నీ ఊపిరి సాక్షిగా ❣️-19

భూమి తిప్పుకుంటూ వెళ్ళడం చూసిన శ్లోక ఛా!! అని అసహనంగా వాల్ కి పంచ్ ఇస్తూ అది తనకే నొప్పి పుట్టడం తో ఆ….. !! ఆవ్చ్ అని నొప్పి పుట్టిన చేతిని చూసి….. !! దీనికి అన్నయ్య పడిపోయాడు నో డౌబ్ట్ అని కోపంగా రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద అడ్డంగా పడిపోతుంది…… !! నందన మొహం లోని కోపాన్ని చూసిన మహాన్ గాడ్ మామ్ చూసినట్టు ఉంది అని తల పట్టుకుని 🤦 యాక్చుయల్లీ మామ్ అంటూ ఏదో చెప్పబోతున్న మహాన్ ను ఏమాత్రం పట్టించుకోకుండా కిందకు వెళ్ళిపోతుంది నందన….. !!

ఇదంతా ఆ భూమి వల్లే అసలు దీనికి ఏమైంది మార్నింగ్ నుండి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది….. !! దీనికి నేనంటే భయం తగ్గినట్టు ఉంది చెప్తా దీని పని అని మహాన్ కూడా మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని కిందకు వెళతాడు….. !!

నలుగురు డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం తో భూమి నే నలుగురికి నవ్వుతూ సర్వ్ చేస్తూ ఉంటుంది….. !! నందన, మహాన్ మొహాన్ని ఆముదం తాగిన వాళ్ళ లా పెట్టుకుని సీరియస్ గా తింటూ ఉంటారు….. !! గీ కాస్త తక్కువ తినండి అత్తయ్య ఇప్పటికే మీకు బాగా కొవ్వు ఎక్కువ పెరిగింది అంటున్న భూమి మాట కంప్లీట్ అవ్వకముందే నందన తను తింటున్న చేత్తోనే భూమి చంప చల్లుమని పగల కొడుతుంది…… !!

కింద పడ్డ భూమి బుజం పట్టుకుని పైకి లేపి ఎంటే చూస్తున్నా అని నిన్నటి నుంచి రెచ్చిపోతున్నావ్ హా…… ?? నేను కామ్ గా ఉంటున్నా అని నోటికి వచ్చింది వాగుతున్నావ్ చంపేస్తాను నువ్వు ఈ ఇంటి పని మనిషివి సో నువ్వు నీ లిమిట్స్ తెలుసుకుని బిహేవ్ చెయ్….. !! మరో సారి నిన్ను మహాన్ ఉన్న సరౌండింగ్స్ లో చూసానో చంపేస్తాను అంటూ కోపంగా చెప్తుంది….. !!

నందన…. !! ఎమ్ చేస్తున్నావ్ తనను వదులు అంటున్న దేవయాని వైపు చూస్తూ కోపంగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ అన్ని కోపంగా కిందకు పడేసి ఇంకో సారి మరెవరైనా దీనికి సపోర్ట్ చేస్తే బాగోదు అంటూ పిచ్చిగా బిహేవ్ చేస్తున్న కూతురి బిహేవియర్ కి దేవయాని కి తగ్గక తప్పదు….. !!

భూమి చంప మీద చెయ్ పెట్టుకుని మహాన్ వైపే కన్నీళ్ళతో చూస్తూ ఉంటుంది బట్ మహాన్ మాత్రం భూమి వైపు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా చూస్తూ జస్ట్ జరిగేది బొమ్మా లా చూస్తూ ఉంటాడు ……. !! నందన కోపంగా భూమి చూస్తున్న వైపు చూసి అక్కడ మహాన్ కనిపించడం తో నందన మరింత కోపంతో ఊగిపోతూ భూమి జుట్టు పట్టుకుని తన వైపు తిప్పుకుంటుంది……. !!

 

ఎంటే వాడి వైపు చూస్తున్నావ్ వాడేమైన నిన్ను సేవ్ చేస్తాడు అనుకుంటున్నావా ……. ?? అని భూమి బుగ్గలు నొక్కి పట్టుకుని మహాన్ ఇది మార్నింగ్ నా నిద్రను డిస్టర్బ్ చేసింది & ఇందాక నన్ను కింద పడేలా చేసింది…… ?? దీన్ని ఎమ్ చేస్తావో నీ ఇష్టం అంటూ భూమి ను విసురుగా మహాన్ కాళ్ళ దగ్గర పడేస్తుంది …… !!

యూ జస్ట్ రిలాక్స్ మామ్ దీని సంగతి నేను చూసుకుంటాను కదా …… !! అంటూ భూమి చేతిని పట్టుకుని పైకి లేపి తనను బర బరా పక్కకు ఈడ్చు కెళ్ళి ఇంకో సారి మామ్ ను డిస్టర్బ్ చేసావో చంపేస్తాను ……. !! నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు ఆ గీత దాటి వచ్చావా ……. ?? అంటూ వేలు పెట్టి బెదిరిస్తూ నువ్వు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఎంటో తెలుసా …….. !! అంటూ భూమి ను అలాగే తన చెయ్ పట్టుకుని కిచెన్ లోకి తీసుకు వెళ్లి ఇవాళ నువ్వు ఒకటే కుక్ చెయ్యాలి…… !!

 

నీకు ఎవరు హెల్ప్ చేయరు & నువ్వు నాకు స్వయంగా లంచ్ తీసుకుని ఆఫీస్ కి రావాలి అర్థం అవుతుందా అని భూమి చేతిని గట్టిగా నొక్కి పట్టుకుని ఆ నొప్పికి భూమి ఏడవడం చూసి నవ్వుకుంటూ……. !! గుడ్ నువ్వు ఎప్పుడూ ఇలా ఏడుస్తూనే ఉండాలి ఇంకో సారి ఎక్స్ట్రాస్ చేసావో తోలు వలిచేస్తాను జాగ్రత్త అంటూ భూమి ను కోపంగా కిందకు తోసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు…….. !! భూమి ఏడుపు హాల్ లోకి వినిపించడం తో నందన అది విని నవ్వుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ వాడు నా కొడుకే వాడిని ఎక్కడ లాక్ చేయాలో నాకు బాగా తెలుసు అని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది…… !!

అమ్మా !!! అని మహాన్ చేతిలో నుండి తన చేతిని విడిపించుకుని నొప్పికి విల విల లాడుతూ ఏడుస్తున్న భూమి ను చూసి మొబైల్ కిచెన్ లో మర్చిపోవడం తో వెనక్కి వచ్చిన మహాన్…… !! భూమి ను అలా చూసి అమ్మా అని కాదే మామ అని అరువు వస్తాడేమో నీ మామ ……. ?? చూద్దాం అని వెక్కిరింతగా చెప్పి మరో సారి నిద్ర లేపి కాఫీ ఇచ్చావో అదే వేడి వేడి కాఫీ నీ మొహం మీద ఉంటుంది…… !! అని జాగ్రత్త అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మహాన్…… !!

మహాన్ వెళ్ళగానే అప్పటి వరకు గోడకు బయం తో అతుక్కుపోయిన రేణుక …… !! భూమి ఏడుపుకు స్పృహ లోకి వచ్చి భూమి లే అంటూ కింద కూర్చున్న భూమి ను పైకి లేపి కూల్ వాటర్ లో భూమి చేతిని తడిపి తన చేతి వైపు చూస్తుంది …… !! అప్పటీకే సున్నితంగా ఉన్న భూమి భూమి చేయ్ ఎర్రగా కందిపోయి కనిపిస్తూ ఉంటే అయ్యో బాగా ఎర్రగా అయిపోయింది……. !! అని కంగారుగా భూమి చేతికి పేస్ట్ రాసి బాధ పడకు భూమి ఎమ్ కాదు లే తగ్గిపోతుంది…… !! అంటూ భూమి ను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ మీ మావయ్య వచ్చి అడిగినప్పుడు వెళ్ళిపోయి ఉంటే ఈ కష్టాలు కన్నీళ్ళు ఉండేవి కాదు కదా భూమి …… !! ఇంకా ఎందుకు ఇక్కడే ఉండి వీళ్ళు పెట్టే బాధ లను ఓపికగా బరిస్తున్నావ్….. ?? అని భూమి కన్నీళ్లు తుడుస్తూ లాలనగా అడుగుతుంది……. !!

మీ మావయ్య, ఆన్నయ్య చెప్పినట్టు వీళ్ళు నిజంగా మారారు భూమి ……. !! వీళ్ళను మర్చాలి అనుకోవడం నిజంగా నీ పిచ్చితనం …… !! అని చుట్టూ చూస్తూ అక్కడ ఎవరు లేకపోవడం తో మెల్లగా భూమి చెవిలో మహాన్ బాబు ను నువ్వు మార్చాలి అనుకున్నా ……. !!

నందన మేడమ్ అది జరవనివ్వదు మహాన్ బాబు వొంట్లో నీ మీద ప్రతీ రోజూ విషాన్ని నింపుతూనే ఉంటుంది ……. !! ఆవిడకి నువ్వు కొంచెం కూడా ఇష్టం లేదు & ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఎమ్ జరగదు ……. !! అది నీకు ఈ పాటికి అర్థం అయ్యే ఉంటుంది….. !! ఇప్పటికైనా నీకు జరిగింది బొమ్మ ల పెళ్ళి అనుకుని వెళ్ళిపో భూమి …… !! నందన మేడం గీసిన గీత ను మహాన్ బాబు ఎప్పటికీ దాటడు ….. !!

లేదక్కా నేను వెళ్ళను & వెళ్లలేను ….. !! నేను ఇక్కడ ఉండడానికి రీసన్ కేవలం నా కాపురం నిలబెట్టు కోవడానికి మాత్రమే కాదు …… !! విడిపోయిన అత్తయ్య మావయ్య లను కలపడానికి కూడా వాళ్లు కలిసి పోతే 20 సంవత్సరాలుగా విడిపోయిన మా రెండు కుటుంబాలు కలుస్తాయి …… !! అది జరగాలి ఆన్న ఆశ తోనే అన్ని బరిస్తున్నా అంటూ తన చేతిని చూసుకుంటూ చెప్తుంది…….. !!

 

అయ్యో భూమి నీకు ఎలా చెప్పాలి & ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది…… !!     నందన మేడమ్ కి చాలా పొగరు భూమి ఇలా అంటున్నందుకు నువ్వేం అనుకోకమ్మా ……. !! కానీ మీ అత్తయ్య ను అయిదు సంవత్సరాలుగా నేను చూస్తున్నా …… !! ఆవిడ కి ఉన్నంత పొగరు ఈ హైదరాబాద్ లోనే ఎవరికి ఉండదు అని అనిపిస్తుంది…… !! దేవుయాని అమ్మ లాంటి దేవత కి మీ అత్తయ్య లాంటి రాక్షసి ఎలా పుట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు …..

పెద్ద సర్ ( విజయేంద్ర ప్రసాద్) ఎలా అయితే ఉంటారో నందన మేడమ్ కూడా అంతే పొగరు తో ఉంటారు …… !! వీళ్ళను ( శ్లోక, మహాన్) లను కూడా అలాగే పెంచింది …… !! వాళ్లు కూడా ఈవిడ పెంపకంలో అంతే పొగరు గా పెరిగారు …… !! వీళ్లలో కొంచెం లో కొంచెం మహాన్ బాబు మంచి వాడు కానీ ఆయన వొళ్ళంతా మీ అత్త విషాన్ని నింపేసి ఆయనను కూడా మార్చేసింది…… !! వీళ్ళు అందరికి ఒకటే ఆశయం అమ్మా !! అది మిమ్మల్ని & మీ కుటుంబాన్ని జీవితాంతం బాధ పెట్టడం ……. !! మీరు నాకు పెళ్ళికి ముందు తెలియక పోయినా వీళ్ళు రోజూ మీ గురించే రోజూ ఇంట్లో మాట్లాడుతూ ఉండే వాళ్ళు…… !! మిమ్మల్ని ఎలా నమ్మించి పెళ్లి చేసుకోవాలి & మీ ద్వారా మీ మావయ్య ను ఎలా టార్గెట్ చేయాలి అని డియాక్ట్ డిస్కస్ చేస్తూ ఉండే వాళ్లు ……. !!

నీకు ఇంకో నిజం చెప్తాను ఎవరికీ చెప్పకు భూమి అని మరో సారి చుట్టూ చూస్తూ ఒక రోజు ఎమ్ జరిగిందో ఏంటో తెలియదు కరెక్ట్ గా మహాన్ బాబు ఇంటికి వచ్చే టైం కి నందన మేడమ్ ఏడుస్తూ హాల్ లో కూర్చుంది…… !! చిన్నప్పటి నుండి మహాన్ బాబు కి నందన మేడం అంటే చాలా ఇష్టం అందుకే మేడం ను అలా చూడలేక రీసన్ ఏంటి అని అడిగితే నందన మేడం ఏడుస్తూ మహాన్ బాబు కి మీ గురించి ఉన్నవి లేనివి చెప్పి మీ మీద మనసు విరిచేసింది…… !!

 

అంతటితో ఆగకుండా తన జీవితం ఇలా అవ్వడానికి కారణం మీరే అని తన లాగే మీ 3జీవితం కూడా అవ్వాలని ……. !! నీ జీవితాన్ని ఎలా అయినా నాశనం చేయాలని అది చూసి మీ మావయ్య ఏడవాలని మహాన్ బాబు దగ్గర మాట తీసుకుందమ్మా ……. !! ఆ రోజు నుండి మహాన్ బాబు మిమ్మల్ని మాటలతో మాయ చేసి ఇదిగో ఇలా నమ్మించి మాసం చేశాడు …… !! వాళ్ళు ఇంత చేసినా నువ్వు ఇక్కడే ఉండాలి అనుకుంటే నేను ఇంకేం చెప్పలేను……. !! కానీ నువ్వు నన్ను అక్క అని పిలుస్తున్నందుకు ఒక్కటి మాత్రం చెప్పగలను భూమి……. !! నువ్వు ఇక్కడ ఉండడం కంటే మీ ఇంటికి వెళ్ళడమే మంచిది ఆ తర్వాత నీ ఇష్టం అంటూ కిచెన్ నుండి వెళ్ళిపోతుంది….. !?

భూమి ఫ్లోర్ మీద మోకాళ్ళ దగ్గరకు లాక్కుని చుట్టూ చేతులు వేసి ఆ చేతుల మీద తల పెట్టుకుంటూ నన్ను టార్గెట్ చేయడానికి వీళ్ళు 5 ఇయర్స్ గా ట్రై చేస్తున్నారా ……. ?? కానీ ఎందుకు అంత తప్పు అసలు నేనేం చేశాను ……. ?? అత్తయ్య మావయ్య ల గతం తో నాకు ఏంటి సంబంధం ??? అత్తయ్య నా వల్ల వాళ్ళు విడిపోయారు అంటున్నారు ……. ?? వాళ్లు విడిపోవడానికి నేను ఎలా కారణం ఇది తెలియాలి అంటే నేను అమ్మమ్మ ను కలవాలి కానీ ఎలా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుండి పోతుంది ……. !!

విజయేంద్ర ప్రసాద్ వెళ్ళే వరకూ ఓపిక పట్టిన దేవయాని ఆయన తన కార్ లో ఆఫీస్ కి వెళ్లగానే మెల్లగా భూమి ను వెతుక్కుంటూ కిచెన్ లోకి వస్తుంది…… !! భూమి కిచెన్ లో ఫ్లోర్ మీద కూర్చుని ఏదో డీప్ గా ఆలోచిస్తూ కూర్చోడం చూసిన దేవయాని బాధగా భూమి వైపు చూస్తూ స్టవ్ మీద కాచిన పాలు కనిపించడం తో అవి మళ్ళీ వేడి చేసి మిల్క్ లో సుగర్ యాడ్ చేసి భూమి అంటూ తన పక్కనే స్టూల్ లాక్కుని కూర్చుంటూ తన ముందు మిల్క్ గ్లాస్ పెడుతుంది…… !!

భూమి మిల్క్ గ్లాస్ వైపు చూస్తూ వద్దు నానమ్మ అంటూ డల్ గా కూర్చున్న భూమి మొహాన్ని తన వైపు తిప్పుకుని నందన గురించి తెలిసిందే కదా భూమి…… !! దానికి కోపం వస్తే ఇదిగో ఇలాగే పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తుంది ……. !! దాని గురించి వదిలేయ్ ముందు నువ్వు ఈ మిల్క్ తాగు నువ్వు స్ట్రాంగ్ గా ఉంటేనే కదా మీ మావయ్య ను నందన ను కలపగలవు అని చిరు నవ్వుతో చెప్తున్న దేవయాని ను చూసి భూమి కూడా చిన్నగా నవ్వి మిల్క్ గ్లాస్ తీసుకుని మెల్లగా తాగుతూ ఉంటుంది…… !!

భూమి నిన్నో విషయం అడగనా….. ?? మీ మామ్ కి దూరంగా ఉండలేక స్టడీస్ కూడా ఇక్కడే చదివావ్ అంట మరి ఇన్ని రోజులు అవుతున్నా నీకు మానస గుర్తు రావడం లేదా….. ??

చాలా గుర్తొస్తుంది నానమ్మ 🥹 కానీ మామ్ ను మీట్ అవ్వడానికి ఎలాంటి వే కనిపించడం లేదు….. !! మామ్ కూడా నా కోసం ఏడుస్తూ ఉంటుంది….. !! ఇంత వరకు మామ్ తో కాల్ కూడా మాట్లాడలేక పోయాను …… !! మామ్ ఎలా ఉందో ఏంటో….. ??

నీ గురించే ఆలోచిస్తూ ఏడుస్తుంది భూమి మీ అమ్మమ్మ కాల్ చేసి చెప్పింది & నిన్ను తీసుకుని టెంపుల్ కి రమ్మని చెప్పింది….. !! బట్ మనం టెంపుల్ కి వెళ్తే అక్కడ ఎవరైనా మనల్ని చూస్తే మళ్ళీ అదో ప్రాబ్లెమ్ ….. !! అందుకే ఇప్పుడు మనం డైరెక్ట్ గా మీ ఇంటికే వెళ్తున్నాం…… !! నువ్వు ఫాస్ట్ గా లేచి రెడీ అయ్యి రా ఎవరు మనల్ని చూడక ముందే వెళ్లొచ్చేద్దాం….. !!

మహాన్ కి తెలిస్తే మళ్ళీ గొడవ అవుతుందేమో నానమ్మ….. ?? పైగా నన్ను లంచ్ కూడా కుక్ చేయమని చెప్పాడు….. ?? నేను లంచ్ తీసుకుని వెళ్లకపోతే మళ్ళీ అదో గొడవ…….. !!

ఏడ్చాడు….. !! మనం ఇంటికి వచ్చే సరికి లంచ్ రెడీ చేయమని రేణుక తో చెప్తాను….. !! లేదు లేదు రేణుక వద్దు కుక్ కి చెప్తాను రేణుక వంట ను వాడు గుర్తు పడతాడు….. !! అదంతా నేను చూసుకుంటాను ముందు పదా అని దేవయాని బలవంతం చేయడం తో భూమి కూడా ఆనందంగా హగ్ చేసుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్తే…… !! దేవయాని లంచ్ కుక్ చేయమని కుక్ కి చెప్తూ అలా హాల్ లోకి వెళ్లి కూర్చుంటుంది….. !!

వీళ్ళ మాటలు డోర్ చాటున నుంచుని విన్న శ్లోక అమ్మ అమ్మమ్మా!! ఎమ్ ప్లాన్ చేసావ్ చెప్తా ఆగండి మీ పని….. ?? ఒసేయ్ భూమి మీ మమ్మీ ను కలవడానికి వెళ్తున్నావా వెళ్ళు వెళ్ళు మీ మమ్మీ ముందే నిన్ను మా అన్నయ్య ఈడ్చుకుంటూ వచ్చేలా చేస్తా అని నవ్వుకుంటూ ఎవరు చూడకుండా తన రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసి మొబైల్ తీసుకుంటుంది….. ??

ఈ శ్లోక మళ్ళీ ఏదో పెంట చేసేలా ఉంది…… ?? శ్లోక ఎవరికి కాల్ చేయబోతుంది……. ?? దేవయాని, భూమి ఇంటికి వెళ్తారా లేదా….. ?? భూమి ఇప్పటికైనా తన వాళ్ళను కలుస్తుందా లేక ఇంకేదైనా జరుగుతుందా….. ?? అసలు నెక్స్ట్ ఎమ్ జరగబోతుంది…… ?? గెస్ చేసి కామెంట్స్ లో చెప్పండి 🙂 ❤️

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply