రాజ్ విజయేంద్ర ప్రసాద్ మాటలకు కోపంగా శ్లోక కాళ్ళ దగ్గర తగిలి తగలనట్టు షూట్ చేయగానే ఆ…… డాడీ అంటూ శ్లోక వెళ్ళి భయం తో కార్తికేయ గుండెల్లో గువ్వ పిట్ట లా ఒదిగిపోయి డాడ్ భయంగా ఉంది…… !! అని ఎడవడం చూసి రాజ్ పొగరుగా నవ్వితే ……. !! మహాన్, విజయేంద్ర ప్రసాద్ కోపంగా చూస్తూ ఉంటారు….. !! కార్తికేయ మాత్రం కూతురిని మొదటి సారి దగ్గరకు తీసుకుని భయపడకు తల్లీ నేనున్నా కదా ……… !! అంటూ ప్రేమగా తల నిమురుతూ ఉంటే శ్లోక నీళ్ళు నిండిన కన్నులతో తల పైకి ఎత్తి తన తండ్రి వైపు చూస్తుంది…… !!
శ్లోక తన వైపు చూడ్డం తో కార్తీకేయ కూడా ప్రేమగా శ్లోక వైపు చూస్తూ ఉంటాడు 🥹…. !! This is two decades of pain, 23 సంవత్సరాల గిల్ట్ రా ….!! నా గుండెలో అణువణువునా మీరు లేని లోటు ఒక డీప్ వౌండ్ లా ఉండిపోయింది శ్లోక…… !! నువ్వు నన్ను చూసి కఠినంగా మాట్లాడిన ప్రతి మాట… ఒక ఫాదర్ గా నా ఫెయిల్యూర్ ను గుర్తు చేసింది……!!
ఐ నోహ్ నీకు నాపై ఉన్నది కోపం కాదు ఒక unexpressed love ……!! నేనొక సెల్ఫిష్ ఫాదర్ ని శ్లోక …. !! మీ మామ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిన రోజు & ఆ ఒక్క క్షణం… నేను కోల్పోయింది కేవలం నందు ని మాత్రమే కాదు… !! వరల్డ్ లో అత్యంత విలువైన నా ఐడెంటిటీ ని.. !! అదేంటో తెలుసా ‘ఫాదర్’ అనే పిలుపు నా నుండి నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది…… !!
నీకు తెలుసా ప్రతి రోజూ, సూర్యుడు అస్తమించినప్పుడు… ‘నా పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో….. ?? అక్కడ బానే ఉన్నారా మీ హెల్త్ ఎలా ఉందో & మీ స్టడీస్ ఎలా వెళ్తున్నాయో….. ?? ఇలాంటి థాట్స్ తో నాకు నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు…… !!
నేను & నందు విడిపోయాక నా లైఫ్ ఒక మైనింగ్లేస్ జర్నీ లా చేంజ్ అయింది …… !! నాతో అన్నీ ఉన్నాయి డబ్బు, హోదా, పేరు ఇవన్నీ ఉన్నా నా పక్కన మీరు లేరు అన్న లోటు నన్ను ఎవ్రీ గిల్ట్ ఫీల్ అయ్యేలా చేసింది…… !! కేవలం నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం భూమీ నా చిట్టి తల్లీ లేకపోయి ఉంటే ఇవాళ నీ ఫాదర్ ఇలా నీ కళ్ళ ముందు ఉండే వాడు కాదు శ్లోక….. !! నీకో విషయం చెప్పనా నేను మిమ్మల్ని వదిలి దూరంగా ఉన్నాను అనుకున్నాను కానీ నిజానికి నా నుంచే నేను దూరంగా వెళ్లిపోయాను……… !!
నువ్వు నన్ను ద్వేషించినా, తిట్టినా నాకు కోపం రాదు ఎందుకంటే I deserve it…… !! నిన్ను ఇలా హత్తుకున్నాక నా గుండెలో ఇంతకాలం పేరుకుపోయిన ఆ బాధ ఒక్కసారిగా కరిగిపోతున్నట్టు ఉంది…… !!
నన్ను క్షమించమని అడగను నాకు ఆ అర్హత లేదు బట్ నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నా లైఫ్ లో మిగిలిన డేస్ అన్నీ మీ హ్యాపీనెస్ కోసమే ఇస్తాను…… !! Just give me a chance to be your dad again .. !!
కార్తికేయ శ్లోక వైపు చూస్తూ తన మనసులోని బాధ మొత్తం కళ్ళల్లో చూపిస్తూ ఉంటే శ్లోక కూడా తన ఫాదర్ వైపు నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ ఉంటుంది…….. !! ఇంకొక్క క్షణం అలాగే ఉన్నా శ్లోక కార్తికేయ ను హగ్ చేసుకుంటూ ఏడ్చేసేది అనగా విజయేంద్ర ప్రసాద్ కోపంగా శ్లోక చెయ్ పట్టుకుని తన వైపుకు లాక్కుని శ్లోక చంప పగల కొడతాడు….. !!
తాతయ్య…. !? బుగ్గ మీద చెయ్ పెట్టుకుని బాధగా పిలిచిన శ్లోక వైపు కోపంగా చూస్తూ మాట్లాడకు నువ్వు ….. ?? ఆ మనిషి గాలి కూడా మీకు తాకకుండా ఎంతో జాగ్రత్తగా పెంచించి మీ మామ్….. !! అలాంటి మనిషిని నాన్న అని ఎలా అనగలగుతున్నావ్ హా ..?? మీ మామ్ కి ఆ మనిషి చేసిన అన్యాయం మర్చిపోయావా లేక మీ కోసం మీ మామ్ కార్చిన కన్నీళ్లను మర్చిపోయావా అని కోపంగా అడగ్గానే శ్లోక బాధగా కార్తికేయ వైపు చూస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటుంది ….. !!
మీ పంచాయతీ ఏదైనా ఉంటే రోడ్ మీద పెట్టుకోండి నా స్టేషన్ లో ఏంటి ఈ రచ్చ ముందు అందరూ బయటకు నడవండి….. ?? అంటూ కోపంగా అరిచిన రాజ్ వాయిస్ కి మహాన్ తన వైపు సీరియస్ గా చూస్తూ మేము బయటకు నడవడం కాదు అసలు నా చెల్లిని ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఎలా అరెస్ట్ చేశావో నాకు చెప్పు….. ?? శ్లోక కి సారి చెప్పి తనను వదిలేస్తే ఇక్కడితో ఎండ్ అవుతుంది లేదా నేను ఎంత దూరం అయినా వెళ్తాను ……. ??
ఏంట్రా వెళ్ళేది అంటూ మహాన్ కాలర్ పట్టుకున్న రాజ్ కార్తికేయ వాయిస్ కి మహాన్ కాలర్ వదిలి అసహనంగా నుంచున్నాడు….. !! కార్తికేయ భారంగా ఊపిరి వదిలి మహాన్ & రాజ్ మధ్యలో నుంచుంటూ అసలేం జరుగుతుంది రాజ్ ఇక్కడ ఏంటీ ఈ గొడవ అంటూ సీరియస్ గా అడుగుతాడు…… ?? ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు….. ??
అరే వాహ్ ఏమన్నా యాక్ట్ చేస్తున్నావా కార్తికేయ మిశ్ర …. ?? కావాలని నీ పోలీస్ మేనల్లుడిని రెచ్చగొట్టి నీ కూతురి మీదకు వదిలి ఇప్పుడు ఎమ్ తెలియనట్టు వచ్చి అడిగి వీళ్ళకు దగ్గర అవ్వాలి అని చూస్తున్నావా….. ?? నా కంఠం లో ప్రాణం ఉండగా నిన్ను వీళ్ళతో కలవనివ్వను అంటూ కోపంగా చెప్తాడు విజయేంద్ర ప్రసాద్….. !!
రేయ్ ముసలోడా నోరు తెరిచావో నోట్లో బులెట్ దించేస్తా చెప్తున్నా….. !! ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నావ్ హా తుమ్మితే పోయే ప్రాణం నీది అలాంటి నీ తొక్కలో ప్రాణం కి మళ్ళీ షబదాలు కూడానా 😏ఇంకోసారి నా ముందు నోరు చించుకుని అరిచావో 🔫🔫 అంటూ గన్ చూపించి ……. !! నా మాట విని కృష్ణ రామా అంటూ ఒక మూల ఉండి నీ శేష జీవితాన్ని గడిపేయ్ లేదా ఇలాగే వాగావ్ అంటే ……. ?? నాకు తిక్క రేగితే నిన్ను ఎప్పుడు చంపేస్తానో చంపేస్తా నాకు మా మావయ్య అంత మంచి తనం & ఓపిక రెండు లేవు 😎.!!
రాజ్ ఆయనతో నీకు ఎందుకు జస్ట్ లీవ్ ఇట్ అంటూ విసుగ్గా అంటున్న కార్తికేయ వైపు పళ్ళు నూరుతూ చూస్తూ ఉంటాడు విజయేంద్ర ప్రసాద్….. !!
మావయ్య అసలేం జరిగింది అంటే అంటూ శ్లోక యాక్సిడెంట్ నుండి ఇప్పుడు మహాన్ ఎవిడెన్సెస్ లేకుండా చేయడం దాకా మొత్తం క్లియర్ గా చెప్తూ…… !! ఇది ఫ్యామిలీ ఇష్యూ అయ్యుంటే డెఫినెట్ గా మీతో డిస్కస్ చేసే వాడిని బట్ ఇది నా ప్రొఫెషనల్ ప్రాబ్లెమ్ అందుకే మీతో డిస్కస్ చేయలేదు….. !!
కార్తికేయ కాసేపు ఆలోచించి లుక్ రాజ్ కోర్ట్ కి మన నోటి నుంచి వచ్చే నిజం కాదు ఆ నిజాన్ని చూపించే సాక్షాలు అవి మన దగ్గర లేవు కాబట్టి నువ్వు శ్లోక ను ఇంకా ఇక్కడే పెట్టుకోవడం లో యూస్ లేదు…… !! ఎవరైతే తన మీద కంప్లైంట్ ఇచ్చారో ఇప్పుడు వాళ్లే కేస్ వాపస్ తీసుకుంటున్నారు కాబట్టి మే బీ నువ్వే పొరబడ్డావేమో తనే యాక్సిడెంట్ చేసింది అనడానికి నీతో ప్రూఫ్ ఉందా…… ?? ఉంటే షో మీ ది ప్రూఫ్!!
రాజ్ కార్తికేయ వైపు చూస్తూ లేదు మావయ్య నాతో ఎలాంటి ప్రూఫ్స్ లేవు బట్ ఇదే యాక్సిడెంట్ చేసిందని నా గట్టి నమ్మకం….. !! నమ్మకాలతో కేస్ నిలబడదు రిలీజ్ హర్ ఆ కుటుంబం ఉన్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ ఇష్యూ ఇక్కడితో ఆపేసి తనను రిలీస్ చెయ్……. !! అంటూ కార్తికేయ గాగుల్స్ పెట్టుకొంటూ అక్కడి నుండి వెళ్తూ శ్లోక, మహాన్ ల వైపు ఒక సారి చూసి వెళ్ళిపోతాడు….. !!
రాజ్ వెళ్తున్న కార్తికేయ వైపు చూస్తూ సోమేష్ అంటూ ఎస్. ఐ. ను పిలిచి శ్లోక తో సైన్స్ చేయించి ఇక మీరు వెళ్ళచ్చు అని అసహనంగా చెప్పి తన రూమ్ లోకి వెళ్ళబోతూ….. !! హెలో మిస్టర్ స్వరాజ్ అని చిటికే వేసి పిలిచిన మహాన్ వాయిస్ కి మెడ క్రాస్ గా తిప్పి మహాన్ వైపు యాటిట్యూడ్ గా చూస్తాడు…. !!
ఏంటి అలా సైలెంట్ గా వెళ్ళిపోతున్నావ్ హా..!! నువ్వు చేసిన తప్పు కి నా చెల్లికి సారీ చెప్తే తప్పా మేము ఇక్కడి నుండి కదలం సే సారి టు హర్….. !! రాజ్ కోపంగా మహాన్ వైపు తిరిగి హో సారి నే కదా చెప్తా అంటూ శ్లోక వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటే …… !! శ్లోక కూడా రాజ్ వైపు యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని బుజం మీద జుట్టును వెనక్కి వేస్తూ పోజ్ ఇస్తుంది…… !!
రాజ్ శ్లోక పక్కనున్న విజయేంద్ర ప్రసాద్ ను చూడు ముసలి గ్రాండ్‌పా నేను నీ మనవరాలికి ప్రైవేట్ గా సారి చెప్పాలి అనుకుంటున్నా…… !! సో నువ్వు ఎందుకు మాకు అడ్డంగా నుంచున్నావ్ కొంచెం పక్కకెళ్ళి ఆడుకో పో 🤪🤭……. !! అంటూ విజయేంద్ర ప్రసాద్ ను మహాన్ వైపు నెట్టగానే తాతయ్య ఆర్ యూ ఒకే అని ఆయన కింద పడకుండా పట్టుకుంటూ…… !! యూ ఇడియట్ కళ్ళు కనిపించట్లేదా అని రాజ్ వైపు గుడ్లు ఉరిమి చూస్తాడు… !!
( ఇక్కడ మీకు చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి…!! బేసిక్ గా రాజ్ పెద్దవాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు కార్తికేయ ఇద్దరినీ అన్ని విలువలు తెలిసేలా పెంచాడు….. !!
బట్ విజయేంద్ర ప్రసాద్ అడుగడుగునా కార్తికేయ ను ఇన్సల్టింగ్ గా మాట్లాడడం రాజ్ కి నచ్చలేదు ……. !! అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు సో తన మీద రాంగ్ జడ్జ్మెంట్ పాస్ చేయకండి ☺️)
విజయేంద్ర ప్రసాద్ కూడా రాజ్ వైపు కోపంగా చూస్తూ ఉండగా……. !! రాజ్ శ్లోక కి ఇంచ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా నుంచోవడం చూసి రేయ్…. !! అంటూ కోపంగా వెళ్ళబోతూ ఉంటే రాజ్ గన్ తీసుకుని విజయేంద్ర ప్రసాద్ వైపు ఎయిమ్ చేయగానే విజయేంద్ర ప్రసాద్ అడుగులు అక్కడే ఆగిపోతాయి….. !?
ట్రిగ్గర్ నొక్కానంటే ఒక్క బులెట్ చాలు చచ్చి ఊరుకుంటావ్ కాబట్టి అన్నీ మూసుకుని నుంచో…. !! సారి అడిగారు చెప్తున్నా కదా వెయిట్ చెయ్ అంటూ సీరియస్ గా చూస్తూ ఏయ్ కానిస్టేబుల్స్ ఇక్కడా నా వాయిస్ తప్పా ఇంకెవరి వాయిస్ అయినా వినిపించిందో నిర్దాక్షిణ్యంగా షూట్ చేసేయండి….. !! తర్వాత ఎమ్ జరిగినా నేను చూసుకుంటా అండర్‌స్టాండ్ అనగానే …… !! రాజ్ సీరియస్ టోన్ కి అందరూ ముక్త కంఠం తో యస్ సర్ అంటూ అందరూ కూడా గన్స్ పట్టుకుని అలర్ట్ గా ఉంటారు….. !!
అది చూసిన మహాన్, విజయేంద్ర ప్రసాద్ రాజ్ వైపు కోపంగా చూస్తు ఉంటారు…. !! రాజ్ వాయిస్ కి నిలువెల్ల వణికిపోతున్న శ్లోక అక్కడి నుండి రెండు అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే….. !! శ్లోక నడుము పట్టుకుని మీదకు లాక్కుంటూ ఎంటే నీకు సారి చెప్పాలా ఒకే చెప్తా ……. !! బట్ నార్మల్ గా చెప్పను ఇందాక రోడ్ మీద చెప్పాను చూడు అలా చెప్తా షల్ వుయ్ స్టార్ట్ ……. !! అంటూ శ్లోక ఎర్రటి పెదాల వైపు చూస్తూ లో వాయిస్ లో శ్లోక కి మాత్రమే వినిపించేలా చెవిలో చెప్తాడు….. !!
రాజ్ పెదాలు తన చెవికి తాకుతూ ఉంటే శ్లోక గుండెల్లో తెలియని అలజడి రాజ్ లో వాయిస్ కి హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుంటూ పెదాలు తడి ఆరిపోతూ ఉంటే……. !! శ్లోక విసురుగా రాజు ను వెనక్కి తోసి ఫాస్ట్ గా బయటకు పరిగెత్తడం చూసి రాజ్ సైడ్ స్మైల్ తో వెనక్కి తిరిగి విజిల్ వేసుకుంటూ…… !! అక్కడి నుండి తన రూమ్ వైపు వెళ్ళడం చూసి మహాన్, విజయేంద్ర ప్రసాద్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు….. !!
శ్లోక కార్ కి ఆనుకుని భారంగా శ్వాస తీసుకుంటూ నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ కార్ లో నుండి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతూ కాసేపటికి నార్మల్ అవుతుంది…… !! గాడ్ ఎమ్ అవుతుంది నాకు ఫస్ట్ టైమ్ ఏదోలా ఉంది అసలేంటి ఫీలింగ్ నాకేం అర్థం కావడం లేదు….. ?? గుండె ఎందుకింత స్పీడ్ గా కొట్టుకుంటుంది & వాడంటే నాకు నచ్చదు కదా ఎందుకని నా కళ్ళు వాడి వైపే చూస్తున్నాయి అని తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది….. !!
శ్లోక వాడేం అన్నాడు నీతో…. ?? అక్కడికి రావడం రావడమే ఆవేశంగా అడిగిన విజయేంద్ర ప్రసాద్ వాయిస్ కి ఉలిక్కిపడి వాళ్ళ వైపు చూస్తూ ఆ…. ఏం అంటాడు తాతయ్య ఎమ్ అనలేదు…… !! అయినా నన్ను ఆన్ ధైర్యం వాడికి ఎక్కడిది నన్ను మళ్ళీ ఎలా అయినా అరెస్ట్ చేస్తాను అని చెప్పాడు అంతే…. అంతే…!! అంటూ కంగారుగా కంగారుగా చెప్తుంది….. !!
వాడి మొహం వాడు నిన్నేం చేయలేడు ఎమ్ చేయాలి అన్నా వాడికి మీ అన్న ఇచ్చిన షాక్ నుండి బయటకు రావడానికి టైమ్ పడుతుంది…… !! కానీ నువ్వు కూర్చో ఇంటి దగ్గర మీ మామ్ నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది …….!!అని విజయేంద్ర ప్రసాద్ ఆయన కార్ వైపు వెళతాడు….. !!
శ్లోక కార్ లో కూర్చున్న తర్వాత మహాన్ శ్లోక వైపు డౌబ్ట్ గా చూస్తూ వాడు నిజంగా అదే అన్నాడా….. ?? అవును అన్నయ్య అయినా నీతో అబద్దం ఎందుకు చెప్తాను ఎందుకంత డౌబ్ట్ గా చూస్తున్నావ్….. !!
వాడు నిజంగా అదే అనుంటే దానికి తగ్గ ఆన్సర్ నువ్వు ఇచ్చే దానివి కానీ ఇలా కంగారుగా పరిగెత్తుకు రావు కదా అందుకే నా డౌబ్ట్ వాడు నీతో ఇంకేదో అన్నాడు నిజం చెప్పు శ్లోక నా దగ్గర ఏమైనా దాస్తున్నావా….. ??
అన్నయ్య కి డౌబ్ట్ వచ్చేసింది….. !? సిగ్గు లేకుండా వాడు నన్ను ఒక్క సారి కాదు పది సార్లు కిస్ చేశాడు అని ఎలా చెప్పాలి….. !! నన్ను ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడ టచ్ చేసి నన్ను డిస్టర్బ్ చేశాడు అని ఎలా చెప్పాలి అన్నయ్య….. !! లేదు వాడి మీద రివెంజ్ నేనే తీర్చుకుంటా ఇది అన్నయ్య వరకూ వెళ్లకూడదు….. !!
అడుగుతుంటే దిక్కులు చూస్తూ కూర్చున్నావ్ ఏంటి శ్లోక…. ?? నా దగ్గర ఏమైనా నిజంగా హైడ్ చేయడానికి ట్రై చేస్తున్నావా….. ??
నీ దగ్గర నేను ఎందుకు హైడ్ చేస్తాను అన్నయ్య నువ్వు మరీ ఓవర్ థింక్ చేయకు నేను నీ చెల్లిని ఆ నమ్మకం నీకు ఉంటే నన్ను ఇంకేం క్వశ్చన్ చేయకు అనగానే….. !! మహాన్ సూటిగా శ్లోక కళ్ళల్లోకి చూస్తూ కార్ స్టార్ట్ చేస్తాడు వెనుకే విజయేంద్ర ప్రసాద్ కార్ కూడా మహాన్ కార్ ను ఫాలో అవుతూ ఇంటికి రీచ్ అవుతుంది…… !!
💫💫💫💫💫💫💫💫💫💫💫
రాజ్ తన రూమ్ కి వెళ్ళి టేబుల్ మీద ఉన్న ఫైల్స్, బుక్స్, మూమెంటోస్ & మొబైల్స్ ఇలా అన్నీ కోపంగా విసిరేస్తూ ……. !! రేయ్ మహాన్ ఐ విల్ సి యువర్ ఎండ్ నాకే వార్నింగ్ ఇస్తావా నీ చెల్లిని చాలా తెలివిగా నా దగ్గర నుండి తప్పించా అని సంబరపడిపోతున్నావ్ కదా…… !!
నిన్ను ఊహించని విధంగా దెబ్బ కొడతాను రా చూస్తూ ఉండు….. !! నా చెల్లిని నీ గుప్పెట్లో పెట్టుకుని నన్ను కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్న నీ ప్లాన్ ఎలా అయినా తిప్పి కొట్టాలి & కొడతాను కూడా…… ?? కానీ ఎలా….. ?? ఎమ్ చేయాలి….. ?? ఎలా నిన్ను దెబ్బ కొట్టాలి…… ??
రాజ్ ఆలోచనలు చిరుత కంటే వేగంగా కదులుతూ ఉంటాయి….. !! అప్పుడే రాజ్ కోసం టీ తీసుకుని వచ్చిన అబ్బాయి రాజ్ రూమ్ ను చూసి ఎక్కడివి అక్కడ సర్దేసి టీ టేబుల్ మీద పెడుతూ సోమేష్ కి వెళ్ళి రాజ్ కోపంగా ఉన్నాడని చెప్తాడు….. !!
సోమేష్ మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి కోపంగా ఉన్న రాజ్ మొహాన్ని చూస్తూ అయిదు అడుగుల దూరం లో నుంచుని చూస్తూ ఉంటాడు….. !! నాకు వంటరిగా ఉండాలి అనుంది సోమేష్ ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం యూ మే గో నౌ..!!
ఐ ఆమ్ సారి సర్ నాకు మీ కోపం & ఆవేశం అర్థం అవుతున్నాయి…. !! బట్ మనం ఎమ్ చేయగలం సర్ సాక్షాలు అన్ని మీ బావ గారు మార్చేశారు అంతే కాకుండా మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీ మావయ్య…….. !! కూడా ఆయన కూతుర్ని కాపాడడం కోసం ఈ కేస్ వదిలేయమని మీకు అన్యాయం చేశారు…. !!
చూసారా సర్ మీ మావయ్య ఎంత స్వార్థంగా ఆలోచించాడో ఎంతైనా ఆయన కూతురు కదా….. !! నెక్స్ట్ మినిట్ సోమేష్ చంప పగిలిన శబ్దం బయటకు వినిపిస్తుంది….. !! షట్ అప్ ఇంకొక్క మాట నా మామ గురించి మాట్లాడావో నిన్ను ఇప్పుడే ఇక్కడే షూట్ చేసి కేస్ లేకుండా చేయగలను….. !! ఎం తెలుసు నీకు ఆయన గురించి హా…!! ఆయన గురించి మాట్లాడే అర్హత కాదు కదా ఆయన పేరు పలికే అర్హత కూడా నీకు లేదు….. !! అర్థం అవుతుందా…… ??
స… స…. సారి సర్ ఏదో తెలియక మాట్లాడాను ఇంకెప్పుడు సర్ గురించి నోరు జారాను….. !! గెట్ అవుట్ అంటూ గంభీరంగా వినిపించిన రాజ్ వాయిస్ కి సోమేష్ భయంగా అక్కడి నుండి వెళ్ళిపోయాక రాజ్ కళ్ళు మూసుకుని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండగా రాజ్ కి మహాన్ మాటలు గుర్తొస్తాయి ….. !!
నీ చెల్లిని అడ్డు పెట్టుకుని నేను మీ అందరితో ఆడుకుంటున్నా అని నువ్వు కూడా నా చెల్లిని అడ్డు పెట్టుకోవాలి అనుకున్నావ్ కదా పాపం ……. !!
కానీ ఏం చేస్తాం నీ ప్లాన్ ఇలా అట్టర్ ఫ్లాప్ అయింది …… ??
నీ చెల్లి అంత అమాయకురాలు కాదు రా నా చెల్లి శ్లోక & అక్కడుంది ఈ మహాన్ చెల్లి …… !! దాన్ని నమ్మించడం అంత ఈజీ కాదు & అక్కడ నీ చెల్లి నన్ను ప్రేమించింది బట్ నా చెల్లి ఎప్పటికీ నీ వైపు కూడా చూడదు ….. !! ఇంకో సారి నా చెల్లి జోలికి వచ్చావో చీమ ను నలిపినట్టు నలిపేస్తా ….!!
మహాన్ మాటలు గుర్తు చేసుకున్న రాజ్ ఒక్క సారిగా కళ్ళు తెరిచి సో వాడి చెల్లిని నన్ను ప్రేమించేలా చేస్తే…… ?? అప్పుడు వాడికి నా బాధ క్లియర్ గా అర్థం అయ్యేలా చేసి వాడ్ని ఫుట్ బాల్ ఆడుకోవచ్చు….. !! అనుకోగానే రాజ్ మొహం ఆనందం తో నిండిపోతుంది……. !! ఓహ్ మై శ్లోక డార్లింగ్ ఇప్పటి నుంచి నా టార్గెట్ నీ అన్న కాదే నువ్వే నా టార్గెట్ అనుకుంటూ గట్టిగా నవ్వుతాడు……. ??