విలన్ హస్బెండ్ – 9

విలన్ హస్బెండ్ – 9

విలన్ హస్బెండ్ – 9

గెస్ట్స్ అందరూ వచ్చేయడం తో జై తన వాచ్ లో టైమ్ చూస్తూ ఒకే గాయ్స్ ఇట్స్ టైమ్ ఫర్ పార్టీ విల్ హ్యావ్ సో మచ్ ఫన్ ఆన్ దిస్ పార్టీ కమాన్ లెట్స్ మూవ్ అంటూ పైకి లేచి అందరిని తొందర చేస్తాడు…. అందరూ కూడా పైకి లేచి వెళ్తూ ఉండగా మాయ ఆద్య చెయ్ పట్టుకుని వదిన కమ్ నా ఫ్రెండ్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తా అని తీసుకుని వెళ్తూ ఉంటుంది బట్ అపుడే ఆద్య కి ఇంపార్టెంట్ కాల్ రావడం తో మాయ నువ్వెళ్ళు ఇంపార్టెంట్ కాల్ జస్ట్ 5 మినిట్స్ అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది…

కమ్ ఫాస్ట్ వదిన అంటూ వినయ్ వీల్ చైర్ ను ముందుకు పుష్ చేయడానికి తీసుకుంటూ ఉండగా జై స్పెషల్ గా వినయ్ కోసం అపాయింట్ చేసిన కేర్ టేకర్ అక్కడికి వచ్చి మ్యామ్ నేను తీసుకుని వస్తాను అని దాన్ని పుష్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే వెనుకే మిగిలిన అందరూ మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తారు…

అందరూ వెళ్ళిన ఆద్య కోసం మాన్య వెయిట్ చేస్తూ ఉండటం చూసి రేయ్ మాన్య ను ఇక్కడి నుండి తీసుకుని పో నేను దాంతో మాట్లాడాలి

ఆద్య తో నీకు మాటలు ఏంట్రా ముందు పదా పార్టీ లో జాయిన్ అవుదాం

షట్ అప్ చెప్పింది చెయ్ అని సీరియస్ గా చెప్తున్న జై ను చూసి వీడు ఏదో పెంట పెట్టేలా ఉన్నాడు అని తల కొట్టుకుని మాన్య ముందుకు వెళ్లి నుంచుని పళ్ళు కనిపించేలా నవ్వుతాడు

వాట్ అంటూ తన వైపు చూస్తున్న మాన్య ను చూసి 😁😁 పార్టీ లో జాయిన్ అవ్వకుండా ఇక్కడేం చేస్తున్నారు రండి వెళ్దాం

నేనేం చేస్తే వీడికి ఎందుకు అని అమర్ వైపు రెక్లెస్ గా చూసి మొహం తిప్పుకుని మొబైల్ చూస్తున్న మాన్య వైపు విసుగ్గా చూస్తాడు అమర్

హలో మీతోనే మాట్లాడుతున్నా నాకు అన్సర్ కూడా ఇవ్వకుండా మొబైల్ చూస్తే ఎంటర్థం???

నా నోరు నా ఇష్టం నాకు నచ్చితేనే మాట్లాడుతాను నువ్వు నాకు నచ్చలేదు ఒకే ఇక నువెల్లచ్చు

ఎంత పొగరే నీకు ఆగు చెప్తా నీ పని అనుకుని మాన్య చెయ్ పట్టుకుని బలవంతంగా అక్కడి నుండి వేరే వైపుగా తీసుకుని వెళతాడు

ఏయ్ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావ్ రా…. అని మాన్య అరుస్తున్నా వినకుండా పూల్ సైడ్ కి తీసుకుని వెళ్లి తన వైపు చూస్తాడు

పార్టీ అక్కడ జరుగుతుంటే ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావ్ ముందు నా చెయ్ వదులు అని కోపంగా తన చేయి విడిపించుకుని వెళ్తున్న మాన్య చెయ్ పట్టుకుని ఆపేస్తూ రెండు చేతులతో లిఫ్ట్ చేసి తన వైపు చూస్తాడు

హేయ్ అసలేం చేస్తున్నావ్ నువ్వు అంటున్న మాన్య మాట కంప్లీట్ అవ్వకుండానే తనను డబ్ మంటూ పూల్ లోకి విసిరి గట్టిగా నవ్వుతాడు

యూ ఫూల్ నన్నే పడేస్తావా చంపేస్తాను నిన్ను అని అరుస్తున్న మాన్య ను చూసి నేను కూడా నీ టైపే నాకు నచ్చని వాళ్ళను ఇలాగే నీళ్ళల్లో పడేస్తా ఎలా ఉంది దెబ్బ అదుర్స్ కదూ 😉🤪 ఇంకో సారి నాతో పెట్టుకోకు అని విజిల్ వేసుకుంటూ వెళుతున్న అమర్ ను చూసి పళ్ళు నూరుతూ చూస్తుంది మాన్య….

ఆద్య తన కాల్ ఫినిష్ చేసి వెనక్కు తిరిగే సరికి కాలు మీద కాలు వేసి తన వైపే యాటిట్యూడ్ గా చూస్తున్న జై తప్పా ఎవరు కనిపించక పోయేసరికి ఆద్య కూడా లోపలికి వెళ్ళబోతుంది బట్ ఫాస్ట్ గా రియాక్ట్ అయిన జై తన ముందుకు వచ్చి నుంచుని ఆద్య రియాక్ట్ అయ్యే లోపు తన నోరు మూసి ఎత్తుకుని వెనక్కి తీసుకుని వెళతాడు

జై లేకపోతే కేక్ కట్ చేయను అని చెప్తున్న మాయ ను చూసి రేణుక జై ను తీసుకుని రావడానికి వస్తూ ఉండగా అత్త… బావ ను నేను తీసుకుని వస్తాను అని జై కోసం అక్కడికి వచ్చిన హరిణి వాళ్ళను అలా చూసి షాక్ అవుతూ బావ ఏంటి ఈ అమ్మాయిని ఎటు తీసుకుని వెళ్తున్నాడు అని కంగారుగా తను కూడా వెళ్తుంది….

ఆద్య ను గార్డెన్ లోకి తీసుకుని వెళ్ళి ఒక చెట్టు దగ్గర లైటింగ్ తక్కువ ఉన్న ప్లేస్ లో లాక్ చేసి ఆద్య వైపు నవ్వుతూ చూస్తూ కళ్ళు ఎగరేస్తాడు

ఆద్య జై వైపు సీరియస్ గా చూస్తూ హౌ డేర్ యూ టచ్ మీ హా!!! అంటూ తనను కొట్టడానికి చెయ్ ఎత్తుతుంది బట్ జై ఆద్య నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని ఏయ్ మిర్చి ఇవాళ ఎందుకు నువ్వు నాకు ఇంత అందంగా కనిపిస్తున్నావ్ యూ నో నిన్ను చూసినప్పటి నుండి నా ఫీలింగ్స్ చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నా నీ ఫింగర్ టచ్ అయినా నాలో ఫీలింగ్స్ బౌండరీస్ క్రాస్ చేస్తున్నాయి అని హస్కీ గా చెప్తాడు

స్టాప్ ఇట్ డోంట్ టాక్ టు మీ లైక్ దట్ వినయ్ అంకుల్ ఫేస్ చూసి నిన్ను బేర్ చేస్తున్నా ఇంకో సారి నాతో ఇలా బిహేవ్ చేస్తే డైరెక్ట్ గా అంకుల్ తోనే చెప్తాను అని సీరియస్ గా చెప్పి వెళ్ళబోతుంది

ఓహ్ రియల్లీ ఒకే ఫైన్ ఎలాగో చెప్పాలి అని డిసైడ్ అయ్యావ్ గా చెప్పు నాకు ఆయన తిట్లు బాగా అలవాటు అయ్యాయి అని కేర్లెస్ గా అన్సర్ చేసి దాంతో పాటు ఇది కూడా చెప్పు అని ఆద్య మెడ పట్టుకుని దగ్గరకు లాక్కుని డీప్ కిస్ చేసాక వదులుతూ యూ లిప్స్ ఆర్ సో స్వీట్ లైక్ హానీ అంటూ అక్కడి నుంచి ఆగకుండా వెళ్ళిపోతాడు

జై చేసిన పనికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఆద్య కి అర్థం అవ్వదు ఒకటి కాదు రెండు సార్లు తనను బలవంతంగా కిస్ చేసిన జై మీద ద్వేషాన్ని పెంచుకుని పార్టీ మిడిల్ లోనే హెడ్ ఏక్ గా ఉందని మహిదర్ కి కాల్ చేసి చెప్పి క్యాబ్ లో ఇంటికి వెళ్ళిపోతుంది

షట్ బావ ఆ అమ్మాయిని ఎందుకలా కిస్ చేశాడు వీళ్లకు ముందే పరిచయం ఉందా మరి తెలియనట్టే ఉన్నారు కదా నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఏం తెలియనట్టే హరిణి కూడా వెనక్కి వెళ్తుంది

సడెన్ గా తల నొప్పి ఏంటండీ దీన్ని ఎక్కడికి తీసుకుని వచ్చినా సరే కాసేపు కూడా అందరితో టైమ్ స్పెండ్ చేయదు అక్కడికి ఎన్ని సార్లు చెప్పాను పార్టీ అయ్యే వరకూ ఉండాలి అని నా మాట అంటే మీకు మీ కూతురికి విలువే లేదు

శైలు నిజంగా తల నొప్పిగా ఉందేమో ఊరికే అరవకు ఇంటికి వెళ్ళాక అడుగుదాం నువ్వు ఇక కామ్ గా ఉండు అని చెప్పి వినయ్ పిలవడం తో తన దగ్గరకు వెళతాడు

ఏమైంది రా ఎందుకలా ఉన్నావ్ శైలు కూడా బాగా డిస్టర్బ్ గా కనిపిస్తుంది

అదేం లేదు వినయ్ సడెన్ గా ఆద్య హెడ్ ఏక్ అని వెళ్ళిపోయింది దానికే శైలు అరుస్తుంది అంతే ఇది నాకు మాములే అని చిన్నగా నవ్వుతాడు

ఇప్పటి వరకూ బానే ఉంది కదరా సడెన్ గా తల నొప్పి ఏంటి అనుకుంటూ మొహాన్ని అటు వైపు తిప్పిన తనకు జై తనలో తానే నవ్వుకుంటూ రావడం చూసి నొసలు ముడి పడుతాయి

అయ్యో వదిన అపుడే వెళ్ళిపోయిందా అని డల్ గా అడుగుతున్న మాయ ను చూసి నువ్వు ఫీల్ అవ్వకు రా రేపు ఎలాగో సండే కదా మీరు అందరూ మా ఇంటికి రండి అక్కడే టైమ్ స్పెండ్ చేద్దాం ఒకే!!!

మాయ సంతోషంగా ఒకే చెప్పే లోపే డబుల్ ఒకే అంకుల్ మేము మార్నింగ్ నే వచ్చేస్తాం అని నవ్వుతూ చెప్తున్న జై ను చూసి అందరూ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు… జై ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఎవరికి అర్థం అవ్వదు ముఖ్యంగా వినయ్ కి జై వైపు అలాగే చూస్తూ ఉంటాడు

మహిదర్ నవ్వుతూ సరే అంటూ బంగారం కేక్ కట్ చెయ్ రా అనగానే ఒకే మామ అంటూ డాడ్ నా గిఫ్ట్ ఎక్కడ అనగానే మాయ చేతిలో కీస్ పెడుతూ పార్కింగ్ ప్లేస్ లో నీ గిఫ్ట్ రెడీగా ఉంది అనగానే మాయ నవ్వుతూ ఆ కీస్ తీసుకుని పార్కింగ్ ప్లేస్ కి వెళ్ళి చూడగా బ్లాక్ కలర్ ఆడి కార్ కనిపించడం తో మాయ నవ్వుతూ దాని వైపు చూస్తుంది

 

ఏంట్రా నచ్చిందా అంటున్న వినయ్ వాయిస్ కి చాలా చాలా బావుంది డాడ్ లవ్ యూ అంటూ వినయ్ ను హగ్ చేసుకుంటూ వెంటనే కార్ కీస్ తో లాక్ ఓపెన్ చేసి దాని లోపల చెక్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వినయ్ ముందుకు వచ్చి నుంచుంటుంది

కేక్ కట్ చెయ్ బంగారం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ మాయ ను తీసుకుని తిరిగి కేక్ దగ్గరకు వస్తాడు మాయ ఫస్ట్ పీస్ ఎప్పటిలా వినయ్ కే తినిపించి తరువాత ఒక్కొక్కరిగా అందరికీ తినిపిస్తూ అలా అందరితో హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేస్తుంది….

 

🤍💛🤍💛🤍💛🤍💛🤍💛

పూల్ నుండి బయట పడ్డ మాన్య ఎలాగోలా డ్రెస్ డ్రై చేసుకున్న తర్వాత ఇక పార్టీ లోకి వెళ్ళే మూడ్ లేక తను కూడా ఇంటికి వెళ్ళిపోతుంది…. వెళ్తూ వెళ్తూ తను వెళ్తున్నట్టు ఆద్య కి మెసేజ్ చేసి వెళ్తుంది బట్ ఆద్య పాప సీరియస్ గా ఉండటం వల్ల మాన్య మెసేజ్ ను చూడదు సో సక్సెస్ ఫుల్ గా ఫ్రెండ్స్ ఇద్దరూ వీళ్ళను ఇరిటేట్ చేసి ఇంటికి పంపేశారు అనమాట 🫣

గెస్ట్స్ అందరూ వెళ్ళిపోయాక దిస్ ఈజ్ ది బెస్ట్…బెస్ట్… బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ జై ను హగ్ చేసుకుంటూ నవ్వుతూ చెప్తుంది

జై చిన్నగా నవ్వి సరే పదా అలా రైడ్ కి వెళ్ళొద్దాం నీకు ఎపుడు గిఫ్ట్స్ వచ్చినా ఫస్ట్ రైడ్ నాతోనే కదా వస్తావ్ ( మాయ కి ఆల్రెడీ 2 స్కూటీ,2 కార్స్ ఉన్నాయి సో వాటిని గిఫ్ట్ చేసాక జై తోనే ఫస్ట్ రైడ్ చేసింది అది గుర్తు తెచ్చుకునే జై అలా అడిగాడు) …

నో అన్నయ్య ఈ సారీ నీతో కాదు నాకు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు సో వాళ్ళతోనే వెళ్తాను

నాకు తెలియని అంత స్పెషల్ పర్సన్ ఎవరు మాయ???

మాయ నవ్వుతూ ఈ సారి వదిన తో ఫస్ట్ రైడ్ కి వెళ్లాలి అనుంది అన్నయ్య ఎందుకో షి ఇస్ సమ్థింగ్ స్పెషల్ అనిపిస్తుంది….

మాయ చెప్తుంది హరిణి గురించి అనుకున్న రేణుక అలాగే రా ఇద్దరూ అలా సరదాగా వెళ్ళి రండి హరిణి వెళ్ళవే మాయ కి ఎంతైనా నువ్వంటే ఇష్టం ఎక్కువే అంటూ చిరు నవ్వుతో చెప్తుంది

అలాగే అత్త మాయ కమ్ అలా ట్యాంక్ బండ్ దాకా వెళ్ళొద్దాం ఈ టైం లో వ్యూ కూడా సూపర్ ఉంటుంది అంటూ మాయ చెయ్ పట్టుకుని నవ్వుతూ చెప్తుంది

నేను నీతో రైడ్ కి వస్తాను అని చెప్పానా నీ లిమిట్స్ లో నువ్వుండు అని విసుగ్గా తన చెయ్ విడిపించుకుంటున్న మాయ ను చూసి హరిణి మొహం ఎర్రగా మారుతుంది

మాయ అని సీరియస్ గా వినిపించిన రేణుక వాయిస్ కి మామ్ ప్లీస్ డోంట్ ఇరిటేట్ మీ నేను వెళ్తాను అన్నది వదిన తో వేస్ట్ ఫెలోస్ తో కాదు అని హరిణి వైపు చిరాగ్గా చూస్తూ తన రూమ్ వైపు వెళ్తుంది

ఏంటి వదిన ఇది మాయ నా కూతుర్ని పట్టుకుని అలా మాట్లాడుతూ ఉంటే సైలెంట్ గా ఉంటావేంటి ఇంటికి కాబోయే కోడలికి ఇదేనా మీరు ఇచ్చే మర్యాద అంటూ ఆవేశంగా అరుస్తుంది

వదిన ప్లీస్ కంట్రోల్ అంటూ అప్పటికే మాయ తో పాటు జై కూడా అక్కడి నుండి వెళ్లిపోవడం తో అరవకండి వదిన మీ మాటలు జై వింటే పెద్ద గొడవ చేస్తాడు అంటూ కంగారుగా చెప్తుంది
జై వింటాడు అని మీరు ఎమ్ అన్నా సైలంట్ గా ఉండాలా నా కూతురు ఎలా కనిపిస్తుంది నీ కూతురికి ముందు మాయ తో నా కూతురికి సారి చెప్పించు అప్పటి వరకు నేను నా కూతురు ఇక్కడికి రాము అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతారు…

రేణుక కోపంగా మాయ రూమ్ లోకి వెళ్ళి మాయ అసలేం చేస్తున్నావ్ నువ్వు కొంచెం కూడా బుద్ధి లేకుండా వదిన తో అలాగేనా మాట్లాడేది ఫస్ట్ వెళ్ళి హరిణి వదిన కి సారి చెప్పు

వాట్ హరిణి వదినా 🤣😂 హో మై గాడ్ మామ్ బలే జోక్ చేసావ్ అని నవ్వుతున్న కూతురిని చూసి రేణుక మరింత కోపంగా తన వైపు చూస్తుంది

మాయ నాకు కోపం తెప్పించకు ఫస్ట్ ఆ నవ్వడం ఆపు అని సీరియస్ గా అంటుంది

మాయ కష్టంగా తన నవ్వును కంట్రోల్ చేసుకుంటూ జోక్ కాకపోతే మరేంటి మామ్ ఆ హరిణి నాకు వదిన ఏంటి 😏 తను జస్ట్ నీ అన్న కూతురు అంతే అంతకు మించి నాకేం అవ్వదు

మాయ పిచ్చిగా మాట్లాడకు చిన్నప్పుడే నీకు హరీష్ కి జై కి హరిణి కి మ్యారేజ్ చేయాలి అనుకున్నాం ఆ విషయం మర్చిపోయావా ….. ఇప్పుడు నువ్వు హరిణి తో అలా బిహేవ్ చేస్తే రేపు నువ్వు మ్యారేజ్ చేసుకుని ఆ ఇంటికి వెళ్ళాక వాళ్ళతో ఎలా అడ్జస్ట్ అవుతావ్ నువ్వు లైఫ్ లాంగ్ ఉండాల్సింది మీ అత్త వాళ్లింట్లోనే అదైనా గుర్తుందా నీకు

హలో హోల్డ్ ఆన్ ఆ కుత్తే హరీష్ తో నాకు పెళ్ళేంటి వాడ్ని పెళ్లి చేసుకుంటా అని నేను ఎప్పుడూ చెప్పలేదే దట్ టూ అన్నయ్య కి ఆ హరిణి అసలు పర్ఫెక్ట్ కాదు దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడు నాకు కూడా తెలుసు అలాంటి దానికి అన్నయ్య తో పెళ్ళేంటి

హు నీ అన్నయ్య ఏమైనా శ్రీరామ చంద్రుడు అనుకుంటున్నావా 😏 రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతాడు అలాంటి వాడిని ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు …. అన్ని తెలిసి కూడా హరిణి చేసుకుంటాను అంది అందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి

మామ్ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అది కూడా అన్నయ్య గురించి అని రేణుక మాటలకు నోటి నుండి మాట రాక ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది

తను ఆవేశం లో నోరు జారానని అర్థం అవ్వడం తో ఎలాగోలా కవర్ చేయాలి అనుకుని రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయి జై గురించి తెలిసి ఎవరు వస్తారు మాయ అదే హరిణి అయితే అడ్జస్ట్ అవుతుంది అందుకే హరిణి తో మ్యారేజ్ చేయాలి అని చూస్తున్నా ఇలా అయినా జై లో చేంజ్ వస్తుందని ఎక్కడో ఆశ అని బాధ నటిస్తూ చెప్తుంది

మామ్ ప్లీస్ నువ్వు నిజంగా అన్నయ్య హ్యాపీనెస్ కోరుకుంటూ ఉంటే దయచేసి అన్నయ్య మ్యారేజ్ విషయం లో ఇన్వాల్వ్ అవ్వకు లేదు అన్నయ్య మ్యారేజ్ నీ చేతుల్లో జరగాలి అనుకుంటే ముందు డాడ్, తాతయ్య తో ఈ విషయం గురించి డిస్కస్ చెయ్ నా మ్యారేజ్ అటుంచి ముందు అన్నయ్య మ్యారేజ్ గురించి ఏదోటి డిసైడ్ అవ్వండి అని చెప్పి మాయ షవర్ చేయడం కోసం వాష్ రూమ్ కి వెళ్తుంది

హరిణి తో మ్యారేజ్ అంటే మావయ్య నో చెప్పారు ఇపుడు మాయ కూడా వద్దు అంటుంది ఈయన ను అయినా ఎలాగోలా ఒప్పించాలి అనుకుని మళ్ళీ కిందకు వెళ్తుంది…..

హాల్ లో కూర్చుని పార్టీ లో జై అబ్నార్మల్ బిహేవియర్ గురించి ఆలోచిస్తున్న వినయ్ ముందు ప్రతాప్ వర్మ వచ్చి కూర్చుని ఏదో డీప్ గా ఆలోచిస్తున్న వినయ్ ను చూస్తూ వినయ్ అంటూ నెమ్మదిగా పిలుస్తాడు

తన తండ్రి వాయిస్ కి ఎదురుగా చూసిన వినయ్ కి తన వైపే చూస్తున్న ప్రతాప్ కనిపించడం చూసి హా…..!!! నాన్న చెప్పండి అంటూ ప్రతాప్ వర్మ వైపు చూస్తాడు

ఏమైంది వినయ్ దేని గురించీ అంతలా ఆలోచిస్తున్నావ్ పార్టీ లో కూడా అబ్జర్వ్ చేసాను ఏదో నవ్వాలి కాబట్టి నవ్వాలి అని హ్యాపీగా ఉన్నట్టు కనిపించావ్ ఏమైంది రా అంటూ ఆప్యాయంగా అడుగుతాడు

నాకు జై గురించి తప్పా ఇంకే ఆలోచన లేదు నాన్న వాడి లైఫ్ గురించే నా బాధ… అందరూ వాడ్ని వాడి సక్సెస్ ను ప్రైస్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో…. వాడి గురించి మాట్లాడుతూ ఉంటే అంతే భాష పడతాను కానీ అది వాడికి కొంచెం కూడా అర్థం కావడం లేదు ఇంకా ఎన్ని రోజులు ఇలా…. నా వల్ల కావట్లేదు నాన్న దీనికి నాకు సొల్యూషన్ కావాలి

జై తెలుసుకుంటాడు అని మీరు ఇప్పటి వరకూ ఇన్వాల్వ్ అవ్వలేదు ఇంకా మీరు సైలెంట్ గా ఉంటే జై మీరు చెప్పినా వింటాడు అన్న నమ్మకం నాకు లేదు అంటూ బాధగా చెప్తాడు

వినయ్ నీ బాధ నాకు అర్థం అయింది నేను కూడా దీని గురించి మాట్లాడాలి అనే వచ్చాను జై తిరుగుళ్ళు ఆగాలి అంటే ఒకటే సొల్యూషన్ అది వాడి పెళ్ళి…

నాన్న అసలేం మాట్లాడుతున్నారు జై గురించి తెలిసి వాడ్ని ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు దట్ టూ మ్యారేజ్ కి జై ఒకే అనాలి కదా

మీరు చెప్తే కచ్చితంగా ఒప్పుకుంటారు అండి అమ్మాయి కూడా రెడీగా ఉంది అని అపుడే వాళ్ళ కాన్వర్జేషన్ విన్న రేణుక అక్కడికి వస్తూ చెప్తుంది

అవును అమ్మాయి సిద్ధంగా ఉంది త్వరలోనే ఆ అమ్మాయి ఎవరో రివీల్ చేస్తాను నువ్వు దాని గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉండు అని కొడుకు తల నిమురుతూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న ప్రతాప్ వర్మ ను చూసి మావయ్య గారు చెప్తున్నది ఎవరి గురించి అని ఆలోచిస్తూ ఉంటుంది రేణుక….

రేణు…. అమ్మాయి ఉంది అంటున్నావ్ ఎవరా అమ్మాయి నువ్వు నాన్న అపుడే అమ్మాయిని కూడా చూసారా

కొత్తగా చూడ్డం ఏంటండీ హరిణి ఉంది కదా తన గురించే మావయ్య చెప్తుంది

హరిణి గురించా అని ఆలోచిస్తూ జై ఇపుడు ఎక్కడ ఉంటాడో తలచుకుని ప్రతాప్ వర్మ చెప్పినట్టు జై కి మ్యారేజ్ చేస్తేనే సెట్ అవుతాడు అనుకుని ఎలా జై ను ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు…. ఇవేమీ తెలియని జై మాత్రం తన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ తో తన ఫ్లాట్ లో కిందా మీదా పడుతూ ఒంట్లో వేడిని తగ్గించుకుంటూ ఉంటాడు

మన జై పెళ్లికి ఒప్పుకుంటాడు అంటారా గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి 😌☺️ అన్నట్లు రుద్రాన్ష్ ఎంట్రీ 15 పార్ట్ నుండి ఉంటుంది 🥰🤗 ఇక్కడ 3 పెయిర్స్ ఉన్నారు వాళ్ళెవరో కామెంట్స్ లో గెస్ చేయండి చూద్దాం

 

To Be Continueed….