నీ ఊపిరి సాక్షిగా ❣️-22

కార్తికేయ నందన వైపు కోపంగా చూస్తూ తనను విసురుగా గోడ వైపు నెట్టగానే ఆ ఫోర్స్ కి నందన తల వెళ్ళి గోడ కి బలంగా తాకుతుంది….. !! తలకు దెబ్బ బలంగా తగలడం తో తల నుండి రక్తం కారుతూ నందన కార్తికేయ కళ్ళ ముందే స్పృహ లేకుండా కిందకు జారిపోతుంది…… !! కార్తికేయ కింద పడ్డ నందన వైపు చూస్తూ ఏయ్ బయటకు పొమ్మంటే అలా కింద పడ్డావ్ ఏంటి?? లే ముందు అని నందన ముందుకు వెళ్ళిన కార్తికేయ కి నందన నుదుటిన అయిన గాయం & బ్లడ్ చూసి షాక్ అవుతూ నందు…. నందు….. !! గెట్ అప్ అంటూ నీస్ మీద కూర్చుని నందన బుగ్గలు తడుతూ తనను కాన్షియస్ లోకి తీసుకుని రావడానికి ట్రై చేస్తూ వాల్ వైపు చూసిన కార్తికేయ కి వాల్ మీద బ్లడ్ స్టెయిన్స్ చూసి గాడ్ అని తల పట్టుకుని నందన ను రెండు చేతులతో లిఫ్ట్ చేసి తన క్యాబిన్ కి అటాచ్ ఆయున్ను పర్సనల్ రూమ్ కి తీసుకుని వెళతాడు…. !!

నందన ను బెడ్ మీద పడుకో బెట్టి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అందులో ఉన్న వాటర్ ను అరచేతిలోకి తీసుకుని నందన మొహం మీద వాటర్ స్ప్రింకిల్ చేసినా నందన లో ఎలాంటి చలనం ఉండదు…… !! కార్తికేయ వెంటనే తన క్యాబిన్ కి వచ్చి మొబైల్ తీసుకుని తన ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేయబోయి నంబర్ డెయిల్ చేస్తూ ఆగిపోతాడు…… !!

లేదు నేను ట్రీట్మెంట్ చేయించానని తెలిస్తే ఈ తిక్కల్ మొహం ది తనను తానే గాయం చేసుకుంటుంది దీని ఈగో గురించి నాకు తెలియదా ….. ?? అని నందు ను తిట్టుకుంటూ మొబైల్ విసుగ్గా పాకెట్ లో పెట్టుకాబోయి ఆగి తన డ్రైవర్ కి కాల్ చేసి కార్ స్టార్ట్ చేయమని చెప్పి మొబైల్ పాకెట్ లో పెట్టేసి బ్యాక్ సైడ్ డోర్ నుండి లిఫ్ట్ లో నందన ను తీసుకుని పార్కింగ్ లాట్ వైపు నడుస్తాడు…. !!

కార్తికేయ బ్యాక్ డోర్ యూస్ చేయడానికి రీసన్ నందన కార్తికేయ ఒకప్పుడు హస్బెండ్ & వైఫ్ రిలేషన్ లో ఉన్నా ప్రెసెంట్ మాత్రం ఇద్దరూ బద్ద శత్రువులు అని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్…..  !! వీళ్ళు ఎప్పుడూ ఎదురు పడ్డా ఏదో ఒక సెన్సేషన్ అవుతుంది…… !! అందుకే ఇప్పుడు నందన స్పృహ లేకుండా పడి ఉండడం చూసి అది మీడియా వరకూ వెళ్ళడం ఇష్టం లేని కార్తికేయ తనను ఎవరు చూడకుండా తీసుకుని వెళ్ళి తన కార్ లో కూర్చుంటాడు….. !!

కార్తికేయ తన కార్ లో కూర్చోగానే డ్రైవర్ కార్ ను కార్తికేయ బెస్ట్ ఫ్రెండ్ & ఫ్యామిలీ డాక్టర్ అయిన అనంత్ హాస్పిటల్స్ వైపు కార్ ను పరుగులు పెట్టిస్తాడు……. !! నందన ను కార్ లో తీసుకుని వెళ్తున్న కార్తికేయ ను చూసి నందన డ్రైవర్ కార్తికేయ కార్ ను ఫాలో అవుతూ వెనుకే వస్తాడు….. !!

