నీ ఊపిరి సాక్షిగా ❣️- 4

గుడిలో కార్తికేయ బర్త్డే అని కళ్లు మూసుకొని ప్రదక్షనలు చేస్తున్న భూమి చూడకుండా గాజు ముక్క మీద కాలు వేయబోతుండగా మహాన్ తన అరచేతిని అడ్డు పెట్టి ఆ గాజు ముక్క తనకు గుచ్చుకునేల చేసుకుని నీకేం కాలేదు కదా అని భూమి ను పరీక్షగా చూస్తూ అడుగుతాడు ….. మహాన్ చేతి నుండి రక్తం కారడం చూసి భూమి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఏడుస్తూ ఎన్టీ మహాన్ నువ్వు చేసిన పిచ్చి పని చూడు ఎంత డీప్ గా గుచ్చుకుందో అని ఆ గాజు ముక్క ను జాగ్రత్తగా తీసి తన దగ్గరున్న కర్చీఫ్ తో బ్లడ్ పోకుండా గట్టిగా కట్టు కడుతూ ఏడుస్తూ మహాన్ వైపు చూస్తుంది …….

భూమి డోంట్ క్రై ఐ యాం ఒకే …..!! నువ్వు చూడకుండా ఆ గాజు ముక్క మీద కాలు వేసుంటే ఆ పెయిన్ నువ్వు బారించలేవు……. నేను కాబట్టి ఇలా ఉన్నా & నీకు చిన్న ముళ్లు గుచ్చుకున్నా నేను చూడలేను అంటూ ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తు చెప్పగానే భూమి ఏడుస్తూ మహాన్ ను హగ్ చేసుకుని లవ్ యూ మహాన్ మావయ్య, స్వరాజ్ ల తర్వాత నన్ను అంతలా లవ్ చేసేది నువ్వే థాంక్స్ ఫర్ కమింగ్ టు మై లైఫ్ అంటూ ఆనందంగా చెప్తుంది …..

అది నా బాధ్యత భూమి నీ కంట్లో నీళ్లు వస్తే నొప్పి నాకు తెలుస్తుంది …… కాబట్టీ నిన్ను లైఫ్ లాంగ్ ఇలాగే గాజు బొమ్మలా చూసుకుంటాను……   ట్రస్ట్ మీ నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను అంటూ భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఫోర్హెడ్ కిస్ పెడుతూ చెప్తాడు……

భూమి అన్న రేణుక పిలుపుకు గతం నుండి బయటకు వచ్చిన తనకు మహాన్ తనను ఎంత ప్రేమించే వాడో గుర్తు రావడం తో భూమి కి ప్రాణం పోతున్నట్టు గా ఉంది ….. తనను ఏంతో ప్రేమగా చూసుకునే మహాన్ ఇపుడు తనను శత్రువులా చూస్తున్నాడు…… తనకు చిన్న దెబ్బ తగిలినా విల విల లాగే మహాన్ ఇప్పుడు తనే బాధ పెడుతున్నాడు ….. తనేం తప్పు చేసిందో భూమి కి అర్తం కావడం లేదు కానీ తన వల్లే కార్తికేయ నందన విడిపోయారు అని మాత్రం తెలుస్తుంది……

 

ఎలా అయినా వాళ్ళను ఒక్కటి చేసి మహాన్ కి తన మీద పోయినా ప్రేమను తిరిగి పొందాలి అనుకుని కన్నీళ్ళు తుడుచుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చిన రేణుక వైపు చూస్తుంది……. పిలుస్తుంటే పట్టించు కోకుండా ఎమ్ ఆలోచిస్తున్నావ్ భూమి అని అడుగుతూ తన చేతికి అయిన గాయం చూసి అయ్యో భూమి ఏంటిది అంటూ కంగారుగా అడుగుతూ తన చేతికి బ్యాండేజ్ వేసి కట్టు కడుతుంది ….

అక్క!! నాకేం కాలేదు చిన్న దెబ్బే నువ్వు టెన్షన్ పడకు ముందు నాకు ఈ బ్రేక్ఫాస్ట్ ఏలా చేయాలో చెప్పు లేట్ అయితే మళ్ళీ అత్తయ్య కి కోపం వస్తుంది …..

చెయ్యి ఇంతలా కాలిపోయి కనిపిస్తుంటే చిన్న దెబ్బ అంటావెంటి భూమి మహాన్ బాబు నే కదా ఇలా చేసింది ….?? నొప్పిగా ఉందా అని బాధగా అడుగుతుంది …..

లేదక్కా పెయిన్ ఎమ్ లేదు తగ్గిపోయింది …… మహాన్ బ్రేక్ఫాస్ట్ అడిగాడు త్వరగా ప్రిపేర్ చేద్దాం రా అక్క ప్రాసెస్ చెప్పు నేను చేస్తాను అని చెయ్ నొప్పి పెడుతున్న ఓర్చుకుంటూ 2గంటల్లో అందరికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి డైనింగ్ తేబుల్ మీద సర్దుతూ ఉంటుంది ……. ఎక్కడో నా లాంటి పని మనుషుల చేత కుక్ చేయించుకుని హై రేంజ్ లో ఉండాల్సిన అమ్మాయివి ఇలా వీళ్ళ మధ్య చిక్కుకుని ఇన్ని బాధలు పడుతున్నావ్ అని భూమి ను చూసి బాధ పడుతూ మిగిలిన వర్క్ భూమి ను చేయనివ్వకుండా తనే చేసి అందరినీ బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పి వస్తుంది రేణుక……

అందరు వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే వాల్లకు సర్వ్ చేయాలి అని వస్తున్న రేణుక ను ఆపి నువ్వెల్లి కిచెన్ లో వర్క్ ఏమైనా ఉంటే చూసుకో ?? ఇది కాలిగానే ఉందిగా ఇది వడ్డిస్తుందిలే నువ్వెల్లు అంటూ భూమి వైపు చూసి ఏయ్ దిష్టి బొమ్మలా ఎన్టీ ఆలా నిల్చున్నావ్ ఇలా రా……?? ఏంటి వచ్చి అందరికి సర్వ్ చేయాలి అని కూడా నీకు బొట్టు పెట్టి చెప్పాలా సర్వ్ చేయ్ అంటూ కోపంగా అరుస్తుంది నందన……!!

మేడం అమ్మాయి గారికీ చెయ్యి గాలి బొబ్బలు వచ్చాయి మేడం …….. మీకు నేను సర్వ్ చేస్తాను పాపం అమ్మాయి గారికి చాలా నొప్పిగా ఉండి ఉంటుంది అయినా మీరు చెప్పారని ఓర్చుకుని మరీ తనే వంట చేసింది ……!!

శ్లోక పైకీ లేచి రేణుక ను లాగి పెట్టీ కొట్టి మద్యలో నీ బోడి రేకమెండేశన్ ఎంటే……?? హా !! మామ్ చెప్తుంది కదా నోరు మూసుకుని లోపలికి వెళ్ళి పని చూసుకో పో…..?? అయినా చెయ్యే కదా కాళింది ఎదో వొళ్ళు కాలిపోయినట్టు ఎన్టీ ఈ ఓవర్ యాక్షన్ ……?? నోరు మూసుకుని చెప్పిన పని చెయ్ లేకపోతె నీ ప్లేస్ లోకి వేరే మనిషి వస్తారు వెల్లు అని అరవగానే రేణుక భూమి వైపు బాధగా చూస్తూ కిచెన్ లోకి వెళ్ళిపోతుంది …….

భూమి అందరికి దగ్గరుండి సర్వ్ చేసి వాళ్ళు తింటూ ఉంటే పక్కనే నిల్చొని వాల్లకు ఎమ్ కావాలో చూసుకుంటూ ఉంటుంది …… శ్లోక కావాలనే అది కావాలీ ఇది కావాలీ ఇందులో సాల్ట్ లేదు & దీంట్లో కారం ఎక్కువ అయ్యింది అని వంకలు పెడుతూ భూమి ను అటు ఇటు తిప్పి ఈగో సాటిస్ఫై చేసుకొని తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది ……. వాళ్ళు అందరూ తినేసాక మహాన్ కోసం ట్రే లో ఫుడ్ వాటర్ బాటిల్ తీసుకుని కష్టంగా పట్టుకొని లిఫ్ట్ వైపు వెళ్తుంటే అది ఇంట్లో వాళ్లకు నీ లాంటి పని మనుషుల కు కాదు అని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం తో ఒక్కో అడుగు కష్టంగా వేస్తూ స్టెప్స్ ఎక్కుతూ మహాన్ రూమ్ వైపు వెళ్తుంది …….

మహాన్ రూమ్ డోర్ డోర్ నాక్ చేయగానే ఆఫిస్ కి రెడీ అవుతున్న మహాన్ డోర్ ఓపెన్ చేసి భూమి వైపు చూస్తాడు…… ఏడవడం వల్ల మోహం వుబ్బిపోయి, కల్లు ఎర్రగా కందిపోయి & చమట కి మొహానికి అంటుకు పోయిన హెయిర్ తో అక్కడక్కడ పిండి అంటుకుని చీర నలిగిపోయి కనిపిస్తుంది…… భూమి ను అలా చూసి న మహాన్ మోహం చిట్లించి వాట్ అంటూ కోపంగా అరుస్తాడు ……!!

బ్రే….. బ్రేక్ఫాస్ట్ మహాన్ అంటూ ట్రే మహాన్ ముందు పెడుతుంది …… మహాన్ దాన్ని తీసుకొని దూరంగా విసిరి కొడుతూ నేను ఎప్పుడూ చెప్పా నువ్వు ఎప్పుడూ తెచ్ఛావ్ హా…!! అంటే నువ్వు ఎప్పుడూ తెస్తే నేను అపుడే తినాలా నా మీద నీ పెత్తనం ఎన్టీ ……??

అయ్యో నా ఉద్దేశం అది కాదు మహాన్ నాకు కుకింగ్ కొత్త కదా అందుకే లేట్ అయింది ….. రేపటి నుంచి ఫాస్ట్ గా ఇన్ టైమ్ కి తీసుకొని వస్తాను…… ప్లీస్ బ్రేక్ఫాస్ట్ చెయ్ మహాన్ నా మీద కోపాన్ని ఫుడ్ మీద చూపెట్టకు అనిమహాన్ చెయ్ పట్టుకొని రిక్వెస్టింగ్ గా అడుగుతుంది ……..

డోంట్ టచ్ మీ అంటూ భూమి ను వెనక్కి నెట్టి నీ టచ్ కూడా నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది అని కోపంగా తన మొబైల్ తీసుకొని ఆఫిస్ కి వెళ్లిపోతాడు …….. కింద పడ్డ భూమి చేతికి మళ్ళీ దెబ్బ తగడలం తో బ్లీడింగ్ అయి బ్లడ్ వస్తూ వుంటుంది….. భూమి కి ఆ దెబ్బ కంటే మహాన్ తనను ప్రేమించాను అని చెప్పి గుండెల మీద కొట్టిన దెబ్బే బలంగా తగలడం తో అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది 🥺🥹……..

కార్తికేయ కార్ ఫాస్ట్ గా రోడ్ మీద పరుగులు పెడుతూ 15 నిమిషాల్లో భూమి నిలయం అని గోల్డెన్ లెటర్స్ తో రాసిన అందమైన విల్లా ముందు ఆగుతుంది ……. కార్ హార్న్ సౌండ్ విని సెక్యురిటి గార్డ్ మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే కార్ ఫాస్ట్ గా వెళ్ళి కార్ పార్టికోలో ఆగుతుంది ……. కార్తికేయ కార్ చూసి ఆ ఇంట్లో పనిచేసే వాడు ఫాస్ట్ గా వచ్చి వినయంగా కార్ డోర్ ఓపెన్ చేయగానే కార్తికేయ మొహాన్ని సీరియస్ గా పెట్టుకొని గంభీరంగా నడుస్తూ ఇంట్లోకి వెళతాడు……..

కార్తికేయ హాల్ లోకి వెళ్ళేసరికి తన కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తారు తన తల్లి అనసూయ & చెల్లి మానస …… కార్తికేయ అడుగు చప్పుడు విని సోఫా లో కూర్చుని టెన్షన్ గా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎదురుగా నడుస్తూ వస్తున్న కార్తికేయ ను చూసి మానస పైకి లేచి నిల్చుంటే అనసూయ కార్తికేయ వెనక గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది ……. !!

కార్తికేయ సింగిల్ సోఫా సీటర్ లో కూర్చుని వెనక్కి వాలి కల్లు మూసుకుంటాడు ……. ఆ కళ్ల మాటున మహాన్ భూమి మీద చెయ్ చేసుకోవడమే కనిపిస్తూ ఉంటే గట్టిగా పిడికిలి బిగించి ఐ విల్ సీ యూ మహాన్ అని కోపాన్ని అణుచుకుంటూ ఉంటాడు ……

మానస అనసూయ వైపు అడుగు అన్నట్టు చూడ్డం తో అనసూయ కళ్లతోనే నేను మాట్లాడుతాను అని సైగ చేసి కార్తికేయ భూమి తల్లీ ఎక్కడ …….?? తనను నీతో పాటు తీసుకుని వస్తాను అని చెప్పావ్ కదా ఎక్కడ తను బయటుందా……!! నేను ఏమైనా అంటాను అని భయం తో ఆగిపోయిందా అని కొడుకు మోహం లో కనిపిస్తున్న కోపాన్ని చూసి మెల్లగా గొంతు విప్పుతుంది ……….

కార్తికేయ అనసూయ వైపు చూస్తూ లేదు అమ్మా!!! చిట్టి తల్లీ బయట లేదు ఎందుకంటే తను నాతో రాలేదు …..

మానస, అనసూయ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఎంటి రాలేదా…..?? తనను తీసుకు వస్తాను అని చెప్పావ్ కదా మరీ ఎందుకు వంటరిగా వచ్చావ్ ……..!! నువ్వు పిలిస్తే భూమి రాకుండా ఉంటుందా??? అసలు నువ్వు అక్కడికీ వెళ్ళావా లేదా కార్తికేయ ……??

అమ్మా భూమి ఆ నరకం లోకి వెళ్ళింది అని తెలిసి ఎలా అయినా నా బంగారు తల్లి ను ఆ నరకం నుండి తీసుకు వద్దాం అనే వెళ్ళాను…… కానీ తను తన మీద ఒట్టేసి నా చేతులు కట్టేసి అలా తనను నిస్సహాయంగా నన్ను వదిలి వచ్చేలా చేసింది …….

అన్నయ్య అంటే భూమి జీవితాంతం ఆ నరకం లో ఉండాల్సిందేనా ….. ?? నా కూతురు కష్టాలు పడుతూ ఉంటే ఈ తల్లి మనసు చూస్తూ ఎలా తట్టుకోగలదు అన్నయ్య 🥺 భూమి కి నచ్చచెప్పి నేను తీసుకు వస్తాను అంటూ నందన ఇంటికి వెళ్ళబోతుంది…….

అడుగు ముందుకు వేసిన మానస చేతిని పట్టుకొని ఆపి ఆగు మను నువ్వే కాదు భూమి ఇప్పుడు ఎవరు చెప్పినా వినే స్థితిలో లేదు …….. తన మెడలో వాడు కట్టిన తాళి కే విలువనిచ్చి అందరికంటే ఎక్కువ ప్రేమించే నా మాట కూడా వినకుండా ఆ నరకం లోనే ఉండడానికి సిద్ధ పడింది ……… అలాంటిది నువ్వు పిలిస్తే వస్తుంది అని ఎలా అనుకుంటున్నావ్ …….??

రాదు అని చూస్తూ చూస్తూ తనను ఆ నరకం లో వదిలేయమంటావా అన్నయ్య…..?? తను ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నావా ?? భూమి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు తనను టార్చర్ చేస్తారు అది నేను చూస్తూ బరించలేను అంటూ ఏడుస్తూ కార్తికేయ గుండె ల మీద తల పెట్టుకుంటుంది……..

 

అంత వరకు రానివ్వను మను అంటూ మానస తల నిమురుతూ తన కన్నీళ్ళు తుడుస్తూ భూమి ను ఎవరు ఎలా మ్యానిప్యులేట్ చేశారో నాకు బాగ తెలుసు ……. వాల్లకు బుద్ది చెప్పి నా బంగారు తల్లి ను ఈ ఇంటికీ తీసుకు వచ్చే బాధ్యత నాది ఈ అన్నయ్య మీద నమ్మకం ఉంటే ఇక ఆ విషయం గురించి వర్రీ అవ్వకు అని మానస ను దూరం జరిపి పైకి వెళ్లి ఫ్రెష్ అయి ఫాస్ట్ గా రెడీ అయి కిందకు వస్తాడు…..

ఇపుడే కదా కార్తికేయ వచ్చావ్ ఈలోపే మళ్ళీ ఎక్కడికీ వెళ్తున్నావ్ …. ??

కార్తికేయ వాచ్ సరి చేసుకుంటూ అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయమ్మ నైట్ రావటానికి లేట్ అవ్వచ్చు వెయిట్ చేయకండి ……!!

అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెల్లు అన్నయ్య !!

మాహాన్ భూమి ను చంప దెబ్బ కొట్టడం గుర్తు చేసుకుంటూ వద్దు మను ఆకలి చచ్చిపోయింది …….. అని ఫాస్ట్ గా కార్ దగ్గరకు రాగానే డ్రైవర్ వినయంగా బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే కార్తికేయ వెళ్లి గంభీరంగా సీట్ లో కూర్చుని డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న డ్రైవర్ తో నందన కంపెనీస్ కి పోనివ్వు అని చెప్పి కాల్స్ లో బిజీ అవుతాడు …….

హడావిడిగా వెళ్లిపోయిన కార్తికేయ ను బాధగా చూస్తూ ఎందుకమ్మా అన్నయ్య మరీ ఇలా మెషిన్ లా మారిపోయాడు అని బాధగా అడుగుతుంది మానస

నీకు తెలియంది ఏముంది మను ….!! కార్తికేయ ఇలా అవ్వడానికి కారణం ఆ నందన నే తన మీద ఉన్న కోపంతోనే  కార్తికేయ నిద్రకు దూరం అయి కంపెనీ కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్ట పడుతూ ఎప్పుడూ ఆ నందన కంటే ఒక మెట్టు పైనే ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు అంటూ బాధగా నిట్టూరుస్తుంది……!!

మహాన్ ఆఫీస్ కి ఆవేశంగా స్టార్ట్ అయిన కార్తికేయ ఎమ్ చేయబోతున్నాడు……?? మహాన్ కి భూమి అంటే ఎందుకింత కోపం……?? నందన కి కార్తికేయ కి మధ్య అసలేం జరిగింది…..?? భూమి మహాన్ తో పాస్ట్ లో స్వరాజ్ అని తనకు చెప్పిన వ్యక్తి ఎవరు…. ?? వీటన్నిటికి ఆన్సర్ తెలియాలి అంటే ప్లీస్ డు ఫాలో ట్విన్ హార్ట్ స్టోరీస్ ♥️☺️

 

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply