నందన ఆఫీస్ నుంచి కోపంగా తన ఆఫీస్ కి వెళ్ళిన కార్తికేయ చేతికి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా నందన మీద వస్తున్న కోపాన్ని & అసహ్యాన్ని వర్క్ మీద చూపిస్తూ లాపి కి బ్లడ్ అంటకుండా తన చేతిని టిస్యూ తో క్లీన్ చేసుకుని హ్యండ్ పెయిన్ గా ఉన్నా ఏమాత్రం కేర్ చేయకుండా వర్క్ మీద ఫోకస్ పెడతాడు…… !! ఈవెనింగ్ వరకు విత్ అవుట్ బ్రేక్ తన సిస్టమ్ ముందే కూర్చుని 2 డేస్ లో చేయాల్సిన వర్క్ మొత్తం వన్ డే లో ఫినిష్ చేసి కంప్లీట్ చేసిన వర్క్ సేవ్ చేసి సీట్ లో వెనక్కి వాలి కల్లు మూసుకుంటాడు ….. !!
మూసుకున్న ఆ కను రెప్పల మాటున తనను ఎంతో ప్రేమగా మావయ్య ❤️ అని పిలిచే భూమి రూపం గుర్తు రాగానే కార్తికేయ పిడికిలి బలంగా బిగుసుకుంటుంది …… !! తన మేనకోడలు తనకు దూరం అవ్వడానికి కారణం అయిన మహాన్, నందన మీద విపరీతమైన కోపం వస్తుంటే …. !! అసహనంగా సిట్ లో నుండి పైకి లేచి పర్సనల్ రూమ్ కి వెళ్ళి సిగర్ తీసుకొని తాగుతూ ఉంటాడు…… !! ఫస్ట్ భూమి ను ఆ నరకం నుండి ఎలా బయటకు తీసుకు రావాలు అని అలోచిస్తూ సిగరెట్ ప్యాకెట్ లో ఉన్న ఆన్ని సిగర్స్ వన్ బై వన్ ఫినిష్ చేసి ముందు దేవయాని తో మాట్లాడాలని ఫిక్స్ అయి ఫేస్ వాష్ కోసం వాష్ రూమ్లో కి వెళతాడు ……. !!
✨💫✨💫✨💫✨💫✨💫
మహాన్ చేతుల్లో ఉన్న భూమి ను చూడగానే నందన మోహం కోపంతో ఎర్రబడుతుంది …… !! మహాన్ కూడా చుట్టూ ఎవరున్నారు అన్నది కూడా మర్చిపోయి భూమి వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉండడం చూసి నందన కోపం అంతకంతకు ఎక్కువ అవుతుంది ……. !! వీడ్ని దాన్ని ప్రేమించినట్టు నటించమని మాత్రమే చెప్పాను కానీ వీడ్ని చూస్తూంటే నేను చెప్పింది నిజం చేసేలా వున్నాడు …… !! అది ఎప్పటికీ జరగకూడదు అని కోపంగా మహాన్ ముందుకు వెళ్లి మహాన్ అంటూ కోపంగా అరుస్తుంది ….. !!
నందన పిలుపు విని భూమి ఉలిక్కి పడితే మహాన్ భూమి ను వదిలి సరిగ్గా నిల్చోపెడతాడు …… !! నలిగిన బ్లేజర్ సరి చేసుకుంటూ మా….. మామ్ ఎప్పుడోచ్చావ్ ?? అంటూ నందన వైపు కంగారుగా చూస్తూ తనను భూమి ను క్లోజ్ గా చూసేసిందా అని టెన్షన్ పడుతూ అడుగుతాడు …… !!
నేను వచ్చింది కూడా గమనించకుండా దాన్ని అంటుకుని పట్టుకున్నప్పుడు వచ్చాను ……. !!అని మహాన్ వైపు సీరియస్ గా చూస్తూ చెప్తుంది ……. !!
సారి మామ్ అనుకోకుండా అలా పట్టుకున్నా వాంటెడ్ గా కాదు అంటూ నందన వైపు చూస్తూ చెప్తున్న మహాన్ ను చూసి హ్మ్మ్….. !! వెల్లి ఫ్రెష్ అవ్వు అసలే దరిద్రపు మనుషుల్ని టచ్ చేశావ్ …… !! ఆ మురికి పోయే వరకు స్నానం చేసి రా అని చెప్పగానే అలాగే మామ్ అని ముందుకు అడుగు వేసిన మహాన్ మెడలో దండ వల్ల భూమి ను కూడా తన వైపు లాగడం తో భూమి వెళ్ళి మహాన్ కు అతుక్కుంటుంది…… !! బెదురు కళ్ళతో తన కను రెప్పలను టపా …. టపా కొడుతూ చూస్తున్న భూమి వైపు కోపంగా చూస్తు ఆ దండ తీసి దూరంగా విసిరి కొట్టి భూమి ను పట్టుకుంటూ అనుకోకుండా కింద పడి పగిలి పోయినా తన లాపి ను తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్ కి వెళతాడు మహాన్….. !!
మహాన్ వెళ్ళే వరకు కామ్ & సైలెంట్ గా చూస్తూ ఉన్న నందన మహాన్ తన రూమ్ కి వెళ్ళగానే కోపంగా భూమి మెడ వెనుక నుండి తన జుట్టు పట్టుకుని నాన్న మీరు కూడా ఫ్రెష్ అయి రండి బాగా టైడ్ అయ్యారు ……. !! అని విజయేంద్ర ప్రసాద్ ను కూడా రూమ్ కి పంపించి …….. !! అక్కడే ఉన్న రేణుక ను కూడా తిట్టి పంపేశాక భూమి వైపు కోపంగా చూస్తూ ఎంటే?? ఇలా ఆందంగా రెడీ అయ్యి నా కొడుకు ను బుట్టలో వేసుకోవాలి అని చూస్తున్నావా …… !! అని మెడ దగ్గర ఉన్న నరం మీద ప్రెషర్ ఇస్తూ భూమి కళ్లల్లో నీళ్లు రప్పిస్తుంది …… !!
ఆమ్మా 🥹 అంటూ మెడ దగ్గర చెయ్ పెట్టుకొని నొప్పితో ఏడుస్తూ అత్తయ్య ప్లీస్ వదలండి నొప్పిగా ఉంది …… !! అని కన్నీళ్ళతో తన వైపు చూస్తున్న భూమి ను చూసి వదలడం కాదే నిన్ను అంటూ భూమి బుగ్గ కందిపోయేలా ఈడ్చి పెట్టి కొట్టగానే భూమి ఏడుస్తూ చంప మీద చెయ్ పెట్టుకొని నందన వైపు బయంగా చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది …… !!
నేను నీకు మార్నింగ్ ఎమ్ చెప్పాను ?? హా!! చెప్పవే ఎమ్ చెప్పా నువ్వు నేను చెప్పిన చీరలు మాత్రమే కట్టుకుని ఈ ఇంటి పనిమనిషి లా ఉండాలి అని చెప్పానా లేదా ……. ?? నేను చెప్పింది ఏమాత్రం కేర్ చేయకుండా నేను అలా ఆఫిస్ కి వెళ్లగానే ఇలా సింగారించుకుని నా మాటను కూర లో కరివేపాకు లా పక్కకు తీసేస్తావా ……. ?? నా మాట అంటే అంత లెక్క లేదా నీకు అని బుగ్గలు నొక్కి పట్టుకుని భూమి వైపు సీరియస్ గా చూస్తూ అరుస్తుంది……. !!
గార్డెన్ లో జరుగుతున్న గొడవ గురించి తన రూమ్ లో కూర్చుని రామాయణం బుక్ చదువుతున్న దేవయాని కు రేణుక కంగారుగా చెప్పగానే దేవయాని వెంటనే బుక్ క్లోజ్ చేసి గార్డెన్ లోకి వస్తుంది…… !! నందన భూమి బుగ్గలు నొక్కి పట్టుకుని భూమి ను కొప్పడుతూ ఏదో సీరియస్ గా తిడుతూ కనిపించడం చూసి దేవయాని కంగారుగా వీళ్ళ దగ్గరకు వస్తుంది…… !!
నందన ఎమ్ చేస్తున్నావ్ వదులు దాన్ని అంటూ నందన ను భూమి నుండి దూరం జరిపి అమ్మా భూమి నొప్పిగా ఉందా …… !! అంటూ తన మోహం వైపు పరీక్షగా చూసిన తనకు భూమి చంప మీద చేతి వేళ్ళు కనిపించడం తో నందన వైపు కోపంగా చూస్తు నీకేమైనా పిచ్చి పట్టిందా ?? నందన ఎందుకు తనను ఇలా గొడ్డుని బాదినట్టు కొడుతున్నావ్ …… !! తనది కూడా శ్లోక ఏజ్ నే నీ కూతుర్ని ఎవరైనా ఇలా కొడితే చూస్తూ ఊరుకుంటావా అని కోపంగా అరుస్తుంది ….. !!
అమ్మా !! దీనికి నా కూతురితో కంపారిజన్ ఎంటి నాన్సెన్స్….. !! ఇది నా ఇంటికి పని మనిషి బట్ నా కూతురు ఈ ఇంటి యువరాణి …… !! అలాంటిది దానితో నా కూతురిని పోలుస్తావా….. ??
నీ ఇంటికి నీ కూతురు మహారాణీ అయితే తన ఇంటికి కూడా తను మహారాణీ అవుతుంది అది మర్చిపోకు…… !! నువ్వు ఇన్ని బాధలు పెడుతున్నా ఓర్చుకుంటూ ఇక్కడే ఉంది కేవలం మహాన్ మీదున్న ప్రేమతో …… !! ఇప్పటికైనా నీ పంతం పట్టన పెట్టి భూమి ను కోడలిగా అంగీకరించు ……. !! నీ అర్తం పర్థం లేని పగ , ప్రతీకారాలకు పిల్లల భవిష్యత్తును బలి చేయకు ….. !!
ఇక చాలు ఆపమ్మా !! నా పిల్లల ఫ్యూచర్ గురించి నువ్వేం దిగులు పడకు …… !! వాళ్ళు సంతోషంగానే ఉంటారు ….. !! ఇక పోతే నువ్వు దీని విషయం లో ఇంటర్ఫియర్ అవ్వకు…… !! ఇదే లాస్ట్ చెప్పడం & ఇంకో సారి దీనికి సపోర్ట్ చేస్తే మాత్రం నాలో వున్న రాక్షసిని చుడాల్సి వస్తుంది …… !! అని కోపంగా చెప్పి చెప్పవే ఈ శారీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడిది ?? దొంగతనం చేసి ఈ చీర కొనుక్కుని వచ్చావా ….. ?? నా పర్మిషన్ లేకుండా బయటకు ఎందుకు వెళ్లావ్ అని కోపంగా బుజం పట్టుకుని ఊపేస్తూ అడుగుతుంది ……. !!
దొంగతనం చేయాల్సిన అవసరం భూమికి ఎమ్ లేదు నందన……. !! దాని కోసం నేనే చీరలు తెప్పించా అని చెప్తున్న దేవయాని వైపు చూసి నాకు చెప్పకుండా దీనికి చీర కాదు సేఫ్టీ పిన్ కూడా కొనడానికి వీల్లేదు …… !! నా మాట కాదని కొంటే దీని వొళ్ళంతా వాతలు పెడతాను అయినా పర్లేదు అనుకుంటే కొనివ్వు ……. !! అని కోపంగా అరిచి చెప్పి ఏయ్ వెళ్ళి మార్నింగ్ ఎలా ఉన్నావో అలా రా ……. !! ఆలాగే అమ్మ నీకోసం తీసుకున్న శారీస్ అన్ని తీసుకురా & ఇప్పుడు నువ్వు కట్టుకున్న దానితో సహా నీకు 5 మినిట్స్ టైమ్ అని వాచ్ వైపు చూస్తూ చెప్తుంది …… !!
భూమి ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్లి మార్నింగ్ కట్టుకున్న శారీ రేణుక హెల్ప్ తో కట్టుకుని వచ్చి చేతిలో మార్నింగ్ దేవయాని ఇచ్చిన కవర్స్ తీసుకుని వచ్చి నందన ముందు నిల్చుంటుంది ……. !! ఆ చీరలు అన్నిటినీ కవర్స్ నుండి తీసి కుప్పగా బయట పడేసి మ్యాచ్ బాక్స్ తో అంటించి విసురుగా శ్లోక ను తీసుకొని రూమ్ కి వెళ్ళిపోతుంది ….. !!
తన కోసం దేవయాని ఎంతో ప్రేమగా తెప్పించిన శారీస్ ను నందన అలా తన ముందే తగలబెట్టడం తో భూమి ముందు షాక్ అయినా తర్వాత ఏడుస్తూ ఆ మంటను చేత్తో ఆర్పడానికి ట్రై చేస్తూ చెయ్ కాల్చుకుని అమ్మా 🥹….. !! అని ఆ చేతిని గుండెకు ఆనించుకుని ఏడుస్తూ ఉంటుంది….. !! తన కళ్ళు ముందు కాలిపోతున్న ఆ చీరలను చూసిన భూమి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఫాస్ట్ గా ఇంట్లోకి పరిగెత్తి తన చేతిలో కి వాటర్ బాటిల్స్ తీసుకు వచ్చి కష్టంగా మంటల మీద వాటర్ పోసి మంటను ఆర్పుతుంది …… !! బట్ భూమి బ్యాడ్ లక్ ఆ లోపే ఆ చీరలు మొత్తం కాలిపోయి భూమి కి బూడిద మాత్రమే మిగులుతుంది …… !! నందన తో వెళ్లినట్టే వెళ్ళి కార్నర్ లో ఎవరికి కనిపించకుండా నుంచుని అది చూసిన శ్లోక భూమి కన్నీళ్లను చూసి నవ్వుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోతుంది…… !!
కాలిపోయిన చీరలను చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న భూమి ను చూసి కష్టంగా భూమి పక్కన కూర్చుంటూ భూమి ఏడవకు తల్లీ !! చీరలే కదా కాలిపోయింది…… !! మళ్లీ నీ కోసం కొంటాను ఇలా ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకోకు అని తల నిమురుతూ చెప్తున్న దేవయాని ను చూసి నానమ్మ అంటూ ఏడుస్తూ గట్టిగా హత్తుకుంటుంది….. !! నేనేం తప్పు చేసానని అత్తయ్య నన్నిలా బాధ పెడుతుంది నానమ్మ 🥹 నిజం చెప్తున్నా నేను కావాలని మహాన్ ను టచ్ చేయలేదు తనే నేను పడి పోతుంటే పట్టుకున్నాడు అని వెక్కుతు చెప్తుంది …… !!
భూమి కన్నీళ్లు ప్రేమగా తుడుస్తూ మహాన్ ఎక్కడ నీకు దగ్గరవుతాడో అని భయపడి నందన ఇలా నిన్ను బాధ పెడుతూ ఏడిపిస్తుంది …… !! బాధ పడకు భూమి నిన్ను ఇంతలా బాధ పెడుతున్నందుకు నందన కచ్చితంగా పశ్చాతాపం పడే రోజు దగ్గర్లోనే ఉంది …… !! పైకీ లే అంటూ తనను పైకి లేపి వెళ్ళి మోహం కడుక్కో చూడు మోహం అంతా ఏడ్చి ఏడ్చి పిక్కుపోయింది …… !! అని భూమి ను అక్కడి నుంచి బలవంతంగా ఫేస్ వాష్ కోసం పంపించేస్తుంది ….. !! భూమి వెళ్ళాక రేణుక తో అది క్లీన్ చేయమని చెప్పి ఈ సమస్యకి పరిష్కారం అనేది లేదా అని ఆలోచిస్తున్న తనకు చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూస్తుంది …… !!
కార్తికేయ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు ఎంటి ?? అని మొబైల్ ను సైలెంట్ లో పెట్టి ఎవరూ చూడకుండా గార్డెన్ చివరకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి హలో కార్తికేయ అని మెల్లగా మాట్లాడుతుంది ….. !!
హలో అత్తయ్య ఏలా ఉన్నారు డిస్ట్రబ్ చేసానా ???
బానే ఉన్నాను కార్తికేయ ….. !! నువ్వెలా ఉన్నావ్ ?? అలాంటిదేం లేదు నేను ఫ్రీగానే ఉన్నాను …… !! అమ్మా, చెల్లి ఎలా ఉన్నారు….. ??
ఎవరం బాలేం అత్తయ్యా ముక్యంగా నేను అయితే అసలు బాగోలేను అత్తయ్య …… !! నా ఇంటి మహాలక్ష్మి ను తీసుకుని వెళ్లి మీ ఇంటి పనిమనిషి ను చేసారు …… !! తనతో అన్ని పనులు చేయించడమే కాకుండా తనను కొట్టి హింసిస్తున్నారు …… !! నా చిట్టి తల్లీ అలా అక్కడ అంత బాధ పడుతూ ఉంటే ఇక్కడ నేనెలా సంతోషంగా ఉండగలను మీరే చెప్పండి….. !!
నీ బాధ నాకు తెలుస్తుంది కార్తికేయ ….. !! కానీ నేను ఈ విషయం లో ఎమ్ చేయలేక పోతున్నాను ఎందుకంటే నేను భూమి కి ఎంత చెప్పినా వినడం లేదు …… !! ఎంత కష్టం అయినా ఇక్కడే ఉండి అనుభవిస్తాను కానీ ఇక్కడి నుండి వీళ్ళను …… !! ఇక్కడున్న అందరినీ మార్చి కానీ వెళ్ళను అని మొండి పట్టు వదలకుండా కూర్చుంది …….. !! నువ్వైనా భూమి కి నచ్చ చెప్పి ఇక్కడి నుంచి తీసుకు వెల్లు కార్తికేయ ……. !! భూమి ను ఇలా నేను చూడలేక పోతున్నాను …… !!
నేను చెప్పినా కూడా భూమి వినడం లేదు అత్తయ్య …… !! ఆ ఇంట్లో భూమి ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా తను వేసిన ఒట్టు వల్ల తనను బలవంతం చేయలేక అక్కడి నుండి వచ్చేసాను …… !! అంటే కారణం మీరున్నారు అని ధైర్యం …… !! తను చాలా అమాయకురాలు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా & కొద్ది రోజులు తనను జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య ……. !! ఈ లోపు భూమి మనసు ఎలా అయినా మార్చి అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతాను …… !!
నువ్వు అంతగా చెప్పాలా కార్తికేయ భూమి కూడా నా మనవరాలే ….. !! అలాంటిది తనను అశ్రద్ద చేస్తానా ?? నువ్వు భూమి గురించి దిగులు పడకుండా భూమి ను ఇక్కడ నుండి ఎలా తీసుకు వెళ్ళాలో ఆలోచించు …… !! నేను భూమి ను జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా!!
ఆలాగే అత్తయ్య చాలా థాంక్స్ ఇప్పుడు నా మనసుకు కొంచెం ప్రశాంతంగా ఉంది….. !! ఇంతకీ భూమి ఎలా ఉంది ?? ఇంకా ఏడుస్తుందా అత్తయ్య…… !! మార్నింగ్ నుండి ఏమైనా తిందా లేదా ?? తనకు ఆకలి వేసినా ఎవర్ని నోరు తెరిచి అడగదు కొంచెం మీరే తనను కనిపెట్టుకుని ఉండాలి …… !!
భూమి బానే ఉంది కార్తికేయ కాకపోతే నిన్ను బాధ పెట్టి ఇక్కడి నుండి పంపించేసింది అని డల్ గా ఉంది ….. !! తనకు దగ్గరుండి నేనే తినిపించాను నువ్వు వర్రీ అవ్వకు కార్తికేయ తను నీ దగ్గరకు వచ్చేదాక భూమి బాధ్యత నాది ….. !!
చాలా చాలా థాంక్స్ అత్తయ్య ఆ ఇంట్లో నాకు నచ్చిన నమ్మకం ఉన్న పర్సన్ మీరొక్కరే ….. !! అందుకే నా ప్రాణానికి ప్రాణమైన భూమి బాధ్యత మీ మీద పెడుతున్నా …… !! జాగ్రత్త అత్తయ్య అంటూ కాల్ కట్ చేసిన కార్తికేయ ను తలచుకుంటూ బాధగా అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటుంది దేవయాని…… !! నన్ను క్షమించు కార్తికేయ భూమి ను నందన పెడుతున్న టార్చర్ గురించి నీకు తెలిస్తే వెనుక ముందు చూడకుండా నందన ప్రాణం తీస్తావ్ …… !! అందుకే భూమి బావుందని అబద్దం చెప్పాను అని భారంగా నిట్టూర్చి కూతురి బిహేవియర్ కి బాధ పడుతూ ఒంటరిగా గార్డెన్ లోనే మిగిలిపోతుంది …….. !!
🫧💦🫧💦🫧💦🫧💦🫧💦🫧
డిన్నర్ టైమ్ అవ్వడంతో నందన చెప్పిన డిషెస్ అన్ని రేణుక మరియు కుక్ హెల్ప్ తో భూమి నే వాల్ల ఇద్దరి పర్యవేక్షణలో కుక్ చేసి వాళ్ళు వచ్చే టైమ్ కి అన్ని టేబుల్ మీద సర్దుతుంది …… !! ఇంట్లో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ప్లేట్స్ నీట్ గా పెడుతూ రేణుక తో అందరినీ డైనర్ కి పిలవమని చెప్పి అన్నీ నీట్ గా సెట్ చేస్తూ వుంటుంది ……. !! అందరు డిన్నర్ చేయడానికి వచ్చి కూర్చోగానే నందన చెప్పకుండానే భూమి నే తన బాధను మనసులోనే దాచేసి మొహాన్ని నార్మల్ గా పెట్టుకుని దగ్గరుండి అందరికి వాళ్ళు అడిగింది సర్వ్ చేస్తుంది …… !!
నందన కావాలనే భూమి తో ఎక్స్ట్రా డిషెస్ కుక్ చేయించి భూమి కి మరింత వర్క్ ఎక్కువ ఇవ్వడం తో భూమి మొహం అప్పటికే వాడిపోతుంది…… !! అసలే తెల్లగా ఉంటుంది అందుకే బాగా టైడ్ అవ్వడం తో భూమి మొహం ఎర్రగా కందిపోయి కనిపిస్తుంది…… !! మహాన్ వాటర్ తాగుతూ కర్రీ వేస్తున్న భూమి చెతి వైపు చూసిన తనకు మార్నింగ్ తను చేసిన గాయం కి ఇందాక కాలిపోతున్న చీరలను మంట ఆర్పడానికి చెయ్ పెట్టడం తో ఆ గాయం మరింత పెద్దదై స్కిన్ మొత్తం రెడ్ అయి కందిపోయి కనిపిస్తుంది …… !!
అంత గాయం అయినా నొప్పి ని ఓర్చుకుంటూ అందరికీ డైనర్ వడ్డిస్తున్న భూమి వైపు ఓ సారి చూసి తన డిన్నర్ తను తింటూ నందన, విజయేంద్ర ప్రసాద్ గారి తో బిజినెస్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాడు…… !! తింటున్నంత సేపు భూమి వైపు కన్నెత్తి కూడా చూడకుండా డిన్నర్ పూర్తి చేసి నందన కు గుడ్ నైట్ చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్ కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు …… !!
విజయేంద్ర ప్రసాద్ కూడా తన డిన్నర్ పూర్తి అవ్వగానే అందరికి గుడ్ నైట్ చెప్పి ఆయన రూమ్ కి ఆయన వెళ్ళిపోతాడు …… !! మిగిలిన ముగ్గురి డిన్నెర్ కూడా అయ్యాక వాళ్ళు తిన్న ప్లేట్స్ తీసి సింక్ లో తనే వేస్తుంది…… !! డిషెస్ క్లీన్ చేయడానికి చీర కొంగును నడుముకు దోపుకుంటున్న భూమి చెయ్ పట్టుకుని అక్కడ చేతులు అంతలా కాలిపోయి కందిపోయి కనిపిస్తూ ఉంటే డిషెస్ ఎలా క్లీన్ చేయాలి అనుకుంటున్నావ్ భూమి…… !! నేనున్నా కదా అవన్నీ నేను చూసుకుంటాను ఆఫ్టర్ నూన్ కూడా నువ్వు తినలేదు అంటూ రేణుక భూమి ను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వచ్చి కూర్చోబెట్టి బలవంతంగా డిన్నర్ వడ్డిస్తూ ఉంటుంది …… !!
హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడికీ వచ్చిన శ్లోక భూమి ను డైనింగ్ టేబుల్ మీద కూర్చోడం చూసి కోపంగా చేతిలోని క్లాత్ విసిరేసి …… !! హేయ్ ఎంటి ఇంటి కోడళ్ళ టేబుల్ మీద కూర్చుని తింటున్నావ్ అంటూ నోట్లోకి ముద్ద పెట్టుకుంటున్న భూమి చేతిని నెట్టేయడం తో అది కాస్త నేల మీద పడుతుంది ….. !!