను సపోర్ట్ చెయ్ మావయ్యా …….. !! ఎందుకంటే నీ సపోర్ట్ ఉంటే నేను ఎదైనా సాదిస్తానన్న నమ్మకం నాకుంది …… !!
నువ్వు ఆ ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతున్నావో నా కళ్ళతో చుసాను ……. !! ఇంక ఎలా సపోర్ట్ చేయంటావ్ భూమి ……. ?? నందన మారదు చిట్టి తల్లీ ఎందుకంటే తనకు ఉన్న అహంకారం తగ్గే వరకు తనలో మార్పు రాదు అది నేను బ్రతికుండగా జరగదు …… !!
మావయ్య నాకు తండ్రి లేడు అన్న విషయం కూడా మర్చిపోయేంత ప్రేమను పంచి నన్ను మహా రాణి లా చూసుకున్నావ్…….!! నీ చెల్లి పిల్లల్ని అంత బాగా చూసుకునే నువ్వు ఎందుకు నీ సొంత పిల్లలకు దూరంగా ఉన్నావ్ …… ?? నాకు నీ గతం గురించి తెలుసుకోవాలి అనుంది చెప్పు మావయ్యా …… !!
ఇప్పుడు అది తెలుసుకుని బాధ పడ్డం తప్పా మరో ఉపయోగం లేదు భూమి …… !! చేదు అనుభవాలను మర్చిపోవాలి తప్పా వాటినే గుర్తు చేసుకుంటూ బాధ పడుతూ ఉంటే మనం ముందుకు వెళ్లలేము ఎప్పటికీ గతం లోనే ఉంటాం…… !!
నీ గతం తోనే నా భవిష్యత్తు ముడి పడి వుంది మావయ్యా……. !! అందుకే అడుగుతున్నా అది తెలిస్తే నేను ఎమ్ చేయాలో నాకు తెలుస్తుంది ……. !! అందుకే అడుగుతున్నా వీలు చూసుకుని నేను నిన్ను మీట్ అవుతాను మావయ్యా ……. !! నాకు ఎమ్ దాచకుండా గతాన్ని చెప్పాలి అంటూ ఇంకో మాట కు తావు ఇవ్వకుండా కాల్ కట్ చేసి నిన్ను బాధ పెడుతున్నందుకు సారి మావయ్యా …… !! అని అనుకుంటూ ఉండగా చెట్ల మధ్య ఎదో చప్పుడు అవ్వడం తో భూమి తనకు దగ్గర్లో ఉన్న కర్ర పట్టుకుని అటు వైపు అడుగులు వేస్తుంది …… !!
భూమి చేతిలో కర్ర పట్టుకుని అటు వైపు అడుగులు వేస్తూ మొబైల్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని అటుగా వెళ్లిన భూమికి …….. !! తన ముందుకు సడెన్ గా వచ్చిన మనిషి ను చూసి రెండు అడుగులు వెనక్కి వేసి బయం తో గట్టిగా అరవబోతున్న భూమి నోటిని తన చేత్తో మూసేస్తాడు రాజ్ …… !!
ఉమ్మ్ ….. ఉమ్మ్…… !! అని అరవడానికి ట్రై చేస్తూ తనను కొట్టడానికి చేయ్ ఎత్తుతున్న భూమి మరో చేతిని కూడా పట్టుకుంటూ…… !! తాను వేసుకున్న మాస్క్ తీసిన రాజ్ ను చూసిన భూమి తన కంగారు తగ్గించుకుంటూ……. !! రాజ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ రాజ్ తన రెండు చేతులు వదలగానే అన్నయ్య అంటూ రాజ్ ను హత్తుకుని …… !! నువ్వేంటి అన్నయ్య ఇక్కడ ఈ టైమ్ లో అది కూడా గార్డెన్ లో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ …… ?? నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా అని అటు ఇటు చూస్తూ కంగారుగా అడుగుతుంది ……. !!
నా సంగతి తర్వాత నువ్వు పడుకోకుండా ఈ టైమ్ లో ఒక్కదానివే గార్డెన్ లో ఎమ్ చేస్తున్నావ్ …… ??
భూమి రాజ్ వైపు చూసి తడబడుతూ ఆ… అది నిద్ర రాక కాసేపు ఇక్కడ కూర్చుందాం …… !! అని వచ్చాను అన్నయ్య ముందు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు …… !!
అబద్దం చెప్పడం కూడా నీకు రాదు భూమి…… !! నేను వెళ్ళాక ఇంట్లో ఎమ్ జరిగిందో & నువ్వు ఈ టైమ్ లో ఇక్కడ ఎందుకు ఉన్నావో నాకు అన్ని తెలుసు …… !! ఇన్ఫాక్ట్ అన్ని తెలుసుకునే వచ్చాను అంటూ పిడికిలి బిగించి కోపంగా చెప్తాడు …… !!
అన్నయ్య ప్లీస్ ఇప్పటికీ నువ్వు చేసింది చాలు …… !! ఎవరు చూడకముందే ఇక్కడి నుండి వెళ్ళిపో … !! ఇప్పుడు నువ్వెళ్ళి గొడవ పడితే గొడవ మరింత పెద్దది అవుతుంది ……. !! అత్తయ్య, మహాన్ కూడా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఏదోటి అంటారు…….. !! నా బాధంత నా గురించి కాదు….. !! ఈ గొడవల వల్ల మన రెండు కుటుంబాల మధ్య దూరం మరింత పెరుగుతుంది …… !! అది నాకు ఇష్టం లేదు ప్లీస్ వెళ్ళిపో అన్నయ్య …… !!
భూమి నీకు మాట ఇచ్చాను 3 మంత్స్ వరకూ నాకు నేనుగా వీళ్లతో ఎటువంటి గొడవ పెట్టుకోను….. !! అని అలా అని నిన్ను ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే నీ అన్నగా చూస్తూ ఊరుకోను…… !! ఎందుకంటే నాకు నీకు ఉన్నంత పేషెన్స్ లేదు ….. !!
అన్నయ్య వాళ్ళు నన్నేం అనలేదు & ఇవాళ నైట్ బయటే పడుకోమని చెప్పారు అంతే ….. !! ఈ నైట్ ఒక్కటే ఎలాగోలా పడుకుంటే ఈ ప్రాబ్లెమ్ ఇక్కడితో క్లియర్ అవుతుంది…… !! ప్లీజ్ నువ్వేం చేయకు అన్నయ్య …… !! వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు వదిలేయ్ ప్లీస్ రా వెళ్ళిపో….. !!
నేను ఎమ్ చేయను ఒకే నా…… !! వాళ్ళని ఒక్క మాట కూడా అనను సరేనా …… !! అదంతా కాదు ముందు నాకు ఈ ఇంటి ఎలక్ట్రిసిటీ మెయిన్ బోర్డ్ ఎక్కడ ఉందో చూపించు….. ??
భూమి రాజ్ వైపు అనుమానంగా చూస్తూ ఇప్పుడు అది ఎందుకు …… ?? ఇక్కడ లైట్స్ లేకపోవడానికి ప్రాబ్లెమ్ అక్కడ కాదు …… !! ఇంట్లో వాళ్ళు కావాలనే లైట్ ఆప్ చేసారు ……. !! నువ్వు స్ట్రెస్ తీసుకోకు ఐ అం ఓకే ఇక నువ్వు ఇంటికి వెల్లు మామ్, అమ్మమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు …… !!
భూమి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు స్విచ్ బోర్డ్ ఎక్కడ అంటూ భూమి వైపు సిరియస్ గా చూస్తూ అడుగుతాడు రాజ్…… !!
రాజ్ వాయిస్ లోని బేస్ కి డౌబ్ట్ గా చూస్తూనే లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉంది అని చెప్తూ నిజం చెప్పు ఎమ్ చేయబోతున్నావ్ అని అడిగిన భూమి వైపు చూస్తూ రాజ్ కన్నింగ్ గా నవ్వుతాడు…… !!
ఇప్పుడు రాజ్ ఎమ్ చేయబోతున్నాడు …… ?? రాజ్ ఇక్కడికి ఎలా వచ్చాడు….. ?? మహాన్ నిజంగా భూమి ని ప్రేమించాడా….. ?? నందన మహాన్ కి మరో మ్యారేజ్ చేయబోతుందా ….. ?? రాజ్ మహాన్ కంటపడితే ఎమ్ జరుగుతుంది…… ?? భూమి ఎమ్ ప్లాన్ చేయబోతోంది……. ??