విలన్ హస్బెండ్-11

వినయ్ విల్లా నుండి తమ ఇంటికి రాగానే హరిణి కోపంగా హాల్ లో ఉన్న ప్రతీ వస్తువు కోపంగా పగల కొడుతూ ఉంటుంది …. శ్వేత ఆపడానికి ట్రై చేస్తున్నా హరిణి కోపం కంట్రోల్ అవ్వక శ్వేత మాట కేర్ చేయకుండా హాల్ లో ఉన్న షో పీసెస్ మొత్తం బ్రేక్ చేసి కోపంగా సోఫా లో కూర్చుంటుంది…..

నీకేమైనా పిచ్చా హరిణి ఆ మాయ మీద కోపం ఉంటే వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ పగల కొట్టాలి కానీ మన ఇంట్లో ఫర్నిచర్ కాదు అక్కడ సైలెంట్ గా ఉండి ఇక్కడ గోల చేస్తున్నావ్ ఏంటి ???

అక్కడ సైలెంట్ గా ఉంది అత్తయ్య ముందు బ్యాడ్ అవ్వడం ఇష్టం లేక అసలే నాకు ఆ ఇంట్లో సపోర్టివ్ గా ఉండేది తను మాత్రమే ఇప్పుడు నేను ఇక్కడ చేసినట్టు అక్కడ చేసుంటే అత్తయ్య కూడా నన్ను సపోర్ట్ చేయదు

నువ్వు మాయ బానే ఉంటారు కదా హరిణి అదెందుకు నిన్ను అంతలా ఇన్సల్ట్ చేసింది ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా ???

లేదు మమ్మీ దాంతో నేను ఎందుకు గొడవ పడతా దానికి నా మీద డౌబ్ట్ వచ్చినట్టు ఉంది బావా రూమ్ లోకి వెళ్ళడం చూసింది సో అది మనసులో పెట్టుకునే ఇలా రివెంజ్ తీర్చుకుంది….

శ్వేత తల పట్టుకుని ఆ ఆస్తి మన చేతికి వచ్చే వరకు కామ్ గా ఉండు హరిణి వన్స్ నీ అన్న తో దానికి మ్యారేజ్ అయ్యాక దాన్ని నీ కాళ్ళ దగ్గర పడేస్తా అప్పటి వరకు నీ కోపాన్ని మాయ దగ్గర చూపించకు

హరిణి శ్వేత వైపు చూసి మాయ ను ఊరికే వదలను మామ్ దానికి ఈ మధ్య బావ ను చూసి బాగా పొగరు ఎక్కింది అర్జంట్ గా హరీష్ ను ఇండియా రప్పించాలి అని మాదేశ్ కి కాల్ చేస్తూ అక్కడి నుండి తన రూమ్ కి వెళ్తుంది….

దీనికి కోపం వస్తే ఏం చేస్తుందో దీనికే అర్థం అవ్వదు అని మెయిడ్ తో హాల్ క్లీన్ చేయించి రేణుక కాల్ చేస్తుంటే విసురుగా కాల్ కట్ చేసి తన రూమ్ వైపు వెళ్తుంది ….

 

🤍💜🤍💜🤍💜🤍💜🤍💜

జై ను బేర్ చేయడం నాన్సీ కి చాలా కష్టంగా ఉంది జనరల్లీ జై ఫీలింగ్స్ హై లో ఉంటాయి బట్ నౌ ఇంకా హై లో ఉండటం వల్ల నాన్సీ లో పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి జై డోంట్ డు దిస్ ఐ కాంట్ బేర్ ఇట్ అని బాధగా అరుస్తున్న నాన్సీ లిప్స్ ను తన లిప్స్ తో లాక్ చేస్తూ హోల్డ్ ఆన్ నాన్సీ అని డీప్ కిస్ చేస్తూ తన ఫీలింగ్స్ కంట్రోల్ అయ్యాక నాన్సీ పక్కకు చేరిపోయి నాన్సీ వైపు చూస్తాడు…

పెయిన్స్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఏడుస్తున్న నాన్సీ ను చూసి సారీ నాన్సీ నువ్వు నీ మాటలతో హర్ట్ చేసావ్ అందుకే ఇలా అంటూ ఫోర్హెడ్ కిస్ చేసి రెస్ట్ తీసుకో డాక్టర్ కి ఇన్ఫామ్ చేస్తానని ఫ్రెష్ అయి జై డ్రెస్ అప్ అయ్యాక లేడీ డాక్టర్ ( జై వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్) కి కాల్ చేస్తాడు …..

లేట్ నైట్ డ్యూటీ ఫినిష్ చేసి అపుడే తన ఫ్లాట్ కి వచ్చి పడుకోవడానికి చూస్తున్న డాక్టర్ శ్రావణి ( ఈ నేమ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా అది ఎవరి పేరో గుర్తొస్తే గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి 😌 😎) కి జై నుండి కాల్ రావడం తో ఈ టైం లో జై కాల్ చేస్తున్నాడు ఏంటి అని ఆలోచిస్తూనే లిఫ్ట్ చేస్తుంది…

హేయ్ శ్రావణి ఎక్కడున్నావ్

డ్యూటీ నుండి ఇపుడే వచ్చాను జై నువ్వేంటి ఈ టైమ్ లో కాల్ చేసావ్ ఎనీ ఎమర్జెన్సీ???

అందుకే కదా నీకు కాల్ చేసాను అర్జెంట్ గా స్టార్ట్ అయ్యి నాన్సీ ఫ్లాట్ కి వచ్చెయ్

జై నీకు ఎన్ని సార్లు చెప్పాలి అమ్మాయిలతో హార్డ్ గా బిహేవ్ చేయకు అని పాపం రా నాన్సీ ప్రతీ ఎందుకు తనను హర్ట్ చేస్తూనే ఉంటావ్

సోది ఆపి త్వరగా స్టార్ట్ అవ్వు నాన్సీ పెయిన్ కి ఏడుస్తుంది కమ్ ఫాస్ట్ అని కాల్ చేసిన జై ను తిట్టుకుంటూనే తన కార్ లో నాన్సీ ఫ్లాట్ కి స్టార్ట్ అయి కాలింగ్ బెల్ కొడుతుంది….
శ్రావణి కోసం వెయిట్ చేస్తున్న జై వెంటనే డోర్ ఓపెన్ చేసి ఎంటే ఇంత లేట్ చేసావ్ అంటున్న జై ను సీరియస్ గా చూస్తూ నాన్సీ రూమ్ కి వెళ్ళి జై ను చూసి కోపంగా డోర్ లాక్ చేసి నాన్సీ ను చెక్ చేసాక పెయిన్స్ తగ్గడానికి ఇంజెక్షన్ చేసి ఈ మెడిసిన్స్ 4 డేస్ యూస్ చెయ్ అని టేబుల్ మీద పెడుతూ అండ్ ఆయింట్మెంట్ కూడా యూస్ చెయ్ ఎక్కువ పెయిన్ అనిపిస్తే నాకు కాల్ చెయ్

థాంక్ యూ శ్రావణి అని నీరసంగా చెప్తున్న నాన్సీ చెయ్ పట్టుకుని వాడిని చేంజ్ చేయాలి అనుకుంటూ ప్రతీ సారి ఇలాగే వాడితో పెయిన్ తీసుకుంటున్నావ్ వాడ్ని వదిలి నువ్వు ఉండలేవు అండ్ జై కూడా ఈ లైఫ్ నుండి దూరంగా రాడు ఇంకా ఎందుకే వాడిలో చేంజ్ కోసం ట్రై చేస్తున్నావ్

నాకు జై అంటే ఎంత పిచ్చో నీకు తెలియంది కాదు శ్రావణి బట్ నా స్వార్థం కోసం జై ను నా దగ్గరే లాక్ చేయడం నాకు నచ్చడం లేదు

నాన్సీ అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటున్నా ఎలాగే ఇంత పిచ్చిగా జై కోసం అన్నీ బరిస్తున్నావ్ ఆఖరికి నీ పేరెంట్స్ ను కూడా జై కోసం వదిలేశావ్ ఇంత పిచ్చిగా ఏ అమ్మాయి కూడా అబ్బాయిని లవ్ చేయదు… !!

నువ్వే అంటున్నావ్ కదా పిచ్చి అని అయినా నా కంటూ ఎవరు లేరు శ్రావణి ఉన్నది జై మాత్రమే ప్లీస్ వాళ్లను గుర్తు చేయకు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది…

నాన్సీ ఐ ఆమ్ సారి ప్లీస్ కంట్రోల్ అని తన చేతిని ప్రెస్ చేసి వదులుతూ 1 వీక్ వరకు జై కి దూరంగా ఉండు అపుడే నువ్వు సెట్ అవుతావు వాడేమైన ఫోర్స్ చేస్తే నాకు కాల్ చెయ్ నేనొచ్చి వాడికి లెఫ్ట్ & రైట్ ఇస్తా అని కోపంగా చెప్తుంది

హహ జై మరీ అంత హార్ట్ లెస్ ఫెలో కాదు శ్రావణి తను నాకు 1 వీక్ వరకు కనిపించడు ఎలాగో నువ్వు వెళ్తూ వెళ్తూ జై కి క్లాస్ ఇచ్చే వెళ్తావ్ కాబట్టి జై ఇంకో వీక్ వరకు ఇటు వైపు కూడా రాడు ….

రాకపోతే చంపేస్తాను నిన్ను ఇలా బెడ్ మీద పడేసి వాడు ఎక్కడికి వెళ్తాడు అని కోపంగా అరుస్తూ డోర్ ఓపెన్ చేసి జై ను లోపలికి పిలుస్తుంది….

నాన్సీ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడుగుతూ నాన్సీ పక్కన కూర్చుని కన్సర్న్ చూపిస్తూ అడుగుతున్న జై ను చూసి వీడు నాకు అర్థం అవ్వడు అని పెదవి విరుస్తూ జై వైపు చూస్తూ ఉంటుంది

ప్చ్ …. !! శ్రావణి దెయ్యం లా అలా నుంచుని చూడక పోతే వెళ్ళి నాన్సీ కోసం జ్యూస్ తీసుకుని రా అని అంటున్న జై ను చూసి వీడు నన్ను డాక్టర్ అనుకున్నాడా మెయిడ్ అనుకుంటున్నాడా 🙄😬

జై శ్రావణి ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ నౌ ఐ ఆమ్ ఒకే అని చిన్న స్మైల్ ఇచ్చి పాపం అనవసరంగా శ్రావణి కి ట్రబుల్ ఇచ్చావ్ తన ఫ్లాట్ ఇక్కడి నుండి చాలా లాంగ్ వెళ్ళి తనను డ్రాప్ చేసి రా ప్లీస్ జై

నన్నేం డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు కానీ నాన్సీ వీక్ గా ఉంది తను క్యూర్ అయ్యే వరకు ఎటు వెళ్లకుండా కేర్ ఫుల్ గా చూసుకో అండ్ 10 డేస్ వరకు దాన్ని టచ్ చేయకు అని సీరియస్ గా చెప్పి వెళ్తున్న శ్రావణి ను చూసి జై నవ్వుకుంటూ దీనికి లోపల భయంగా ఉన్నా పైకి మాత్రం ధైర్యం నటిస్తుంది అని చెప్పి నవ్వుతాడు అది విన్న నాన్సీ కూడా చిన్నగా నవ్వుతుంది

తన కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చున్న శ్రావణి వాటర్ బాటిల్ ఫినిష్ చేసి బాబోయ్ ఎంత భయం వేసిందో పర్లేదు బానే మాట్లాడా అని నవ్వుకుంటూ తన ఫ్లాట్ కి రిటర్న్ అవుతుంది….

జై నువ్వు నీ ఫ్లాట్ కి స్టార్ట్ అవ్వు నేను బానే ఉన్నాను అని జై కి తన వల్ల ఇబ్బంది అవుతుందని మెల్లగా చెప్తుంది….

నీ కోసం మెయిడ్ ను అపాయింట్ చేసాను నాన్సీ తను రేపు వస్తుంది తను రాగానే వెళ్తాను నువ్వు జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో అని నాన్సీ కి జ్యూస్ తాగించి పడుకో పెట్టాక తాను హాల్ లోకి వెళ్లి లాప్ టాబ్ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు…

🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍🖤🤍

నిద్రపోతున్న మాన్య మొబైల్ రింగ్ అవ్వడం తో కళ్ళు కూడా తెరవకుండానే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని హ….లో అంటూ నిద్ర మత్తులో మాట్లాడుతుంది

ఎంటే ఇంకా పంది లా బెడ్ మీద పడుకుని పొర్లుతున్నావా లెగవే ఫస్ట్ అంటున్న మేల్ వాయిస్ కి మాన్య నిద్ర ఎగిరిపోవడం తో పాటు తన మొహం బీట్ రూట్ లా ఎర్రబడుతుంది

 

ఎవర్రా నువ్వు కాల్ చేసి పిచ్చి వాగుడు వాగుతున్నావ్ ఇంకో సారి నాకు కాల్ చేస్తే పుచ్చ లేచిపొద్దీ

నేను ఎవరో కాదే నీకు కాబోయే మొగుడ్ని నువ్వు నన్ను లేపాల్సింది పోయి నేనే నిన్ను లేపాల్సి వస్తుంది

ఇలాంటి డైలాగ్ ఎక్కడో విన్నానే 🙆🤔🤔

వామ్మో దీనికి డౌబ్ట్ వచ్చినట్టు ఉంది అని అమర్ కాల్ కట్ చేసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక్కడ మన మాన్య పాప జుట్టు పీక్కుంటూ ఉంటుంది కాల్ చేసింది ఎవరా అని పైగా కాల్ బ్యాక్ చేయడానికి కూడా లేకుండా అది ప్రైవేట్ నంబర్ అవ్వడం వల్ల ఆలోచిస్తూ ఉంటుంది ….ఇంతలో శైలు నుండి కాల్ రావడం తో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఒకే ఆంటీ ఇపుడే స్టార్ట్ అవుతాను అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది….

🤍🩷🤍🩷🤍🩷🤍🩷🤍🩷

డీప్ స్లీప్ లో ఉన్న మాయ కి తన బెడ్ రూమ్ డోర్ నాక్ చేస్తున్న సౌండ్ కి కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుని మొబైల్ లో టైం చూసి తన బెడ్ మీదున్న హర్ష థింగ్స్ అన్నిటిని నీట్ గా తన వాడ్రాబ్ లో ముందులా ఎవరికి కనిపించకుండా దాచేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది….

అమ్మాయి గారు కాఫీ అంటూ మెయిడ్ తన చేతిలో కప్ పెట్టగానే దాన్ని తీసుకుని మళ్ళీ రూమ్ లోకి వెళ్ళి తన బాల్కనీ లో కూర్చుని గార్డెన్ వైపు చూస్తూ కాఫీ సిప్ చేస్తున్న తనకు ఇవాళ ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని గుర్తు రావడం తో హో షట్…!! ఈ విషయం ఎలా మర్చిపోయాను అని తన ముందున్న మొబైల్ లో మరో సారి టైమ్ చూస్తుంది 9::05 అవుతూ కనిపించడం చూసి వీకెండ్ అని బద్దకంగా పడుకున్నా అక్కడ వదిన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు….

దట్ టూ వదిన పార్టీ లో నుండి మిడిల్ లో వెళ్ళిపోయింది అని కాఫీ కప్ పక్కన పెడుతూ ఫస్ట్ ఈ విషయం అందరికీ గుర్తు చేయాలి అనుకుంటూ హాల్ లోకి వచ్చిన మాయ కి హాల్ లో ఎవరు కనిపించరు బట్ కిచెన్ నుండి మాత్రం కుక్కర్ విజిల్ సౌండ్స్ రావడం విని రేణుక కోసం కిచెన్ లోకి వెళ్తుంది…

సండే అవ్వడం తో ఆ రోజు అందరికీ ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని మార్కెట్ నుండి ఫ్రెష్ గా తెప్పించి రేణుక కుక్ హెల్ప్ తో తనే కుక్ చేసి అందరికీ వడ్డిస్తుంది….

ప్రతాప్ వర్మ  కోసం ఫిష్,వినయ్ వర్మ కోసం మటన్ & జై కోసం ఫ్రాన్స్, తన కోసం చికెన్…. మాయ నాన్ వెజ్ తినదు కాబట్టి మష్రూమ్, పన్నీర్ ఇలా అందరి కోసం అన్ని వెరైటీస్ కుక్ చేసి డైనింగ్ టేబుల్ మొత్తం ఫిల్ చేసి ప్రతీ ఒక్కరికి తనే వడ్డించడం రేణుక కి బాగా ఇష్టం…. జై ఎక్కువగా జిమ్ చేసేది రేణుక కోసమే తినను అంటే రేణుక ఫీల్ అవుతుంది అని సండే తన డైట్ ను క్రాస్ చేసి తిని ఎక్స్ట్రా అవర్స్ జిమ్ చేస్తాడు….

గుడ్ మార్నింగ్ మామ్ అంటూ తనను వెనుక నుండి చుట్టేసి నవ్వుతూ చెప్తున్న కూతురిని చూసి తన కోపాన్ని పక్కన పెట్టి మార్నింగ్ మాయ అని చిన్నగా నవ్వుతూ తన కుకింగ్ కంటిన్యూ చేస్తుంది….

మామ్ ఎమ్ చేస్తున్నావ్ అని స్టవ్ వైపు చూసిన తనకు నాలుగు బర్నర్స్ మీద ఫోర్ టైప్ ఆఫ్ వెరైటీస్ కనిపించడం చూసి మామ్ మర్చిపోయావా ఇవాళ మనం వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ అక్కడే అది మర్చిపోయావా ఏంటి???

వదిన??? ఏ వదిన 😏😏 ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని గుర్తున్నా లేనట్టే మాట్లాడి మనం ఎక్కడికి వెళ్ళడం లేదు కానీ వెళ్ళి ఫ్రెష్ అయి రా నీ కోసం పన్నీర్ దోస వేస్తున్నా వేడి వేడిగా తిందువు అని చెప్పి మళ్ళీ కుకింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది….

మామ్ మర్చిపోయావా మనం ఆద్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం కదా అంటూ రేణుక కు దూరం జరిగి తన వైపు చూస్తుంది

మాయ చాలా చిరాగ్గా ఉన్నాను విసిగించకుండా వెళ్ళు అయినా మీ డాడ్, తాతయ్య అంత కాలీగా ఎమ్ లేరు …. వాళ్ల వర్క్స్ ఆపుకుని మరీ అక్కడ టైం స్పెండ్ చేయాల్సిన నీడ్ లేదు పైగా జై కూడా ఇంకా ఇంటికి రాలేదు

ఏంటి అన్నయ్య ఇంకా రాలేదా 😬🤦 మళ్ళీ ఆ సోని దగ్గరకు వెళ్ళాడా ఏంటి దానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చానే అని ఆలోచిస్తూ నువ్వు ఎలా రావో నేను చూస్తాను మామ్ నువ్వు టీవీ అయితే రిమోట్ డాడ్ అని నాకు తెలుసు కదా అని నవ్వుకుంటూ వినయ్ రూమ్ వైపు వెళ్తుంది ….

రేణుక వెనక్కి తిరిగి వెళ్తున్న మాయ ను చూసి వదిన అంట వదిన 😏🤨🤨 ఇంకో సారి దాని పేరు పిలవకుండా చూడాలి అనుకుని శ్వేత కి మళ్ళీ కాల్ చేస్తుంది బట్ శ్వేత లిఫ్ట్ చేయక పోవడం తో వదిన బాగా ఫీల్ అయినట్టు ఉంది కుదిరితే ఒక సారి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి అనుకుని చికెన్ ను రోస్ట్ చేస్తూ ఉంటుంది….

 

మాయ తన పేరెంట్స్ రూమ్ లోకి వెళ్ళి డాడ్ అంటూ వెళ్ళి వినయ్ కాల్ లో బిజీగా ఉండటం చూసి సైలెంట్ గా బెడ్ మీద కూర్చుని వినయ్ కాల్ అయ్యేవరకు ఓపికగా వెయిట్ చేస్తూ కూర్చుంటుంది ……

వినయ్ కాల్ అయ్యాక మాయ వైపు చూస్తూ ఏంట్రా మార్నింగ్ నే ఇలా వచ్చావ్ ఎటైనా వెళ్తున్నావా మనీ ఏమైనా కావాలా అంటూ తన వీల్ చైర్ మూవ్ చేస్తూ మాయ ముందుకు వచ్చి ఆగుతాడు

వెళ్తున్నావా కాదు డాడ్ వెళ్తున్నాం అందరం ఆద్య వదిన ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం కదా ఆ విషయాన్ని మీరు కూడా మర్చిపోయారా

అవును కదా నిజంగా మర్చిపోయాను బంగారం అయితే ఏంటి ఇపుడే స్టార్ట్ అవుదాం వెళ్ళి తాతయ్య కి మామ్ కి కూడా చెప్పు

తాతయ్య కి నేను చెప్తాను బట్ మామ్ కి మాత్రం నువ్వే చెప్పు ఎందుకంటే మామ్ నువ్వు చెప్తేనే వింటుంది అనగానే అలాగే రా ఇపుడే చెప్తాను ఆగు అని రేణుక నంబర్ కి డయల్ చేసి రూమ్ దగ్గరకు రమ్మని కాల్ కట్ చేస్తాడు

కుక్ తో కర్రీస్ మాడిపోకుండా చూడమని చెప్పి రేణుక రూమ్ లోకి వచ్చేసరికి వినయ్, మాయ నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు …..

ఏంటండీ పిలిచారు ఏమైనా కావాలా

నాకేం అక్కర్లేదు కానీ ఇంకో హాఫ్ ఆన్ అవర్ లో అందరం మహిదర్ హోం కి వెళ్తున్నాం ఫాస్ట్ గా రెడీ అవ్వు డిన్నర్ కూడా అక్కడే చేస్తున్నాం

అదేంటండి సడెన్ గా చెప్తే ఎలా మీ అందరి కోసం నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేసాను కావాలంటే మనం మరో వీకెండ్ వెళ్దాం ….

సడెన్ గా ఏం కాదు మామ్ డాడ్ నైట్ కూడా చెప్పాడు కదా అని పక్క నుండి చెప్తున్న మాయ ను చూసి సీరియస్ గా చూస్తుంది రేణుక
పార్టీ లో కూడా సరిగ్గా టైమ్ స్పెండ్ చేయలేదు రేణు అయినా నువ్వు కుక్ చేయాలి అనుకుంటే అక్కడ కూడా చేయచ్చు ఇక్కడ కుక్ చేసినవి ఇంట్లో మెయిడ్స్ తింటారు కానీ ఫస్ట్ రెడీ అవ్వు అని వినయ్ సీరియస్ గా చెప్పడం తో రేణుక చచ్చినట్టు రెడీ అవుతుంది అది చూసిన మాయ నవ్వుకుని రేణు చూడకుండా వినయ్ బుగ్గన ముద్దు పెట్టి ఫాస్ట్ గా ప్రతాప్ రూమ్ లోకి వెళ్ళి తనకు కూడా విషయం చెప్పి తన రూమ్ కి వెళ్తుంది….

అన్నయ్య కి కాల్ చేయాలి ఎక్కడున్నాడో ఏంటో అనుకుని వెంటనే జై నంబర్ కి డయల్ చేస్తుంది నైట్ వర్క్ చేస్తూ ఎపుడో ఎర్లీ మార్నింగ్ పడుకున్న జై కి మాయ నుండి కాల్ రావడం తో నిద్ర కళ్ళతోనే లిఫ్ట్ చేస్తాడు

 

గుడ్ మార్నింగ్ అన్నయ్య ఎక్కడున్నావ్ మళ్ళీ ఆ ఫ్లాట్ కి వెళ్ళావా అని కోపంగా అడుగుతుంది

గుడ్ మార్నింగ్ మాయ ప్చ్ లేదు రా వేరే ఫ్రెండ్ దగ్గరున్నా ఏంటో చెప్పు బాగా నిద్రొస్తుంది నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదు

నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు ఇంతకీ తను అమ్మాయా/ అబ్బాయా

మార్నింగ్…. మార్నింగ్ ఈ క్విజ్ ఏంట్రా నాకు తను అమ్మాయే అయితే ఏంటి చెప్పు

హు 😏 అమ్మాయి అంటేనే తెలుస్తుంది లే నువ్వు నైట్ అంతా ఎందుకు నిద్రపోలేదు అని అనుకుంటూ నువ్వు అక్కడి నుంచి ఎపుడు స్టార్ట్ అవుతావు అన్నయ్య

ఇవాళ రాలేను మాయ నా ఫ్రెండ్ కూడా సిక్ అయింది తనను కేర్ చేయడానికి ఇక్కడ ఎవరు లేరు

ఓహ్ అలాగా ఒకే అన్నయ్య మేము అందరం ఆద్య వదిన హోమ్ కి వెళ్తున్నాం యూ టేక్ కేర్ అంటూ పార్టీ లో జై ఇంటెన్షన్ ఆద్య మీద ఉండటం గమనించి కాల్ కట్ చేసి నవ్వుకుంటూ ఎలా రావో నేను చూస్తాను అని నవ్వుకుంటూ తను రెడీ అయ్యి కిందకు వెళ్ళి అందరూ రెడీ అయ్యాక అక్కడి నుంచి స్టార్ అవ్వబోతూ ఉండగా ఉరుములేని పిడుగులా సడెన్ గా అక్కడికి వచ్చిన జై ను చూసి మాయ నవ్వుకుంటుంది….

To Be Contineeed…….

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply