విలన్ హస్బెండ్ -19

హరిణి రాహుల్ చేయ్ పట్టుకుని తను ఎపుడు కాన్షియస్ లోకి వస్తాడా అని వెయిట్ చేస్తూ కూర్చుంటుంది…. భరత్ క్యాంటీన్ కి వెళ్ళి లైట్ గా డిన్నర్ చేసి హరిణి కోసం బబుల్ టీ తీసుకుని వచ్చి ఇవ్వగానే హరిణి టీ ను మెల్లగా సిప్ చేస్తూనే ఇన్స్టా లో మాయ అప్లోడ్ చేసిన ఒక్కో పిక్ స్క్రోల్ చేస్తూ నేను లేకుండా బానే ఎంజాయ్ చేస్తున్నారు కదా చేయండే బాగా చేయండి వన్స్ నేను అక్కడికి ఎంటర్ అయ్యాక ఉంటుంది ఒక్కొక్కరికి ఎంజాయ్మెంట్ అని మాయ తీసిన ఫ్యామిలీ పిక్ ను చూస్తూ ఉంది అందులో ఆద్య, జై పక్క పక్కనే నిల్చోవడం హరిణి కి ఏమాత్రం నచ్చలేదు….

అందుకే ఆ పిక్స్ ను కోపంగా చూస్తూ ఉండగా తనకు శ్వేత నుండి కాల్ రావడం తో ఉఫ్ 🤦🤦 నేను వచ్చి 1 అవర్ అవ్వలేదు అపుడే కాల్స్ స్టార్ట్ చేసింది 😬😬 అని చిరాకు పడుతూనే కాల్ లిఫ్ట్ చేస్తుంది….

వాట్ మామ్ నన్ను బయటకు వచ్చినా పీస్ఫుల్ గా ఉండనివ్వవా చెప్పాను కదా డెఫినెట్ గా వస్తాను అని మళ్ళీ ఎందుకు కాల్ చేసావ్

నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తావా 😏😏 నేను ఎపుడు వస్తావ్ అని అడగడానికి కాల్ చేయలేదు….మీ అత్త ఇందాకే కాల్ చేసింది నైట్ కి వాళ్ళు ఆ ఆద్య వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తున్నారట మాయ, జై కలిసి ఏవో గేమ్స్ ఆడాలి అని అందరినీ గార్డెన్ లో గ్యాదర్ చేసి అందరితో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారట మీ అత్త కాల్ చేసి నీ కూతురు ఉంది వేస్ట్ ఆ ఆధ్య అపుడే జై ను తన వైపు తిప్పుకుంది అని దెప్పుతుంది అని అసహనంగా అంటుంది….

హు అది ఎంత తిప్పుకున్నా బావ దానికి ఎంత మౌల్డ్ అయినా బావ వీక్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు ఎంతగా ఎంజాయ్ చేస్తారో చేయనివ్వు మామ్ బావ ను ఎప్పటికైనా సొంతం చేసుకునేది నేనే అని యాటిట్యూడ్ గా చెప్పి కాల్ కట్ చేస్తుంది….

అక్కడ అంత జరుగుతుంటే దీనికి చీమ కట్టినట్టు కూడా లేదు పైగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి ఎమ్ జరుగుతుందో ఏంటో మాదేష్ రాగానే ఇద్దరం వెళ్లి ఆ వినయ్ వర్మ తో పెళ్లి గురించి మాట్లాడాలి అని ఫిక్స్ అవుతుంది శ్వేత….

హు ఇస్ దట్ హరిణి అని అడుగుతున్న భరత్ ను చూసి మై మామ్ అని సింపుల్ గా ఒక్క వర్డ్ తో టాపిక్ కట్ చేసి మెల్లగా కాన్షియస్ లోకి వస్తున్న రాహుల్ వైపు చూస్తుంది….

హరిణి పట్టుకున్న తన చేతి ఫింగర్స్ ను మెల్లగా కదిలిస్తూ కళ్ళను కష్టంగా తెరవడానికి ట్రై చేస్తున్న రాహుల్ ను చూసి తన చేతిని రాహుల్ చేత్తో గట్టిగా పట్టుకుంటూ రాహుల్…. రాహుల్….. ఓపెన్ యువర్ ఐస్ నేను మాట్లాడుతుంది వినిపిస్తుందా అని అడుగుతున్న హరిణి వాయిస్ రాహుల్ గుర్తు పట్టి హరిణి చేతిని మరింత గట్టిగా పట్టుకుంటాడు….

రిలాక్స్ హరిణి వాడు కాన్షియస్ లోకి వచ్చాడు అంటే ఇక ప్రాబ్లెమ్ లేనట్టే వెయిట్ నేను డాక్టర్ ను తీసుకుని వస్తాను అని భరత్ వెళ్ళి డాక్టర్ ను తీసుకుని రాగానే ఇద్దరినీ కాసేపు వెయిట్ చేయమని చెప్పి డాక్టర్ రాహుల్ ను చెక్ చేసాక ఇంజెక్షన్ చేసి హి ఇస్ ఆల్రైట్ నౌ ఎక్కువ సేపు డిస్టర్బ్ చేయకండి పేషెంట్ చాలా వీక్ గా ఉన్నాడు అని భరత్ చేతికి ప్రిస్క్రిప్షన్ నోట్ ఇస్తూ ఈ మెడిసిన్స్ ఫార్మసీ లో అవైలబుల్ లో ఉంటాయి

నేను రాసిన మెడిసిన్స్ తీసుకుని వచ్చి సిస్టర్ కి చూపిస్తే ఎపుడు వాడాలో తను చెప్తుంది ఏదైనా ఎనర్జెన్సీ అనిపిస్తే నేను నా రూమ్ లోనే ఉంటాను అక్కడికి రండి అని చెప్పి రాహుల్ ను ట్రీట్ చేసిన డాక్టర్ రౌండ్స్ కి వెళతాడు…..

హరిణి నువ్వు ఇక్కడే ఉండు నేను మెడిసిన్స్ తీసుకుని వస్తాను అని భరత్ ఫార్మసీ వైపు వెళ్ళాక కళ్ళు తెరిచి చూస్తున్న రాహుల్ వైపు చూస్తూ అసలేం జరిగింది రాహుల్ ఎవరు నిన్నిలా కొట్టారు వాళ్ళు కొట్టే వరకూ నువ్వు చూస్తూ ఉన్నావా అని అసహనంగా అంటుంది….

నేను ఇలా బెడ్ మీద ఉండడానికి రీసన్ ఒక అమ్మాయి దాన్ని నేను అంత ఈజీ గా వదలను అని కోపంగా చెప్తున్న రాహుల్ వైపు చూస్తూ అరే అసలేం జరిగిందో చెప్పకుండా ఇలా వదలను అంటే నాకెలా తెలుస్తుంది చెప్పు రాహుల్ గొడవ ఏంటి???

రాహుల్ హరిణి వైపు చూస్తూ నా ఫ్రెండ్స్ బలవంత పెడితే వాళ్ళతో పాటు మాల్ కి వెళ్ళాను అక్కడ ఒక అమ్మాయి కావాలని నా కాలు తొక్కింది ( మీకేమైనా ఐడియా వచ్చిందా రాహుల్ ఎవరి గురించి చెప్తున్నాడో వస్తే మాత్రం కామెంట్స్ లో చెప్పండీ 😌🫣) అయినా ఆ అమ్మాయి నన్ను చూసి కూడా సారి చెప్పలేదు సరి కదా నేనే కావాలని తనకు అడ్డు వచ్చానని నన్ను కొట్టింది …..

దాంతో నాకు నా ఫ్రెండ్స్ కి కోపం వచ్చి ఆ అమ్మాయిని కామెంట్ చేశాం అంతే వాడు ఎవడో ఏంటో తెలియదు కానీ నన్ను నా ఫ్రెండ్స్ ను ఇదిగో ఇలా కొట్టి ఆ అమ్మాయి ను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని సగం అబద్దం సగం నిజం కలిపి హరిణి కి చెప్తాడు ……. ఎందుకంటే నిజం చెప్తే హరిణి నే నాలుగు తగిలిస్తుంది అని సగం అది సగం ఇది కలిపి చెప్తాడు

రాహుల్ చెప్పింది విన్న హరిణి వాట్ ఆ అమ్మాయే కావాలని నిన్ను కాలితో తొక్కి ఎవడితోనో నిన్ను కొట్టించిందా ఎవరు రాహుల్ అది చెప్పు దాని సంగతి నేను చూసుకుంటా నిన్ను ఇలా వన్ మంత్ బెడ్ మీద పడుకునేలా చేసిన దాన్ని నేను వదిలి పెట్టను….

నో హరిణి దాని మీద రివెంజ్ నేను తీర్చుకుంటాను ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుని దాని లైఫ్ మీద దెబ్బ కొట్టి ఈ రాహుల్ అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తాను అని కోపంగా చెప్తాడు….

నీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా ఐ ఆమ్ ఆల్వేస్ బీ విత్ యూ రాహుల్ అని చెప్తూ భరత్ రాహుల్ కోసం మెడిసిన్స్ తో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకుని రావడం తో ఫ్రూట్స్ కట్ చేసి తినిపిస్తూ 2 అవర్స్ అలా రాహుల్ తో టైమ్ స్పెండ్ చేసి రాహుల్ ను జాగ్రత్తగా కేర్ చేయమని భరత్ కి మరి మరీ చెప్పి తన ఇంటికి స్టార్ట్ అవుతుంది హరిణి….

🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍🖤

 

తన బెడ్ రూమ్ లో కూర్చుని తన సిస్టమ్ లో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆద్య ను చూస్తూ టైమ్ ఎంత అయిందో కూడా గమనించడు అతను ( క్యారెక్టర్ నేమ్ రివీల్ అయ్యే వరకూ అతను అనే పిలుస్తాను గుర్తు పెట్టుకోండి 🙂🥲) సరిగ్గా అపుడే ఆ బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని అతని మదర్ ఫుడ్ ప్లేట్ ట్రే లో పట్టుకుని అక్కడికి వచ్చి అతన్ని అలా చూసి నా కోడలి ఫోటో చూస్తూ నీకు ఆకలి కూడా వేయడం లేదా నాన్న అని నవ్వు ఆపుకుంటూ అడుగుతుంది….

తన తల్లి వాయిస్ కి ఫాస్ట్ గా లాపి క్లోజ్ చేసి చైర్ నుండి పైకి లేచి వెనక్కి తిరిగి తన మదర్ ను అక్కడ చూసి మమ్మీ నువ్వు ఎప్పుడు వచ్చావ్ అని నవ్వుతూ అడుగుతూ బెడ్ మీద తన మదర్ కి ఎదురుగా కూర్చుంటూ అడుగుతాడు అతను…..

నువ్వు నా కోడలిని చూస్తూ ఆకలి కూడా మర్చిపోయినపుడే వచ్చాను …. నువ్వు ఎంత సేపటికి డిన్నర్ కి రాకపోయేసరికి నేనే ఇలా డిన్నర్ తీసుకుని వచ్చాను

అబ్బా మామ్ అలాంటిదేం లేదు ఇపుడే అలా చూస్తూ కూర్చున్నాను ఈ లోగా నువ్వే వచ్చావ్ సరే ఎలాగో వచ్చావ్ కదా నీ చేత్తో నే తినిపించు మమ్మీ నీ చేత్తో అయితే ఎక్స్ట్రా గా ఇంకో రెండు ముద్దలు ఎక్కువ తినచ్చు….

దొరకవు రా నువ్వు ఇదిగో ఇలాగే నీ మాటలతో నన్ను ఇంకేం మాట్లాడనివ్వకుండా చేస్తావ్ అని కొడుకును మురిపెంగా చూస్తూ ఇదిగో ఆ… అను అంటూ అతనికి కొసరి కొసరి తినిపిస్తూ ఇంకేంటి నాన్న విశేషాలు ఎన్ని రోజులు ఇలా కోడలిని దూరంగా చూస్తూ దూరంగానే ఉండిపోతావ్…

 

ఇవాళ, రేపు యూత్ ఎంత ఫాస్ట్ గా ఉన్నారో తెలుసా నువ్వేంటో ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోయావ్ !! నా కోడలు అసలే బంగారు బొమ్మ ఈ పాటికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి తన మనసులోకి ఎవరో ఒకరు వచ్చే లోపే నీ లవ్ గురించి చెప్పు నాన్న…..

 

అదేంటో మమ్మీ తనను చూస్తే చాలు నాకు తెలియకుండానే నేను మూగవాడిని అయిపోతాను ఇంకా ఇలా టైం వేస్ట్ చేయడం నాకు కూడా నచ్చడం లేదు అందుకే త్వరలోనే నేను ఆద్య ముందుకు వెళ్ళి నా ప్రేమ గురించి చెప్తాను

ఆల్ ది బెస్ట్ నాన్న ఆద్య కచ్చితంగా నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అని చిరు నవ్వుతో చెప్పి వాటర్ తాగించాక ఎక్కువ సేపు అలాగే ఫోటోస్ చూస్తూ కూర్చోకుండా త్వరగా పడుకో అని చెప్పి తన మదర్ వెళ్ళిపోయాక అతను లాప్టాబ్ ఓపెన్ చేసి ఆద్య ఫొటోస్ ఒక్కోటి స్క్రోల్ చేస్తూ ఎప్పటిలాగే ఎర్లీ మార్నింగ్ నిద్రపోతాడు…..

🤍💜🤍💜🤍💜🤍💜🤍💜🤍💜🤍

రుద్రాన్ష్ తన సిస్టమ్ ముందు కూర్చుని సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్ కమ్ పీ. ఏ. ఆనంద్ ఎక్సె క్యూస్ మీ సర్ అంటూ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి అడగడం తో ఆనంద్ వాయిస్ గుర్తు పట్టి కళ్ళు మాత్రం పైకి ఎత్తి ఆనంద్ వైపు షార్ప్ గా చూస్తాడు

😁😁 అని క్లోజ్ అప్ యాడ్ లో మాడల్ లా నవ్వుతూ రుద్రాన్ష్ ఎదురుగా కూర్చుంటూ ఐ నో నీకు సర్ అంటే నచ్చదు బట్ చెప్పాను కదా రుద్ర సర్ ఆఫీస్ లో ఉన్నంత వరకూ నిన్ను సర్ అనే పిలుస్తాను అని ఈ ఒక్క విషయం లో నన్ను ఎక్స్ క్యూస్ చేయాలి సర్

చెప్పినా వినవు కదా సర్లే అలాగే ఏడువు ఇంతకీ ఆఫీస్ అవర్స్ లో ఎందుకిలా వచ్చావ్

నేను కూడా వర్క్ మీదే వచ్చాను కానీ ఇదిగో ఇక్కడ ఈ ఫైల్ మీద సైన్ చెయ్ దీన్ని అర్జంట్ గా ఫ్యాక్స్ పంపించాలి అని రుద్రాన్ష్ సైన్ చేశాక అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు

వన్ మినిట్ మిస్టర్ ఆనంద్

రుద్రాన్ష్ వాయిస్ కి వెనక్కి తిరిగి యస్ సర్ అంటూ టేబుల్ దగ్గరకు వచ్చి నుంచుని తన వైపు చూస్తాడు….

హైదరాబాద్ లో మనం బ్రాంచ్ ఓపెన్ చేయాలి అనుకున్నాం కదా వర్క్స్ ఎక్కడి వరకూ వచ్చాయి & నేను ఒక కంపెనీ తో ఒక ప్రాజెక్ట్ కోసం కొలాబరేట్ అవ్వాలి అనుకున్నాను కదా అదేమైంది దాని నుండి ఒక్క అప్డేట్ కూడా నాకు ఇవ్వలేదు….

 

బ్రాంచ్ వర్క్స్ ఇంకో వన్ మంత్ లో కంప్లీట్ గా ఫినిష్ అవుతాయి సర్ & ఆ కంపెనీ తో కొలాబరేషన్ గురించి ఆల్మోస్ట్ డన్ ఇంకో 3 డేస్ లో మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను

3 డేస్ కాదు విత్ ఇన్ వన్ డే లో నాకు రిజల్ట్ తెలియాలి నాకు అది ఒక్కటే చాలా వర్క్స్ ఉన్నాయి యూ గాట్ మై పాయింట్ అని సీరియస్ గా చెప్తాడు….

రుద్రాన్ష్ వాయిస్ చిన్నగా ఉన్నా అందులో ఏ మాత్రం తగ్గని బేస్ కి ఏ. సి. లో కూడా ఆనంద్ కి చమటలు పట్టడం తో ఎస్ సర్ అని చెప్పి తన క్యాబిన్ కి వెళ్ళిపోతాడు….

ఐ ఆమ్ కమింగ్ హైదరాబాద్ అని ఈవిల్ స్మైల్ ఇస్తూ తిరిగి వర్క్ స్టార్ట్ చేసిన రుద్రాన్ష్ కి క్యాబిన్ డోర్ ఓపెన్ అవ్వగానే అటుగా చూసిన తనకు చిరు నవ్వుతో హాయ్ రుద్ర్ అనుకుంటూ వస్తూ కనిపిస్తుంది 22 సంవత్సరాల శ్రేయ 🖤

 

నువ్వేంటి ఆఫీస్ టైమ్ లో ఇలా వచ్చావ్ అని మొహాన్ని సీరియస్ గా పెట్టుకొంటూ అడుగుతాడు రుద్రాన్ష్….

అబ్బా ఎపుడు ఇంతే ఫేస్ ను హ్మ్మ్…. అని పెట్టుకుని ఉంటావ్ కొంచెం నవ్వితే నీ ఆస్తి ఏమైనా అరిగిపోతుందా రుద్ర్ యూ నో నువ్వు నవ్వితే ఎంత బావుంటావో తెలుసా అచ్చం హాలీవుడ్ హీరో లా ఉంటావ్ ప్లీస్ రుద్ర్ ఒక్క సారి నా కోసం స్మైల్ చెయ్ ప్లీస్…. !!

నీ టైం వేస్ట్ చేసుకోవడమే కాకుండా నా టైం కూడా వేస్ట్ చేస్తున్నావ్ శ్రేయ జస్ట్ గెట్ అవుట్

సరే…. సరే కూల్ కొప్పడకు నేను వెళ్ళిపోతా ఇవాళ ఈవెనింగ్ డిన్నర్ కి ప్లాన్ చేశాను నువ్వే ప్రోగ్రామ్స్ పెట్టుకోకు రుద్ర్ ఇది చెప్పడానికే వచ్చాను వన్ మంత్ నుండి అడుగుతున్నా ప్లీస్…. ప్లీస్ నో అనకు…. !!!

ఒకే ఐ విల్ బీ దేర్ ఎట్ నైట్ 9 ఆర్ యూ హ్యాపీ నౌ ఇక నువ్వు వెళ్తే నా వర్క్ నేను చేసుకుంటాను

వావ్ యూ సేడ్ ఒకే దట్స్ ఏనఫ్ ఫర్ మీ అడ్రస్ షేర్ చేస్తాను డోంట్ ఫర్గెట్ అవర్ డిన్నర్ బై రుద్ర్ అని శ్రేయ అక్కడి నుండి వెళ్లిపోవడం చూసి పాగల్ అని చిన్నగా నవ్వి తన వర్క్ లో బిసి అవుతాడు రుద్రాన్ష్….

🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍♥️🤍

 

జై ఫ్లాట్ కి వెళ్ళడానికి 2 గంటల నుండి కష్టపడి రెడీ అవుతున్న టీనా కి జై దగ్గర నుంచి కాల్ రావడం తో నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ డియర్ ఏంటి ఆగలేకపోతున్నావా అపుడే కాల్ చేసావ్ ఇంకో హాఫ్ ఆన్ అవర్ లో నీ వడిలో ఉంటా జై ఇవాళ మొత్తం నేను నీ సొంతం అని మెలికలు తిరుగుతూ యూ నో నీకు నచ్చేలా రెడీ అవుతున్న నన్ను చూస్తే నువ్వు కంట్రోల్ లో ఉండడం కొంచెం కష్టమే అని కవ్వింపుగా చెప్తుంది….

నాకు ఇవాళ కుదరదు టీనా విల్ మీట్ ఆన్ సమ్ ఆదర్ టైమ్

వాట్??? ఎపుడెపుడు జై ఫ్లాట్ కి వెళ్ళి తన వడిలో వాలిపోవాలా అని చూస్తున్న టీనా కి జై చెప్పింది విన్నాక పిచ్చ షాక్ తగులుతుంది…. ఎమ్ మాట్లాడుతున్నావ్ జై నువ్వే కదా ఇవాళ ఫ్రీగా ఉంటాను నైట్ మీట్ అవుదాం అన్నావ్ సడెన్ గా కుదరదు అని ఎందుకు అంటున్నావ్??

యాహ్ మీట్ అవ్వాలి అనే అనుకున్నా ఆల్ ఆఫ్ ది సడన్ వేరే వర్క్ వల్ల స్ట్రక్ అయ్యాను సో ఐ కాంట్ కమ్

అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి జై??? ప్లీస్ జై రావచ్చు కదా నేను చాలా వెయిట్ చేస్తున్నా అంటూ హస్కీ వాయిస్ తో మాట్లాడుతూ జై ను టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది….

ప్రతిదీ నీతో డిస్కస్ చేయడానికి యూ ఆర్ నైట్ మై గర్ల్ ఒకే…. యూ ఆర్ మై ఎంటర్టైన్మెంట్ & నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేయకు అని సీరియస్ గా చెప్పి కాల్ కట్ చేస్తాడు…. ఛా…. !! ఎంటి ఇలా జరిగింది ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరిగింది అంటే ఇప్పటి వరకు నేను చేసుకున్న మేక్ అప్ మొత్తం వేస్ట్ అయినట్టేనా అని ఏడుపు మొహం పెట్టుకుని మిర్రర్ లో చూసుకుంటుంది…..

మెయిడ్స్ తో ఆద్య, మాన్య, మాయ గార్డెన్ లో అందరూ కూర్చోవడానికి సెట్ చేయించాక, తినడానికి స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇలా అన్ని సెట్ చేసాక మెలోడీ సాంగ్స్ ప్లే చేస్తూ అక్కడే అందరినీ గ్యాదర్ చేస్తారు….

ఒక్కో ప్లేస్ లో ఇద్దరు ఇద్దరు కూర్చోవడానికి సెట్ చేయిస్తుంది మాయ ముందుగా మహీదర్, శైలు తరువాత వినయ్ వర్మ, రేణుక వీళ్ళకు ఎదురుగా ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఆద్య, జై వాళ్ళ పక్కన మాన్య, అమర్ అందరూ కూర్చున్న తర్వాత మీరు ఎవరు చీటింగ్ చేయకుండా నేను అందరినీ అబ్జర్వ్ చేస్తూ మీతో గేమ్ ఆడిస్తాను & ఇక్కడ మనమే యాంకర్ అని మాయ చెప్పగానే అందరూ కూడా ఒకే అని చెప్పి గేమ్ స్టార్ట్ చేస్తారు …..

నా చేతిలో ఉన్న బౌల్ లో అందరి నేమ్స్ ఉన్నాయి సో నేను ఎవరి పేరు అయితే తీస్తానో వాళ్ళు ఇందులో ఉన్నది నో అనకుండా చేయాలి ఒకే… లాస్ట్ లో తాతయ్య విన్నర్ ను ఎనౌన్స్ చేస్తారు లెట్స్ స్టార్ట్ అంటూ మెలోడీ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే అందరూ కూడా ఆ పాటను హమ్ చేస్తూ మాయ ఎవరి పేరు తీస్తుందా అని చూస్తూ ఉంటారు….

మాయ బౌల్ లో ఉన్న పేపర్స్ మొత్తం అటు ఇటు కలుపుతూ లాస్ట్ కి ఒక స్లిప్ పిక్ చేస్తుంది అందులో ఎవరి పేరు ఉందో అని అందరూ ఎవరి పేరు వచ్చిందా అని ఎక్స్సైటింగ్ గా చూస్తూ ఉంటారు…. ఎవరి పేరు వచ్చిందో చెప్పేస్తున్నా… చెప్పేస్తున్నా… ఆ పేరు ఎవరిది అంటే అది డాడీ అనగానే అందరూ హేయ్ అని నవ్వుతూ క్లాప్స్ కొడుతూ వినయ్ వర్మ వైపు చూస్తారు …..

వినయ్ కూడా నవ్వుతూ మాయ ఎమ్ యాక్టివిటీ ఇస్తుందా అని చూస్తూ ఉంటాడు…. డాడ్ ఇక్కడ మీకో క్వశ్చన్ అది అడిగాక మీరు జెన్యూన్ గా అన్సర్ ఇవ్వాలి & ఎవరి ఫీలింగ్స్ మీరు పట్టించుకోకండి అని రేణుక ను దృష్టిలో పెట్టుకుని చెప్తుంది…..

అలాగే బంగారం నువ్వు ముందు క్వశ్చన్ ఏంటో అడుగు అక్కడ ఎమ్ రాసుందో ఏంటో అని టెన్షన్ గా ఉంది నాకు ఇక్కడ….

మాయ చిన్నగా నవ్వి అందరి వైపు చూసి డాడ్ మీ లైఫ్ లో ఈ పర్సన్ నాకు చాలా స్పెషల్ అని ఎవరైనా ఉన్నారా?? ఉంటే వాళ్ళు ఎవరు ఇది చాలా జెన్యూన్ గా చెప్పాలి

వినయ్ అందరి వైపు చూసి దీనికి అన్సర్ నేను నిద్రలో అడిగినా చెప్తాను మాయ నా లైఫ్ లో నాకు ఎప్పటికీ స్పెషల్ నా సంధ్య 💕….. ఎందుకు అంత స్పెషల్ పర్సన్ అంటే ఇప్పటికీ తన ఇన్నోసెన్స్ గుర్తొస్తే నా పెదవుల మీద నవ్వు అలాగే ఉండిపోతుంది… తనను చూడగానే షి ఇస్ మైన్ అని ఫిక్స్ అయిపోయాను….

సంధ్య ను మ్యారేజ్ చేసుకోవడానికి నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాను అది నాకు మహి కి మాత్రమే తెలుసు తనతో మ్యారేజ్ కి రెండు ఫ్యామిలీస్ ఒకే అన్నాక నా హ్యాపీనెస్ అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేవు…. తనతో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకున్న నాకు నా సంధ్య యాక్సిడెంట్ లో దూరం అయ్యి నన్ను ఒంటరి వాడ్ని చేసి చాలా అన్యాయం చేసింది….

అప్పటికే వినయ్ కళ్ళు వర్షిస్తూ ఉంటాయి 🥺🥹 మహీదర్ వినయ్ బుజం మీద చేయి వేయగానే తన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆ తరువాత నా లోకం మొత్తం జై నే మాయ…. వాడి కోసమే సంధ్య చనిపోయినా నేను చనిపోకుండా బ్రతికాను సంధ్య తర్వాత నా ప్రపంచం మొత్తం జై నే అనగానే జై కూడా ఎమోషనల్ గా వినయ్ వైపు చూస్తాడు అంత లోనే వినయ్ అన్న మాటలకు క్షణాల్లో జై మొహం ఎర్రగా మారుతుంది….

 

To Be Continueed…….

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply