విలన్ హస్బెండ్-10

విలన్ హస్బెండ్-10

శైలు,మహిదర్ పార్టీ నుండి స్టార్ట్ అయ్యి ట్రాఫిక్ లో ఇరుక్కుని దాన్ని  క్రాస్ చేసి తమ విల్లా కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:40 అవుతుంది. ఓహ్ గాడ్ ఇవాళ ఏంటండీ ఇంత ట్రాఫిక్ ఉంది అని ఇంట్లోకి రాగానే అలసటగా సోఫా లో కూర్చుని మెయిడ్ ఇచ్చిన వాటర్ తాగుతూ ఆద్య వచ్చిందా అంటూ మెయిడ్ పద్మ వైపు చూస్తుంది….

అమ్మాయి గారు వచ్చి చాలా సేపు అవుతుంది మేడమ్ బాగా డిస్టర్బ్ గా ఉన్నాను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని సీరియస్ గా చెప్పి రూమ్ లోకి వెళ్ళారు డిన్నర్ చేయడానికి కూడా రాలేదు.. పిలవాలి అని 2 సార్లు అమ్మాయి గారి రూమ్ దగ్గరకు వెళ్ళాను కానీ అమ్మాయి గారు డిస్టర్బ్ చేయద్దు అన్నారని ఆగిపోయి ఇప్పటి వరకూ పాప డిన్నర్ కి వస్తుందేమో అని చూస్తున్నాను మేడమ్….

ఆద్య డిస్టర్బ్ చేయద్దు అంటే ఊరుకోవడమేనా తనకు టైమ్ కి ఫుడ్ పెట్టాలి అనే కదా నిన్ను అపాయింట్ చేసింది అని విసుగ్గా పద్మ వైపు చూస్తూ సర్లే వెళ్ళి డిన్నర్ తీసుకుని రా అని చెప్పి వద్దు అమ్ము కి నేనే ఏదైనా వేడిగా చేసి తీసుకుని వెళ్తాను నువ్వు సర్ కి కాఫీ ఇవ్వు అని శారీ చేంజ్ చేయడం కోసం రూమ్ వైపు వెళ్తుంది

కూతురి మీద శైలు కి చాలా ప్రేమ ఉంది బట్ దాన్ని బయటకు చూపించదు కారణం మహిదర్ ఆద్య ను చాలా గారాబంగా చూసుకుంటూ ఉంటాడు తను కూడా గారాబం చేస్తే ఆద్య మాట వినదు అని కూతురు మీద ప్రేమ చూపించకుండా ఆద్య తో అలా సీరియస్ గా బిహేవ్ చేస్తుంది …. శైలు ను చూసిన మహిదర్ చిన్నగా నవ్వి మెయిడ్ ఇచ్చిన కాఫీ తాగుతూ మాన్య కూడా పార్టీ మిడిల్ లో వెళ్ళిపోవడం గుర్తొచ్చి ఫ్రెష్ అయి కిచెన్ లోకి వెళ్తున్న శైలు ను పిలుస్తాడు….

ఏంటండీ ఏమైనా కావాలా మీకు కూడా ఏదైనా లైట్ ఫుడ్ కుక్ చేయనా??

ఫుడ్ గురించి కాదు శైలు నేను పిలిచింది పార్టీ మిడిల్ లో ఆద్య అంటే హెడ్ ఏక్ అని వచ్చేసింది మరి మాన్య ఎందుకు వచ్చింది ఎట్ లీస్ట్ వెళ్తున్నట్టు చెప్పను కూడా లేదు…

మాన్య కి ఇంటి నుంచి కాల్ వచ్చిందట అండి తన మదర్ కాల్ చేసి అర్జంట్ గా రమ్మని చెప్పారట అందుకే హడావిడిగా వెళ్ళిపోయింది…. ఆద్య కాల్ పిక్ చేయలేదని మాన్య నాకు కాల్ చేసి చెప్పింది ఈ విషయం మీకు చెప్పాలి అనుకున్నా బట్ పార్టీ హడావిడి లో మర్చిపోయాను…

అవునా!!! ఏంటో ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే సారి పార్టీ నుంచి వెళ్ళిపోయారు అని నిట్టూర్చి మార్నింగ్ మాన్య కి కాల్ చేసి ఇంటికి రమ్మను ఎలాగో వినయ్ ఫ్యామిలీ వస్తున్నారు కదా సరదాగా అందరం టైమ్ స్పెండ్ చేయచ్చు వాట్ డు యూ సే శైలు…?

అలాగే నండి తప్పకుండా పిలుస్తాను కుదిరితే తన పేరెంట్స్ ను కూడా తీసుకుని రమ్మని చెప్తా… మీ కూతురి మీద మాత్రం నాకు చాలా కోపంగా ఉంది రెండు గంటలు కష్టపడి రెడీ చేస్తే పార్టీ లో 20 మినిట్స్ కూడా లేదు అని రుసరుసలాడుతూ కిచెన్ లోకి వెళ్తున్న శైలు ను చూసి హాయిగా నవ్వేస్తాడు మహిదర్…

శైలు ఆద్య కోసం వేడి వేడిగా వెజ్ నూడిల్స్ ప్రిపేర్ చేసి అది ఆద్య రూమ్ లోకి తీసుకుని రమ్మని చెప్పి తను ఆద్య రూమ్ వైపు వెళ్తుంది… మెయిడ్ ట్రే టేబుల్ మీద పెట్టేసి బయటకు వెళ్లగానే బ్లాక్ షాట్ విత్ పింక్ ట్యూబ్ స్లీవ్లెస్ టాప్ వేసుకుని తన వైట్ కలర్ టెడ్డి బేర్ ను హగ్ చేసుకుని ముద్దుగా పడుతున్న కూతుర్ని చూసి నవ్వుతూ తన తల నిమురుతుంది …. పడుకున్నప్పుడు ఎంత ఇన్నోసెంట్ గా ఉంటుందో మెలకువగా ఉన్నప్పుడు అంత రాక్షసి లా బిహేవ్ చేస్తుంది అని నవ్వుకుంటూ ఆద్య ను బలవంతంగా నిద్ర లేపుతుంది….

అబ్బా మమ్మీ నన్ను పడుకోనివ్వు నాకు మూడ్ అసలు బాలేదు ఇరిటేట్ చేయకుండా వెళ్ళమ్మా అని అటు వైపు తిరిగి పడుకుంటుంది….

అలా ఎంప్టీ స్టమక్ తో పడుకోకూడదే నా మాట విను కొంచెం అయినా తిని పడుకో పైగా హెడ్ ఏక్ అంటున్నావ్ కాస్త తిను అని ఆద్య ను కష్టంగా పైకి లేపి కూర్చోబెట్టి కొంచెం కొంచెంగా తినిపిస్తుంది……

జై ను తిట్టుకుంటూ పడుకున్న ఆద్య కి శైలు లేపడం వల్ల మళ్ళీ జై గుర్తు రావడం తో లోఫర్, డాఫర్, ఫాల్తూ ఇంకో సారి వాడు కనిపిస్తే లైఫ్ లో మర్చిపోలేని విధంగా నా స్టైల్ లో టార్చర్ చేస్తాను అని తిట్టుకుంటూ కూర్చుంటుంది ….

నోరు తెరవ్వే అని ఆద్య నెత్తి మీద కొడుతూ ఆ బ్రెయిన్ కి కొంచెం అయినా రెస్ట్ ఇవ్వు ఎపుడు ఆఫీస్, వర్క్, ప్రాజెక్ట్స్ ఇవే లైఫ్ కాదు అని చిరు కోపంగా చెప్తుంది…

అబ్బా అని తల రుద్దుకుంటూ అసలే ఆ మెంటలోడి వల్ల నా మూడ్ బాలేదు అని నేను ఏడుస్తుంటే మమ్మీ ఒకటి నాకు ఈజిప్ట్ మమ్మీ లా తయారు అయింది అనుకుని అసలే తల నొప్పిగా ఉంటే మళ్ళీ తల మీద కొడతావా నాకు నువ్వు వొద్దు నీ నూడిల్స్ వద్దు పెహ్ అని అలిగి కాస్త వాటర్ తాగి అలాగే పడుకుంటుంది….

ఏయ్ తిన్న వెంటనే పడుకోకూడదు 2 మినిట్స్ అయినా లేచి కూర్చో ….

మమ్మీ ఇరిటేట్ చేయకుండా వెళ్ళు నా మూడ్ నిజంగా చాలా వరెస్ట్ గా ఉంది నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను బయటకు వెళ్లిపోతా అని సీరియస్ గా చెప్తున్న కూతురిని చూసి నీ ఇష్టం వచ్చినట్టు ఏడువు అని శైలు నే ట్రే తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది…

రేయ్ విలన్ ఇంకో సారి నా కళ్ళకు కనిపించావో నిన్ను ఎమ్ చేస్తానో నాకే తెలియదు అని జై ను తిట్టుకుంటూ ఆద్య ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది…

తన చేతిలో ఉన్న ట్రే మెయిడ్ చేతిలో పెట్టి తన రూమ్ వైపు వెళ్తున్న శైలు కి మ్యారేజ్ బ్రోకర్ నుండి కాల్ రావడం చూసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తుంది

నమస్తే శైలజ గారు అంతా క్షేమమేనా!!! ఈ టైమ్ లో డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీరు ఫ్రీగానే ఉన్నారా

హలో శర్మ గారు నమస్తే అండి!!! యాహ్ మేము అందరం బావున్నాం మీరెలా ఉన్నారు మీ వైఫ్ కుమారి, మీ పిల్లలు అందరూ బావున్నారా అని శర్మ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం తో ఆప్యాయంగా పలకరిస్తుంది శైలజ…

ఇక్కడ మేము క్షేమంగానే ఉన్నాం శైలజ గారు మీతో కొంచెం మాట్లాడాలి వీలవుతుందా!!

చెప్పండి శర్మ గారు ఫ్రీగానే ఉన్నాను.. ఈ టైం లో కాల్ చేశారు అంటే ఏదో ఇంపార్టెంట్ విషయమే అయ్యుంటుంది

అవునండి చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అదేంటంటే మన ఆద్య పాప కి చక్కటి సంబంధం దొరికింది అబ్బాయి చాలా అందంగా ఉంటాడు పైగా ఆద్య పాప ఫోటో చూసాక చేసుకుంటే తననే చేసుకుంటా అని కూడా అంటున్నాడు

నిజమా శర్మ గారు ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి ఇంతకీ అబ్బాయి వాళ్ళది ఏ ఊరు అబ్బాయి ఎమ్ చేస్తూ ఉంటాడు తన ఫ్యామిలీ డిటైల్స్ ఏంటీ

అబ్బాయి వాళ్ళది ఈ ఊరే వాళ్ళు కూడా మీ లాగే చాలా ధనవంతులు పైగా ఒక్కడే కొడుకు కోట్లకు వారసుడు ఏ చెడు అలవాట్లు లేవు…. మన ఆద్య పాప పక్కన రాజాలాగా ఉంటాడు అందుకే లేట్ చేయకుండా మన పాప ఫోటో పంపించా వాళ్లకు పాప బాగా నచ్చింది మీకు కూడా పంపిస్తాను మీరు ఒకే అనుకుంటే మంచి రోజు చూసి పెళ్లి చూపులు ఎరేంజ్ చేసుకుందాం ….

అలాగే శర్మ గారు ముందు అబ్బాయి ఫోటో & ఫ్యామిలీ డిటైల్స్ సెండ్ చేయండి నేను ఆయన కి కూడా చెప్తాను అంటూ సంతోషంగా కాల్ కట్ చేశాక …. శర్మ పంపిన పిక్ చూసి వావ్ అబ్బాయి చాలా బావున్నాడు అమ్ము పక్కన పర్ఫెక్ట్ గా ఉంటాడు అని నవ్వుతూ తమ రూమ్ కి వెళ్ళి ఏమండీ అంటూ వాష్ రూమ్ లో ఫ్రెష్ అవుతున్న మహిదర్ ను పిలుస్తుంది

శైలు 5 నిమిషాలు బాత్ చేస్తున్నా అని చెప్తున్నా ఆగకుండా డోర్ బాదేస్తున్న శైలు ను తిట్టలేక తిట్టే ధైర్యం లేక తనను తాను కొట్టుకుని ఎహే ఏంటీ నీ గోల ప్రశాంతంగా స్నానం కూడా చేయనివ్వవా

అది కాదండి మీకో గుడ్ న్యూస్ చెప్పాలి అందుకే హ్యాపీనెస్ ఆపుకోలేక పోయాను

ఆద్య పుట్టగానే నీకు ఆపరేషన్ చేయించాను కదా ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి శైలు అని నవ్వు ఆపుకుంటూ అడుగుతున్న మహిదర్ ను చూసి సీరియస్ గా చూస్తుంది 🤨🤨 శైలు

శైలు ఫేస్ చూసి నవ్వుకుంటూ సరే సరే ఇచ్చిన లుక్స్ చాలు కానీ ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటూ తల తుడుచుకుంటూ అడుగుతాడు

ఇదిగో ఈ ఫోటో చూడండి అని మహిదర్ చేతిలో మొబైల్ పెడుతుంది…. ఫొటో ఏంటీ అని శైలు మొబైల్ తీసుకుని చూసిన మహిదర్ కి బ్లాక్ ఫార్మల్స్ లో చాక్లెట్ బాయ్ లా కనిపిస్తున్న అబ్బాయిని చూసి ఎవరు శైలు ఈ అబ్బాయి ?? చూడ్డానికి హీరో రామ్ లా క్యూట్ గా ఉన్నాడు అని చిరు నవ్వుతో అడుగుతాడు ….

మన ఆద్య కోసం మ్యాచెస్ చూడమని శర్మ గారికి చెప్పాను కదండి ఆయన ఇందాకే కాల్ చేసి ఈ అబ్బాయి గురించి చెప్పాడు…. మన ఆద్య ఈ అబ్బాయిలు బాగా నచ్చిందట మనకు కూడా నచ్చితే పెళ్ళి చూపులు ఎరేంజ్ చేస్తానని శర్మ గారు చెప్పారు అని ఆనందంగా అంటుంది….

అబ్బాయికి నచ్చడం లేదా మనకు నచ్చడం గురించి వదిలేయ్ ముందు ఈ విషయం గురించి అమ్ము కి చెప్పావా ఇది కదా మన ముందున్న పెద్ద టాస్క్ అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతున్న మహిదర్ ను చూసి అప్పటి వరకు నవ్వుతున్న శైలు ఒక్కసారిగా డల్ అయిపోతుంది….

నేను ఈ విషయం గురించే మర్చిపోయాను ఆండీ అని తల మీద చేతులు పెట్టుకుని 🙆🙆 ఇప్పుడెలా దీన్ని పెళ్లికి ఒప్పించాలి అని మహిదర్ వైపు చూస్తుంది….

నువ్వు తొందర పడి అప్పుడే ఆద్య తో ఈ ప్రపోజల్ గురించి డిస్కస్ చేయకు ఇప్పుడే కదా ఈ సంబంధం గురించి చెప్పారు వాళ్ళు ఎవరో ఏంటో నేను ఎంక్వైరీ చేయిస్తాను వాళ్ళు ఒకే అనుకున్నాక ఆద్య తో మాట్లాడుదాం… పైగా ఆద్య హెడ్ ఏక్ అంటుంది నువ్వు దీని గురించి చెప్పి తనతో గొడవ పడి తన హెడ్ ఏక్ ను మరింత పెద్దది చేయకు….

శైలు కోపంగా మహిదర్ వైపు చూస్తూ అంటే ఏంటండీ నాకు గొడవ పడ్డం తప్పా ఇంకేం పని లేదు అనుకుంటున్నారా …మీకు మాత్రమే మీ కూతురు మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడకండి అని విసురుగా చెప్పి అలిగి బెడ్ మీద పడుకుంటుంది ….

అబ్బో మేడం గారికి కోపం వచ్చిందే అని నవ్వుతూ శైలు ను వెనుక నుండి హగ్ చేసుకుంటూ తనకు గిలింతలు పెడుతూ నవ్వించగానే ఎక్కువ సేపు నవ్వలేక త్వరగానే కాంప్రమైజ్ అవుతూ మహిదర్ చేతి మీద తల వాల్చి ఆద్య పెళ్ళి గురించి కలలు కంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుని నిద్రపోతుంది ….

శైలు నిద్రపోయాక తనను జాగ్రత్తగా పిల్లో మీదకు షిఫ్ట్ చేసి కూతురి రూమ్ లోకి వెళ్లి బెడ్ షీట్ నీట్ గా కప్పాక ఏ. సి. అడ్జస్ట్ చేసి ఆద్య పెళ్ళి గురించి ఆలోచిస్తూ తను కూడా పడుకుంటాడు మహిదర్….

❤️🤍❤️🤍❤️🤍❤️🤍❤️🤍

 

మాయ ఫ్రెష్ అయి వచ్చాక రూమ్ లో కనిపించని రేణుక కోసం చూసి తను వెళ్ళిపోయింది అనుకుంటూ డోర్ లాక్ చేశాక ఫ్రీగా ఉండేలా నైట్ డ్రెస్ లోకి చేంజ్ అయ్యాక మిర్రర్ ముందు కూర్చుని స్కిన్ కేర్ చేసుకుంటూ మిర్రర్ లో తన వైపు చూసుకుంటుంది…

మిర్రర్ లో తనకు తను షాడో బదులు ఒక అబ్బాయి అందమైన రూపం కనిపించడం తో నవ్వుతూ తన వైపు చూస్తూ ఉంటుంది….

ఈ రోజు నా బర్త్డే నీ విష్ కోసం ఎంతలా వెయిట్ చేసానో తెలుసా అని డల్ గా మిర్రర్ లో కనిపిస్తున్న రూపం ను క్వశ్చన్ చేస్తూ అడుగుతుంది….

నిన్ను నేను తలచుకోని క్షణం అంటూ లేదు రా…!! అంతలా నాలో నిండిపోయావ్ బట్ నీకు మాత్రం నేను గుర్తు రావటం లేదా నా కోసం ఒక్క సారైన వస్తావు అని పిచ్చి దానిలా నిన్నే లవ్ చేస్తున్నా హర్ష ❤️

ఇప్పటికైనా జరిగింది మర్చిపోయి నా కోసం వచ్చెయ్ హర్ష ప్లీస్ మన మధ్య ఈ దూరాన్ని నేను భరించలేక పోతున్నాను…. అన్నయ్య, డాడ్ కోసం నవ్వుతూ ఉంటున్నా కానీ నిన్ను ఎవ్రీ మినిట్ నిన్ను మిస్ అవుతున్నా ప్లీస్ కమ్ బ్యాక్ హర్ష అంటూ తన వాడ్రాబ్ లో దాచిన కొన్ని థింగ్స్ బయటకు తీసి వాటిని చూసి హర్ష తో తన మెమోరీస్ గుర్తు చేసుకుంటూ ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యూ అని కన్నీళ్లను తుడుచుకుంటూ ఆ ఫోటోస్ వైపు చూస్తూ ఉంటుంది….

( మన మాయ పాప ఆల్రెడీ లవ్ లో ఉన్నట్టు ఉందేంటి 😳😳 ఈ హర్ష ఎవరు వీళ్ళు ఎలా విడిపోయారు ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ లో చెప్పండి కరెక్ట్ గా గెస్ చేస్తే ఫ్యూచర్ లో మంచి గిఫ్ట్స్ కూడా పంపే ఆలోచనలో ఉన్నాం సో డోంట్ మిస్ 😌😎)

 

❤️🖤❤️🖤❤️🖤❤️🖤❤️

పార్టీ అని చెప్పి త్వరగా ఇంటికి వచ్చేసిన కూతుర్ని చూసి అదేంటి మాన్య పార్టీ కి వెళ్తున్నా రావడానికి లేట్ అవుతుంది అని చెప్పావ్ ఇపుడేంటి ఇంత ఎర్లీ గా వచ్చేసావ్ …..

పార్టీ లో ఎంజాయ్ చేసే మూడ్ లేదు మామ్ అందుకే వచ్చేసా అంటూ కోపంగా స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ……

ఏమైంది దీనికి ఇంత కోపంగా ఉంది అనుకుంటూ మాన్య మదర్ కూడా తన వెనుక రూమ్ లోకి వెళ్ళే సరికి మాన్య షవర్ చేస్తూ ఉంటుంది ……

బెడ్ మీద తన వాలెట్, మొబైల్ అండ్ కార్ కీస్ అటు ఇటు పడేసి తన హీల్స్ ను ఒకటి నార్త్ లో మరోటి సౌత్ వైపు విసిరి తను వేసుకున్న డ్రెస్ కూడా ఫ్లోర్ మీద పడి ఉండటం చూసి తల కొట్టుకుని ఎక్కడికి అక్కడ నీట్ గా సర్ది మాన్య కోసం నైట్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి తన కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది…..

10 మినిట్స్ తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన మాన్య తల్లి వైపు చూసి కూడా మాట్లాడకుండా హెయిర్ డ్రయ్యర్ తో హెయిర్ ఆర్పుకున్న తరువాత డ్రెస్ అప్ అయి కౌచ్ లో కూర్చుని అమర్ ను బండ బూతులు తిట్టుకుంటూ ఉంటుంది….

మాన్య ఏమైంది రా ఎందుకలా డల్ గా ఉన్నావ్ అని మాన్య చెయ్ పట్టుకుని అడుగుతున్న తన మదర్ వైపు చూస్తూ ఏం లేదు మమ్మీ ఇవాళ పార్టీ లో ఒక పిచ్చి కుక్క కనిపించింది దాంతో ఇవాళ బాగా హెడ్ ఏక్ వచ్చింది అందుకే పార్టీ మిడిల్ లో వచ్చేశాను

పిచ్చి కుక్క పార్టీ లో కనిపించడం ఏంట్రా అయినా అది పార్టీ లోకి ఎలా వచ్చింది

దాన్ని అంకుల్ వాళ్ళు పెంచుకుంటున్నారు లే మమ్మీ 😌😏

పెంచుకుంటున్నారు అంటే మంచి బ్రీడ్ డాగ్ నే అయ్యుంటది కదా మాన్య

లేదు మమ్మీ అది డిఫనేట్ గా పిచ్చిదే ఇంకో సారి కనిపిస్తే రాయిచ్చుకొట్టి చంపేస్తాను అని అమర్ ను గుర్తు చేసుకుని కోపంగా చెప్పి సరే నాకు నిద్రొస్తుంది గుడ్ నైట్ మమ్మీ

మాన్య మరి డిన్నర్ చేయవా

నేను ఆల్రెడీ ఆ కుక్క మీద కోపం తో దాన్ని ఎలా కొట్టాలా అని ఆలోచిస్తూ బిర్యాని తినేసి వచ్చా మీరు తినేయండి మమ్మీ అని ఆవలిస్తూ చెప్పి పడుకుంటుంది

మాన్య ను చూసి 🙄😒🤦 ఇది చూడ్డానికి అయిన్స్టెన్ లెవెల్ లో కనిపిస్తుంది కానీ దీనంత తింగరిది ఎవరు ఉండరు అని తల కొట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది….

❤️🤍❤️🤍❤️🤍❤️🤍❤️

అమర్ తన బెడ్ మీద పడుకుని పార్టీ లో మాన్య తో జరిగింది గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు నా తింగరి బుచ్చి ఈ పాటికి నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది 🤣😂

నీతో స్ట్రెయిట్ గా వస్తే పని అవ్వదు పాప అందుకే ఇలా రివర్స్ లో వస్తున్నా అని నవ్వుతూ తన మొబైల్ లో మాన్య ఫోటో వైపు చూస్తూ ఉంటాడు ….

నిన్ను షాపింగ్ మాల్ లో చూసినపుడే నచ్చేశావ్ మాన్య బట్ జై ఆద్య ల గొడవ వల్ల నీతో మాట్లాడడం కుదరలేదు…. బట్ ఆ నెక్స్ట్ డే నే మమ్మీ నీ ఫోటో నాకు చూపించి ఈ అమ్మాయి ఎలా ఉందో చెప్పు మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం వచ్చింది అన్నప్పుడు నా హ్యాపీనెస్ కి లిమిట్ లేకుండా పోయింది…..

ఆ తర్వాత నిన్ను మాయ బర్త్డే పార్టీ లో చూసి ఇంకా సర్ప్రస్ ఫీల్ అయ్యాను ఇలా మన ఇద్దరికీ తెలియకుండా నే బలే మీట్ అవుతున్నాం….

నీకు గుర్తుందా ఆ రోజు నువ్వు కూడా నన్ను చూడగానే గుర్తు పెట్టావ్ 😊 బట్ నేనే కావాలని నీకు కోపం తెప్పించి నీ మైండ్ లో నేను రిజిస్టర్ అయ్యేలా చేశా పెళ్ళికి ముందు ఇలాంటి స్వీట్ మెమోరీస్ బావుంటాయి మాన్య ….

అందుకే ఇంకొద్ది రోజులు మన మధ్య ఈ స్వీట్ ఫైట్స్ తప్పవు అని నవ్వుకుంటూ మాన్య ఫోటో చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు

🖤🤍🖤🤍🖤🤍🖤🤍🖤

 

అలసటగా తన పక్కన పడుకున్న జై వైపు చూసి వాట్ డియర్ ఇవాళ చాలా హై లో ఉన్నట్టు ఉన్నాయిగా నీ ఫీలింగ్స్ అంటూ జై గుండె మీద వాలి మత్తుగా అడుగుతుంది జై ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ నాన్సీ ( ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి బాగా గుర్తుంచుకోండి ) …

యూ ఆర్ రైట్ నాన్సీ ఇవాళ చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను జనరల్లీ అన్నాయి కిస్ చేస్తే నాలో ఫీలింగ్స్ జెనరేట్ అవుతాయి బట్ ఒక అమ్మాయి నన్ను జస్ట్ అలా టచ్ చేసినా నా బ్లడ్ బాయిల్ అవుతుంది నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది…. తన టచ్ నన్ను అంతలా డిస్టర్బ్ చేస్తుంది ఒక ఫుల్ స్కాచ్ తాగినా రాని కిక్ తన టచ్ లో వచ్చేస్తుంది …..

రియల్లీ అంటూ నాన్సీ తన వంటికి బెడ్ షీట్ చుట్టుకుని కూర్చుంటూ నువ్వు ఒక అమ్మాయి గురించి చెప్పడం ఫస్ట్ టైమ్ హు ఇస్ షి జై అంటూ క్యూరియాసిటి తో అడుగుతుంది….

తన పేరు ఆద్య మై డాడ్స్ ఫ్రెండ్ డాటర్ అంటూ నాన్సీ వడిలో తల పెట్టుకొంటూ చెప్తాడు

ఆద్య – నేమ్ చాలా బ్యూటీఫుల్ గా ఉంది జై మరి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది

పేరుకు తగ్గట్టుగా చాలా అందంగా, క్యూట్ గా ఈవెన్ మోర్ హాట్ గా కూడా ఉంటుంది కాకపోతే బలుపు కూడా అంతే ఉంటుంది అని పళ్ళు నూరుతూ ఆద్య ను గుర్తు చేసుకుని కోపంగా చెప్తాడు

హహ అంత అందమైన అమ్మాయికి ఆ మాత్రం ఉండటం న్యాచురల్ జై…. అంటూ జై వైపు చూసి తన తల నిమురుతూ నిన్నో విషయం అడగనా జై అన్సర్ ఇస్తావా

నాన్సీ చెయ్ పట్టుకుని పెదవులకు ఆనించుకుని నాకు మామ్, మాయ తర్వాత ఇంత దగ్గరగా వచ్చింది నువ్వు మాత్రమే నాన్సీ అలాంటిది నీకు ఎందుకు అబద్దం చెప్తాను

ఇంకా ఎందుకు జై ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నావ్ నువ్వేంటో నాకు చెప్పావ్ అలాగే నీ ఫ్యామిలీ కి కూడా చెప్పి ఈ లైఫ్ నుండి దూరంగా వెళ్ళిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చెయ్ జై ప్లీస్

జై నాన్సీ వడిలో నుండి లేచి తన మొహం లోకి మొహం పెట్టి చూస్తూ నాకు దూరంగా నువ్వు ఉండగలవా అని సీరియస్ గా చూస్తూ అడుగుతాడు

నాన్సీ తల వంచుకుని ఉంటాను అని అబద్దం చెప్పడం చూసి జై మెడ పట్టుకుని డీప్ కిస్ ఇచ్చి వదులుతూ దూరం జరుగుతున్న జై ను వెళ్లకుండా ఆపి తనే కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది….

జై మెల్లగా నాన్సీ ను బెడ్ మీద కు షిఫ్ట్ చేసి తను నాన్సీ మీదకు చేరి ఇద్దరికీ కలిపి బెడ్ షీట్ కప్పేస్తాడు…

మన స్టోరీ ఇపుడే కదా స్టార్ట్ అయింది సో అపుడే జై క్యారెక్టర్ ను జడ్జ్ చేయకండి తనో ప్లే బాయ్ అని ముందే చెప్పాను సో ఇలాంటి ప్లే బాయ్ ను ఆద్య ఎలా మార్చుకుంది అన్నదే స్టోరీ….

హీరోయిన్ ఎంటర్ అవ్వగానే అలా ఎలా చేంజ్ అవుతాడు చెప్పండి 😌 జై ఇలా చేంజ్ అవ్వడానికి రీసన్ తెలియాలి…. హీరోయిన్ తో లవ్ లో పడాలి మన పాప తన లవ్ తో జై ను చేంజ్ చేయాలి అబ్బో చాలా కథ ఉంది…

 

TO BE CONTINUEED………

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply