నీ ఊపిరి సాక్షిగా ❣️ – 5

ఎందుకమ్మా వదిన అన్నయ్య కి తన పిల్లల్ని దూరం చేసి వాళ్ళు కూడా అన్నయ్య ను శత్రువులా చూస్తుంటే కామ్ గా ఉంటూ వాళ్ళను మరింత రెచ్చగొడుతుంది అంటూ బాధగా అడుగుతుంది మానస……. !!

నందన ఎమ్ చెప్పిందో తెలియదు కానీ పిల్లలు కూడా కార్తికేయ మీద ద్వేషాన్ని పెంచుకున్నారు…….  కలిసి మెలిసి సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు ఇలా పగలు ప్రతీకారంతో బ్రతుకుతున్నారు ……. కార్తికేయ మీదున్న కోపాన్ని భూమి మీద చూపిస్తూ పాపం దాన్ని ఎంత బాధ పెడుతున్నారో ఎంటో అసలే అది అమాయకురాలు మహాన్ మేక వన్నె పులి అని తెలియక గుడ్డిగా నమ్మి సింహం బోనులో కి వెళ్ళింది !! అని భూమి ను తలచుకుని భాధ పడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటారు….. !!

మహాన్ భూమి ను పెళ్ళి చేసుకున్నాడు అని రాజ్ కి తెలిస్తే ఇంకెంత పెద్ద గొడవ అవుతుందో అని నాకు చాలా భయంగా ఉందమ్మా !! అన్నయ్య మనకు చెప్పలేదు కానీ అక్కడ పెద్ద గొడవే జరిగి ఉంటుంది …… అదే రాజ్ వెల్తే వీడికి ఉన్న ఆవేశం తో అక్కడ ఎమ్ జరుగుతుందో అని నాకు కాళ్ళు చేతులు ఆడ్డం లేదు …… !!

ఈ విషయం లో నాకు అంతే భయంగా ఉంది మను…… సి. ఏమ్ సెక్యురిటి కోసం వెళ్ళిన రాజ్ ఈరోజు కాకపోయినా రేపైన వస్తాడు !! వాడికి ఈ విషయం తెలిస్తే అంత సులువుగా తీసుకోడు……. !! వాడ్ని ఆపడం మన వల్ల కాదు ఇక కార్తికేయ కూడా ఇందులో అడ్డు చెప్పడు ….. !!

 

నువ్వు కూడా చూసావు కదా భూమి గురించి బాధ పడుతు వాడు టిఫిన్ కూడా చేయలేదు…….. ఈ విషయం లో వాళ్ళు ఇద్దరు ఓకే పార్టీ !! ఎమ్ జరుగుతుందో ఎంటో ?? ఈ గొడవలు ఎపుడు సర్దు మనుగుతాయా అని చూస్తూంటే అవి ఈ పెళ్లితో ఇంకా పెద్దగా అయ్యాయి అంటూ తల పట్టుకుంటుంది అనసూయ…… !!

నిజమే అమ్మా నేను ఈ ఇంటికి రాకపోయి ఉంటే అన్నయ్య నందన వదిన తో & తన పిల్లలతో సంతోషంగా ఉండేవాడు ……. నా వల్లే కదా వాళ్ళు విడిపోయింది అని అనసూయను హత్తుకుని ఏడుస్తూ వాళ్ళని విడదీసినందుకే అనుకుంటా అమ్మా!! ఆ దేవుడు నా కూతురికి ఇలాంటి రాత రాశాడు అని ఏడుస్తూ ఉంటే అనసూయ మానస ను ఓదారుస్తూ ఉంటుంది……

కార్తికేయ కార్ నందన కంపెనీ దగ్గర ఆగడం తో కార్ డోర్ ఓపెన్ చేసుకుని కిందకు దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు కార్తికేయ కార్ డ్రైవర్…… ఓపెన్ అయిన డోర్ నుండి దిగిన కార్తికేయ సింహం లాంటి నడకతో చూపుల్లో పదును & నడకలో రాయల్టీ మెయిన్ టెయిన్ చేస్తూ నందన కంపెనీస్ లోకి ఎంటర్ అవుతాడు ……… !!

 

రిసెప్షనిస్ట్ కార్తికేయ రావటం చూసి వెంటనే నందన ఛాంబర్ కి కాల్ చేసి కార్తికేయ వచ్చిన విషయం చెప్తంది…… అది ముందే గెస్ చేసిన నందన నవ్వుతూ డోంట్ స్టాప్ హిమ్ అని కాల్ కట్ చేసి లాపీ లో మద్యలో ఆపిన వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది ……. !!

ఫోర్స్ గా ఓపెన్ అయిన తన క్యాబిన్ డోర్ వైపు కళ్లు పైకెత్తి చూసిన నందన కి ఆవేశంగా వస్తూ కనిపిస్తాడు కార్తికేయ …… తనను చూసి కాలు మీద కాలేసుకుని వావ్ కార్తికేయ నువ్వా!!! వాట్ ఎ ప్లేసెంట్ సర్ప్రైజ్ నువ్వేంటి ఇలా??? ఓహ్ నీ మేనకోడలి గురించి రిక్వెస్ట్ చేయడానికి వచ్చావా అని నవ్వుతూ చైర్ ను రౌండ్ గా తిప్పుతూ అడుగుతుంది ……. !!

కాదు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అని టేబుల్ మీద రెండు చేతులు అదిమి పెట్టి మర్యాదగా నా చిట్టి తల్లి ను నా ఇంటికి పంపించు లేకపోతే…..?? నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను & గుర్తు పెట్టుకో నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాను ……. అని నీకు బాగా తెలుసు సో !! నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే రేపు ఉదయం నేను కళ్లు తెరిచే సరికి నా చిట్టి తల్లి నా ఇంట్లో ఉండాలి ……. లేకపోతె చెప్పాను కదా థింక్ అబౌట్ ఇట్ !! అని తను చెప్పాల్సింది చెప్పి వెళ్ళడానికి వెనుతిరుగుతాడు …… !!

నందన చిటికె వేయడం తో ఆగి వెనక్కీ తిరుగుతాడు కార్తికేయ……. నందన పైకీ లేచి నిల్చొని టేబుల్ కి అనుకుని కరెక్ట్ యువర్ వర్డ్స్ మిస్టర్ కార్తికేయ మిశ్ర తను నీ ఇంటికి బంగారు తల్లి / చిట్టి తల్లీ / గారాల పట్టి వాట్ ఎవర్ ఏదైనా అయ్యుండచ్చు ……. బట్ ఇప్పుడు అది నా ఇంట్లో ఉంది …… అంతే కాదు అది నా ఇంటి పనిమనిషి …… నా పనిమనిషి నీతో వస్తాను అంటే తప్పకుండా తీసుకు వెల్లు నేనేం అడ్డుకోను ……. అంతే కానీ నాకే వార్నింగ్ ఇవ్వాలి అనీ చూస్తే మాత్రం రిజల్ట్ నీ మేనకోడలి వంటి మీద వాతల రూపం లో ఉంటుంది మైండ్ ఇట్…..!!

కార్తికేయ సింహం పంజా  పిడికిలి లో నెక్స్ట్ మినిట్ నందన గొంతు చిక్కుకుని కాసేపు ఊపిరి ఆడకుండా చేస్తుంది…… నా బంగారు తల్లి మీద చెయ్యి పడిందో నిన్ను చంపకుండా వదిలి పెట్టను అని మరింత గట్టిగా వత్తిడి పెడుతూ నందన వైపు చిరుత కళ్ళతో కోపంగా చూస్తాడు ….. !!

నందన తన రెండు చేతులతో తన బలం మొత్తం ఉపయోగించి కార్తికేయ నుండి తన గొంతు విడిపించుకుని …… !! బలంగా ఊపిరి పీల్చుకుని తన వైపు కోపంగా చూస్తు నన్ను నువ్వు కొత్తగా చంపడానికి ఏముంది!! ఎప్పుడైతే నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా కంటే నీ కడుపున పుట్టిన మన పిల్లల కంటే నీ చెల్లి తన పిల్లలే ముఖ్యం అని చెప్పావో ……. !! అపుడే ఆ క్షణమే నన్ను చంపేశావ్ నీ మీదున్న ప్రేమతో సహా అని కోపంగా కార్తికేయ వైపు చూస్తూ ఇప్పుడు నీ ముందున్నది మిసెస్ నందన కార్తికేయ కాదు నందన వర్మ ….. !!

నీ బెదిరింపులకు బెదిరిపోయి బయపడ్డానికి ఇక్కడెవరు చేతకాని దద్దమ్మలు లేరు అది వస్తాను అంటే దాన్ని నిక్షేపంగా తీసుకుపో ……. !! నేను ఆపను అంతే కానీ నేనేదో నీ మేనకోడలిని బెదిరించి ఆపుతున్నట్టు మాట్లాడకు …… !!

యస్ మీరు బెదిరించే భూమి ను నాతో రాకుండా ఆపారు …… నువ్వు నీ కొడుకు కలసి నా కోడలిని టార్చర్ చేయడానికే అడ్డుకుంటున్నారు తప్ప తన మీద ప్రేమతో కాదు …. !!

హహ ప్రేమ?? అని నవ్వుతూ ..!!! ప్రేమ!! ఈ పదం విని చాలా సంత్సరాలు అవుతుంది…….. నీకు ఆ ప్రేమ గురించి తెలిస్తే నన్ను ఇలా వంటరిగా వదిలేయవ్ కార్తికేయ!! అని కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా కోపంగా కార్తికేయ కాలర్ పట్టుకుని నిన్ను ఎంతలా ప్రేమించాను హా !! నువ్వంటే నాకు పిచ్చి నీ కోసం ఎమ్ చేయడానికి అయినా రెడీగా ఉంటాను…….. అలాంటి నన్ను కాదని నీ చెల్లి కోసం నన్ను వదిలేసావ్ ఎలా మర్చిపోమంటావ్ ?? నీకు నీ చెల్లే ముక్యమైనపుడు నన్ను ఎందుకు పెళ్ళి చేసుకుని నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకునేలా చేశావ్ …… ??

కార్తికేయ విసురుగా నందన చేతుల్లో నుండి తన కాలర్ విడిపించుకుని చస్తాను అని బెదిరించి మా అమ్మ ను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంది నువ్వు !! నేనేం నీ మీద ప్రేమ పెంచుకుని నిన్ను పెళ్ళి చేసుకోలేదు ……. నువ్వే నన్ను ప్రేమించి నీ ప్రేమ కదన్నానని మా అమ్మ ను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకునేలా చేశావ్……. !! గతాన్ని నువ్వు మర్చిపోయినా నేను ఏదీ మర్చిపోలేదు……. !!

పెళ్లి జరినప్పటి నుండి నన్ను  ప్రశాంతంగా ఉండనిచ్చావా ?? ఎప్పుడూ చూడు నన్ను మీ ఇంటికి ఇల్లరికం తీసుకు వెళ్లడానికి ట్రై చేశావ్ ….. !! నీతో కలిసున్న 6 ఇయర్స్ లో నేను నీతో సంతోషంగా ఉన్న రోజులు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు……. !! నీకు ఉన్న పోగరు తో మా అమ్మ ను ఏ ఒక్క రోజైనా గౌరవించావా ??

 

భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో పసిబిడ్డ ను తీసుకుని కడుపులో మరో ప్రాణాన్ని మోస్తూ వచ్చిన ఆడ పడుచును అక్కున చేర్చుకోవాల్సింది పోయి అనరాని మాటలు అని దాన్ని మరింత బాధ పెట్టి ఇంట్లో నుండి వెళ్లేలా చేశావ్ ?? అంటూ ఆవేశంగా నందన వైపు గట్టిగా అరిచి టేబుల్ ను చేత్తో కొట్టగానే అది గల్లున శబ్దం చేస్తూ పగిలి ఆ గ్లాస్ పీసెస్ గుచ్చుకుని కార్తికేయ చేతికి రక్తం దారాలంగా కారుతుంది ……. !!

నిన్ను నా చెల్లి విషయం లో క్షమించడానికి కారణం మా అమ్మ, మను కానీ ఇప్పుడు నా మీద కోపాన్ని భూమి మీద చూపిస్తే మాత్రం అంటూ కోపంగా చూస్తు విసురుగా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళిపోతాడు ……. కార్తికేయ వెళ్ళగానే ఆఆ!! ఐ హేట్ యూ కార్తికేయ యూ డిడ్న్ట్ చేంజ్ నీకు నా కంటే వాళ్ళే ఇంపార్టెంట్ అని అరుస్తూ రూమ్ లో వస్తువులు అన్ని పగల కొట్టేసి ……… నేను ఎంత బాధ అనుభవించానో నిన్ను అంతకు మించిన బాధ అనుభవించేలా చేయకపోతే అప్పుడు అడుగు ప్రేమించిన మనిషికి దురాం అయి నేను ఎంత నరకం అనుభవించానో ఆ భూమి కి తెలిసేలా చేస్తాను అని కోపంగా అనుకుంటూ భూమి మీద మరింత కోపం పెంచుకుంటుంది……

మహాన్ రూమ్ లోనే ఏడుస్తూ కూర్చున్న భూమి బుజం మీద చెయ్ పడ్డం తో భూమి ఉలిక్కిపడి పైకి లేచి ఎదురుగా ఉన్న దేవయాని ను చూసి షాక్ తో బిగుసుకుపోతుంది …… !! ఎమ్ కావాలి నానమ్మ అని భయంగా అడుగుతున్న భూమి ను చూసిన దేవయాని వణుకుతున్న భూమి చేతులను చూసి వాటిని పట్టుకుంటూ ఎందుకమ్మా అంత భయపడుతున్నావ్ ?? నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు & నన్ను చూసి అలా భయపడకు నాకు చాలా బాధగా ఉంది ……. !! నాకు శ్లోక ఎంతో నువ్వు కూడా అంతే అని అభిమానంగా భూమి తల నిమురుతూ చెప్తుంది ….. !!

భూమి దేవయాని వైపు అశ్చర్యంగా చూస్తూ అంటే మీరు నన్ను కొ..ట్టా…రా నానమ్మ నిజంగా నేనంటే మీకు కోపం లేదా అని అమాయకంగా అడుగుతుంది …….

భూమి మోహం లో కనిపిస్తున్న అమాయకత్వాన్ని చూస్తూ చెప్పాను కదా బంగారం నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదని ఇప్పుడైనా భయపడ్డం ఆపు అంటూ భూమి ను దగ్గరకు తీసుకుంటుంది….. !!

మరీ నేను మహాన్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లొకి వచ్చాక ఎందుకు నానమ్మ నేనంటే ఇష్టం లేనట్టు మాట్లాడావ్??  అత్తయ్య !! నన్ను తిడుతున్నా నువ్వు ఆపలేదు ఎందుకు అని వెక్కుతూ అడుగుతుంది …… !!

భూమి ముందు నువ్వు ఈ ఏడుపు ఆపు అని సున్నితంగా తన కన్నీళ్ళు తుడిచి ఇలా రా అంటూ తనను తన రూమ్ ( దేవయాని రూమ్) లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద ఉన్న కవర్ లో నుండి శారీ తీసి ఇవి నీ కోసమే తెప్పించాను….. !! వెళ్ళి ఫ్రెష్ అయి శారీ కట్టుకుని రా !! చూడు మోహం అంతా జిడ్డుగా ఉంది …… వెళ్ళి హెడ్ బాత్ చెయ్ అన్ని వాష్ రూమ్లో లోనే ఉన్నాయి …… అని భూమి వద్దు అంటున్నా బలవంతంగా తనను వాష్ రూమ్లో కి పంపిస్తుంది ….. !!

భూమి అయిష్టంగానే స్నానం చేసి చీర కట్టుకోవాలి అని శారీ ను చేతిలోకి తీసుకుంటుంది …….. కానీ తనకు శారీ కట్టుకోవడం రాదు అని గుర్తు తెచ్చుకుంటూ తల కొట్టుకుని ఇన్నర్ మీద బ్లౌస్ వేసుకుని హెయిర్ కి టవల్ చుట్టుకుని లంగా & బ్లౌజ్ మీద చీర చుట్టుకుని వాష్ రూమ్లో నుండి బయటకు వస్తుంది ….. !!

భూమి కోసమే వెయిట్ చేస్తూ బెడ్ మీద కూర్చున్న దేవయాని భూమి ను అలా చూసి చీర కట్టుకోమని చెప్పా చుట్టుకోమని కాదు భూమి అని నవ్వగానే భూమి తల వంచుకుని సారి నానమ్మ నాకు చీర కట్టుకోవడం రాదు …….. ప్లీస్ కాస్త హెల్ప్ హెల్ప్ చేయరా !!

మరి ఇందాక కట్టుకున్న చీర ఎలా కట్టుకున్నావ్ భూమి??

అది నేను కట్టుకోలేదు రేణుక అక్క కట్టింది ……. చూడు నాకు శారీ కట్టుకోవడం రావట్లేదు అని దేవయాని ముందే కట్టుకోవడానికి ట్రై చేసి అది అవ్వక ఏడుపు మొహం పెట్టుకుంటుంది….. !!

హహ అదేం పెద్ద కష్టం కాదు తల్లీ ఆగు నేను నేర్పిస్తాను అని తనే భూమి వంటి మీద నుండి శారీ తీసుకొని నీట్ గా భూమి కి వన్ ప్లీట్ శారీ కట్టి పిన్ పెడుతూ బ్లౌస్ కి ఉన్న లేస్ కట్టి అరే రెడీమేడ్ బ్లౌస్ అయినా నీకు కరెక్ట్ గా సెట్ అయ్యింది……  ఎంత బావున్నావో తెలుసా భూమి నా దిష్టే తగిలేలా ఉంది అని భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటిన ముద్దు పెడుతూ ఇవి నీ కోసం అని డైమండ్ ఇయర్ రింగ్స్ & బాంగిల్స్ కూడా ప్రేమగా వేసి భూమి వైపు అపురూపంగా చూస్తుంది …… !!

అయ్యో !! నానమ్మ ఇపుడు నాకు ఇవన్నీ ఎందుకు??  నాకు ఇలా ఉండడం ఇష్టం లేదు & నాకు సింపుల్ గా ఉండడమే ఇష్టం ……. ఇలా నన్ను చూస్తే అత్తయ్య కోప్పడతారు ప్లీస్ నానమ్మ ఇవేం వద్దు అని గాజులు తీయబోతుంది …… !!

అలా ఎమ్ అనదు ఒకవేళ నందు ఏమైనా అంటే నేను చెప్తాను కానీ నువ్వు సైలెంట్ గా ఉండు ……. అని హెయిర్ ను బాగా తుడిచి ఆరాక చిక్కు ముడులు తీసి నీట్ గా దువ్వి మొహాన చిన్న బింది అంటించి కుంకుమ పాపిట పెడుతూ నా దిస్టే తగిలేలా ఉంది భూమి…….  నిజంగా నీకు ఎటువంటి మేక్ ఆప్ అవసరం లేదు శ్లోక మేక్ ఆప్ వేసుకున్నా నీ అంతా ఆందంగా ఉండదు అని మెటికలు విరిచి భూమి ను ఓ సారి కళ్ళ నిండా చూసుకుంటుంది ……

బ్లాక్ కలర్ సారి విత్ విత్ వైట్ మిర్రర్ వర్క్ డిజైన్ బ్లౌస్ లో అప్సరస లా ఉన్న భూమి ను మురిపెంగా చూసుకుని కాటుక తీసి చెవి వెనుక పెడుతూ బంగారు బొమ్మ లా ఉన్నావ్ …… !! సరే పదా ఫస్ట్ టిఫిన్ తిను నిన్ను వదిలేస్తే ఇలానే ఏడుస్తూ కూర్చుంటావ్ అని భూమి ను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకు వెళ్లి తనే భూమి ప్లేట్ లోకి స్వయంగా వడ్డించి పక్కనే కూర్చుని తిను తల్లీ అంటూ ఆప్యాయంగా అడుగుతుంది …… !!

దేవయాని ను చూస్తు ఉంటే తనకు అనసూయ గుర్తొస్తుంది అనసూయ కూడా తనను ఇలాగే చూసుకుంటూ వుండేది ……. !! అనసూయ గుర్తు రాగానే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అవి దేవయాని కు కనిపించకుండా తుడుచుకుని పోంగల్ తినాలి అనుకుంటుంది కానీ ముట్టుకోగానే అమ్మ !! అని ఆరిచి తన అరచేతిని చూసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది …….. !!

అయ్యో ఏమైంది భూమి ?? అని దేవయాని అరచేతిని పట్టుకుని చూడగా మహాన్ చేసిన పనికి భూమి చెయ్ ఎర్రగా కందిపోయి చుట్టూ బొబ్బ వచ్చి కనిపిస్తుంది ……. భూమి ఎంటి ఈ గాయం అసలు ఎలా తగిలింది ?? అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి అయింట్మెంట్ అప్లై చేసి బ్యాండేజ్  వేస్తూ అడుగుతుంది …….. !!

మహాన్ చెయ్ కాల్చాడు అని చెప్పలేక మౌనంగా ఉండిపోయిన భూమి ను చూసి ఏమైంది అంటుంటే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటావేంటి భూమి ఏమైంది ఈ గాయం ఎలా అయింది ….. ??

అటుగా వచ్చిన రేణుక దేవయాని మాటలు విని అమ్మగారు అదీ ఇందాక భూమి అమ్మాయి గారి మావయ్య వచ్చి వెళ్ళాక మహాన్ బాబు కోపంగా అమ్మాయి గారి చెయ్యి కాల్చారు…… !! ఆ విషయం మీకు చెప్పలేక అమ్మాయి గారు మౌనంగా ఉన్నారు ……. ఈ విషయమే నందన అమ్మ కి చెప్తే శ్లోక అమ్మాయి గారు నన్ను కొట్టి ఇక్కడి నుండి వెళ్ళమన్నారు ……. మీకు చెప్దామని అనుకుంటే అప్పుడు మీరు రూమ్ లో వున్నారు అని చెప్పి గార్డెన్ లోకి వెళ్తుంది రేణుక ……. !!

దేవయాని బాధగా భూమి వైపు చూస్తూ ఇంత గాయం అయినా ఎలా వంట చేసి వడ్డించావ్ భూమి నొప్పిగా ఉందా!! అని భూమి ను గుండెలకు హత్తుకుని బాధగా చూస్తూ అడుగుతుంది ……. !!

పర్లేదు నానమ్మ చిన్న దెబ్బే కదా నొప్పేం లేదు నువ్వు ఫీల్ అవ్వకు అని దేవయాని నుండి దూరం జరిగి తినడానికి ప్లేట్ తీసుకోబోతుంది కానీ దేవయాని అడ్డుకుని ఆగు నేను తినిపిస్తా అని ప్రేమగా భూమి కి కడుపు నిండా తినిపించి…….. తను సోఫా లో కూర్చొని భూమి ను వొళ్ళో పడుకోబెట్టుకొని జో కొడుతూ భూమి నిన్నోటి అడుగుతాను చేస్తావా ?? అని భూమి తల నిమురుతూ మెల్లిగా అడుగుతుంది …… !!

ఇక్కడ నన్ను మనిషిలా చూసి ప్రేమగా చూసుకుంటుంది నువ్వే నానమ్మ అలాంటిది నువ్వు అడిగితే చేయకుండా ఉంటానా చెప్పు ఎమ్ చేయాలి …….. ??

ఈ ఇంటి నుండి వెళ్ళిపో భూమి అనగానే భూమి షాక్ అయ్యి పైకి లేచి కూర్చుంటుంది …… !!

దేవయాని ఎందుకలా అంది….. ?? భూమి ఎమ్ ఆన్సర్ ఇవ్వనుంది….. ?? నందన భూమి ను ఏం చేయబోతుంది….. ??

 

 

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply