విలన్ హస్బెండ్-18

మాయ కి చాలా చిరాగ్గా & ఇరిటేటింగ్ గా ఉంది సరదాగా జై తో టైమ్ స్పెండ్ చేయాలి అని అనుకున్న ప్రతీ సారీ ఇలా ఎవరో ఒక్కరు వచ్చి తన హ్యాపీ మూడ్ ను కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేస్తున్నారు ఇపుడు కూడా అలాగే చేశారు అది కూడా ఆద్య ముందు అది తలచుకుంటే మాయ కి జై మీద పట్టరానంత కోపంగా ఉంది…. ఈ విషయాన్ని ఆద్య కి జై తో లవ్ లో పడే వరకూ తనకు తెలియకుండా చూసుకోవాలి అని చాలా జాగ్రత్త పడుతూ వచ్చింది బట్ నౌ ఆద్య కి కంప్లీట్ గా జై గురించి తెలిసి పోయింది ఇందాక ఏదో ఆద్య ముందు జై గురించి కవర్ చేసింది కానీ దాన్ని ఆద్య అంత ఈజీ గా నమ్మదు అని మాయ కి కూడా తెలుసు….

జై ఇలా కనిపించిన ప్రతీ అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ వాళ్ళతో ఫ్లాట్ లో ఎంజాయ్ చేస్తుంటే ఆద్య జై ను ఎలా ఇష్టపడుతుంది పైగా ఆద్య కి పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు అలాంటిది జై ను ఎందుకు మ్యారేజ్ చేసుకుంటుంది ???

 

ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మాయ మైండ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంది అందుకే సైలెంట్ గా వెళ్ళి కార్ లో కూర్చుంటుంది వెనుకే వచ్చిన మాన్య, ఆద్య కూడా మాయ పక్కన కూర్చుంటూ వాట్ హ్యాపెండ్ మాయ ఏమైంది సడెన్ గా అలా వచ్చేసావ్ ఆ కాట్రాజ్ నిన్ను ఏమైనా అన్నాడా ఏంటి ( ఆధ్య పాప మన విలన్ బాబు కి ఇంకో పేరు పెట్టింది లేండి అదే ఈ కాట్రాజ్) అని మాయ చెయ్ పట్టుకుని అనుమానంగా అడుగుతుంది

అదేం లేదు వదిన సడెన్ గా ఎందుకో హెడేక్ గా ఉంది అంతే అని చిన్న స్మైల్ తో చెప్పి కార్ లో కూర్చుంటున్న జై ను చూసి తన వైపు సీరియస్ గా చూస్తుంది

నాకు కొంచెం వర్క్ ఉంది మాయ సో చెప్పు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏమున్నా ఇంకో 2 అవర్స్ లో ఫినిష్ చేసుకో అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు

ఎక్కడికి అక్కర్లేదు వదిన వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళు అని చెప్పి మొహం తిప్పుకున్న చెల్లిని ను చూసిన జై నవ్వుతూ కార్ ను  స్టార్ట్ చేసి విత్ ఇన్ హాఫ్ ఆన్ అవర్ లో ఆద్య ఇంటి ముందు ఆపుతాడు

కార్ ఆగగానే నలుగురు ఇంట్లోకి వెళ్ళినా జై మాత్రం పార్టీకో లోనే ఆగి స్మోకింగ్ చేస్తూ టీనా వల్ల డిస్టర్బ్ అయిన తన మైండ్ & బాడీ ను స్మోక్ ను ఇన్హెల్ చేస్తూ డైవర్ట్ చేస్తూ ఉంటాడు

జై ను ఎలా అయినా టీనా దగ్గరకు వెళ్లకుండా ఆపాలి అది కేవలం మాయ వల్లే అవుతుంది అనుకుంటూ మాయ కాస్త ఇలా రా నీతో మాట్లాడాలి అంటూ మాయ చెయ్ పట్టుకుని తనను గార్డెన్ లోకి తీసుకుని వెళతాడు అమర్….

అన్నయ్య ప్లీస్ చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాను మనం మళ్ళీ మాట్లాడుకుందాం ప్లీస్ ఫస్ట్ వేడి వేడిగా కాఫీ తాగాలి అపుడే ఈ తల నొప్పి నాకు తగ్గుతుంది….

లేదు మాయ నేను ఇప్పుడే మాట్లాడాలి & ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనగానే మాయ అమర్ వైపు చూస్తూ సరే చెప్పు అన్నయ్య దేని గురించి నువ్వు మాట్లాడాలి?? అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటూ అడుగుతుంది

అమర్ చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూస్తూ గార్డెనింగ్ చేస్తున్న వెంకటేష్ ను చూసి నిన్ను ఆద్య పిలుస్తుంది అని చెప్పి పంపేసాక మాయ పక్కన కూర్చుని యూ నో మాయ ఇందాక మనం మాల్ లో చూసాం కదా మీ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ టీనా తనతో మీ అన్నయ్య కాసేపట్లో వాడి ఫ్లాట్ కి వెళ్ళబోతున్నాడు మీరు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ అమ్మాయిని ఫ్లాట్ కి రమ్మని చెప్పాడు ఎలా అయినా సరే నువ్వు జై ను ఫ్లాట్ కి వెళ్లకుండా ఆపాలి జై నీ మాట నే వింటాడు ఎదోటి చేసి వాడ్ని వెళ్లకుండా ఆపు….

నువ్వు చెప్తుంది నిజమా అన్నయ్య!!! అందుకేనా ఇందాక ఏదో అర్జంట్ వర్క్ ఉందని తెగ స్పీడ్ గా డ్రైవ్ చేసాడు చెప్తా అని అమర్ కి థాంక్స్ చెప్పి మాయ ఇంట్లోకి వెళ్లగానే ఇక్కడ అమర్ కూడా ఎమ్ తెలియనట్టు మాయ వెనుకే ఇంట్లోకి వెళ్లి కౌచ్ లో కూర్చుని ప్రతాప్ వర్మ తో మాట్లాడుతూ ఉంటాడు

🤍💜🤍💜🤍💜🤍💜🤍💜🤍

ఫ్రెష్ అయి సరదాగా రీల్స్ చూస్తూ టైమ్ పాస్ చేస్తున్న హరిణి కి తన ఫ్రెండ్ కొత్తగా ఓపెన్ అయిన బొటిక్ నుండి కొన్ని డ్రెసెస్ పంపించడం తో వాటిని ఓపెన్ చేసి కొన్ని ఫైనల్ చేసి తిరిగి తన ఫ్రెండ్ కి పంపేసాక హరిణి చూపు మాయ స్టేటస్ మీద పడుతుంది….

అందులో మాయ ఆద్య తో తీసుకున్న పిక్స్ కనిపించడం తో అది చూసిన హరిణి కి మాయ పెట్టిన క్యాప్షన్ కి కోపం తో పళ్ళు నూరుతూ ఆ పిక్స్ జూమ్ చేసి మరీ చూస్తూ ఉంటుంది వండర్ఫుల్ డే అవుట్ విత్ మై డార్లింగ్ వదిన అన్న క్యాప్షన్ చూసి హరిణి కి మండుతూ ఉంటుంది….
చిన్నప్పటి నుండి చూస్తున్నా ఎప్పుడైనా నన్ను వదిన అని పిలిచావా బట్ అది నిన్న కాక మొన్న వచ్చింది దాన్ని మాత్రం గంటకు 10 సార్లు వదిన… వదిన అంటూ జపం చేస్తున్నావ్ నాతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం రీసన్ చెప్తావ్ దాంతో మాత్రం ఇంత హ్యాపీగా ఉంటావా చెప్తానే మీ ఇద్దరి పని ఎలా అయినా మీ మధ్యలో దూరి మీ ఇద్దరికి క్లాషెస్ వచ్చేలా చేయకపోతే నా పేరు హరిణి నే కాదు అని ద్వేషపు కళ్లతో వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది

ఇదేంటి ఇంత అందంగా ఉంది అని ఆద్య వైపు చూసి ఆ రోజు పార్టీ లో చూసినపుడే అనుకున్నానే నువ్వు పెద్ద కిలాడి అని ఎంత కిలాడివి కాకపోతే బావ నిన్ను చూడగానే అలా కిస్ చేస్తాడు…  లాభం లేదు ఇలా చూస్తూ ఊరుకుంటే అత్త అన్నట్లు నిజంగా ఆ ఇంటికి కోడలు కూడా అయిపోయేలా ఉన్నావ్ ఎదోటి చేసి మీకు మీకు గొడవలు పెట్టాలి కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉండగా హరిణి కి కాల్ రావడం తో ఆ కాల్ లిఫ్ట్ చేస్తుంది….

హలో హు ఇస్ దిస్ అని ఆన్ నోన్ నంబర్ లిఫ్ట్ చేసి అడుగుతుంది

హరిణి ఇట్స్ మీ యార్ భరత్ యువర్ బాయ్ ఫ్రెండ్ కసిన్ గుర్తొచ్చానా లాస్ట్ టైమ్ పబ్ లో మీట్ అయ్యాం డిడ్ యూ రిమెంబర్ మీ

భరత్??? అంటూ కాసేపు ఆలోచించిన హరిణి కి 1 వీక్ బ్యాక్ పబ్ లో రాహుల్ తన కసిన్ ను పరిచయం చేయడం గుర్తు చేసుకుంటూ హేయ్ భరత్ యాహ్ గుర్తొచ్చావ్ హౌ ఆర్ యూ సో లాంగ్ ఎలా ఉన్నావ్

నేను బావున్నాను బట్ రాహుల్ అసలు బాలేడు హరిణి అంటూ టెన్షన్ గా చెప్తాడు

వాట్ రాహుల్ బాలేక పోవడం ఏంటి నేను నైట్ అంతా రాహుల్ తోనే ఉన్నాను ఆఫ్టర్ నూన్ కూడా మాట్లాడాను ఈ లోపు ఏమైంది అంటూ భరత్ చెప్పేది అర్థం అవ్వక టెన్షన్ గా అడుగుతుంది హరిణి

ఈవెనింగ్ రాహుల్ కి మాల్ లో ఎవరితోనో చిన్న గొడవ జరిగిందట ఆ గోడవ లో రాహుల్ కి బాగా దెబ్బలు తగిలాయి చెయ్యి ఫ్రాక్చర్ అయింది & రాహుల్ కాన్షియస్ లో కూడా లేడు తన ఫ్రెండ్స్ కి కూడా దెబ్బలు తగిలాయి అందరి కంటే ఎక్కువ రాహుల్ కే తగిలాయి హరిణి హస్పిటల్ లో జాయిన్ చేసాను నువ్వు ఫ్రీగా ఉంటే రాగలవా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది

ఓహ్ గాడ్!!! వీడు కుదురుగా ఉండడు కదా మళ్ళీ ఎవరిని గెలికి తన్నులు తిన్నాడు అని అసహనంగా అరుస్తూ ఒకే ఫైన్ నేను ఇపుడే స్టార్ట్ అవుతాను అడ్రస్ షేర్ చెయ్ భరత్ అంటూ కాల్ కట్ చేసి హస్పిటల్ కి రెడీ అవుతుంది…. భరత్ హరిణి కి హస్పిటల్ అడ్రస్ షేర్ చేశాక డాక్టర్ ఎపుడు బయటకు వస్తాడా అని వెయిట్ చేస్తూ అక్కడే ఉన్న చైర్ లో కూర్చుంటాడు…..

హరిణి ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్తున్నావ్ అని నైట్ 8: 20 కి హడావిడిగా బయటకు వెళ్తున్న కూతురిని హాల్ లో కూర్చుని టీవీ చూస్తున్న శ్వేత అడుగుతుంది

మామ్ అర్జంట్ వర్క్ మీద వెళ్తున్నా బట్ లేట్ అయినా ఇంటికి కచ్చితంగా వచ్చేస్తాను నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ చేసి పడుకో ….

మార్నింగ్ నే కదా చెప్పాను నీకు జై తో మ్యారేజ్ అయ్యే వరకూ నీ తిరుగుళ్ళు తగ్గించమని చెప్పి 1 డే కూడా అవ్వలేదు అపుడే మళ్ళీ స్టార్ట్ చేశావా అని విసుగ్గా అడుగుతూ నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నోరు మూసి లోపలికి పదా డిన్నర్ చేసి పాడుకుందాం రేపు మీ డాడ్ వస్తున్నాడు అదైనా గుర్తుందా నీకు ??

ఉఫ్ మామ్ డోంట్ ఇరిటేట్ మీ ఒకే నేను అందుకోసం వెళ్ళడం లేదు రాహుల్ కి యాక్సిడెంట్ అయిందట (ఎవరితోనో గొడవ పడి వాళ్ళతో తన్నులు తిన్నాడు అని చెప్పడం ఇష్టం లేక ఇలా చక్కగా కవర్ చేసిందన మాట 😜😉) అందుకే చూడ్డానికి వెళ్తున్నా & డాడ్ వాళ్ళు వస్తున్న విషయం నాక్కూడా గుర్తుంది యూ డోంట్ వర్రీ నేను త్వరగానే వచ్చేస్తా అని చెప్పి ఫాస్ట్ గా వెళ్తున్న కూతురిని చూసి ఎపుడు ఇది చెప్పేది తప్పా నా మాట ఇది ఎపుడు వినాలి అంతా నా కర్మ 🤦🤦 అని తల కొట్టుకుని మళ్ళీ తిరిగి చూడ్డం లో ఇన్వాల్వ్ అవుతుంది శ్వేత

🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍🖤

మంచిగా దమ్ము కొట్టి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్న అన్న ను చూసి మాయ పళ్ళు నూరుతూ నిన్ను ఇపుడు ఎలా లాక్ చేస్తానో చూడు అన్నయ్య అని నవ్వుకుని మళ్ళీ మొహాన్ని నార్మల్ గా పెట్టుకుని శైలు తీసుకుని వచ్చిన స్వీట్ తింటూ మాన్య తో ముచ్చట్లు చెప్తూ కూర్చుంటుంది….

బోర్ కొడుతుంది అని బయటకు వెళ్ళారు కదా అపుడే వచ్చేశారు ఏంటి ఆద్య అని కూతురి పక్కన కూర్చుంటూ అడుగుతాడు మహిదర్

డాడ్ అపుడే ఏంటి మేము వెళ్ళి 3 అవర్స్ పైనే అవుతుంది & అక్కడ చాలా గేమ్స్ ఆడుకున్నాం నచ్చిన ఫుడ్ తిన్నాం బాగా టైడ్ అయ్యి వచ్చేసాం మీ వాలకం చూస్తుంటే అక్కడే పడుకుని రేపు వస్తాం అనుకున్నారా ఏంటి అని నవ్వుతూ అడుగుతుంది

హహ అల్లరి పిల్ల నా ఉద్దేశం అది కాదు ఎమ్ షాపింగ్ చేయకుండా వచ్చారేంటి అని నువ్వు మాల్ కి వెళ్తే ఎదోటి షాప్ చేసే తీసుకుని వస్తావ్ కదా అందుకే అడిగా అని మాయ వైపు చూస్తూ ఏంటి మాయ బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు కదా ఇపుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా

అయ్యో మామూలుగా కాదు మామ బీభత్సంగా ఎంజాయ్ చేసాను అని నా కంటే ఇన్ఫాక్ట్ అందరి కంటే ఎక్కువ అన్నయ్య ఎంజాయ్ చేశాడు అని జై వైపు చూస్తూ కదా అన్నయ్య అని సర్కాస్టింగ్ గా అంటుంది….

మాయ ఎక్స్ప్రెషన్ కి నవ్వుకుంటూ హ…. హ
…. అవును అంకుల్ బానే ఎంజాయ్ చేసాను

అంకుల్ ఏంటి జై మాయ చూడు ఎంత చక్కగా మామ అంటుందో నువ్వు కూడా అలాగే పిలువు అనడానికి నీకు వినడానికి నాకు ఇద్దరికీ బావుంటుంది

హహ ఒకే మామ అని చిన్న స్మైల్ ఇచ్చి యాక్చివల్లీ నాకు కొంచెం వ…. అంటూ ఉండగా హా…. మామ చెప్పడం మర్చిపోయాను అన్నయ్య నేను కలిసి ఒక గేమ్ ప్లాన్ చేశాం అదేంటంటే అందరం అలా గార్డెన్ లో కూర్చుని ఒక సింపుల్ గేమ్ ఆడుదాం…. గేమ్ ఏంటంటే అందరి నేమ్స్ చిన్న స్లిప్స్ లో రాసి ఒక బౌల్ లో వేస్తాను ఒక్కొక్కరు ఒక్కో స్లిప్ తీయాలి ఆ స్లిప్ ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళు ఆ నేమ్ పక్కనే చిన్న యాక్టివిటీ యాడ్ చేశాం లైక్ సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ అలా సో వచ్చిన యాక్టివిటీ ను వాళ్ళు పెర్ఫెక్ట్ గా చేయాలి ఎవరు బాగా చేస్తే వాళ్ళే విన్నర్ ఆ విన్నర్ ను తాతయ్య ఎన్నౌన్స్ చేస్తారు సో అందరికీ ఇది ఒకే నా అనగానే అందరూ హుషారుగా ఒకే అంటూ గట్టిగా అరుస్తారు ఒక్క రేణుక, జై తప్పా 😜😝

మాయ కావాలని నన్ను ఇలా అందరి ముందు లాక్ చేసింది అని మాయ వైపు సీరియస్ గా చూస్తూ కూర్చున్న జై ను చూసిన అమర్ మనసులోనే డాన్స్ వేస్తూ అలాగే జై కి డౌబ్ట్ వస్తే ఇవ్వాళే తన లాస్ట్ డే కూడా అని రియలైజ్ అయ్యి నార్మల్ గా ఫేస్ పెడుతూ & ఇన్నోసెంట్ బేబీ లా యాక్ట్ చేస్తూ రేయ్ జై ఇపుడు నువ్వు బయటకు వెళ్ళాలి అది ఇదీ అన్నావో అంకుల్ మూడ్ టోటల్లీ అప్సెట్ అవుతుంది…. చూడు చాలా డేస్ తర్వాత అంకుల్ ఫేస్ లో రియల్ హ్యాపీనెస్ కనిపిస్తుంది ఇప్పుడు నువ్వు అందరం హ్యాపీగా ఉన్న టైం ను స్పాయిల్ చేస్తే అంకుల్ డెఫినెట్ గా ఫీల్ అవుతారు తరువాత నీ ఇష్టం అని జై ను ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ చేస్తాడు …..

 

జై వినయ్ వర్మ వైపు చూస్తాడు నిజంగానే వినయ్ వర్మ ఫేస్ అమర్ చెప్పినట్టు చాలా డేస్ తర్వాత చాలా ప్లెసెంట్ గా & అంతే హ్యాపీగా కనిపిస్తూ ఉంటే జై కి కాంప్రమైజ్ అవ్వక తప్పదు అది చూసిన అమర్ జై చూడకుండా ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుతారు

జై అమర్ వైపు చూస్తూ రేయ్ నిజం చెప్పు ఇది నీ ప్లాన్ అయితే కాదు కదా ఎందుకంటే టీనా తో నేను ఫ్లాట్ కి రమ్మని చెప్పినపుడు నాతో నువ్వు మాత్రమే కదా ఉన్నావ్ సో నన్ను ఫ్లాట్ కి వెళ్లకుండా ఆపడానికి ఇలా నన్ను లాక్ చేసావా నిజం చెప్పరా అని సీరియస్ గా చూస్తూ అడుగుతాడు

ఓరి దేవుడా 🤦🤦 వీడికి డౌబ్ట్ వచ్చినట్టు ఉంది జాగ్రత్తగా కవర్ చేయాలి అనుకుని ఎమ్ మాట్లాడుతున్నావ్ జై 🤷🤷 నిన్ను వెళ్లకుండా నేను ఎందుకు ఆపాలి అనుకుంటాను అయినా నేను ఆపితే మాత్రం నువ్వు ఆగుతావా నీ గురించి తెలిసి కూడా నీతో పెట్టుకుంటానా నాకు అంత ధైర్యం లేదు బాబు …….

 

అసలే నా లైఫ్ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి పైగా లైఫ్ లో ఇంకా ఏం చూడలేదు అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెడుతూ నువ్వంటే అన్ని సుఖాలు చూసావు మరి నాకు పెళ్ళి కాదు కదా ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు అనగానే జై సీరియస్ గా చూస్తాడు అదే…. అదే రా ఫస్ట్ నైట్ కాదు కదా పెళ్ళి కూడా అవ్వలేదు అంటున్నాను 😌☹️

నేను జస్ట్ నువ్వే ప్లాన్ చేసావా అని అడిగినందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ అంటే డెఫినెట్ గా నువ్వే ఏదో పెంట చేసావ్ అది నాకు తెలియాలి అప్పుడు చెప్తా నీ పని అని సీరియస్ గా చెప్పి టీనా తో ప్రోగ్రామ్ క్యాన్సల్ అని చెప్పడానికి గార్డెన్ వైపు వెళతాడు …..

 

టైమ్ గాడ్ కొంచెం లో తప్పించుకున్నా అని ఊపిరి తీసుకుంటూ అందుకే ఓవర్ యాక్షన్ చేయకూడదు అని తనను తాను తిట్టుకుని గార్డెన్ లో ఎరేంజ్మెంట్స్ చేయడానికి ఆద్య, మాయ లకు హెల్ప్ చేయడానికి గార్డెన్ వైపు వెళతాడు అమర్ ….

రాత్రి 7 అవుతూ ఉంటే ఇప్పుడు ఈ గేమ్స్ ఏంటి వీళ్ళ వాలకం చూస్తుంటే ఇక్కడి నుంచి కదిలేలా లేరు అని అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రేణుక

🤍💜🤍💜🤍💜🤍💜🤍💜🤍

 

హరిణి భరత్ షేర్ చేసిన హాస్పిటల్ ముందు కార్ ఆపి అది పార్క్ చేశాక రాహుల్ నేమ్ రిసెప్షన్ లో అడిగి మరీ తెలుసుకుని రాహుల్ ను ట్రీట్ చేస్తున్న రూమ్ 5త్ ఫ్లోర్ లో ఉందని తెలుసుకుని లిఫ్ట్ లో ఆ రూమ్ ఉన్న ఫ్లోర్ కి వెళ్ళి ఒక్కో రూమ్ చూస్తూ వెళ్తున్న హరిణి కి భరత్ ఒక రూమ్ ముందు డాక్టర్ తో మాట్లాడుతూ కనిపించగానే ఫాస్ట్ గా అటు వైపు నడుస్తుంది….

తన ముందు నుంచి డాక్టర్ భరత్ తో మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోవడం చూసి భరత్ అంటూ హరిణి భరత్ ను పిలవగానే హరిణి వాయిస్ కి తన వైపు చూసిన భరత్ ఏయ్ హరిణి వచ్చేశావా నీ కోసమే చూస్తున్నా అని ఫార్మల్ హగ్ చేసుకుంటూ చెప్తాడు….

హాయ్ భరత్ హౌ ఇస్ రాహుల్ డాక్టర్ ఎం చెప్పారు అని అడుగుతున్న హరిణి ను చూసి కమ్ అంటూ రాహుల్ ఉన్నా రూమ్ లోకి తీసుకుని వెళ్ళి రాహుల్ ను హరిణి కి చూపిస్తాడు….

వొళ్ళంతా దెబ్బలతో రైట్ హ్యాండ్ కి హ్యాండ్ సపోర్ట్ బ్యాండేజ్ వేసి ఉండడం & మొహం మీద కూడా అక్కడక్కడ దెబ్బలకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఉండడం చూసి ఓహ్ గాడ్ అంటూ రాహుల్…. రాహుల్ అంటూ తనను లేపడానికి ట్రై చేస్తూ అక్కడే ఉన్న చైర్ లో కూర్చుని రాహుల్ మరో హ్యాండ్ పట్టుకుని తన వైపు చూస్తుంది….

సెడెటివ్ ఇచ్చారు హరిణి కాన్షియస్ లోకి రావడానికి ఇంకో 10 మినిట్స్ పడుతుంది అన్నారు యూ డోంట్ వర్రీ హి ఇస్ ఒకే నౌ కాకపోతే 1 మంత్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు అని చెప్తూ అక్కడే ఉన్న కౌచ్ లో కూర్చుంటూ అన్సర్ ఇస్తాడు …..

 

అసలేం జరిగింది భరత్ వీడిని ఇంతలా ఎవరు కొట్టారు చూస్తుంటే ఏదో కావాలని గ్రడ్జ్ పెట్టుకుని కొట్టినట్టు ఉన్నారు నేను ఏదో చిన్న దెబ్బలు అనుకున్నా బట్ బాగా తగిలాయి అని రాహుల్ వైపు కన్సర్న్ చూపిస్తూ అడుగుతుంది….

హా….. బాగానే తగిలాయి హరిణి ఎమ్ జరిగిందో నాకు కూడా క్లారిటీ లేదు రాహుల్ ఫ్రెండ్స్ మాత్రం వీళ్ళు ఎవరో అమ్మాయిని కామెంట్ చేస్తే ఎవడో కొట్టాడు అంటున్నారు ఇన్ఫాక్ట్ నాకు కాల్ చేసింది కూడా రాహుల్ ఫ్రెండ్ మోహన్ నేను వెళ్ళే సరికి అందరూ స్రృహ లో లేకుండా పడున్నారు & ఎవరు కూడా వీళ్ళను పట్టించు కోవడం లేదు నేను మాల్ మ్యానేజర్ ను నాలుగు తిట్టి వీళ్ళను వెంటనే ఇక్కడ అడ్మిట్ చేసి నీకు కాల్ చేసాను ……. అని జరిగింది తనకు తెలిసింది హరిణి కి చెప్తాడు భరత్

వాట్ జస్ట్ కామెంట్ చేస్తే ఇంతలా కొట్టాలా ఎవడు వాడు అని సీరియస్ అవుతూ రాహుల్ కి ఎపుడు స్పృహ వస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంటుంది హరిణి…..

 

To Be continueed……………………………

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply