నీ ఊపిరి సాక్షిగా ❣️-42

శ్లోక  ఇక్కడ కూడా లేదేంటి అబ్బా ఇది ఒక్క చోట ఉండదు కదా బొంగరం లా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది…… !! ఇప్పుడు శ్లోక ను ఇంత పెద్ద టెంపుల్ లో నేను ఎక్కడని వెతకాలి అంటూ …… !!  కాసేపు అటు ఇటు వెతికి శ్లోక కనిపించకపోయేసరికి నీరసంగా ఒక చోట కూర్చుంటాడు…… !! మహాన్ శ్లోక కనిపించిందా అని అక్కడికి వచ్చిన భూమి వైపు చూస్తూ నేను టెంపుల్ కి నిన్ను, శ్లోక ను వెతకడానికే వచ్చినట్టు ఉన్నాను….. !! నాకేంటి ఈ టెన్షన్ ఛా అని అసహనంగా పైకి లేస్తూ నువ్వు అటు వైపు వెళ్ళి వెతుకు…… !!  నేను ఇటు వైపు వెళ్ళి వెతుకుతాను అని శ్లోక మొబైల్ కి కాల్స్ ట్రై చేస్తూ మహాన్ & భూమి చెరో వైపు వెతుకుతూ ఉంటారు….. !!

తన చేతిలోని మొబైల్ రింగ్ అవ్వగానే మొబైల్ వైపు చూస్తూ…… !! అన్నయ్య కాల్ చేస్తున్నాడు వదులు రాజ్ ఐ హావ్ టు గో అంటూ విసుగ్గా అడుగుతుంది శ్లోక…… !! వెల్దువ్ లే కానీ ఎంటే మేము మాట్లాడుకుంటూ ఉంటే చాటుగా నుంచుని కుక్క లా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నావ్……. ??  అంటూ శ్లోక ను గోడకు అదిమి శ్లోక ఊపిరి తగిలేంత దగ్గరగా నుంచుని తను ఎటు కదలకుండా చేతులతో లాక్ చేస్తాడు రాజ్….. !!

తనను కుక్క అన్నందుకు రాజ్ వైపు సీరియస్ గా చూస్తూ….. !! ఏయ్ కుక్క నక్క అంటే బాగోదు చెప్తున్నా అయినా నేనేం నీకు సైట్ కొట్టడానికి రాలేదు మా అన్నయ్య కోసం వచ్చాను…… !! సైట్ కొట్టినా తప్పులేదు లే శ్లోక ఎలాగో నేను నీకు బావ నే అవుతాను కదా ….. !! అంటూ స్మూతీ వాయిస్ తో చిరు నవ్వుతో చెప్తున్న రాజ్ వైపు విచిత్రంగా టాప్ టు బాటమ్ చూస్తూ….. !! ఏంట్రా నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడుతున్నావా ఇది కళా నిజమా 🙄😳 …….. ??

ఎమ్ మాట్లాడకూడదా అంటూ తన తలను డీ కొట్టి ఇప్పటి వరకూ మన మధ్య జరిగింది మర్చిపోయి లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రెష్ రిలేషన్ అంటూ…..!! నవ్వుతూ చెప్తున్న రాజ్ ను కోపంగా దూరంగా నెడుతూ ఏంట్రా వేషాలా…… ?? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి హా నువ్వు అన్నీ మర్చిపోదాం అనగానే బావా తీసుకోవా పాల కోవా అని నవ్వుతూ అడుగుతాను అనుకున్నావా …… ?? శ్లోక రా ఇక్కడ నువ్వేదో ప్లాన్ లో వచ్చావ్ అని నాకు బాగా అర్థం అవుతుంది బట్ శ్లోక ఎవరికి పడదు…… !! వెళ్ళి ఎవర్నైనా ట్రై చేసుకో పో నీ మీద ఉన్న కోపం, ద్వేషం మర్చిపోయే ఛాన్స్ లేదు…… !! నన్ను ఎంతలా అవమానించావో దానికి డబుల్ రివేంజ్ తీర్చుకుంటాను జస్ట్ వెయిట్ & వాచ్ అని యాటిట్యూడ్ గా చెప్పి వెళ్ళిపోతుంది శ్లోక….. !!

శ్లోక వెళ్లగానే అప్పటి వరకు నవ్వుతున్న రాజ్ మొహం ఒక్కసారిగా కోపంగా మారుతుంది….. !! నాకు తెలుసే నువ్వు పెద్ద కంచు వని ఒక్క సీన్ కే నాకు పడవని నాకు తెలుసు…… !! కానీ చూస్తూ ఉండు నిన్ను ఎలాగోలా పడేసి నీ అన్న ను నా కాళ్ళ దగ్గరకు రప్పించుకుని నీ మీద కోపం & నీ అన్న గాడి మీద పగ రెండు తీర్చుకుంటాను ….. !! వన్ షాట్ టూ బర్డ్స్ ఇప్పుడు ఎంతలా ఎగురుతావో ఎగురు వన్స్ నేను అనుకున్నది నెరవేరాకా నీ రెక్కలు విరిచేస్తాను అని కోపంగా అనుకుంటూ కార్తికేయ కాల్ లిఫ్ట్ చేస్తాడు…… !!

💫💫💫💫💫💫💫💫💫

శ్లోక ను వెతుకుతున్న మహాన్ కి శ్లోక ఎదురుగా వస్తూ కనిపిస్తుంది….. !! యూ అంటూ శ్లోక వైపు కోపంగా వస్తూ ఎటు వెళ్ళావ్ శ్లోక నీ కోసం ఎక్కడని వెతకాలి నేను….. !! కాల్ చేస్తున్నా పిక్ చేయవు ఎక్కడికి వెళ్ళావ్ నువ్వు…… ?? నీ కోసం నేను భూమి అరగంట నుండి వెతుకుతున్నాం తెలుసా…… !!

నా కోసం వెతుకుతున్నట్టు యాక్ట్ చేస్తూ దానితో బాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటావ్….. !! అది కవర్ చేసుకోవడానికి నన్ను అడ్డు పెట్టుకుంటున్నావ్ …… !! ఎమ్ యాక్ట్ చేస్తున్నావ్ అన్నయ్య ఆ భూమి కోసం నన్ను మామ్ ను చీటింగ్ చేయడానికి కూడా రెడీ అయిపోయావ్…… ??

అడుగుతుంటే నా వైపు చూస్తావు ఏంటి శ్లోక ఎక్కడికి వెళ్ళావ్….. ?? ఆ…. అదేం లేదు అన్నయ్య నేను మామ్ కోసం వెతుకుతూ టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయాను అక్కడ కొంచెం పీస్ఫుల్ గా ఉంటే అక్కడే కూర్చున్నాను…… !! ఈ లోగా నీ నుండి వచ్చిన మిస్డ్ కాల్స్ చూసి ఇలా వస్తున్నాను…. !!

సంతోషించాం అరే నీ కోసం మామ్ అక్కడ అభిషేకం కి టైమ్ అవుతుంది అని వెయిట్ చేస్తుంది కానీ ఫస్ట్ పదా….. !! ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అనగానే నువ్వు కూడా రా అన్నయ్య అంటున్న శ్లోక వైపు చూస్తూ….. !! భూమి నిన్ను వెతుకుతూ అటే వచ్చింది నేను వెళ్ళి దాన్ని తీసుకుని వస్తాను నువ్వు లోపలికి వెళ్ళు అంటూ భూమి కోసం వెళుతున్న మహాన్ ను చూసి విసుగ్గా లోపలికి వెళుతుంది శ్లోక….. !!

💫💫💫💫💫💫💫💫💫💫💫

 

భూమి….. భూమి అంటూ భూమి కోసం వెళ్ళిన మహాన్ కి భూమి వినాయకుడి విగ్రహం ముందు మోకాళ్ళ మీద కూర్చుని చేతిలో కర్పూరం వెలిగించి స్వామి కి హారతి ఇస్తూ కనిపిస్తుంది…… !! ఏయ్ మెంటల్ అంటూ ఫాస్ట్ గా భూమి చేతిలో నుండి కర్పూరాన్ని పక్కకు విసిరేసి పిచ్చా భూమి నీకు…… ?? చేతిలో కర్పూరం ఎవరైనా వెలిగిస్తారా ఇక్కడ హారతి ప్లేట్ లేకపోతే ఏదైనా రాయి మీద వెలిగించాలి అంతే కానీ ఇలా చేత్తో వెలిగించడం ఏంటి….. ??

చేత్తో కర్పూరం వెలిగిస్తే మంచిదని భర్త ఆరోగ్యంగా నిండు నూరేళ్లూ ఉంటాడని ఇక్కడ అందరూ నమ్ముతారంట మహాన్….. !! నువ్వు కూడా హెల్తీ & హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని నీ భార్యగా కోరుకుంటూ వెలిగించాను…….. !!

అఘోరించావ్ లే ఐ డోంట్ లైక్ దీస్ ఫూలిష్ సెంటిమెంట్స్ చూడు పిచ్చి దానిలా చేతిలో వెలిగించినందుకు హ్యాండ్ ఎర్రగా కాలిపోయింది…… !! అని భూమి చేతిని పట్టుకుని చూస్తూ నొప్పిగా ఉందా అని అడుగుతున్న మహాన్ వైపు చూస్తూ లేదు అంటూ తల ఊపుతూ….. !! మహాన్ నిన్ను 3 విషయాలు అడుగుతాను ఎప్పటిలా కాలమే సమాధానం చెప్తుంది అని కాకుండా నీ మనసులో ఏముందో అది చెపుతావా ప్లీస్….. !!

మహాన్ కాసేపు ఆలోచించి హ్మ్మ్ ఏంటో అడుగు అంటూ భూమి వైపు చూస్తాడు….. !! నీ హ్యాండ్ మీదున్న నా నేమ్ ను టాటూ లా ఇష్టపడే వేయించుకున్నావా లేక అది కూడా నన్ను పడేయడానికి వేసిన ప్లాన్ ఆ…… ?? ఇష్టపడే వేసుకున్నాను అని చెప్పిన మహాన్ వైపు చూస్తూ మీ అమ్మ చెప్తే నిజంగా నన్ను వదిలేస్తావా నిజం చెప్పు మహాన్ ప్లీస్….. !! అందులో డౌబ్ట్ లేదు భూమి మామ్ చెప్తే నిన్నే కాదు నా ప్రాణాన్నైనా నవ్వుతూ వదిలేస్తాను అంటున్న మహాన్ నిర్ణయానికి భూమి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి….. !! అవి బయటకు కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ నన్ను నిజంగా ప్రేమించావా లేదా చెప్పు మహాన్ నీ ప్రేమ నిజమా….. ?? అబద్దమా…. ??

గుడిలో దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో నిన్ను ప్రేమిస్తున్నా అన్నది కూడా అంతే నిజం…… !! ఇక నీ క్వశ్చన్స్ అయిపోతే వెళ్దాం అంటున్న మహాన్ ముందు కుంకుమ పెడుతూ మహాన్ వైపు చూస్తుంది…… !! మహాన్ ఆ కుంకుమ ను చేత్తో పట్టుకుని భూమి నుదుటిన & పాపిట్లో పెట్టగానే భూమి కళ్ళ నుండి తెలియకుండానే కన్నీళ్ళు జారి బుగ్గలను తడిపేస్తాయి……. !! వాటిని తుడుచుకుంటూ మహాన్ వెంట భూమి గుడి లోకి నడుస్తుంది…… !!

 

✨✨✨✨✨✨✨✨✨✨✨

రోజులు గడుస్తున్నాయి ఎవరి డెయిలీ రొటీన్ లో వాళ్ళు బీసీ అయిపోయారు…… !! ఎప్పటిలా భూమి ప్రొద్దునే లేచి ఎవరికి ఇవ్వాల్సిన డ్రింక్స్ వాళ్లకు ఇచ్చి తన పూజ కంప్లీట్ అవ్వగానే అందరికీ రేణుక హెల్ప్ తో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది…… !! అమ్మా భూమి బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది గార్డెన్ లో ఉన్న కృష్ణుడి విగ్రహం దగ్గర రోస్ పేటల్స్ & ఫ్లవర్స్ తో అందంగా అలంకరించవా ….. !! ఈ లోగా నేను కుక్ చేసినవి అన్నీ టేబుల్ మీద పెట్టేసాను అనగానే భూమి సరే అంటూ ఫ్లవర్స్ ఉన్న ప్లేట్ పట్టుకుని గార్డెన్ లోకి వెళ్తూ…… !! తడిగా ఉన్న ఫ్లోర్ మీద కాలు వేసి జారి రోస్ పేటల్స్ మొత్తం అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మాయి మీద పూల వర్షం కురిపిస్తుంది… !!

వావ్ వెల్కమ్ అదిరింది అని కళ్ళకున్న గాగుల్స్ తీసి తల మీద పెట్టుకొంటూ రైట్ లెగ్ తో ఇంట్లోకి అడుగు పెడుతూ…… !! నోట్లోని చూయింగం నములుతూ ఇంటిని చూస్తున్న ఆ అమ్మాయి ఎవరో అర్థం అవ్వక లగేజ్ తో డైరెక్ట్ గా ఇంట్లోకి 🚫 ఎంట్రీ ఇచ్చిన ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటుంది భూమి… !!

బ్లాక్ కలర్ మినీ స్కర్ట్ విత్ వైట్ కలర్ స్లీవ్లెస్ టాప్ వేసుకుని స్టైల్ గా ఉన్న ఆ అమ్మాయి వైపు చూస్తూ…… !! ఎక్స్క్యూస్ మీ ఎవరు కావాలి అని వినయంగా అడుగుతున్న భూమి ను చూసి…… !! గెట్ మీ వన్ గ్లాస్ చిల్డ్ వాటర్ అంటూ సో హాట్ ఇక్కడ ఇంత వేడిగా ఉండేంటి ఓహ్ గాడ్ ఇక్కడ మనుషులు ఎలా ఉంటున్నారో ఏంటో….. ?? అని సోఫా లో కూర్చుంటుంది…… !!

ఏయ్ అమ్మాయ్ చెప్తుంటే వినిపించడం లేదా గో అండ్ గెట్ ది వాటర్….. !! చాలా వేడిగా ఉంది కొంచెం ఏ. సీ ఆన్ చెయ్ అలాగే ఐ వాంట్ సమ్ ఫ్రూట్ సలాడ్ విత్ నట్స్ & లిటిల్ పించ్ ఆఫ్ హనీ……. !!

భూమి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా అని అడుగుతూ అక్కడికి దేవయాని ఫ్యాషన్ షో కి వచ్చిన మోడల్ లా ఉన్న ఆ అమ్మాయిని చూసి…… !! ఎవరు అంటూ భూమి వైపు చూస్తుంది….. !! నాది కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతూ నాకు ఆర్డర్స్ వేస్తోంది నానమ్మ….. !!

అవునా సరే నువ్వాగు నేను కనుకుంటాను అంటూ ఇదిగో అమ్మాయ్ ఎవరు నువ్వు…… ?? అని అడగ్గానే ఆ అమ్మాయి దేవయాని ను చూసి వావ్ గ్రానీ హౌ ఆర్ యూ అని అడుగుతూ దేవయాని బ్లెస్సింగ్స్ తీసుకుని నవ్వుతూ తన వైపు చూస్తుంది…… !!

ఎవరు అంటుంటే సమాధానం ఇవ్వవ్ ఏంటి…… ?? ఓహ్ సారి నన్ను మీరు గుర్తు పట్టలేదా గ్రానీ ఇట్స్ మీ ఇషా మహాన్ తో పాటు స్కూలింగ్ చేసాను ఆఫ్టర్ దట్ యూ. కే వెళ్ళిపోయాను గుర్తొచ్చిందా….. ?? దేవయాని కాసేపు ఆలోచించి ఆ… ఆ…. గుర్తొచ్చావ్ ఎంత మారిపోయావ్ అమ్మాయ్ ఎలా ఉన్నావ్….. ?? అంటూ భూమి ఈ అమ్మాయి మన మహాన్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తూ ఉండగా….. !!

అమ్మా చిన్న చేంజ్ ఇషా అప్పట్లో మహాన్ ఫ్రెండ్ బట్ ఇప్పుడు తనకు కాబోయే భార్య…… !! అంటూ స్టెప్స్ దిగుతూ పొగరుగా నవ్వుతూ చెప్తున్న నందన ను చూసి …… !! భూమి, దేవయాని షాక్ అవుతూ ఏంటీ అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతారు…… !!

ఇషా రాకతో మహాన్ లైఫ్ ఎటువంటి మలుపు తిరగబోతోంది…… ?? నందన అనుకున్నట్టు మహాన్ & ఇషా కి పెళ్లి చేస్తుందా…,. ?? మరి భూమి పరిస్థితి ఏంటి…….. ?? ఇది రాజ్ కి తెలిస్తే ఎమ్ చేయనున్నాడు…… ??

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply