విలన్ హస్బెండ్-21

మాన్య తన వైపు చూసి నవ్వుతున్న అమర్ వైపు డౌబ్ట్ గా చూస్తూ వీడేంటి నా వైపు తేడాగా చూస్తున్నాడు 🧐🧐 వీడు ఇప్పుడు నాతోనే డాన్స్ చేస్తా అని చెప్పాలి గొంతు పిసికి చంపుతా 😬😬 అని అమర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది….

ఆద్య మాన్య కి సైగ చేయడం తో మాన్య నెమ్మదిగా పైకి లేచి ఆద్య పక్కకు వచ్చి నుంచుని ఎంటే వీడు నా వైపు అలా చూస్తున్నాడు 😖😖 కొంపదీసి వీడు నన్ను సెలెక్ట్ చేయడు కదా ☹️

కొంప తీయకుండానే నిన్ను మాత్రమే సెలెక్ట్ చేస్తాడు ఎందుకంటే మాయ అమర్ ను బ్రదర్ లా ట్రీట్ చేస్తుంది తను కూడా అంతే & నన్ను కూడా అమర్ సిస్టర్ లా చూస్తున్నాడు దట్ టూ సిస్టర్ తో సాల్సా డాన్స్ చేయరు 🤷 సో ఆబ్వియస్లి తనకు ఇక్కడ ఉన్న ఆప్షన్ నువ్వే పాప సో గెట్ రెడీ 😜😌

షట్ అప్ ఆద్య వాడితో నేను డాన్స్ చేయాలా అది కూడా సాల్సా 😬😬 నో వే!!!

చూడు పాప నువ్వు డాన్స్ చేయక తప్పదు ఎందుకంటే ఇది జస్ట్ గేమ్ బయట నీకు అమర్ అంటే ఎంత కోపం ఉన్నా ఇక్కడ మరో ఆప్షన్ లేదు కాబట్టి చచ్చినట్టు నువ్వు చేయాలి సో నీ ఈగో ను మడిచి పాకెట్ లో పెట్టుకుని వెళ్ళి డాన్స్ చేయ్ ఇది జస్ట్ గేమ్ నే కదే ఎందుకలా గుడ్ల గూబ లా చూస్తున్నావ్ 😏🤣

(ఆద్య పాప కొంచెం ఎక్కువైనట్టు లేదు 🤷😌 నెక్స్ట్ నీకు రాబోతున్న టాస్క్ చూసి నువ్వేం రియాక్షన్ ఇస్తావో చూడ్డానికి నాతో పాటు నీ ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ 😜☺️)

వదిన ఏంటి మీ డిస్కషన్స్ ఇంతకీ మీ ఇద్దరిలో అమర్ అన్నయ్య తో డాన్స్ చేసేది ఎవరు ?? ( ఎవరికి డౌబ్ట్ రాకూడదు అని మాయ కావాలని అలా అడుగుతుంది 🥲😌)

డిస్కషన్ ఎమ్ లేదు మాయ మాన్య కి  డాన్స్ అంటే బాగా ఇష్టం అందుకే తను డాన్స్ చేస్తాను అని చెప్తుంది అంతే 😜🫣

దొంగ మొహంది ఇరికించేసింది 😖🤨😕

మాన్య ఎక్స్ప్రెషన్ కి ఆద్య నవ్వు ఆపుకుంటూ తన వైపు చూస్తూ ఉంటుంది 🫣😂

తన వైపు నవ్వుతూ చూస్తూ తన ముందుకు వచ్చి నుంచున్న అమర్ వైపు చూస్తూ ఏంట్రా ఈ అంటూ పళ్ళు మొత్తం కనిపించేలా స్మైల్ చేస్తున్నావ్ నీతో నేను చచ్చినా డాన్స్ చేయను అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా చూస్తూ అంటుంది 🤨🤨

అబ్బో నువ్వో రష్మిక మందన్నా మరి 😏🤷 నీతో డాన్స్ చేయడానికి చచ్చిపోతున్నాం ఇక్కడ గబ్బిలం మొహం దానా పోయి అద్దం లో మొహం లో చూసుకోవే

రేయ్ ఎక్కువగా వాగకు నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు చెప్తున్నా ….!!

అరేయ్ ఈ విషయం నీకు కూడా తెలిసిపోయిందా .., నువ్వు అప్పుడప్పుడు బలే నిజం చెప్తావే ఇది ఒక్క క్వాలిటీ నే నాకు నీలో నచ్చింది ….

ఏంట్రా ఆది???

అదేనే నువ్వు మనిషివి కాదు పిశాచివి అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పావే అది నాకు బాగా నచ్చింది
… 🤣😂

యూ ఫూల్ నువ్వెరా దెయ్యం, భూతం ఇంకా… ఇంకా హా అగోరా అని నువ్వెరా పంది

నేను పంది అయితే నువ్వు బురదలో దొర్లే అడవి పంది వి 😏🤣

అబ్బబ్బా ఆపండర్రా మీ గొడవ మీ కంటే చిన్న పిల్లలు బెటర్ చెప్పిన మాట వింటారు మీరు ఇంత ఏజ్ వచ్చినా కొట్టుకుంటూనే ఉన్నారు మార్నింగ్ వాళ్ళు ( జై, ఆద్య) ఇప్పుడు మీరు 🤦 సరిపోయారు ఇద్దరికీ ఇద్దరు 🤷 అని అసహనంగా అరుస్తున్న ప్రతాప్ వాయిస్ కి ఇద్దరూ తమ గొడవ కి బ్రేక్ ఇచ్చి ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు…..

మాయ అమర్ షర్ట్ పట్టుకుని పక్కకు లాగి అన్నయ్య నువ్వు నిజంగా మాన్య ను లవ్ చేస్తున్నావా 😕😕

అదేంట్రా సడెన్ గా అలా అడిగావ్ మాన్య మీద నాకు ఉన్న ప్రేమ నీకు కనిపించడం లేదా

ఎందుకు కనిపించడం లేదు క్లియర్ గా కనిపిస్తుంది 🤷 మాన్య మీద నీకు ఉన్న పగ ఇందులో ప్రేమ మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు

అబ్బా అదేం లేదు రా అయినా దాని మీద నాకు ఎందుకు పగ ఉంటుంది చెప్పు అదే కావాలని దాని మాటలతో నన్ను రెచ్చగొడుతుంది నేను కంట్రోల్ మిస్ అవుతా…. ఇదిగో ఇలాగే ప్రతీ సారి మాన్య తో ప్రేమగా మాట్లాడాలి అనే అనుకుంటాను చివరికి ఇలా గొడవ తో ముగుస్తుంది…. !!

మాన్య ఎన్ని మాటలు అన్నా నువ్వు రాయాక్ట్ అవ్వకు అన్నయ్య అపుడే మీ మధ్య లవ్ జెనరేట్ అవుతుంది… అది తర్వాత ముందు నువ్వు ఎమ్ చెప్తావో నాకు సంబంధం లేదు వెళ్ళి మాన్య ను డాన్స్ కి ఒప్పించు అని అమర్ ను మాన్య వైపు నెడుతుంది….

తన మీద పడబోయి నిలదొక్కుకున్న అమర్ వైపు చూస్తూ వాట్ అంటూ సీరియస్ అవుతుంది మాన్య……

చీచీ!!!  దీనికి దేవుడు ఫీలింగ్స్ అనేవి పెట్టడం మర్చిపోయాడు అనుకుంటా ఎపుడు చూసినా కుక్క లా అరవడం తప్పా నవ్వుతూ మాట్లాడదు అంతా నా కర్మ…. చేసుకున్న వాడికి చేసుకున్నంత అని ఊరికే అన్నారా మహానుభావులు ….!!

ఏయ్ ఏంట్రా అలా చూస్తున్నావ్

నువ్వో మిస్ యూనివర్స్ అని నీకు సైట్ కొడుతున్నా 😏

మళ్ళీ మొదలు 🤦 ఇవి అక్కడున్న అందరి ఎక్స్ప్రెషన్స్ ఇన్క్లూడింగ్ జై 🙄😬😕😶🤐😒

పిచ్చిగా మాట్లాడకుండా పో ఇక్కడి నుంచి నిన్ను చూస్తేనే చిరాగ్గా ఉంది….

ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు ఆల్రెడీ నాకు పడిపోయావ్ అది నేను కనిపెట్టకుండా ఉండడానికి ఇలా కోపంగా నన్ను తిడుతూ కవర్ చేస్తున్నావ్

వాట్ 🤷 హెలో నిల్చునే కళలు కంటున్నావా వేక్ అప్ 🤦 నేను నీకు పడిపోవడం అది ఎప్పటికీ జరగదు వెళ్ళి మొహం అద్దం లో చూసుకో మాన్య ఇక్కడ నాతో అంత ఈజీ కాదు అని రెక్లెస్ గా చెప్తున్న మాన్య ను చూసి నవ్వుతూ …… అచ్చా నీ మీద నీకు అంత నమ్మకమా ఒకే ఫైన్ నాతో 5 మినిట్స్ ఈ డాన్స్ చేశాక కూడా ఇదే మాట చెప్పు అప్పుడు ఒప్పుకుంటా యూ ఆర్ గ్రేట్ అని అంటూ కావాలని మాన్య ను రెచ్చకొడతాడు…..

ఒకే ఫైన్ ఆమ్ రెడీ అంటూ అందరికీ మిడిల్ లో నుంచున్న మాన్య ను చూసి ఆద్య తల కొట్టుకుంటే అమర్ నవ్వుతూ వెళ్ళి ఒక చేత్తో మాన్య నడుమును మరో చేత్తో మాన్య రైట్ హ్యాండ్ ను హోల్డ్ చేసి సాంగ్ ప్లే చేయమని మాయ కి సైగ చేయగానే మాయ నవ్వుతూ సాంగ్ ప్లే చేస్తుంది…..

అమర్ నవ్వుతూ మాన్య కళ్ళల్లోకి చూస్తూ చిన్న చిన్న మూమెంట్స్ వేస్తూ ఉంటే మాన్య అమర్ వైపు చూస్తూ తన హై హీల్ తో అమర్ కాళ్లను పచ్చడి చేస్తూ ఇష్టం వచ్చినట్టు మోచేతితో అమర్ కడుపులో డాన్స్ చేస్తున్నట్టు పంచెస్ ఇస్తూ అమర్ కి గెలాక్సీ చూపించి నాతో పెట్టుకోకు అని యాటిట్యూడ్ గా నవ్వుతూ వెళ్ళి తన ప్లేస్ లో కూర్చుంటుంది……

ఓసి నీ చంపేశావ్ కదే 😖😖 అమ్మా నా కాళ్ళు అంటూ అమర్ కూడా ఏడుపు మొహం తో పొట్ట దగ్గర చెయ్ పెట్టుకుని మాన్య వైపు చూస్తూ తర్వాత చెప్తానే నీ సంగతి అని తన వైపు చూస్తూ పళ్ళు నూరుతూ తన పక్కనే కూర్చుంటూ అంటాడు ….

అమర్ వార్నింగ్ ను కూర లో కరివేపాకు లా తీసేసి అమర్ మీద ఇలా అయినా పగ తీర్చుకున్నందుకు తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది మాన్య…..

ఒకే గాయ్స్ ఇపుడు మనం డాన్స్ లాంటి డాన్స్ చూసాం కదా ఎలా అనిపించింది అనగానే అందరూ ముసి ముసిగా నవ్వుకుంటూ ఉంటే అమర్ మాయ వైపు చిరు కోపంగా చూస్తూ ఇప్పటికే బాగా మండుతుంది నువ్వు పెట్రోల్ పోయద్దు అని చెప్పగానే మాయ చేయి అడ్డు పెడుతూ నవ్వుకుంటుంది…..

ఒకే…. ఒకే….. కూల్ నెక్స్ట్ ఎవరి నేమ్ రాబోతుందో చూద్దాం అంటూ సాంగ్ ప్లే చేసి ఆఖరిగా స్లిప్ తీస్తుంది ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది అని అందరి వైపు చూస్తూ వదిన అనగానే ఆద్య నవ్వలేక నవ్వుతూ పైకి లేచి నుంచుని మాయ ఎమ్ చెప్తుందా అని చూస్తూ ఉంటుంది…..

వదిన నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు అన్నయ్య కళ్ళల్లోకి 5 మినిట్స్ కళ్ళు ఆర్పకుండా చూడాలి & అన్నయ్య నువ్వు కూడా సేమ్ ఎవరైతే ఫస్ట్ కళ్ళు ఆర్పుతారో వాళ్ళు ఈ గేమ్ లో ఓడిపోతారు….. సో చూద్దాం ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో 🤷🤷

 

ఇది మీ మధ్య ఉన్న మిస్ అండర్స్టాండింగ్స్ ను తగ్గించడానికి నా నుండి చిన్న ప్రయత్నం కాబట్టి ఇద్దరూ నో అనకుండా రండి అని అప్పటికే ఇద్దరూ ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ ఉండడం గమనించి రిక్వెస్టింగ్ గా పిలుస్తుంది……

ఓహ్ గాడ్ ఏంటిది మాయ ఇలా బుక్ చేసింది నాకు వీడిని చూస్తేనే వొళ్ళు మండుతుంది అలాంటిది వాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎలా చూడాలి 🤦😬

ఈ మిర్చి ను చూస్తేనే నాకు చిరాకు ఇదో పెద్ద ఫిగర్ అని దీని ఫీలింగ్ అయినా మనం ఎందులో కూడా బ్యాక్ స్టెప్ వేయకూడదు ఎలా అయినా ఈ టాస్క్ లో నేనే విన్ అవ్వాలి అంటూ జై లేచి మాయ పక్కకు వచ్చి నుంచుంటాడు….

ఇది నా కడుపున ఎలా పుట్టింది రా దేవుడా 🤦🤐 వీళ్ళ ఇద్దరినీ కలిపే వరకూ ఇది నిద్రపోయేలా లేదు అంతా నా తల రాత అని తల కొట్టుకుంటూ మాయ వైపు కోపంగా చూస్తూ ఇపుడేం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ గా చూస్తూ ఉంటుంది రేణుక….

అందరూ గేమ్ ను గేమ్ లాగే చూస్తూ ఇద్దరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటే రేణుక మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతూ ఇద్దరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది…..

ఏంటి మేడం ఇందాక నాకు ఏదో చెప్పారు గేమ్ ను గేమ్ లా చూడాలి డాన్స్ చేస్తే ఏమవుతుంది??? అది ఇది అని తెగ చెప్పావ్ ఇప్పుడేంటి అక్కడ మాయ నీ కోసం చూస్తూ ఉంటే స్టాచ్యు లా నుంచున్నావ్ అని వెటకారంగా అడుగుతున్న మాన్య వైపు ఆద్య విసుగ్గా చూస్తుంది….

వదిన కమ్ అన్నయ్య గేమ్ కి రెడీగా ఉన్నాడు నీదే లేట్ అంటూ పిలుస్తుంది మాయ…. అది కాదు మాయ అని ఏదో చెప్పబోతున్న ఆద్య ను అడ్డుకుంటూ ఇది గేమ్ నే కదా ఆద్య వెళ్ళమ్మా అని ప్రతాప్ వర్మ చెప్పడం తో ఆయన మాటకు ఎదురు చెప్పలేక అయిష్టంగానే వెళ్ళి జై కి ఎదురుగా నుంచుంది…..

వదిన కూడా వచ్చేసింది కాబట్టి గేమ్ స్టార్ట్ చేస్తున్నా ఇపుడే చెప్తున్నా ఎవరు చీట్ చేయకూడదు అని చెప్పి నౌ ది గేమ్ స్టార్ట్స్ అంటూ స్టాప్ వాచ్ లో టైమ్ 5 మినిట్స్ కి సెట్ చేసి ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది…..

 

ఇప్పుడు సిచుయేషన్ సాంగ్ ప్లే చేస్తే బలే ఉంటుంది అని నవ్వుకుంటూ అమర్ వెంటనే ఒక సాంగ్ ప్లే చేస్తాడు అది విన్న మాయ నవ్వుకుంటే మాన్య అమర్ వైపు అసహనంగా చూస్తుంది….

నీ కళ్ళతోటి
నా కళ్ళలోకి
చూస్తేనే చంద్రోదయం…. !!

నీ చూపుతోటి
నను తాకుతుంటే
తనువంత సూర్యోదయం….!!

ఇలాగే ఇలాగే
మనం ఏకమయ్యే
క్షణాలే కదా ఓ వరం…..!!

అలాగే అలాగే
ప్రపంచాలు పలికే
కథవ్వాలి మనమిద్దరం…..!! అంటూ సాంగ్ ప్లే అవుతూ ఉంటే జై, ఆద్య ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా చూస్తూ ఎంత సేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు….

ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు అయినా కూడా ఇద్దరు రెప్ప కూడా వేయకుండా ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ తమ మధ్య ఉన్న పది అడుగుల దూరాన్ని దగ్గర చేస్తూ ఇద్దరూ ఒక్కో అడుగు ముందుకు వేశారు……

ఇంకో 5 నిమిషాలకు ఇంకో 2 అడుగులు వేసారు ఇప్పుడు ఇద్దరి మధ్య 4 అడుగుల దూరం మాత్రమే ఉంది అది చూస్తున్న అందరూ కూడా వాళ్ళ వైపు అలాగే చూస్తున్నారు ఎందుకంటే అప్పటికే వాళ్ళు అలా చూసుకుంటూ అరగంట గడిపేశారు అయినా ఇద్దరిలో ఒక్కరు కూడా కళ్ళు ఆర్పడం లేదు….

అలా ఇంకో అడుగు ఇద్దరూ వేయగానే ఇద్దరి మధ్య ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉండటం చూసి రేణుక కి చమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి అయిపోయింది అంతా అయిపోయింది 😖😖 జై పూర్తీగా ఆద్య కి పడిపోయాడు ఇది తెలిస్తే హరిణి ఏమైపోతుంది అన్న ఊహే రేణుక కి కంగారు పుట్టిస్తుంది దాంతో నో…… అంటూ గట్టిగా అరువగానే అందరితో పాటు వీళ్ళు కూడా షాక్ అవుతూ రేణుక వైపు చూసి తమ మధ్య ఉన్న గ్యాప్ చూసి ఇద్దరూ కంగారుగా దూరం జరుగుతారు…..

రేణు ఏమైంది ఎందుకలా అరిచావ్ అని కంగారుగా అడుగుతున్న వినయ్ వాయిస్ కి తను ఎమ్ చేసిందో గుర్తు చేసుకుంటూ 🤦🤦 తల కొట్టుకుని అది….  ఏదో పురుగు అండి అందుకే సడెన్ గా అరిచాను సారి అంటూ మెల్లగా చెప్తూ ఉఫ్ ఏదైతే ఏంటి వీళ్ళ గేమ్ ఇలా అయినా స్పాయిల్ చేసాను ఇంకెప్పుడు జై ను ఆద్య దగ్గర్లో కూడా వదలకూడదు అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతుంది రేణుక…..
ఛా…..!!! ఇంకాసేపు అలాగే ఉంటే అన్నయ్య కి వదిన మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యేవి మొత్తం స్పాయిల్ చేసింది మమ్మీ అని రేణు వైపు సీరియస్ గా చూస్తూ ఒకే గాయ్స్ మీ గేమ్ అయిపోయింది విన్నర్ ఎవరో తర్వాత తాతయ్య డిసైడ్ చేస్తారు అని వాళ్ళను వాళ్ళ ప్లేసెస్ కి పంపేసి మరో స్లిప్ తీస్తుంది మాయ……

ఇప్పుడు పెర్ఫార్మ్ చేయాల్సింది మామ & అత్త మీ ఇద్దరూ ఇప్పుడు ఒక డ్యూయెట్ కి డాన్స్ చేయాలి అనగానే శైలు సిగ్గు పడుతూ మహీదర్ నవ్వుతూనే సాంగ్ కి డాన్స్ చేస్తారు & రేణుక కి సాంగ్ పాడాలి అని వస్తుంది అది రేణుక నవ్వుతూ ఫినిష్ చేస్తుంది….

అలా అందరి పెర్ఫామెన్సెస్ కంప్లీట్ అవుతాయి ప్రతాప్ వర్మ అందరి వైపు చూస్తూ ఇపుడు విన్నర్ ను ఎనౌన్స్ చేస్తున్నా అందరి పెర్ఫామెన్సెస్ చూసాక నాకు ఒకరిది బాగా నచ్చింది ఇందులో ఎలాంటి పార్షియాలిటీ లేదు నేను నిజాయితీగానే విన్నర్ ను సెలెక్ట్ చేశాను…..

 

మీరు అంత ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన నీడ్ లేదు తాతయ్య మీ జడ్జ్మెంట్ మీద మా అందరికి ట్రస్ట్ ఉంది మీరు లేట్ చేయకుండా విన్నర్ ఎవరో చెప్పండి ప్లీస్….

హు ఇంకెవరు ఉంటారు ఆ జై నే అయ్యుంటాడు ఈయన గారికి వీడు ఉంటే ఇంకెవరు కనిపిస్తారు అని మూతి తిప్పుతూ గడ్డి పీకుతున్న రేణుక షాక్ అయ్యేలా ప్రతాప్ తన పేరు చెప్పడం రేణుక నమ్మలేక అలా నోరు తెరిచి చూస్తూ ఉంటుంది 😮😮

మమ్మీ కంగ్రాట్స్ అంటూ మాయ నవ్వుతూ వచ్చి తనను హగ్ చేసుకునే వరకూ అది తన పేరే అని నమ్మలేక పోతుంది…. మాయ టచ్ తో తేరుకుంటూ థాంక్ యూ మాయ అని నవ్వుతూ అందరూ తనకు కంగ్రాట్స్ చెప్తుంటే తనలో తానే మురిసిపోతూ తన సింగింగ్ ట్యాలెంట్ కి తనో గొప్ప సింగర్ లా ఇమాజిన్ చేసుకుంటూ ఊహా లోకం లో విహరిస్తూ ఉంటుంది రేణుక….

రేణుక ను చూసిన మాయ 🤭🤭 మెల్లగా ప్రతాప్ వర్మ పక్కకు వెళ్ళి మమ్మీ బుట్ట లో పడ్డట్టే తాతయ్య అని ఎవరు చూడకుండా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ప్రతాప్ వర్మ రేణుక ను మరింత పడకొట్టడానికి రేణుక కి 5 లాక్స్ చెక్ ఇస్తాడు అది చూసిన రేణుక హ్యాపీనెస్ కి లిమిట్ లేకుండా పోయింది…..

ఇదే కరెక్ట్ టైమ్ అనుకుంటూ రేణుక తో నెక్స్ట్ వీక్ మన రెండు ఫ్యామిలీస్ జై నానమ్మ ఊరికి వెళ్లి అక్కడే 10 డేస్ స్పెండ్ చేయబోతున్నాయి నీకు ఒకే కదా రేణుక అంటూ తన వైపు చూస్తాడు….
ఆ చెక్ వైపు చూస్తూ మురుస్తున్న రేణుక ప్రతాప్ వర్మ చెప్పిన ఊరు సరిగ్గా వినకుండా ఒకే మావయ్య అని చెప్పగానే మాయ, ప్రతాప్ ప్లాన్ సక్సెస్ అని నవ్వుకుంటూ అందరినీ తీసుకుని లోపలికి వెళ్ళి హ్యాపీగా డిన్నర్ చేస్తారు……

🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️

రుద్రాన్ష్ తన ఆఫీస్ టైమ్ అవ్వగానే తన వర్క్ అయినంత వరకూ సేవ్ చేసి లాప్ టాప్ షడ్ డౌన్ చేసి అది ప్యూన్ తో కార్ లో పెట్టమని చెప్పి తను క్యాబిన్ నుండి బయటకు వస్తూ అప్పటికే 22 వ సారి కాల్ చేస్తున్న శ్రియ కాల్ లిఫ్ట్ చేస్తాడు….

రుద్ర్ స్టార్ట్ అయ్యావా నేను ఇపుడే స్టార్ట్ అవుతున్నా షార్ప్ వన్ అవర్ లో అక్కడ ఉంటాను ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావ్?? కాల్ చేస్తే పిక్ చేయడానికి కూడా ఫ్రీ లేనంత బిజీగా ఉన్నావా??

యూ డిడ్ న్ట్ చేంజ్ శ్రియ పక్కన వాళ్లకు మాట్లాడడానికి స్కోప్ కాస్త కూడా ఇవ్వవ్…. నా ఆఫీస్ ఇపుడే ఫినిష్ అయింది…. ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతాను షేర్ ది అడ్రస్ అని ఒక్క మాట మాట్లాడి కాల్ కట్ చేసి కార్ లో కూర్చుని తన వాల్ పేపర్ గా ఉన్న ఆద్య ఫోటో వైపు చూస్తూ ఉంటాడు….

జస్ట్ వన్ వీక్ రా ఇంకెప్పుడు నీకు దూరంగా వెళ్ళను నా కోసం బాగా గట్టిగానే వెతికిస్తున్నావ్ అని ఆద్య చేస్తున్న ట్రయల్స్ గుర్తు చేసుకుంటూ నవ్వుతూ ఆద్య ఫోటో వైపు చూస్తూ తను మాట్లాడాలి అనుకున్న మాటలు అన్ని మాట్లాడుతూ తను ఇంటికి రీచ్ అయింది కూడా గమనించడు రుద్రాన్ష్…..

సర్ విల్లా కి రీచ్ అయ్యాం అని చెప్తున్న డ్రైవర్ మాటకి విండో లో నుంచి బయటకు చూసి తన బ్యాగ్ తో ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతున్న రుద్రాన్ష్ కి రుద్ర అని వినిపిస్తుంది ఒక మిడిల్ ఏజ్డ్ వాయిస్….. ??

ఆ వాయిస్ ఎవరిదో గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండీ 😌🫣 అలాగే స్టోరీ ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి ♥️🤗 ఏ పెయిర్ మీకు స్క్రీన్ మీద ఎక్కువ కావాలి & ఎందుకు ఇవన్నీ కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి…. ☺️🤍

 

To BE CONTINUEED…….

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply