నీ ఊపిరి సాక్షిగా ❣️- 3

ఎప్పుడూ కాస్ట్లీ డ్రెస్సెస్ లో కనిపించే భూమి ను ఇప్పుడు ఇలా నేత చీర కట్టుకుని మొహానికి చేతులకు పిండి అంటుకుని ఎన్నడూ కిచెన్ లోకి అడుగు కూడా పెట్టకుండా చూసుకున్న భూమి ను ఇవాళ ఇలా చూస్తాడు అని కల్లో కూడా అనుకోలేదు …..!! బంగారు బొమ్మ లా చూసుకున్న తన మేనకోడలు ఇవాళ ఒక పనిమనిషి లా కనిపిస్తూ ఉంటే కార్తికేయ మనసు విలవిల లాడుతు ఉంది 🥹 …… భూమి ను తను ఎంత అపురూపంగా చూసుకునే వాడో అక్కడున్న అందరికి తెలుసు….. అలాంటి భూమి ఇవాళ ఇలా అవ్వడానికి కారణం నందన అని అర్తం అయిన కార్తికేయ తన వైపు పిడికిలి బిగించి కోపంగా చూస్తు నిల్చున్నాడు ……!!

కిచెన్ లో నుండి బయటకు వచ్చిన భూమి తన చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ చెప్పండి అత్తయ్య ఎంటి పిలిచారు అని అడుగుతూ 2 అడుగుల దూరంలో నిల్చొని బెదురు కళ్ళతో అడుగుతుంది ……
పిలిచినా వెంటనే రావాలి అని తెలియదా ఎమ్ చేస్తున్నావ్ లోపల హా….??

సారి అత్తయ్య మీ అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను….. నేను మీరు పిలిచిన వెంటనే వచ్చాను ఎందుకు పిలిచారు అంటూ భయంగా చూస్తుంది….

హ్మ్మ్ …..!! నీ కోసం ఎవరో వచ్చారు చూడు అని నందన చెప్పడం తో ఎవరు అంటూ గుమ్మం వైపు చూసిన భూమి కి తన వైపే బాధగా చూస్తున్న కార్తికేయ కనిపించడం తో కళ్ళల్లో ఉప్పొంగుతున్న నీటిని ఆపలేక కార్తికేయ వైపు చూస్తూ మావయ్య అంటూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ కార్తికేయ దగ్గరకు వెళ్తున్న భూమి కి ఆగు ఆన్న కంచు కంఠం వినిపించగానే తన అడుగులు అక్కడే ఆగి ఆ పిలుపు లాంటి అరుపు వినిపించిన స్టెప్స్ వైపు బెదురు కళ్ళతో చూస్తుంది ……

బ్లూ జీన్స్ విత్ చాక్లెట్ కలర్ షర్ట్ వేసుకొని ఎరుపెక్కిన కళ్ళతో యాటిట్యూడ్ వాక్ చేస్తూ స్టెప్స్ దిగుతున్న మహాన్ ను చూసిన భూమి కి అరచేతుల్లో చమటలు పడతాయి…… భయం భయంగా మహాన్ వైపు చూస్తూ చీర కొంగు ను టెన్షన్ తో నలిపేస్తూ ఉంటుంది ………

మహాన్ చూడడానికి యాస్ ఇట్ ఈజ్ కార్తికేయ లాగే ఉంటాడు …… తన రూపు రేఖలు, బాడీ ఫిట్నెస్, వాకింగ్ స్టయిల్, కలర్ మొత్తం కార్తికేయ లాగే ఉంటాడు …… ఒక్క మాట లో చెప్పాలంటే కార్తికేయ టీనేజ్ లో ఎలా ఉండేవాడో ఇపుడు మహాన్ అలా ఉన్నాడు…… మహాన్ కార్తికేయ ఎందులోనూ తీసిపోరు ఆఖరికి బలుపు లో కూడా ఇద్దరు ఒకటే ……!!

మహాన్ స్టెప్స్ దిగి భూమి ముందు నిల్చొని నిప్పులు చిమ్మే కళ్ళతో భూమి వైపు సూటిగా చూస్తూ నీ మామ కనపడగానే ఎక్కడికీ ఎగేసుకుని పరిగెత్తుకుంటూ పోతున్నావ్ హా !!! అంటూ గంభీరంగా అడుగుతాడు…..

సారి మ….మహాన్ మావయ్య ను చూసిన హ్యాపీనెస్ లో నీకు చెప్పడం మర్చిపోయాను…..
షట్ అప్ …..!! అంటూ చూపుడు వేలు భూమి వైపు చూపిస్తూ నువ్వు నీ వాళ్ళని కలవాలి అంటే నా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పానా లేదా ??

చె… చెప్పావ్ !!
మరీ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావ్ దట్ మీన్స్ నేనంటే భయం లేదు రైట్ …..??

లే….. లేదు మహాన్ ఐ యాం సారి ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీస్ మహాన్ నన్ను మావయ్య తో మాట్లాడనివ్వు 🥹 ఇంకెప్పుడు నీ పర్మిషన్ లేకుండా ఎలాంటి పని చేయను…..

. మహాన్ తనను కోపంగా చూస్తున్న కార్తికేయ వైపు ఒక యారోగెంట్  లుక్ ఇస్తూ భూమి ను లాగి పెట్టీ కొట్టి నోరు మూసుకుని కిచెన్ లోకి పో …..!! నువ్వు నీ వాళ్ళు ఎవరితో మాట్లాడడానికి కాదు కదా వాళ్ళను చూడ్డానికి కూడా నేను ఒప్పుకోను వెళ్ళు అని కోపంగా అరవగానే మహాన్ కొట్టిన ఫోర్స్ కి కింద పడబోతున్న భూమి ను చూసి చిట్టి తల్లీ!!! అంటూ ఫాస్ట్ గా భూమి దగ్గరకు వచ్చి భూమి కింద పడకుండా పట్టుకుని నీకేం దెబ్బలు తగ్గలేదు కదా అని అనునయంగా అడుగుతున్న కార్తికేయ ను చూసి ఏడుపు కష్టంగా ఆపుకుంటూ🥹🥺 లేదు అన్నట్టు తల ఊపి సరిగ్గా నిల్చుని చంప మీద చెయ్ పెట్టుకొని మహాన్ వైపు భయంగా నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ నిల్చుంది …..

మహాన్ కొట్టిన బుగ్గ మీద మహాన్ చేతి వేళ్ళు పడ్డం తో తెల్లటి భూమి బుగ్గలు ఎరుపు వర్ణం దాల్చడం తో కార్తికేయ ఆవేశంగా మహాన్ కాలర్ పట్టుకుని ముక్కు పుటాలు ఎగరేస్తూ హౌ డేర్ యూ నా ముందే నా కోడల్ని కొడతావా …..?? నిన్ను ఇవాళ ఊరికే వదిలి పెట్టను అసలేం చేసిందని తనను ఇంత హింస పెడుతున్నావ్ రా ప్రేమించాను అని చెప్పి నమ్మించి ఆ అమాయకురాలిని ఇలా చిత్ర హింసలు పెడుతున్నావ్ ……?? అసలు నువ్వు మనిషి వేనా చీ నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఎలా పూట్టావ్ రా నా కడుపున అంటూ మహాన్ వైపు అసహ్యంగా చూస్తూ ఆవేశంగా అరుస్తాడు…….

స్టాప్ దిస్ నాన్సెన్స్  నేను నీ కొడుకు అని నువ్వు అనుకుంటే సరిపోదు నేను కూడా అనుకోవాలి…… నాకు వున్నది ఆమ్మ మాత్రమే నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు అండ్ కాలర్ పట్టుకోవడం నీకే కాదు నాకు వచ్చు మర్యాదగా వదిలితే బావుంటుంది లేకపోతే …..??

హా లేకపోతే చెప్పరా ఎమ్ చేస్తావ్ కొడతావా ఎది కొట్టు అని మరింత గట్టిగా మహాన్ కాలర్ పట్టుకుంటాడు కార్తికేయ…..!!

మహాన్ మోహం లో మారుతున్న రంగులను చూసిన భూమి భయపడుతూ మావయ్య ప్లీస్ వదులు …..!! ఇపుడు మహాన్ నా భర్త ప్లీస్ నా కోసం వదిలేయ్ మావయ్య ప్లీస్ అంటూ దీనంగా రెండు చేతులతో నమస్కారం చేస్తూ ఏడుస్తూ అడుగుతుంది భూమి….. తన కళ్లల్లో నీళ్లు చూసిన కార్తికేయ తన చేతిని వెనక్కి తీసుకుంటు విసురుగా మహాన్ ను వెనక్కి నెట్టి చిట్టీ తల్లీ పదమ్మా ఇక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి నేను ఒప్పుకోను అంటూ భూమి చెయ్ పట్టుకుంటాడు ………

భూమి ఎక్కడ వెళ్లిపోతుందో ఇన్నాళ్లుగా ఎంతో కష్టపడి వేసిన ప్లాన్ మొత్తం వేస్ట్ అవుతుందేమో అని కంగారుగా చూస్తూన్న నందన, శ్లోక, విజయేంద్ర ల అభిప్రాయం తప్పు అని నిరూపిస్తూ కార్తికేయ చేతి నుండి తన చెయ్ వెనక్కీ తీసుకుని సారి మావయ్య నేను రాలేను🥺 …….. నా ఇల్లు ఇదే నేను నా ఇంటిని వదిలి ఎక్కడికీ రాను అని స్థిరంగా చెప్తుంది …… అది చూసిన కార్తికేయ అశ్చర్యంగా భూమి వైపు చూస్తే మహాన్ పెదవుల్లో శాడిస్టిక్ స్మైల్ …….

ఎమ్ మాట్లడుతున్నావ్ చిట్టి తల్లీ…..?? ఇది నీ ఇల్లా ఇది నీ ఇల్లు కాదమ్మా మన ఇల్లు వేరే నిన్ను ఈ రాక్షసులు బ్రతకనివ్వరు బంగారం నా మాట విని నాతో వచ్చెయ్…..!!

ఇధి నా ఇల్లే మావయ్య నా భర్త ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు….. నా భర్త ను వదిలి నేను రాను ప్లీస్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మళ్ళీ ఎప్పుడూ ఇక్కడికి రావద్దు అంటూ వెనక్కి తిరిగి తన కన్నీళ్ళు కార్తికేయ కు కనిపించకుండా తుడుచుకుంటుంది ……

నేను వెళ్లడం అంటూ జరిగితే అది నిన్ను తీసుకునే వెళ్తాను చిట్టి తల్లీ ….. ఈ నరరూప రాక్షశుల మధ్య నిన్ను ఒంటరిగా వదిలి నేను వెళ్లలేను…… ఈ మావయ్య చెప్పేది విను నీకు పెళ్ళి జరిగింది అన్న విషయం మర్చిపో బరించే వాడ్ని భర్త అంటారు కానీ వీడిలా బార్య మనసు అర్తం చేసుకోలేని వాడ్ని కాదు పదమ్మ మనింటికి వెళ్దాం నెల తిరక్కుండానే వీడి కంటే గొప్ప వ్యక్తి ను తీసుకొచ్చి అంగరంగ వైభవంగా నీ పెళ్ళి జరిపిస్తాను ……

మావయ్య నా జీవితంలో పెళ్లి అనే చాప్టర్ అయిపొయింది …… నా భర్త ఎప్పటికీ మహాన్ నే అంటూ కార్తికేయ వైపు చూసి రెండు చేతులతో నమస్కారం చేస్తూ ప్లీస్ మావయ్య నా మీద ఏమాత్రం ప్రేమ వున్నా ఇక్కడి నుంచి వెళ్లిపోండి ప్లీస్ అని ఏడుస్తూ నీస్ పైన కూర్చుని విడిపోయిన మిమ్మల్ని కలిపే వరకు ఈ గడప దాటి మన ఇంటికి నేను రాను రాలేను అత్తయ్య మాటల్లో మీరు ఇలా దూరంగా ఉండడానికి కారణం నేనే అని అర్తం అయ్యింది మావయ్య…….. నా వల్ల విడిపోయిన మీ ఇద్దరినీ నేనే కలుపుతాను అప్పటి వరకు నేను ఎన్ని కష్టాలు వచ్చినా బరిస్తాను ఇలా అయినా మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ……

చిట్టి తల్లీ కాస్త నేను చెప్పేది విను తల్లీ వీళ్ళు నిన్ను బ్రతక నివ్వరు నా మాట విని వచ్చేయ్ అంటూ భూమి చెయ్ పట్టుకోబోతున్న కార్తికేయ ను అడ్డుకుని భూమి కి కార్తికేయ కి మధ్యలో నుంచున్న మహాన్ కార్తికేయ వైపు సీరియస్ గా చూస్తూ చెప్పింది కదా అది రానని ఫోర్స్ చేస్తావెందుకు…. ?? అది ఇప్పుడు నీ కోడలు కాదు నా పెళ్ళాం దానికి రావటం ఇష్టం లేదు ఇక నువ్వు అంటూ తన చేతిని గుమ్మం వైపు చూపించడం తో కార్తికేయ భూమి వైపు చూస్తూ నిన్ను చూసి భయపడి కాదు నా చిట్టి తల్లీ మీదున్న ప్రేమతో వెళ్తున్నా …… ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని సంబర పడిపోకు నా చిట్టి తల్లీ ను ఇక్కడి నుండి ఎలా తీసుకు వెళ్ళాలో నాకు బాగ తెలుసు అని అంతే కోపంగా మహాన్ వైపు చూస్తూ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు కార్తికేయ……..

కార్తికేయ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాక …… వెళ్తున్న కార్తికేయ ను చూసి ఏడుస్తున్న భూమి జుట్టు పట్టుకున్న మహాన్ కోపంగా భూమి వైపు చూస్తూ తన జుట్టు అలాగే పట్టుకుని అంతే కోపంగా కిచెన్ లోకి లాక్కెళ్లి ఎంటే నీ మామ ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే బొమ్మలా నిలబడి సినీమా చూస్తావా ఎలా కనిపిస్తున్నానే నీకు నీ మామ కి ?? అంటూ గాస్ బర్నర్ అన్ చేసి దాని మీద భూమి అరచేతిని ఉంచుతాడు…… అమ్మా అన్న గావు కేక పెట్టిన భూమి ను చూసి సైడ్ స్మైల్ తో నవ్వూతూ అలాగే 2 నిమిషాల ఉంచి ఎర్రగా కందిన భూమి అరచేతిని చూసి బర్నర్ ఆఫ్ చేసి భూమి ను వెనక్కి తోసి త్వరగా నా బ్రేక్ఫాస్ట్ తీసుకుని నా రూమ్ కి రా అని ఆర్డర్ వేసి కోపంగా తన రూమ్ కి వెళ్ళిపోతున్న మహాన్ ను చూసి భూమి బాధ వర్ణాతీతంగా ఉంది 🥹🥺

తనను ఎంతో ప్రేమించే మహాన్ ఇవాళ తనతో ఉన్న మహాన్ ఒక్కరేనా అన్నట్టు చూస్తూ చర్మం చీలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే తన అరచేతిని వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది……

కార్తికేయ నెక్స్ట్ ఎమ్ చేయబోతున్నాడు?? భూమి కార్తికేయ కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా లేక తను అనుకున్నది సాధిస్తుందా…..?? కార్తికేయ నందన పాస్ట్ ఏంటి…..?? మహాన్ కార్తికేయ లకు ఒకరంటే ఒకరికి ఎందుకు పడదు….??

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply