ప్రతాప్ వర్మ వైపు కన్ఫ్యూస్డ్ ఫేస్ తో చూస్తూ ఎమ్మాట్లాడుతున్నారు తాతయ్య నానమ్మ సొంతూరు రామాపురం కి వెళ్ళడం ఏంటి?? మనకు ఎవరు ఉన్నారు అక్కడ? నేను ఇప్పటి వరకూ ఆ విలేజ్ నేమ్ కూడా వినలేదు ఇంతకీ ఆ విలేజ్ ఎక్కడ?? అని అడుగుతుంది మాయ…
నీ చిన్నప్పుడు ఒక సారి వెళ్ళాం తల్లీ ఆ తర్వాత మీ నానమ్మ చనిపోయాక మనం ఎపుడు అక్కడికి వెళ్లలేదు & నేను మీ డాడ్ బిజినెస్ లో బిసి అవ్వడం వల్ల అన్నిటికీ దూరంగా ఇదిగో ఇక్కడ ఉంటున్నాం అందుకే ఒక సారి అందరినీ చూసినట్టు ఉంటుంది & మీకు కూడా చిన్న చేంజ్ ఉంటుంది ఎపుడు విలేజ్ ను చూడలేదు కదా సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీరు లైవ్ లో చూడచ్చు ట్రస్ట్ మీ నేను చెప్తున్న విలేజ్ చాలా బావుంటుంది మీ అందరికీ బాగా నచ్చుతుంది…
అదంతా ఒకే తాతయ్య బట్ మనకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారా?? ఉంటే వాళ్ళు మనకు ఎమ్ అవుతారు ఇన్నాళ్ళు వాళ్ళు మనతో ఎందుకు మాట్లాడలేదు
హా!!! బంగారం మనకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారు మీ నానమ్మ తమ్ముడి ఫ్యామిలీ అక్కడే ఉంటారు మీరు వాళ్ళతో మాట్లాడలేదు కానీ వాళ్ళు ఎప్పుడూ మీ గురించి అడుగుతూనే ఉంటారు
అవునా 😊😊 మరీ మాకు ఎప్పుడూ ఎందుకు నాన్నమ్మ ఫ్యామిలీ గురించి చెప్పలేదు తాతయ్య
మీ మామ్ కి నానమ్మ ఫ్యామిలీ అంటే నచ్చదు నీ చిన్నప్పుడే చాలా పెద్ద గొడవ జరిగింది అప్పటి నుంచి వాళ్ళకు దూరంగా ఉంటున్నాం
అయ్యో అలాగా మామ్ గురించి తెలిసిందే కదా తాతయ్య మామ్ కోసం ఇన్ని ఇయర్స్ వాళ్ళను మాకు దూరం చేసారా అని బాధగా అడుగుతూ ఇట్స్ ఒకే తాతయ్య ఇప్పటికైనా మనం వాళ్ళను మీట్ అవ్వబోతున్నాం మామ్ ను నేను ఒప్పిస్తాను మీరు మన రిలేటివ్స్ కి ఇన్ఫామ్ చేయండి మనం అక్కడికి వస్తున్నాం అని అంటూ క్యూట్ స్మైల్ తో చెప్తుంది
అలాగే బంగారం బట్ మీ మామ్ కి నువ్వు కాదు నేనే చెప్తాను ఇన్నాళ్ళు మీ మామ్ వల్లే వాళ్ళకు దూరంగా ఉన్నాను బట్ ఇపుడు మీ మామ్ ద్వారానే వాళ్ళను కలవబోతున్నాం అని ఐ వింక్ చేసిన ప్రతాప్ వైపు చూస్తూ అదెలా తాతయ్య మీరే చెప్పారు కదా మామ్ కి వాళ్ళంటే నచ్చదు అని అలాంటి మామ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకుంటుంది
హహ 😁 మీ మామ్ ను చిన్నప్పటి నుండి చూస్తున్నా మాయ తనను ఎక్కడ ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు యూ జస్ట్ రిలాక్స్ అని కాన్ఫిడెంట్ గా చెప్తున్న ప్రతాప్ వర్మ వైపు చూసి తాతయ్య ఏదో ప్లాన్ వేసినట్టు ఉన్నాడు చూద్దాం ఎమ్ అవుతుందో ఒక వేళ తాతయ్య ప్లాన్ ఫ్లాప్ అయితే నేను ఇంకేదైనా ప్లాన్ చేసి మామ్ ను ఒప్పించాలి అనుకుని తను కామ్ అవుతుంది మాయ….
🤍💜🤍💜🤍💜🤍💜🤍💜
చీ ఛీ ఇంకా ఎంత సేపు ఇక్కడే ఉండాలి అరే గెస్ట్స్ ఇంటికి వచ్చారు అని కొంచెం అయినా సెన్స్ లేకుండా ఆ ఆద్య డైనింగ్ టేబుల్ దగ్గర ఎంత 4పొగరుగా ప్లేట్ విసిరి కొట్టింది అని కోపంగా పళ్ళు కొరుకుతూ గార్డెన్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రేణుక
మావయ్య ఏమో ఆద్య దగ్గర నుండి సభ్యత, సంస్కారం నేర్చుకోవాలి అని లెక్చర్ ఇస్తాడు ఇదేనా సంస్కారం అదే హరిణి అయితే అలా నలుగురిలో ఎపుడు అలా బిహేవ్ చేయదు ఎంతైనా నా కోడలు బంగారం అని మురిసిపోతూ ఆధ్య, జై ఎక్కువ సార్లు మీట్ అవ్వడం అసలు మంచిది కాదు
వాళ్ళను చూస్తుంటే నాకు కూడా డౌబ్ట్ గానే ఉంది … అరే ఎపుడు కొట్టుకుంటూ ఉంటారు మళ్ళీ అంతలోనే అమర ప్రేమికుల్లా ఒకరిని ఒకరు అతుక్కుని తిరుగుతారు… లాభం లేదు ఇంకా ఇలాగే చూస్తూ ఉంటే మావయ్య, ఆయన కలిసి వీళ్ళకు పెళ్ళి చేసినా చేస్తారు హరిణి ను ఎమ్ చేసైనా సరే జై ను తన వైపు తిప్పుకునేలా చేయమని చెప్పాలి అని మొబైల్ తీసుకుని హరిణి కి కాల్ చేస్తుంది
🤍💚🤍💚🤍💚🤍💚🤍💚
కోపంగా బెడ్ మీద బోర్లా పడుకుని బాధగా పిల్లో ను తడిపేస్తున్న ఆద్య కి డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించడం తో ఏడుస్తూనే అటు వైపు చూసిన ఆద్య కి మహిదర్ ప్లేట్ లో ఫుడ్ సర్వ్ చేసుకుని రావడం చూసి మొహాన్ని మరో వైపు తిప్పుకుని పడుకుంటుంది
ఆద్య ను అలా చూసిన మహీదర్ అరే అమ్ము తల్లీ లే కన్నలు చూడు నీ కోసం ఎమ్ తీసుకుని వచ్చానో అని టేబుల్ మీద ప్లేట్ పెడుతూ ఆద్య ను లేపడానికి ట్రై చేస్తాడు…
ప్చ్ …. డాడీ ప్లీస్ లీవ్ మీ నాకు ఆకలి వేయడం ప్లీస్ నన్ను ఒంటరిగా వదిలేయండి అని తన చెయ్ విడిపించుకుని అలాగే అలిగి పడుకుంటుంది
అమ్ము నీకు చెప్తూనే ఉంటాను నేను నీకు అలగాలి అనుంటే నా మీద అలుగు లేదా మీ అమ్మ మీద అలుగు అంతే కానీ ఇలా ఫుడ్ మీద అలగకూడదు తల్లీ ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇది దొరకక చాలా మంది ఎన్నో బాధలు పడుతున్నారు సో నువ్వు నీ నోటి దగ్గరకు వచ్చిన దాన్ని అలా కింద పడేసి వేస్ట్ చేసావ్ అది చాలా తప్పు బంగారం
ఆద్య కోపంగా పైకి లేచి కూర్చుని మీరు నేను వద్దు అన్నా కూడా ఎందుకు నాకు మ్యాచెస్ చూస్తున్నారు అలా చూడ్డం వల్లే కదా నేను కోపంగా అలా విసిరేసాను అయినా మీరు నాతో మాట్లాడకండి మమ్మీ తో పాటు మీరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు
అమ్ము…. నీ మ్యారేజ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ నువ్వు భోజనం చేయ్ అంటూ చికెన్ బిర్యానీ ను తన చేత్తో తినిపించాలి అని ఆద్య నోటి దగ్గర పెడతాడు
డాడీ ప్లీస్ నన్ను ఇరిటేట్ చేయకండి నాకు కొంచెం స్పేస్ కావాలి అంటూ మొహం తిప్పుకున్న ఆద్య ను చూసి సరే నీకు నువ్వుగా మ్యారేజ్ చేయండి అని అడిగే వరకు మ్యారేజ్ టాపిక్ తీసుకుని రాము మీ మమ్మీ తో కూడా నేను మాట్లాడుతాను ఇప్పుడైనా తింటావా
మీ మాట ను నేను ట్రస్ట్ చేయను ముందు కూడా నాతో ఇలాగే చెప్పారు బట్ నౌ పెళ్ళి చూపులు వరకూ వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అవుతుంది ఐ నో దట్
సో నీకు మీ డాడీ మీద నమ్మకం లేదు అంతే కదా అమ్ము అంటూ ఆద్య ను సెంటిమెంటల్ గా లాక్ చేయడానికి ట్రై చేస్తున్న మహీదర్ వైపు చూసి డాడ్ మీరు ఎన్ని డైలాగ్స్ వేసినా ఈ విషయం లో నేను మీ మాట ఇక వినను & నేను చెన్నై వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అని సీరియస్ గా చెప్తున్న కూతురి వైపు విస్మయంగా చూస్తూ వాట్ అని కొంచెం గట్టిగానే షాక్ అవుతాడు
నేను ముందే చెప్పాను నా పెళ్ళి టాపిక్ మళ్ళీ తీసుకుని వస్తే నేను దూరంగా వెళ్ళిపోతా అని బట్ మీరు నా మాట ను లెఫ్ట్ లెగ్ తో తన్నేసి సంబంధాలు చూసారు అందుకే నేను ఇక ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు
మహిదర్ ఆద్య వైపు చూసి తన చెయ్ పట్టుకుని అమ్ము బంగారం కోపం లో ఏదో అంటున్నావ్ కానీ నిజం చెప్పరా నువ్వు కూడా మాకు దూరంగా వెళ్ళిపోతే మేము ఇంక ఎవరి కోసం బ్రతకాలి 🥹🥹
డాడీ అంటూ ఆద్య ఒక్క సారిగా ఎమోషనల్ అవుతూ మహీదర్ వీపు ను చుట్టేసి ప్లీస్ అలా మాట్లాడకండి మీ మొహం లో హ్యాపీనెస్ మాత్రమే నేను చూడగలను ఇంకెప్పుడు అలా అనకండి ఐ ఆల్వేస్ లవ్ యూ అందుకే మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లకూడదు అనే పెళ్ళి కూడా వద్దు అనుకున్నాను ప్లీస్ డాడీ మన మధ్య ఇంకెవ్వరు వద్దు అని చిన్న పిల్ల స్కూల్ కి వెళ్లనని మారం చేసినట్టు ఆద్య పెళ్ళి వద్దు అని చెప్పడం చూసి మహిదర్ ఆలోచన లో పడతాడు
చెప్పు డాడీ అంటూ బేలగా తన వైపు చూస్తున్న కూతురి వైపు చూసి మహీదర్ ఏదో చెప్పే లోగా ఆహా!!! ఓహో…. అబ్బబ్బా…. హ్మ్మ్…. అని సౌండ్ చేస్తూ బిర్యాని తింటూ జై ఆద్య రూమ్ లోకి ఎంటర్ అయ్యి ఆద్య ఎదురుగా చైర్ లాక్కుని కూర్చుంటూ బిర్యాని తింటూ ఉంటాడు
జై ను చూసిన ఆద్య తన వైపు కోపంగా చూస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ మహిదర్ కు దూరంగా జరిగి తన వైపు నడుము మీద చేతులు పెట్టుకుని సీరియస్ లుక్స్ ఇస్తూ ఉంటుంది
ఆహా…!! ఆంటీ ఏమన్నా చేసిందా అంకుల్ బిర్యాని ఇలా తింటూ ఉంటే అలా గొంతు లోకి జారిపోతూ ఉంది ఇదిగో ఈ ఫ్రై పీస్ అయితే బలే సాఫ్ట్ గా కుక్ అయింది & మటన్ ఫ్రై కూడా అంతే బలే కుదిరింది అని ఆద్య ను ఊరిస్తూ తింటూ ఉంటాడు
యూ ఇడియట్ నువ్వు తినాలి అనుకుంటే బయటకు వెళ్ళి తిను నా రూమ్ లోకి వచ్చి ఇలా సౌండ్స్ చేస్తూ తింటుంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది
హలో ఇది నీ రూమ్ నే అవ్వచ్చు బట్ ఇది మా అంకుల్ విల్లా సో నేను ఎక్కడికైనా వస్తాను ఏమైనా చేస్తాను కాదు అని చెప్పడానికి నీకు ఏ రైట్ లేదు ఒకే బెటర్ యూ షట్ యువర్ మౌత్
చూసావా డాడ్ వాడి పొగరు నా ఇంటికి వచ్చి నన్నే నోరు మూసుకో అని నీ ముందే చెప్తున్నాడు & నా ఇంట్లో నాకు రైట్ లేదా వాట్ ఇస్ దిస్ డాడీ అర్జెంట్ గా వాడ్ని బయటకు వెళ్ళమంటావా లేక నేను వెళ్ళిపోనా
ఏయ్ మిర్చి నీకు ప్రాబ్లెమ్ ఉంటే నాతో మాట్లాడవే లేదా పోట్లాడు అంతే కానీ మన మధ్యలోకి అంకుల్ ను లాగకు
నీతో నాకెంట్రా మాటలు అసలు నువ్వు ఇక్కడికి నాతో గొడవ పడడానికే వచ్చావా
కాదు బిర్యాని తినడానికి వచ్చాను నువ్వు అలాగే ఆకలికి కడుపు మార్చుకుంటూ ఉండు అది చూసి నేను ఇలాగే నీ ముందే కూర్చుని ఫుల్ గా బిర్యాని కుమ్మేస్తా అంటూ తన ప్లేట్ లో బిర్యాని ఫినిష్ చేస్తున్న జై వైపు సీరియస్ గా చూస్తూ చూడు పంది లా ఎలా తింటున్నాడో వీడు మాడ్చుకో అంటే నేను ఎందుకు కడుపు మార్చుకుంటాను అని పంతంగా అనుకుంటూ డాడీ ఫీలింగ్ హంగ్రీ అంటూ మహీదర్ చేతిలోని ప్లేట్ లాక్కుని తింటున్న ఆద్య ను చూసి జై నవ్వుతూ మహిదర్ వైపు చూడ్డం తో మహిదర్ కళ్ళతోనే జై కి థాంక్స్ చెప్పి రూమ్ లో నుండి జై ను తీసుకుని శైలు ఉన్న రూమ్ లోకి వెళతారు
మహీదర్ ను చూసిన శైలు ఏమైందండీ అది లంచ్ చేసిందా అని ఆత్రంగా అడుగుతున్న శైలు వైపు చూసి చేసింది బట్ అందుకు రీసన్ జై తనే కావాలని ఆద్య ను మాటలతో రెచ్చ కొట్టి తినేలా చేశాడు ఈ విషయం లో మనం జై కి థాంక్స్ చెప్పాలి
అరే వాట్ అంకుల్ మీరు నాకు థాంక్స్ చెప్పడం ఏంటి మీకు చెప్పాను కదా ఆద్య మ్యారేజ్ మీకు నచ్చిన వాడితోనే గ్రాండ్ గా జరుగుతుంది అందుకు నాకు కొంచెం టైమ్ ఇవ్వండి
వద్దు జై ఇందాక ఆద్య తో మాట్లాడినప్పుడు తన కళ్ళల్లో పెయిన్ గుండెల్లో బాధ రెండు నాకు అర్థం అయ్యాయి ఆద్య ఎపుడైతే మ్యారేజ్ కి మెంటల్ గా రెడీ గా ఉంటుందో అపుడే మ్యారేజ్ చేస్తాం లేదా ఎప్పటికీ మాతో ఇలాగే ఉండిపోతుంది ఎమ్ జరగాలి అనుంటే అదే జరుగుతుంది నువ్వు అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆద్య కి మరింత శత్రువు గా మారిపోకు అని తన బుజం తట్టి హాల్ లోకి వెళ్ళిపోతాడు
ఆంటీ ఏంటిది ఆద్య ఇష్టంగా మ్యారేజ్ కి ఒప్పుకోవాలి అంటే అది ఈ జన్మలో జరుగుతుందా మనం కొంచెం ట్రై చేస్తేనే కదా రిసల్ట్ కనిపిస్తుంది
ఆయన మాటలు నువ్వు పట్టించు కోవద్దు జై ఆద్య మనసు ఎలా అయినా చేంజ్ చేసి మ్యారేజ్ కి ఒప్పించు నాకు ఆద్య మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండడం కావాలి అందుకు నేను ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను
అలా అన్నారు బావుంది ఇక నుండి నేను అదే పనిలో ఉంటాను అని కిందకు వెళ్తున్న జై చెయ్ పట్టుకుని మరో వైపు కు తీసుకుని వెళ్ళి రేయ్ అసలేం చేస్తున్నావ్ రా నువ్వు ఆద్య అంటేనే చిరాకు పడతావు అలాంటిది తన మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవడం ఏంటి ఆద్య నిన్ను తిడుతున్నా అలా సైలంట్ గా ఉండడం ఏంటి నువ్వు చేస్తుంది నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు
జై ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ ఆద్య తనకు ఇష్టం లేని పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్తేనే కదరా దాని పొగరు, బలుపు తగ్గేది & అప్పుడు కదా దాని మీద నా కోపం, పగ అన్ని నెరవేరుతాయి
ఆద్య కి ఎలా అయినా పెళ్లి చేయాలి బట్ అది పెళ్లయ్యాక హ్యాపీగా మాత్రం ఉండకూడదు ఉండనివ్వను లేకపోతే ఈ జై ధీర్ నే ఇన్సల్ట్ చేస్తుందా చూస్తూ ఉండు దాన్ని ఎలా దెబ్బ కొడతానో అంటూ కన్నింగ్ నవ్వుతున్న జై ను చూసి అమర్ నుదుటిన చమట పడుతుంది
జై నువ్వు చేస్తుంది చాలా తప్పు రా మీ మధ్య ఉన్నవి సిల్లీ ఫైట్స్ రా దాని కోసం నువ్వు ఆద్య లైఫ్ ను స్పాయిల్ చేయాలి అనుకోవడం కంప్లీట్ రాంగ్ పాపం మహీదర్ అంకుల్ శైలు ఆంటీ లకు ఇది తెలిస్తే నిన్ను మాత్రమే కాదు నీ ఫ్యామిలీ ను కూడా అసహ్యించుకునే ఛాన్స్ ఉంది
షట్ అప్ అమర్ అది నన్ను ఎంత ఇన్సల్ట్ చేసిందో తెలిసి కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నావా ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు అది నాకు చిన్నప్పటి నుండి శత్రువే అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఆగి ఈ మ్యాటర్ ఎక్కడైనా లీక్ చేశావో నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు సూర్యుడిని చూడావ్ నాకు ఫ్రెండ్ అన్న సెంటిమెంట్ కూడా లేదు అని చెప్పి ఆగకుండా వెళ్తున్న జై వైపే అమర్ చూస్తూ ఉండిపోతాడు
🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍🖤
ఆద్య తన ప్లేట్ లోని ఫుడ్ ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండగా అక్కడికి వస్తుంది మాయ తనను చూసిన ఆద్య చిన్న స్మైల్ ఇచ్చి కమ్ మాయ అంటూ తను కౌచ్ లో కూర్చుని పక్కనే మాయ ను కూర్చో బెట్టుకుని తన వైపు చూస్తుంది
వదిన ఇపుడు నీ మూడ్ సెట్ అయిందా ఐ మీన్ లంచ్ చేసావ్ కదా సో సెట్ అయింది అనే అనుకుంటున్నా అయినా ఎందుకు వదిన నీకు మ్యారేజ్ అంటే అంత అసహ్యం
నా ఫ్రెండ్ లైఫ్ లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల మ్యారేజ్ గురించి కంప్లీట్ నా థాట్ నే మార్చేసింది అందుకే నాకు మ్యారేజ్ అంటే ఇష్టం లేదు & నాకు ఇపుడు మ్యారేజ్ కంటే ముందు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది మాయ అది ఎలా ఫినిష్ చేయాలి అందుకే ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా కంప్లీట్ చేయాలి అని ట్రై చేస్తున్నా బై గాడ్స్ గ్రేస్ అది సక్సెస్ అవుతుందని చిన్న హోప్ ఉంది
ఏంటి వదిన అంత సీక్రెట్ వర్క్ ఎమ్ నాకు కూడా చెప్పకూడదా
అలా ఎమ్ లేదు మాయ నీ మీద నాకు కంప్లీట్ ట్రస్ట్ ఉంది అని మాయ కి దగ్గరగా జరిగి నీకు మా అన్నయ్య హర్ష గుర్తున్నాడా మాయ అని నెమ్మదిగా అడుగుతుంది
హర్ష పేరు వినగానే మాయ గుండె కొట్టుకునే స్పీడ్ అమాంతం పెరిగిపోతుంది & తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు బుగ్గల మీద కు జారుతూ ఉంటే వాటిని ఆపలేక అవి ఆద్య కంట పడకుండా పైకి లేచి తుడుచుకుంటూ హ్మ్మ్…. అని మాత్రమే సౌండ్ చేస్తుంది ( మాయ మాట్లాడాలి అనుకున్నా గుండెల్లో నుండి తన్నుకు వస్తున్న బాధ మాయ మాట ను గొంతులోనే ఆపేస్తుంది)
మీరు ఇద్దరూ చిన్నప్పుడు చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళు మాయ నాకు బాగా గుర్తుంది మాయ ఒక్క రోజు హర్ష కనిపించక పోయినా నువ్వు బాగా ఏడ్చేసి ఫీవర్ కూడా తెచ్చుకొనే దానివి వాడు అంటే అంత ఇష్టం నీకు & ఇంకో విషయం గుర్తుందా నీ బర్త్డే రోజు హర్ష నీ పేరు ని వాడి రైట్ హ్యాండ్ మీద టాటూ వేయించుకుని ఆ నొప్పికి ఫీవర్ కూడా తెచ్చుకుంటే అది చూసి ఏడుస్తూ నువ్వు కూడా ఫీవర్ తెచ్చుకున్నావ్
అధ్య చెప్తున్న ఒక్కో సీన్ తన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తూ ఉంటే మాయ కళ్ళు వర్షించే సంద్రాలే అవుతాయి హర్ష తన కోసం చేసిన ప్రతీ పని లో తన మీదున్న ప్రేమ కనిపిస్తూ ఉంటే మాయ కి ఏడుపు తో పాటు ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయి
ఆద్య తను ఫ్లో లో చెప్పుకుంటూ మాయ ను గమనించ లేదు కానీ అప్పటికే మాయ బాగా ఏడవడం వల్ల తన మొహం ఎర్రగా కందిపోయి ఎక్కిళ్ళు బయటకు వినిపించడం తో ఆద్య కంగారుగా వాటర్ మాయ కి తాగిస్తూ తన మొహం వైపు చూసి అయ్యో మాయ ఏంటిది అన్నయ్య గుర్తొచ్చాడా అని లాలనగా అడుగుతూ ఉంటే మాయ ఏడుస్తూ అవును అంటూ ఆద్య ను హగ్ చేసుకుంటుంది
అయ్యో నీకు అనవసరంగా గుర్తు చేశా అనుకుంటా ఊరుకో మాయ అంటూ తన వీపు నిమురుతూ మాయ నార్మల్ అయ్యాక తనను కౌచ్ లో కూర్చో పెడుతూ నాకు ఎందుకో అందరూ అనుకుంటున్నట్టు అన్నయ్య చనిపోలేదు అనిపిస్తుంది మాయ అందుకే 5 ఇయర్స్ గా అన్నయ్య కోసం సీక్రెట్ గా సెర్చ్ చేస్తూనే ఉన్నాను బట్ నో యూస్ 😔😔
హర్ష ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా వదిన మరి ఎలా సెర్చ్ చేయిస్తున్నావ్ అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంది
అన్నయ్య పారిపోయేటపుడు ఎలా ఉన్నాడో చూపించి ఆర్టిస్ట్ తో స్కెచ్ వేయించా మాయ వాళ్ళు కొన్ని రిఫరెన్స్ పిక్స్ డ్రా చేసి ఇచ్చారు సో ఆ పిక్స్ ఆధారంగా సెర్చ్ చేయిస్తున్నా ఎలా అయినా అన్నయ్య ను పట్టుకుని మమ్మీ ముందు కు తీసుకుని వెళ్ళి సర్ప్రైజ్ చేయాలి ఇపుడు నా ముందు ఉంది ఇదే గోల్ మాయ
వదిన ఇపుడు హర్ష ఉండుంటాడు ఒక సారి ఆ ఆర్టిస్ట్ వేసిన డ్రా తీసుకుని రావా ప్లీస్ అనగానే ఆద్య లోపల దాచిన వాటిని తీసుకుని వచ్చి మాయ చేతిలో పెడుతుంది మాయ వాటిని ప్రేమగా తడుముతూ ఎక్కడున్నావ్ రా అని మూగగా ప్రశ్నించాగానే ఆఫీస్ లో సిస్టమ్ ముందు కూర్చున్న హర్ష కి ఆగకుండా వెక్కిళ్లు మొదలవుతాయి..
To Be Continueed…..
Error: Contact form not found.
Nice