భూమి మహాన్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అత్తయ్య ను మా ఇంట్లో చూడలేదు ……. !! అత్తయ్య కి నాకు పరిచయం కూడా లేదు & మహాన్ తనకు మామ్ గా అత్తయ్య ను పరిచయం చేసే వరకు అత్తయ్య నే మహాన్ కి మదర్ అని నాకు తెలియదు ……. !! అలాంటిది నేను అత్తయ్య విషయం లో ఎమ్ తప్పు చేశాను …… ?? అత్తయ్య మహాన్ & శ్లోక ఎందుకు నా మీద అంత కోపంగా వున్నారు …… ?? నిజంగా అత్తయ్య విషయం లో నేను ఎదైనా చేయకూడని తప్పు చేసానా అని అలోచిస్తూ ఒక్కో స్టెప్ దిగుతూ కిచెన్ లోకి వస్తుంది భూమి……. !!
ఎక్కడో చూస్తూ వస్తున్న భూమి ను అయోమయంగా చూస్తూ భూమి చేతిని పట్టుకుని భూమి ఏమైందమ్మా ……. ?? ఎందుకలా వున్నావ్ …… !! మళ్ళీ మహాన్ బాబు ఏమైనా అన్నాడా …… ?? కోకోనట్ వాటర్ తాగలేదా అని కంగారుగా అడుగుతుంది రేణుక….. !!
భూమి రేణుక వైపు చూస్తూ అదేం లేదక్కా మహాన్ వాటర్ తాగాడు …… !! అని ట్రే లో ఉన్న కాళీ గ్లాస్ చూపిస్తు తనకు మహాన్ కు జరిగిన డిస్కషన్ గురించి క్లియర్ గా చెప్తూ నాకేం అర్టం కావడం లేదు అక్క ….. !! నిజంగా నేను అత్తయ్య ను బాధ పెట్టలేదు కానీ వీళ్లంతా నేనే అత్తయ్య & మావయ్య విడిపోవడానికి రీసన్ అంటున్నారు అంటూ డల్ గా చెప్తుంది ……. !!
ఆ విషయాల గురించి నాకేం తెలియదు భూమి కానీ పెద్దమ్మ ( దేవయాని) గారికీ ఈ విషయాల గురించి తెలిసుంటుంది ….. !! నువ్వు ఆవిడ ను అడిగితే నీ ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ దొరకచ్చు ఒక సారి అడిగి చూడు అంటూ తిరిగి బ్రేక్ఫాస్ట్ కి అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది……. !!
అవును అక్క ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది …… !! ఈ విషయం గురించి చెప్పాలి అంటే అది నానమ్మ ను అడిగితేనే కరెక్ట్ వీళ్ళు అందరు వెళ్ళాక నానమ్మ ను అడుగుతాను ….. !! థాంక్స్ అక్క మంచి ఐడియా ఇచ్చావ్ అంటూ రేణుక వైపు నవ్వూతూ చూస్తుంది …… !!
రేణుక కూడా నవ్వూతూ ఇంత చిన్న విషయానికి థాంక్స్ ఎందుకు భూమి …… !! అందరు బావుండాలి విడిపోయినా మీ రెండు ఫ్యామిలీస్ బావుండాలి అని వీళ్ళు నిన్ను ఎంత ఏడిపిస్తున్నా అన్నిటినీ భరిస్తున్న నీ లాంటి మంచి అమ్మాయి కి అన్యాయం జరగకూడదు & నువ్వు సంతోషంగా ఉంటే చూడాలి అనుంది …… !! అందుకే నాకు తెలిసింది చెప్పాను అంటూ సరే మార్నింగ్ లేచి అటు ఇటు తిరుగుతూ చాలా టైడ్ అయ్యావ్ ఇదిగో టీ తాగు అంటూ భూమి చేతిలో టీ కప్ పెట్టి తను బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ……. !!
భూమి ఆ కాఫి కప్ అందుకుని కిచెన్ గట్టు మీద కూర్చుని టీ స్మెల్ చూస్తూ సిప్ చేసి వాహ్ సూపర్ అక్క ….. !! మా మమ్మీ టీ తర్వాత నాకు నచ్చేలా టీ చేసింది నువ్వే …… !! అని రేణుక కు కాంప్లిమెంట్ ఇచ్చి కల్లు మూసుకుని టీ తాగుతూ ఉంటుంది ……. !!
ఏయ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఎమ్ చేస్తున్నారు ……. !! అని సడన్ గా కిచెన్ లోకి వచ్చిన నందన భూమి ను అలా చూసి కోపంగా భూమి అని అరవగానే నందన రావడంతో నే షాక్ అయిన భూమి నందన అరుపుకి బయపడి కిందకు దిగి నందన వైపు టెన్షన్ గా చూస్తూ ఉంటుంది …… !!
ఎమ్ చేస్తున్నావ్ ఇక్కడ అని సీరియస్ గా అడుగుతుంది నందన….. !!
అ…. అత్తయ్య!! అది అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం …… !! ఆని చేతులు నలుపుకుంటూ భయంగా చెప్తుంది …… !!
బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది రేణుక …… !! మరి నువ్వేం చేస్తున్నావు ?? కిచెన్ గట్టు మీద కూర్చుని మహారాణీ లాగ టీ తాగుతూ ఉంటే రేణుక ఒక్కటే వంట చేస్తుంది …… !! నీకు నేనేం చెప్పాను నిన్ను మాత్రమే వంట చేయమని చెప్పానా లేదా ……. ?? అయినా నువ్వు చేయకుండా తనతో చేయిస్తున్నావ్ ……. !! బాగా కొవ్వు పెట్టావ్ అందుకే నేను చెప్పిన విషయాలు ఇలా గాలికి వదిలేసి నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావ్….. !! నేను చెప్పింది నువ్వు చేయనందుకు నీకు నేను ఇవ్వబోయే పనిష్మెంట్ ఎంటో తెలుసా …… !!
మళ్ళీ నందన భూమి ను ఎక్కడ ఏడిపిస్తుందో అని కంగారు పడుతూ అయ్యో అమ్మ గారు ఇందులో భూమి అమ్మాయి గారి తప్పేం లేదు ……. !! నేనే అమ్మాయి గారికీ వద్దు అంటున్నా టీ ఇచ్చాను తప్పు నాదే అమ్మ క్షమించండి ……. !! అని ముందుకు వచ్చిన రేణుక ను లాగీ పెట్టి కొట్టి ఇదే లాస్ట్ వార్నింగ్ మరో సారి దానికి సపోర్ట్ చేస్తూ కనిపించావో ……. !! ఈ ఇంట్లో కనిపించవ్ అని సీరియస్ గా చెప్పి భూమి వైపు కోపంగా చూసి ఏయ్ ఈ రోజు మొత్తం నువ్వు ఫుడ్ తీసుకోవడానికి వీల్లేదు ……. !! అలా కాదని తీసుకున్నావ్ అని తెలిసిందో వారం రోజులు ఇంటి బయట ఉంటావ్ అని సీరియస్ గా చూస్తూ త్వరగా కుక్ చేయండి అని ఏమేం కావాలో లిస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ……. !!
నందన అక్కడి నుంచి వెళ్ళిపోయాక భూమి బాధగా రేణుక బుజం మీద బాధగా చెయ్ వేసి ఎందుకు అక్క అనవసరంగా నాకు సపోర్ట్ చేశావ్ …… ?? నీకు తెలుసు కదా అత్తయ్య కి నేనంటే ఇష్టం లేదు అని మరి అలాంటపుడు నాకు సపోర్ట్ చేస్తే నిన్ను ఇలాగే బాధ పెడతారు …… !! ఐ యాం సారి అక్క ఇంకెప్పుడు నాకు సపోర్ట్ చేయకు …… !! అని బాధగా చెప్పి టీ కూడా తాగాలి అనిపించక టీ కప్ పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటుంది …… !!
నన్ను కొట్టినందుకు నాకేం బాధ లేదు భూమి కానీ నా వల్ల నువ్వు ఇవాళ మొత్తం ఎమ్ తినకుండా ఉండాల్సి వస్తోంది అసలే నిన్న కూడా నువ్వేం తినలేదు….. !! నీకు టీ ఇవ్వకపోయినా బావుండేది భూమి నేను ఇచ్చిన టీ వల్లే ఈరోజు మొత్తం నువ్వు పస్తు ఉండబోతున్నావ్ ……. !! అని భూమి వైపు జాలిగా చూస్తూ మళ్లీ బ్రేక్ఫాస్ట్ లేట్ అయితే నందన సీరియస్ అవుతుందని ఫాస్ట్ గా అన్ని రెడీ చేసి టేబుల్ మీద పెడుతుంది …… !!
బ్రేక్ఫాస్ట్ టైమ్ అవ్వడంతో ఒక్కొక్కరిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్న వాళ్ళని చూసి రేణుక అక్కడి నుంచి పక్కకు వెల్తే భూమి అందరికి వడ్డిస్తూ ఉంటుంది….. !! ఎవరికి ఏమేం కావాలో చూసుకుంటూ పక్కనే నిల్చొని ఉంటుంది …… !! అందరి బ్రేక్ఫాస్ట్ అయ్యాక వాళ్ళు తిన్న ప్లేట్స్ తీస్తున్న భూమి ను అడ్డుకుని ఇవి నేను తీస్తాను …… !! నువ్వు ఇక్కడి నుండి వెల్లు భూమి అని భూమి ను అక్కడి నుండి పంపించి రేణుక నే అవన్ని తీసేస్తుంది …… !!
శ్లోక హాల్ లో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉండడం చూసిన నందన తన చేతికి ఉన్న వాచ్ లో టైమ్ చూస్తూ శ్లోక కాలేజ్ టైమ్ అవుతోంది కదా ……. !! ఇంకా ఇలాగే వున్నావేంటి కాలేజ్ కి వెళ్ళవా …… ?? అంటూ కాలేజ్ కి రెడీ అవ్వని కూతుర్ని చూస్తూ అయోమయంగా అడుగుతుంది …… !!
లేదు మామ్ నా ఫ్రెండ్స్ వస్తున్నారు …… !! సో ఈ రోజు ఇక్కడే లంచ్ చేస్తాం అని చెప్పి రేణుక ను పిలిచి రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ నేమ్స్ చెప్పి అన్ని రెడీగా ఉండాలి …… !! ఆని స్ట్రిక్ట్ గా చెప్పీ ఆఫిస్ కి వెళ్తున్న నందన ను చూసి బై చెప్పి హాల్ లో బిందాస్ గా కూర్చుంటుంది …… !!
ఇంట్లో ప్రశాంతంగా లేదని టెంపుల్ కి వెళ్తున్న దేవయాని భూమి ను జాగ్రత్తగా ఉండమని చెప్పి దగ్గర్లో ఉన్న టెంపుల్ కి వెళ్తుంది …… !! శ్లోక కావాలనే భూమి ను ఏడిపించడానికి జ్యూస్ ఫ్లోర్ మీద పోసి ఏయ్ భూమి జ్యూస్ పొరపాటున కింద పడిపోయింది వచ్చి క్లీన్ చెయ్ అని పిలుస్తుంది …… !!
శ్లోక కావలని చేస్తుంది అని తెలిసినా ఎమ్ చేయాలని దుస్థితి భూమి ది అందుకే మౌనంగా క్లాత్ తో జ్యూస్ పడ్డ చోట క్లీన్ చేస్తున్న భూమి ను చూసి నవ్వుకుంటూ కావాలనే తన హీల్ ను తగిలిస్తూ భూమి చేతిని బలంగా తొక్కుతుంది …… !! భూమి అమ్మా 🥹 అన్న పిలుపు విన్న శ్లోక నవ్వుకుంటూ ఉండగా ఎవరో సడెన్ గా శ్లోక ను సోఫా లో నుండి పైకి లేపి ఈడ్చి పెట్టి కొట్టగానే శ్లోక ఆ వ్యక్తి వైపు గుటకలు మింగుతూ చూస్తూ రాజ్ అని షాక్ అవుతుంది ……. !!
భూమి ఫ్లోర్ మీద పడ్డ జ్యూస్ క్లీన్ చేస్తూ ఉండగా శ్లోక భూమి ను అలా చూసి నవ్వుకుంటూ కావాలనే భూమి చేతి మీద తన హీల్ తో బలంగా తొక్కగానే భూమి అమ్మ ఆన్న అరుపు విని శ్లోక నవ్వుతూ ఉండగా ఎవరో సడెన్ గా శ్లోక రెక్క పట్టుకుని సోఫా నుండి పైకీ లేపి ఈడ్చి పెట్టి కొట్టగానే శ్లోక చంపన చెయ్ పెట్టుకుని ఆ వ్యక్తి ను చూసి షాక్ అయ్యి గుటకలు మింగుతూ రాజ్ అంటూ నిలుక్కుపోయి చూస్తూ ఉంటుంది
రాజ్ శ్లోక వైపు నిప్పులు కక్కే కళ్ళతో సిరియస్ గా చూస్తూ హౌ డేర్ యూ …… ?? నా చెల్లి తోనే ఇలాంటి పనులు చేయిస్థూ తనను బాధ పెడతావా అని చంపలు నాన్ స్టాప్ గా వాయించి బుగ్గలు బురెల్లా పొంగేలా చేస్తాడు …… !! శ్లోక అరవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా కొడుతున్న రాజ్ ను చూసి నొప్పికి ఓర్చుకుంటూ పైకి లేచిన భూమి అన్నయ్య ఎమ్ చేస్తున్నావ్ …… !! వదులు అంటూ రాజ్ చెయ్ పట్టుకుని వెనక్కి లాగుతుంది …… !!
నువ్వాగు భూమి అంటూ భూమి చేతి వైపు బాధగా చూసి ఎందుకు నన్ను ఆపుతున్నావ్ …… !! అంటూ తన చెయ్ విడిపించుకుని ఇన్నాళ్లు నువ్వు ఆడదానివి కాదు అనుకున్నా కానీ అసలు మనిషివే కాదని అర్తం అవుతుంది …… !! తను కూడా నీలా అమ్మాయే అన్న విషయం గుర్తుందా …… ?? నీకు అంటూ కోపంగా తన ఉక్కు పిడికిలిలో శ్లోక గొంతు ను బందిస్తాడు …… !!
శ్లోక కి ఊపిరి ఆడక గుడ్లు రెండు బయటకు వచ్చేలా చూస్తున్న తన వైపు కంగారుగా చూస్తూ అన్నయ్య ప్లీస్ తను చచ్చిపోయేలా ఉంది వదలరా …… !! తనకేమైన అయితే నన్ను నేను క్షమించుకోలేను ప్లీస్ నా మాట విను అని ఏడుస్తూ చెప్తున్న భూమి వాయిస్ విని కష్టంగా తన చేతిని వెనక్కి తీసుకుంటూ శ్లోక ను ఫ్లోర్ మీదకు నెడుతాడు …… !!
పోతుంది అనుకున్న ప్రాణం ఆఖరి క్షణం లో తిరిగి రావడంతో ఆలాగే కింద పడి గొంతు పట్టుకుని దగ్గుతూ కొంత సేపు నరకం చూస్తుంది …… !! కాసేపటికి తనను తాను కంట్రోల్ చేసుకుని కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా పైకీ లేచి ఏంట్రా చంపేస్తావా ?? నన్ను అని అడ్డుగా ఉన్న భూమి ను పక్కకు నెట్టి కోపంగా రాజ్ కాలర్ పట్టుకుంటుంది …… !!
నన్నే రా అంటావా అయిపోయావే అంటూ కోపంగా శ్లోక చెయ్ వెనక్కి మడిచి మర్యాదగా నా కాళ్ళు పట్టుకుని సారి సర్ తప్పైపోయింది …… !! ఇంకెప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడను అని చెప్పు లేకపోతే ఈ చెయ్యి విరిచి నీ చేతిలోనే పెడతాను ….. !!
వాట్ నేను నీ కాళ్ళు పట్టుకుని సారి చెప్పాలా నెవర్ ఈ శ్లోక ఎవరి ముందు తల వంచదు …… !! అలాంటిది నీ కాళ్ళు పట్టుకుంటా అని ఎలా అనుకున్నావ్ రా అని పొగరుగా చెప్తుంది ….. !!
ఈస్ ఇట్ అంటూ సైడ్ స్మైల్ తో పాకెట్ లో నుండి లైటర్ తీసి సిగరెట్ వెలిగిస్తూ నీకు 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నా …… !! ఈ లోపు నేను ఎక్స్పెక్ట్ చేసిన సారి చెప్పలేదు అనుకో ….. !! వద్దు లే అది నేను చెప్పను తర్వాత ఎమ్ జరుగుతుందో నువ్వే చూడు ….. !! అంటూ ఆఫ్టర్ 10 సెకండ్స్ లైటర్ ను తీసుకుని శ్లోక చేతి దగ్గరకు తీసుకు వస్తు ఉంటాడు…… !!
ఆ లైటర్ వేడికి చర్మం కాలిపోయేల ఉండడం తో శ్లోక భయపడుతూ స…. స…. సారి ప్లీస్ నన్నేం చేయకు అంటూ ఏడుస్తూ మెడ వెనక్కీ తిప్పి రాజ్ వైపు ఏడుస్తూ చూస్తుంది …… !!
రాజ్ సైడ్ స్మైల్ తో శ్లోక కళ్ళల్లో నీటిని చూసి చేతిని వదిలి నేను ఎమ్ చెప్పా నా కాళ్ళు పట్టుకుని సారి చెప్పమని చెప్పానా ….. ?? అని శ్లోక ను తన కాళ్ళ దగ్గరకు పడేలా ఒక్కటి ఇవ్వగానే శ్లోక కోపంగా రాజ్ కాళ్ళు పట్టుకుంటూ సారి సర్ అని చెప్పి పైకీ లేచి నాతోనే నీ కాళ్ళు పట్టించుకున్నావ్ కదరా…… !! ఇందుకు 10 టైమ్స్ నీ మీద రివేంజ్ తీర్చుకోకపోతే నా పేరు శ్లోక నే కాదు ….. !! మా అన్నయ్య లేని టైమ్ లో వచ్చావ్ కాబట్టీ ఇంకా నా కళ్ళ ముందే వున్నావ్ అదే మహాన్ ఉండుంటే వాడు కొట్టిన దెబ్బలకు హాస్పిటల్ లో వుండేవాడివి …… !!
ఎంటే వాగుతున్నావ్ వాడేమైనా పెద్ద పిస్తా అనుకుంటున్నావా …… ?? రమ్మనవే వాడ్ని ఫస్ట్ కాల్ చెయ్ వాడికి వెంటనే రమ్మని చెప్పు నేను వచ్చింది కూడా వాడి పని చెప్పడానికే….. !! నేను లేనప్పుడు దొంగ గా నా చెల్లిని పెళ్ళి చేసుకున్న ఆ దద్దమ్మ ను పిలువు నేను ఇక్కడే ఉంటాను …… !! ఎవరు ఎవరిని కొడతారో & ఎవరు హాస్పిటల్ లో పడతారో చూద్దాం ……. !! అని యాటిట్యూడ్ గా చెప్పి భూమి ను తీసుకుని అక్కడే ఉన్న సోఫా లో క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుంటాడు …… !!
నీకు బాగా మూడింది రా అందుకే మా అన్నయ్య ను రమ్మంటున్నావ్ చెప్తా ఆగు నీ పని అని కోపంగా ఇద్దరి వైపు చూస్తూ తన మొబైల్ తీసుకుని మహాన్ కి కాల్ చేస్తూ గార్డెన్ లోకి వెళ్తుంది ….. !!
ఏడ్చావ్ లే పోవే అని వెళ్తున్న వైపు చూస్తున్న రాజ్ ను చూసిన భూమి కోపంగా ఉన్న రాజ్ మొహాన్ని చూసి భయపడుతూనే అన్నయ్య ప్లీస్ ఇక్కడి నుండి వెళ్ళిపో …… !! మహాన్ ఇక్కడికి వస్తే గొడవ పెద్దది అవుతుంది …… !! ప్లీస్ రా నా మాట విను అంటూ కన్నీళ్లతో రాజ్ చేతిని పట్టుకుంటుంది …… !!
స్టాప్ ఇట్ భూమి నేను ఎందుకు వెళ్తాను …… !! నిన్ను ఈ ఇంటి మనుషులు ఇంతలా టార్చర్ పెట్టినందుకు అందరికి బుద్ది చెప్పే నిన్ను తీసుకుని వెళ్తాను …… !! మావయ్య ను లాక్ చేసినట్టు నన్ను ఏమోషనల్ గా లాక్ చేయాలి అని చూడకు ….. !! నేను అలాంటి సెంటిమెంట్స్ కి లొంగను అని నీకు బాగా తెలుసు & నేను నిన్ను తీసుకుని వెళ్లకుండా ఇక్కడి నుండి కదలను ….. !! మేము అందరం వాడ్ని మర్చిపోమని వాడు నీకు కరెక్ట్ కాదని వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా వాడ్ని నమ్మి పెళ్ళి చేసుకున్నావ్ …… !! ఎట్లిస్ట్ ఇప్పటికైనా వాడెంటో అర్తం అయిందా ….. !! వాడి గురించి తెలిసాక కూడా నువ్వు ఇక్కడే ఉండాలి అనుకోవడం లో నీకు పిచ్చి అని తెలుస్తుంది …… !!
అన్నయ్య నేను ఇక్కడ ఉన్నది కేవలం మహాన్ కోసం మాత్రమే కాదు …… !! విడిపోయిన వాళ్ళని కలపడానికి ప్లీస్ నా ప్రయత్నానికి అడ్డు రాకు ……. !! ఇది నా ఇల్లు నేను నా ఇంటిని వదిలి ఎక్కడికీ రాను ఇక నువ్వు వెళ్ళు అని కోపంగా చెప్పి పైకీ లేస్తుంది …… !!
కోపం నీకు సెట్ అవ్వదు భూమి అంటూ రాజ్ కూడా పైకి లేచి నువ్వు నాతో ఇలా కాదు ఇంకెలా మాట్లాడినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను …… !! అని భూమి అరచేతిని పట్టుకుని కాలిని తన చేతి వైపు చూస్తూ నిన్ను ఇలా చూడ్డానికేనా మేము అల్లారు ముద్దుగా పెంచింది ….. !! అని రాజ్ అనగానే భూమి ఏడుస్తూ అన్నయ్య నేను మోసపోయాను మహాన్ నన్ను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు …… !! ఎందుకు చేశావ్ అంటుంటే నేను అత్తయ్య కి అన్యాయం చేశా అంటున్నాడు ……. !! నాకేం అర్థం కావడం లేదు అని ఏడుస్తూ రాజ్ గుండెళ్ళో వదిగి బాధ మొత్తం పోయే వరకు ఏడుస్తూ ఉంటుంది …….. !!
తన చెల్లి కన్నీళ్లతో తడిసిన గుండెను చూసిన రాజ్ కల్లు ఎరు పెక్కుతాయి …… !! కోపంగా నిన్ను ఇంత టార్చర్ పెట్టిన వాడ్ని ఊరికే వదిలి పెట్టను భూమి అని అనుకుంటూ ప్రేమగా భూమి తల నిమురుతూ ఉన్నాడు …… !! అప్పుడే ఇంట్లోకి ఆవేశంగా వచ్చిన మహాన్ వాళ్ళని అలా చూసి కోపంగా రాజ్ అని గట్టిగా అరుస్థాడు ….. !!
శ్లోక రాజ్ & భూమి ను కోపంగా చూస్తు మీకు మూడింది రా అందుకే నన్ను కొట్టి ఆ భూమి కాళ్ళు నేను పట్టుకునేలా చేస్తావా …… !! అయిపోయావ్ రా అని రాజ్ ను కోపంగా చూస్తు గార్డెన్ లోకి వెళ్లి ఏడుస్తూ మహాన్ కి కాల్ చేస్తుంది ….. !! మహాన్ మీటింగ్ లో వుండడం వల్ల కాల్ కట్ చేసి మీటింగ్ కంటిన్యూ చేస్తాడు …… !! ఇదేంటి అన్నయ్య కాల్ కట్ చేశాడు అనుకుంటూ మళ్లీ మళ్లీ మహాన్ కి విసుగొచ్చి కాల్ లిఫ్ట్ చేసేదాకా బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తూనే ఉంటుంది …… !!
శ్లోక కాల్స్ కి విసుగొచ్చిన మహాన్ మీటింగ్ హనీష్ కంటిన్యూ చేయమని చెప్పి కోపంగా మీటింగ్ నుండి బయటకి వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు ….. !! కాల్ కట్ చేస్తే బిజీగా ఉన్నానని అర్తం ఆ మాత్రం అర్తం చేసుకోకుండా ఎన్టీ ఈ కాల్స్ శ్లోక ఇది ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ నో తెలుసా అసలు ఇపుడేం కొంప మునిగిందని ఆన్ని సార్లు కాల్ చేశావ్ చెప్పు అంటూ గట్టిగా అరుస్తాడు….. !!
అన్నయ్య !! సారి అని ఏడుస్తూ మాట్లాడుతున్న శ్లోక గొంతు విని ఏయ్ శ్లోక ఏమైందీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్ ….. ?? అని అయోమయంగా అడుగుతాడు
అన్నయ్య నువ్వు, మమ్మీ లేని టైమ్ చూసి ఆ భూమి వాళ్ళ అన్న అదే ఆ రాజ్ ఇంటికి వచ్చి నన్ను కొట్టాడు …… !! అంతే కాదు నాతో ఆ భూమి కాళ్ళు కూడా పట్టుకునేలా చేసాడు ….. !! అని ఏడుస్తూ నువ్వు కొట్టావ్ అని మా అన్నయ్య కి చెప్తాను అంటే మీ తాత కి కూడా చెప్పు .,…. !! నన్ను ఎవడు ఏమీ చేయలేడు అని పొగరుగా అంటున్నాడు …… !!
వాట్….. ?? ఆ రాజ్ మన ఇంటికి వచ్చి నిన్ను కొట్టాడా …… !! అని అడుగుతూ ఆఫిస్ బయటకి నడిచి కార్ లో కూర్చుని ఇంటికి పోనివ్వమని డ్రైవర్ తో చెప్తాడు……. !! శ్లోక ఏడుస్తూ చెప్పేది మొత్తం విని 10 మినిట్స్ లో మన ఇంట్లో ఉంటాను నువ్వేం బాధ పడకు వాడ్ని కుక్క ను కొట్టినట్టు కొట్టి బయట పడేస్తా అని కాల్ కట్ చేస్తాడు …… !!
శ్లోక నవ్వుకుంటూ రేయ్ రాజ్ ఇవాళ మా అన్నయ్య చేతిలో అయిపోయావ్ రా ……. !! లేకపోతే నన్నే కొడతావా ……. ?? ఈ శ్లోక అంటే ఎంటో నీకు తెలిసేలా చేయకపోతే అప్పుడు అడుగు …… !! అని కాసేపూ అక్కడే కూర్చుని ఇంట్లోకి వెళ్తుంది అప్పుడే మహాన్ కూడా ఇంట్లో కి రావడం తో ఇద్దరూ ఒకే సారి ఇంట్లోకి రావడం జరుగుతుంది…… !!
ఆవేశంగా ఇంట్లోకి వచ్చిన మహాన్ కి హాల్ లోనే భూమి ఏడుస్తుంటే తనను దగ్గరకు తీసుకుని కన్నీళ్ళు తుడుస్తూ ఒదారుస్తున్నా రాజ్ కనిపించడం తో కోపంగా రేయ్ రాజ్ అంటూ కోపంగా అరవగానే మహాన్ వాయిస్ విని ఉలిక్కి పడి రాజ్ కి దూరంగా జరుగుతుంది…….. !! తన వైపే కోపంగా చూస్తూ వస్తున్న మహాన్ ను చూసి టెన్షన్ పడుతూ కంగారుగా పైకి లేచి నుంచుని చూస్తూ ఇప్పుడేం గొడవ జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది …… !!
మహాన్ రావడం రావడమే ఆవేశంగా భూమి ముందుకు వచ్చి లాగి పెట్టి కొట్టగానే భూమి ఆ ఫోర్స్ కి వెళ్లి సోఫా లో పడి చంప మీద చెయ్ పెట్టుకొని ఏడుస్తూ మహాన్ వైపు చూస్తుంది ….. !! అది చూసిన శ్లోక నవ్వుకుంటూ చేతులు కట్టుకుని సినీమా చూసినట్టు చూస్తూ ఉంటుంది …… !!
రేయ్ అంటూ రాజ్ కోపంగా మహాన్ కాలర్ పట్టుకుని ఒక పోలీస్ ఆఫీసర్ ముందు అది కూడా నా చెల్లినే కొడతావా …… ?? అయిపోయావ్ రా నా చేతుల్లో అని మహాన్ ముక్కు మీద బలంగా గుద్దగానే మహాన్ ముక్కు లో నుండి రక్తం వచ్చి 2 నిమిషాలు మహాన్ కి ఎమ్ కనిపించదు ….. !! అది చూసిన శ్లోక అయితే రాజ్ మహాన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు….. !!
అన్నయ్య ఎమ్ చేస్తున్నావ్ ….. ?? అంటూ కాంగారుగా మహాన్ వైపు వెళ్తున్న భూమి చెయ్ పట్టుకుని ఆపి వాడి వైపు వెళ్లావో చంపేస్తాను చెప్తున్నా …… !! పక్కకు వెల్లు అంటూ భూమి ను పక్కకు జరిపి మహాన్ కాలర్ పట్టుకుని గొడవకు దిగుతాడు ……. !! ఇద్దరూ హాల్ మొత్తం దొర్లుతూ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ హాల్ లో వున్న ఫర్నీచర్ మొత్తం నాశనం చేస్తారు …… !!
గుడి నుండి ఇంట్లోకి వస్తున్న దేవయాని హాల్ లో కొట్టుకుంటున్న ఇద్దరి మనవల్లని చూసి అయ్యో ఏంట్రా !! ఇది ఆపండి అంటూ రాజ్ ను పట్టుకుని వెనక్కి లాగడానికి చూస్తుంది …… !! నానమ్మ కాసేపు సైలెంట్ గా వుండు అంటూరాజ్ దేవయాని ను పక్కకు జరిపి మహాన్ కడుపులో బలంగా పంచ్ ఇవ్వగానే మహాన్ కడుపు పట్టుకుని కింద కూర్చుని నొప్పిని బరించలేక మూలుగుతూ ఉంటాడు ….. !!
మహాన్ ను అలా చూసిన భూమి ఏడుస్తూ మహాన్ అంటూ మహాన్ ను పట్టుకుని నొప్పిగా ఉందా పదా హాస్పిటల్ కి వెళ్దాం …… !! అని మహాన్ ను అతి కష్టం మీద పైకీ లేపి ఏడుస్తూ 🥹 అన్నయ్య ఏంటి ఇది మహాన్ కి ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉంటాను అనే అనుకుంటున్నావా …… ?? ఎందుకిలా చేస్తున్నావ్ నేను ఇప్పుడు మహాన్ బార్య ను ప్లీజ్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ……. !!
రాజ్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మొహాన్ని అటు వైపు తిప్పుకుని ఉండడం చూసిన మహాన్ ఎంటే డ్రామాలు ఆడుతున్నారా అన్నా చెల్లెలు …… ?? హా నా చెల్లిని కొట్టిందే కాకుండా నా ఇంటికి వచ్చి నన్నే కొడతాడా …… ?? వాడ్ని మర్యాదగా ఇక్కడి నుంచి వెల్లిపోమని చెప్పు లేకపోతే వాడు ఈ రోజు నా చేతుల్లో చావడం ఖాయం అంటూ కోపంగా భూమి మెడ పట్టుకుని చెప్తాడు …… !!
రేయ్ అన్న రాజ్ వాయిస్ విని అటు వైపు చూసిన మహాన్ కి రాజ్ శ్లోక మెడ మీద కత్తి పెట్టి కనిపించడం తో కరెంట్ షాక్ కొట్టినట్టు షాక్ అవుతాడు…… !! శ్లోక అంటూ భూమి ను వదిలి ముందుకు అడుగు వేసిన మహాన్ ను ఆపి అడుగు ముందుకు వేసావో దీని గొంతులో కత్తి దిగుద్ది …… !! అంటూ లైట్ గా బ్లడ్ వచ్చేలా గుచ్చగానే శ్లోక నోటి నుండీ అమ్మా ఆన్న అరుపు విని మహాన్ అక్కడే ఆగి వద్దు ప్లీస్ శ్లోక ను ఎమ్ చేయకు అంటూ కంగారుగా చెప్తాడు …… !!
గుడ్!! ఇప్పుడు దారిలోకి వచ్చావ్ ….. !! నీ చెల్లికి కొంచెం బ్లడ్ వస్తేనే తట్టుకోలేక పోతున్నావ్ …… !! మరి నా కళ్ల ముందే నా చెల్లిని కొట్టి టార్చర్ చేస్తున్నావ్ మరి నాకు ఎంత కోపం రావాలి హా !! అంటూ మహాన్ వైపు కోపంగా చూస్తాడు ….. !!
అది నా బార్య కొట్టుకుంటాను అవసరమైతే చంపేస్తాను అడగడానికి నువ్వు ఎవడివి రా ….. !! ముందు నా చెల్లిని వదులు ….. !!
నువ్వు చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా …… !! దాన్ని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి పెళ్ళి చేసుకున్నావ్ ….. !! ఇందుకు నువ్వు త్వరలోనే రిగ్రెట్ అయ్యేలా చేయకపోతే నా పేరు రాజ్ నే కాదు …… !! భూమి పదమ్మా ఇక్కడి నుండి వెల్లి పోదాం ఈ వెధవ దగ్గర నువ్వు క్షణం కూడా ఉండడానికి వీల్లేదు…… !!
అది ఎక్కడికీ రాదు ఇక నువ్వెళ్ళచ్చు అంటూ కోపంగా చెప్తున్న మహాన్ ను చూసి నవ్వుతూ అచ్ఛా….. !! నా చెల్లి అమాయకురాలు కాబట్టి నువ్వు పెట్టే బాధలను కూడా భరిస్తూ ఇక్కడే ఉండాలి అనుకుంటుంది….. !! కానీ నా గురించి తెలుసు కదా భూమి ను ఇక్కడి నుంచి బయటకు ఎలా తీసుకుని వెళ్ళాలో నాకు తెలుసు నువ్వు ఆ నోరు మూసి నాకు, భూమి కి & నానమ్మ కి ఫ్రిడ్జ్ నుండి కూల్ డ్రింక్స్ తీసుకుని రా అంటూ యాటిట్యూడ్ గా చెప్పగానే మహాన్ పళ్ళు నూరుతూ చూస్తూ ఉంటాడు…… !!
రేయ్ చెప్పేది నీకే వెళ్ళి కూల్ డ్రింక్స్ పట్టుకుని రా….. !! ముందే చెప్తున్నా బాగా కూల్ గా ఉండాలి….. !! అసలే ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది….. !!
యూ ఫూల్ ఎలా కనిపిస్తున్నా నీ కంటికి నన్ను కూల్ డ్రింక్స్ తీసుకుని రమ్మంటావా….. ?? ఇంటికి వచ్చిన అడ్డమైన వాళ్ళకు జ్యూస్ ఇచ్చి సర్వ్ చేయడానికి నేనేమైనా సర్వర్ నా….. ??
మరి నా చెల్లి మీ అందరికీ సర్వెంట్ అనుకుంటున్నారా ….. ?? తనతో వర్క్ చేయించడానికి మీ అందరికీ ఎంత ధైర్యం…. ??
రేయ్ అనవసరంగా నన్ను రెచ్చకొట్టకు నీకు ముందే చెప్పాను అది నా పెళ్ళాం నా ఇష్టం వచ్చినట్టు చేయించుకుంటా ….. !! నీకెంట్రా నొప్పి….. ??
హుష్!! ఇప్పుడు నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ మర్యాదగా తీసుకుని రాకపోతే అంటూ ఇంకా కత్తి శ్లోక మెడ మీదే ఉండడం తో దాన్ని ఇంకొచెం జస్ట్ అలా లోతుగా అనడం తో అప్పటికి ఆగిన బ్లీడింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం తో శ్లోక నొప్పికి ఏడుస్తూ అన్నయ్య ప్లీస్ వీడు చంపేసేలా ఉన్నాడు….. !! వీడు చెప్పింది చెయ్ ప్లీస్ అంటూ భయం తో గట్టిగా ఏడుస్తూ ఉంటే సీరియస్ గా కనిపిస్తున్న రాజ్ మొహాన్ని చూసి మహాన్ తన మొహాన్ని మరింత సీరియస్ గా పెట్టుకుని రాజ్ అడిగినట్టు డ్రింక్స్ తీసుకుని వచ్చి ఇస్తాడు….. !!
గుడ్ అంటూ కూల్ డ్రింక్ సిప్ చేస్తూ ఇంకో సారి నా చెల్లిని హర్ట్ చేయడానికి ట్రై చేశారో చంపేస్తాను అని రాజ్ శ్లోక ను మహాన్ వైపు నెడతాడు…… శ్లోక ఆర్ యూ ఆల్రైట్ అంటూ మెడ దగ్గర కాటన్ పెడుతూ బ్లడ్ రాకుండా ఆపుతూ చెప్తాడు మహాన్….. !! బాగా నొప్పిగా ఉంది అన్నయ్య అని ఏడుస్తూ రాజ్ వైపు కోపంగా చూస్తుంది…… !!
భూమి ను తీసుకుని వెళ్తాను అని చెప్పాను తీసుకుని వెళ్తాను నువ్వు మగాడివి అయితే ఆపడానికి ట్రై చెయ్ అంటూ భూమి చెయ్ పట్టుకుని నా మీద ఏ మాత్రం ప్రేమ, నమ్మకం ఉన్నా ఇంకేం మాట్లాడకుండా నాతో పాటు పదా అంటూ రాజ్ తనను తీసుకు వెళ్తూ ఉంటే భూమి కన్నీళ్ళతో మహాన్ వైపు చూస్తూ అన్నయ్య ప్లీస్ నేను చెప్పేది విను అంటూ రాజ్ వెంట వెళ్ళిపోతుంది ……… !! అది చూసిన దేవయాని భూమి వైపు చూస్తూ ఆనందంగా చూస్తూ ఇప్పటికైనా నీకు వీళ్ళ నుండి విముక్తి కలుగుతుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది…… !!
రాజ్ భూమి ని తీసుకుని వెళ్ళిపోయాడా….. ?? ఇప్పుడు భూమి ఏం చేయాలి అనుకుంటుంది….. ?? రాజ్ మీద మహాన్, శ్లోక ఎలా రివెంజ్ ప్లాన్ చేయబోతున్నారు….. ?? ఈ విషయం నందన కి తెలిస్తే ఏం చేయనుంది….. ?? మహాన్ అంత ఈజీగా భూమి ను వదిలేస్తాడా…. ?? గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి 🙂