తన రూమ్ కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న రుద్రాన్ష్ కి రుద్ర అన్న మిడిల్ ఏజ్డ్ వాయిస్ వినిపించగానే స్టెప్స్ ఎక్కుతున్న రుద్రాన్ష్ వెనక్కి తిరిగి తన వైపు వస్తున్న తన మదర్ ను చూసి నవ్వుతూ హాయ్ మామ్ అంటూ వెళ్ళి అపర్ణ ను సైడ్ హగ్ చేసుకుంటూ తన తల్లి తో పాటు సోఫా లో సెటిల్ అవుతాడు….
రుద్ర ఏంటి ఇవాళ ఇంత ఎర్లీ గా వచ్చావ్ డెయిలీ 10 అయితే కానీ ఇల్లు మొహం చూడావ్ అలాంటిది ఇవాలేంటి ఇంత ఫాస్ట్ గా వచ్చావ్ అని కొడుకు వైపు చూస్తూ మెయిడ్ తో ఇద్దరికీ టీ తీసుకుని రమ్మని చెప్తుంది అపర్ణ….
మామ్ డోంట్ యాక్ట్ స్మార్ట్ ఒకే శ్రియ ఆల్రెడీ నీకు చెప్పే ఉంటుంది కదా తనతో డిన్నర్ కి వెళ్తున్నా అని అగైన్ వై ఆర్ యూ ఆస్కింగ్ మీ అంటూ కళ్ళు ఎగరేస్తూ అడుగుతున్న రుద్రాన్ష్ వాయిస్ కి గతుక్కుమంటుంది అపర్ణ …. వాట్?? డిన్నర్ ఏంటి రియల్లీ ఐ డోంట్ నో రుద్ర అని ఇన్నోసెంట్ గా చెప్తున్న తల్లి ని చూసి విసుగ్గా ఫేస్ తిప్పేస్తాడు రుద్రాన్ష్….
ఏదైతే ఏంటి ఇన్నాళ్లకు దాంతో డిన్నర్ కి వెళ్ళడానికి ఒకే చెప్పావ్ అదే హ్యాపీ అని సర్వెంట్ తెచ్చిన టీ కప్ అందుకుంటూ మీరు డిన్నర్ కి వెళ్తున్న రిసార్ట్ ఇక్కడి నుంచి చాలా లాంగ్ రుద్ర నువ్వు త్వరగా ఫ్రెష్ అయి స్టార్ట్ అవ్వు ఆ పిచ్చిది నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది….
రుద్రాన్ష్ లెఫ్ట్ ఐ బ్రో రైస్ చేసి అపర్ణ వైపు చూసి మేము డిన్నర్ కి వెళ్తున్నట్టు తెలియదు అన్నావ్ కదా మామ్ మరి ఇక్కడి నుంచి రిసార్ట్ లాంగ్ అని ఎలా చెప్తున్నావ్???
కనిపెట్టేశాడు అని తల కొట్టుకుని 🤦🤦 అదే రుద్ర డిన్నర్ అంటే కొంచెం లాంగ్ రిసార్ట్ నే ప్లాన్ చేసుంటారు అని అలా చెప్పాను అంతే ఒకే రుద్ర వెళ్ళి ఫ్రెష్ అవ్వు నాకు కూడా కొంచెం వర్క్ ఉంది అని అక్కడి నుంచి వడి వడిగా వెళ్తున్న అపర్ణ ను చూసి ఉఫ్ మామ్ నీకు అన్నీ తెలిసి కూడా తెలియనట్టు ఇంకా ఎన్ని డేస్ మ్యానేజ్ చేస్తావో నేను చూస్తా అనుకుని తన చేతిలో ఉన్న టీ కప్ ఫినిష్ చేసి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ కి వెళతాడు….
కొంచెం లో మిస్ అయ్యాను అయినా నాకు ఎక్సైట్మెంట్ లో ఎమ్ మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు అని తన ఎక్సైట్మెంట్ తగ్గించుకుంటూ వెంటనే శ్రియ కి కాల్ చేస్తుంది…. రుద్రాన్ష్ తో డిన్నర్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్న శ్రియ అపర్ణ నుండి కాల్ రావడం చూసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ ఆంటీ అంటూ ఎప్పటిలాగే నవ్వుతూ విష్ చేస్తుంది….
ఈ హాయ్ లు బాయ్ లు తరువాత శ్రియ, నేను చెప్పినట్టు పక్కా ఇండియన్ గర్ల్ లా శారీ లో రెడీ అయ్యావా అలాగే నేను నీకు గిఫ్ట్ చేసిన ఇయర్ రింగ్స్ పెట్టుకో అలాగే హార్డ్ గా పెర్ఫ్యూమ్ స్ప్రే చేయకు లైట్ గా ఉన్న షేడ్ యూస్ చెయ్ & మెయిన్లీ బ్యాంగిల్స్, మొహాన బింది పెట్టడం మర్చిపోకు మొత్తం రెడీ అయ్యాక నాకు వీడియో కాల్ చెయ్ ఏమైనా తక్కువ ఉంటే నేను నోటీస్ చేస్తాను….
మీరు టెన్షన్ అవ్వకండి ఆంటీ నాకు మీరు చెప్పినవి అన్ని బాగా గుర్తున్నాయి ఇప్పటికీ 60 సార్లు చెప్పారు ఇంకా మీరు ఇలాగే చెప్తే డెఫినెట్ గా మర్చిపోతారు ఇపుడే శారీ డ్రేపింగ్ ఫినిష్ అయింది ఇంకో హాఫ్ ఆన్ అవర్ లో టోటల్ గా రెడీ అయి కాల్ చేస్తాను ఒకే… రుద్ర్ వచ్చాడా ఆంటీ నేను ఇందాక కాల్ చేస్తే స్టార్ట్ అవుతున్నా ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పాడు….
హా వచ్చాడే 10 మినిట్స్ అవుతుంది ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు నువ్వు త్వరగా రెడీ అయి నాకు కాల్ చెయ్ అని అపర్ణ కాల్ కట్ చేసి శ్రియ ఎపుడు కాల్ చేస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంటుంది….. హాఫ్ ఆన్ అవర్ కి ఇంకో 10 మినిట్స్ యాడ్ చేసి 40 మినిట్స్ తర్వాత శ్రియ నుండి కాల్ రాగానే ఫస్ట్ రింగ్ కే కాల్ లిఫ్ట్ చేసి శ్రియ ను చూసి స్టన్ అవుతుంది అపర్ణ….
బ్లాక్ కలర్ సిల్క్ కాక్టెయిల్ పార్టీ వేర్ శారీ లో తను గిఫ్ట్ చేసిన డైమండ్ ఇయర్ రింగ్స్ తో మెడలో సింపుల్ జ్యువలరీ,చేతులకు బ్యాంగిల్స్,నుదుటిన బ్లాక్ కలర్ బింది తో హెయిర్ లీవ్ చేసుకుని ట్రెడిషనల్ గర్ల్ లా కనిపిస్తున్న శ్రియ ను చూసి అపర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ టూ బ్యూటీఫుల్ శ్రియ రుద్ర నిన్ను ఇలా చూస్తే డెఫినెట్ గా ఇంప్రెస్స్ అవుతాడు….
శ్రియ నవ్వుతూ అపర్ణ వైపు చూసి థాంక్ యూ ఆంటీ అని తన రూపాన్ని అద్దం లో చూసుకుంటూ శారీ ను సరి చేసుకుంటూ కాస్త లిప్స్టిక్ రాసుకుంటూ ఉంటుంది…. ఇపుడే చెప్తున్నా ఎప్పటిలా నీ కొడుకు యారోగెన్స్ చూసి భయమేసి చెప్పలేక పోయాను ఆంటీ అని రొటీన్ డైలాగ్ చెప్పకుండా నీ మనసులో ఏముందో రుద్ర కి భయపడకుండా ఎక్స్ప్రెస్ చెయ్ వాడు ఇంకా నిన్ను ఫ్రెండ్ లాగే చూస్తున్నాడు ఆ ఫీలింగ్ ను తీసేసి నిన్ను రుద్ర గర్ల్ ఫ్రెండ్ లా చూసేలా నువ్వే చేయాలి….
అదే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది ఆంటీ రుద్ర్ దీనికి ఎలా ఫీల్ అవుతాడో ఏంటో అని ఇక్కడ నాకు టెన్షన్ మామూలుగా లేదు బట్ ఏదైతే అది అయింది నేను లవ్ చేస్తున్నట్టు రుద్ర్ కి చెప్పేస్తాను……
నాకు రుద్ర్ నుండి వచ్చే ఏ ఎమోషన్ అయినా ఇష్టమే అది ప్రేమైనా సరే కోపం అయినా సరే అని నవ్వుతూ చెప్పి ఒకే ఆంటీ నేను స్టార్ట్ అవుతాను గెట్టింగ్ లేట్ అని చెప్పి కాల్ కట్ చేయబోతున్న శ్రియ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి అపర్ణ కూడా కాల్ కట్ చేసి రుద్ర ఎలా రాయాక్ట్ అవుతాడో తెలుసు కాబట్టి అలా అవ్వకుండా చూడు స్వామి అని అనుకుంటూ ఉంటుంది….
♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍
డెలిగేట్స్ తో మీటింగ్ ఫినిష్ చేసుకుని తన క్యాబిన్ కి వచ్చి తన చైర్ లో కూర్చుని లాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న అతనికి తన టేబుల్ మీద ఉన్న మొబైల్ రింగ్ అవ్వడం తో స్క్రీన్ మీద కనిపిస్తున్న నేమ్ చూసి వెంటనే లిఫ్ట్ చేస్తాడు….
గుడ్ మార్నింగ్ సర్ ఐ ఆమ్ సారి టు బాదర్ యూ బిజీగా ఉన్నారా?? అని పొలైట్ గా వినిపిస్తున్న వాయిస్ కి ఇట్స్ ఒకే నితీష్ టెల్ మీ ఎనీ థింగ్ ఇంపార్టెంట్ అంటూ స్ట్రెయిట్ గా పాయింట్ కి వచ్చేస్తాడు అతను…
యస్ సర్ ఆద్య మేడమ్ ను 24/7 వాచ్ చేయమని చెప్పారు కదా మేడం ఇప్పుడే తన ఫ్రెండ్ తో కలిసి హాస్పిటల్ కి వచ్చారు సర్ అని హాస్పిటల్ ముందు కార్ ఆపి లోపలికి వెళ్తున్న ఆద్య, మాన్య వైపు చూస్తూ అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు నితీష్…
వాట్ హాస్పటల్ కా?? ఇస్ ఎవ్రిథింగ్ ఒకే…. హాస్పిటల్ నేమ్ ఏంటి చెప్పు నేను ఇపుడే స్టార్ట్ అవుతున్నా అని కార్ కీస్ తీసుకుంటూ క్యాబిన్ బయటకు నడుస్తాడు…. నథింగ్ టు వర్రీ సర్ మేడం బావున్నారు మే బీ మేడం కి కావలసిన వాళ్ళు ఇక్కడ అడ్మిట్ అయ్యారు అనుకుంటా మీరు వచ్చేలోగా నేను డిటైల్స్ తెలుసుకుంటాను సర్ & హాస్పిటల్ నేమ్ యశోదా అని నితీష్ కాల్ కట్ చేసి ఆద్య ను ఫాలో అవుతాడు….
సడెన్ గా హాస్పిటల్ ఏంటి ఎమైఉంటుంది అని ఆలోచిస్తూనే డ్రైవర్ ను వద్దని తనే సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ నితీష్ పంపిన హాస్పిటల్ కి స్టార్ట్ అవుతాడు అతను….
ఏమైందే నీకు పొద్దు పొద్దున్నే ఇలా హాస్పిటల్ కి తీసుకుని వచ్చావ్ మనం నైట్ పడుకునే సరికి 2 అయింది నాకు బాగా నిద్రొస్తుంది అంటున్నా వినకుండా నన్ను ఎట్ లీస్ట్ బ్రష్ కూడా చేసుకోనివ్వలేదు అని ఇంకా నిద్ర కళ్ళతోనే హాస్పిటల్ లోకి నడుస్తూ ఆద్య ను అడుగుతుంది మాన్య….
నువ్వే కాదు నేను కూడా బ్రష్ చేయలేదు కానీ మాట్లాడకుండా పదా అని రిసెప్షన్ లో ఎక్స్క్యూస్ మీ నైట్ మీ హస్పిటల్ లో లాస్య అని సూసైడ్ చేసుకున్న అమ్మాయిని అడ్మిట్ చేశారు కదా తను ఏ రూమ్ లో ఉందో కాస్త చెప్పగలరా అని రిసెప్షనిస్ట్ ను అడుగుతున్న ఆద్య ను చూసి మాన్య కి దెబ్బకు నిద్ర మత్తు వదులుతుంది….
రిసెప్షనిస్ట్ సిస్టమ్ లో చెక్ చేసి యస్ మ్యామ్ మీరు చెప్పిన పేషెంట్ నైట్ అడ్మిట్ అయ్యారు రూమ్ నంబర్ 13 , ఫోర్త్ ఫ్లోర్ రైట్ సైడ్ అని చెప్పగానే థాంక్ యూ అని చెప్పి లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతారు…. వీళ్ళ వెనుకే మరో లిఫ్ట్ లో నితీష్ కూడా ఫాలో అవుతాడు ఇద్దరూ సేమ్ టైమ్ కి ఎదురెదుగా లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేసుకుని అందరూ ఫోర్త్ ఫ్లోర్ లోకి ఎంటర్ అయ్యారు…
ఆద్య ఏమైందే లాస్య సూసైడ్ చేసుకోవడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు దానికేం అయిందే సడెన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకుంది అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని 13 నంబర్ ఎక్కడుందా అని చూస్తున్న ఆద్య ను అడుగుతుంది మాన్య ….
లాస్య తమ్ముడు ప్రవీణ్ మార్నింగ్ కాల్ చేసి ఏడుస్తూ చెప్పాడు పైగా వాళ్ళు పేరెంట్స్ ఊర్లో లేరట వాళ్ళకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు అని పాపం వాడు చాలా టెన్షన్ గా చెప్పాడే అందుకే నేను వెంటనే నిన్ను లాక్కుని వచ్చాను అని 13 నంబర్ రూమ్ కనిపించగానే ఇద్దరూ ఆ రూమ్ లోకి వెళతారు….
ఆద్య, మాన్య లను చూసిన 19 ఇయర్స్ ప్రవీణ్ అక్కా…. అని ఏడుస్తూ వెళ్ళి ఇద్దరిని హగ్ చేసుకుంటూ ఏడవడం చూసి ఇద్దరూ బాధగా ప్రవీణ్ వీపు నిమురుతూ కంట్రోల్ ప్రవీణ్ అక్క కి ఎమ్ అవ్వదు మేము వచ్చేసాం కదా ధైర్యంగా ఉండు అని ప్రవీణ్ కి ధైర్యం చెప్పి తను నార్మల్ అయ్యాక లాస్య బెడ్ దగ్గరకు నడుస్తారు…
ఇంకా స్పృహ లోకి రాని లాస్య వైపు చూస్తూ అసలేం జరిగింది ప్రవీణ్ లాస్య ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది?? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అని నెమ్మదిగా ప్రవీణ్ ను పక్కన కూర్చో పెట్టుకుని అడుగుతుంది ఆద్య…
అదేం లేదు అక్కా ఇంట్లో అంతా బానే ఉంది & మమ్మీ డాడీ కూడా నిన్ననే రిలేటివ్స్ మ్యారేజ్ కోసం ముంబై వెళ్ళారు…. నేను నైట్ బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి అక్క ఏడుస్తూ పాయిజన్ తాగుతూ కనిపించింది వెంటనే దాన్ని పడేసి అక్క ను బలవంతంగా ఇక్కడికి తీసుకుని వచ్చాను అని ఏడుస్తూ చెప్తాడు….
ఒకే…. ఒకే…. కూల్ ఏడవకు అని ప్రవీణ్ కి ధైర్యం చెప్తూ లాస్య ఎపుడు కాన్షియస్ లోక్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు…. కాసేపటికి లాస్య నెమ్మదిగా కళ్ళు తెరవడం చూసిన మాన్య ఏయ్ అమ్ము లాస్య కాన్షియస్ లోకి వచ్చింది లుక్ ఎట్ హర్ అని పిలవగానే ముగ్గురు లాస్య చుట్టూ చేరి తన వైపు చూస్తారు….
లాస్య కళ్ళు తెరిచి సీలింగ్ వైపు చూస్తున్న తనకు తను ఇంకా చావలేదు అని అది తన ఇల్లు కాదు అని తెలియడం తో తాను ఎక్కడ ఉందో అర్థం అవ్వక తన కళ్ళను అటు ఇటు తిప్పుతూ చూస్తున్న తనకు కన్నీళ్లతో తన వైపు చూస్తూ కనిపిస్తాడు తన తమ్ముడు ప్రవీణ్…
ప్రవీణ్ అంటూ కన్నీళ్లతో పిలుస్తున్న లాస్య ను చూసి అక్కా అని ఏడ్చేస్తూ ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావ్ నీకేం అయినా అయితే మమ్మీ డాడీ కి నేను మొహం చూపించగలనా అసలు నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాం అనుకున్నావ్ అక్క 🥹🥹 నాకు చాలా భయం వేసింది అందుకే ఆద్య అక్క కి కాల్ చేసాను అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆద్య వైపు చూస్తాడు …..
లాస్య నీళ్ళు నిండిన కళ్లతో 🥹🥹 ఆద్య వైపు చూస్తూ ఉంటే ఆద్య అక్కడే టేబుల్ మీద ఉన్న జ్యూస్ టిన్ తీసుకుని గ్లాస్ లోకి జ్యూస్ వొంపాక లాస్య వద్దు అంటున్నా బలవంతంగా తాగించి లాస్య కాస్త కుదుట పడ్డాక ఇపుడు ఎలా ఉంది లాస్య అంటూ తన పక్కనే చైర్ లో కూర్చుంటూ అడుగుతుంది…..
థాంక్ యూ ఫర్ కమింగ్ ఆద్య నేను బానే…. అన్న వర్డ్ కంప్లీట్ అవ్వక ముందే ఆద్య కొట్టిన దెబ్బ ఆ రూమ్ మొత్తం రీ సౌండ్ వస్తూ ఉంటుంది అది చూసిన మాన్య, ప్రవీణ్ తో పాటు బయట నుంచుని జరిగేది చూస్తున్న నితీష్ అపుడే అక్కడికి వచ్చి నుంచుని చూస్తున్న అతను కూడా షాక్ అవుతాడు….
ఆద్య ఎమ్ చేస్తున్నావ్ అంటూ మళ్ళీ కొట్టబోతున్న ఆద్య ను కష్టంగా ఆపుతూ తనను వెనక్కి లాగుతుంది మాన్య…. వదలవే నన్ను కొంచెం కూడా సెన్స్ లేకుండా ఇది ఎలాంటి పని చేసిందో చూడు …. ప్రవీణ్ ను చూడవే పాపం ఎంత భయపడుతున్నాడో చిన్న పిల్లాడే వాడు రాత్రంతా లాస్య గురించి ఎంత టెన్షన్ పడుంటాడు అయినా నీకు చచ్చేంత ప్రాబ్లమ్స్ ఏమున్నాయని సూసైడ్ చేసుకోవాలి అనుకున్నావ్ లాస్య ??? ప్రతీ విషయం మా ఇద్దరితో షేర్ చేసుకునే నువ్వు సూసైడ్ చేసుకోవాలి అనుకునేంత కష్టం వస్తే మాతో ఒక్క మాట కూడా చెప్పాలి అనిపించలేదా అంటూ కోపంగా అరుస్తూ ఉంటే లాస్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది…..
లాస్య ను చూడ్డానికి వచ్చిన డాక్టర్ లాస్య ను అలా చూసి హో గాడ్ చూడండి మిస్ మీరు చాలా వీక్ గా ఉన్నారు ఇలా ఏడవకూడదు & మీరు 4 మంత్స్ ప్రెగ్నెంట్ కూడా సో ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు జస్ట్ రిలాక్స్ అని చెప్తున్న డాక్టర్ మాటలకు ప్రెగ్నెంట్ ఏంటి అని ముగ్గురూ షాక్ అవుతూ డాక్టర్ వైపు చూస్తారు….
ప్రెగ్నెంట్ ఏంటి అంటారేంటి మేడం షి ఇస్ ప్రెగ్నెంట్ తనకు ఇపుడు 4ర్త్ మంత్ రన్నింగ్ అని అన్సర్ ఇస్తున్న డాక్టర్ ను చూసి ప్రవీణ్ షాక్ తో చైర్ లో కూర్చుంటే మాన్య, ఆద్య ఒకరిని ఒకరు చూసుకుని లాస్య వైపు చూస్తారు…. వాళ్ళను ఫేస్ చేసే ధైర్యం లేక లాస్య తల వంచుకుని మౌనంగా ఏడుస్తూ ఉంటుంది……
అది చూసిన ఆద్య తప్పు చేస్తున్నప్పుడు తల వంచుకోవాలి కానీ తప్పు చేసాక కాదు మా వైపు చూడ్డానికి కూడా నీకు ధైర్యం సరిపోవడం లేదు అంటే అది తప్పు అని ఇప్పుడు రియలైజ్ అయ్యావ్ అనమాట చెప్పు లాస్య నిన్ను ఈ సిచుయేషన్ లో వదిలేసిన వాడి పేరేంటి ???
లాస్య కన్నీళ్ళు తుడుచుకుంటూ ఐ ఆమ్ సారి ఆద్య నీకు మ్యారేజ్, లవ్ అంటే నచ్చదు కదా నా లవ్ మ్యాటర్ తెలిస్తే ఎక్కడ ఇంట్లో చెప్తావో అని భయం వేసింది… మాన్య కి చెప్దాం అనుకున్నా మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండవు కదా అందుకే మీ ఇద్దరికీ చెప్పలేదు…..
దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ముందు ఆ కుత్తే గాడు ఎవడో చెప్పు?? వాడి పేరేంటి & వాడు ఎమ్ చేస్తూ ఉంటాడు ., మీ ఇద్దరికీ ఎలా పరిచయం??
లాస్య ఏడుస్తూ తను జై ధీర్ అంటూ ఉండగానే వాట్ అంటూ మాన్య, ఆద్య షాక్ తో గట్టిగా అరుస్తారు….
TO BE CONTINUEED…………………….