అనంత్ కి కార్తికేయ ముందే ఇన్ఫామ్ చేయడం తో స్ట్రెచర్ తో రెడీగా ఉన్న అనంత్ తన స్టాఫ్ తో నందన ను ఐ. సి. యూ కి షిఫ్ట్ చేయించి ….. !! కార్తికేయ వైపు ఒక సారి చూసి నందన ఉన్న రూమ్ లోకి వెళ్ళి తనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు….. !! కార్తికేయ గ్లాస్ డోర్ నుండి జరుగుతున్న ట్రీట్మెంట్ ను చూసి అక్కడి నుండి అనంత్ కి క్యాబిన్ కి వెళ్ళబోతూ ఆయాసపడుతూ అక్కడికి వచ్చిన నందన డ్రైవర్ కి విషయం చెప్పి ఈ విషయం ఎవరికి తెలియకూడదు ….. !!  అని సీరియస్ గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాక డ్రైవర్ భయం భయంగా నందన కి ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్ ముందు టెన్షన్ గా నుంచుంటాడు….. !!

కాసేపటికి నందన కి ట్రీట్మెంట్ చేసి ఇంజెక్షన్ చేస్తూ సిస్టర్ కి ఏవో ఇంస్ట్రక్షన్స్ ఇస్తూ బయటకు వచ్చిన డాక్టర్ ను చూసి నందన కండిషన్ గురించి కంగారుగా అడుగుతూ తనను తాను పరిచయం చేసుకుంటాడు నందన డ్రైవర్….. !!

నో వర్రీస్ షి ఇస్ ఒకే నౌ….. !! హెడ్ కి దెబ్బ తగలడం వల్ల అన్ కాన్షియస్ అయ్యారు ఇంజెక్షన్ చేసాను ఓ 2 అవర్స్ లో కాన్షియస్ లోకి వస్తారు….. !! అని చెప్పి అనంత్ కార్తికేయ కోసం తన క్యాబిన్ కి వెళ్ళి నందన్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తూ ఇద్దరికీ కాఫీ తెప్పించి తాగుతూ సైలెంట్ గా మొబైల్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్న కార్తికేయ వైపు చూస్తూ తన రెండు కన్నులు ముడి పడతాయి…… !!

కార్తీక్ ఏంట్రా ఇది?? ఇంకా ఎన్ని ఇయర్స్ రా ఇలా….. ?? ఎవరో ఒకరు బ్యాక్ స్టెప్ వేసి స్టాండ్ తీసుకోకపోతే మీ రిలేషన్ డే బై డే ఇంకా దూరం అవుతుంది….. !! అది తెలుస్తుందా నీకు…… ??

 

నీకు నందన మీద ప్రేమ ఉన్నా బయట పడవు & నందన కి నీ మీద ప్రేమున్నా దాన్ని తన ఈగో డామినేట్ చేస్తోంది….. ?? ఇలా ఇంకా ఎంత కాలం కార్తీక్….. ?? మీ డిస్టెన్స్ మీ కిడ్స్ మీద కూడా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో నీకు తెలుసు అయినా కూడా ఎందుకు కార్తీక్ ఇదంతా…… ??

అనంత్ జరగని విషయాల గురించి డిస్కస్ చేసే టైం & ఇంట్రెస్ట్ రెండు నాకు లేవ్ అని కప్ కింద పెట్టేస్తూ….. !! అది స్పృహ లోకి వచ్చాక దాన్ని తన డ్రైవర్ తీసుకుని వచ్చాడు అని చెప్పి పంపేయ్….. !! నాకు అర్జంట్ మీటింగ్ ఉంది బై అంటూ వెళ్తున్న కార్తీక్ చేయ్ పట్టుకుంటూ అన్సర్ టు మీ కార్తీక్ అంటూ సీరియస్ గా అడుగుతున్న అనంత్ ను చూసి విసుగ్గా చైర్ లో కూర్చుంటాడు కార్తికేయ….. !!

మాట్లాడవెంట్రా?? నిన్నే అడుగుతున్నా ఇంకా ఇది ఎన్ని డేస్ ఇలా కంటిన్యూ అవ్వాలి దీనికి బ్రేక్ లేదా…… ?? లేదు ఇది లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యు అవుతుంది చాలా అని సీరియస్ గా అంటున్న కార్తికేయ వాయిస్ కి అనంత్ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు…… !!

నేను కూడా మనిషినే అనంత్ నాకు ఫీలింగ్స్ ఉన్నాయి & ఉంటాయి….. !! అది నన్ను ఎలా పెళ్ళి చేసుకున్నా పెళ్ళి తర్వాత అది చూపించే ప్రేమ & కేరింగ్ తో నేను కూడా నందు ను ఇష్టపడ్డాను & ప్రేమించాను…… !!

నాకు అర్థం అవ్వక అడుగుతాను ఎంత సేపు అది నేను ప్రేమించలేదు….. ప్రేమించలేదు అని వాదిస్తుంది……. ?? నేను నందు ను లవ్ చేయకపోతే మహాన్, శ్లోక ఎలా వచ్చారు….. ?? ఏ సాఫ్ట్వేర్ యూస్ చేసి వాళ్ళను డౌన్లోడ్ చేసిందో నాకు చెప్పమను అంటూ ఆవేశంగా అరుస్తున్న కార్తికేయ ను చూసి అనంత్ సైలెంట్ గా ఉండిపోతాడు…… !!

నేను ప్రేమించిన నందు వేరు ఇప్పుడు నాకు కనిపిస్తున్న నందు వేరు అనంత్….. !! నేను ప్రేమించిన నందు కి డబ్బు ఉందన్న అహంకారం తో పాటు మనుషుల మీద ప్రేమ కూడా ఉండేది…. !! బట్ నేను చూస్తున్న నందు కి ప్రేమ, జాలి, దయ ఏవీ లేవు కేవలం నన్ను ఏడిపించడమే తన టార్గెట్…… !! మహాన్, శ్లోక అంటే నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు….. ?? వాళ్ళు నా రక్తం రా అలాంటి వాళ్ళను నేను నెగ్లెట్ చేస్తానా అది కళలో కూడా జరగదు….. !!
ఈ 5 ఇయర్స్ వాళ్లకే తెలియకుండా వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళకు సక్సెస్ అందించాను….  !! మహాన్ ప్రెసెంట్ ఈ పొజిషన్ లో ఉండడానికి రీసన్ వాడి హార్డ్ వర్క్ అని డప్పు కొట్టుకున్నాడు…… !! బట్ వాడి వెనుక ఉండి వాడు సక్సెస్ అవ్వడానికి వెనుక నుండి పుష్ చేస్తూ వాడికే ప్రాజెస్ట్ వెళ్లేలా చేస్తుంది నేను….. !! ఈ విషయం ఇప్పటి వరకు నాకు తప్పా ఎవరికి తెలియదు & తెలియాలి అనుకోలేదు….. !! ఎందుకంటే ఒక ఫాదర్ గా నా పిల్లలు సక్సెస్ అవ్వాలి అనుకున్నాను & అయ్యేలా చేసాను అది నా బాధ్యత అనుకున్నాను కానీ హెల్ప్ అని ఏ రోజు ఫీల్ అవ్వలేదు…… !!

శ్లోక కి తను కోరుకున్న కాలేజ్ లో సీట్ రాలేదు అని తెలిసి నా ఇన్ఫ్లుయెన్స్ తో సీట్ వచ్చేలా చేశా….. !! ఇదంతా వాళ్ళ మీద ప్రేమ లేకుండానే చేస్తానా ఒక్క సారి ఆలోచించు అనంత్ నా పిల్లలు దూరం అయ్యి నేను ఎంత పెయిన్ ఫేస్ చేసుంటానో నీకే తెలుస్తుంది….. !! వాళ్ళను అక్కున చేర్చుకోవాలి అనుకున్న ప్రతీ సారి ఇద్దరిలో కనిపించే ఆ పొగరు నన్ను వాళ్లకు దగ్గర అవ్వకుండా చేసింది….. !!

పిల్లలకు నా మీద ఉన్నవి లేనివి చెప్పి వాళ్లకు నన్ను & నాకు వాళ్ళని దూరం చేసి మా మధ్య గోడ కట్టేసింది….. !! ఇవన్నీ చాలవు అన్నట్టు భూమి ను టార్గెట్ చేసింది….. !! ఈ విషయాన్ని మాత్రం నేను ఈజీగా తీసుకోను & నందన ను ఈ విషయం లో క్షమించే ఉద్దేశం కూడా లేదు….. !!

నలుగురులోకి ( రాజ్, మహాన్ శ్లోక, భూమి) చిన్న పిల్ల రా భూమి….. !! అలాంటి తనను కావాలనే టార్గెట్ చేసి కొడుకు తో ప్రేమ నాటకం ఆడించింది….. !! వాళ్ళ ఉద్దేశం నేను గెస్ చేసాను కనుకే భూమి ను దూరంగా ఉండమని చెప్పినా ……. !! నా చిట్టి తల్లీ నన్ను దాన్ని కలపాలి అని ఆ పాము లాంటి మహాన్ ను నమ్మి పెళ్ళి చేసుకుని ఇప్పుడు అత్తారింట్లో కష్టాలు పడుతుంది….. !! ఇన్ని చేసిన నందు ను నేను క్షమించాలా అంటూ కోపంగా అడుగుతున్న కార్తికేయ ను చూసి అనంత్ పైకి లేచి ఎదురుగా నుంచుంటాడు….. !!

నువ్వు నీ కొడుకు, కూతురు ను పట్టించుకోవడం లేదనే కదా కార్తీక్ నందన ఇలా తయారు అయింది….. !! నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ ఏది మర్చిపోలేదు అని నందన కి ప్రూవ్ చేస్తే నందన నీ ప్రేమ ను అర్థం చేసుకుంటే మీరు ముందులా హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కార్తీక్…… !! నా ప్రేమను ప్రూవ్ చేస్తేనే తను నమ్ముతుంది అంటే అలాంటి ప్రేమ నాకు వద్దు అనంత్ ….. !! ఇన్నాళ్ళు ఎలా అయితే నా జీవితాన్ని ఒంటరిగా గడిపేసానో ఇప్పుడు అలాగే గడిపేస్తా అంటూ అనంత్ పిలుస్తున్నా ఆగకుండా అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు కార్తికేయ…… !!

కార్తీక్….. కార్తీక్…… ఒక్క సారి ఆగరా నేను చెప్పేది విను….. !! ఏంటి అలా వెళ్ళిపోయాడు అని తన కళ్ళ ముందే మాయం అయిపోయిన కార్తికేయ కార్ ను చూసి అసహనంగా తిరిగి హాస్పిటల్ లోకి వెళతాడు అనంత్…… !!

⚡⚡⚡⚡⚡⚡⚡⚡

తన ఇంటి ముందు ఆగిన కార్ నుండి కోపంగా డోర్ ఓపెన్ చేసుకుని దిగిన మహాన్ ఆవేశంగా భూమి చెయ్ పట్టుకుని ఇంట్లోకి లాక్కుని వెళతాడు….. !! మహాన్ లీవ్ మీ అమ్మా!! హ్యాండ్ పెయిన్ గా ఉంది మహాన్ వదులు అని మహాన్ చేతుల్లో నుండి గింజుకుంటున్న భూమి వైపు సీరియస్ లుక్స్ ఇస్తూ మహాన్ భూమి చేతిని ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటూ తనను హాల్ లోకి నెడతాడు…… !!

మహాన్ కార్ వెనుక వచ్చిన దేవయాని కార్ ఇంటి పోర్టికోలో ఆగడం ఆలస్యం దేవయాని వడి వడిగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వెళ్ళేసరికి మహాన్ భూమి ను గోడ కు ఆనించి సీరియస్ గా చూస్తూ ఉంటే పక్కనే సోఫా లో స్టైల్ గా కూర్చుని చికెన్ షవర్మా తింటూ ఉమ్…. ఉమ్మ్….. !! అని సౌండ్స్ చేస్తున్న మనవరాలి వైపు కోపంగా చూస్తూ మహాన్ అంటూ కోపంగా అరుస్తుంది దేవయాని…… !!

దేవయాని అరుపుకి మహాన్ భూమి గొంతు మీదున్న తన చేతిని అసహనంగా వెనక్కి తీసుకోగానే భూమి కి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుంది…… !!

భారంగా శ్వాస తీసుకుంటున్న భూమి కి వాటర్ బాటిల్ అందించి నువ్వసలు మనిషి వేనా…… ?? ఎందుకిలా తయారయ్యావ్ మహాన్…… ?? ఇప్పుడు ఏమైందని భూమి గొంతు పట్టుకున్నావ్….. ?? మార్నింగ్ అలా ఇప్పుడు ఇలా….. ??

అమ్మమ్మ చాలు ఇక ఆపేయ్ అయినా మామ్ చెప్పింది కదా నీకు దీని వైపు స్టాండ్ తీసుకోవద్దు అని దెన్ వై ఆర్ యూ ఇంటర్ఫియర్ దిస్…… ?? అసలు దీన్ని తీసుకుని ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నావ్…… ?? ఆ ఇంటికి మనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిసి కూడా ఎందుకు వెళ్తున్నావ్…… ?? ఈ విషయం గురించి నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది అదే మామ్ కు తెలిసుంటే ఎంత రచ్చ అయ్యేదో ఆలోచించావా….. ?? ఇంకెప్పుడు ఇలాంటి డేర్ చేయకు అంటూ దేవయాని కి సీరియస్ గా చెప్పి భూమి వైపు చూస్తాడు….. !!

భూమి బుగ్గలు నొక్కి పట్టుకుని ఏయ్ ఇంకో సారి నా పర్మిషన్ లేకుండా కాలు బయట పెట్టావో ఆ కాలు నరికి నీ మామ కి పార్సెల్ చేస్తా గుర్తు పెట్టుకో….. !! అని భూమి ను కోపంగా సోఫా లోకి తోసి పో లోపలికి వెళ్ళి నాకు ఇష్టమైన డిషెస్ అన్ని ప్రిపేర్ చేసి లంచ్ పట్టుకుని ఆఫీస్ కి రా అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న మహాన్ ను ఆపేస్తుంది దేవయాని….. !!

మేము భూమి వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు ఎవరు చెప్పారు….. ?? సూటిగా అడుగుతున్న దేవయాని ను చూసి అప్పటి దాకా జరిగే గొడవను ఎంజాయ్ చేస్తూ తన చేతిలోని షవర్మ తింటున్న శ్లోక కి పొలమారి దగ్గుతుంది….. !! దేవుడా అమ్మమ్మ కి డౌబ్ట్ వచ్చేసింది ఇప్పుడు కానీ అన్నయ్య నా పేరు చెప్పాడంటే నన్ను డీ ఫ్రై చేసుకుని తింటుంది అని గోళ్ళు కొరికేస్తూ టెన్షన్ గా మహాన్ వైపు చెప్పద్దు…. చెప్పద్దు అని సైగలు చేస్తుంటుంది…… !!

మహాన్ శ్లోక వైపు చూడకపోవడం తో శ్లోక ఎంత సైగ లు చేస్తున్నా అవి మహాన్ కి చేరవు….. !! ఎవరు చెప్తే ఏంటి అమ్మమ్మా?? నువ్వు ఇంకో సారి భూమి ను ఎక్కడికి తీసుకుని వెళ్ళకు అన్నయ్య కి కోపం వస్తుంది ముందు నువ్వెళ్లి రెస్ట్ తీసుకో అంటూ కంగారుగా చెప్పి అన్నయ్య ఆఫీస్ కి వెళ్తున్నట్టు ఉన్నావ్…. ?? నన్ను స్టార్ బగ్స్ దగ్గర డ్రాప్ చేయ్ అని అడుగుతూ మహాన్ ముందుకు వెళ్తున్న శ్లోక జుట్టు పట్టుకుని లాగుతూ నువ్వు కొంచెం నోరు మూస్తావా అని కసిరి నువ్వు చెప్పరా అంటూ మహాన్ వైపు చూస్తుంది దేవయాని….. !!

శ్లోక చెప్పింది అమ్మమ్మ అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయిన మహాన్ ను తిట్టుకుంటూ దేవయాని వైపు చూసేసరికి…… !! దేవయాని తన వైపే చంపేసేలా చూస్తూ ఉండడం గమనించి వామ్మో ఇక్కడే ఉంటే చంపేస్తుంది అని దెబ్బకు బయటకు పరుగు అందుకుంటుంది….. !!

ఇదంతా ఈ చిన్న దెయ్యం పనా ఆగవే నీ పని చెప్తా నీకు కరెక్ట్ మొగుడు 😈 😈 ఎవరో నాకు బాగా తెలుసు అని విసురుగా రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది….. !!

భూమి నీకు నేను హెల్ప్ చేస్తాను రా అని రేణుక ఆల్రెడీ కుక్ కుకింగ్ స్టార్ట్ చేయడం తో మిగిలిన డిషెస్ భూమి తో చేయిస్తూ ఉంటుంది….. !! భూమి కి కుకింగ్ రాకపోయినా ఈ మధ్య రేణుక ట్రైనింగ్ వల్ల బానే ఇంప్రూవ్ అయింది….. !!

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

 

దేవయాని రూమ్ లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటూ తన మొబైల్ తీసుకుని రాజ్ నంబర్ కి డయల్ చేస్తుంది….. !! ఇక్కడి నుండి డైరెక్ట్ గా తన ఫ్లాట్ కి వెళ్ళిన రాజ్ ఫుల్ డీప్ స్లీప్ లో ఉంటాడు….. !! తన మొబైల్ ఆగకుండా రింగ్ అవుతూ ఉంటే బద్దకంగా ఎర్రగా ఉన్న తన కళ్ళను తెరిచి చూస్తూ రింగ్ అవుతున్న మొబైల్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తూ లేచి కూర్చుంటాడు…. !!

రాజ్ ఎలా ఉన్నావ్ నాన్న….. ?? బిజీగా ఉన్నావా….. ?? డిస్టర్బ్ చేయలేదు కదా….. ??

మీరు నన్ను డిస్టర్బ్ చేయడం ఏంటి నానమ్మ అలాంటిదేం లేదు…. !! నేను బావున్నా మీరెలా ఉన్నారు…… !! భూమి ఎమ్ చేస్తుంది….. ?? అంటూ ఆవలిస్తూ వాల్ క్లాక్ మీద టైం చూసి బ్రష్ చేతిలోకి తీసుకుని బ్రష్ చేస్తూ ఉంటాడు….. !!

బావున్నా రాజ్ నీతో కొంచెం మాట్లాడాలి…… !! నాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి చెయగలవా రాజ్…… !! ఈ విషయం లో నాకు నువ్వే హెల్ప్ చేయగలవ్ అందుకే నీకు కాల్ చేసాను….. !!

నానమ్మ నువ్వు ఇంతలా చెప్పాలా…… ?? విషయం చెప్పండి ఏమైంది…..?? అంటూ గంభీరంగా వినిపించిన రాజ్ వాయిస్ కి విషయం మొత్తం క్లియర్ గా చెప్పి నా మనవరాలికి బుద్ధి రావాలి అంటే అది నీ వల్లే అవుతుందని నా గట్టి నమ్మకం అందుకే అడుగుతున్నా …… !! శ్లోక కి ఉన్న పొగరు, బలుపు తగ్గాలి అంటే అది నీ వల్లే అవుతుంది ….. !! తను నందు లా అవ్వకుండా నువ్వే మార్చాలి రాజ్….. !!

విషయం చెప్పారు కదా మీరు దీని గురించి వదిలేయండి అమ్మమ్మ….. !! దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని కాల్ కట్ చేసి నుదుటిన చూపుడు వేలితో రాస్తూ దీనికి మొన్న ఇచ్చిన కోటింగ్ సరిపోలేదు అనుకుంటా పోలీసోడు దెబ్బ కొడితే ఎలా ఉంటుందో దీనికి తెలియాలి…… ?? ఒసేయ్ శ్లోక అయిపోయావే అనవసరంగా నా చెల్లి జోలికి వెళ్తున్నావ్ నిన్ను నా నుండి ఈ సారి ఎవడు సేవ్ చేస్తాడో నేను చూస్తా అని పొగరుగా నవ్వుకుంటూ స్టేషన్ కి వెళ్ళాలని గుర్తొచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు 😈…… !!

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply