నీ ఊపిరి సాక్షిగా ❣️-25

మావయ్య బాధ పడుతున్నావా ….. ?? అని మహాన్ వెళ్లిన వైపే చూస్తున్న కార్తికేయ బుజం మీద ఓదార్పుగా చెయ్ వేస్తూ అడుగుతాడు రాజ్…… !! బాధ…. ?? నాకు ఎందుకు రాజ్ ఇపుడు నాకేం తక్కువ అయింది రా బాధ పడడానికి….. ?? ఇంత ఏజ్ వచ్చినా నన్ను చిన్న పిల్లాడిలా చూసుకునే అమ్మ!! నన్ను అనుక్షణం కేర్ చేసే చెల్లి & నేను ఏది చెప్పినా అది మీ మంచి కోసమే అని నమ్మి నా మాటే వేదంగా బావించే నువ్వు & భూమి మీరు అందరూ ఉండగా…… !?  నేను ఎందుకు బాధ పడతాను చెప్పు అని మొహాన్ని నార్మల్ పెట్టుకుని అవును నువ్వేంటి ఇలా సడెన్ గా వచ్చావ్….. ?? స్టేషన్ నుండి డైరెక్ట్ గా వస్తున్నావా అని తన సీట్ లో వెళ్ళి కూర్చుంటూ అడుగుతాడు….. !!

స్టేషన్ కి వెళ్తూ మిమ్మల్ని మీట్ అవుదాం అని వచ్చా మావయ్య అని ఇద్దరూ కాసేపు భూమి గురించి మాట్లాడుకుని…. !! సరే మావయ్య నాకు టైమ్ అవుతోంది నైట్ మాట్లాడుదాం అని టేబుల్ మీద ఉన్న క్యాప్ తీసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న జై ను చూసి కార్తికేయ సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు…… !!

రాజ్ బయటకు వెళ్తూ ఆగి కార్తికేయ వైపు చూసి నువ్వు నాతో చెప్పకపోయినా నువ్వు పడుతున్న బాధ నీ కళ్ళల్లో కనిపిస్తుంది మావయ్య…. !! ఇన్ని రోజులు నీకు ఆవిడ తో పాటు మహాన్, శ్లోక అంటే ఇష్టం లేదు అనుకున్నా కానీ పిల్లలు ఎలాంటి తప్పులు చేసినా పేరెంట్స్ వాటిని క్షమిస్తారు అని …… !! నువ్వు మహాన్ ను చూసిన చూపు లో వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆ బాధ క్లియర్ గా కనిపించింది మావయ్య….. !!

ఇన్నాళ్ళు నువ్వు మేము ఎమ్ అడిగినా కాదు అనకుండా ఇచ్చావ్ నౌ ఇట్స్ మై టర్న్ !! నువ్వు అడగకపోయినా నువ్వు కోరుకున్నది నీ దగ్గరకు చేరుస్తూ అని కార్తికేయ వైపు చూసి అక్కడి నుండి స్టేషన్ కి వెళ్ళిపోతాడు రాజ్….. !!

✨✨✨✨✨✨✨✨

 

మహాన్ కార్తికేయ ఆఫీస్ నుండి డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి డైరెక్ట్ గా నందన ఉన్న రూమ్ కు వెళతాడు….. !! మహాన్ కోసమే వెయిట్ చేస్తున్న హనీష్, నందన ఓపెన్ అయిన డోర్ వైపు చూస్తారు….. !! రూమ్ లోకి మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని వస్తున్న మహాన్ ను చూసి కార్తికేయ తో పెద్ద గానే గొడవ పడ్డాడు అని హనీష్ కి ఈజీగా అర్థం అవుతుంది…… !! ఛా వీడు ఈ జన్మ కి మారడు అంకుల్ గురించి అంతలా చెప్పినా మళ్ళీ వెళ్ళి గొడవ పడ్డాడు అంటే ఏం అనాలి వీడ్ని అని మహాన్ వైపు కోపంగా చూస్తూ సైలెంట్ గా చూస్తుంటాడు….. !!

నందన బెడ్ పక్కనే ఉన్న సిస్టర్ ను చూసి తన చేతిలోని పేపర్స్ చూపెడుతూ ఫార్మాలిటీస్ ఫినిష్ అయ్యాయి…… !!  మీరు మామ్ హ్యాండ్ కి ఉన్న క్యాన్యులా పెయిన్ రాకుండా రిమూవ్ చేస్తే మేము వెళ్తాం అని నందన మెడిసిన్స్ అన్ని ప్యాక్ చేస్తూ చెప్తాడు….. !!

ష్యూర్ సర్ అని సిస్టర్ నందన హ్యాండ్ కి ఉన్న క్యాన్యులా తీస్తూ ఉంటే ఆ నొప్పికి నందన కి ఏడ్పొచ్చేస్తుంది ….. !! కానీ మహాన్ కార్తికేయ తో ఆ రేంజ్ లో గొడవ పడి వచ్చుంటాడో ఇమాజిన్ చేసుకుంటున్న నందన……. !! నువ్వు నా గుండెల మీద కొట్టిన దెబ్బ కంటే ఈ నొప్పి నాకు పెద్దది కాదు కార్తికేయ…… !!

ఎంత ప్రేమించాను నిన్ను …… ?? నీ కోసం నీ ప్రేమ కోసం చావు దాకా వెళ్ళి మరీ నిన్ను దక్కించుకున్నా అది నీకు పంతం లా అనిపించచ్చు….. ?? కానీ నా దృష్టిలో మాత్రం అది ప్రేమ ❤️ ! నీ కోసం అన్నిటికీ అడ్జస్ట్ అయ్యాను నీతో పాటు నీ ఇంట్లో ఉన్నాను…… !! నేను నీ నుండి కోరుకున్నది నీ ప్రేమ మాత్రమే నీకు నేనే ఇంపార్టెంట్ అవ్వాలి అనుకున్నాను కానీ నువ్వు ప్రతీ క్షణం మన మధ్యకు నీ చెల్లిని తీసుకొచ్చావ్…… ??

నేనే కాదు ఏ బార్య కూడా తన భర్త తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటుంది నేను కూడా అదే కోరుకున్నా ఇస్ ఇట్ రాంగ్…… ?? నువ్వు నా కంటే నీ చెల్లి & తన పిల్లలే ఇంపార్టెంట్ అని చెప్పి నీ మీదున్న ప్రేమ ను చంపేశావ్….. ?? అప్పటి నుంచి నీ మీద ఉన్న ప్రేమ కాస్త పగ లా మారిపోయింది ….. !! ఎవరి కోసం అయితే నువ్వు నన్ను నా ప్రేమ ను దూరం చేసుకున్నావో వాళ్ళనే నీ లైఫ్ లో లేకుండా చేసి నందన అంటే ఏంటో చూపిస్తా మిస్టర్ కార్తికేయ 😈😈 !!

మామ్ ఏమైంది నీకు…… ?? పిలుస్తుంటే అన్సర్ చేయవేంటి….. ?? మహాన్ తన బుజం పట్టుకుని ఊపేస్తూ అడగడం తో హా!! అని ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటకు వచ్చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను….. !! ఏంటి మహాన్ చెప్పు….. ??

నిన్ను డిశ్చార్జ్ చేసేశారు వెళ్దామా మామ్ అయినా పిలుస్తున్నా పలకకుండా అంతలా ఏమ్ ఆలోచిస్తున్నావ్….. ??

ఇంకేం ఉంటుంది  😏 భూమి ను ఎలా ఏడిపించాలి & అంకుల్ ను ఇంకెలా బాధ పెట్టాలి అని కన్నింగ్ ప్లాన్స్ వేస్తూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు హనీష్….. !!

ఎమ్ లేదు మహాన్ అంటూ మహాన్ ను తన పక్కనే కూర్చో పెట్టుకుని కార్తికేయ ఆఫీస్ కి కోపంగా వెళ్ళావ్ కదా….. ?? అక్కడ ఆ కార్తీక్ నిన్నేమైనా అన్నాడేమో అని ఆలోచిస్తున్నా …… ?? నీకు తెలుసు కదా మహాన్ నాకు నువ్వు, శ్లోక నే ప్రపంచం మిమ్మల్ని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను అని ప్రేమగా మహాన్ చంప నిమురుతూ చెప్తుంది….. !!

మామ్ అని నందన చేతిని తన రెండు చేతులతో బంధించి నన్ను అనడానికి ఆయన ఎవరు….. ?? నన్ను ఏమైనా అనాలి అంటే ఆ రైట్ నీకు మాత్రమే ఉంది….. !! పదా వెళ్దాం అని నందన చెయ్ పట్టుకుని మెల్లగా రూమ్ నుండి బయటకు తీసుకుని వెళతాడు….. !!

ఓరి పిచ్చి నా కొ….. !! వద్దు లే అని బూతులు కంట్రోల్ చేసుకుంటూ నిన్ను మీ అమ్మ వెర్రి వెధవ ను చేసి ఆడిస్తుంది రా బాబు 🙆😬 ….. !! అది నీ మట్టి బుర్ర కి అర్థం కాదు & చెప్పినా ఆంటీ మీదున్న పిచ్చి ప్రేమ తో నవ్వు నమ్మి చావవ్ అంతా నా కర్మ 🤦🤦 !!

హనీ!! మహాన్ అరుపుకు హా చస్తున్నా అదే వస్తున్నా !! అని విసుగ్గా వెళ్ళి కార్ లో కూర్చోగానే మహాన్ కార్ తన ఇంటి వైపు పరుగులు పెడుతుంది…… !!

🌟🌟🌟🌟🌟🌟🌟🌟

 

తన ఫ్రెండ్స్ తో స్టార్ బగ్స్ లో ఫుడ్ కోర్ట్ లో కూర్చుని నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది శ్లోక….. !! ఈవెనింగ్ పార్టీ లో మీట్ అవుదాం అని చెప్పి సడెన్ గా వచ్చావ్ ఏంటి శ్లోక దట్ టూ బర్త్డే రియా ది అయితే పార్టీ నువ్వు ఇస్తున్నావ్….. ?? క్యా హువా రే….. !??

కుచ్ నయ్ బాబా ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకే ఈ ట్రీట్ అని తన ఫేవరేట్ బబుల్ టీ సిప్ చేస్తూ….. !! యూ నో వాట్ మీకు తెలుసు కదా అన్నయ్య మ్యారేజ్ గురించి….. ??

యాహ్ వుయ్ ఆల్ నో మీ అన్నయ్య భూమి ను లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి మ్యారేజ్ చేసుకుని డెయిలీ టార్చర్ చేస్తున్నాడు రైట్….. ??

ఎక్స్సాట్లీ ఇవాళ మార్నింగ్ అన్నయ్య, మామ్ & తాతయ్య ఆఫీస్ కి వెళ్ళిపోయాక ఆ భూమి అమ్మమ్మ ను తీసుకుని తన హోమ్ కి వెళ్ళాలి అని ప్లాన్ చేసారు….. !! బట్ దాని బ్యాడ్ లక్ వాళ్ళ ప్లాన్ నేను వినేసాను & లేట్ చేయకుండా అన్నయ్య కి మ్యాటర్ పాస్ చేశా వెంటనే అన్నయ్య దాన్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి ఇంట్లో పడేసాడు….. !!

వావ్ యూ ఆర్ గ్రేట్ శ్లోక అయితే ఆ భూమి కి చుక్కలు కనిపించాయి అనమాట అని తన ఫ్రెండ్స్ నవ్వుతూ ఉంటే శ్లోక పొగరుగా చూస్తూ ఈ శ్లోక తో పెట్టుకుంటే ఎవరికైనా మిగిలేది కన్నీళ్ళే అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది….. !!

ఓహ్ మై గాడ్ శ్లోక లుక్ ఎట్ దిస్ అంటూ అదే గ్యాంగ్ లో ఉన్న మరో అమ్మాయి మొబైల్ స్క్రోల్ చేస్తూ కనిపించిన వీడియో ను శ్లోక కి చూపెడుతుంది….. !! ఆ వీడియో చూసిన శ్లోక తో పాటు అక్కడున్న తన ఫ్రెండ్స్ అందరూ ఒకరిని ఒకరు చూసుకుని షాక్ అవుతూ శ్లోక వైపు చూస్తారు….. !!

భూమి ఆఫీస్ కి వచ్చినప్పుడు తను పడిపోతూ ఉంటే మహాన్ భూమి నడుము చుట్టూ చెయ్ వేసి పట్టుకుంటాడు కదా అప్పుడు ఆ ఫోజ్ లో ఫోటో తీసినా హనీష్….. !! ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ పిక్ ను ఇంకొంచెం ఎడిటింగ్ చేసి మంచి లవ్ సాంగ్ యాడ్ చేసి దాన్ని ఇన్స్టా లో పోస్ట్ చేస్తాడు….. !! Hand in hand ,we will walk into forever’ ♾️ together ❤️❤️  అన్న వర్డ్స్ తో ఉన్న ఆ పోస్ట్ చూసి శ్లోక కోపంగా పైకి లేస్తూ ఆ మొబైల్ ను దూరంగా విసిరి కొట్టగానే అది రెండు ముక్కలు అవుతుంది….. !!

శ్లోక దట్స్ మై మొబైల్ అని తన ఫ్రెండ్ కోపంగా అరిచి మొబైల్ ను చేతిలో తీసుకుని 1.75 లాక్స్ మొబైల్ అలా పడేశావ్ ఏంటి….. ?? ఈ కోపం నా మొబైల్ మీద కాదు వెళ్ళి మీ అన్నయ్య ముందు చూపెట్టు ….. !! మీ అన్నయ్య యాక్ట్ చేయడం కాదు నిజంగానే భూమి ను లవ్ చేస్తున్నాడు….. ?? నువ్వు కోపంగా చూసిన అదే నిజం ఛా!! మై మొబైల్ అని విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఫ్రెండ్ ను అంత కంటే విసుగ్గా చూస్తూ….. !! తన ఫ్రెండ్స్ పిలుస్తున్నా కోపంగా ఇంటికి స్టార్ట్ అవుతుంది శ్లోక….. !!

క్యూట్ పెయిర్, బ్యూటిఫుల్ గర్ల్, పెయిర్ అంటే ఉండాలి, మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ అంటూ ఆ వీడియో కి వచ్చిన కామెంట్స్ గుర్తు రాగానే శ్లోక మోహం మరింత ఎర్రగా మారుతుంది….. !! ఆ కోపాన్ని మొత్తం డ్రైవింగ్ మీద చూపిస్తూ రాష్ డ్రైవింగ్ చేస్తూ అనుకోకుండా యాక్సిడెంట్ చేసి ఆగకుండా వెళ్ళిపోతుంది….. !! కానీ అక్కడున్న కొంత మంది శ్లోక కార్ నంబర్ నోట్ చేసుకుని యాక్సిడెంట్ అయిన అబ్బాయిని తీసుకుని యాంబులెన్స్ కి కాల్ చేసి అది రాగానే హాస్పిటల్ కి వెళతారు….. !?

(   ఇప్పుడు కానీ శ్లోక పాప మన రాజ్ చేతికి చిక్కితే పాప కి ఉంటది ఒకటే మ్యూజిక్ 🥁🥁 జింతాత జింత జింత జింతాత 🤣🥱)

 

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

నందన కోసమే టెన్షన్ గా వెయిట్ చేస్తున్న దేవయాని, భూమి లకు మహాన్ కార్ సౌండ్ వినిపించగానే భూమి బంగారం వెళ్ళి హారతి తీసుకుని రా….. !! మీ అత్త కి దిష్టి తాకినట్టుగా ఉంది అని దేవయాని చెప్పగానే సరే నానమ్మ అని భూమి హారతి ప్లేట్ తో గుమ్మం ముందుకు వచ్చి నుంచుంటుంది….. !!

ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న నందన ను ఆపి అత్తయ్య యాక్సిడెంట్ నుండి సేఫ్ గా వచ్చారు కదా….. !! ఆగండి దిష్టి తీస్తాను అంటున్న భూమి ను చూసి నందన కోపంగా నీ మామ వల్ల నేను ఈ పొజిషన్ లో ఉంటే కావాలనే సింపతీ చూపిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా….. ?? నువ్వు ఎన్ని డ్రామా ప్లే చేసినా నిన్ను నీ మామ ను లైఫ్ లో క్షమించను అని కోపంగా హారతి ప్లేట్ ను విసిరి కొట్టి లెట్స్ మూవ్ మహాన్ అంటూ నందన తన రూమ్ కి వెళ్ళిపోతుంది….. !!

మావయ్య వల్ల ఇలా అయింది అంటుంది ఏంటి…… ?? అసలేం జరిగింది మళ్ళీ ఇద్దరికీ గొడవ అయిందా అని ఆలోచిస్తున్న భూమి ను చూసి దాని మాటలు పట్టించుకోకు భూమి హారతి నేను ఇచ్చున్నా నీకు ఈ తిట్లు తప్పేవీ….. !! ఇలా అయినా అది నీ గురించి పాసిటివ్ గా ఆలోచిస్తుంది అనుకున్నాను…. !!

అత్తయ్య మాటలు నాకు మాములే నానమ్మ నేనేం ఫీల్ అవ్వడం లేదు….. !! నువ్వు వెళ్ళి అత్తయ్య దగ్గర ఉండు నేను అత్తయ్య కోసం రేణుక అక్క ను ఏదైనా కుక్ చేయమని చెప్తాను అని కిచెన్ లోకి వెళ్తున్న భూమి ను చూసి దేవయాని నందన రూమ్ కి వెళ్తుంది….. !!

మామ్ రెస్ట్ తీసుకో అని తన మెడిసిన్స్ అన్ని టేబుల్ మీద పెడుతూ నందన ను పడుకో బెట్టి హనీష్ తో బయటకు వెళ్తున్న కొడుకు ను చూసి…… !! నవ్వుకుంటూ పడుకున్న నందన కి తన రూమ్ లోకి వస్తున్న దేవయాని ను చూసి మొహాన్ని నార్మల్ గా పెట్టుకుంటుంది….. !!

నందు బాగా నొప్పిగా ఉందా….. ?? అని అడుగుతూ పక్కనే కూర్చుని మార్నింగ్ బానే వెళ్ళావ్ కదా….. !! ఇప్పుడేంటి ఇలా తలకు కట్టు తో వచ్చావ్ అసలేం జరిగింది….. ?? కార్తికేయ అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు పదే పదే తనతో గొడవ పడి ఉన్న మనశ్శాంతి ను కూడా దూరం చేసుకుంటున్నావ్ ….. ??

అమ్మా!! నేను కావాలని గొడవ పెట్టుకోలేదు….. !! తనే కావాలని నేనేం అనకపోయినా నన్ను తిట్టాడు & నన్నుమాటలతో రెచ్చ కొట్టి ఇదిగో ఈ పరిస్థితికి తీసుకుని వచ్చాడు….. !!

నోరు మూసేయ్ నువ్వెన్ని చెప్పినా కార్తికేయ గురించి నాకు తెలుసు….. !! కార్తికేయ కి అంత కోపం వచ్చింది అంటే నువ్వు అనరాని మాటలు ఏవో అనే ఉంటావు….. !! నీ మాటలు నీ కొడుకు కి మీ నాన్న కి చెప్పు వింటారు నాకు కాదు…. !!

ఈ లోగా రేణుక వేడి వేడిగా సూప్ చేసుకుని తీసుకుని రావడం తో నందన చేత బలవంతంగా సూప్ తాగించి….. !! ఇప్పుడైనా ప్రశాంతంగా పడుకో అని టాబ్లెట్స్ వేసి నందన రూమ్ నుండి వెళ్ళిపోతుంది దేవయాని…. !!

నీ కడుపున పుట్టిన నన్ను కూడా నువ్వు నమ్మవ్ కానీ నన్ను కట్టుకున్న మొగుడ్ని మాత్రం నెత్తి మీద పెట్టుకున్నావ్….. ?? నీ నోటితో నువ్వే ఆ కార్తికేయ ను తిట్టేలా త్వరలో చేయకపోతే అప్పుడు అడుగు….. !! అని టాబ్లెట్స్ వేడుకోవడం వల్ల నిద్ర పోవాలి అనుకున్న టైమ్ కి అక్కడికి వస్తుంది శ్లోక….. !!

నందన గురించి తెలిసి అక్కడికి కంగారుగా వచ్చిన శ్లోక నందన ను అలా బెడ్ మీద చూసి ఏడుస్తూ మామ్….. ?? వాట్ హ్యాపెండ్ అంటూ కంగారుగా అడుగుతున్న శ్లోక కి జరిగింది బ్రీఫ్ గా చెప్పి ….. !! నౌ ఐ ఆమ్ ఒకే శ్లోక ఏడవకు అని తన కన్నీళ్ళు తుడుస్తూ మీ అన్నయ్య నా కంట్రోల్ లో ఉన్నంత వరకూ మీ డాడ్ నన్ను ఎమ్ చేయలేడు చేసిన మహాన్ చూస్తూ ఊరుకోడు అని గర్వంగా నవ్వుతూ చెప్తుంది….. !!

అంత బొమ్మ లేదు మమ్మీ అన్నయ్య ఆల్రెడీ భూమి కి పడిపోయాడు అది నువ్వు & నేను తెలుసుకోలేక పోతున్నాం & అన్నయ్య కూడా జాగ్రత్తగా బయట పడకుండా మ్యానేజ్ చేస్తున్నాడు….. !!

ఎమ్ వాగుతున్నావ్ శ్లోక…… ?? వాడు నా కొడుకు నేను గీసిన గీత వాడు ఎప్పుడూ క్రాస్ చేయడు….. ??

అచ్ఛా అవునా!! నేను ఇప్పటి వరకూ అదే అనుకున్నా….. !! కానీ అన్నయ్య అది రాంగ్ అని ప్రూవ్ చేశాడు….. !! నువ్వు అనుకుంటున్నట్టు అన్నయ్య మమ్మా ‘ స్ బాయ్ కాదు పక్కా పెళ్ళాం చాటు మొగుడు కావాలంటే ఇది చూడు అని ఇన్స్టా లో వైరల్ అవుతున్న మహాన్ & భూమి వీడియో క్లిప్ చూపిస్తుంది….. !!

ఆ వీడియో చూసిన నందన కళ్ళు పెద్దవి చేసి షాక్ అయితే నువ్వు ఇలాగే చూస్తూ ఊరుకుంటే అన్నయ్య ఆ భూమి కంట్రోల్ లోకి పూర్తిగా వెళ్ళిపోతాడు….. !! ఆ తర్వాత నువ్వు నేను భూమి ముందు చేతులు కట్టుకుని నుంచోవాలి….. !! ఇంత చెప్పినా నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను అని శ్లోక అక్కడి నుంచి వెళ్ళిపోయాక నందన ఆలోచన లో పడుతుంది…. !!!

శ్లోక చెప్పినట్టు వాడు నిజంగా భూమి కి పడిపోయాడా….. ?? అని మార్నింగ్ భూమి ను పట్టుకోవడం & ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండడం గుర్తు చేసుకుంటూ డీప్ థింకింగ్ లో ఉంటుంది…… !!

మహాన్ నా చెయ్ దాటి పోక ముందే ఏదోటి చేయాలి అని ఫిక్స్ అవుతూ మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తుంది….. !! కొన్ని రింగ్స్ తర్వాత అటు వైపు కాల్ లిఫ్ట్ చేయగానే హలో ఇషా ……. ??

మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం 😎!! కొంత మంది ఈ స్టోరీ లో నందన ను నెగెటివ్ గా చూపిస్తున్నారు అంటున్నారు….. ?? అరే నాకు అర్థం అవ్వక అడుగుతాను స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుండి చూస్తున్నా దీన్ని ఎందుకు నెగెటివ్ వే లో చూస్తున్నారు….. ?? సినిమా అన్నాక హీరో తో పాటు విలన్ కూడా ఉంటాడు & హీరో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో విలన్ కూడా అంతే స్ట్రాంగ్ & తన క్యారెక్టర్ కి కూడా ఎక్కడ తగ్గకుండా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది….. !! ఇక్కడ అంతే అలా అని నందన విలన్ అని చెప్పడం లేదు స్టోరీ ఇపుడే కదా మొదలైంది అప్పుడే ఎందుకు డిసైడ్ అవుతారు….. ?? ముందు చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఇది స్టోరీ & దీన్ని అలాగే చూద్దాం 😶😶 !! కావాలని నేను నెగెటివ్ చేయడం లేదు తన క్యారెక్టర్ గురించి క్లియర్ గా చెప్పాను …. !! కొంచెం వెయిట్ చేయండి మీకే క్లారిటీ వస్తుంది….. !! హోప్ యూ లైక్ దిస్ వీడియో 😎😎 లిటిల్ కామెంట్ & బుజ్జి లైక్ & చిన్ని హైప్ ఇస్తే వుయ్ ఆర్ వెరీ హ్యాపీ ❤️❤️

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply